"అక్కా నీతో మాట్లాడాలి" చిన్నాన్నగారి అమ్మాయి గీత ఫోన్ చేసి అడిగింది. రేపు మాట్లాడుకుందాము, మధ్యానం లంచ్ కి కుదురుతుందా? అని అడిగాను. మేమిద్దరం పని చేసే ఆఫీస్లు దగ్గర కావటం వల్ల అప్పుడప్పుడు ఇలా లంచ్ లో కలుసుకోవడం పరిపాటే! ఇద్దరము దగ్గరలో ఉన్న ఒక రెస్టారంట్ లో కలిసాము. కొద్దిగా దిగులుగా కనిపించింది గీత. "ఏంటి మీ ఆయనతో గొడవ పడ్డావా?" అని అడిగాను. "లేదక్కా, చిన్ను గురించి" అంది. "చిన్ను? వాడికేమైంది? ఆరోగ్యం బాగుంది కదా?" కొంచెం ఆదుర్దాతో అడిగాను. చిన్ను గీత కొడుకు, నాలుగు సంవత్సరాలు వాడికి. "ఆరోగ్యం బానే ఉంది, కాని వాడితో పెద్ద చిక్కొచ్చి పడింది అక్కా,వాడి ఏజ్ కి చాప్టర్ బూక్స్ కూడా చదువుతున్నారు, వీడు అసలు రీడింగ్ చెయ్యటంలేదు. అన్ని విషయాలలోను చురుకుగానే ఉంటాడు, రీడింగ్ అంటే చాలు, అసలు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. దానితో అసలు వీడికి రీడింగ్ వస్తుందా అని బెంగగా ఉంది " అంది."ఫర్వాలేదులే నెమ్మదిగా చేస్తాడులే రీడింగ్, ఇంకా చిన్నవాడే కదా" అన్నాను. "ఎంటక్కా అలా మాట్లాడతావు, మా neighborhood లో వీడి ఏజ్ వాళ్ళందరూ చదువుతున్నారు. వీడికి ఎమన్నా ప్రోబ్లం ఉందేమొ" అని బాధపడుతున్న కస్సిన్ ని చూస్తే నవ్వొచ్చింది. ప్రస్తుతం చిన్ను ఒక pre-school కి వెళుతున్నాడు.అందరి పిల్లలాగే చలాకిగా ఉంటూ, బాగా తెలివైన వాడని అనుకుంటూ ఉంటాము. "ఇదేమంత బెంగ పడాల్సిన విషయం కాదు. ఇంకొక సంవత్సరం ఆగు,చక్కగా చదువుతాడు." అని సమాధానపరిచాను. గీత దిగులు నేనైతే పోగొట్టలేనని తెలిసి టాపిక్ మార్చి కాసేపు ఇండియా విశేషాలు మాట్లాడుకుని తిరిగి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయాము.
Elementary school లో కి అడుగు కూడా పెట్టని చిన్ను గురించి అంత దిగులు పడుతున్న గీత అందోళనను నేను కొట్టి పాడెయ్యలేను.కాంపిటీషన్ అలానే ఉంది మరి. 2 సంవత్సరాల వయసు నుంచే రీడింగ్, లెక్కలు రుద్దేస్తున్న కాలమిది. అమెరికన్స్ వారికి పుట్టిన పిల్లలందరికీ చాలా చిన్న వయసు (ఆరు నెలల వయసు) నుండే పుస్తకాలు చదివి వినిపిస్తూ ఉంటారు. పిల్లలు పుస్తకం లో బొమ్మలు చూస్తూ అల్లరి చేస్తూనే ఉంటారు, అయినా వారికి బుక్ రీడింగ్ చేస్తూ చిన్న వయసు నుంచే ఒక మంచి అలవాటును వారికి నేర్పుతారు. ఇక్కడ Elementary school (k-5/6) అంటే kindergarten నుంచి ఆరవ (6) తరగతి లేక ఐదవ (5) తరగతి వరకు విధ్యార్ధులు ఈ స్కూల్స్ లో చదువుకుంటారు.ఇక్కడ కొద్ది మంది తప్ప ఎక్కువ సాతం ఇండియన్స్ పబ్లిక్ స్కూల్స్ కే వెళతారు.ఫీస్ లు ఉండవు. ఖర్చు పెద్దగా ఉండదు. ఎక్కువగా రక రకాల బుక్స్ రీడ్ చెయ్యటం, కొద్దిగా బేసిక్ మేత్ నేర్పడం తప్ప kindergarten, 1st గ్రేడ్ లో పెద్దగా చదువు చెప్పటం అంటూ ఉండదు. కాని నాకు తెలిసి చాలా రకమైన క్రేఫ్ట్ వర్క్, ఇంకా రంగు రంగుల పెన్సిల్స్ తో బొమ్మలు వేస్తూ, ఆర్ట్ వర్క్ చేస్తూ, ఆడుకుంటూ, స్కూల్ కి వెళ్ళడం అంటేనే ఇష్టపడేటట్టూ గా ఉంటుంది మొదటి రెండు సంవత్సరాల ప్రాధమిక విద్య. ఎక్కువగా నీ గురించి, నీ కుట్టుంబం గురించి రాయమని రైటింగ్ assignments ఉంటాయి. ఒక లైన్ లో ,కాని రెండు లేదా మూడు లైన్స్ లో ఎదో వంకర టింకరగా అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పదాలతో రాస్తూ ఉంటారు విధ్యార్ధులు. హోం వర్క్ అంటూ ఏమి ఉండదు. స్కూల్ డ్రెస్స్ కూడా ఉండదు. ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించవచ్చు. ఇలా ఆడూతూ పాడుతూ కాలం గడిపేస్తున్న విధ్యార్ధులకు తల్లి తండ్రులకు తెలియకుండానే కొన్ని స్టేట్స్ లో (అన్ని స్టేట్స్ లో పబ్లిక్ స్కూల్స్ లో ఈ పరీక్షలు ఉండక పోవచ్చు,New york, Virginia, Maryland, DC, California, North Carolina, kansas etc..) అకస్మాత్తుగా ఒక పరీక్ష పెడతారు. అవి ఇంటెల్లిజెన్స్ -తెలివి తేటలను పరీక్షించే టెస్ట్స్. సాధారణంగా phsycologists IQ level తెలుసుకోవడం కోసం ఈ పరీక్షలు పెడుతూ ఉంటారు. వీటినే 1st గ్రేడ్ చివరిలో కాని, 2nd గ్రేడ్ లో కాని పెడతారు. నాకు తెలిసిన ఈ పరీక్షల పేర్లు- Cognitive abilities tests (verbal aptitide, non verbal aptitude, quantitave aptitude), Naglieri Non-Verbal Ability Test ( non verbal aptitude ), Otis-Lennon School Ability Test (verbal aptitide, non verbal aptitude ) etc... వీటినే gifted and talented tests అని కూడా అంటారు. ఈ పరీక్షలలో cuttoff మార్కులు తెచ్చుకుంటే స్కూల్ administration తల్లి తండ్రులకు ఒక లెటర్ ద్వారా తెలియపరుస్తారు మీ పిల్లలు Gifted and Talented మొదటి రౌండ్ లో సెలెక్ట్ అయ్యారు అని. అప్పుడు కాని తల్లి తండ్రులకి ఇలాంటి పరీక్షలు ఉంటాయి అని కూడా తెలియదు. తర్వాత రౌండ్ లో ఒక application process లో విధ్యార్ధుల గ్రేడ్స్ 1st గ్రేడ్, 2nd గ్రేడ్ వి, వాళ్ళ టీచర్ రికమ్మండేషన్స్ లాంటివి జోడించి ఇంకో కమిటీ కీ పంపుతారు. అందులో కూడా సెలెక్ట్ అయితే, అప్పుడు ఆ విధ్యార్ధులను 3rd గ్రేడ్ నుంచి gifted and talented (GT) కిడ్స్ అని చెప్పి వారిని వేరే స్కూల్స్ కి పంపుతారు. కొన్ని స్టేట్స్ లో వేరు గా అలా స్కూల్స్ ఉండవు ( ఆ స్టేట్ budget బట్టి ఉంటుంది), అలాంటప్పుడు అదే స్కూల్స్ లో విడిగా ఈ GT కిడ్స్ ని pool చేసి చదువు చెపుతారు. వీరి curriculum కొద్దిగా లెక్కలలో, science లో అడ్వాన్సడ్ గా ఉంటుంది.లెక్కలలో మాత్రం ఒక గ్రేడ్ ముందుగా చదువుతారు. (అంటే 3rd లో ఉంటే 4th గ్రేడ్ మేత్ చేస్తారు). science లో ప్రాజెక్ట్ వర్క్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి.
ఒకప్పుడు ఇలాంటి పరీక్షలు ఉంటాయని కాని, ఇలా
సెలెక్ట్ చేస్తారని కాని మాకు తెలిసేది కాదు. స్కూల్ నుంచి సెలక్ట్ అయ్యరని తెలిసేది అంతే.ఇప్పుడు వలస వచ్చిన భారతీయులు ఎక్కువ అయిపోయి, అన్ని విషయాలు ముందుగా తెలుసుకుని,ఈ పరీక్షలకు పిల్లలను ప్రిపేర్ చెయ్యడం మొదలుపెట్టారు.పుట్టగొడుగులుగా coaching centers వెలిసాయి. పుస్తకాల వేట మొదలుపెట్టి కొన్ని excercise books చేయించ సాగారు. మనం చదువలకు ఇచ్చే విలువ అలాంటిది. నాకైతే ఆ స్కూల్స్ లో వాళ్ళు చెప్పే చదువుకంటే అందరూ తెలివైన పిల్లలు ఒకే చోట ఉండటం వలన, మన పిల్లలు మంచి వాతావరణం లో ఉంటారు. ఇప్పుడు మా గీత అవేదన మీకు అర్ధం అయ్యే ఉంటుంది ఎందుకు చిన్ను ఇంకా బుక్ రీడింగ్ చెయ్యటం లేదని బాధ పడుతుందో. ఈ GT పరీక్షల గురించి తల్లితండ్రులు పడే stress (అవునండీ, రెండవ తరగతి చదువుతున్న పిల్లల గురించి stress (7 year kids)) , GT/ non GT kids elementary స్కూల్ లో అభ్యసించే విద్య, వాటి వివరాలు ఇంకో పోస్ట్ లో...


