ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం
పిలవకుండా వచ్చిందే మా ఊరు ఈ చుట్టం!
తెల్లవారిందంటూ గోడ మీద శ్రీనివాసుని పటం
పాడింది శ్రావ్యాంగా సుప్రభాతం!
ఇంకాసేపు పవళించమంటుంది బద్దకం
తెలియలేదు నాకు ఆ రోజు పొంచి ఉన్న ప్రమాదం!
రోజు కన్నా అరగంట ఆలశ్యంగా దిగాను మంచం
తప్పేది కాదుగా చెయ్యాల్సిన ఉద్యోగం!
శ్రీవారు అప్పటికే లేచి చేస్తున్నారు వ్యాయామం
ప్రతి సోమవారం ఇంట్లోనేగా వారి మకాం!
మెరుపు వేగంతో ముగించేసా స్నానం
పెట్టాలిగా మొక్కుబడిగా దేవుడికి నైవేధ్యం!
హడావిడిగా చేసాను ఫలహారం
జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యమని శ్రీవారి ఆదేశం!
ఆఫీస్ కి చేరుకోవాలంటే చెయ్యాలి గంట ప్రయాణం
వర్షం, ట్రాఫిక్ కలిసి చూపిస్తాయని తెలుసు నరకం!
కారు గరాజ్ లోంచి బయటికి తీస్తూ చూసుకున్నా సమయం
ఒక్కసారిగా గుండె ఆగిపోయిందా అన్నంత కలవరం!
ఎలాగైనా సమయానికి ఆఫీస్ చేరుకోవాలనే తాపత్రయం
చూసుకోలేదు డ్రైవేయ్ లో ఉన్న శ్రీవారి వాహనం!
వేగంగా కారు రివర్స్ చేస్తూ శ్రీవారి కారుని డీకొన్న వైనం
తెలియలేదు పాపం వారికి నేను చేసిన ఘనకార్యం!
మూడో మనిషికి తెలియకుండా చిత్తగించాను పలాయనం
శ్రీవారికి తెలిస్తే అవుతుందని తెలుసుగా యుద్దం!
మనసు ఉండబట్టలేక ఫోన్ చేసా, వెళ్ళాక కొంత దూరం
ఏంటోయి ఇప్పుడేగా మాట్లాడాం, అంటూ చేసారు పరిహాసం!
తెలపాలిగా వారి కారు నుజ్జు నుజ్జు అయిన సమాచారం
నెమ్మదిగా చెప్పాను వారికి జరిగిన విషయం!
సృష్టించారు శ్రీవారు ఫోన్ లోనే ప్రళయం
వారెదురుగా లేకుండా ఉండడం నాకు దేవుడు ఇచ్చిన ఒక వరం!
రోజంతా పనిలో నిమగ్నమవ్వాలని చేసాను ప్రయత్నం
అయినా మనసంతా ఏదో గందరగోళం!
ఇంటికి దిగులుగా చేరుకున్నాను ఆ సాయంత్రం
పలకలేదు శ్రీవారు ఎంత చేసినా నేను ప్రయత్నం!
ఎన్నడూ చూడని కొత్త రూపాన్ని శ్రీవారిలో చూసాను ఆ దినం
మాట లేదు , పలుకు లేదు, వ్యక్తపరచలేదు తన అవేశం!
నా తప్పేమి లేదని వర్షం మీద వేసాను నెపం
అయినా తగ్గలేదు శ్రీవారి కోపం!
ఎడ మొక్కం పెడ మొక్కం గా చేసాము భోజనం
చేసేదేమి లేక పాంటించా నేను మౌనం!
శ్రీవారు ఏకాగ్రతతో ఇమైల్ టైప్ చేస్తుంటే,వినిపించింది కీబోర్డ్ శబ్ధం
దగ్గరగా చేరి అడిగా ఎవరికా లేఖ అని వివరం!
మనసులో బాధను పంచుకోటానికి, ఉందొక నేస్తం
నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అని వచ్చింది సమాధానం!
అసూయతో రగిలిపోయాను ఆ నిమిషం
తన్నుకొచ్చేసింది నాలో ఉక్రోషం!
చెయ్యలేదుగా నేను ఘోరమైన నేరం
అయినా ఎన్నాళ్ళుగా సాగుతుందో ఈ రహస్య ప్రణయం!
మొదలయ్యింది ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం
తగ్గలేదు నేను, తెలుసుకోవటానికి ఆయన రహస్యం!
శ్రీవారి సమాధానం - "నీకు సంబంధం లేదు ఇది నా వ్యకిగతం
అయినా అన్నీ నీకు తెలియాలని లేదుగా నియమం!"
ఇంక లేదు నాకు సహనం
తెలుసుకోపోతే ఎవరో ఆ నేస్తం, తట్టుకోగలదా నా ప్రాణం!
అయినా అసలు ఇదేమి మాయరోగం
నేనే తన లోకమంటూ చేసారుగా ప్రమాణం!
ఇంతేలే అనుకున్నా ఈ జీవితం
బంధాలేవి కావనుకున్నాను శాస్వతం!
ఇప్పటికైనా తెలుసుకున్నా మావారి నిజ స్వరూపం
ఇంతటితో మా మధ్య ఉన్న బంధం సమాప్తం!
అంతులేని వ్యధను అనుభవిస్తున్నఆ తరుణం
శ్రీవారు ఇమైల్ పూర్తిచేసి గీకారు తన సంతకం!
చదవమంటూ నా చేతికి ఇచ్చారు మరుక్షణం
చదువుతూనే పెదవుల మీద మెరిసింది చిరు మందహాసం!
ఆనందంతో నిండి పోయింది నా హృదయం
మా అమ్మాయికి రాసారు ఉదయాన నేను చేసిన నిర్వాకం!
పొరపాట్లన్నవి మానవ సహజం
జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యాలన్నది నేను నేర్చుకున్న పాటం!