Monday, June 11, 2012

ఇడ్లీలు, దోశలు ఏవి? కనీసం ఉప్మా, పెసరట్టు?

(A song is auto played on this website. If the  music is bothering you please scroll down and pause the player Thanks!)

This slide show is downloaded from slideshare.net.

నాకైతే ఇండియా బ్రేక్ ఫాస్ట్ కూడా నచ్చలేదు..
ఇంచక్కా మన ఇడ్లీ,దోశ,ఉప్మా,పెసరట్టు ద బెస్టు!
మరి మీరేమంటారు?

46 comments:

  1. venezuela lo kajjikayalu,
    colombia lo peruguvada,
    cuba lo adedo mukka, coffee,
    meeru perlu cheppakunda, udayanne urinchadam bhaga ledandi, velli tiffen cheyyali, maa avida dosa chesindoch.

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిస్తే కదండి ఆ పేర్లు..
      మీకు పెరుగు ఆవడలు కనపడ్డాయా? హా హా హా..
      మీరు దోశలు తింటున్నారా?
      తినండీ, అందులో rice బాగా కలుపుతారు, నూనె బాగా వేస్తారు, దోశను మళ్ళీ చట్నితో తింటారు..అమ్మో! breakfast కి అన్ని calories???
      తినటానికి భయపడుతున్నారు కదూ??? :)) మీ స్పందనకు ధన్యవాదాలు భాస్కర్ గారు.

      Delete
  2. mm chilaquiles!! que rico!! మీతో ఉప్మా విషయంలో తప్ప మిగతా వాటితో ఏకీభవిస్తా. పెసరట్టు నా ఆల్ టైం ఫావ్! ఆరోగ్యపరంగా, టేస్టు పరంగా నేను ఓట్స్ ఉతప్పం ఎక్కువగా చేసుకుంటా ;)

    ReplyDelete
    Replies
    1. So you like chilaquiles? I like enchiladas.
      ewww! oats? అన్ని రకాలుగా ఎన్నో వంటకాలలో try చేసి చేసి, ఆ oats అంటేనే బాబోయి అనిపిస్తుందండి రసజ్ఞ గారు! I know, I know good for health...అందుకే అప్పుడప్పుడు తప్పక తింటా!ఏంటీ? మీరు మా అమ్మాయి లా, ఎదన్నా okay except upmaa అంటున్నారు? ధన్యవాదాలండి మీ స్పందనకు.

      Delete
    2. చిలకిలెస్, ఎంచిలదస్... చిల్ల గింజలతో చేసినదేదైనా రసజ్ఞ గారికి ఇష్టమే. :P :))

      Delete
    3. అంతేకాని మీకే breakfast ఇష్టమో చెప్పనేలేదు SNKR గారు?

      Delete
    4. ఉప్మా నచ్చుతుంది కాని దాన్ని పెసరట్టుతో కలపడం ద్వారా రసభంగం జరుగుతుందని అనుకుంటా. ఇష్టమైనవి అంటే ..ఓహ్.. మసాలా దోశ, వడ-సాంబార్, పూరీ-ఆలు కూర, బాగా కేలరీలు వేసి చేసిన కట్టు పొంగలి, గుళ్ళలో ఇచ్చే వేడి పులిహోర ... ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.

      మీరు చెప్పిన చిలకిలస్, ఎంచిలదస్ కూడా పేర్లు బాగున్నాయి, :) రెసిపి తెలిస్తే పోస్టండి.

      Delete
    5. భలే వారండి మీరు, రెసిపిలాంటివాటికి నేను చాలా దూరం. ఎక్కడ రుచికరమైన చిలకిలస్, ఎంచిలదస్ దొరుకుతాయో మాత్రం (మా దగ్గర) అది మాత్రం టక్కున చెప్పగలను. తినిపెట్టడం లో ఉన్న ఉత్సాహం వండి పెట్టటం లో లేదు అని ఎవరో కవి అన్నట్టు గుర్తే! :))
      ధన్యవాదాలండి!

      Delete
  3. నిజం జలతారువెన్నల గారు పెసరట్టు, ఉమ్మా, ఇడ్లీ ఇవే బాగుంటాయి...నాకు బాగా ఇష్టం..

    కానీ ఉదయాన్నే పెరుగన్నంలో ఆవకాయ వేసుకొని తినడం అంటే ఇంకా ఇష్టం. (బ్రేక్ పాస్ట్ గా నైనా సరే)

    ReplyDelete
    Replies
    1. మీరు కూడా మా పార్టీనే అన్న మాట!
      పెరుగన్నంలో ఆవాకాయ..మీకు ఇష్టమైన బ్రేక్ఫస్త్ అన్నమాట!
      ధన్యాదాలండి మీ స్పందనకి!మీకు నా బ్లాగ్ కి స్వాగతం సాయి గారు!

      Delete
  4. రాత్రి వండి నట్టి రాగి సంగటి లోన
    నీళ్ళు వోసి పెట్టి నిదుర లేచి
    గడ్డ పెరుగు గలిపి కడుపార భుజియించు
    నాటి చద్ది కంటె మేటి లేదు .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మాష్టారు! బియ్యంతో పోలిస్తే రాగులలోనే ఎక్కువ పోషక పదార్ధాలు ఉన్నాయి. రాగి అంబలి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారని చదివినట్టు గుర్తు. మజ్జిగతో చేసిన రాగి అంబలి వేసవిలో చాలా మంచిది,అది వేడిని తగ్గిస్తుంధి కదా..
      స్పందనకు ధన్యవాదాలండి!

      Delete
  5. Peasarat best of all, I like it much, my favourite. Good music, accidentally heard, as speaker is on by default, as I v taken system fro my grand daughter.

    ReplyDelete
    Replies
    1. మీరు పెసరట్టు అంటే గుర్తుకొచ్చింది! మీరు మాకు ఉప్మా పెసరట్టు ఆతిధ్యం ఇస్తానన్నారు కదా! నాకు కూడా పెసరట్టు,ఉప్మా ఇష్టమండి! పాట మీకు నచ్చినందుకు సంతోషం.
      ధన్యవాదాలండి మీ స్పందనకు.

      Delete
    2. నేను మరిచిపోలేదు. మీరు తొందరలో మా ఇంటికి దయ చేస్తే ఆనందం, ఆ పై పెసరట్లు ఒకటేనా మీఇష్టం.మరొక సారి మీకు స్వాగతం.

      Delete
    3. ధన్యవాదాలండి, సమయం చూసుకుని తప్పక త్వరలో వస్తాను. పెసరట్టు కోసం కాకపోయినా..మిమ్మల్ని కలవడానికి వస్తాను. (వచ్చినప్పుడు పెసరట్టు తినే వెళతానండోయి!)

      Delete
  6. http://www.divshare.com/download/18349380-aa1

    ReplyDelete
    Replies
    1. Thank you, Thank you and Thank you Sri gaaru!
      I liked the song! copied and embedded the song. ఈ సినిమా release అయ్యిందా అండి?

      Delete
    2. inkaa ledu... thanks for using suitable song...
      midhunam book dorikite tappakundaa chadavandi...
      bangaaru murugu, midhunam kadhalu meeku chaalaa nachchutaayi.
      writer: sri ramana
      @SRI

      Delete
  7. మీకు html link పంపిస్తే...
    అవలేదు....
    మిధునంలో పాట (ఆవకాయ మన అందరిదీ) పోస్ట్ చేసాను...
    యు ట్యూబ్ లింక్ పేస్ట్ అయింది....
    మీ ప్రశ్నకి అదే సమాధానం...:-)
    ఇంత మంచి రిప్లై మీకు దొరకదు వెన్నెల గారూ!
    నేతి పెసరట్టు -ఉప్మా -అల్లం పచ్చడి...నాకు పసందైన టిఫిన్ అండీ!
    :-)))
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. :)) అందరూ ఇష్టపడే breakfast అదే కదా శ్రీ గారు?
      మీ పాట కు, మీ స్పందనకు ధన్యవాదాలండి

      Delete
  8. ఏమిటో ఇలా పెట్టి వూరిస్తే ఎలా ? ఇప్పటికిప్పుపుడు ఎక్కడ దొరుకుతాయి .హుం

    ReplyDelete
    Replies
    1. తెలిసో, తెలియకో తప్పు చేసానండి మాలాకుమార్ గారు! ఈ సారికి క్షమించేయ్యండి! :))
      అయితే మీకు చాలా breakfasts నచ్చాయనమాట! మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  9. జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసీ!మన దోశ,ఇడ్లీ,ఉప్మా పెసరట్టు(కలగలిసి)కూడా చేర్చుకుందాం.ఏమిటీ ఇన్ని టిఫన్లు వడ్డించేసారు!

    ReplyDelete
    Replies
    1. చాలా రోజులయ్యింది కదా ఉమాదేవి గారు బ్లాగ్గింగ్ మొదలుపెట్టి,నన్నింతగా ఆదరిస్తున్న మీ అందరికి విందు ఇవ్వాలని అనుకుని, variety గా ఇలా "E-BREAKFAST పార్టీ" ఇలా అన్నమాట!ధన్యవాదాలండి ఉమాదేవి గారు!

      Delete
  10. అబ్బబ్బ, ఇడ్లి, కారప్పొడి, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఉప్మా పెసరట్టు , మినపట్టు, పూరి, ఉదయాన్నే పెరుగు లో ఆవకాయ నంచుకోవడం , అప్పుడప్పుడు, ఆవకాయి అయిపోతే, పచ్చి మిరపకాయి కాల్చి నంచుకోవడం, ఆ కారానికి మొత్తం పెరుగన్నం అంత ఒకేసారి గబా గబా తినడం. అర్జెంటు గా ఇంటికి వెళ్లిపోవాలని అనిపిస్తుంది ఇవన్ని చూసి. రోజు oats తినలేకపోతున్నాను. మల్లి నేనే ప్రేపరే చేసుకోవాలి. ఒకప్పుడు అవి వద్దు, ఇవి వద్దు ఇంట్లో గోడవ పదేవాన్ని. ఇప్పుడేమో ఏదో ఒకటి ఉంటె బాగున్ను అని అనిపిస్తుంది. అంతే దూరం అయిపోతేనే తెలుస్తుంది విలువ. మొత్తానికి మీ పోస్ట్ ఎక్కడో టచ్ చేసింది నన్ను.
    :venkat

    ReplyDelete
    Replies
    1. అంతే వెంకట్ గారు, ఇంట్లో అమ్మ చేసినప్పుడు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని అంటారు!
      అవి చేసేపెట్టే వారు లేక, చేసుకోలేక అప్పుడు తెలుసుకుంటారు. మా అమ్మాయి కూడా అంతే! ఇప్పుడు ఎప్పుడు ఇంటికి వచ్చి అమ్మా చేసిపెట్టేవన్నీ తినాలా అని అలోచిస్తూ ఉంటుంది! ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  11. మీ టపా లోని పెసరట్టు ఇప్పుడే చేసినట్టు ఫ్రెష్ గా ఉందండీ! ఉల్లి, పచ్చి మిరపకాయల ముక్కలు, అల్లం పచ్చడి, ఆలు కుర్మా మంచి కాంబినేషన్. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. ఆలు కూర్మా పెసరట్టుతోనా? వినలేదండి నేను ఇంతకు ముందు.
      మసాల దోశలో ఆలు తెలుసు..ఇప్పుడు breakfast టైం మాకు,మనస్సు భలే లాగేస్తుందండి ఇవన్నీ తినాలని.ధన్యవాదాలండి నాగేంద్ర గారు!

      Delete
  12. ఇక్కడ టిఫిన్లు, కాంబినేషన్లు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నా వంతుగా ఓ కరివేపాకు రెమ్మ..

    క్రేజీ కాంబినేషన్స్ అన్నమాట. రాసిపెట్టుకోండి చాలా పనికొస్తాయి..

    http://jyothivalaboju.blogspot.in/2008/04/blog-post_17.html

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారు స్వాగతం!
      మీరు ఇచ్చిన లింక్ చూసాను. అసలు ఆ క్రేజీ కాంబినేషన్స్ ఎంటండి? పూరి లు టీ తో,మరియు mango juice తో నా? (try chestaananDi) ఆవకాయ అన్నం నూనే తో? ఇంకా పెరుగన్నం లో అప్పడాలు నాకు నచ్చింది (అప్పుడప్పుడు చిప్స్ తో తింటాను నేను పెరుగన్నం) మీ బ్లాగ్ లో ఆ కాఫీ, mango juice చిత్రాలు భలే టెంప్టింగ్ గా ఉన్నాయండి. మీ స్పందనకు ధన్యవాదాలండి!

      Delete
  13. చల్లటి మామిడి జ్యూస్ తో వేడి వేడి పూరీలు ఒకసారి తిని చూడండి. తర్వాత మాట్లాడదాం..:))

    కామెంట్స్ చూడండి. అలాటివే బోలెడు కాంబినేషన్స్..

    ReplyDelete
    Replies
    1. మీరు లింక్ ఇచ్చినప్పుడే , అన్ని కామెంట్స్ చదివేసానండి!
      నిజంగా బొలెడన్ని combinations suggest చేసారు. కొన్నైనా try చెస్తానండి!
      మీకు మరి ఒక్కసారి ధన్యవాదాలండి జ్యోతి గారు.

      Delete
  14. ఏమిటో.. ఈ పలాహారాల పోస్ట్లు. చూడగానే ఆకలి అవుతుంది. అక్కడికి వెళితే ఈ పలాహారాలే గుర్తొచ్చేసి ,నచ్చేసి జిహ్వ చచ్చిపోతుంది. మధ్యలో..జ్యోతి గారు పరిచయం చేసే కొత్త రుచులు.ఇంకా పుస్తకాల కబుర్లు... తెగ నచ్చేసాయి.
    నాకు వంట చేయడం మహా బద్దకంగా ఉంది. అమ్మలా ఎవరైనా నన్ను పెంచుకొన్దోచ్!! వచ్చేస్తాను. :) :)

    ReplyDelete
    Replies
    1. హా హా హా! వనజ గారు! ఇదేదో బాగుందండోయి! అమ్మలా పెంచుకోవడం!!!
      జ్యోతి గారి లింక్ లో నిజంగానే భలే variety combinations ఉన్నాయి కదండి?
      ఎవరన్నా చక్కగా వండి పెడితే తినిపెట్టడానికి నేను కూడా రేడీ!

      Delete
  15. మీరు చెప్పినవాటితో పాటు జొన్నరొట్టె,గుత్తి వంకాయతో గానీ,సొరకాయ కూరతో గానీ చాలా బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. గుత్తి వంకాయ కూరను గుర్తు చేసారు భోజన సమయంలో ..వెంగెతబ్లెస్ లో కింగ్ అండి వంకాయ!
      ఇక సొరకాయ కి మీకు ఎదో అవినాభావ సంబంధం ఉందండి విజయమోహన్ గారు.
      సొరకాయ ను ఇంతకు ముందు తీసి పారేసేదాన్ని. ఇప్పుడు సొరకాయను చూస్తే..మీ art మాత్రమే గుర్తుకు వస్తుంది..సొరకాయ మీద ఇష్టం అనలేను కాని ఏదో గౌరవం పెరిగిందండి! జొన్న రొట్ట్లు ఎప్పుడు తినలేదు నేను!మీ స్పందనకు ధన్యవాదాలండి!

      Delete
  16. మీరు ఇలా అన్ని వెరైటీస్ పెట్టి నోరూరిస్తే ఎలా!ఏదేమైనా మీ విభిన్న పోస్ట్ కి థాంక్స్.అన్ని దేశాలు తిరిగినట్టుంది.

    ReplyDelete
    Replies
    1. "E-BREAKFAST పార్టీ" అండి రవిశేఖర్ గారు.
      కాని ఎంతైనా.. మన పెసరట్టే బెస్టు కదండి?ధన్యవాదాలు మీ స్పందనకు!

      Delete
  17. Replies
    1. మిధునం సినిమాలోది తమ్ముడు.శ్రీ గారు లింక్ ఇచ్చారు నాకు.

      Delete
  18. భలె పాట పెట్టారె :)' ఆవకాయ మన అందరిదీ 'ఎక్కడి దండీ ఈ పాట ? బాగుంది .

    ReplyDelete
    Replies
    1. "మిధునం" సినిమాలోది మాలాకుమార్ గారు. నాకు శ్రీ గారు ఇచ్చారు లింక్.

      Delete
  19. Dosa with chicken ia very good combination. Pulka with paneer curry also:D:D

    ReplyDelete