సందీప్ చెప్పినదంతా విన్న సుభద్ర నిశ్చేష్టురాలయ్యింది.కొద్ది సేపు వరకు ఎలా స్పందించాలో తెలియక,మౌనంగా సందీప్ ని చూస్తు ఉండిపోయింది.సందీప్ అక్కడనుంచి లేచి వెళ్ళిపోయాడు.సుభద్ర వెంకట్ ని అడిగింది,"గీతతో మాట్లాడాలి"అని."నేను కూడా తనతో మాట్లాడలేదు ఇంతవరకు,వెళదాము పద"అని సమాధానమిచ్చాడు వెంకట్.ఇద్దరు కలిసి లివింగ్ రూం లో కి వెళ్ళి సురేష్ తో అన్నారు"మేము గీతను కలవాలి.మీ ఇంటికి వెళదామా"అని.సురేష్ అలాగేనని"పదండి"అన్నాడు.గీత నాన్నగారు కూడా వారితోటి కారులో కూర్చున్నారు.రాహుల్ తో చెప్పింది సుభద్ర" Please take care of Sandeep"అని.
సురేష్ ఇంటిలో గీత పరిస్థితి కూడా ఏమీ బాలేదు.రాత్రంతా నిద్ర లేమితో,బాగా ఏడ్చినట్టుగా ఉంది మొఖం.గీతని చూస్తూనే అంది సుభద్ర "గీతా, ఏంటిదంతా?అసలు నువ్వేం చేసావో ఆవేశంలో తెలుసా?"అంటూ ప్రశ్నించింది.అక్కడే ఉన్న గీత అమ్మగారు,"మీ తమ్ముడు చేసిన నిర్వాకం మీకు తెలీదా?అమ్మాయిని ప్రశ్నించటానికి వచ్చారా?"అంటూ ఎదురు ప్రశ్న వేసారు"తమ్ముడితో మాట్లాడే వచ్చాను.జరిగినదంతా తెలుసుకున్నాను.ఎందుకు జరిగింది,ఎలా జరిగింది,ఎవరిది తప్పు అన్న విషయాలు చర్చించుకోవడం కన్నా,ఇప్పుడు మనం పెద్దవారిగా చెయ్యవలసినదేంటి వీరిద్దరిని కలపటానికి అన్న విషయం గురించి అలోచించాలండి."అని నెమ్మదిగా జవాబు ఇచ్చింది సుభద్ర.గీత నాన్నగారు కూడా వెంటనే"అమ్మాయి మీద చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది.ఇంత దూరం రాకుండా ఉండేది కదా"అని అన్నారు.వెంకట్ దురుసుగా"అంటే,చెయ్యి చేసుకున్నాడని కాప్స్ కి ఫోన్ చెయ్యమని చెప్పారా మీరు గీతకి"అంటూ గట్టిగానే అడిగాడు.మేమెందుకు చెపుతాము,ఆ పరిస్థితుల్లో మళ్ళీ కొడతాడేమో అని భయ్యంతో అమ్మాయి ఫోన్ చేసింది.తప్పేముంది అన్నట్లు పొగరుగా మాట్లాడాడు ఆయన.
సుభద్ర కళ్ళతోనే వెంకట్ ని వారించింది."గీతా,చెప్పమ్మా..నువ్వు చిన్న పిల్లవేమి కాదు.జరిగేది,జరుగుతున్నది నీకు అర్ధం కాకపోవడానికి.సందీప్ దుర్మార్గుడు,అతనితో బ్రతకడమంటే నా ప్రాణానికి హాని అని నువ్వు అనుకున్నట్లైతే చెప్పు.తమ్ముడిగా నా దృష్టిలో అతను మంచివాడే కావొచ్చు,భర్తగా మంచివాడవ్వాలని లేదుగా"అంటూ సూటిగా గీతని చూస్తూ అడిగింది. గీత దగ్గర నుంచి సమాధానం రాలేదు.చాలా సేపు గీతతో మాట్లాడుతూనే ఉంది సుభద్ర.అవేశంలో,తొందరపడి ఇద్దరు చేసినవి తప్పులే!భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వారు ఎలాంటి సమస్య వచ్చినా ఇంకోరకంగా పరిష్కరించుకునేవారేమో కాని,గీత తల్లితండ్రులు అక్కడ ఉండటం వలన ఇద్దరు ఎవరికి వారు తగ్గడానికి అహాలు అడ్డు వచ్చి,ఇంత దూరం తెచ్చుకున్నారు.ఎంత సేపు మాట్లాడినా రాయిలా కూర్చుందే తప్ప,గీత ఒక్క మాట కూడా సుభద్రతో మాట్లాడలేదు.ఇక తను చెయ్యగలిగినది ఏమీ లేదు అనుకుంటూ,అవేశాలు తగ్గాక,వివేకం హెచ్చరిస్తే,అప్పుడు కాని వారి బుర్రలు సరిగ్గా పని చెయ్యవని అనుకుని,వెళతానని చెప్పి బయలుదేరింది సుభద్ర.సందీప్ ఇంటికి వచ్చి,సందీప్ బట్టలు సర్దమని రాహుల్ కి చెప్పి,సందీప్ ని తనతో పాటు ఇంటికి రమ్మని అడిగింది. "లేదక్కా, నేను రాను.I need some time for myself"అని సందీప్ సుభద్రతో చెప్పాడు.రాహుల్ ని తోడు గా ఉండమని చెప్పి అక్కడనుంచి ఇంటిముఖం పట్టింది సుభద్ర.
జరిగినదంతా ఒక కల అయితే ఎంత బాగున్నో! అని లెక్కలేనన్ని సార్లు అనుకుంది సుభద్ర.వెంకట్ మాత్రం గీతదే తప్పని,కాప్స్ కి ఫోన్ చేసే ముందు ఒక్క క్షణం అలోచించి ఉంటే సమస్య ఇంత జటిలంగా మారేది కాదు కదా అని బాధపడ్డాడు.సుభద్ర మాత్రం తప్పు ఎవరిది అన్న విశ్లేషణ అనవసరమని,ఎలాగైనా వారిద్దరు జరిగినదంతా మరచిపోయి,మళ్ళీ కలిసిపోవాలని దేవున్ని మనసులో కోరుకుంది.గీత కొద్ది రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి సురేష్ ఇంట్లోనే తల్లితండ్రులతో కలిసి ఉండిపోయింది.సందీప్ ని చాలా సార్లు ఇంటికి రమ్మని అడిగి విసిగిపోయిన సుభద్ర తనే రోజు విడిచి రోజు అతనిని కలిసి వచ్చేది.గీతతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది.సందీప్ సహజంగానే మితభాషి.ఈ సంఘటనతో అతను మనుషులతో మాట్లాడం పూర్తిగా తగ్గించేసాడు.అతని మనుసులో ఏముందో తెలుసుకోవడం ఆ బ్రహ్మ రుద్రాదులకు అయినా సాధ్యం అయ్యే పనేనా అనుకుంటూ ఉండేది సుభద్ర.
ఎలాగైనా సందీప్ ని,గీతని ఒక చోట చేర్చి వారిని ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా చెయ్యాలని ఎన్నోసార్లు అనుకుంది సుభద్ర.గీత మాట ఎత్తితేనే,పూర్తిగా మౌనం వహించేవాడు సందీప్.సందీప్..బుజ్జిగాడిని చూడాలని అనిపించటం లేదా అని సందీప్ ని నిలదీసి అడిగితే మాత్రం చాలా బాధపడేవాడు.బుజ్జిగాడి కోసం అయినా వీళ్ళిద్దరు కలిసిపోతారేమో అన్న ఆశ కలిగేది సుభద్రకి.సందీప్ తల్లితండ్రులు,పెద్దవాళ్ళు అందరు గీతతో,గీత తల్లితండ్రులతో మాట్లాడారు.సందీప్ వచ్చి తనతో మాట్లాడితే తిరిగి సందీప్ తో కలిసి జీవితం గడపడానికి తనకేమి అభ్యంతరం లేదని గీత చెప్పింది.అది వినగానే అందరు చాలా ఆనందపడి సందీప్ ని ఒక్కసారి దీపని కలవమని ఎంతో నచ్చచెప్పారు.ససేమిరా అన్నాడు సందీప్.ఆ విషయం తెలిసిన దీప తనకేమి సందీప్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదంటూ,బుజ్జిగాడిని తల్లితండ్రులతో ఇండియా పంపించి తను ఉద్యోగం చేసే స్టేట్ లోనే ఇల్లు రెంట్ చేసుకుని తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది.ఒక సంవత్సర కాలంలో సందీప్ రెసిడెన్సి పూర్తిచేసుకుని,వేరే స్టేట్ లో తన మిత్రులతో కలిసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి,కొద్ది కాలంలోనే బిసి అయిపోయాడు.వెకషన్ కి ఇండియా వెళ్ళిన సుభద్ర బుజ్జిగాడిని చూడడానికి వెళ్ళింది.ఎంతో ముద్దుగా ఉన్నాడు బుజ్జిగాడు.వాడు చేసే అల్లరి ఎలా ఉంటుందో చెప్పి మురిసిపోయారు గీత తల్లితండ్రులు.సుభద్రకి మనసులో ఎంతో దిగులుగా అనిపించింది.బుజ్జిగాడికి తల్లితండ్రులిద్దరి ప్రేమను పొందే అదృష్టం లేదే అని.ఇండియా నుంచి తిరిగి వచ్చాక సందీప్ ని కలిసింది సుభద్ర.తన కొడుకు ఎంత చక్కగా ఉన్నాడో,తను లైఫ్ లో ఏమీ మిస్స్ అవుతున్నాడో తెలుసుకోమని మళ్ళీ చెప్పింది సుభద్ర.సందీప్ వైఖరిలో ఏమీ మార్పు లేదు.
అప్పటివరకు ఎవ్వరిని జరిగిన దానికి దూషించని సుభద్ర మాత్రం ఆ రోజు తమ్ముడిని పట్టుకుని కడిగేసింది.పెద్ద పెద్ద చదువులు,ఉన్నతమైన పదవులు,ఆత్మాభిమానాలు అనుకుంటూ అన్ని భూతద్దంలో చూసుకుంటున్నారే కాని,మీకు ఒక కొడుకు ఉన్నాడని కాని,వాడు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమకు దూరమౌతున్నాడని అలోచించారా?పిల్లలు ఉన్నారని జీవితమంతా రాజిపడి బ్రతకడం మా వల్ల కాదు అని మోడర్న్ గా అలోచిస్తూ,పాత కాలం చింతపండులా కాదు అని విర్రవీగుతున్నారే కాని,కలిసి బ్రతకలేనప్పుడు, అంత తొందరపడి పిల్లలను ఎందుకు కనాలి అని మాత్రం అలోచించరే?నాకు తెలిసిన సూత్రం ఒక్కటే సందీప్.నీకు, గీతకి బుజ్జిగాడు ఉండకపోతే,మీ ఇద్దరి జీవితాలు మీ ఇష్టం.చెయ్యి చేసుకుంటే పడి ఉండే భార్య లేదని నువ్వు,అవేశం లో చెయ్యి చేసుకున్నాడని మతి లేకుండా కాప్స్ వరకు వెళ్ళిన నీ భార్య ఇద్దరు ఇద్దరే!పూర్తి స్వార్ధపరులు.ఆ రోజు ఇద్దరు అలసి సొలసి ఇంటికి చేరి ఉండకపోతే,మీ అత్తగారు,మావగారు ఇంట్లో ఉండకపోతే ఆ సంఘటన జరిగేదే కాదు.మూడు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడుతూ కూడా,ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉన్నవారు,ఆ ఒక్క రోజు సంఘటనతో విడిపోయారు.పిల్లలని కనేముందు ఒక్కసారి అలోచించండి మీ యువతరం.ఒకరికొకరు జీవితాంతం తోడు ఉండగలమనే ఆ నమ్మకం కలగనప్పుడు దయచేసి పిల్లలను కనకండి.ఒకసారి పిల్లలను కన్నాక,పంతాలకు పోకండి.ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి.అన్ని విషయలలో ఒకటి పది సార్లు అలోచిస్తారు కదా మీ తరం,దయచేసి పిల్లలను కనడం ఒక experience గా పరిగణించకుండా అది ఒక బాధ్యత అని వారి బంగారు జీవితం మీ చేతిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించండి.అలా అని మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారు అని నేను అనడం లేదు.ఒకవేళ నిజంగానే మొదట్లో బయటకి రాని విశ్వరూపాలు పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాల తరువాత బయటపడితే,అప్పుడు కలిసి ఉండాలి అని నేను అనను.కాని మీ స్వార్ధానికి, మీ అర్ధంలేని అహాలకి పిల్లల జీవితాలను బలి ఇవ్వకండి.కలిసి బ్రతకలేనప్పుడు మీకు పిల్లలను కనే హక్కు లేదు."అని తమ్ముడి తో తెగేసి చెప్పింది సుభద్ర.
జరిగినదంతా ఒక కల అయితే ఎంత బాగున్నో! అని లెక్కలేనన్ని సార్లు అనుకుంది సుభద్ర.వెంకట్ మాత్రం గీతదే తప్పని,కాప్స్ కి ఫోన్ చేసే ముందు ఒక్క క్షణం అలోచించి ఉంటే సమస్య ఇంత జటిలంగా మారేది కాదు కదా అని బాధపడ్డాడు.సుభద్ర మాత్రం తప్పు ఎవరిది అన్న విశ్లేషణ అనవసరమని,ఎలాగైనా వారిద్దరు జరిగినదంతా మరచిపోయి,మళ్ళీ కలిసిపోవాలని దేవున్ని మనసులో కోరుకుంది.గీత కొద్ది రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి సురేష్ ఇంట్లోనే తల్లితండ్రులతో కలిసి ఉండిపోయింది.సందీప్ ని చాలా సార్లు ఇంటికి రమ్మని అడిగి విసిగిపోయిన సుభద్ర తనే రోజు విడిచి రోజు అతనిని కలిసి వచ్చేది.గీతతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది.సందీప్ సహజంగానే మితభాషి.ఈ సంఘటనతో అతను మనుషులతో మాట్లాడం పూర్తిగా తగ్గించేసాడు.అతని మనుసులో ఏముందో తెలుసుకోవడం ఆ బ్రహ్మ రుద్రాదులకు అయినా సాధ్యం అయ్యే పనేనా అనుకుంటూ ఉండేది సుభద్ర.
ఎలాగైనా సందీప్ ని,గీతని ఒక చోట చేర్చి వారిని ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా చెయ్యాలని ఎన్నోసార్లు అనుకుంది సుభద్ర.గీత మాట ఎత్తితేనే,పూర్తిగా మౌనం వహించేవాడు సందీప్.సందీప్..బుజ్జిగాడిని చూడాలని అనిపించటం లేదా అని సందీప్ ని నిలదీసి అడిగితే మాత్రం చాలా బాధపడేవాడు.బుజ్జిగాడి కోసం అయినా వీళ్ళిద్దరు కలిసిపోతారేమో అన్న ఆశ కలిగేది సుభద్రకి.సందీప్ తల్లితండ్రులు,పెద్దవాళ్ళు అందరు గీతతో,గీత తల్లితండ్రులతో మాట్లాడారు.సందీప్ వచ్చి తనతో మాట్లాడితే తిరిగి సందీప్ తో కలిసి జీవితం గడపడానికి తనకేమి అభ్యంతరం లేదని గీత చెప్పింది.అది వినగానే అందరు చాలా ఆనందపడి సందీప్ ని ఒక్కసారి దీపని కలవమని ఎంతో నచ్చచెప్పారు.ససేమిరా అన్నాడు సందీప్.ఆ విషయం తెలిసిన దీప తనకేమి సందీప్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదంటూ,బుజ్జిగాడిని తల్లితండ్రులతో ఇండియా పంపించి తను ఉద్యోగం చేసే స్టేట్ లోనే ఇల్లు రెంట్ చేసుకుని తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది.ఒక సంవత్సర కాలంలో సందీప్ రెసిడెన్సి పూర్తిచేసుకుని,వేరే స్టేట్ లో తన మిత్రులతో కలిసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి,కొద్ది కాలంలోనే బిసి అయిపోయాడు.వెకషన్ కి ఇండియా వెళ్ళిన సుభద్ర బుజ్జిగాడిని చూడడానికి వెళ్ళింది.ఎంతో ముద్దుగా ఉన్నాడు బుజ్జిగాడు.వాడు చేసే అల్లరి ఎలా ఉంటుందో చెప్పి మురిసిపోయారు గీత తల్లితండ్రులు.సుభద్రకి మనసులో ఎంతో దిగులుగా అనిపించింది.బుజ్జిగాడికి తల్లితండ్రులిద్దరి ప్రేమను పొందే అదృష్టం లేదే అని.ఇండియా నుంచి తిరిగి వచ్చాక సందీప్ ని కలిసింది సుభద్ర.తన కొడుకు ఎంత చక్కగా ఉన్నాడో,తను లైఫ్ లో ఏమీ మిస్స్ అవుతున్నాడో తెలుసుకోమని మళ్ళీ చెప్పింది సుభద్ర.సందీప్ వైఖరిలో ఏమీ మార్పు లేదు.
అప్పటివరకు ఎవ్వరిని జరిగిన దానికి దూషించని సుభద్ర మాత్రం ఆ రోజు తమ్ముడిని పట్టుకుని కడిగేసింది.పెద్ద పెద్ద చదువులు,ఉన్నతమైన పదవులు,ఆత్మాభిమానాలు అనుకుంటూ అన్ని భూతద్దంలో చూసుకుంటున్నారే కాని,మీకు ఒక కొడుకు ఉన్నాడని కాని,వాడు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమకు దూరమౌతున్నాడని అలోచించారా?పిల్లలు ఉన్నారని జీవితమంతా రాజిపడి బ్రతకడం మా వల్ల కాదు అని మోడర్న్ గా అలోచిస్తూ,పాత కాలం చింతపండులా కాదు అని విర్రవీగుతున్నారే కాని,కలిసి బ్రతకలేనప్పుడు, అంత తొందరపడి పిల్లలను ఎందుకు కనాలి అని మాత్రం అలోచించరే?నాకు తెలిసిన సూత్రం ఒక్కటే సందీప్.నీకు, గీతకి బుజ్జిగాడు ఉండకపోతే,మీ ఇద్దరి జీవితాలు మీ ఇష్టం.చెయ్యి చేసుకుంటే పడి ఉండే భార్య లేదని నువ్వు,అవేశం లో చెయ్యి చేసుకున్నాడని మతి లేకుండా కాప్స్ వరకు వెళ్ళిన నీ భార్య ఇద్దరు ఇద్దరే!పూర్తి స్వార్ధపరులు.ఆ రోజు ఇద్దరు అలసి సొలసి ఇంటికి చేరి ఉండకపోతే,మీ అత్తగారు,మావగారు ఇంట్లో ఉండకపోతే ఆ సంఘటన జరిగేదే కాదు.మూడు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడుతూ కూడా,ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉన్నవారు,ఆ ఒక్క రోజు సంఘటనతో విడిపోయారు.పిల్లలని కనేముందు ఒక్కసారి అలోచించండి మీ యువతరం.ఒకరికొకరు జీవితాంతం తోడు ఉండగలమనే ఆ నమ్మకం కలగనప్పుడు దయచేసి పిల్లలను కనకండి.ఒకసారి పిల్లలను కన్నాక,పంతాలకు పోకండి.ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి.అన్ని విషయలలో ఒకటి పది సార్లు అలోచిస్తారు కదా మీ తరం,దయచేసి పిల్లలను కనడం ఒక experience గా పరిగణించకుండా అది ఒక బాధ్యత అని వారి బంగారు జీవితం మీ చేతిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించండి.అలా అని మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారు అని నేను అనడం లేదు.ఒకవేళ నిజంగానే మొదట్లో బయటకి రాని విశ్వరూపాలు పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాల తరువాత బయటపడితే,అప్పుడు కలిసి ఉండాలి అని నేను అనను.కాని మీ స్వార్ధానికి, మీ అర్ధంలేని అహాలకి పిల్లల జీవితాలను బలి ఇవ్వకండి.కలిసి బ్రతకలేనప్పుడు మీకు పిల్లలను కనే హక్కు లేదు."అని తమ్ముడి తో తెగేసి చెప్పింది సుభద్ర.

ఏమి వ్యాక్యానించదానికి లేదు. ఆవేశం లొ సందీప్, గీత ఇద్దరూ విచక్షణ కొల్పోయారు.పంతాలు-పట్టింపులు వల్ల ఎంతో మంది ఇలా కుటుంబాన్ని కోల్పోతున్నారు. పసి బిద్ద ని తల్చుకుంటే బాధ కల్గుతుంది
ReplyDeleteప్రతిదానికి మీరు అంత బాధ పడవలసిన అవసరం లేదు. ఇటువంటి పసిబిడ్డ ఒకడు, పెరిగి పెద్దవాడై మా ఊరిలోఇంటర్ చదువుతున్నాడు. వాడి తల్లిదండృలు వేరే దేశాలలో ఉంట్టూ , బాగా డబ్బులు పంపిస్తారు. చాలా ఖరీదైన బైక్ తీశాడు. అందరు ఆ యువకుడిని ముద్దుగా బంటి అనిపిలుచుకొంటారు. వాడి అమ్మామా తాత లకు డబ్బు పిచ్చి. ముసలి వయసులో కూడా తాత గారు డబ్బులు సంపాదించటానికి మొదటి ప్రిఫెరెన్స్ ఇస్తాడు. చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకు సహాయంగా భార్య ఎల్లపుడు అందుబాటులో ఉంట్టుంది. వాడు చదవడు పెట్టడు. బైకేసు కొని జులాయిగా ఊరంతా తిరుగుతూంటాడు. చిన్న వయసులోనే ఆయన చేసే చిలిపి పనుల వలన కొంతమంది ఇంటిపైకి దండయాత్రకి వస్తూంటారు. ఆ అబ్బాయికి వాళ్ల తాత ఎటువంటివారినైనా డబ్బుతో కొడతాడని, వీలు కాకపోతే రాజకీయ పలుకు బడితో అయినా నోరు మూయిస్తాడని తెలుసు. తాత మనవడు చెత్త పనులు చేస్తున్నా చూసిచూడనట్లు పోతాడు. వాడి గురించి ఎక్కువగా పట్టించుకొంటే ఆయన వ్యాపారం లో నష్టపోతానేమో అని ఆయన బెంగ.
Deleteఈ మొత్తం వ్యవహారంలో (పై కథలో)ఆ అబ్బాయిని ఇండియాకు తీసుకొచ్చి పెంచటం బాగాలేదు. ప్రపంచం లో అన్ని రకాల చెత్తను పడేయటానికి , ఇండియా ఒక డస్ట్ బిన్ లాగా తయారయ్యింది.
4545
నిజమే వనజ గారు.భార్యభర్తలిద్దరు ఆ విషయం గ్రహించాలి కాని, ఎవ్వరు వారికి నచ్చచెప్పలేని పరిస్థితి. ధన్యవాదాలు వనజ గారు.
Deleteరచనా నైపుణ్యాన్ని అలవోకగా ప్రదర్శించారు,..సుఖాంతం చేస్తారేమోననుకున్నా చివరి వరకు,..ఎక్కడా బోర్ కొట్టకుండా కధను వేగంగా నడిపారు,.ఇంకో పార్ట్ కూడా రాస్తే బావుంటుందేమో,..మంచి కధ అభినందనలు,..
ReplyDeleteభాస్కర్ గారు,చదివి,అభిప్రాయం తెలిపి, ప్రశంసించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.ఎందరో దగ్గరవారు వారి కథ సుఖాంతం కావాలని ఈ రోజు కూడా కోరుకుంటున్నారండి.
Deleteexcellent ending. no excuses.
ReplyDeleteచక్కటి టపాను వేసారండి.
ReplyDeleteమీ అభిప్రాయం అమూల్యమైనది అనురాధగారు. ధన్యవాదాలు మీకు
Deleteఅమెరికా లో ఏమి జరిగినా వెంటనే 911 కు కాల్ చేసి చెప్పటము , కాప్స్ రావటమూ ఒకరకంగా సెక్యూరిటీ గా వుంటుందేమో కాని ఇలా భార్యాభర్తలు , పిల్లలు తల్లి తండ్రులనుంచి విడిపోవటం బాధగా వుంటుంది . ఇది మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు . ఆ వీలు వుంది కదా అని చిన్న చిన్న వాటికే కాప్స్ కు కాల్ చేయటం ఈ మధ్య చాలా విన్నాను .
ReplyDeleteకథ బాగుంది .
నిజమే మాలా గారు. చట్టాలు ఒకందుకు ఉంటే, వాటిని సరిగ్గా ఉపయోగించుకోవటం పొరులుగా మన బాధ్యత వివేకం నశించినప్పుడు ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ వాఖ్యకి ధన్యవాదాలండి.
Deleteబాబు కోసమైనా సందీప్ గీతకు సారీ చెబితే సరిపోయేది.
ReplyDeleteమీ అభిప్రాయమే నాది కూడా నాగరాణి గారు.ధన్యవాదాలు మీకు.
DeleteIs this real story or fiction? Very well written. Such attention to detail!
ReplyDeleteI know a similar incident involving bathroom curtains not kept inside. ;)
Even kids call the cops when mom & dad gets into arguments. With Indians loud voices are very common, ABCD kids find that offensive.
చాతకం గారు, based on real incident. Thanks for the nice words.
Delete" With Indians loud voices are very common, ABCD kids find that offensive." So true .....!!
జలతారు వెన్నెల గారూ, ముగింపు చదవకుండానే నా అభిప్రాయం వ్రాద్దామనుకున్నాను, ముగింపు ప్రభావితం చేసిందనుకుంటారేమోనని. కానీ నాకు కుదరలేదు. మీరు చూసినది ఇలా ఉంటే నాకు తెలిసిన కనీసం మూడింటికి మూడు సంఘటనల్లో పోలీసులని పిలిచాక సర్దుకుపోయారు. ఒక కుటుంబం విషయంలో పొరుగువాళ్ళు పిలిచారు. 'కొట్టడం' అనేది "పోలీసులని" పిలించేంత విషయం కాదని ఎలా అనిపిస్తుందో అలాగే "పోలీసులని" పిలవడం అనేది కూడా కాపురం తెచుకొనేంత విషయం కాదని అర్థం చేసుకుంటే బావుంటుంది. సంఘటన కాదు, ఆ తర్వాత ఎలా స్పందించారన్నదే ముఖ్యం ఇక్కడ. నిజంగా వారి మధ్య సరైన బంధం ఉండగలిగే స్థితి ఉంటే అది ఆ తర్వాత జరిగిన దాంట్లోనే బయటపడుతుంది. ఇంతకంటే ఘోరమైనవి మన దగ్గర బంధువులు, in-laws కి ఉండే పంతాలూ, పట్టింపులూను. అవి కాపురాలని నిలువునా కాల్చుకు తింటుంటాయి. పిల్లల గురించి ఆలోచిస్తే మనసు తరుక్కుపోతుంది. ఈ విషయాలలో కలిసి ఉండడమే సుఖానతం అనుకుంటే సరే. కానీ అక్కడ వ్యక్తుల వ్యక్తిత్వాలు ఒకరికొకరికి సరిపడనివి అని స్పష్టమౌతున్నది. పిల్లలు మధ్యలో. వాళ్ళకి ఆ హక్కు లేదు నిజమే కానీ. ఎవరో చెప్పారు ఎక్కడో, పిల్లలు పుట్టాక ఆరోగ్యకరమైన బంధాలు మరింత గట్టి పడతాయి, అనారోగ్యకరమైనవి మరింత బలహీనపడతాయిట. నాకు English Vinglish లో శ్రీదేవి పాత్ర చెప్పిన మాటలు చాలా నచ్చాయి. ఇద్దరూ సమానంగా ప్రవేశిస్తున్నారు బంధంలోకి . ఒక్కో సారి ఒకరికి తక్కువ అన్న భావం కలిగితే ఇంకొకరు వారికి సమానం అన్న భావం కలిగించడానికి ప్రయత్నించాలి. ఒక్కోసారి ఆ భావం ఎవరికి వారే పెంపొందించుకోవాలి.
ReplyDelete"ఇన్-లవ్స్ కి ఉండే పంతాలూ, పట్టింపులూను"
Delete"ఇంటింటికొక ముసలి ఘటం అది ప్రేమికులకు పెనుభూతం" పాత సినేమాలో పద్మనాభం పాట ఉంది. ఇప్పుడు ముసలి ఘాటాల స్థానం లో అమ్మాయి తల్లిదండృలు వస్తారు. అల్లుడి మీద ఆధిపత్యం చేలాయించటం ఎక్కువైపోయింది. మధ్య తరగతి ఆడవారి అడ్డుగోల వ్యవహారాలు ఇప్పుడు అందరికి చిరపరిచితాలే. సమాజం లో వచ్చిన మార్పులకి కనుగుణం గా మగవారు కూడా కళ్లు తెరుస్తున్నరు లేండి.
లలిత గారు,మీరు చాలా బాగా విశ్లేషించారు. జరిగినదంతా ఒక third person perspective (who is close to sandeep)రాయడం జరిగింది కాబట్టి, కొద్దిగా సందీప్ తరపున కథ రాసినట్టు అనిపించిదేమో చదివిన వారికి.ధన్యవాదాలు మీ వాఖ్యకి.
Delete"కొద్దిగా సందీప్ తరపున కథ రాసినట్టు అనిపించిదేమో చదివిన వారికి" నేను వ్రాయాలనుకున్నది మీరు చెప్పారు.ఇంకొక వ్యాఖ్య వ్రాయడం మొదలు పెట్టి పూర్తి చెయ్యలేకపోయాను నిన్న. ఇదే అబ్బాయి తల్లి దండ్రుల జోక్యం గురించి వ్రాస్తే స్పందన ఎలా ఉండేది అని నా అనుమానం.
Deleteఅబ్బాయి తల్లి దండ్రుల జోక్యం గురించి మీరు రాయండి చదివి తెలుసుకొంటాం.
Deleteలలితగారు,ఈ టపాలో నేను ముఖ్యం గా చెప్పదలచుకున్నది,ఇతరుల జోక్యంతో భార్యభర్తల బంధంలో వచ్చిన మార్పు కాదండి. అందుకని ఆ ఇతరులు అమ్మాయి తరపు వారైనా,అబ్బాయి తరపు వారైనా ఒకటే నా దృష్టిలో! ఒకరినొకరు సరిగా అర్ధం చేసుకోకుండా, పంతాలతో,పట్టింపులతో అహంభావంతో, నేను అన్న భావం ఇంకా చాలా ఇద్దరిలో మిగిలి ఉన్నపుడు,వారు పిల్లలను కనాల్సిన అవసరం లేదు. "నేను అన్న భావన కన్నా,"మనం" అన్న భావన వారికి కలిగినప్పుడు మాత్రమే పిల్లలను కనే హక్కు ఉంది అని చెప్పాలన్న చిన్న ప్రయత్నం అంతేనండి.
Deleteచర్చ తప్పుదోవ పడుతుందేమోనన్న బెంగతో ఎంత ప్రయత్నించినా మాటలు సరిగా కూర్చుకోలేక నేను వ్రాయలేదు ముందు. మీరన్న మాటలే ఉదహరించి నాకున్న అనుమానాన్ని వ్యక్తం చేశాను అంతే. మీ ఉద్దేశం నాకు అర్థం అయ్యింది. స్పందన చాలామటుకు ఆవేశంతో కాక ఆలోచనతో నిండి ఉంది. అది సంతోషించతగ్గ విషయం. ఒకింత అనుమానం తొలిచింది అంతే.ఇక్కడ వచ్చిన ఆరోగ్యకరమైన స్పందనే అంతటా పెరగాలి. పొడిగించడం నా ఉద్దేశం కాదు. అంతే కాదు, నేను ఈ కథ మొత్తం మరొకసారి తీరికగా చదవవలసి ఉంది. కథేమిటో అర్థమయ్యింది కాని వివరాలు కొన్ని వివరాలు నేను గమనించలేదనుకుంటాను.
Deleteమనస్ఫూర్తిగా ఆ కుటుంబం మంచి కోరుకునే వారున్నారు కనుక ఫలితం మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వారికి కొంత సమయం పట్టవచ్చు. అలా సర్దుకున్న జంటలు కూడా తక్కువేమో కానీ పూర్తిగా లేకుండా మాత్రం లేవు.
లలిత గారు,మీ మొదటి కామెంట్ నన్ను అలోచింపచేసింది.English Vinglish సినిమాని ఉదహరించి మీరు రాసిన వాఖ్యలు చదవగానే,గత సంవత్సరం Detorit లో జరిగిన ఇంకో సంఘటన గుర్తుకు వచ్చింది. త్వరలో టపా వేస్తాను. చదివి అభిప్రాయం తెలుపండి.ధన్యవాదాలండి.
Deleteజలతారు వెన్నెలగారు కథను బాగా నడిపించారు. అభినందనలు.
ReplyDeleteపాత పాట ఒకటి ఉంది "చేతులు కలసిన తప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లూ" అని.
భార్యాభర్తల మధ్యకు మూడవ వ్యక్తి ప్రవేశించకూడదు - ఖచ్చితంగా కూడదు. "అమ్మా/నాన్నా ఇది మా యిద్దరి మధ్య చిన్న వ్యవహారం, దయచేసి మీరు కల్పించుకొని జటిలం చేయకండి అని ఖరాఖండిగా తమకు సపోర్టుగా వచ్చిన తలిదండ్రులతో చెప్పగలిగిన పరిపక్వత లేకపోతే తీవ్ర పరిణామాలు కలుగుతాయి మరి.
వివాహబంధాన్ని అలోచన + అవగాహన బలోపేతం చేస్తే ఆవేశం + ఇతరుల ప్రవేశం బలహీనం చేస్తుంది. ఇది నేను ప్రత్యక్షంగా చీసిన సత్యం.
ఇలాంటి మంచి కథలు చదివాకా నేను కూడా యెందుకు వ్రాయకూడదా అని అనిపిసస్తుంది!
శ్యామలీయం గారు,ఎంత బాగా చెప్పారండి."వివాహబంధాన్ని అలోచన + అవగాహన బలోపేతం చేస్తే ఆవేశం + ఇతరుల ప్రవేశం బలహీనం చేస్తుంది." నూటికి నూరుపాళ్ళు నిజం!
Deleteమీరు వ్రాయండి శ్యామలీయంగారు. మీ అనిభవాలన్ని కథలుగా రాస్తే మాలాంటివారికి/ఎందరికో జీవిత పాఠాలుగా ఉపయోగపడతాయి!
ధన్యవాదాలు శ్యామలీయం గారు
కొన్ని జీవితాలు అంతే వారు మారరు.సుభద్ర కోణం కరెక్ట్.
ReplyDeleteసుభద్ర తో ఏకీభవించారన మాట. ధన్యవాదాలు రవిశేఖర్ గారు.
Deleteసందీప్ తప్పేమి లేదు. అనవసరం గా అతనిని అందరు తప్పూపడుతున్నారు. భారత ప్రజల అలక్ష్యం, మనదేశం లో ఉన్నపుడే భరించటం కష్టం. విదేశ జీవనం అలవాటైన వారికి ఇటువంటి సంఘటనలు కోపం తెప్పించటం తప్పూ పట్టలేము. కొందరు సందీప్ అత్తమామలకు సారి చెప్పేస్తే బాగుండేదేమో అని వ్యాఖ్యానించారు. టపామొత్తం లో అత్తామామలకు అహంకారం తప్పించి, బుద్ది,జ్ణానం ఉన్నట్లు ఎక్కడా కనపడ లేదు. మొదట అత్త్తామామలే సందీప్ కు సారి చెప్పాలి. వారి నుంచి ఆశించటం అత్యాస. అమ్మా, నాన్నలే ఎక్కువనుకొన్నపుడు ఆడవాళ్లు పెళ్ళిళు చేసుకోకుండా వాళ్ల దగ్గరే ఉంటే మంచిది. గీతలాంటి వారికి పెళ్ళి అనవసరం. ఆమే తండ్రి కూడా ఆ ఉద్దేశం తో పెంచాడని స్పష్టంగా తెలుసుతున్నాది. మొగుడు, పిల్లలు సంసారం లేకపోయినా పరవాలేదు, పెద్ద చదువులు చదివించినందుకు కూతురు అమేరికాలో ఉద్యోగం చేసి డబ్బులు బాగా సంపాదించూ కోంటే అదే చాలు అనుకొన్నట్లున్నాడు.
ReplyDeleteఈ మధ్య జరిగే ఇటువంటి సంఘటనలవలన కొన్ని స్టీరియోటైప్ అభిప్రాయాలు పటాపంచలై పోతున్నాయి. ప్రపంచం లో భారత నారి చాలా ప్రత్యేకం. స్రీ ప్రేమ స్వరూపిణి, ప్రేమించటం మాత్రమే, ఆమేకు తెలుసు అని ప్రాపంగండా చేసుకొన్న వాళ్ల అభిప్రాయాలు తప్పు అని తెలిసిపొతున్నాయి.
ఇందృడి ఆజ్ణ జవదాటకుండా, శకుంతలను అడవిలో వదలి, కేరీర్ కోసం స్వర్గానికి వెళ్లి పోయిన దేవవేశ్య మేనకకు, గీతకు పెద్ద భేదమేమి లేదు. తప్పుచేసిన వాళ్లంతా తప్పు అని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నపుడు, సుభద్ర తమ్ముడిని పట్టుకొని దులపటం తప్ప అంతకు మించి ఎమీ చేయగలదు?
4545
:) బాగా కదిలించినట్టుంది ఈ టపా మిమ్మల్ని. ధన్యవాదాలండి మీ స్పందనకు
Deleteఅసలు పెళ్ళయిన కొత్తలోనే ఇద్దరినీ కూర్చో పెట్టి...చెప్పాలి...ఇక ముందు జీవితంలో ఎప్పుడైనా సమస్య వచ్చి ఒకళ్ళు రెచ్చిపోతే...అవతలి వాళ్ళు సైలెంట్ అయిపోవాలి...పరిస్థితి తీవ్రత తగ్గే వరకూ...తర్వాత నిదానంగా సర్ది చెప్పుకోవాలని...చాలా మంది ఇళ్ళలో ఆడవాళ్ళు ఇలా సైలెంట్ అయిపోయి...అవతలి వాళ్ళ కోపం తగ్గాక క్లాసులు పీకడం నేను విన్నాను...ఇదే ఉత్తమమైన పద్దతి అనిపిస్తుంది..ఇద్దరూ ఒకేసారి రెచ్చిపోతే....ఇక ఇలానే...
ReplyDelete@ వారి బంగారు జీవితం మీ చేతిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించండి..
ఆ పిల్లలు అనుభవించే నరకం..ఎదుర్కునే సమస్యలు...సింగిల్ పేరెంట్ చైల్డ్ గా...అనుభవించిన వారికే తెలుస్తుంది...వాళ్ళు ఎంతో తెలివైన పిల్లలయితే తప్ప...పైకి రావటం చాలా కష్టం...
నిజమే ప్రసాద్ గారు.Counselling before marriage/after marriage is very much necessary అంటారు."Silence is golden sometimes" అని కూడా అంటున్నారు.మీ స్పందనకు ధన్యవాదాలండి.
Deleteయె మనిషి పెర్ఫెక్ట్ కాదు. ఒక్కో సమయం లొ మనలోని లోపాలు బయట పడతాయి ఆవేశం, కోపం రూపంలొ..భార్యగా గీత భర్త మనస్తితి అర్దం చేసుకుని తల్లి కి సర్ది చెప్పొచు..మెల్లగా భర్తకి తను ఛెసిన పని వల్ల తల్లి లాంటి అత్తగరు ఎల నొచ్చుకున్నారొ చెప్పవచ్చు. సమస్యని పెద్దది చేసి అప్పటికప్పుడె సారీ చెప్పటం అవసరమా? అత్త మామలకు అల్లుడు ఒక కొడుకు లాంటి వాడె కదా..కొడుకు తప్పు చేస్తే కష్మించమా? సారి చెప్పెఏ తీరాలా? కొడుకు మీద మితిమీరిన ప్రేమ వల్ల సందీప్ అతా చేసాదని తల్లి కి గీత సర్ది చెప్పి వుంటె అసలు సమస్యే లెదు. అందుకె ఇల్లాలి ఇంగిత జ్ఞానం సమస్యలకు దూరం ..నాకొకటి అనాలని పిస్తోంది..చదువుకున్నోల్లకంటె చాకలోడు మేలు అని..మొగుడు రెండు పీకిన సాయం కాలానికి మూరెడు మల్లెపువ్వులు ఇస్తె మూతి తిప్పుకుంటూనె భర్త ని చెరదీస్తుందా ఇల్లాలు...తనకి బ్రతకటం చేతకక..ఆత్మాభిమానం లేక కాదు..ఆలుమగల అన్యొన్యం..అనురాగాల విలువ తెలుసు కాబట్టి.
ReplyDeleteతల్లిలంటి అత్తగారు అంట్టున్నారు, ఆమే నారి నారి నడుమమురారీ సినేమాలో శారద లాంటి అత్తగారైతే అల్లుడు ఎమిచేయాలి? పైగా ఆమే భర్త కూడా ఆమేకు మద్దతు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఈ తరం/ కాలం వారు తల్లిదండృల కలలను నిజం చేయటానికి పగలు రాత్రి చదివి, చిన్నవయసులోనే విదేశాలకు వేళ్లి, కొత్త అక్కడ ఇంకొక కొత్త అవతారం అంటే ఆదేశసంస్కృతి తగిన విధంగా వారి అలవాట్లను మార్చుకొని, జీవనయానం సాగిస్తున్నారు. ఇంట్లో ఉండే పెద్దవారు కనీసం ఒకటి రెండు పద్దతులు మార్చుకోవటానికి సన్నదంగా లేరు. పైగా మాకు చెప్పేటంతటి వాడా? అని అహంకారం, మూర్ఖత్వం. ఇటువంటి వారు కూతురి జీవితంతో ఆడుకోవటమే కాక, మనవడిని భారతదేశానికి తీసుకొని పోయి, తల్లిదండృలు దగ్గరలేని బిడ్డా అని మురిపెంగా పెంచుతూ, వాడిని ఇంకొక మూర్ఖుడిగా తయారు చెయవచ్చు కూడాను.
Deleteచదువుకొంటే తెలివిగా వాగే నేర్పు పెరుగుతుంది. విచక్షణ, ఇంగితజ్ణం పెరుగుతుందన్న భరోసాలేదు. అవి అనుభవంతో మాత్రం వస్తాయి.
4545
ఇద్దరు అజ్ఞాతలకు ధన్యవాదాలండి. ఓపిక గా చదివి, మీ అభిప్రాయాల్ని పంచుకున్నందుకు.
Deleteఆవేశం లో తీసుకునే నిర్ణయాలు చేదు ఫలితాలిస్తాయి, అలా జరిగిపోయింది, భార్యాభర్తల మధ్య మూడవవారి జోక్యం అనర్థదాయకం, చిత్రంగా మొన్నటి, నేటి నా టపాలు అదే విషయం మీద ఉన్నాయి.
ReplyDeleteఇప్పుడే చదివానండి మీ టపాలు శర్మ గారు.ధన్యవాదాలు శర్మ గారు
Delete
ReplyDeleteఅనుభవానికీ , బాధ్యతకు ఉన్న తేడాను చాలా చక్కగా తెలియచేశారు .
నేటి యువతరమే కాదు , అన్ని తరాల వారు అంతరాలు తెలుసుకొంటూ
మనుగడ సాగించాల్సిందే .
శర్మ గారు, ధన్యవాదాలండి మీ స్పందనకు.
Deleteపూర్వ ఫల్గుణి(poorva phalguni) has left a new comment on your post "ఆ హక్కు మీకు లేదు!-ముగింపు":
ReplyDelete"చాల బాగా కళ్ళకు కట్టినట్లు రాసారు.ఎంత చక్కగా నడిపించారో కధనాన్ని. మాకు ఇక్కడ బాగా పవర్ పోతోంది. ఇప్పటి తరం వాళ్ళు highly independent అన్న మాట.. వాళ్ళకి కావలిసినది.తలచుకున్నది జరగడమే. చాల చాల APT gaa vundi present generation ki . Once again hearty congrats! "
sorry andi...delete ayyindi original comment.
పూర్వ ఫల్గుణి గారు,మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం! మీ ప్రోత్సాహానికి,అబిమానానికి ధన్యవాదాలండి!
DeleteFirst of all, your narrations skills are very good (perhaps, that's why I am reacting!)
ReplyDeleteWhat you said (story or fact, doesn't matter) is mostly
about the past (quarrels)
reasons for the past (presence of elders, egos between couples)
recent past (leaving kid(s) in India)
personal advises (not to have kids till 'understanding' is achieved).
What (perhaps) I am looking forward is towards (future? since time is past changing (good / bad, wrong / right . . . thanks to internet!)):
How to 'make our minds' to handle 'so called' orphan kids / single moms?
System for ignoring (start with) and neglecting (completely) the 'divinity' we give to (once) married ladies.
Lay (constructive, equally sacred) paths for marriages of ladies (who are already had children in prior relationships).
Since writers like you are more educated, elaborate and extremely humanistic, you will come in long way to give your expertise in those 'future' lines.
Prevention (is better than cure) may not be always (currently) possible and 'living with' it may be at the end of tunnel, for us / coming generations, soon. Thanks and looking for your further 'heart felt' efforts in 'other approaches'.
First of all thank you for reading the post and also for leaving a comment. Your comment triggered few thoughts!
DeleteI would love to respond to every line you wrote,however I am restraining myself as the comment is posted as "Anonymous". I don't take anaonymous comments very seriously. I publish them if they have some substance in them, and as long as they are not personal targets/rude/harsh. So for now, I would say, I liked your comment which made me think for sometime -however since anonymous comments cannot be trusted as "constructive criticism" but more in the lines of "sarcasm", I am bit scared to open up and respond with my heart to your comment. Hope you understand! Thank you again.
Thanks for the repsonse.
DeleteI appreciate and respect your 'online / security' related expressions.
Name: ravi
E-mail:wecomeabcd@yahoo.com
(I continue to write in English so that, at least from language flow, you may figure out I am the one who sent two responses earlier).
I don't intend to be Anonymous. But I don't have any of the pull down menu options. Hence, I (had to) chose Anonymous.
Also, I have to say:
1 Even after giving name and Email, I may still be 'harmful' / equally 'unclear'. Hence, you may kindly give your 'constructive' responses or continue refrain. Your choice.
2 I don't know if there is any 'valid' way of verifying identity, online.
3 Most importantly, readers (and writers) can still interact without bothering about identity. I mean the focus can be on the 'concepts' (Eg: conflict management, marriage-relationships, accomoodating "new realties" coming up in familes viz., step / off brother / sister relations, shifting sacred / divinty feelings from virginity (single marriage) to long lasting understanding, humanity, etc.,).
నేను జనరల్ గా కామెంట్స్ పెట్టను (చదవడమే తప్ప - స్వార్ద్తం అని, తప్పు అని తెలిసీ) ఎప్పుడో కాని. మీ రచనా విధానం నచ్చి / మరింత నచ్చేలా ఉంటె నా ఆలోచనలకూ ఇంకొంచెం మేత (నా స్వార్థం కొద్దీ) దొరికి నా బుర్ర (మనసు) పదును ఎక్కుతుందని వ్రాసాను. ఇబ్బంది పెట్టినా / తోటి చదువరులకు అభ్యంతరంగా ఉన్నా (భాష మరియు నిడివి) క్షమించవలసింది. మీరు చిన్నవారైతే - ఆశెస్సులు. పెద్ద వారైతే నమస్తే.
Ravi గారు,మీ అలోచనా తీరు,మీరు కామెంట్ రాసిన విధానం నాకు నచ్చింది.
Deleteఅజ్ఞాతగా మీరు స్పందించినందుకు,కొద్దిగా సంశయం తో ఆగిపోయాను,మీ వాఖ్యకి జవాబు ఇవ్వాలనుకుని కూడా!
మీ పై కామెంట్ లో మూడవ పాయింట్ లో మీరన్నట్టుగా -
focus can be on the 'concepts' and whether readers (and writers)
can still interact without bothering about identity? Yes! Totally agree! Thanks for
reminding that.
మీ మొదటి వాఖ్యకి నా స్పందన:
చాలా ఉన్నతం గా అలోచించి మంచి ప్రశ్నలు వేసారు.
చాలా మంది నాకు తెలిసి single moms కొత్తగా జీవితం మళ్ళీ తీర్చిదిద్దుకున్న వారు ఉన్నారు.సమాజ దృష్టి వీరి పట్ల మారింది/మారుతుంది అని కూడా నేను నమ్ముతున్నాను. ఉదాహరణకు నాకు తెలిసి ఈ రోజు పెళ్ళి కాని అబ్బాయిలు చాలా మంది-పెళ్ళికి ముందు ఆ అమ్మాయి ఏమిటి అన్నది మాకనవసరం అని అన్నవారిని నేనెరుగుదును.మార్పు వస్తుంది మనుషుల అలోచనలలో,సమాజంలో!వేచి చూడాలి అంతే!మీ వాఖ్య ఈ మధ్య కాలం లో జరిగిన ఒక సంఘటనను నాకు గుర్తుకు తెచ్చింది. ఒక పోస్ట్ రాస్తాను త్వరలో!
"ఈరోజు పెళ్ళి కాని అబ్బాయిలు చాలా మంది-పెళ్ళికి ముందు ఆ అమ్మాయి ఏమిటి అన్నది మాకనవసరం "
ReplyDeleteఈ రోజే కాదు,ఏ రోజు కూడా సిరిసంపదలు,అధికారం ఉన్న పురుషులకి స్రీల శీలం/పాతివ్రత్యం అనేది ఒక ముఖ్యమైన అంశం కాదు. రావణాసురుడు పెళ్లైన సీతను తనన్ని పెళ్లి చేసుకొంటే పట్టపురాణి చేస్తానని ప్రమాణం చేశాడు కదా! పురుషులకి వాళ్లకి నచ్చే అంశం ఏ స్రీలో అయినా ఉంటే వారిని తమ స్వంతం చేసుకోవాలను కోవటం సహజ స్వభావం. అమ్మాయిలు వాళ్ల భర్త వీరిపైన గౌరవం తో, ప్రేమ కోసం పెళ్ళి చేసుకొన్నారనుకొంటే అంతకన్నా అమాయకత్వం ఉండదు. పురుషులు తమకున్న కలను సాకారం చేసుకొవటానికి చేసే ప్రయత్నాలలో అది ఒక భాగం.
:)
Deleteఈ కోణం లో నేనెప్పుడు అలోచించలేదు అనాలా, లేక అసలు నాకు ఈ విషయం తెలీదు అనాలో మరి! మీ కామెంట్ వలన,అబ్బాయిల సహజ స్వభావం తెలుసుకున్నాను. ధన్యవాదాలు అజ్ఞాతగారు.
రావణాసురుడు కాముకుడు. సీతతో అన్నట్లే మరెంత మందితో ఆ ముక్క అన్నాడో మరి. అజ్ఞాతగారు పురుషుల సహజస్వభావాన్ని సరిగానే అంచనా వేసారు. కాని మరొక విషయం ఉంది. పరస్త్రీలను వశం చేసుకోవటాని పురుషులు తమ గొప్పకు చిహ్నంగా భావించటం కొత్త విషయం కానట్లే, వివాహం చేసుకుందుకు మాత్రం పురుషులు స్రీల శీలం/పాతివ్రత్యం అనేది ఒక ముఖ్యమైన అంశంగానే భావిస్తారనేదీ కొత్త మాట కాదు.
Deleteశ్యామలీయం మాష్టారు,
Delete"వివాహం చేసుకుందుకు మాత్రం పురుషులు స్రీల శీలం/పాతివ్రత్యం అనేది ఒక ముఖ్యమైన అంశంగానే భావిస్తారనేదీ కొత్త మాట కాదు"
అది మీ వ్యక్తిగత అభిప్రాయం. పురుషులు కాదు స్రీల శీలం/పాతివ్రత్యం ఒక ముఖమైన అంశంగా పరిగణించేది. "కుటుంబం" ఎప్పుడైతే కుటుంబం మగవారు పెళ్ళి చేసుకోనె విధానం లో వేలు పెడుతుందో, కాబోయే కోడలి మీద అంచనాలు పెరిగిపోతాయి. ఇప్పుడు కుటుంబ వ్యవస్త క్షీణ స్థితిలో ఉంది కనుక అబ్బాయిలు స్రీల శీలం/పాతివ్రత్యం అనేది ఒక ముఖ్యమైన అంశంగా పరిగణలోలి తీసుకోవటంలేదు.
ఐతే ఈ సింగిల్ మదర్ తల్లులు రెండో భర్త తో కాపురం చేయవచ్చేమోగాని. వారిని మారిన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో కొందరు గౌరవించవచ్చేమోగాని, వాళ్ల అసలు సమస్య పిల్లలు పెద్దైన తరువాత మొదలౌతుంది. క్లుప్తంగా చెప్పాలంటే సింగిల్ మదర్లను ప్రపంచ మంతా చూసి చూడనట్లువదిలివేసినా, పిల్లలు అమ్మగారి గుణగణాల మీద,ప్రవర్తన మీద చిన్నపటినుంచి ఒక కన్నేసి,విడాకులు/రెండోపెళ్ళి చేసుకోవటానికి, ఆమే చెప్పిన కారణాలు వాళ్ల అంచనాలతో సరిపోకపోతే, పెరిగి పెద్దయ్యాక ప్రత్యేక 70యం.యం సినేమా చూపిస్తారు.మొగుడినైతే వదిలేస్తరు పిల్లల విషయంలో అలా చేయటం సాధ్యం కాకపోవచ్చు.ఇది ఇండియన్ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను