సందీప్ చెప్పినదంతా విన్న సుభద్ర నిశ్చేష్టురాలయ్యింది.కొద్ది సేపు వరకు ఎలా స్పందించాలో తెలియక,మౌనంగా సందీప్ ని చూస్తు ఉండిపోయింది.సందీప్ అక్కడనుంచి లేచి వెళ్ళిపోయాడు.సుభద్ర వెంకట్ ని అడిగింది,"గీతతో మాట్లాడాలి"అని."నేను కూడా తనతో మాట్లాడలేదు ఇంతవరకు,వెళదాము పద"అని సమాధానమిచ్చాడు వెంకట్.ఇద్దరు కలిసి లివింగ్ రూం లో కి వెళ్ళి సురేష్ తో అన్నారు"మేము గీతను కలవాలి.మీ ఇంటికి వెళదామా"అని.సురేష్ అలాగేనని"పదండి"అన్నాడు.గీత నాన్నగారు కూడా వారితోటి కారులో కూర్చున్నారు.రాహుల్ తో చెప్పింది సుభద్ర" Please take care of Sandeep"అని.
సురేష్ ఇంటిలో గీత పరిస్థితి కూడా ఏమీ బాలేదు.రాత్రంతా నిద్ర లేమితో,బాగా ఏడ్చినట్టుగా ఉంది మొఖం.గీతని చూస్తూనే అంది సుభద్ర "గీతా, ఏంటిదంతా?అసలు నువ్వేం చేసావో ఆవేశంలో తెలుసా?"అంటూ ప్రశ్నించింది.అక్కడే ఉన్న గీత అమ్మగారు,"మీ తమ్ముడు చేసిన నిర్వాకం మీకు తెలీదా?అమ్మాయిని ప్రశ్నించటానికి వచ్చారా?"అంటూ ఎదురు ప్రశ్న వేసారు"తమ్ముడితో మాట్లాడే వచ్చాను.జరిగినదంతా తెలుసుకున్నాను.ఎందుకు జరిగింది,ఎలా జరిగింది,ఎవరిది తప్పు అన్న విషయాలు చర్చించుకోవడం కన్నా,ఇప్పుడు మనం పెద్దవారిగా చెయ్యవలసినదేంటి వీరిద్దరిని కలపటానికి అన్న విషయం గురించి అలోచించాలండి."అని నెమ్మదిగా జవాబు ఇచ్చింది సుభద్ర.గీత నాన్నగారు కూడా వెంటనే"అమ్మాయి మీద చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది.ఇంత దూరం రాకుండా ఉండేది కదా"అని అన్నారు.వెంకట్ దురుసుగా"అంటే,చెయ్యి చేసుకున్నాడని కాప్స్ కి ఫోన్ చెయ్యమని చెప్పారా మీరు గీతకి"అంటూ గట్టిగానే అడిగాడు.మేమెందుకు చెపుతాము,ఆ పరిస్థితుల్లో మళ్ళీ కొడతాడేమో అని భయ్యంతో అమ్మాయి ఫోన్ చేసింది.తప్పేముంది అన్నట్లు పొగరుగా మాట్లాడాడు ఆయన.
సుభద్ర కళ్ళతోనే వెంకట్ ని వారించింది."గీతా,చెప్పమ్మా..నువ్వు చిన్న పిల్లవేమి కాదు.జరిగేది,జరుగుతున్నది నీకు అర్ధం కాకపోవడానికి.సందీప్ దుర్మార్గుడు,అతనితో బ్రతకడమంటే నా ప్రాణానికి హాని అని నువ్వు అనుకున్నట్లైతే చెప్పు.తమ్ముడిగా నా దృష్టిలో అతను మంచివాడే కావొచ్చు,భర్తగా మంచివాడవ్వాలని లేదుగా"అంటూ సూటిగా గీతని చూస్తూ అడిగింది. గీత దగ్గర నుంచి సమాధానం రాలేదు.చాలా సేపు గీతతో మాట్లాడుతూనే ఉంది సుభద్ర.అవేశంలో,తొందరపడి ఇద్దరు చేసినవి తప్పులే!భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వారు ఎలాంటి సమస్య వచ్చినా ఇంకోరకంగా పరిష్కరించుకునేవారేమో కాని,గీత తల్లితండ్రులు అక్కడ ఉండటం వలన ఇద్దరు ఎవరికి వారు తగ్గడానికి అహాలు అడ్డు వచ్చి,ఇంత దూరం తెచ్చుకున్నారు.ఎంత సేపు మాట్లాడినా రాయిలా కూర్చుందే తప్ప,గీత ఒక్క మాట కూడా సుభద్రతో మాట్లాడలేదు.ఇక తను చెయ్యగలిగినది ఏమీ లేదు అనుకుంటూ,అవేశాలు తగ్గాక,వివేకం హెచ్చరిస్తే,అప్పుడు కాని వారి బుర్రలు సరిగ్గా పని చెయ్యవని అనుకుని,వెళతానని చెప్పి బయలుదేరింది సుభద్ర.సందీప్ ఇంటికి వచ్చి,సందీప్ బట్టలు సర్దమని రాహుల్ కి చెప్పి,సందీప్ ని తనతో పాటు ఇంటికి రమ్మని అడిగింది. "లేదక్కా, నేను రాను.I need some time for myself"అని సందీప్ సుభద్రతో చెప్పాడు.రాహుల్ ని తోడు గా ఉండమని చెప్పి అక్కడనుంచి ఇంటిముఖం పట్టింది సుభద్ర.
జరిగినదంతా ఒక కల అయితే ఎంత బాగున్నో! అని లెక్కలేనన్ని సార్లు అనుకుంది సుభద్ర.వెంకట్ మాత్రం గీతదే తప్పని,కాప్స్ కి ఫోన్ చేసే ముందు ఒక్క క్షణం అలోచించి ఉంటే సమస్య ఇంత జటిలంగా మారేది కాదు కదా అని బాధపడ్డాడు.సుభద్ర మాత్రం తప్పు ఎవరిది అన్న విశ్లేషణ అనవసరమని,ఎలాగైనా వారిద్దరు జరిగినదంతా మరచిపోయి,మళ్ళీ కలిసిపోవాలని దేవున్ని మనసులో కోరుకుంది.గీత కొద్ది రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి సురేష్ ఇంట్లోనే తల్లితండ్రులతో కలిసి ఉండిపోయింది.సందీప్ ని చాలా సార్లు ఇంటికి రమ్మని అడిగి విసిగిపోయిన సుభద్ర తనే రోజు విడిచి రోజు అతనిని కలిసి వచ్చేది.గీతతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది.సందీప్ సహజంగానే మితభాషి.ఈ సంఘటనతో అతను మనుషులతో మాట్లాడం పూర్తిగా తగ్గించేసాడు.అతని మనుసులో ఏముందో తెలుసుకోవడం ఆ బ్రహ్మ రుద్రాదులకు అయినా సాధ్యం అయ్యే పనేనా అనుకుంటూ ఉండేది సుభద్ర.
ఎలాగైనా సందీప్ ని,గీతని ఒక చోట చేర్చి వారిని ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా చెయ్యాలని ఎన్నోసార్లు అనుకుంది సుభద్ర.గీత మాట ఎత్తితేనే,పూర్తిగా మౌనం వహించేవాడు సందీప్.సందీప్..బుజ్జిగాడిని చూడాలని అనిపించటం లేదా అని సందీప్ ని నిలదీసి అడిగితే మాత్రం చాలా బాధపడేవాడు.బుజ్జిగాడి కోసం అయినా వీళ్ళిద్దరు కలిసిపోతారేమో అన్న ఆశ కలిగేది సుభద్రకి.సందీప్ తల్లితండ్రులు,పెద్దవాళ్ళు అందరు గీతతో,గీత తల్లితండ్రులతో మాట్లాడారు.సందీప్ వచ్చి తనతో మాట్లాడితే తిరిగి సందీప్ తో కలిసి జీవితం గడపడానికి తనకేమి అభ్యంతరం లేదని గీత చెప్పింది.అది వినగానే అందరు చాలా ఆనందపడి సందీప్ ని ఒక్కసారి దీపని కలవమని ఎంతో నచ్చచెప్పారు.ససేమిరా అన్నాడు సందీప్.ఆ విషయం తెలిసిన దీప తనకేమి సందీప్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదంటూ,బుజ్జిగాడిని తల్లితండ్రులతో ఇండియా పంపించి తను ఉద్యోగం చేసే స్టేట్ లోనే ఇల్లు రెంట్ చేసుకుని తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది.ఒక సంవత్సర కాలంలో సందీప్ రెసిడెన్సి పూర్తిచేసుకుని,వేరే స్టేట్ లో తన మిత్రులతో కలిసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి,కొద్ది కాలంలోనే బిసి అయిపోయాడు.వెకషన్ కి ఇండియా వెళ్ళిన సుభద్ర బుజ్జిగాడిని చూడడానికి వెళ్ళింది.ఎంతో ముద్దుగా ఉన్నాడు బుజ్జిగాడు.వాడు చేసే అల్లరి ఎలా ఉంటుందో చెప్పి మురిసిపోయారు గీత తల్లితండ్రులు.సుభద్రకి మనసులో ఎంతో దిగులుగా అనిపించింది.బుజ్జిగాడికి తల్లితండ్రులిద్దరి ప్రేమను పొందే అదృష్టం లేదే అని.ఇండియా నుంచి తిరిగి వచ్చాక సందీప్ ని కలిసింది సుభద్ర.తన కొడుకు ఎంత చక్కగా ఉన్నాడో,తను లైఫ్ లో ఏమీ మిస్స్ అవుతున్నాడో తెలుసుకోమని మళ్ళీ చెప్పింది సుభద్ర.సందీప్ వైఖరిలో ఏమీ మార్పు లేదు.
అప్పటివరకు ఎవ్వరిని జరిగిన దానికి దూషించని సుభద్ర మాత్రం ఆ రోజు తమ్ముడిని పట్టుకుని కడిగేసింది.పెద్ద పెద్ద చదువులు,ఉన్నతమైన పదవులు,ఆత్మాభిమానాలు అనుకుంటూ అన్ని భూతద్దంలో చూసుకుంటున్నారే కాని,మీకు ఒక కొడుకు ఉన్నాడని కాని,వాడు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమకు దూరమౌతున్నాడని అలోచించారా?పిల్లలు ఉన్నారని జీవితమంతా రాజిపడి బ్రతకడం మా వల్ల కాదు అని మోడర్న్ గా అలోచిస్తూ,పాత కాలం చింతపండులా కాదు అని విర్రవీగుతున్నారే కాని,కలిసి బ్రతకలేనప్పుడు, అంత తొందరపడి పిల్లలను ఎందుకు కనాలి అని మాత్రం అలోచించరే?నాకు తెలిసిన సూత్రం ఒక్కటే సందీప్.నీకు, గీతకి బుజ్జిగాడు ఉండకపోతే,మీ ఇద్దరి జీవితాలు మీ ఇష్టం.చెయ్యి చేసుకుంటే పడి ఉండే భార్య లేదని నువ్వు,అవేశం లో చెయ్యి చేసుకున్నాడని మతి లేకుండా కాప్స్ వరకు వెళ్ళిన నీ భార్య ఇద్దరు ఇద్దరే!పూర్తి స్వార్ధపరులు.ఆ రోజు ఇద్దరు అలసి సొలసి ఇంటికి చేరి ఉండకపోతే,మీ అత్తగారు,మావగారు ఇంట్లో ఉండకపోతే ఆ సంఘటన జరిగేదే కాదు.మూడు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడుతూ కూడా,ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉన్నవారు,ఆ ఒక్క రోజు సంఘటనతో విడిపోయారు.పిల్లలని కనేముందు ఒక్కసారి అలోచించండి మీ యువతరం.ఒకరికొకరు జీవితాంతం తోడు ఉండగలమనే ఆ నమ్మకం కలగనప్పుడు దయచేసి పిల్లలను కనకండి.ఒకసారి పిల్లలను కన్నాక,పంతాలకు పోకండి.ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి.అన్ని విషయలలో ఒకటి పది సార్లు అలోచిస్తారు కదా మీ తరం,దయచేసి పిల్లలను కనడం ఒక experience గా పరిగణించకుండా అది ఒక బాధ్యత అని వారి బంగారు జీవితం మీ చేతిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించండి.అలా అని మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారు అని నేను అనడం లేదు.ఒకవేళ నిజంగానే మొదట్లో బయటకి రాని విశ్వరూపాలు పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాల తరువాత బయటపడితే,అప్పుడు కలిసి ఉండాలి అని నేను అనను.కాని మీ స్వార్ధానికి, మీ అర్ధంలేని అహాలకి పిల్లల జీవితాలను బలి ఇవ్వకండి.కలిసి బ్రతకలేనప్పుడు మీకు పిల్లలను కనే హక్కు లేదు."అని తమ్ముడి తో తెగేసి చెప్పింది సుభద్ర.