Wednesday, April 17, 2013

సరదా సరదాగా...



"వనజ వనమాలి"గారు,నమస్కారం అండి,"కబుర్లు కాకరకాయలు"ఏమన్నా ఉంటే కాస్త చెబుదురూ..మీరు ఎన్నో వైవిధ్యభరితమైన టాపిక్స్ తో అవలీలగా టపాలు రాసేస్తుంటారు.అసలే ఈ మధ్య పిల్లలందరికి పరీక్షలని,నా స్నేహితులందరు తెగ బిసీ అయిపోయారు."పని లేక"తోచటం లేదు,తీరిక సమయం ఎక్కువయ్యింది"అని అన్నాను.సరే చెప్పండి"తెలుగు వెన్నెల"గారు,ఎక్కడ మొదలుపెడదాము?నాలుగు పుస్తకాలు చెపుతాను,అవి చదువుకోండి,హాయిగా...పుస్తకాలు ఎక్కువ చదివితేనే కదా భావ ప్రకటన అద్భుతం చెయ్యగలుగుతారు మీరు కూడా టపాలలో?"కష్టేఫలే"అన్న విషయం తెలుసు కదా మీకు?మరి ఇంక మొదలుపెట్టండి చదవటం మన గొప్ప తెలుగు సాహిత్యాన్ని" అని ఒక సలహా పాడేసారు ఆవిడ.

ఏదో"ఔను,నేను బ్లాగ్ మొదలుపెట్టాను"అనుకున్నానే కాని,అందులో "సాహితి"విలువలు ఉన్నాయా లేదా అన్న విషయం మీద అలోచనే లేదు కదా?నా రాతలన్ని"నాతో నేను నా గురించి"అనుకున్నాను."నా తెలుగు" భాషని మరవకుండా ఏదో నాలుగు ముక్కలు రాస్తే చాలు కదా అన్న "తెలుగు భావాలు"కలిగి ఉన్నానే ఇన్ని రోజులు.నాలో ఆ క్షణం ఉవ్వెత్తున లెగిసాయి"అలోచనాతరంగాలు".చిన్నప్పుడెప్పుడో"తాత,వారి డైరీ" రాతలను ఎగతాళి చేసాను కాని,ఇప్పుడు నేను బ్లాగ్ అని పేరు పెట్టి  చేస్తున్నదేమిటో!పుస్తకాల షెల్ఫ్ నుండి"కవితా సుమహారం" అందుకున్నా."శ్రీ కవితలు"అన్న పేరుతో ఒక పుస్తకం ఎప్పటికన్నా నేను కూడా రాయాలి అన్న అవేశం తో!కవితలు చదువుతూ"నా చిన్ని ప్రపంచం" అదేనండి నా బ్లాగ్ , అందులో నేను రాసుకున్న రాతల వంక, వాటికి వచ్చిన "స్పందన" చూసుకుంటూ మురిసిపోయా."ఆనందం" (aanamdam) తో. 

ఇంతలో నా  సహచరుడు గంటలు గంటలు ఆ అంతర్జాలంలో ఎందుకు సమయం వ్యర్ధ పరుస్తావు అని విస్సుకోగా,ఇంతేలే ఈ"జీవితం"అని నిట్టూర్పు విడిచి లాప్టాప్ మూసేసాను.IPOD లో "నవ రస(జ్ఞ) భరితం"  అయిన "తెలుగు పాటలు"వింటూ పనిలో నిమగ్నమయ్యిపోయాను.అరగంటలో "వేడి వేడి సమోసాలు" తయ్యారు చేసాను.ఇంక లాగించేద్దామా అనుకుంటుండగా పక్కింటి"రవిగారు"ఎదురింటి "NIHAR" పలకరించడానికి వచ్చారు.నా సమోసాలలో భాగం వీరికి కూడా పంచాలి కాబోలు అని కించిత్తు బాధపడుతూ ఎక్కడో"చిన్ని ఆశ"తొందరగా వెళ్ళిపోతారేమో అని.తొందరగా వారిని సాగనంపడానికి నా"అలోచనాస్త్రాలను"సంధించాను.ఇంతలో"శ్రీ లలిత"సహస్రనామస్తోత్రం చదువుకుందామని స్నేహితురాలి ఫోన్ రావడం తో,వచ్చిన అథిదులను పంపించేసాను.స్నేహితురాలి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను.స్వాగతం రా"ఇది శశి ప్రపంచం"అంటూ ఆహ్వానించింది.ఆవిడ పూజ గదిలో"యశోదకృష్ణ"చిత్రపటం గోడకి తగిలించి ఉండడం చూసాను.అలంకరించి ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం వైపు చూస్తే అప్రయత్నంగా నేను"మాలతీమాధవం"అనుకోకుండా ఉండలేకపోయాను."శ్యామలీయం" అయిన శ్రీకృష్ణుడి విగ్రహం నాకు ఆ క్షణంలో"లీలా మోహనం"గా అనిపించింది.భగవన్నామ"స్మరణ"లో కొద్దిసేపు గడిపాను.పూజకి "పద్మార్పిత"నువ్వే,చెప్పినట్టు చెయ్యి అంది పక్కింటావిడ.పూజ ముగించుకుని ఆరుబయట బాల్కని లోకి వచ్చి నించున్నాను.అంతవరకు ఉన్న వాతావరణం మారిపోయి వర్షం కురిసింది.ఆకాశంలో "ఇంద్రదనుస్సు"ప్రత్యక్షం."నాలో మాట"ఒకటి ఆ క్షణం అందమైన పాట గా మారి,"సరిగమలు"పలికింది.ఇవన్ని"చిన్నిగుండె చప్పుళ్లు"కదూ అనుకుంటూ ఆ "Nature Tints"ని చూస్తూ పరవసించిపోయాను.ఇంతలో ఇంటినుండి పిలుపు వస్తే"ఎందుకో, ఏమో"అనుకుంటూ హడావిడిగా పక్కింటావిడకు వెళ్ళొస్తానని చెప్పాను.

ఇంట్లో టాటా "ఫోటాన్‌" ప్లస్‌ TV లో TV9  చానల్  చూస్తూ ఇంటి సభ్యులు త్రీవ్రమైన చర్చలో మునిగి ఉన్నారు.TV ఎదురుగా కూర్చున్న అమ్మని నన్ను మార్చి మార్చి చూస్తూ, ఇంట్లో వాళ్ళు "తెలుగు బ్లాగు-సీరీయల్ ముచ్చట్లు" అని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.అదేనండి నేనేమో బ్లాగులు చూస్తానని,అమ్మేమో సీరియల్స్ చూస్తుంటుంది అని మమ్మల్ని అలా ఎత్తిపొడుస్తారు వాళ్ళు.అసలు ఆ TV9 చానల్ ఎందుకు పెట్టారు? వేసిన న్యుస్ మళ్ళీ మళ్ళీ వేసి విసిగించేస్తారు అంటూ అందరినీ ప్రశ్నించాను.అయినా ఆ"రవిశేఖర్ హృ(మ)దిలో"ఏముందో కాని ...అని మండిపడ్డాను.రవిశేఖర్ కాదోయి రవిప్రకాష్ అంటూ వచ్చింది సమాధానం.ఏదో ఒకటి అని విస్సుకుంటూ ఈ TV9 చానల్ ప్రజలు చూడకుండా"మనం ఏమీ చెయ్యలేమా"అనుకుంటూ ఎప్పుడో,ఎవరో పెట్టాలి ఈ చానల్ వాళ్ళకి"చాకిరేవు"అనుకున్నాను."నా అలోచనల పరంపర"లో అలా నేను కొట్టుకు పోతుండగా ఫోన్ మోగింది."మానస"దగ్గరనుండి ఫోన్. నేను అభిమానంగా"మనస్వి"అని పిలుస్తా తనని."మన కాకినాడలో" విశేషాలు ఏంటి అని తనతో కబుర్లలో పడిపోయాను.

TV లో"అంతర్ముఖం"ప్రోగ్రాం చూస్తున్నారు అందరు. ఎలా చూస్తున్నారో ఈ ప్రోగ్రాంస్ అందరు ఆంధ్ర రాష్ట్రం లో అని అబ్బురపడుతు ఒక్క ప్రొగ్రాం అయినా,"సుజన-సృజన"గా లేదే అనుకుని,నా లాప్టాప్ మళ్ళీ తెరిచాను.పత్రికా ఆఫీస్ లో పనిచేస్తున్న సోదరుడు,లాప్టాప్ మూసేసి వస్తే కబుర్లు చెపుతాను అని నాతో అంటే, సర్లే నీ"Jurno Dreams"లో నువ్వుండు,నా లోకం లో నేనుంటాను అంటూ నవ్వాను.ఇంతలో చదువుతు ఆపేసిన కవితలు గుర్తుకోచ్చి,కవితలు చదవసాగాను."వరూధిని"ప్రవరాఖ్యుల మీద కవితలు చదువుతున్నంత సేపు నేను"అమృతమథనం"చేస్తున్న భావన.నా లోకం లో నేను మునిగి ఉన్న వేళ ఇంట్లో వారందరు నవ్వుకుంటుంటే నేను వారి వంక నిర్లక్ష్యం గా ఒక చూపు విసిరి"నవ్వితే నవ్వండి"అనుకున్నాను.నెమ్మదిగా ఇల్లంతా సద్దుమునిగి పోయింది.నేను మాత్రం అలా చదువుకుంటూ ఉండిపోయాను.ఇంతలో అంతా"రవీయం" అన్నట్లు చీకట్లు తొలగిస్తూ"భాస్కర్"డు వచ్చాడు.

(ఈ టపా సరదాగా నేను చదివే బ్లాగ్స్ , మరియు నా బ్లాగ్ చదివి ఎల్లప్పుడు నన్ను కామెంట్స్ రూపేనా ప్రోత్షహించిన ఎందరో బ్లాగర్స్ బ్లాగ్ పేర్లతో అల్లిన కల్పిత కథ. )

92 comments:

  1. miiiind blowing, awesome

    సూపరాతి సూపరు :)

    ReplyDelete
    Replies
    1. నాగార్జునగారు,మీరు సూపర్ అంటే సూపరే మరి! ధన్యవాదాలు మీకు.

      Delete
  2. బ్లాగులలో సంచరిస్తూ ఇప్పడే మెరిసిన మీ పోస్ట్ చూసి అయ్యబాబోయ్ ! అనుకున్నాను నా పేరు కనబడి .

    మీ అభిమానం, మీ ఓపిక, మీ శ్రమ మీ అసాధ్యం కూలిపోనూ !! ఏమి ఒపికండీ ,ఏమి ఆలోచనండీ !? ఎంత గొప్పగా ఉందొ! నిజంగా మీరు అన్ని బ్లాగ్ లు చదివి కామెంట్స్ పెడుతూ ఉండటం ఎంత వండర్ అనిపిస్తుందో తెలుసా!? రియల్లీ గ్రేట్ !

    మీలా అందరికి ఆ సహృదయం రాదండీ ! చక్కగా ప్రోత్సాహం గా కామెంట్ పెడతారు . మనః పూర్వక అభినందనలు

    జలతారు వెన్నెల కురిసినట్లు మీ చల్లని హృదయం అందరికి చల్లని చూపులే ప్రసరింపజేస్తుంది . చాలా సంతోషం "శ్రీ " గారు . అభినందనలు మీ హృదయ సంస్కారానికి _/\_ _/\_ _/\_ లు

    ReplyDelete
    Replies
    1. వనజగారు,మీ వాఖ్య చదివాక నాకు ఎలా స్పందించాలో తెలియటం లేదండి. ఎల్లప్పుడు మనస్పూర్తిగా నన్ను ప్రోత్సహించే స్నేహశీలి మీరు. ధన్యవాదాలండి.

      Delete
  3. nice.... బ్లాగ్ ల వారిని బలెగా సరదాగా కలిపేశారె.. -:)

    ReplyDelete
  4. చిత్రం భళారే విచిత్రం అయ్యారే విచిత్రం.

    ReplyDelete
    Replies
    1. శర్మ గారు,ఏదో ఊసిపోక రాసిన టపా అండి.మీ కామెంట్ బాగుంది.ధన్యవాదాలు మీకు.

      Delete
  5. వెన్నెల గారు !

    "శ్రీ కవితలు" అబ్బ ఇంచక్కా నాబ్లాగ్ లోని కవితలన్నీ తీసేసుకుని బుక్ ప్రింట్ చేయించి ...ముందుమాట నాగురించి మీకు నచ్చినట్లు వ్రాసేసి ...ఓ రెండు flight టిక్కెట్లు పంపించేస్తే ఎంచక్కా usa లో కూడా నా కవితలు పాపులర్ అయిపోతాయి ...ఎప్పుడు చేస్తున్నారు ప్రింట్ చెప్పండి ...నేను visa అన్నీ సిద్ధం చేసుకుంటాను....:-)...చాలాబాగుంది మీ కథ....:-)@ శ్రీ

    ReplyDelete
    Replies
    1. ఆ మాట మీదుండండి శ్రీ గారు మీరు.Tickets పంపిస్తున్నాను మరి.మాటిచ్చేసారు కదా. :) ధన్యవాదాలు మీకు.

      Delete
  6. హే నా బ్లాగ్ పేరు రెండు సార్లు వచ్చింది ! Thanks for the special treatment :-) Just kidding, Nice try, keep rocking !

    ReplyDelete
    Replies
    1. శ్రావ్యా గారు, నేను పొరపాటున ఈ టపా డ్రాఫ్ట్ ప్రూఫ్రీడ్ చెయ్యకుండా పబ్లిష్ చేసాసాను. వెంటనే కొన్ని అచ్చుతప్పులు,మీ బ్లాగ్ పేరు రిపీట్ అవ్వడం చూసి సరిచేసాను. కాని మీరు అప్పటికే చదివేసారు.మీ స్నేహ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  7. ఇలా రాయగలగడం మీ వల్లే అవుతుంది.

    కొత్త వారికి ప్రోత్సాహాన్ని అందించే మీ ఉత్సాహం నిజంగా అభినందనీయం ..... మీరు ఇలానే ఎల్లప్పుడూ స్పూర్తిని నింపుతూ సరదా సరదా గా మరిన్ని టపాలు ప్రచురించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ .... శుభాకాంక్షలు తెలుపుతున్నానోచ్ ......

    ReplyDelete
    Replies
    1. సాగర్ గారు, మనసుతో స్పందించారు. మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు.

      Delete
  8. మొత్తం చదువుతుంటే వెన్నెలంత చల్లగా ఉంది, మేనిపై జలతారు వెన్నెల కురిసినట్లుంది. మంచి ప్రయోగం డియర్ . మీ శైలి బాగుంటుంది

    ReplyDelete
    Replies
    1. కవిసంగమం "కవయిత్రిగారు" మేరాజ్ గారు, ముందుగా మీకు అభినందనలు.
      మీ ప్రశంసకు ధన్యవాదాలు.

      Delete
  9. నమస్కారం . తెలుగువెలుగు పుణయమాని ఈమధయనే కూడలి లోకి .పరవేసించాను. మీ మితురలందరినీ తలచుకుంటూ చాలా చాలా బాగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. స్వాగతం అండి. బ్లాగ్స్ అన్ని చుట్టేయండి మరి.ఎన్నో మంచి బ్లాగ్స్ ఉన్నాయి.టపాలు చదివి మీ అభిప్రాయాలు పంచుకోండి.ధన్యవాదాలు మీకు.

      Delete
  10. Replies
    1. లక్ష్మీదేవి గారు....:) ధన్యవాదాలండి

      Delete
  11. :) chaalaa baagaa rasaru saradaa gaa ainaa chakkagaa vundi Thank u vennela gaaru nannu cherchukunnaduku

    ReplyDelete
    Replies
    1. మంజు గారు, మీకు నచ్చితే నాకు తృప్తి.భలేవారే,మీ బ్లాగ్ పేరు లేకుండా కథ రాయగలనా? ధన్యవాదాలు.

      Delete
  12. బాగుంది మీ కథ.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మార్పిత గారు.

      Delete

  13. ఆహా! నా గత స్మృతులను ఒక ఉయ్యాల ఊపేసారుకదా జలతారు వెన్నెల గారు. చాలా బాగుంది. నన్ను కూడా ఇరికించినందుకు చాలా థాంక్స్.

    మరి నేను రాసుకున్నది కూడా చూడండి.:)
    http://manasvi-jaya.blogspot.in/2009/12/blog-post_10.html

    ReplyDelete
    Replies
    1. జయగారు, మీరు కూడా ఇలాంటి టపా ఒకటి రాసారు అన్న విషయం నాకు తెలీదండి.
      లింక్ ఇచ్చిన వెంటనే చదివేసాను.మీరు రాసిన దానికి నేను రాసిన దానికి తేడాలు ఉన్నాయండి. మీరు చక్కగా ఆ బ్లాగ్స్ ప్రత్యేకతల గురించి, మీకేమి నచ్చుతాయో,బ్లాగర్స్ పేర్లు అన్నీ రాసారు. నేనేమో చదివే బ్లాగ్స్ పేర్లు, నా బ్లాగ్స్ చదివే వారి బ్లాగ్ పేర్లు మాత్రమే నేను వాడి ఒక కల్పిత కథ రాసాను. నా టపాలో , బ్లాగ్స్ గురించి ఏ వివరాలు కాని, ఆ బ్లాగ్స్ లో ఫలానా విషయాలు నాకు నచ్చుతాయని కాని రాయలేదు.
      లింక్స్ మాత్రమే ఇచ్చాను ఆ బ్లాగ్స్ కి :) ధన్యవాదాలండి జయగారు.

      Delete
  14. బ్లాగ్ పూదోటనుంచి అన్నిరకాల పువ్వుల్నీ తెచ్చి దండ కట్టినట్టు ఉంది. చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు సంతోషం కిషోర్ వర్మ గారు.

      Delete
  15. ఇంత మందిని ఒకే చోట చేర్చుతూ మా కిష్టమైన జలతారువెన్నల, వెలుగులు పంచకపోవడాన్ని తీవ్రంగా గర్హిస్తూ,..వెంటనే ఈ పోస్ట్ ను సవరిస్తూ మరింత వెన్నల పంచవలసినదిగా అభ్యర్ధిస్తున్నాము,.
    హ,హ,..భలే రాసారు,..నాకెందుకో,, భాస్కర్ డుడు బసవన్నలాగా మేఘలా మధ్య తలూపుతున్నాడులా అనిపించింది చివరి వాక్యం చదువుతుంటే,.ధన్యవాదాలు,.నా బ్లాగ్ ని కూడా చేర్చినందుకు,..

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు....:)
      మీ బ్లాగ్ పేరుతో మహా ఇబ్బంది అయిపోయిందండి. చాలాసేపు ఎక్కడ వాడాలో ఎలా వాడాలో అర్ధమే కాలేదు. ఆఖరికి సూర్యుడి కి ఇంకో పదంలా అలా వాడాను. మీ ఆత్మీయ స్పందనకు
      ధన్యవాదాలు.

      Delete
  16. ఎంత బాగా వ్రాసారు.భలే నచ్చింది.లింక్ ఉంచుకుంటాను.అందరి బ్లాగ్స్ చూడొచ్చు :))

    ReplyDelete
    Replies
    1. శశి గారు, మీరు సమయం తీసుకుని టపా చదివి మెచ్చుకున్నందుకు ధన్యవాదాలండి.
      టపాలన్నింటికి లింక్స్ ఉన్నాయి. సేవ్ చేసుకోండి.

      Delete
  17. బాగుంది బాగుంది జ.వె గారు :))
    గుడ్ ఐడియా,
    కొన్ని బ్లాగ్స్ ఎప్పుడూ చూడనివి వున్నాయి, వాటి లింక్స్ కుడా ఇచ్చింటే బాగుండేది :)

    ReplyDelete
    Replies
    1. లింక్స్ అన్నీ ఇచ్చాను ఫోటొన్ గారు.మీరు బ్లాగ్స్ పేర్ల మీద క్లిక్ చెయ్యండి.
      ధన్యవాదాలు.

      Delete
  18. అందరూ బాగా చెప్పారు.నేను ఏది చెప్పినా అది తక్కువే!
    అందుకే ఒక్క మాటలో 'అద్భుతః' అంటాను జలతారు పరదాలో వున్నా ఓ వెన్నెలమ్మా!

    ReplyDelete
    Replies
    1. నేను బ్లాగ్స్ రాయడం మొదలుపెట్టినప్పటి నుండి మీరు నన్ను ఎంతో ప్రోత్షహించారు పూర్వ ఫల్గుణి గారు.నా టపాకి కామెంట్స్ రాయడం మొదలు, మీకు నచ్చిన బ్లాగ్ నాది అని కూడా ఒకసారి చెప్పారు ఒక బ్లాగ్ లో... మీకు టపా నచ్చిందంటే నాకు చాలా సంతోషం.మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలండి.

      Delete
  19. మీరు వ్రాసిన అందరి కధ బాగుంది...దహా.

    ReplyDelete
    Replies
    1. చలా సంతోషమండి. దహా (దరహాసం) తో దీవించినట్లు భావిస్తాను.ధన్యవాదాలండి.

      Delete
  20. మొత్తాని కి అందరినీ పలకరించి వచ్చారన్నమాట . నాకూ హాయ్ చెప్పినందుకు థాంక్స్ అండి .

    ReplyDelete
    Replies
    1. అదేంటి మాలాగారు, మీకు హాయ్ చెప్పకుండా ఉండగలనా?
      ధన్యవాదాలు.

      Delete
  21. నిజమే,హర్ష గారు చెప్పినట్లు ఇందులో జలతారు వెన్నెల ఉండకపోతే వెలితిగానే ఉంది.

    ReplyDelete
    Replies
    1. అయ్యో లక్ష్మి దేవి గారు, మీరు పాయింట్ మిస్స్ అయిపోయారండి.
      నాలోనే, అందరిని కలిపేసుకున్నాను కదా? :))
      ధన్యవాదాలండి.

      Delete
  22. వావ్ నైస్ ట్రై అండీ భలే కలిపారు బ్లాగర్స్ అందరినీనూ :)

    ReplyDelete
  23. ఇది కధ కాదు , బ్లాగు మిత్రుల వేదిక . మీ రచనా పటిమ బహు దొడ్డది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శర్మ గారు. లింక్స్ ఉన్నాయి అన్ని బ్లాగ్స్ కి. బ్లాగ్ పెరు మీద క్లిక్ చెయ్యండి.

      Delete
  24. Wow! Wonderful!! ఇన్ని బ్లాగులనీ కలిపి అద్భుతంగా రాసారు. అన్నిటినీ వీలు చేసుకుని ఇవాళే చదువుతాను. చాలా సహాయం చేసారు మంచివి మిస్ అవ్వకుండా. మంచి ఆలోచనతో రాసారు. అభినందనలు. మమ్మల్ని ఇలాగే హాయిగా అలరిస్తూ వుండండి.

    ReplyDelete
    Replies
    1. అను గారు, స్వాగతం. మీరు ఈ మధ్యనే మొదలు పెట్టినట్టు ఉన్నారు కదా మీ బ్లాగ్?
      టపాలో అన్ని బ్లాగ్స్ కి ఇప్పుడు లింక్స్ ఉన్నాయి. బ్లాగ్ పేర్లను క్లిక్ చెయ్యండి. ధన్యవాదాలండి

      Delete
  25. ఇలా అప్పుడెప్పుడో పద్మార్పితగారు బ్లాగర్స్ పై భావాలు అంటూ రాసారు. మంచి ప్రయత్నం.

    ReplyDelete
    Replies
    1. ఈ రోజే చదివాను పద్మార్పిత గారి టపా మీరు చెప్పాక. పద్మ గారు బ్లాగ్స్ మీద తన అభిప్రాయాలు, తనకు ఆ యా బ్లాగ్స్ చదువుతున్నపుడు వచ్చే అలోచనలకు రూపం ఇచ్చారు. నేను ఒక కల్పిత కథకి బ్లాగ్స్ పెర్లు వాడుకున్నానంతే! మంచి ప్రయత్నం అన్న కితాబుకి ధన్యవాదాలు మీకు.

      Delete
  26. తెలుగు బ్లాగుల పూదోట తీర్చి నట్లు ,
    పైన జలతారు వెన్నెల పరచి నట్లు ,
    పిల్ల తెమ్మెర పలుకులు చల్లి నట్లు
    మనసు దోచెను - మమ్ము" శ్రీ "మాయ జేసి

    ReplyDelete
    Replies
    1. మాష్టారు...చాలా రోజులు తరువాత మళ్ళీ కనిపించారు.
      మీ పద్యాలు చదివి కూడా ఎన్ని రోజులయ్యిందో! మీ చల్లటి మనసుతో ఆత్మీయం గా పలకరించారు.ధన్యవాదాలండి

      Delete
  27. శ్రీ గారు, చాలా బాగా రాశారండి. నీను తరించని బ్లాగ్స్ చాలా వున్నాయి అని ఈ టపా చదివితే తెలిసింది. చాల మంచి ఆలోచనతో టపా రాసారు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. రామ్ గారు, వీలు చూసుకుని టపా చదివి వాఖ్య పెట్టారు.చాలా సంతోషం.
      అన్ని బ్లాగ్స్ కి లింక్స్ ఇచ్చాను. చదవండి వీలు చూసుకుని. ధన్యవాదాలు.

      Delete
  28. రమేష్ గారు,Thank you very much.
    మీ కవితలు , హైకులు చాలా బాగుంటాయని విన్నాను. మీ టపాలు తొందరలో వీలు చేసుకుని చదువుతాను.

    ReplyDelete
  29. మీరు చదివే బ్లాగ్స్ తో సరదాకే అయినా అందంగా అల్లిన ఈ టపా చదువుతుంటే జలతారు వెన్నెల లా హాయిగా అనిపించింది.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశగారు, మీకు నచ్చింది అన్నారు. చాలా సంతోషం.
      ధన్యవాదాలు మీకు

      Delete
  30. చాలా బాగుంది అక్కా

    ReplyDelete
  31. మాకు ఇలాంటి ఐడియాలు రావేంటి చెప్మా!!అవును మరి... మంచి టపాలు రాసే వాళ్ళని చూసి ఉడుక్కోవడంతో నే సరిపోతుంది టైమ్ అంతా..మంచి ఐడియాలు రమ్మంటే ఎలా వస్తాయి?...ఉంటానండీ....
    (ఉ....రేయ్ షంకరం!!... వెన్నెల గారి బ్లాగు చూడ్డం మానేద్దాం రా అబ్బీ... చూసినప్పుడల్లా కడుపులో మంట మొదలయి పోతోంది ...వెన్నెల గారి బ్లాగ్...ఆ బుక్ మార్కుల్లో ఉంటూంది...త్వరగా చూసి డిలీట్ చేసేయరా.....అబ్బీ!!!.అంత వరకూ మన:శ్శాంతి వుండదు...8(>_<)8 ...

    ReplyDelete
    Replies
    1. మీరలాగూ అడిగారు కాబట్టి చెప్పేస్తా మరి సీక్రెట్. మీకు చేతి నిండా పని ఉండడం వల్ల ఇలాంటి అలోచనలు రావు అనమాట. ప్రస్తుతానికి నాకు కొద్దిగా తీరిక సమయం ఉంది అన మాట! :)) ధన్యవాదాలు ప్రసాద్ గారు. మీరు నా టపాని బుక్మార్క్స్ నుంచి డిలీట్ చెయ్యకండే...

      Delete
  32. వావ్ చాల బాగుంది పోస్ట్.... అందరూ ఒక్కచోటే అండ్ థాంక్స్ :)

    ReplyDelete
    Replies
    1. శేఖర్ గారు, మీ తెలుగు బ్లాగ్ సంగతి మర్చేపోయాను. ఏంటో మీ చిత్రాల బ్లాగ్ మాత్రమే అలా గుర్తుండిపోయింది.మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  33. మీ ఆలోచనలకి పదును పెట్టి 56 బ్లాగ్ లతో సరదాగా అల్లిన కథ చాలా బాగుంది వెన్నెల గారు! ఇందులో నా బ్లాగ్ ని చేర్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి కొత్త ఐడియా లతో రాయడం మీకు మీరే సాటి. మీకూ, మీ కుటుంబసభ్యులకు 'శ్రీ రామ నవమి' శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. నాగేంద్రగారు, మీరన్నట్టు సరదాగానే రాసినది ఈ టపా.మీ ప్రశంసకు మనస్పూర్తిగా ధన్యవాదాలండి. మీకు కూడా 'శ్రీ రామ నవమి' శుభాకాంక్షలు.

      Delete
  34. బహు బ్లాగుల స్మరణతో బహు బాగు బాగు మీ 'మా' జలతారు వెన్నెల బ్లాగ్.
    స్మరణలో కొద్దిసేపు గడిపి నాకు స్థానమిచ్చినందుకు బహు ఆనందముగా ఉంది.
    మీ ఈ కధనం బలేగుంది వెన్నెల గారు.
    శ్రీరామ నవమి శుభాకాంక్షలండి.

    ReplyDelete
    Replies
    1. ఏదో అలా బ్లాగ్స్ పేర్లు చూస్తు, అర్ధవంతమైన టపా రాయాలని అనుకోకుండా,అల్లేసిన కథ అండి.
      మీ బ్లాగ్ పేరు లేకుండా ఎలాగండి భారతి గారు. మీకు కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు, మరియు ధన్యవాదాలు.

      Delete
  35. కురిసే చల్లనీ వెన్నెలా
    మరల మీ‌బ్లాగు ప్రతిరోజులా

    బ్రహ్మాండంగా చెన్నెలవిహారం చేయించేసారు. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు, మీ వాఖ్య చూసి చాలా ఆనందపడ్డాను.
      నా ఈ ప్రయత్నాన్ని సహృద్యంతో మెచ్చుకున్నారు. ధన్యవాదాలండి.

      Delete
  36. జలతారు వెన్నెల గారూ,

    మీరు "అంతర్ జాల తారా వెన్నెల" అయిపోయేరు సుమీ !!


    చీర్స్
    జిలేబి
    (జిలేబీ పాపం వరూధిని అయి పోయింది!)

    ReplyDelete
    Replies
    1. జిలేబీ గారు, మీ రాక చాలా సంతోషమండి.నేను ఈ కథ బ్లాగ్స్ పేర్లతో రాసానండి.
      అందుకని "వరూధిని" అని మీ బ్లాగ్ పేరు మాత్రమే వాడాను కథలో!
      నాకైతే "జిలేబి" అంటేనే ఇష్టమండి..:)
      ధన్యవాదాలు జిలేబి గారు.

      Delete
  37. చక్కని ప్రయత్నం వెన్నెలగారు.అంతా కులాసానే!

    ReplyDelete
    Replies
    1. ఉమాదేవి గారు, ధన్యవాదాలండి.

      Delete
  38. సరదాగా వ్రాసినా మీ ప్రయోగం ఎంత మందిని ఆనందానికి గురి చేసిందో చూడండి.మీరు
    ఎప్పుడు ఇలాగే మీ వెన్నెల నవ్వుల్నీ పంచుతు ఉండాలని ......

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు,అంతేనంటారా? ధన్యవాదాలండి. మీ బ్లాగ్ పేరు కథలో ఎలా వాడాలో అసలు తెలియలేదంటే నమ్మండి. కాని ప్రయత్నించాను. :)

      Delete
  39. నా బ్లాగ్ పేరు ఏదండి. ఎలాగైనా ఇప్పుడు మీరు చేర్చాలి :-)

    ReplyDelete
    Replies
    1. ముందుగా క్షమించండి లాస్య గారు.ఈ మధ్య మీ బ్లాగ్ క్రమం తప్పకుండా చూస్తున్నాను. ఇరికించేసాను మీ బ్లాగ్ పేరు మీ కామెంట్ చదవగానే. ఒక లుక్కు వెయ్యండి మరి...:) దన్యవాదాలు.

      Delete
  40. ఇదెప్పుడు వ్రాసారు? నేను మిస్ అయినట్లున్నాను. కథ బాగుంది. మంచి ప్రయత్నం. మీ పేరు కూడా పెడితే బాగుండేది కదా!

    ReplyDelete
    Replies
    1. వరూధిని గారు, బాగున్నారా?నా బ్లాగ్ లోనే అన్ని బ్లాగ్స్ కలిపేసుకున్నాననమాట!
      ధన్యవాదాలండి మీ పలకరింపుకు.

      Delete
  41. మీ కధనం ఆకట్టుకుంది.... మీ నుంచి మరిన్ని ఆశిస్తూ...
    ఆన్నట్టు నేను కూడ ఒక చిన్న కవినే.. నా బ్లాగు చూసి మీ అభిప్రాయం తెలుప ప్రార్థన ----
    ఇట్లు పుబాకా

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగ్ చాలా బాగుందండి.అందమైన చిత్రాలు, గీతాలు, కవితలు. ఇక పై చదువుతాను క్రమం తప్పకుండా..అన్ని చదివేసి కామెంట్స్ పెడతానండి. ధన్యవాదాలు మీకు!

      Delete
    2. Dhanyavaadhamulu.... :)

      Delete
  42. వెన్నెలగారూ నమస్కారం... మీ కథనం బాగుంది. ఇంత ఆలస్యంగానా స్పందించడం అంటారేమో... మీరు సమోసాలు మాకు పెట్టకుండా దాచేసుకుని తినేస్తున్నారుగా...అందుకే!. మీ సమోసా బంగారం గానూ... పెట్టకపోతే పెట్టకపోయారు గానీ ఎప్పుడూ నా బ్లాగు చదువుతూ కామెంట్ రాస్తూ ఉండండి... నిహార్

    ReplyDelete
    Replies
    1. నిహార్ గారు, ఆలశ్యంగా స్పందించడానికి కారణం సమోసాలనమాట! :)
      మీ బ్లాగ్,లో మీరు రాసే ప్రతి టపా క్రమం తప్పకుండా చదువుతాను.ప్రపంచమంతా చుట్టి రావాలా? మీ బ్లాగ్ చూస్తే చాలదూ బోలెడన్ని వార్తలు,వింతలు తెలుసుకోడానికి అని ఎన్నోసార్లు అనుకున్నాను. మీ బ్లాగ్ లో టపాలు మీరు చిన్నపిల్లల కోసం రాస్తారేమో అని అనుమానం వచ్చినా, వారికన్నా అధ్వానం నా general knowledge అని తెలుసుకుని చదువుతూ ఉంటాను బుధ్ధిగా! తప్పకుండా, కామెంట్స్ కూడా రాస్తానండి.ధన్యవాదాలు మీ వాఖ్యకి, స్పందనకు.

      Delete
  43. వెన్నెల గారు మీ సరదా నా కొంప ముంచింది. మీ పోస్ట్ చదివి అమ్మ దొంగా యిన్నాళ్ళు యింటి పక్కనే వుంటూ సాటీ బ్లాగర్ అని చెప్పకుండా వాకింగ్ కి పోతునప్పుడు మొక్కలకి నీళ్ళు పోస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ నన్ను ఆట పట్టిస్తావా అని మొన్న పద్దెనిమిదో తారికున యధా విధి గా వాకింగ్ కి వెళుతూ పక్కింటి గేటు తీసుకుని తిన్న గా ఆమె దగ్గరికి వెళ్లి సమోసాలు ఎప్పుడు పెడుతున్నారు అనడం వరకు గుర్తు వుంది . ఆ తర్వాత ఏం జరిగిందో యెంత ఆలోచించినా గుర్తుకు రావడం లెదు. నేను మాత్రం మెలుకువ వచ్చేటప్పటికి ఫూట్పాత్ గోడకి ఆనించి వున్నా . ఆ తర్వాత ఆ వన దేవత దర్సనం మళ్ళి కలగా లేదు . మా శ్రీమతి తర్వాత రోజునే ట్రెడ్మిల్ తెచ్చి యింట్లో ఎందుకు పెట్టిందో యిప్పటికి అర్ధం కావటం లేదు . నేను యిప్పుడు చచ్చినట్టు యింట్లోనే వాకింగ్ చెయ్యవలసి వస్తోంది .. యింతకీ మా పక్కింటి ఆమె మీరేనా? ఆ రోజు ఏం జరిగింది ?మీ కధనం మాత్రం నను మా యింట్లో భందించింది . సుధ చెప్పినా నమ్మడం లేదు ఖర్మ .

    ReplyDelete
    Replies
    1. రవి గారు, ఊహాలోకపు ఊసులు చాలా బాగున్నాయి సుమా!
      మీరు సమోసాలు పెట్టమని అడగడం , తరువాత నేను కుట్ర పన్ని, మీ శ్రీమతి గారిని కూడా పిలవడం,నేను చేసిన సమోసాలు మీరు పదే పదే పొగడటం, ఆవిడకు అది నచ్చకపొవడం...ఇదంతా మీ మెమరీ నుంచి వాష్ అయిపోయింది లేండి.దాని ఫలితమే మీకు ట్రెడ్మిల్ల్ శిక్ష అన్న మాట!సుధకి నేను చెప్పి నమ్మిస్తాను లెండి.
      హా హా హా! ధన్యవాదాలు మీరు చక చక అల్లేసిన కథకి..రవిగారు!

      Delete
  44. చాలా బాగుందండీ!!
    :)

    ReplyDelete
    Replies
    1. చాలా రోజులకు! ఎలా ఉన్నారు?
      ధన్యవాదాలండి.

      Delete
  45. పోస్ట్ చాల బావుందండి
    చాల క్రియేటివ్ గా ఉంది ...

    ReplyDelete