Thursday, May 31, 2012

అమెరికా చదువులు-4


చిన్నానగారి అబ్బాయి సురేష్ ఫోన్ చేసాడు "అక్కా.. సంజయ్ SCAT లో చాలా బాగా స్కోర్ చేసాడు అని ఆనందంతో చెప్పాడు.  సంజయ్ కి ఫోన్ ఇవ్వు.."I will congratulate him" అని అన్నాను. "Hello అత్తయ్యా" అని సంజయ్ అనగానే "Good job రా నాన్నా , ఇలాగే బాగా చదువుకో" అని చెప్పి ఫోన్ పెట్టేసాను. ఇంతకీ సంజయ్ చదువుతున్నది 4th grade. మరి SCAT పరీక్ష ఏంటంటారా? John Hopkins university వాళ్ళు ప్రతి సంవత్సరం Talent search అని కొన్ని tests పెడతారు  2-8 th grade విధ్యార్ధులకు.ఈ పరీక్షలు పెట్టేది summer లో వాళ్ళ programs/classes కి eligibility decide చెయ్యడాని కే అయినా.. ఆ summer programs కి తమ పిల్లలను  పంపని వారు కూడా ఆ పరీక్షలు ఫీస్ చెల్లించి రాయవచ్చు. సంజయ్ చదువుతున్నది 4th grade  అయినా సంజయ్ రాసిన SCAT పరీక్ష 6th grade level లో ఉంటుంది. వచ్చే results కూడా percentiles లో ఉంటాయి. Above grade level english/math లో ఉన్నారా లేదా అని తెలుసుకోవచ్చు, ఈ పరీక్షలలో వచ్చే score ని బట్టి. Middle school (6/7-8 grades) లో CTY (center for talented youth)  ద్వారా students SAT పరీక్ష తీసుకోవచ్చు. SAT విధ్యార్ధులు high school  లో మాత్రమే తీసుకోగలరు. కాని CTY Talent search  లో member  అయితే SAT 6 th grade నుంచే తీసుకోవచ్చు. ఇలాంటిదే ఇంకొక Talent Search exams conducting university NC లో కూడా ఉంది అని విన్నాను. నాకు వివరాలు పెద్దగా తెలియవు. SCAT/STB tests (CTY) information link : http://cty.jhu.edu/talent/

 

Elementary school నుంచి middle school transition  కొంచెం కష్టమైనదే! అప్పటి వరకు academics serious గాతీసుకున్నా,తీసుకోపోయినా..middle school   నుంచి కొంచెం focus చేసి చదువుకోవాలి. Homework లాంటివి చాలా elementary schools లో (public schools) ఇవ్వరు. ఇచ్చినా, 10/20 minutes కంటే ఎక్కువగా ఉండకపోవచ్చు. హట్టాత్తుగా middle school  కి వచ్చేసరికి, ఉన్న 7 subjectsలోను homework తప్పని సరిగా ఉంటుంది.ప్రతి రోజు అన్ని subjects teach  చెయ్యరు. "Block schedule" అని ఒక రోజు 3 subjects ,  ఒక రోజు 4 subjects అలా ఉంటాయి. Middle school నుంచే electives తీసుకోవడం మొదలెడతారు విధ్యార్ధులు. ఏదో ఒక foreign language  (spanish/french/Latin etc..) తీసుకోవచ్చు. ఒకవేళ విధ్యార్దులు middleschool లో తీసుకోకపోయినా high school లో అయితే తప్పనిసరిగా తీసుకోవాలి.

 

ఇంకొక పెద్ద మార్పు ఏంటంటే, అప్పటివరకు, ఒకటో, రెండో పుస్తకాలతో స్కూల్ కి వెళ్ళే విధ్యార్దులందరు హట్టాత్తుగా బోలెడన్నిbooks/folders  మొయ్యాల్సి వస్తుంది. ప్రతి రోజు 3 లేదా  4 subjects మాత్రమే classes ఉంటాయి కాబట్టి, అన్ని classes కి అన్ని folders/books  తీసుకుని వెళ్ళరు. ప్రతి విధ్యార్ధికి lockers allot చేసేది middle school లోనే!Lockers అంటే books/folders/bag/lunch box పెట్టుకోడానికి ఒక storage place లాంటిది. ప్రతి lockerకి కీ ఉంటుంది. ఏ subject class అయితే ఆ సబ్జెక్ట్ books/foldres మాత్రమే తీసుకుని వెళతారు. మిగతా పుస్తకాలన్ని లాకర్ లోనే ఉంటాయి. Challenge ఏమిటంటే  ప్రతి class కి మధ్య gap may be  5 minutes ఉంటుందేమో. Classes  అన్ని ఒకటే floor లేదా.. building లో ఉండకపోవచ్చు. అందుకని, వాళ్ళు ఒక class అవ్వగానే ఇంకొక classకి almost  పరిగెట్టుకుంటూ lockers దగ్గరకి వచ్చి, books/folders మార్చుకుంటూ ఉంటారు. ఆ 5 minutes  లోనే లాకర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ next class ఎక్కడ ఉన్నా...ఆ place కి వెళ్ళడం జరిగిపోవాలి.కొంచెం కష్టమే అయినా...నెమ్మదిగా అలవాటు పడిపోతారు. యంత్రాల్లా చక చక కదులుతారు ఒక class అవ్వగానే, next class కి వెళ్ళడానికి.

Middle school subjects -math, science, social, PE, English,  Music(string/band), Electives (Foreign language falls under this) . Elementary school లో విధ్యార్దులకు ఒక teacher అన్ని subjects teach చెయ్యటం జరుగుతుంది. కాని middle school  నుంచి ప్రతి subject కి different teachers ఉంటారు.Homework కి, quizzes and Tests కి marks ఉంటాయి.ఇవ్వన్ని కలిపి grade determine చేస్తారు.ప్రతి stateకి grading different గా ఉంటుంది కాని mostly on an average 93-100% score చేస్తే"A" grade  వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే, ఒక్క quiz/homework /test  లో కాని 50% కంటే తక్కువ score చేస్తే almost ఆ subject లో "A" తెచ్చుకోవడం చాలా కష్ట్టం. Consistent gaa perform చేస్తేనే కానీ మంచి grades తెచ్చుకోవడం అంత సులభం కాదు. After school clubs గురించి, math and science competitions గురించి, volunteering activities గురించి next పోస్ట్ లో ...

Tuesday, May 29, 2012

జయ క్రిష్ణా ముకుందా మురారి



This slide show is downloaded from slideshare.net.

Friday, May 25, 2012

పాలరాతి శిల్పం చెప్పిన నీతి!


ఒక మ్యుసియం లో అందమైన పాలరాతి శిల్పాన్ని ద్వారం దగ్గర అందరికి కనపడేలా ప్రదర్శించారు.ప్రపంచం నలు దిక్కుల నుండి ఎంతో మంది ఆ అందమైన పాలరాతి శిల్పాన్ని చూడడానికి వచ్చేవారు.ఒక రాత్రి వేళ నేల మీద ఉన్న మార్బల్ టైల్ కి ఆ శిల్పానికి మధ్య సంభాషణ ఇలా సాగింది. " ఓ శిల్పమా..అన్ని దేశాల నుండి ఎంతో మంది నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చి మా మీద అడుగులు వేసి తొక్కేస్తూ ఉంటారు. ఇది భావ్యమేనా?" అని అడిగింది మార్బల్ టైల్. అప్పుడు ఆ శిల్పం ఇలా జవాబు ఇచ్చిందట. "స్నేహితుడా.. నీకు గుర్తుందా మనిద్దరము ఒకటే గుహలోంచి వచ్చాము?" అని. టైల్ దానికి బదులుగా "అందుకే అడుగుతున్నాను,ఇద్దరము పుట్టింది ఒక చోటే, కాని మన ఇద్దరిని ఆదరించే తీరులో ఇంత వ్యత్యాసమేమిటి అన్నది నా ప్రశ్న.ఇది చాలా అన్యాయం కదా" అని అడిగింది.

శిల్పం టైల్ తో " నీకు గుర్తుందా? శిల్పి మన దగ్గరకి వచ్చినప్పుడు మనిద్దరితో పని చెయ్యాలని ప్రయత్నించాడు. నువ్వు ఎదురుతిరిగి అతని పనిముట్లు కి సహకరించలేదు. అదే శిల్పి నా దగ్గరకి వచ్చి తన పనిముట్లు తో నా వళ్ళంతా గాయాలు చేస్తూ నన్ను చెక్కుతున్నపుడు నాకు తెలుసు, ఇవన్నీ భరిస్తూ నేను అతనికి సహకరిస్తే నేను అందరిలా కాక పదిమందిలో ప్రత్యేకం గా నిలువగలుగుతానని. అందుకే ఎంత నొప్పిగా ఉన్నా ఓర్చుకుని ఈ రూపాన్ని పొందాను.నువ్వు శిల్పికి సహరించక అలాగే ఉండిపోయావు.అందుకని  నువ్వు చేసుకున్నదానికి ఎవరినో నిందిస్తావు ఎందుకు?" అని జవాబు ఇచ్చింది.

చిన్న వయసునుండి, జీవితం లో లక్ష్యాలు ఏర్పరుచుకుంటూ,కష్టపడిన వారు జీవితంలో తప్పక పైకొస్తారు. పరాజయాలు, విపత్తులు ఎన్ని ఎదురైనా కుంగిపోకుండా జీవితం లో ముందడుగు వేస్తూ సాగిపోతే మనం కోరుకున్న గమ్యాన్ని తప్పక చేరుకుంటాము. జరిగిపోయినవన్ని తలచుకుంటూ గతంలో వగచేకన్నా, మనం ఏ విధంగాను మార్చలేని గతాన్ని మరిచిపోతూ ,ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకుంటూ(blessing in disguise),వర్తమానంలో జీవిస్తూ, ఉజ్జ్వలమైన భవిష్యత్తు గురించి కలలు కంటూ, విలువలను కాపాడుకుంటూ,మన లక్ష్యాలన్ని నెరవేర్చుకుంటూ  ముందుకు సాగిపోవాలి!

(Original author : Unknown. Translated by me in telugu)

Wednesday, May 23, 2012

Miracle of Life!


Amazing slideshow which I can't wait to share!!



This slide show is downloaded from slideshare.net.

ఆకాశానికి రవికిరణం




ఆకాశానికి రవికిరణం ఆరని హారతి
కడలికి పున్నమి జాబిల్లి వెన్నెల హారతి
త్యాగం మనిషికి ఆభరణం..అది జీవన జ్యోతి
కల్లాకపటం తెలియని హృదయం
కర్పూర జ్యోతి..వెలిగే కర్పూర జ్యోతి

పుట్టినరోజున పాపకు తల్లి పట్టేదే తొలి హారతి
కొత్తకోడలికి ముత్తైదువులు ఇచ్చేదే శుభ హారతి
నిండు మనసుతో దేవుని కొలిచి వెలిగించేదే శ్రీ హారతి
నిండు మనసుతో దేవుని కొలిచి వెలిగించేదే శ్రీ హారతి
కరిగి కరిగినా కాంతి తరగని మంగళ హారతి ఆ జ్యోతి
కల్లాకపటం తెలియని హృదయం..కర్పూర జ్యోతి

విరిసిన కుసుమం వాడిపోయినా..పిందె గురుతుగా మిగిలేను
పండిన ఫలము నేలరాలినా..విత్తనమైనా మిగిలేను
ఆయువు తీరి మనిషి పోయినా
ఆయువు తీరి మనిషి పోయినా..సంతతి అయినా మిగిలేను
వయసులేనిది, వాడిపోనిది  స్మృతి గా మాత్రం మిగిలేది
కల్లాకపటం తెలియని హృదయం..కర్పూర జ్యోతి

Tuesday, May 22, 2012

బ్లాగింగ్ సందేహం!


ఈ రోజు ఉదయం నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే,ఒక విషయం చర్చకు వచ్చింది. అది నన్ను అలోచనకు గురిచేసింది.ఆఫీస్ లో పనిచేస్తున్నా, మధ్యాన్నం లంచ్ చేస్తున్నా,మీటింగ్ లో ఉన్నా అలోచిస్తూనే ఉన్నాను. చివరకు నా అలోచనలు తెగేటట్లు లేవు అని ఈ భారమంతా మీ అందరి మీద కొద్దిగా వేద్దామా అని ఒక కుట్ర పన్ని, ఇలా ఈ పోస్ట్ రాసేస్తున్నా..

ఇంతకీ మా చర్చాంశం ఏమిటంటే బ్లాగ్స్ లో అందరికీ ఉపయోగపడే విషయాలు కాని, కొద్దో గొప్పో మన బ్లాగ్స్ చదివిన వారికి మన ప్రతి పోస్ట్ ఎదో ఒక సందేశం కానీ, మంచి విషయం కాని, తెలియని విషయాలను తెలిపేటట్లు కాని ఉండాలి అనీ,లేదా కనీసం అలోచింపచేసేది గా ఉండాలని, మనమందరమూ బ్లాగ్స్ లో పోస్ట్ లు రాసేటప్పుడు ఒక స్టాండర్డ్ మెంటెయిన్ చెయ్యాలని చర్చ! ఇక కామెంట్స్ విషయానికి  వస్తే కూడా "నాం కె వాస్తే" (ఎదో కామెంట్స్ రాయలని రాయడమే కాని, ఇంకేమికాదు అన్నట్టు) లా కాక  మనం రాసే ప్రతి కామెంట్ లో కూడా అర్ధవంతం గా ఉండాలి అని.

ఈ చర్చ అయ్యాక, నాలో ఒక రకమైన గుబులు మొదలయ్యింది. ఏదో ఆ రోజు మనసులో ఏముంటే అది రాయడమే కాని, ఎప్పుడు..ఈ పోస్ట్ కి అర్ధం ఉందా, ఎవరికన్నా ఉపయోగపడుతుందా, ఇప్పుడు ఈ పోస్ట్ రాయడం వల్ల నేను ఎమన్నా సందేశం ఇస్తున్నానా అన్న అలోచన నాకు ఇంతవరకు రాలేదు.నా పోస్ట్ లో ఒకటో, రెండో తప్ప ఎవరికి ఉపయోగపడే పోస్ట్ లైతే లేవు. పోస్ట్ లన్నిటికీ కామెంట్స్ వస్తుంటే, హమ్మయ్య చదువుతున్నారు కదా అని సంబడం తప్ప,పెద్దగా అలోచించలేదు. నా మటుకు నేను నిజంగానే సరదా/fun కోసమే రాసుకుంటాను. ఎవరిని నొప్పించకుండా రాస్తే చాలు అని మాత్రం అనుకుంటాను. ఎప్పుడన్నా  నేను చూసిన, ప్రభావితమయిన సంఘటనలు ఉంటే వాటి గురించి కూడా రాస్తాను. రాజకీయలలో , సినిమాలలో, లేదా పురాణాలలో, కవిత్వంలో,అధ్యాత్మికం గా కూడా ఉన్నది మిడి, మిడి జ్ఞానమే! కొంతమంది బ్లాగ్ మిత్రులు రాసేవి చూసి అబ్బురపడుతూ ఉంటాను. ఎంత జ్ఞానవంతులో కదా అని.అలాంటి వారి బ్లాగ్స్ చూసినప్పుడు నిజమే ఏదో నేర్చుకున్నాము, తెలియని విషయాలు తెలుసుకున్నాము  అని అనిపిస్తుంది, చాలా సంతృప్తిగా ఉంటుంది కాని, నేను కూడా అలాగే రాయలనుకున్నా రాయలేనే!!

ఇప్పుడు ఇంక ఒకరకమైన సందిగ్ధం లో పడ్డాను.ఒకవేళ నిజంగా బ్లాగ్స్ లో పోస్ట్స్ కూడా జాగ్రత్తగా రాయాలి, ఏదో సరదాగా రాయకూడదు అన్నది నిజమైతే, నేను రాంగోపాల్ వర్మ లా అలోచిస్తున్నానా? ఎవరేమనుకుంటే నాకేంటి...నాకు నచ్చింది, నా మనసులో అనిపించింది మాత్రమే రాయాలి అన్న అలోచన తప్పా? సరదాగా కాలక్షేపానికి చదువుకుంటున్న, రాస్తున్న పోస్ట్స్ అన్నీ ఆపెయ్యాలా?అసలు నిజంగా బ్లాగ్స్ లో ఏమి రాయాలి? బ్లాగింగ్ మీద సరైన  అవగాహన లేకుండా బ్లాగింగ్ మొదలుపెట్టానా ...ఏంటో,అంతా అయోమయం...కొంచెం మీ అందరి అభిప్రాయలు తెలియచెయ్యండి...బ్లాగింగ్ మీద... నా బ్లాగింగ్ మీద కాదండోయి.! అసలు బ్లాగ్స్ రాసేటప్పుడు మనకి మనం  స్టాండర్డ్స్ ఇంపోస్ చేసుకోవాలా అన్న విషయం మీద!!!!!

Friday, May 18, 2012

భిన్నాభిప్రాయాలు-స్పర్ధలు




సాయంత్రం ఏడు గంటలు దాటింది. ఆఫీస్ నుంచి లేట్ గా ఇంటికి వచ్చిన శాంతికి కిరణ్, హారిక డైనింగ్ టేబుల్ దగ్గర వాదించుకుంటూ కనిపించారు. విషయమేమిటా అని తను కూడా నెమ్మదిగా టేబుల్ దగ్గరికి చేరింది. కిరణ్ శాంతిని చూడగానే "ఇదిగో నీ కూతురి సంగతేంటో చూడు, ఆ బక్కెట్లో ఎవరితోనో గొడవట, దాని గురించి మూడ్ ఆఫ్ అంటుంది" అని. హారిక పగలబడి నవ్వుతుంది. "అమ్మా ... నాన్నకెన్ని సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ బక్కెట్ అంటారేంటీ? It's Tumblr Dad!....." అని అంది హారిక. "అదే ఏదో ఒకటి టంబ్లరో, చెంబో, తప్పాలాయో ఎదో ఒకటి లేమ్మా, పేరులో ఏముంది" అని హారికను ఇంకా ఉడికించాడు కిరణ్. సరే విషయమేమిటి అని అడిగింది శాంతి. "నేను చెపుతాను .." అంటూ మొదలుపెట్టాడు కిరణ్

"ఈ మధ్య పాపం అందరు ఐశ్వర్యారాయ్ లావైపోయింది అని బాధపడుతన్నారు కదా. నీ కూతురేమో ఐశ్వర్యారాయ్ మీద ఎదో రాసిందట ఆ బక్కేట్లో,అది ఎవరో స్నేహితురాలికి నచ్చలేదట, చాలా బాధపడుతూ స్పందించిందంట.ఆ స్పందన నచ్చక నీ కూతురు ఇక్కడ ఆవేశపడుతుంది. అందుకే కౌన్సల్లింగ్ చేస్తున్నా" అని చెప్పాడు. "ఏమని రాసావు హారికా,నీ స్నేహితురాలిని అంత బాధపెట్టేలా" అని అడిగింది శాంతి."నేనేమి రాయలేదమ్మా, ఏదో వెబ్సైట్ లో ఎవరో రాసింది నేను Tumblrలో రాసాను రెఫరెన్స్ ఇచ్చి,అయినా నీకు తెలుసు కదా నాకు ఐశ్వర్యారాయ్ అంటే ఇష్ట్టం లేదని" అని జవాబు ఇచ్చింది హారిక. "సరే ఇప్పటికన్నా చెప్పు ఏమిరాసావో .." అని అడిగింది శాంతి .వెంటనే లాప్టాప్ తెరిచి చూపెట్టింది హారిక. "Aishwarya Rai can never get it right. Too perfect, too plastic, too fake, and now, alas, too fat." అని ఉంది అందులో. హారిక వివరించసాగింది."అమ్మా ఇది నా అభిప్రాయం, ఇష్టముంటే చదవాలి,లేకపోతే లేదు,అంతే కాని నా స్నేహితురాలి స్పందన నాకు నచ్చలేదు." 

నవ్వుతూ అడిగింది శాంతి "ఇంతకి ఎమందేమిటి నీ స్నేహితురాలు?" అని."ఐశ్వర్యారాయ్ అంటే నాకు చాలా ఇష్ట్టం, ఇలాంటీవి పోస్ట్ చెయ్యకు. You hurt my feelings. లావవ్వడం, సన్నగా ఉండాలనుకోవటం ఐశ్వర్యా పెర్సనల్ విషయం అది, మధ్య నీకేమిటి ప్రోబ్లం"అని."నువ్వేమన్నావు మరి?"అని అడిగింది శాంతి."ఒక స్మైలీ టైప్ చేసాను"అని చెప్పింది హారిక.మరి ఇంకేమిటి సమస్య ?"అర్ధం కాక అడిగింది శాంతి కూతురిని. ఏముంది అక్కడ తన ఫ్రెండ్ ని ఏమీ అనలేక...ఇక్కడ నా దగ్గర సీమ టపాకాయలా ఎగురుతుంది" అని చెప్పాడు కిరణ్. "అమ్మా నువ్వే చెప్పు, ఎవరి అభిప్రాయాలు వారివి కదా? నేను తన గురించి ఎమీ రాయలేదు కదా, మరి తనకెందుకు అంత బాధ? Aiswarya rai is an actress and she is a public figure. సో నేను కామెంట్ చెయ్యచ్చు." అని సమర్ధించుకుంది హారిక. "పాపం అభిమానులు ఉంటారమ్మా..మరి వారిని నువ్వు బాధపెట్టిన దానివి అయ్యావు కదా..." అని నవ్వుతూ అంది శాంతి. 

 "ok, now stop both of you" అంటూ కిరణ్ కలగచేసుకున్నాడు. "అసలు అవసరం ఉన్న చోట, లేని చోట ఎందుకమ్మా అంతగా రియాక్ట్ అవుతావు హారిక? ఇది పెద్ద విషయమా? ఇక్కడ నువ్వు రాసిన దాన్ని, సమర్ధిస్తే నీకు ఆనందం, అదే విమర్సిస్తేనో, నచ్చలేదని చెపితేనో ,నీకు ఇష్ట్టం ఉండట్లేదు, నీ అహంకారాం దెబ్బ తింటుంది. అసలు దీని గురించి మనం ఇంత సేపు మాట్లాడుకోవాలా?నీ అభిప్రాయాన్ని నువ్వు వ్యక్తపరిచావు, నీ స్నేహితురాలికి అది నచ్చలేదు, నువ్వు నవ్వి ఊరుకున్నా, నీ మనసులో మాత్రం విపరీతమైన కోపం పెంచుకున్నావు.అది తప్పు.నీకు ఎలా నీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వాతంత్రం ఉందో, అలాగే నీ స్నేహితురాలు కాబట్టి నీకు నిష్కర్ష గా చెప్పింది ,నువ్వు రాసినది తనకి నచ్చలేదని. తన ఫీలింగ్స్ కి కూడా నువ్వు విలువ ఇవ్వాలి కదా?" ఆవేశంతో అంది హారిక 
"నేనేమీ తనని కామెంట్  చెయ్యలేదు  కదా, మధ్య తన కెందుకో అంత బాధ...అది నాకు నచ్చలేదు నాన్నా..." అంది. "పిచ్చిదానిలా మాట్లాడకు, ఇంతకు ముందు నీకు, తనకు ఉన్న స్నేహం అంతా ఈ ఒక్క సంఘటనతో తుడిచిపెట్టుకుపోతుందా?" అని తను కూడా అవేశంగా అడిగాడు కిరణ్. ""yeah , I don't like her anymore" అని నెమ్మదిగా చెప్పింది హారిక.

ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది శాంతి. తనకి నచ్చని మాట ఒక్కటి మాట్లాడితే ఇంక స్నేహాన్ని వదులుకుంటున్నట్లు మాట్లాడుతున్న హారికను చూస్తే ఆ నిమిషంలో భయమేసింది శాంతికి. రేపు మాట్లాడుకుందాము అని "ఇంక పడుకుందామా" అని ఆ సంభాషణ అంతటితో ఆపేసింది శాంతి. శాంతి అలోచిస్తూ ఉండిపోయింది చాలా సేపు. ఆ నిమిషంలో శాంతికి తన స్నేహితురాలు రమ్య గుర్తుకువచ్చింది. రమ్య , శాంతి ఒక ఆఫీస్ లో కలిసి పని చేసేవారు. ఇద్దరూ అమెరికాకి ఒకటే సంవత్సరంలో రావడం , ఒకే కమ్మ్యునిటీలో ఉండడం,ఇద్దరు ఇంచుమించుగా దగ్గర వయసు వారే కావటం వల్ల వారిద్దరు మంచి స్నేహితులయ్యారు. కిరణ్ , రమ్య భర్త కి కూడా స్నేహం కుదరటంతో ఇద్దరి కుటుంబాలు బాగా దగ్గరయ్యాయి. శాంతి, రమ్య ఇద్దరు ఏడు సంవత్సరాల వరకు, దేశం కాని దేశంలో  ఎంత బాగా సెట్టిల్ అవ్వగలమా అన్న అంశం మీద తప్ప ఇంకేది పట్టించుకునే  వారు కారు.తరవాత వారి ద్రుష్టి అంతా ఎదుగుతున్న వారి పిల్లల మీదే ఉండేది. మాట్లాడుకున్న, కలిసినా, వారికి పిల్లల చదువులు, యాక్టివిటీస్ తప్ప ఇంకేమి మాట్లాడుకునే వారు కాదు.


అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడు ఒక్కసారి కూడా ఇద్దరికి మాట తేడా కాని, ఒకరి వలన ఇంకొకరు బాధపడటం కాని జరగలేదు.ఇప్పుడు పిల్లల బాధ్యత లేదు ఇద్దరికి.శాంతి కూతురు, రమ్య కొడుకు కూడా వేరే స్టేట్స్ లో కాలెజ్ లో చేరారు. ఇప్పుడు రమ్య కి శాంతికి కావాల్సినంత టైం ఉంది, జీవితంలో ఏ లోటు లేదు. తీరిక ఎక్కువ ఉండటంతో ఇద్దరూ వారి పిల్లలు వాలంటీర్ చేసిన ఒక  హాస్పిటల్లో వారానికి మూడు రోజులు వాలంటీర్ చేస్తూ,ఉద్యోగాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఒక రోజున రమ్య చిరంజీవి పార్టీని కాంగ్రెస్స్ లో విలీనం చేస్తున్నాడని,పార్టీని ద్రుష్టిలో పెట్టుకుని అతను తీసుకున్నది మంచి నిర్ణయం అని రమ్య అంది. దానికి శాంతి ఏదో మార్పు తెస్తానని రాజకీయాలలో దిగాడు కదా, మరి అదేంటీ, పార్టీ ఓడిపోతే పోనీ తన సమయం అంతా సంఘసేవకి వినియోగిస్తూ, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసి నెగ్గి తను ఏవైతే ప్రజలకు చెయ్యాలనుకున్నాడో, అవన్ని చెయ్యొచ్చు కదా, ఇలా పార్టీని విలీనం చేసి, తను నమ్ముకున్న సిద్ధంతాల కన్నా, రాజకీయాలలో పదవి ముఖ్యమని నిరూపించినట్టే  కదా" అని అంది శాంతి.రమ్య దానికి విసురుగా.."అంటారమ్మ , ఎన్నైనా అంటారు, NTR రాజకీయాలలో కి వచ్చిన పరిస్తితులు వేరు, ఇప్పుడు వేరు.ఆ రోజుల్లో చిరంజీవి పార్టీ పెట్టినా తప్పక గెలిచేవాడు" అని అంది.శాంతికి మతిపోయినంత పనైంది.అదేంటి రమ్యా..అలా అనేసావు, నెనేమీ అసలు  NTR మాట ఎత్తలేదే. అది జరిగిపోయిన కథ. మనం మాట్లాడుకుంటున్నది ఈ రోజున చిరంజీవి పార్టీని విలీనం చెయ్యడం గురించి కదా..అసలు నీ నిష్టూరమేంటో నాకేమీ అర్ధం కాలేదు" అని అంది శాంతి. "ఏమీ లేదులే, let's change the topic" అని అక్కడితో ఆపేసింది రమ్య.


ఒక వారం రోజుల తరువాత కిరణ్ అడిగాడు శాంతిని, "నీకు, రమ్యకి 
ఎమన్నా మనస్పర్ధలు వచ్చాయా" అని. "అలాంటిదేమీ లేదే అని అంటూనే, వెంటనే అంది..మీకెందుకు వచ్చింది ఆ అనుమానం?" అని . కిరణ్ తనతో రమ్య భర్త చాలా ముభవంగా ఉంటున్నాడని చెప్పాడు.నిజమే , తను కూడా నాతో అంటి ముట్టనట్టు ఉంటుంది" అని అంది. కొద్ది వారాలలోనే పూర్తిగా శాంతితో మాట్లాడడమే మానేసింది రమ్య. అంతటితో ఆగక, వీరిద్దరు ఇతర స్నేహితుల ఇంట్లో కలిసినప్పుడు, అప్పుడు వరకు వారిద్దరి మధ్య లేని పోటీ మనస్తత్వాన్ని అందరు గమనించారు. అసలు నేనేమన్నానని, అంత మూర్ఖం గా నాతో మాట్లాడడం మానేసి, 17 సంవత్సరాల స్నేహాన్ని ఇలా ఒక్క వారం లో తుంచేసింది రమ్య అని శాంతి బాధపడని రోజు లేదు.


శాంతికి ఎంతో చెప్పి చూసాడు కిరణ్ "ఒకసారి డిన్నర్ కి పిలువు రమ్యని. అంతా అదే సర్దుకుంటుంది" అని. శాంతి ఒప్పుకోలేదు.తనే మాట్లాడడం మానేసింది, నేనెందుకు ఎదో తప్పు చేసిన దానిలా రాజికి రావాలి" అని "అయినా శాంతి నువ్వు ఎన్నిసార్లు రమ్యని భోజనానికి పిలిచినప్పుడు, రమ్యకి ఇష్ట్టమైన వంటలే చేసేదానివి కాని, పర్లేదులే నా ఇంటికి వచ్చింది కాబట్టి నాకు ఇష్ట్టమైన వంటలే తినాలి రమ్య అని అనుకోలేదుగా..ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిరుచి,కొన్ని స్థిరిమైన అభిప్రాయాలు ఉంటాయి.ఆ అభిప్రాయలతో మనం ఏకీభవించాలని లేదు, అలా అని వ్యతిరేకించనవసరమూ లేదు.కొంతమంది వారు నమ్మినదే వేదం అని వాదిస్తారు. విని ఊరుకోవడమే! వాదించి వారి దగ్గర మనం సాధించేదేమీ లేదు.ఇప్పుడు ఒక వేళ నువ్వు ఏదన్నా మంచి కార్యం తలపెట్టవనుకో, దాని వలన కొంత మందికి మేలు చెయ్యగలను అని నువ్వు అనుకుంటే, అప్పుడు నువ్వు చేసేదాన్ని సమర్ధించకుండా వితండ వాదన  చేస్తూ,తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించేవారికి నువ్వు నచ్చచెప్పే ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి.ఓపికగా వారు అర్ధం చేసుకునే వరకు వివరించాలి, డీబేట్ చెయ్యాలి. అంతే కాని రాజకీయనాయకుల గురించి, సినిమా ఏక్టర్ల గురించి,సినిమాల  గురించి ఈ శత్రుత్వాలేంటీ? ఇంత చదువుకుని సిగ్గుగా లేదు? 17 సంవత్సరాలుగా నీకు, రమ్య కి మధ్య ఉన్న స్నేహానికి అడ్డు రాని కులం, ఈరోజున ఇద్దరకి తీరుక ఎక్కువై, ఇలాంటివి మాట్లాడుకుని మనస్పర్ధలకు గురయ్యారు.వ్యక్తిగతంగా నీకు ఇప్పుడు కూడా రమ్య అంటే ఇష్ట్టమే, కాని అది నువ్వు ఇప్పుడు ఒప్పుకోడానికి సిద్ధంగా లేవు. ఆ రోజున రమ్య చిరంజీవి పార్టీ ని గురించి నీతో అన్నప్పుడు నువ్వెందుకు రమ్య కి చిరంజీవి అంటే ఇష్ట్టం కదా..అనవసరం గా ఇప్పుడు విమర్శించి తనను బాధ పెట్టాలి అని అనుకోలేదు? నవ్వి ఊరుకుంటే అంతా సర్దుకునేది కదా?" అని  అన్నాడు కిరణ్. "అదేంటి కిరణ్, నువ్వు కూడా నాదే తప్పు అన్నట్టు మాట్లాడతావు" అని అడిగింది శాంతి."తప్పు నీదా, రమ్యదా అని నేను తీర్పు ఇవ్వటం లేదు. నీకు తెలుసు రమ్య ఎంత మంచిది అన్నది,సరే తను అభిమానించేవారిని కించపరిచావని చిన్నబుచ్చుకున్న మాట కూడా వాస్తవమే!కాని నువ్వేమి చేసావు? తన మనసు నొచ్చుకున్నదని తెలిసి కూడా..నువ్వు కూడా మౌనం గా ఉండిపోయావు. ఇద్దరు నిజమైన స్నేహితుల మధ్య ఇగో ఉండదు, ఉండకూడదు.ప్రేమ ఉన్న చోట ఇగో ఉండదు.అందుకని రేపే వెళ్ళి రమ్య తో మాట్లాడు. మనుషులన్నాక భిన్నాభిప్రాయాలు ఉంటాయి.ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవిస్తూ, ఒకరి పట్ల ఇంకొకరు సహనంతో/Tolerance తో ఉండాలి.విమర్శ మంచిదే,కాని అవసరం ఉన్న చోట, అక్కర్లేని చోట విపరీతం గా ఒకరినొకరిని విమర్శిస్తూ , ఎత్తిపొడుచుకుంటూ మనం సంస్కారం గా ప్రవర్తిస్తున్నామా" అన్నాడు కిరణ్.


కిరణ్ చెప్పినవన్నీ నిజాలే అని తెలిసినా, కొద్ది రోజులదాక శాంతి మౌనంగా ఉండిపోయింది. తరువాత ఒక రోజున ఆఫీస్ లో మాట కలిపింది శాంతి. రమ్య కూడా సంతోషంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఇద్దరు ఒకరికొకరు క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. మళ్ళి ఇదివరకటిలా ఎమీ జరగనట్టే కలిసిపోయారు.ఇప్పుడు వారి మధ్య రాజకీయాల గురించి కాని, సినిమాల గురించి కాని, టాపిక్స్ రావు. వచ్చినా పెద్దగా వారు వాటిని పట్టించుకోరు.


పొద్దున లేవగానే హారికకు నెమ్మదిగా స్నేహం విలువ, ఒకరి అభిప్రాయాలను గౌరవిచటం గురించి విపులంగా చెప్పాలని నిర్ణయించుకుని నిద్రకు ఉపక్రమించింది శాంతి. 

Saturday, May 12, 2012

అమ్మదొంగా! నిన్ను చూడకుంటే..


కలతలు కష్టాలు నీ దరికి రాక..
కలకాలం నీ బ్రతుకు కలలదారి కావాలి!



Thursday, May 10, 2012

అమెరికా చదువులు-3



మా బాబు above grade  లెవెల్  math  చేస్తాడు, రీడింగ్ 2 grades advanced గా ఉన్నాడు, అయినా మా బాబు టీచర్  math లో, English  లో "S" కాని "G " కాని grades ఇస్తుంది. racism  అనుకుంటా.. అని బాధపడుతుంది నా స్నేహితురాలు రమ్య. టీచర్  conference  లో అడిగాను,  ఎందుకు బాబుకి "O" grade ఇవ్వటం లేదు అని. బాగానే చదువుతున్నాడు అంటుంది టీచర్ , కాని grades ఎందుకు ఇవ్వటం లేదో తెలీటం లేదు depression గా ఉంది అని బాధపడసాగింది రమ్య. ఎక్కువగా వింటుంటాను ఇలాంటివి. ఇక్కడ కొన్ని states లో K,1,2 grades వరకు letter  grades 'S(satisfactory), 'G'(good), 'O' (outstanding) అని ఇస్తారు. 3-12 grades లో "A", "B", "C" ఇలా letter grades ఉంటాయి.విధ్యార్ధులకు grades టీచర్  స్కూల్ లో ఇచ్చిన వర్క్ ని బట్టి, చాలా వరకు class లో  వాళ్ళు   perform చేసిన దాని బట్టి grades ఇస్తారు. ఏ  grade లో ఉంటే  ఆ  grade level లోనే వారిని observe చేస్తారే  తప్ప, ఆ విధ్యార్ధి ఎంత above grade level లో ఉన్నాడు  అన్నది టీచర్స్ చూడరు. వాళ్ళ communication skills, వాళ్ళు అందరితో కలిసిపోయే తీరు, వాళ్ళ overall behavior,consistent గా grade level లో బాగా  perform చేస్తున్నారా అన్నది ముఖ్యం. ఇంకొక విషయం ముఖ్యం గా గుర్తుపెట్టుకోవలసినది ఎమిటంటే,ఇక్కడ అన్ని పరీక్షలలోను మంచి మార్కులు సాధించి, మంచి   grades తెచుకున్నా, టీచర్ కి ఆ విధ్యార్ధి మీద సదభిప్రాయం లేకపోయినా, లేక టీచర్ ద్రుష్టిలొ విధ్యార్ధి  పడకపొయినా  విధ్యార్దులకు అది దెబ్బ!టీచర్  recommendations కి  చాలా weightage  ఉంటుంది. మార్కులు వచ్చినా, రాకపోయినా, academic గా  brilliant  కాకపోయినా, టీచర్ కి కనక సదభిప్రాయం విధ్యార్ధి మీద  ఉంటే అది చాలా అద్రుష్టంగా భావించవచ్చు.

Elementary స్కూల్ లో competitions/educational aids గురించి కొన్ని వివరాలు. Kumon :  మన ఇండియా  పద్దతిలో "Practice makes perfect "  లా to some extent, లెక్కలేన్నన్ని practice sheets ఇచ్చి math లో, basic fundamentals of math  బాగా నేర్పిస్తారు. సాధారణంగా kumon లాంటి centers లెక్కలు చక చక చెయ్యటానికి ఉపయోగపడతాయే తప్ప,aptitiude tests కి పెద్దగా ఉపయోగపడవు. kumon  english - నాకు తెలిసి comprehensions practice  చేసుకోవచ్చు.  I don't recommend them . కాని గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే, every child is different. మీ పిల్లలకు ఎలాంటి enrichment అవసరమో మీకంటే ఎక్కువగా ఇంకెవ్వరికి తెలియదు కదా. Elementary school level   నుంచి బుక్ రీడింగ్ అన్నది తప్పనిసరిగా school లో emphasize చేసినట్టు, ఇంట్లో కూడా వీలైనంతవరకు వరకు importance ఇవ్వండి. వాళ్ళు ఎలాంటి బుక్స్ చదివినా సరే encourage చెయ్యండి. Fiction, science fiction or any kind . Vocabulary skills develop  అవ్వాలన్నా , writing skills develop అవ్వాలన్నా, comprehension skills develop  అవ్వాలన్నా అదే కీ! Usefull links/books:Wordly wise books http://www.wordlywise3000.com/  (highly recommended) . చాలా schools లో ఇవి elementary school లో syllabus లో భాగమే! word masters లాంటి analogy competitions కూడా కొన్ని schools లో ఉంటాయి. http://ww2.nps.k12.va.us/education/components/scrapbook/default.php?sectiondetailid=138677& (SAT లో ఇప్పుడు analogies లేవు)
SCORE-(coaching for Math, science and math)-computer లో  software , grade లెవెల్ బట్టి questions వస్తూ ఉంటాయి. scores వస్తాయి చివరిలో.scores  బాగుంటే  next లెవెల్ కి advance అవుతారు, లేకపోతే
ఒకటే లెవెల్ లో questions  వస్తూ ఉంటాయి. ఒక వేళ  ఏమన్నా సందేహాలు  ఉంటే నివృత్తి చెయ్యడానికి ,అక్కడ సహాయం చేసేవారు 
ఉంటారు,కాని నేను చూసినంత వరకు చాలా మంది పిల్లలు అక్కడ   ఆడుతూ  ఉంటారు, mouse తో , keyboard తో.ఎక్కువ సాతం multiple choice questions/answers  కాబట్టి, ఏవో choices select  చేసుకుంటూ ఉంటారు.link : www.escore.com Looks like now it is Kaplan! ఇంక ప్రతిభ కల విధ్యార్ధులకు ALOHA (http://www.aloha-usa.com/arithmetic.htmlలాంటివి ఉపయోగపడతాయి.ముందు ముందు "Math Counts" లాంటి పరీక్షలకు మంచి basic foundation ఇస్తాయి ఇలాంటి coaching centers. However again the key is not all students are really ready to do these mental calculations in their head, some of them do complain their brain hurts! so keep this  in mind! ఇక్కడ middle school లెవెల్ నుంచి calculators ఇచ్చేస్తారు విధ్యార్ధులకు. what they say is " do you know how to solve the problem? that is important , calculators can compute..". ENOPI  (Math critical thinking program) బాగుందని విన్నాను. 
(http://www.enopi.com/Main/Main_Local.aspx?CountryCd=United%20States%20of%20America&HMAC=9wIL3b32FwLqZ3HukclO0dlPM8E=) .వాళ్ళు "Olympiad"  కూడా conduct చేస్తారు అని విన్నాను. Elementary school  లో math competitions:Continental math league. (http://www.continentalmathematicsleague.com/) .Year కి 4 tests ఉంటాయి. వచ్చిన scores అన్నీ కలిపి చివరకు awards ఇస్తారు.I also highly recommend the continental math league books. (http://www.continentalmathematicsleague.com/cmlbooks.html)
Math olympiad competitions untaayi konni schools lo. Book links :

(http://www.amazon.com/Math-Olympiad-Contest-Problems-Volume/dp/1882144112/ref=sr_1_2?ie=UTF8&qid=1336707576&sr=8-2ఇవి enrichment  కి చాలా ఉపయోగపడతాయి. Math league contests అని కూడా కొన్ని states లో ఉంటాయి. Highly recommend these books. 
Competitions attend  చేసినా చెయ్యకపోయినా ఈ బుక్స్ కొన్నుకుంటే అవి చాలా ఉపయోగపడతాయి.ఇంక  science competitions లో అతి ముఖ్యమైనవి- science fair and Science Olympiad. Science fairs  అన్ని స్కూల్స్ లో elementary school level లో ఉండవు. Science Olympiad  కొన్ని schools  లో   5th, 6th grades నుంచి మొదలయినా,middle and high  schools మాత్రమే వీటిలో ఎక్కువ సంఖ్యలో విధ్యార్ధులు పాల్గొంటూ ఉంటారు.(http://soinc.org/).ఎక్కువగా elementary school level   లో  ప్రాచుర్యం పొందిన science program  - Odyssey of the mind competition - (http://www.odysseyofthemind.com/). ప్రతి సంవత్సరం 5 categories లో problems choose  చేసుకుని teams  participate చేస్తాయి regional, county , state and international level లో .గుర్తు పెట్టుకోవాల్సినది ఏంటి అంటే, మంచి team దొరికితే సమస్య లేదు.లేకపోతే మీరు కనక coach చేస్తుంటే చాలా తల నొప్పులు ఉంటాయండోయి! International  లెవెల్ వరకు ఒక team  ని తీసుకెళ్ళిన అనుభవంతో చెపుతున్నాను! చాలా స్కూల్స్ లో ఈ math competitions కాని, science competitions  కాని ఉండవు. అలాంటప్పుడు  స్కూల్స్  లో PTA (Parent Teacher Association) ఉంటుంది కదా..అక్కడ మీరు propose చేసి, like minded  people   కొంతమంది పూల్ అయ్యి,మీరు స్కూల్ ని represent చేస్తూ lead తీసుకొవచ్చు,లేదా individual గా కాని group గా కాని registration చేసుకుని మీరు competitions కి school తో నిమ్మితం లేకుండా పాల్గొనవచ్చు.summarize చేస్తే,book reading, some extra math prep at home (recommending math league books ) in elementary school level should be good enough! ఇంతకు ముందు చెప్పినట్టుగా only if your kids  are genuinely interested, then enrich them above their grade level. వాళ్ళు స్కూల్ లో నేర్చుకుంటున్న విధ్య , అక్కడ creative gaa గా వాళ్ళు చేసే project workతో చాలా నేర్చుకుంటారు విధ్యార్ధులు. School grades are very important , తరవాతే  additional math, english or science enrichment  అన్నీను....


Sunday, May 6, 2012

కాఫీ-కప్పులు




జీవితంలో బాగా స్థిరపడిన కొందరు యువతీయువకులు వారు చదువుకున్న కాలేజ్ లో మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. చదువుకునే రోజుల్లో వాళ్ళు ఎంతో ఇష్టపడే ప్రొఫెస్సర్ ని కలవడానికి వెళ్ళారు. వాళ్ళందరి సంభాషణలలోను జీవితం పట్ల తీవ్రమైన అసంతృప్తి, పని ఒత్తిడి వల్ల కలిగే అలసట,బంధాల పైన అపనమ్మకం ఇలాంటివే ఎక్కువగా మాటలు దొర్లాయి. ఇంతలో ప్రొఫెస్సర్ వారందరికి కాఫీ పెడతానని చెప్పి వెళ్ళి, ఒక పెద్ద కాఫీ పోట్ లో కాఫీ, మరియు ఒక పది కప్పులు తెచ్చి వాళ్ళందరి ముందు ఉంచారు. ఇంట్లో ఒకే రకమైన కప్పులు కనపడకపోవటం వల్ల, కొన్ని గాజు కప్పులు, కొన్ని ప్రొసిలైన్ కప్పులు, కొన్ని క్రిస్టల్ వి, కొన్ని సాధారణ మైనవి, కొన్ని ఖరీదైనవి ప్రొఫెస్సర్ తెచ్చి వారి ముందు పెట్టారు.అందరిని వారికి కావాల్సిన కప్పుల్లో కాఫీ నింపుకుని తాగమని చెప్పారు.వాళ్ళందరు కాఫీ తాగుతుండగా ప్రొఫెస్సర్ గారు ఇలా అన్నారు.."మీరందరు గమనించారో లేదో, ఖరీదైన , అందమైన కప్పులన్ని తీసుకుని, మామూలుగా ఉన్నవి, సాధరణంగా కనిపించే కప్పులు వదిలేసారు.ఇది చాలా సాధారమైణ విషయం,మీరందరూ ఒక సర్వోత్తమమైన జీవితం కోసం ఆశపడుతున్నారు. అదే మూల కారణం మీ అందరి సమస్యలకి, జీవితం పట్ల అసంతృప్తి కి.మీరు తాగుతున్న కప్పు ఎలాంటిదైనా మీ అందరి కాఫీ ఒకేలా ఉంటుంది.మీకందరికీ కావాల్సినది కాఫీ, కాని మీరందరూ ఉన్నవాటిలో అతి ఖరీదైన కప్పు కోసం కాని, అందమైన కప్పు కోసం కాని తాపత్రయపడ్డారు.తరువాత నెమ్మదిగా మీ పక్కవారు ఏకప్పులో కాఫీ తాగుతున్నారో చూడసాగారు. మీ జీవితం ఒక కాఫీ అయితే , మీ ఉద్యోగం, మీ డబ్బు,సమాజం లో మీ ప్రతిష్ట కప్పులు.ఇవన్నీ జీవితం గడపడానికి పనికొచ్చేవి మాత్రమే ! మీరు చేస్తున్న ఉద్యోగం, మీ డబ్బు మీరు అనుభవించే జీవితాన్ని మార్చదు.మనం ఎక్కువగా కప్పు మీద ద్యాస పెడతామే తప్ప మనకు భగవంతుడు ఇచ్చిన జీవితం గురించి అలోచించము.దేవుడు మనకి కాఫీ ఇస్తాడే తప్ప మనం తాగే కప్పు ని వెతికి ఇవ్వడు.సంతోషంగా ఉన్నవారికి శ్రేష్ఠమైన జీవితం ఉండకపోవచ్చు. కాని వారికున్నదానిలో వారు చాలా గొప్ప జీవితాన్ని గడుపుతారు. సాధారణమైన జీవితం గడపండి,దాతృత్వముతో ఉదారమైన జీవితం గడపండి. ఎదుటివారి గురించి అలోచించండి, వారిని ప్రేమతో చూడండి. అందరిపట్ల దయను కలిగి ఉండండి. ఆపై భగవంతుడి కి వదిలెయ్యండి.జీవితంలో అందరికన్నా ధనవవంతుడు అంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడు కాడు, ఎవరికైతే అతి తక్కువ డబ్బు కావాలో జీవించడానికి, వాడే ధనవంతుడు." అని ముగించారు.

(Original author : Unknown. Translated by me in telugu)

Friday, May 4, 2012

కలయా నిజమా..




శుక్రువారం సాయంత్రం స్నేహితురాలిని కలిసి డిన్నర్ చేసాక మళ్ళీ కలుద్దామని తనకి చెప్పి నేను కార్ దగ్గరికి రాగానే, ఏదో పాటల సీడి ఉంది ఇస్తాను ఉండు అని ఇచ్చింది. నేను డ్రైవ్ చేస్తూ సరే ఇచ్చింది కదా విందామని పెట్టాను. ఎందుకో రాత్రి 10:00 గంటలు దాటింది, రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ లేదు. ఎవో కొన్ని పాటలు వచ్చాయి, కొత్త సినిమాల్లోవే అనుకుంటా, ఇంతలో ఈ పాట మొదలయ్యింది.. కలయా నిజమా.. అంటూ.. ఈ పాట ఎవరు పాడారో, గొంతు చాలా బాగుంది అనుకున్నాను. పాట చాలా నచ్చేసింది నాకు. మళ్ళీ మళ్ళీ విన్నాను.సినిమా చూడలేదు కాని, హనుమంతుడు పాడిన పాట అని గ్రహించాను. కొన్ని నిమిషాల పాటు నా మనసు ఒక తెలియని పారవశ్యం తో నిండిపోయింది.ఇంటికి వచ్చాక ఏంటో దేవుడి పాట కదా, దాని మహిమ అనుకున్నాను.కాని అలోచిస్తే నేను పరవశించింది ఆ పాట సంగీతానికి, ఆ పాట పాడిన వారి గొంతులోని మాధుర్యానికే కాని,భక్తి పాట అని కాదేమో ? ఎదైతేనేంటి మంచి పాట విన్నాను కదా అనుకున్నాను.ఈ పాట పాడింది ఎవరో టిప్పు అట..ఇంతకు ముందు ఇంత మంచి పాటలు వచ్చాయో లేదో కాని ఈ పాట మాత్రం చాలా బాగా పాడాడు. సినిమాలో ఎలా చిత్రీకరించారో ఈ పాట.

కలయా నిజమా వైష్ణవ మాయా
అవునా కాదా ఓ ముని వర్యా
జరిగేదేదీ ఆపగలేను..జననీ వ్యధని చూడగ లేను.
కలయా నిజమా…

పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా.. 
సీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యా. 
సిరి మల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా.. 
ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా.. 
కడలే దాటి కలిపిన నేనూ ఇప్పుడూ ఈ తీరు కు ఏమైపోను. 
శ్రీ రామ ఆజ్ఞ ఎదురించ లేను
దారి ఏదీ తోచదాయే తెలుపుమయ్యా.



Wednesday, May 2, 2012

పిచ్చి- ప్రేమ



కొన్ని వేల సంవత్సరాల క్రితం,మనుషులు భూమి మీద లేని కాలం లో ధర్మము, అధర్మము భూమి మీద ఉండేవి. ఏమి చెయ్యాలో తెలియక, అలా తిరుగుతూ ఉండేవి.ఒకరోజు ధర్మము, అధర్మము బంధువర్గం తో ఒకచోట సమావేశం అయ్యినప్పుడు, చమత్కారానికి ఒక అలోచన తట్టి, అందరితో  అంది "మనం అందరము కలిసి దాగుడు మూతల ఆట ఆడదామా?" అని. అందరికి ఆ అలోచన నచ్చి అలాగే ఆడుకుందాము అని అనుకున్నారు. ఇంతలో పిచ్చితనం గట్టిగా అరిచింది "నేను లెక్క పెడతాను, మీరందరూ వెళ్ళి దాక్కోండి" అని. అక్కడ ఉన్న ఎవరికీ పిచ్చితనానికి ఉన్నంత పిచ్చి/వెర్రి లేనందువలన అందరు వెంటనే ఒప్పేసుకున్నారు. పిచ్చితనం ఒక చెట్టు చాటుకు వెళ్ళి " ఒకటి, రెండు, మూడు.." అని లెక్కపెట్ట సాగింది. అలా పిచితనం లెక్కపెడుతూ ఉండగా అందరూ వెళ్ళి దాక్కొన్నారు. కరుణ చంద్ర వంక యొక్క మొనలు కి వేలాడింది.ద్రోహం చెత్తకుప్పలో దాక్కుంది.మోహము మేఘాలలో కలిసిపోయింది. రసము భూమి మధ్యకు వెళ్ళి దాక్కొంది. అబద్దం  అందరితో ఒక రాయి వెనక దాక్కొంటానని చెప్పి కొలను లోకి వెళ్ళి దాక్కొంది. లోభిత్వము ఒక గోనె సంచి లో దాక్కొంది. పిచ్చితనం లెక్కపెడుతూనే ఉంది "డబ్బై తొమ్మిది, ఎనభై,ఎనభై ఒకటి..". ప్రేమ తప్ప అందరూ వెళ్ళిపోయి దాక్కున్నారు. ప్రేమకి ఎక్కడ కి వెళ్ళాలో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమౌతుంది. ఒకరకంగా మన అందరికీ ఇది ఏమాత్రం ఆశ్చర్యము కలగకూడదు, ఎందుకంటే ప్రేమను దాచడం అసాధ్యం కదా?  పిచ్చితనం గట్టిగా లెక్కపెడుతుంది, "తొంభై ఐదు, తొంభై ఆరు, తొంభై ఏడు ..." పిచ్చితనం "వంద" అని అనగానే హడావిడిగా గులాబి పొదలోకి వెళ్ళి దాక్కొంది ప్రేమ. పిచ్చితనం చెట్టు చాటు నుంచి వచ్చి "నేను వస్తున్నాను, వస్తున్నాను" అని అంది. అలా చెట్టు చాటు నుంచి రావడమే తరువాయి, ముందుగా సోమరితనం కనిపించింది. మనకు తెలిసిందే కద, సొమరితనం/బద్ధకానికి దాక్కునేంత శక్తి ఉండదు కదా..తరువాత ఒకరి తర్వాత ఒకరిని కరుణని, అబద్దాన్ని, రసముని, ద్రోహాన్ని, లోభిత్వము ను, అందరిని కనిపేట్టేసింది పిచ్చితనం, ఒక్క ప్రేమను తప్ప. పిచ్చితనం పట్టుదలగా వెతుకుతుంది ప్రేమని. ప్రేమను కనిపెట్టలేక అసహనం గా ఉంది పిచ్చితనం. 

ఓర్వలేనితనంతో అసూయ పిచ్చితనం చెవిలో గుసగుసలాడింది "నువ్వు కనిపెట్టాల్సింది ప్రేమని మాత్రమే, ప్రేమ గులాబి పొదలో దాక్కుని ఉంది వెళ్ళు" అని. పిచ్చితనం అసహనంగా ఒక కర్ర తీసుకుని గులాబి పొదను పొడవసాగింది. అలా పొడవగా పొడవగా, అకస్మాత్తుగా ఎవరిదో బిగ్గరగా ఏడుపు వినిపించింది.ప్రేమ గులాబి పొదలోంచి బయటకు వచ్చి తన ముఖము కనబడకుండా రెండు చేతులూ అడ్డం పెట్టింది.ప్రేమ రెండు కనులలోంచి రక్తం కారుతోంది. పిచ్చితనం ప్రేమను కనిపెట్టాలనే తొందరలో ప్రేమ రెండు కళ్ళను పొడిచేసింది. ఒక్కసారిగా అంతులేని దుఃఖము తో "అయ్యో , నేనెంత పని చేసానే" అని కుమిలిపోయింది పిచ్చితనం. "నేను నిన్ను అంధురాలిని చేసాను. ఇప్పుడు ఎలా?నీకు చూపుని ఎలా తిరిగి ఇవ్వగలను" అని బాధపడుతుంటే, ప్రేమ ఇలా బదులిచ్చింది. "నువ్వు పోయిన నా చూపుని తిరిగి ఎలాగూ నాకు ప్రసాదించలేవు.నిజంగా మంచి మనసుతో నాకు నువ్వు ఎమన్నా చెయ్యలనుకుంటే,ఈ రోజునుంచి నాకు దారి చూపించే తోడుగా ఉండు." అని అడిగింది.  ఆ రోజునుంచి, ప్రేమ గుడ్డిది కావడంతో తోడుగా ప్రేమను అంటిపెట్టుకుని ఉండిపోయింది పిచ్చితనం.

(Original author : Unknown. Translated by me in telugu)

అమెరికా చదువులు -2


"అత్తయ్యా, are you coming to my graduation?" ఐదు సంవత్సరాలు నిండిన నా మేనల్లుడు దగ్గరనుంచి ఫోన్."లేదు రా...sorry, ఇప్పుడు రాలేను, సమ్మర్ లో వస్తాను." అని చెప్పాను." మా friend వాళ్ళ  grand parents వస్తున్నారు, why can't you come అత్తయ్యా?" అని అడుగుతున్న వాడిని చూస్తే భలే ముచ్చటవేసింది. ఇంతకి వాడు ఈ సంవత్సరం kindergarten లో చదువు పూర్తిచేసుకుని, 1st gradeకి వెళుతున్నాడు. Kindergarten కి graduation ఏంటి అనుకుంటున్నారా? kindergarten పాస్ అయినందుకు ఆనందంతో చేసుకునే చిన్న celebration (kindergarten పట్టా తీసుకుంటాడు) అన్న మాట. ఇక్కడ kindergarten పూర్తి చేసాక ,elementary స్కూల్ అయిపోయాక (1-5/6), middle స్కూల్ అయిపోయాక (6/7-8),  high స్కూల్ అయిపోయాక (9-12) తప్పని సరిగా graduation అని ఒక event celebrate చేసుకుంటారు.వాటినే  kindergarten graduation అని,elementary స్కూల్  graduation అని,  middle  స్కూల్  graduation అని,high స్కూల్  graduation అని అంటారు. మా అమ్మాయి high స్కూల్  graduation కి అమెరికా లో ఉన్న బంధువర్గం అంతా రావటం జరిగింది. మా అమ్మాయి ఇండియా ఫోన్ చేసి "అమ్మమ్మ...నా graduation  కి రావొచ్చు కదా" అని అడిగింది. అమ్మ అడిగింది ఫోన్ లో "graduation  అంటే?" అని...మా అమ్మాయి  వివరంగా చెప్పింది. అమ్మ విస్మయం తో "ఎంటీ? intermediate పాస్ అయితే celebration? ఏమి సాధించావని తల్లీ? నువ్వు నిజంగా graduate అయిన రోజు వస్తాలే.ఇలాంటి వన్నీ వింటేనే చిరాకు" అని విసుక్కుంది అమ్మ.

ఇంక syllabus విషయానికి వస్తే k-5/6 syllabus అంతా kindergartenలో ఇలా ఉంటుంది. ఉదాహరణకి, లెక్కలు తీసుకుందాము. kindergarten లో syllabus  ఇలా ఉంటుంది. Number and Number Sense (Focus: Whole Number Concepts) ,Computation and Estimation (Focus: Whole Number Operations), Measurement (Focus: Instruments and Attributes),Geometry(Focus: Plane Figures), Probability and Statistics (Focus: Data Collection and Display),Patterns, Functions, and Algebra (Focus: Attributes and Patterning).
6th grade లో syllabus ఇలా ఉంటుంది. Number and Number Sense (Focus: Relationships among Fractions, Decimals, and Percents), Computation and Estimation (Focus: Applications of Operations with Rational Numbers),Measurement (Focus: Problem Solving with Area, Perimeter, Volume, and Surface Area),Geometry (Focus: Properties and Relationships),Probability and Statistics
(Focus: Practical Applications of Statistics),Patterns, Functions, and Algebra (Focus: Variable Equations and Properties).


Usefull links :
http://www.doe.virginia.gov/testing/sol/standards_docs/mathematics/index.shtml
http://www.doe.virginia.gov/testing/sol/standards_docs/english/review.shtml
http://www.doe.virginia.gov/testing/sol/standards_docs/science/index.shtml
http://www.doe.virginia.gov/testing/sol/standards_docs/history_socialscience/index.shtml

Kindergarten నుంచి elementary  స్కూల్ విధ్యార్ధులకు ఒకటే టీచర్ అన్ని subjects (English, Math, Science and Social Studies టీచ్  చేస్తారు. ఇంతకు ముందు పోస్ట్ లో వివరించినట్టు స్కూల్ లో GT curriculum కి వేరుగా టీచర్స్ ఉంటారు.అలాగే english/reading/math లో advanced గా ఉన్నవారికి వేరుగా టీచర్స్ ఉంటారు. ఇతర దేశాలల నుండి వలస వచ్చిన విధ్యార్ధుల english మాట్లాడడం, రాయడం , చదవటం కష్ట్టమైన వారికి విడిగా ESL (English as Second language)  టీచర్స్ ఉంటారు.  ఎక్కువ సాతం టీచర్స్ విధ్యార్ధులకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు అన్ని సబ్జెక్ట్స్ లోను.
ఈ లింక్ లో science  ప్రాజెక్ట్స్ చూడండి.

http://www.google.com/url?q=http://www.doe.virginia.gov/instruction/gifted_ed/project_promise/implementation/science_activities.doc&sa=U&ei=ZJahT7KIH4To9AT57ZnSCA&ved=0CBEQFjAGOBQ&client=internal-uds-cse&usg=AFQjCNGi-ZssDfI6b4uo_BSyoIgZZAA3Ew

ఇక k-2nd grade వరకు పరీక్షలు ఉండవు. 3rd grade లో స్టేట్ పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు public school,private school, home school  విధ్యార్ధులందరూ రాయాలి. కొద్దిమంది పిల్లలు స్కూల్ లో విధ్య అభ్యసించడం కన్నా వారి తల్లి తండ్రులు వారికి ఇంట్లోనే అన్ని subjects teach చేసి పరీక్షలు మాత్రం designated centers లో తీసుకుంటారు.(home schooling) .Usefull links :
http://www.doe.virginia.gov/testing/sol/released_tests/

4/5/6 grades నుంచి ప్రతి విధ్యార్ధి తప్పనిసరిగా string  లేదా band instruments  నేర్చుకోవాలి. వీటిలో లెవెల్స్ ఉంటాయి- symphony అన్నది advanced లెవెల్ అందులో. physical education కూడా k-5/6 తప్పని సరిగా ఉంటుంది.  Next పోస్ట్ లో, elementary school లెవెల్ లో math competitions ,Science competitions , PTA activities gurinchi, after school clubs, report cards and grading system  గురించి వివరిస్తాను.కొన్ని usefull links కూడా పోస్ట్ చేస్తాను.

GT test preparation links:
http://www.criticalthinking.com/getProductDetails.do?id=05241&code=c
(Building thinking skills books are good!)
http://www.mercerpublishing.com/

ఎక్కువ సాతం ఇంగ్లీష్ పదాలతో రాసిన ఈ పోస్ట్ చూసి నన్ను తిట్టుకోకండే..ప్రయత్నించాను పూర్తిగా తెలుగులో రాయాలని కాని నాకు చేత కాలేదు. మన్నించండి! (శర్మ గారు.. sorry అండి.)