Saturday, October 26, 2013

అద్భుత:



ఈ ప్రోడక్ట్ నింజంగా పై వీడియో లో చూపినట్టు పనిచేస్తే, మార్కెట్ ని స్వీప్ చెయ్యడం తధ్యం...
December 13th సింగపూర్ లో విడుదల.
సింగపూర్ వాసులు...కొనేసుకుని రివ్యులు రాసెయ్యండి.

Thursday, August 1, 2013

జావెద్ అక్తార్ గారి కవిత -మహేష్ బాబు గొంతులో...




మహేష్ బాబు తెలుగులో..

ఫరాన్ అక్తార్ హిందీలో..


ఎవరి కళ్ళలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో
ఎవరి మాట మన్ననగా ఉంటుందో
ఎవరి మనసు మెత్తగా ఉంటుందో
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో
ఎవరికి ఆడవాళ్ళంటే హృదయంలో అభిమానం,సమాజంలో గౌరవం ఉంటాయో
ఎవరు వాళ్ళ శరీరానికి,మనసుకు,ఆత్మకి విలువిస్తారో
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో
స్త్రీకి శక్తుంది,గుర్తింపుంటుంది,గౌరవం ఉండాలని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో
ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు,సహచరుడు,ఆత్మీయుడు
ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు…

(You can stop the song playing on this site, by scrolling down the page and clicking on pause button of the player.)

Thursday, July 25, 2013

దాంపత్యం



సుఖదుఖాలను పంచుకుంటూ,
సమస్యలను కలిసి ఎదురీడుతూ,
నిత్య కలహాలతో,
శ్రుతి మించని అలకలతో,
ప్రేమానురాగ ఆప్యాయతలతో,
ఒకరికొకరు తోడు-నీడ గా,బాసటగా,
ప్రాణస్నేహితులైన స్త్రీ, పురుషుల మధ్య బంధమే కదా...

కొన్ని వసంతాలు నిండిన దాంపత్యం!

Friday, July 19, 2013

శ్రీరస్తు.. శుభమస్తు...అని దీవించగలమా?

రోజులు మారాయి, రోజులు మారాయి, మారాయి... మారాయి ...
రోజులు మారాయి..

నిజమే! ఇలాంటి పెళ్ళిల్లు చూస్తామని ఒకప్పుడు అనుకోలేదు. ఇప్పుడు చాలా సాధారణమైన విషయమైపోయింది.మొదటిసారి నేను ఇలాంటి వివాహం గురించి విని ముక్కున వేలేసుకున్నపుడు అతి కటువుగా నన్ను విస్సుకున్నారొకరు..."You are ridiculous.Stop being a homophobe"  అని...

ప్చ్..ఏంటోముందు, ముందు మరి ఈ వివాహాలు మనుషుల మధ్యే జరుగుతాయో లేక ...oops! నేనేమి వ్రాయలేదు..మీరేమి చదవలేదు అంతే! మీరు కూడా నాకు నాలుగు అక్షింతలెయ్యకముందే, నేను ఈ కింద లింక్ మీకు కానుకగా ఇచ్చేసి, ముగించేస్తాను. 

http://stephgrantphotography.com/blog/shannon-seema-indian-lesbian-wedding-los-angeles-ca/
 

Tuesday, July 9, 2013

అలా చందమామనై...

మల్లెల తీరం లో సిరిమల్లెపువ్వు - నాలుగు పాటలు.


http://www.mediafire.com/listen/jsckc5pzmv9zavv/Alaa_Chandamaamanai.mp3

అలా చందమామనై ఇలా చేతికందనా
అలా చందమామనై ఇలా చేతికందనా
పాడి రోజు లాలిని, పంచుకోనా జాలిని 
పాడి రోజు లాలిని, పంచుకొనా జాలిని
గాలిలో కెరటమై ఎదే తాకనా
మల్లెల్లో మధువునై దరే చేరనా
సందె వెలుగుల చెలిమి తీరం పిలుపునై... రానా
అలా చందమామనై ఇలా చేతికందనా

http://www.mediafire.com/listen/b12jn3z31303fyv/04Mabbulu_Kurise_%5BSongsAp.com%5D.mp3

మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం,చినుకై రాలెను సంతోషం
తియ్యని తేనల సావాసం,తోడై దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం,సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే, మౌనం విరిసే, మది మురిసే
కన్నులు మెరిసే, వెన్నెల కాసే,ఎద ఎగసే

ఏ జన్మ కథ మళ్ళీ మొదలయి,నా జన్మ కదిలింది
ఆశగా నీతో అడుగేస్తుంటే,అణువణువూ అదిరింది
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
మమతల ముడిపడి,మురళిగ నిలబడి,మానస కోయిల కూసెనుగా
మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే

ఏ కొమ్మ తొలి సిగ్గుల మొగ్గై,ఏ చోట పూస్తుందో
ఉరికే వాగులు, పారే ఏరులు చేరే తీరాలేవో
తెలుసా వాటికి తమ తల రాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
తెలుసా వాటికి తమ తల రాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
పువ్వుల ఘుమఘుమ,మువ్వల సరిగమ
ఎవ్వరు ఆపినా ఆగవుగా
మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే

నా చూపులకు సోయగమిచ్చి నీ కంటి కళ వచ్చి
నువ్వే నేనని భావన చేస్తూ,నాతో నేను రమించి
చూసేదంతా సొగసనిపించి,చేసేవన్నీ నిజమనిపించే
చూసేదంతా సొగసనిపించి,చేసేవన్నీ నిజమనిపించే
గువ్వల కిళకిళ,నవ్వుల పరిమళ
మల్లెల తీరము కనిపించే
మల్లెల తీరము కనిపించే

మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే
మల్లెలు పూసే,మౌనం విరిసే, మది మురిసే
కన్నులు మెరిసే, వెన్నెల కాసే,ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం,చినుకై రాలెను సంతోషం
తియ్యని తేనల సావాసం,తోడై దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం,సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే, మౌనం విరిసే, మది మురిసే
కన్నులు మెరిసే, వెన్నెల కాసే,ఎద ఎగసే

http://www.mediafire.com/listen/j83wb9ybt8az1ad/02Nee_Needana_%5BSongsAp.com%5D.mp3


నీ నీడన ఇలా నడవనా
నీ నీడన ఇలా నడవనా
పరిమళించు పువ్వులాగ పలుకరించనా
చినుకు తాకు మొలక రీతి చిగురు తొడగనా
నీ పాటన సుధై పారనా
మనసు కోరు మల్లెనౌతు నేను నీలో కలసిపోనా

మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరస్సులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
 
తూరుపు వెలుగుల,పడమటి జిలుగుల పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుస్సున ఇద్దరమే
చీకటి నలుపున మనమే,చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు,అలసట ఎరుగని నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!

 
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
 
స్వఛ్చపు తొలకరి, వెచ్చని జల్లుల, పచ్చని కాంతులలో మనమే
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటలమనమే
నింగి నేల చిన్నబోయి రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతం ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియ కథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే

 
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరస్సులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా

(You can stop the song playing on this site, by scrolling down the page and clicking on pause button of the player.)

Friday, July 5, 2013

ఆశ్చర్యం..తెలుగు సినిమా కూడా బాగుంటుందా?



రోజూ వర్షాలు, అప్పుడప్పుడు తూఫానులతో  ఈ వేసవి ఒక ఊపు ఊపుతుంది  మా స్టేట్ ని....దానికి తోడు వేసవి సమయంలో అతిధుల రాక పోకలు. మాకోసమైతే వంట తప్పించుకునేందుకు ఎన్నో కారణాలు వెదికే నేను, అతిధులు వస్తే మాత్రం, రోజుకి మూడుసార్లు తప్పదు  కదా మరి వంట గదితో స్నేహం? ఇకపోతే  యంత్రాల మీదే కాక అప్పుడప్పుడు రోడ్డు మీద పకృతిని చూస్తూ పరిగెడుతూనో లేక నడుస్తూనో వేసవి కాలం గడపడం కూడా నాకు ఇష్టం. బ్లాగ్స్ చూసి, రాసి నెల పైనే అయ్యిందా అనిపించింది నాకు. ఇకపోతే ఈ వేసవి కాలం, కొద్దిగా సినిమాల జోరు కూడా బానే ఉందని చెప్పాలి. హిందీ లో ఒక అర డజన్ సినిమాలు,  ఇంగ్లీష్లో కొన్ని అవేశం గా చూసేసాను. ఇంటికి వచ్చిన అతిధులతో మరీ 24 గంటలు మాట్లాడాలి అంటే కూడా ఇబ్బంది కదండి. పదండి సినిమాకి, అని చెప్పి వరుసగా హిందీ , ఇంగ్లీష్ సినిమాలు చూపించేసాను. తెలుగు మాత్రం ఊహు... నా వల్ల కాదు అని ఒక్కటి కూడా చూడలేదు, చూపించలేదు. 

ఇదిలా ఉండగా, అతిధులు వెళ్లాక, మాకు ఈ స్వాతంత్ర దినోత్సవం సెలవలు వచ్చేసాయి. ఈ సంవత్సరం చాలామందికి 4 రోజులు సెలవలు వచ్చాయి. సాధారణం గా ఇలాంటి సెలవలు వస్తే నాకు  హాయిగా న్యు యార్క్ - Time square  వీధుల్లో ముఖ్యం గా రాత్రి సమయంలో నడుస్తూ గడపడం అంతే మహా ఇష్టం. ఇంకేంటి అడ్డం? మరి వెళాదామా అని ఇంట్లో ప్రశ్న...ఊహూ..లేదు ఈ నాలుగు రోజులు వర్షం లేకుండా ఉంటే  నాకిక్కడే  గడపాలని ఉంది అని సమాధానమిచ్చాను. ఇంతలో స్నేహితురాలు ఒక సినిమా trailer పంపింది చూడమని...అది తెలుగు సినిమాది అని చూసి, పెదవి విరిచి, చూసాలే అని స్నేహితురాలికి సమాధానమిచ్చాను. నచ్చలేదా trailer అని మళ్ళీ ప్రశ్న. సరిగ్గా చూడలేదు, చూసి చెపుతానని దాటేసాను సమాధానం. తప్పకుండా చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 


అంతగా చెప్పింది కదా అని సినిమా పేరేమిటా  అని వివరంగా చూసాను. ఒక చిన్న shock! "మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు" ....ఇదేంటి ఇలాంటిదే మొన్నీమధ్య ఒక తల తిక్క సినిమా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అని కదా వచ్చింది? ఆ సినిమాకి వచ్చిన హైప్ చూసి వెళ్ళి ఎంతో నిరుత్షాహపడడం నాకింకా గుర్తే....ఆ సినిమాకి పేరడీ అయ్యి ఉంటుంది, అని విరక్తి కలిగి, తెలుగు డైరక్టర్లను , వారు ఎంచుకుంటున్న ఈ సినిమా టైటిల్స్ కి ఒక నమస్కారం పెట్టి ఆ trailer చూడకుండా కసిగా స్నేహితురాలు పంపిన ఇమైల్ మూసేసాను. 

మళ్ళీ మరునాడే ఫోన్..."సినిమా కి వస్తావా , వెళదాము ఈ రాత్రి"  అని. "అయ్యబాబోయి నా వల్ల కాదు తల్లీ , నీకో దండం నన్ను ఒదిలెయ్యి ఈ సారి"అని బతిమాలాను. "అర్ధం అయ్యింది.. తమరు trailer చూడలేదు .....ముందు వెళ్ళి trailer చూడు. నీకు నచ్చుతుంది అని నాకు గొప్ప నమ్మకం" అంది. తప్పేట్టు లేదురా భగవంతుడా అని trailer చూసాను. నిజమే చాలా బాగుంది అనిపించింది. ముగ్గురి వ్యక్తుల కథ లా అనిపించింది. మనసులో చిన్న ఆశ, బాగుంటుందేమో అని...,వెంటనే తెలుగు సినిమాల మీద అంతకు ముందు ఏర్పరుచుకున్న బలమైన అభిప్రాయం ముందు ఆ చిన్న ఆశ సన్నగిల్లిపోయింది. అసలు ఏమాత్రం ఆశించకుండా, స్నేహితురాలి బలవంతం మీద వెళ్ళి ఈ రోజు చూసాను ఆ సినిమా.... "మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు" 

                   http://www.youtube.com/watch?v=LDCj7Zxs-y0
సినిమా పూర్తయ్యేటప్పటికి, మనసంతా ఆనందం... ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక "అందమైన కవిత" అని చెప్పాలి. ఈ సినిమా కథ మూడు ముక్కల్లో చెప్పొచ్చు... కాని సినిమా తీసిన విధానం, పాటల చిత్రీకరణ,సినిమాలో ప్రతి ఫ్రేం ఎంతో అందం గా ఒక చక్కటి గ్రీటింగ్  కార్డ్ లా ఉంటుంది. సున్నితమైన సంభాషణలు, సున్నితమైన భావాలు ఎంత అందంగా తెరకెక్కించాడో ఆ దర్శకుడు. ఇది అని చెప్పలేని భావమేదో నన్ను ఊపేసింది. వెరసి ఈ రోజు నేను చూసిన సినిమా ఒక గొప్ప కావ్యం అని అంటే అతిసయోక్తి కాదేమో!!!!!



ఇకపోతే ఈ సినిమా విజయవంతమయ్యే అవకాశం చాలా, చాలా తక్కువ. మగవారు  80% ఈ సినిమా లో ఎక్కువ సేపు కూర్చోలేరు...ఎందుకంటే  సున్నితమైన మనసున్న మగవారు చాలా తక్కువ కదండి? అమ్మాయి తన మానసిక సంఘర్షణ, తన ప్రేమ, తన భర్త గురించి మనకి చెపుతుంటే .......అలా రెండు గంటలు ఎలా గడిచాయో తెలియలేదు నాకు. పాటలన్ని ఎంతో బాగున్నాయి. పాత్రలు పోషించిన వారందరు చాలా బాగా చేసారు. ముఖ్య పాత్రలు మూడు. తండి పాత్ర, అక్క పాత్ర వేసిన వారు కూడా చాలా బాగా చేసారు. సినిమా అంతా కథ మీదే ఉంటుంది. Absolutely no commercial elements at all. అసలు deviation అన్నది లేదు story line నుండి..... నాకు effective gaa చెప్పటం చేతకాలేదనిపిస్తుంది...కాని మొత్తానికి తెలుగు సినిమా కూడా బాగుందండోయి అని గర్వం గా చెప్పుకోగలను అనిపించింది. మీరెవ్వరైనా ఈ సినిమా చూస్తే మరి మీ అభిప్రాయాలు పంచుకోవడం మరచి పోకండి. ఇంకెవ్వరైనా ఈ సినిమా రివ్యు  అందం గా రాస్తే చదవాలని కూడా ఉందండోయి.

Tuesday, June 18, 2013

ఒక సాయంత్రం!

Pic source : Google images

సాయం సమయం. వర్షం జోరుగా పడుతుంది.ఈ మధ్య చెప్పా పెట్టకుండా ముంబాయి మహానగరం లో వాన కురిసినట్టు,మా ఊరిలో కూడా ఎప్పుడు వాన పడుతుందో,ఎప్పుడు సూర్య భగవానుడు కరుణిస్తాడో చెప్పడం కష్టం గా ఉంది.అలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను.రేడియో లో ఏదో చెత్త ప్రోగ్రాం వస్తుంది.ఈ మధ్య కొన్ని అంతర్జాల రేడియో ప్రొగ్రాంస్ వింటుంటే ఎందుకో అసలు నచ్చటం లేదు. RJ చేసేవారు,వారికి కాల్ చేసేవారు కూడా...అయినా మధ్యలో నాకెందుకు,రేడియో ఆపేస్తే పోలా?అనుకుని ఆపేసాను. అలోచనలు మళ్ళీ నన్ను చుట్టిముట్టాయి.వర్షం అంటే చిన్నపటి నుంచి నాకు చాలా ఇష్టం. వర్షంలో తడుస్తూ,బాల్యం లో ఆడుకున్న ఆటలు మరచిపోగలమా?

ఇంటికి చేరుకునేసరికి వాన తగ్గు ముఖం పట్టింది.ఇంట్లోకి వస్తూనే వేడి గా టీ పెట్టుకుని అలా సన్నటి వాన తుపర పడుతుంటే,కిటికిలో నుండి ి చూస్తూండిపోయాను.Gym ఎలాగు ఎగ్గొట్టాను కదా అని, అమ్మాయిని పిలిచి "వాక్ కి వెళదామా" అని అడిగాను."అమ్మో, నువ్వు వాక్ అని నన్ను కనీసం మూడో నాలుగో  మైల్స్  నడిపించేస్తావు..నేను రాను పో"అని సమాధానం వచ్చింది."అలా కాదు రా...నా మాట వినవు?ఈ రోజు నాకు తోడు ఎవ్వరు లేరు..ప్లీస్ రావా"అని బతిమాలడం మొదలుపెట్టాను.విసుగ్గా నా వైపు ఒక చూపు చూసి"నా వల్ల కాదమ్మా..ప్లీస్"అంది.అలోచించాను,టాలివుడ్ సినిమాలు చూడకపోయినా, తనకి ఉన్న బాలివుడ్ సినిమా మోజు నాకు ఆ క్షణం లో గుర్తుకు రావడంతో, నన్ను నేనే మెచ్చుకుని,ఇదిగో ఆ "జవాని..." అని ఏదో సినిమా ఈ శుక్రువారం వెళ్ళాలని అన్నావు కదా..నువ్వు ఇప్పుడు వాక్ కి రాకపోతే నేను సినిమాకి రాను...అంతే ఫైనల్...డిసైడ్ చేసుకో"అని వార్నింగ్ ఇచ్చేసాను.నా పాచిక తప్పక పారుతుందని వాకింగ్ షూస్ వేసుకోసాగాను."నువ్వేమి రానక్కర్లా..నా ఫ్రెండ్ జేనీ వస్తానని చెప్పింది..నువ్వు వెళ్ళు, నేను రాను" అని తెగేసి చెప్పింది. "ఔరా...ఆ జేనీకి ఏమర్ధమవుతుంది?డబ్బు దండగ"అని విసుక్కున్నాను.ముసి ముసి నవ్వులు నవ్వుతూ,"సబ్ టైటిల్స్ ఉంటాయిగా...అయినా పిచ్చి అమ్మా...ప్రేమ చిత్రానికి భాషతో సంబంధం ఉండదుగా...అలా అర్ధమయ్యి పోతుందంతే!"అని సమాధానం వచ్చింది.

 


ఇప్పుడెలా? ఒంటరిగా వెళ్ళచ్చు...కాని  ఎవరిదన్నా బుర్ర  తింటూ నడవటం లో ఆ హాయి వేరే కదా?స్నేహితురాలిని పిలవనా అనుకుంటు,ఇంతలో నా పెద్దరికం నన్ను ప్రశ్నించింది,"తల్లి మాటకు ఎదురు చెపుతుందా?రమ్మంటే కిక్కురుమనకుండా రావాలా వద్దా?మా చిన్నపుడు పెద్దవారు చెప్పిన మాటకి ఎదురు చెప్పామా?(అంటే డూ డూ బసవన్నలా తలాడిస్తూనే,ఎదురు చెప్పకుండా..వారు చెప్పినట్టు కాక, నా మనస్సు కి నచ్చినట్టే చాలా సార్లు నడుచుకున్నాననుకోండి.అయినా అవన్ని బయటికి చెప్పము కదా...). ఆఖరి అస్త్రం ప్రయోగించాను."అయినా ఈ మధ్య నువ్వు నా మాట వినటం లేదు,నా దగ్గర ఉండేదే మొక్కుబడిగా  మూడు లేదా రెండు వారాలు..ఆ కొద్ది రోజులు కూడా నాతో సమయం గడపవా..పోన్లే నీ ఇష్టం" అంటూ,వీధి గుమ్మం తలుపు తీసాను.నాకు తెలుసు విసవిసలాడుతూ నా వెనకాలే వస్తుందని.అనుకున్నట్టుగానే"వస్తున్నానుండు"అని ఒక అరుపు అరిచింది నా చెవులు చిల్లులు పడేలా.విజయగర్వంతో నవ్వుకున్నాను.ఈ తరం పిల్లలు మాట విననట్టే వుంటారు, కాని ప్రేమకి లొంగకుండా ఎక్కడికి పోతారు? 

ఇద్దరము జంటగా వీధిలో కి అడుగు పెట్టాము.ఇంతలో వాన చినుకులు మా మీద పడ్డాయి. వెంటనే అమ్మాయి "వాన పడుతుంది, వెనక్కి వెళదాము పద"అంది.ఆకాశం వైపు చూస్తూ నేను"లేదు,ఈ వాన ఎంతో సేపు ఉండదు, పైగా ఇంతకంటే జోరుగా కూడా కురవదు.నువ్వేమి మొక్క మొలిసిపోవు ,పద నడుద్దాము" అన్నాను. "నీకేమన్నా పిచ్చా?ఎవరన్నా వానలో వాకింగ్ చేస్తారా"అంటూ ప్రశ్నించింది.ఎవరు చేసినా,చెయ్యకపోయినా మనం చేద్దాము,వాన చినుకులు ఇలా మనల్ని చక్కగా ముద్దాడుతుంటే హాయిగా లేదు?"అన్నాను ఆ వాతావరణానికి మైమరిచిపోతు.వెంటనే సమాధానమోచ్చింది,"జలుబు చేస్తుంది, I don't want to catch cold" అని."ఈ మాత్రానికి జలుబు చెయ్యదు, ఛలో" అని తన చెయ్యి పట్టుకుని వాకింగ్ కి వెళ్ళిన ఇద్దరము గంటన్నర తరువాత ఇల్లు చేరుకునేసరికి మా బట్టలు వర్షం వలన పూర్తిగా తడిచిపోయాయి.ఇంట్లో శ్రీవారిని చూసి కబుర్లలో పడిపోయింది అమ్మాయి.నాకు మాత్రం ఆ వర్షం లో తడుస్తూ,అమ్మాయితో చిన్ననాటి కబుర్లు చెబుతూ,జీవితాన్నిఇప్పుడిప్పుడే చూస్తున్నా దాని మాటలు వింటూ,అపుడప్పుడు కొన్ని ఉచిత సలహాలేవో పాడేస్తూ,ఇరువరం కలిసి నడిచిన ఆ వాక్ మాత్రం గుర్తుండిపోతుంది.

Saturday, May 11, 2013

మాతృమూర్తులందరికీ వందనం!




మాతృదినోత్సవం సంధర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు!



నాకు జన్మనిచ్చి,నా చేయి పట్టుకుని నడిపించి,
విధ్యావంతురాలిని చేసి,
నా జీవితపు ప్రతి మలుపులోను నాకు మార్గదర్శకురాలిగా నిలిచి,ఈ రోజుకీ నా గురించే అలోచించే మా అమ్మకి వందనం!  

Wednesday, May 8, 2013

అమెరికా చదువులు-8

 
High school అనగానే,విధ్యార్ధులు చాలా మంది వారు తీసుకున్న AP subjects గురించి తరుచుగా మాట్లాడుకోవటం,అవి ఎంత కష్టంగా ఉన్నాయో,మంచి గ్రేడ్స్ వస్తాయో రావో,Final exam  లో 5 రాదేమో,4 వస్తే కాలేజ్ క్రెడిట్ వస్తుందా...ఇలా ఎన్నో ప్రశ్నలు. AP-Advanced Placement  అని అర్ధం. ఇంకా వివరం గా చెప్పాలంటే, ఈ AP subjects తీసుకోవటం వలన, High school  లో GPA  పెరగడమే కాక, college లో కొన్ని credits వస్తాయి కనక,విధ్యార్దులకు college  లో కొద్దిగా load తగ్గి, advanced subjects  తీసుకోవచ్చు.అన్నిటికీ pros and cons ఉన్నట్టే,AP Subjects ఎక్కువగా తీసుకున్న విధ్యార్దులకు high school లో GPA దెబ్బతినచ్చు.అందుకని సరిగ్గా balance చేసుకుని ఎన్ని subjects handle చెయ్యగలరో అన్నేsubjects తీసుకోవాలి. Ivy leagues  లో admission ki కావాల్సినది, all A's (చాలా వరకు, ఒకటో ఒకటో రెండో నాలుగు సంవత్సరాలలో B+ పడితే ఫర్వాలేదు), competitive SAT score (To be frank more than 2350, for some colleges may be between 2330-2350),excellence in one of the EC activity.
 
నాకు తెలిసిన ఇద్దరు విధ్యార్ధుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.ఇద్దరు ప్రాణ స్నేహితులు.ఒకరు అమెరికన్,ఒకరేమో మన తెలుగు అమ్మాయి.ఇద్దరు చిన్నపటినుంచి చాలా శ్రద్దగా చదువుకుని అన్ని గ్రేడ్స్ లోను ఒకరితో ఒకరు పోటీగా చదువుకుంటూనే,ఒకరికొకరు తీసిపోకుండా,వారి స్నేహాన్ని నిలుపుకుంటూ వచ్చారు. High school కి రాగానే తెలుగు విధ్యార్ధి middle school varaku వరకు తను ఎంతో బాగా play చేసే Flute classes ఆపేసింది.High school  లొ Band/Music తీసుకోలేదు.అమెరికన్ విధ్యార్ధి chorus classes continue చేసింది.తెలుగు విధ్యార్ధి music కి బదులు computer science classes తీసుకుంది  9th grade లో.ఇద్దరికి ఎందరో విధ్యార్ధులు కోరుకున్నట్టే Ivy leages లో చదువుకోవాలనే కోరిక. 9th grade లో తీసుకోవాల్సినవి 7 subjects మాత్రమే అయినా,తెలుగు విధ్యార్ధి ఎలాగు computer science classes తీసుకున్నాను కదా అని ఆ విధ్యార్ధి ఆ సంవత్సరం తనకి తాను గా AP బుక్ ఒకటి కొని తెచ్చుకుని ap computer science B exam కి (school లో చదివే 7 subjects  కాకుండా 8th subject  గా చదివి పరీక్ష రాసింది.చక్కగా 5 (highest possible score) తెచ్చుకుంది.అన్ని subjects లో 'A' grades తెచ్చుకుంది. అమెరికన్ విధ్యార్ధి కూడా అన్ని subjects తెలుగు విధ్యార్ధి తీసుకున్నవే చదివినా,computer science subject  కాకుండా chorus(music/chorus) class తీసుకుని  అన్ని subjects లో 'A' grades తెచ్చుకుంది.

ఇంతవరకు అంతా బానే ఉంది.flute classes తీసుకోకపోతే పోన్లే...చక్కగా ఒక AP subject అందునా అతి కష్టమైన లెవెల్ subject పూర్తి చేసేసానే అని ఆనందపడింది తెలుగు విధ్యార్ధి.10th grade లో మళ్ళీ ఇద్దరు విధ్యార్ధులు అన్ని subjects కలిసి తీసుకున్నా, chorus advanced  లెవెల్ అమెరికన్ విధ్యార్ధి తీసుకుంటే,తెలుగు విధ్యార్ధి 9th grade లో basic biology subject  తీసుకుంది కాబట్టి ,10th లో AP biology తీసుకుంది.ఇదే కాక, అసలే సొంతం గా AP subjects  రాసిన అనుభవం ఉంది కనక, school లో తీసుకుంటున్న 7 subjects మాత్రమే కాక,AP environmental science అనే subject  కి బుక్ కొనుక్కుని చదవటం మొదలుపెట్టింది.ఇక్కడ ఒక విషయం చెప్పాలి.ప్రతి సంవత్సరం high school లో ఒక science subject తీసుకోవటం compulsory.9th లో biology,10th లో chemistry,11th లో physics.ఇక 12th లో అన్ని science subjects (high school level) వి చదివేసారు కాబట్టి,విధ్యార్ధులకు నచ్చిన ఏదన్నా ఒక science subject లో AP level subject తీసుకోవడం జరుగుతుంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,తెలుగు అమ్మాయి 10th grade లో 3 science subjects  (Chemistry,AP Biology,AP Environmental science),ఒక math subject,ఒక language,ఒక social sciences subjects తీసుకుంది.అమెరికన్ విధ్యార్ధి ఒక్కటే science subject(chemistry) తీసుకుంది.Final results వచ్చాయి...ఇద్దరికి అన్ని subjects లోను A's. అనందపడ్డారిద్దరు.తెలుగు అమ్మాయి రాసిన రెండు AP subjects లోను మళ్ళీ చక్కగా 5 తెచ్చుకుంది.అమెరికన్ అమ్మాయి  GPA కన్నా, తెలుగు అమ్మాయి GPA కొద్దిగా ఎక్కువ సాధించగలిగింది.10th grade చివరలోనే వారిద్దరు SAT-Math 2  పరీక్ష రాసి 800 (/800) తెచ్చుకున్నారు.తెలుగు విధ్యార్ధి SAT-Biology exam కూడా రాసి 780 (/800) తెచ్చుకుంది.

ఇద్దరికి అప్పటికే 16 సంవత్సరాల వయస్సు కాబట్టి,ఇద్దరు summer లో internships కి apply చేసారు.Apply చేసే టైం కి తెలుగు విధ్యార్ధి మూడు college level subjects (AP subjects) complete చెయ్యడం వలన,NIH (National institute of health)  లో ఒక scientist, biology + computer science combination లో విధ్యార్ధి కోసం వెతకడం,అతనికి ఎవ్వరు ఆ specific combination తో దొరకపోవడం వలన,తెలుగు అమ్మాయి resume చూసి, impress అయ్యి తనకి internship offer చెసారు. అమెరికన్ విధ్యార్ధికి internship ఎక్కడా దొరకకపోవడం వలన, biking.hiking చేస్తూ రిలాక్ష్ అయ్యింది.ఇక తెలుగు అమ్మాయికి internship offer తో నెలకి $1740.00 pay.రెండున్నర నెలలు ప్రతి రోజు,గంట నలభయ్యి ఐదు నిమిషాలు ప్రయాణం చేసి NIH కి వెళ్ళి పని చెయ్యడమే కాకుండా ఒక్కోరోజు గంటల తరబడి modelling చేస్తూ summer గడిపింది.ఒక్క శనివారం,ఆదివారం తప్ప  ఆ విధ్యార్ధికి relax అయ్యే టైం కూడా లేకుండా పోయింది.

Summer లో తెలుగు విధ్యార్ధి పని చేస్తున్నlab లో ఇంకో విధ్యార్ధి ఇలా చెప్పాడు.ఎలాగూ నువ్వు 3 AP subjects complete చేసేసావు కదా, 11th లో మిగతా నాలుగు చదివేసి అన్నింటిలోను high score (5) తెచ్చుకుంటే  Siemens award ఇస్తారు.ఆ award (http://www.siemens-foundation.org/en/advanced_placement.htm) admissions కి బాగా సహాయపడుతుందని చెప్పడం జరిగింది.అసలే AP subjects  మత్తులో వుందేమో తెలుగు విధ్యార్ధి వెంటనే అలోచించింది.తను ఎలాగూ 11th లో basic physics classes తీసుకోవాలి.ఒకవేళ అది skip చేసి direct గా AP Physics తీసుకుంటే?అప్పుడు AP chemistry,AP Calculus BC,AP Physics school లో 7 subjectsలో భాగం గా తీసుకుని, ప్రతి సంవత్సరం లాగా, ఒక AP subject(AP Statistics)  తనకి తాను సొంతం గా చదివేస్తే పోలా అనుకుంది.అనుకున్నట్టుగానే మూడు AP subjects 11th లో తీసుకుంది,వాటికి తోడు 11th లో అందరు తీసుకునే AP US History కూడా తీసుకుంది.అమెరికన్ విధ్యార్ధి మాత్రం ఆ సంవత్సరం AP chemistry, AP Calculus BC , AP US History  తీసుకుంది.అదే సంవత్సరం చివరన వారిద్దరు ఇంకో రెండు SAT Subject tests,SAT exam కూడా ఇవ్వవలసి ఉంది.

అంతకు ముందు రెండు సంవత్సరాలు చాలా కట్టినమైన courses తీసుకోవడం,summer లో కూడా తీరిక లేకుండా పని చెయ్యడం,ఇక 11th లో అంతులేని భారం మొయ్యడానికి ప్రయత్నించడం...తెలుగు అమ్మాయి రాత్రి పగలు చదివినా,ఒక్క నిమిషం వృధా చెయ్యకపోయినా "A" grade రావడం చాలా subjects లో కష్టమైపోయింది.అప్పటి వరకు ఎప్పుడు "A" తప్ప ఇంకో grade చూదని విధ్యార్ధి కనుక,చాలా క్రుంగిపోయింది.Basic physics స్కిప్ చెయ్యడం వలన,AP Physics లో ఆ అమ్మాయి చాలా కష్టపడాల్సి వచ్చింది.దీనికి తోడు,ఆ సంవత్సరం పలు competitions కి prepare అయ్యి,అన్నింట్లోను awards కూడా తీసుకుంది.అమెరికన్ విధ్యార్ధి క్రితం సంవత్సరాలతో పోల్చుకుంటే,కష్టమైన  subjects తీసుకున్నపటికి,అన్ని subjects లో మంచి మార్కులు తెచ్చుకుని అన్నింటిలోను "A" grades తెచ్చుకోసాగింది.సంవత్సరం చివరకు,తెలుగు విధ్యార్ధికి అన్ని subjects లో B+/B' grades,ఒక్క math లో తప్ప. SAT-Chemistry లో మాత్రం 800 సంపాదించుకుంది.SAT లొ 2350 తెచ్చుకుంది.అమెరికన్ విధ్యార్ధికి SAT-Chemistry లో 780, SAT లో 2375 తెచ్చుకుంది.ఇక AP subjects పరీక్షల్లో తెలుగు విధ్యార్ధి ఒక్క AP Calculus BC  (5/5)  లో తప్ప అన్నింటిలోను 4 (/5) మాత్రమే తెచ్చుకోగలిగింది.ఫలితం తనకి Siemens award రాలేదు. అన్ని science and math subjects లోను 5 score  చెయ్యగలిగితే మాత్రమే ఆ award వస్తుంది.

తెలిసిన వారందరు తెలుగు విధ్యార్ధికి ధైర్యం చెప్పారు.నీ GPA కొద్దిగా తక్కువైతే అయ్యింది,నీకు competitions లొ awards ఉన్నాయి,నువ్వు science and math subjects లో అన్ని AP's complete చేసావు.5/5 మూడు subjects లోనే కదా రానిది.4  తక్కువ score కాదు. నీకు ఒక -prestigious institute లో internship ఉంది.నీకు తప్పకుండా Ivy's లో admission వస్తుంది అని చెప్పారు.మళ్ళీ 11th summer అంతా కష్టపడి పని చేసింది NIH లో తెలుగు విధ్యార్ధి. అమెరికన్ విధ్యార్ధి internship దొరకకపోవడం వలన,7,8th grades విధ్యార్ధులకు math & science  tutoring  చేసేది.Robotics competition లో award సంపాదించుకుంది అమెరికన్ విధ్యార్ధి.12th  లో colleges కి apply చెయ్యడం,అమెరికన్ విధ్యార్ధికి 4 Ivy's లో admission రావడం,తెలుగు విధ్యార్ధికి ఒక్క Ivy లో కూడా admission రాలేదు.తెలుగు విధ్యార్ధి,ఆ అమ్మాయి తల్లితండ్రులు పడ్డ బాధ వర్ణాతీతం...నేను కూడా ఎంతో కష్టపడి చదివాను,నా తప్పేంటి.You have to challenge yourself with most difficult curriculum అని కదా అంటారు అందరు teachers......where did I go wrong  అని అడిగితే సమాధానం దొరకలేదు.చివరకు ఎందరో analysis చేసి తేల్చిందేమిటంటే Ivy's would like to see all A's -no compromise on that! Student's subject level difficulty చూడరా అంటే ఏమో! కాని ఎన్నో private schools  లో full scholarship తో తెలుగు విధ్యార్ధికి admission ఇచ్చారు.తనకు నచ్చిన ఒక పేరున్న private school లో full  scholarship తో చదువుకుంటుంది.అమెరికన్ విధ్యార్ధి తనకు నచ్చిన Ivy లో full fees కట్టి చదువుకోసాగింది.ఇద్దరు ఇప్పటికి స్నేహితులే... కాని  ఒకటే college కి వెళ్ళాలన్న వారి కోరిక మాత్రం తీరలేదు.

అందుకని take it easy on AP subjects అని అందరికి చెపుతారు నాకు తెలిసిన వారు ఎంతో మంది.ఎంత load handle చెయ్యగలిగితే అన్ని subjects  మాత్రమే తీసుకుని,mainly stress releief అవ్వడానికి చక్కగా music claasess or any fun activities కి  టైం spare చేసుకుంటూ, high school subjects plan చేసుకోవాలి విధ్యార్ధులు.


Tuesday, April 30, 2013

జిందగీ నా మిలేగి దుబారా





ఉదయమే ఒక ఫోన్ కాల్!
"జిందగీ నా మిలేగి దుబారా" అని నువ్వు నమ్ముతావా?
"అదేమి ప్రశ్న? సంగతేంటో చెప్పు", విసుక్కున్నా నేను.
"నమ్ముతావా లేదా? అ ప్రశ్నకి జవాబు చెప్పు...."
"ఉదయమే ఆ చెత్త ప్రశ్నలేంటి.."అన్నా విసుగ్గా...
పోనీ కనీసం దీనికి జవాబు చెప్పు..."జిందగీ నా మిలేగి దుబారా సినిమా చూసాము కదా? ఆ సినిమా నీకు నచ్చిందా లేదా? "
"ఈ మధ్య చూసిన ఏ సినిమా కథ గుర్తుకు ఉండటం లేదు,కాని ఒక్కటి మాత్రం చెప్పగలను,ఆ సినిమా మాత్రం గుర్తుండిపోయింది...చక్కగా మూడు గంటలలో ప్రపంచమంతా చూపెట్టారు కదా.."అన్నా గుర్తు తెచ్చుకుంటూ...
"అవును , ఇంకేమి నచ్చాయి ఆ సినిమాలో ..."అవతల వైపు నుండి ఆసక్తి గా ఇంకో ప్రశ్న.
"అదేదో టొమేటో ఫెస్టివల్ అని టొమేటోలు  ఒకరిపై ఒకరు విసురుకునే సరదా సంబరం,బుల్ రున్ ఇంకా.."అంటూ మాట్లాడుతున్న నన్ను ఆపి
"ఆగక్కడ...మరి ఒకవేళ మనం కూడా అలా ఒక బుల్ రున్ కి, టోమేటో ఫెస్టివల్ కి వెళితేనో? " అంటూ ఒక ప్రశ్నార్ధకం
"సర్లే....నాకిప్పుడు Spain వెళ్ళే ఓపిక లేదు...తీరిక లేదు.."అంటూ కొట్టిపారేస్తుండగా...
"మరి అదే, వినాలి కదా నేను చెప్పేది పూర్తిగా...."
"ఊ ఊ, చెప్పు ...."
"ఈ ఆగస్ట్ లో మనకి దగ్గరలోనే మనం కూడా ఈ ఫెస్టివల్ సెలెబ్రేట్ చేసుకుంటున్నాము.ఇంచక్కా బుల్స్ తో  పరిగెట్టచ్చు...టొమేటోలతో కొట్టుకోవచ్చు...నువ్వు చెయ్యవలసినదల్లా,టికట్స్ కొనడమే ఆ ఈవెంట్ కి...."అంటూ వచ్చింది సమాధానం...
ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది...పొద్దున్నే భలే వార్త వచ్చిందే అనుకుంటూ
ఇమైల్ చూసుకున్నా....ఈ రెండు లింక్స్ ఉన్నాయి...


వేంటనే తిరిగి రిప్లై కొట్టా ఆ ఇమైల్ కి ...."Hritik Roshan వస్తున్నాడా లేదా? "అంటూ..
ఇంకా ఈ ప్రొగ్రాం కి వెళదామన్న వారందిరికి ఇంకో కండిషన్ పెట్టేసాను పనిలో పనిగా...,ఆగస్ట్ వరకు అంటే ఇంకా మూడు నెలలు ఉన్నాయి కదా....ఒక రెండు 5k రన్స్, ఒక 10k  రన్ రిజిస్టర్ చెయ్యండి, అప్పుడు ఆ బుల్ రన్ ఈవెంట్ లో మనం బాగా పరిగెట్టగలమేమో అని.." 

Friday, April 26, 2013

ఆ హక్కు మీకు లేదు!-ముగింపు




సందీప్ చెప్పినదంతా విన్న సుభద్ర నిశ్చేష్టురాలయ్యింది.కొద్ది సేపు వరకు ఎలా స్పందించాలో తెలియక,మౌనంగా సందీప్ ని చూస్తు ఉండిపోయింది.సందీప్ అక్కడనుంచి లేచి వెళ్ళిపోయాడు.సుభద్ర వెంకట్ ని అడిగింది,"గీతతో మాట్లాడాలి"అని."నేను కూడా తనతో మాట్లాడలేదు ఇంతవరకు,వెళదాము పద"అని సమాధానమిచ్చాడు వెంకట్.ఇద్దరు కలిసి లివింగ్ రూం లో కి వెళ్ళి సురేష్ తో అన్నారు"మేము గీతను కలవాలి.మీ ఇంటికి వెళదామా"అని.సురేష్ అలాగేనని"పదండి"అన్నాడు.గీత నాన్నగారు కూడా వారితోటి కారులో కూర్చున్నారు.రాహుల్ తో చెప్పింది సుభద్ర" Please take care of Sandeep"అని.

సురేష్ ఇంటిలో గీత పరిస్థితి కూడా ఏమీ బాలేదు.రాత్రంతా నిద్ర లేమితో,బాగా ఏడ్చినట్టుగా  ఉంది మొఖం.గీతని చూస్తూనే అంది సుభద్ర "గీతా, ఏంటిదంతా?అసలు నువ్వేం చేసావో ఆవేశంలో తెలుసా?"అంటూ ప్రశ్నించింది.అక్కడే ఉన్న గీత అమ్మగారు,"మీ తమ్ముడు చేసిన నిర్వాకం మీకు తెలీదా?అమ్మాయిని ప్రశ్నించటానికి వచ్చారా?"అంటూ ఎదురు ప్రశ్న వేసారు"తమ్ముడితో మాట్లాడే వచ్చాను.జరిగినదంతా తెలుసుకున్నాను.ఎందుకు జరిగింది,ఎలా జరిగింది,ఎవరిది తప్పు అన్న విషయాలు చర్చించుకోవడం కన్నా,ఇప్పుడు మనం పెద్దవారిగా చెయ్యవలసినదేంటి వీరిద్దరిని కలపటానికి అన్న విషయం గురించి అలోచించాలండి."అని నెమ్మదిగా జవాబు ఇచ్చింది సుభద్ర.గీత నాన్నగారు కూడా వెంటనే"అమ్మాయి మీద చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది.ఇంత దూరం రాకుండా ఉండేది కదా"అని అన్నారు.వెంకట్ దురుసుగా"అంటే,చెయ్యి చేసుకున్నాడని కాప్స్ కి ఫోన్ చెయ్యమని చెప్పారా మీరు గీతకి"అంటూ గట్టిగానే అడిగాడు.మేమెందుకు చెపుతాము,ఆ పరిస్థితుల్లో మళ్ళీ కొడతాడేమో అని భయ్యంతో అమ్మాయి ఫోన్ చేసింది.తప్పేముంది అన్నట్లు పొగరుగా మాట్లాడాడు ఆయన.
 
సుభద్ర కళ్ళతోనే వెంకట్ ని వారించింది."గీతా,చెప్పమ్మా..నువ్వు చిన్న పిల్లవేమి కాదు.జరిగేది,జరుగుతున్నది నీకు అర్ధం కాకపోవడానికి.సందీప్ దుర్మార్గుడు,అతనితో బ్రతకడమంటే నా ప్రాణానికి హాని అని నువ్వు అనుకున్నట్లైతే చెప్పు.తమ్ముడిగా నా దృష్టిలో అతను మంచివాడే కావొచ్చు,భర్తగా మంచివాడవ్వాలని లేదుగా"అంటూ సూటిగా గీతని చూస్తూ అడిగింది. గీత దగ్గర నుంచి సమాధానం రాలేదు.చాలా సేపు గీతతో మాట్లాడుతూనే ఉంది సుభద్ర.అవేశంలో,తొందరపడి ఇద్దరు చేసినవి తప్పులే!భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వారు ఎలాంటి సమస్య వచ్చినా ఇంకోరకంగా పరిష్కరించుకునేవారేమో కాని,గీత తల్లితండ్రులు అక్కడ ఉండటం వలన ఇద్దరు ఎవరికి వారు తగ్గడానికి అహాలు అడ్డు వచ్చి,ఇంత దూరం తెచ్చుకున్నారు.ఎంత సేపు మాట్లాడినా రాయిలా కూర్చుందే తప్ప,గీత ఒక్క మాట కూడా సుభద్రతో మాట్లాడలేదు.ఇక తను చెయ్యగలిగినది ఏమీ లేదు అనుకుంటూ,అవేశాలు తగ్గాక,వివేకం హెచ్చరిస్తే,అప్పుడు కాని వారి బుర్రలు సరిగ్గా పని చెయ్యవని అనుకుని,వెళతానని చెప్పి బయలుదేరింది సుభద్ర.సందీప్ ఇంటికి వచ్చి,సందీప్ బట్టలు సర్దమని రాహుల్ కి చెప్పి,సందీప్ ని తనతో పాటు ఇంటికి రమ్మని అడిగింది.  "లేదక్కా, నేను రాను.I need some time for myself"అని సందీప్ సుభద్రతో చెప్పాడు.రాహుల్ ని తోడు గా ఉండమని చెప్పి అక్కడనుంచి ఇంటిముఖం పట్టింది సుభద్ర.

జరిగినదంతా ఒక కల అయితే ఎంత బాగున్నో! అని లెక్కలేనన్ని సార్లు అనుకుంది సుభద్ర.వెంకట్ మాత్రం గీతదే తప్పని,కాప్స్ కి ఫోన్ చేసే ముందు ఒక్క క్షణం అలోచించి ఉంటే సమస్య ఇంత జటిలంగా మారేది కాదు కదా అని బాధపడ్డాడు.సుభద్ర మాత్రం తప్పు ఎవరిది అన్న విశ్లేషణ అనవసరమని,ఎలాగైనా వారిద్దరు జరిగినదంతా మరచిపోయి,మళ్ళీ కలిసిపోవాలని దేవున్ని మనసులో కోరుకుంది.గీత కొద్ది రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి సురేష్ ఇంట్లోనే తల్లితండ్రులతో కలిసి ఉండిపోయింది.సందీప్ ని చాలా సార్లు ఇంటికి రమ్మని అడిగి విసిగిపోయిన సుభద్ర తనే రోజు విడిచి రోజు అతనిని కలిసి వచ్చేది.గీతతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది.సందీప్ సహజంగానే మితభాషి.ఈ సంఘటనతో అతను మనుషులతో మాట్లాడం పూర్తిగా తగ్గించేసాడు.అతని మనుసులో ఏముందో తెలుసుకోవడం ఆ బ్రహ్మ రుద్రాదులకు అయినా సాధ్యం అయ్యే పనేనా అనుకుంటూ ఉండేది సుభద్ర. 

ఎలాగైనా సందీప్ ని,గీతని ఒక చోట చేర్చి వారిని ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా చెయ్యాలని ఎన్నోసార్లు అనుకుంది సుభద్ర.గీత మాట ఎత్తితేనే,పూర్తిగా మౌనం వహించేవాడు సందీప్.సందీప్..బుజ్జిగాడిని చూడాలని అనిపించటం లేదా అని సందీప్ ని నిలదీసి అడిగితే మాత్రం చాలా బాధపడేవాడు.బుజ్జిగాడి కోసం అయినా వీళ్ళిద్దరు కలిసిపోతారేమో అన్న ఆశ కలిగేది సుభద్రకి.సందీప్ తల్లితండ్రులు,పెద్దవాళ్ళు అందరు గీతతో,గీత తల్లితండ్రులతో మాట్లాడారు.సందీప్ వచ్చి తనతో మాట్లాడితే తిరిగి సందీప్ తో కలిసి జీవితం గడపడానికి తనకేమి అభ్యంతరం లేదని గీత చెప్పింది.అది వినగానే అందరు చాలా ఆనందపడి సందీప్ ని ఒక్కసారి దీపని కలవమని ఎంతో నచ్చచెప్పారు.ససేమిరా అన్నాడు సందీప్.ఆ విషయం తెలిసిన దీప తనకేమి సందీప్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదంటూ,బుజ్జిగాడిని తల్లితండ్రులతో ఇండియా పంపించి తను ఉద్యోగం చేసే స్టేట్ లోనే ఇల్లు రెంట్ చేసుకుని తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది.ఒక సంవత్సర కాలంలో సందీప్ రెసిడెన్సి పూర్తిచేసుకుని,వేరే స్టేట్ లో తన మిత్రులతో కలిసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి,కొద్ది కాలంలోనే బిసి అయిపోయాడు.వెకషన్ కి ఇండియా వెళ్ళిన సుభద్ర బుజ్జిగాడిని చూడడానికి వెళ్ళింది.ఎంతో ముద్దుగా ఉన్నాడు బుజ్జిగాడు.వాడు చేసే అల్లరి ఎలా  ఉంటుందో చెప్పి మురిసిపోయారు గీత తల్లితండ్రులు.సుభద్రకి మనసులో ఎంతో దిగులుగా అనిపించింది.బుజ్జిగాడికి తల్లితండ్రులిద్దరి ప్రేమను పొందే అదృష్టం లేదే అని.ఇండియా నుంచి తిరిగి వచ్చాక సందీప్ ని కలిసింది సుభద్ర.తన కొడుకు ఎంత చక్కగా ఉన్నాడో,తను లైఫ్ లో ఏమీ మిస్స్ అవుతున్నాడో తెలుసుకోమని మళ్ళీ చెప్పింది సుభద్ర.సందీప్ వైఖరిలో ఏమీ మార్పు లేదు.

అప్పటివరకు ఎవ్వరిని జరిగిన దానికి దూషించని సుభద్ర మాత్రం ఆ రోజు తమ్ముడిని పట్టుకుని కడిగేసింది.పెద్ద పెద్ద చదువులు,ఉన్నతమైన పదవులు,ఆత్మాభిమానాలు అనుకుంటూ అన్ని భూతద్దంలో చూసుకుంటున్నారే కాని,మీకు ఒక కొడుకు ఉన్నాడని కాని,వాడు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమకు దూరమౌతున్నాడని అలోచించారా?పిల్లలు ఉన్నారని జీవితమంతా రాజిపడి బ్రతకడం మా వల్ల కాదు అని మోడర్న్ గా అలోచిస్తూ,పాత కాలం చింతపండులా కాదు అని విర్రవీగుతున్నారే కాని,కలిసి బ్రతకలేనప్పుడు, అంత తొందరపడి పిల్లలను ఎందుకు కనాలి అని మాత్రం అలోచించరే?నాకు తెలిసిన సూత్రం ఒక్కటే సందీప్.నీకు, గీతకి బుజ్జిగాడు ఉండకపోతే,మీ ఇద్దరి జీవితాలు మీ ఇష్టం.చెయ్యి చేసుకుంటే పడి ఉండే భార్య లేదని నువ్వు,అవేశం లో చెయ్యి చేసుకున్నాడని మతి లేకుండా కాప్స్ వరకు వెళ్ళిన నీ భార్య ఇద్దరు ఇద్దరే!పూర్తి స్వార్ధపరులు.ఆ రోజు ఇద్దరు అలసి సొలసి ఇంటికి చేరి ఉండకపోతే,మీ అత్తగారు,మావగారు ఇంట్లో ఉండకపోతే ఆ సంఘటన జరిగేదే కాదు.మూడు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడుతూ కూడా,ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉన్నవారు,ఆ ఒక్క రోజు సంఘటనతో విడిపోయారు.పిల్లలని కనేముందు ఒక్కసారి అలోచించండి మీ యువతరం.ఒకరికొకరు జీవితాంతం తోడు ఉండగలమనే ఆ నమ్మకం కలగనప్పుడు దయచేసి పిల్లలను కనకండి.ఒకసారి పిల్లలను కన్నాక,పంతాలకు పోకండి.ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి.అన్ని విషయలలో ఒకటి పది సార్లు అలోచిస్తారు కదా మీ తరం,దయచేసి పిల్లలను కనడం ఒక experience గా పరిగణించకుండా అది ఒక బాధ్యత అని వారి బంగారు జీవితం మీ చేతిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించండి.అలా అని మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారు అని నేను అనడం లేదు.ఒకవేళ నిజంగానే మొదట్లో బయటకి రాని విశ్వరూపాలు పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాల తరువాత బయటపడితే,అప్పుడు కలిసి ఉండాలి అని నేను అనను.కాని మీ స్వార్ధానికి, మీ అర్ధంలేని అహాలకి పిల్లల జీవితాలను బలి ఇవ్వకండి.కలిసి బ్రతకలేనప్పుడు మీకు పిల్లలను కనే హక్కు లేదు."అని తమ్ముడి తో తెగేసి చెప్పింది సుభద్ర.  

Thursday, April 25, 2013

ఆ హక్కు మీకు లేదు!




అర్ధరాత్రి ఒంటిగంట దాటింది.గాడనిద్రలో ఉన్నారు వెంకట్,సుభద్ర.సెల్ ఫోన్ మోగడంతో ఉల్లిక్కిపడి లేచాడు వెంకట్.ఎందుకో వేళ కాని వేళ ఫోన్ వస్తే,అతనికి చాలా కంగారుగా ఉంటుంది.ఇండియాలో అందరు క్షేమంగా ఉన్నారో,లేదో అని  గాబరా పడుతు ఉంటాడు.సెల్ నంబర్ చూస్తే లోకల్ నంబరే!ఎవరో ఇంత రాత్రి వేళ ఫోన్ చేసింది అనుకుంటూ,"హెల్లో.."అన్నాడు.ఇంతలో సుభద్ర లేచి,"ఎవరు వెంకట్?ఇంత రాత్రి వేళ?"అని అడిగింది.మాట్లాడదన్నట్ట్లు సైగ చేస్తూ,వెంటనే తను బయలుదేరి వస్తున్నానని,ఫోన్ చేసిన వారితో చెప్పి ఫోన్ పెట్టేసాడు వెంకట్.విషయం అర్ధం కాక సుభద్ర ఆందోళనగా చూసింది భర్త వంక."ఎక్కడికి ఇంత రాత్రి వేళ? Is everything alright?"అని అడిగింది."నేను అర్జెంట్ గా వెళ్ళాలి.ఫోన్ చేస్తాను నీకు ఒక అరగంటలో,భయపడకు,కంగారు పడాల్సినది ఏమీ లేదులే"అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు వెంకట్.విషయం ఏమై ఉంటుందా అని అలోచిస్తూ,పడుకున్న సుభద్రకి కొంచెంసేపటికే నిద్ర పట్టేసింది.ఉదయం నిద్ర లేచేటప్పటికి సమయం ఏడు దాటింది.ఆ రోజు శనివారం అన్న విషయం గుర్తు వచ్చి,మళ్ళీ బద్దకంతో కళ్ళు మూసుకుంది.

అంతలో రాత్రి ఫోన్ రావడం,వెంకట్ హడావిడిగా బయటికి వెళ్ళడం అన్ని గుర్తొచ్చాయి.అప్పుడు మొదలయ్యింది సుభద్రలో కంగారు.తనకి భర్త ఫోన్ చెయ్యలేదన్న విషయం గ్రహించి,వెంకట్ కి  కాల్ చేసింది సుభద్ర.వెంకట్ ఫోన్ ఎత్తగానే,కొంచెం కోపంగా"ఏమయిపోయావు,రాత్రి హట్టాత్తుగా వెళ్ళిపోయావు,ఫోన్ కూడా చెయ్యలేదు.ఎక్కడ ఉన్నావు ఇప్పుడు?"అని అడిగింది.వెంకట్ నెమ్మదిగా చెప్పాడు,నువ్వు కాలకృత్యాలు తీర్చుకుని సందీప్ ఇంటికి రా,తరువాత మాట్లాడుకుందాము"అన్నాడు వెంకట్.ఆశ్చర్యపోయింది సుభద్ర."అదేంటి, సందీప్ ఇంటికా ఎందుకు? బుజ్జిగాడు బాగున్నాడా?ఏమయ్యింది వెంకట్?"అని కంగారుగా అడిగింది సుభద్ర.నువ్వు వీలైనంత తొందరలో వచ్చెయ్యి,ఫోన్ లో నేను ఏమి చెప్పలేను"అని ఫోన్ పెట్టేసాడు వెంకట్.

ఒక్కసారిగా దిగాలు పడిపోయింది సుభద్ర.సందీప్ సుభద్ర పిన్ని కొడుకు.వయస్సులో చాలా తేడా ఉన్నపటికి,వారిద్దరి మధ్య చనువెక్కువ.తమ్ముడంటే ప్రాణం సుభద్రకి.వెంకట్ కూడా సందీప్ అంటే చాలా అభిమానంగా ఉంటాడు.సందీప్ కి పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలయ్యింది.ఇండియాలో మెడిసిన్ చేసి ఇక్కడ రెసిడెన్సి ఆఖరి సంవత్సరం చేస్తున్నాడు.అతని భార్య గీత పక్కనే ఉన్న ఇంకో స్టేట్ లో ఉద్యోగం చేస్తుంది.మూడు నెలెల బుజ్జిగాడు వారి తొలి సంతానం.ప్రతి వీకెండ్ తప్పనిసరిగా ఒక్కసారైనా వెళ్ళి వాడిని ముద్దాడడం సుభద్రకి,వెంకట్ కి మామూలే!బుజ్జిగాడికేమన్నా ఒంట్లో బాగోలేదా?నేను కంగారు పడతానని నాకు చెప్పలేదా?ఇండియా నుంచి వచ్చిన గీత తల్లితండ్రులకు ఆరోగ్యం బానే ఉంది కదా..అని ఇలా రక రకాల అలోచనలతో హడావిడిగా స్నానం చేసి,సందీప్ ఇంటికి బయలుదేరింది సుభద్ర.

సందీప్ ఇంటి దగ్గర నాలుగు కార్లు వరకు కనిపించడంతో కంగారు ఇంకా ఎక్కువయ్యింది సుభద్రకి.సందీప్ ఇంట్లోకి అడుగుపెడుతూనే లివింగ్ రూంలో కూర్చుని ఉన్న గీత నాన్నగారిని,వెంకట్ ని,గీత పెదన్నాన్న కొడుకు సురేష్ ని,సందీప్ ప్రాణస్నేహితుడైన రాహుల్ ని చూసింది సుభద్ర.అంతమందిని అక్కడ చూసిన సుభద్రకి ఎందుకో బుజ్జిగాడికి ఏమన్నా అయ్యిందేమో అన్న అందోళన కలిగింది.అక్కడ వారందరి మధ్య సందీప్ లేకపోవడం గమనించి,భర్త వంక బేల గా చూసింది సుభద్ర.లోపలికి పదమంటూ సైగ చేసి,వెనకనే తను వచ్చాడు వెంకట్."సందీప్ ఏడి?బుజ్జిగాడు బాగున్నాడా?గీత ఎక్కడ?"అని ప్రశ్నల వర్షం కురిపించింది సుభద్ర.పై ఫ్లోర్ లో ఉన్న బెడ్రూం లొకి తీసుకెళ్ళాడు సుభద్రని వెంకట్.అక్కడ సందీప్ ఒక్కడే బెడ్ మీద పడుకుని ఉన్నాడు.అలికిడి వినిపించి కళ్ళు తెరిచి చూసాడు.సందీప్ కళ్ళు ఎర్రగా చూడడానికే భయపడేట్టు  ఉన్నాయి.సుభద్రని చూడగానే,కళ్ళలో నీళ్ళు తిరిగి,అవి కనపడతాయేమో అన్నట్టు,కళ్ళు వెంటనే మూసుకుని బెడ్ మీద ఇంకో పక్కకి తిరిగి పడుకున్నాడు.

వెంకట్ అక్కడ ఉన్న కుర్చిలో కూర్చుని నెమ్మదిగా సుభద్రతో అన్నాడు,"రాత్రి సందీప్ ని కాప్స్ అర్రెస్ట్ చేసారు.మూడు గంటల క్రితమే ఇంటికి తీసుకొచ్చాము"అని."ఎందుకు?సందీప్ ఏమయ్యిందిరా? ఇటు చూడు"అంటూ తమ్ముడి భుజం పట్టుకుని కుదిపేసింది సుభద్ర.సందీప్ నుండి సమాధానం ఏమీ రాలేదు.వెంకట చెప్పసాగాడు."రాత్రి గీత మీద చెయ్యి చేసుకున్నాడు.గీత కాప్స్ కి ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చితీసుకెళ్ళారు" అని.హతాశురాలయ్యింది సుభద్ర.అసలు చెయ్యి చేసుకోవాల్సిన అవసరం ఏమోచ్చింది వీడికి?గీత కాప్స్ ని ఎందుకు కాల్ చేసింది?ఏది గీత?గీతా,గీత అని గట్టిగా పిలవసాగింది సుభద్ర."గీత ఇక్కడ లేదు,వాళ్ళ అమ్మ,బుజ్జిగాడు అందరు సురేష్ ఇంట్లో ఉన్నారు."అని సమాధానమిచ్చాడు వెంకట్.అప్పటికే సుభద్రకి జరగరానిదేదో వారిద్దరి మధ్య జరిగిందని,దాని పర్యవసానం కూడా చాలా త్రీవ్రంగా ఉంటుందని అర్ధం అయిపోయింది."ఏమి జరిగిందో గీత వాళ్ళ నాన్నగారు చెప్పటమే కాని వీడు మాత్రం ఎంత అడిగినా నోరు మెదపటం లేదు.నువ్వు మాట్లాడు"అని ఆ రూం లోంచి బయటికి వెళ్ళిపోయాడు వెంకట్.


సుభద్రకి అప్పటికే కాళ్ళు,చేతులు వణకసాగాయి.నెమ్మదిగా తమ్ముడి పక్కన  కూర్చుకుని అడిగింది. అసలు ఏం జరిగిందిరా సందీప్,చెప్పు.మీ ఇద్దరి మధ్య గొడవలేంటి?నాకసలు ఏమీ అర్ధం కావట్లేదు."సందీప్ ఏమీ మాట్లాడలేదు. "సందీప్ అలా కాదు, నా మాట విను. జరిగిన విషయం మాకు ఎలా తెలిసేది, నువ్వు ఇలా మౌనంగా ఉంటూ,నీలో నువ్వు బాధపడితే?దయచేసి చెప్పరా" అని బతిమాలింది సుభద్ర.వెంకట్ కాఫీ కప్పు తో రూం లో కి వచ్చి, సుభద్ర చేతికి ఇచ్చాడు, సందీప్ కి ఇవ్వమని సైగ చేస్తూ.అప్పటికి చలనం లేకుండా ఉన్న సందీప్ ని చూస్తే,సుభద్రకి ఒక్కసారిగా కోపం వచ్చి, కొద్దిగా గట్టిగానే, ఇదిగొ నువ్వు ముందు ఆ మంచం మీద నుంచి లెగు, వాష్ రూం లోకి వెళ్ళి మొఖం కడుక్కుని రా.." అని తమ్ముడి మీద మండిపడింది.అయిష్టం గా లేచి, వాష్ రూం కి వెళ్ళి, కొద్దిసెపట్లో బయటికి వచ్చాడు సందీప్. కాఫీ కప్పు చేతిలో పెట్టి ముందు కాఫీ తాగు అంది సుభద్ర.తమ్ముడి మొఖంలోకి చూస్తూ, కంట తడి పెట్టుకుంది సుభద్ర. "ఏమిట్రా ఇదంతా? ఎలా అయిపోయావో తెలుసా? ఎలా జరిగింది ఇదంతా?" అని మళ్ళీ ప్రశ్నించింది. జరిగింది చెప్పసాగాడు సందీప్. 

గీత డెలివరీ కి గీత తల్లితండ్రులు ఇద్దరు,నాలుగు నెలల క్రితమే అమెరికా కి వచ్చారు.గీతకి బాబు పుట్టాక,రెండు నెలల తరువాత,తను ఉద్యోగంలో చేరాల్సిన రోజు రావడంతో అయిష్టంగానే కొడుకుని వదలలేకపోయినా,తప్పని సరి పరిస్థితులలో ఉద్యోగం లో జాయిన్ అయ్యింది.ఇంకో స్టేట్ లో ఉద్యోగం కాబట్టి, వీకెండ్ మాత్రమే ఇంటికి వచ్చేది. భర్త సందీప్ ని,తల్లితండ్రులను,బుజ్జిగాడిని అందరిని వదిలి ప్రతి సోమవారం జాబ్ కి వెళ్ళడానికి మనస్సు అంగీకరించకపోయినా,తప్పదు ఇంకో ఉద్యోగం దొరికేదాకా అనుకుంటూ వెళ్ళేది.సందీప్ రోజులో ఒక్కోసారి 15 గంటల వరకు పని చేసి ఇంటికి అలసి వచ్చేవాడు.కొడుకుతో సమయం గడపలేకపోతున్నానే అని బాధపడుతూనే,ఇంకెంతలే,కొద్దిరోజులే కదా,తను ప్రాక్టిస్ పెట్టుకునే వరకే కదా,అని సర్దిచెప్పుకునే వాడు.గీత తల్లితండ్రులు బుజ్జిగాడిని చాలా ఓపికగా పెంచేవారు.ఒకసారి హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేసరికి అత్తగారు,పంపులో వచ్చే నీరు బాటిల్ లో పోసి, పట్టించటం చూసిన సందీప్,అత్తగారితో అలా చెయ్యొద్దని, ఫిల్టర్ చేసిన నీళ్ళు కాని, కాచిన నీళ్ళు కాని ఇవ్వమని చెప్పాడు.సరే అంది గీత తల్లి.ఇంకో రెండు సార్లు కూడా అలా జరగడంతో, సందీప్ గట్టిగానే చెప్పాడు అత్తగారితో, దయచేసి ఆ నీళ్ళు పట్టకండి.వాడికేమన్నా చేస్తే,తరువాత హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే మాటలు కాదు అని.ఆవిడ అలాగేనని చెప్పింది.

ఆ తరువాత వీకెండ్, గీత అలసిపోయి శుక్రువారం రాత్రి 11:30 గంటలకు ఇంటికి చేరుకుంది.ఆ వారం బుజ్జిగాడికి ఒంట్లో కొద్దిగా నలతగా ఉండటంతో గీత అమ్మగారు,నాన్నగారు కూడా బాగా అలసిపోయి ఉన్నారు.ఆ రోజు కూడా తల్లి వచ్చేవరకు బుజ్జిగాడు నిద్రపోలేదు.అలసి సొలసి ఇంటికి చేరుకున్న గీత కొడుకుని దగ్గరకి తీసుకుని ముద్దాడ సాగింది.అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టాడు సందీప్."ఎంత సేపయ్యింది వచ్చి" అని గీతతో మాట్లాడుతుండగానే,గీత అమ్మగారు పంపులో నీరు బాటిల్ లో పట్టి, బుజ్జిగాడికి పట్టసాగింది. అది చూసిన సందీప్ గట్టిగా అరిచినంత పని చేసాడు.'ఎన్ని సార్లు చెప్పానండి మీకు?పంపులో నీరు బాబుకి పట్టద్దని? చెపితే మీకు అర్ధం కాదా?" అని విస్సుకున్నాడు సందీప్ గీత తల్లిని.అల్లుడు అలా మాట్లడితే ఆవిడకు కూడా కోపం వచ్చి "మాకు తెలీదా పిల్లలను పెంచడం?" అని ఎదురు చెప్పింది. విస్తుపోయి ఆవిడ వంక చూస్తూ,మీకు చాలా సార్లు నెమ్మదిగా చెప్పాను, అలా చెయ్యొద్దని..మీకు నా మాట అంటే లక్ష్యం లేదు.అయినా మిమ్మల్ని అని ఏమీ లాభం?మా పిల్లలను మేము పెంచుకోకపోవడం మా దురదృష్టం"అనేసి విసురుగా,బాబుని ఆవిడ చేతిలోంచి లాక్కొని తన రూం లోకి వెళ్ళిపోయాడు సందీప్.గీత తల్లి అల్లుడు ఇంత అవమానం చేస్తాడా అంటూ,ఏడవసాగింది."ఎవ్వరి చేత ఒక్క మాట అనిపించుకోలేదు నేను,ఈ రోజు నీ గురించి ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది"అని కూతురుని చూస్తూ, ఏడ్చింది ఆవిడ.తల్లి బాధపడుతుంటే, ఒక్కసారిగా గీతకు ఆవేశం వచ్చి సందీప్ దగ్గరికి వెళ్ళి బాబుని లాక్కుని, నీకసలు బుద్దుందా? పెద్దవాళ్ళతో మాట్లాడే పద్దతి అదేనా? మగవాడినన్న అహంకారం చూపిస్తున్నావా?అమ్మ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ వయస్సులో బాబుని చూసుకుంటుంటే కృతజ్ఞతాభావం ఉండాల్సిన నీకు అది లేకుండా..మా అమ్మని విస్సుక్కుని కేకలు వేస్తావా అసలు నువ్వు మనిషివేనా?అంటూ కోపంతో ఊగిపోయింది.మాట,మాట పెరిగింది వారిద్దరి మధ్య.తల్లితండ్రులు వింటున్నారే అన్న తలంపు కూడా లేకుండా,ఆవేశం తో నోటికి వచ్చినట్లు మాట్లాడి,సందీప్ ని తిట్టసాగింది.బయటకి వచ్చి,మర్యాదగా తల్లికి క్షమాపణ చెప్పమని బెదిరించింది.అత్తగారు,మావయ్యగారి ముందు గీత తనని అలా నిలదీసి మాట్లాడడం సందీప్ కూడా సహించలేకపోయాడు.గీతని గదిలోంచి బయటికి నడవమని ఆదేశించాడు.వినలేదు గీత.గీత చెంప చెల్లుమనిపించాడు సందీప్.ఉక్రోషంతో చేతికి అందిన సరుకులన్ని సందీప్ మీద విసిరెయ్యసాగింది గీత."నన్ను కొడతావా"అని అవేశపడిపోతు.

ఇంతలో గీత తల్లితండ్రులు వచ్చి కల్పించుకుని తనని వేరే గదిలోకి లాక్కెళ్ళిపోయారు.గీత తండ్రి కూడా ఆవేశం తో ఊగిపోతు అల్లుడిని తిట్టసాగాడు."ఎంత ధైర్యం రా నీకు?అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నా కూతురుని,కష్టపడి చదువుకుంది,విదేశాలకి వచ్చింది.నీకంటే ఎందులో తక్కువ?దాని ఒంటి నీద చెయ్యి వేస్తావా నువ్వు" అంటూ పట్టరాని అవేశం తో ఊగిపోయాడు అతను.డోర్ లాక్ చేసుకుని తల పట్టుకుని కూర్చుండిపోయాడు సందీప్.ఒక అరగంటలో సందీప్ ఇంటికి కాప్స్(పోలిసులు) రావడం,గీతని కొట్టావా అని ప్రశ్నించి తమతో తీసుకెళ్ళిపోయారు.గీత 911 కాల్ చేసి తనపై పిర్యాదు చేసినట్టు అర్ధం అయ్యింది సందీప్ కి.
(ముగింపు తరువాయి టపాలో)

Wednesday, April 17, 2013

సరదా సరదాగా...



"వనజ వనమాలి"గారు,నమస్కారం అండి,"కబుర్లు కాకరకాయలు"ఏమన్నా ఉంటే కాస్త చెబుదురూ..మీరు ఎన్నో వైవిధ్యభరితమైన టాపిక్స్ తో అవలీలగా టపాలు రాసేస్తుంటారు.అసలే ఈ మధ్య పిల్లలందరికి పరీక్షలని,నా స్నేహితులందరు తెగ బిసీ అయిపోయారు."పని లేక"తోచటం లేదు,తీరిక సమయం ఎక్కువయ్యింది"అని అన్నాను.సరే చెప్పండి"తెలుగు వెన్నెల"గారు,ఎక్కడ మొదలుపెడదాము?నాలుగు పుస్తకాలు చెపుతాను,అవి చదువుకోండి,హాయిగా...పుస్తకాలు ఎక్కువ చదివితేనే కదా భావ ప్రకటన అద్భుతం చెయ్యగలుగుతారు మీరు కూడా టపాలలో?"కష్టేఫలే"అన్న విషయం తెలుసు కదా మీకు?మరి ఇంక మొదలుపెట్టండి చదవటం మన గొప్ప తెలుగు సాహిత్యాన్ని" అని ఒక సలహా పాడేసారు ఆవిడ.

ఏదో"ఔను,నేను బ్లాగ్ మొదలుపెట్టాను"అనుకున్నానే కాని,అందులో "సాహితి"విలువలు ఉన్నాయా లేదా అన్న విషయం మీద అలోచనే లేదు కదా?నా రాతలన్ని"నాతో నేను నా గురించి"అనుకున్నాను."నా తెలుగు" భాషని మరవకుండా ఏదో నాలుగు ముక్కలు రాస్తే చాలు కదా అన్న "తెలుగు భావాలు"కలిగి ఉన్నానే ఇన్ని రోజులు.నాలో ఆ క్షణం ఉవ్వెత్తున లెగిసాయి"అలోచనాతరంగాలు".చిన్నప్పుడెప్పుడో"తాత,వారి డైరీ" రాతలను ఎగతాళి చేసాను కాని,ఇప్పుడు నేను బ్లాగ్ అని పేరు పెట్టి  చేస్తున్నదేమిటో!పుస్తకాల షెల్ఫ్ నుండి"కవితా సుమహారం" అందుకున్నా."శ్రీ కవితలు"అన్న పేరుతో ఒక పుస్తకం ఎప్పటికన్నా నేను కూడా రాయాలి అన్న అవేశం తో!కవితలు చదువుతూ"నా చిన్ని ప్రపంచం" అదేనండి నా బ్లాగ్ , అందులో నేను రాసుకున్న రాతల వంక, వాటికి వచ్చిన "స్పందన" చూసుకుంటూ మురిసిపోయా."ఆనందం" (aanamdam) తో. 

ఇంతలో నా  సహచరుడు గంటలు గంటలు ఆ అంతర్జాలంలో ఎందుకు సమయం వ్యర్ధ పరుస్తావు అని విస్సుకోగా,ఇంతేలే ఈ"జీవితం"అని నిట్టూర్పు విడిచి లాప్టాప్ మూసేసాను.IPOD లో "నవ రస(జ్ఞ) భరితం"  అయిన "తెలుగు పాటలు"వింటూ పనిలో నిమగ్నమయ్యిపోయాను.అరగంటలో "వేడి వేడి సమోసాలు" తయ్యారు చేసాను.ఇంక లాగించేద్దామా అనుకుంటుండగా పక్కింటి"రవిగారు"ఎదురింటి "NIHAR" పలకరించడానికి వచ్చారు.నా సమోసాలలో భాగం వీరికి కూడా పంచాలి కాబోలు అని కించిత్తు బాధపడుతూ ఎక్కడో"చిన్ని ఆశ"తొందరగా వెళ్ళిపోతారేమో అని.తొందరగా వారిని సాగనంపడానికి నా"అలోచనాస్త్రాలను"సంధించాను.ఇంతలో"శ్రీ లలిత"సహస్రనామస్తోత్రం చదువుకుందామని స్నేహితురాలి ఫోన్ రావడం తో,వచ్చిన అథిదులను పంపించేసాను.స్నేహితురాలి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను.స్వాగతం రా"ఇది శశి ప్రపంచం"అంటూ ఆహ్వానించింది.ఆవిడ పూజ గదిలో"యశోదకృష్ణ"చిత్రపటం గోడకి తగిలించి ఉండడం చూసాను.అలంకరించి ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం వైపు చూస్తే అప్రయత్నంగా నేను"మాలతీమాధవం"అనుకోకుండా ఉండలేకపోయాను."శ్యామలీయం" అయిన శ్రీకృష్ణుడి విగ్రహం నాకు ఆ క్షణంలో"లీలా మోహనం"గా అనిపించింది.భగవన్నామ"స్మరణ"లో కొద్దిసేపు గడిపాను.పూజకి "పద్మార్పిత"నువ్వే,చెప్పినట్టు చెయ్యి అంది పక్కింటావిడ.పూజ ముగించుకుని ఆరుబయట బాల్కని లోకి వచ్చి నించున్నాను.అంతవరకు ఉన్న వాతావరణం మారిపోయి వర్షం కురిసింది.ఆకాశంలో "ఇంద్రదనుస్సు"ప్రత్యక్షం."నాలో మాట"ఒకటి ఆ క్షణం అందమైన పాట గా మారి,"సరిగమలు"పలికింది.ఇవన్ని"చిన్నిగుండె చప్పుళ్లు"కదూ అనుకుంటూ ఆ "Nature Tints"ని చూస్తూ పరవసించిపోయాను.ఇంతలో ఇంటినుండి పిలుపు వస్తే"ఎందుకో, ఏమో"అనుకుంటూ హడావిడిగా పక్కింటావిడకు వెళ్ళొస్తానని చెప్పాను.

ఇంట్లో టాటా "ఫోటాన్‌" ప్లస్‌ TV లో TV9  చానల్  చూస్తూ ఇంటి సభ్యులు త్రీవ్రమైన చర్చలో మునిగి ఉన్నారు.TV ఎదురుగా కూర్చున్న అమ్మని నన్ను మార్చి మార్చి చూస్తూ, ఇంట్లో వాళ్ళు "తెలుగు బ్లాగు-సీరీయల్ ముచ్చట్లు" అని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.అదేనండి నేనేమో బ్లాగులు చూస్తానని,అమ్మేమో సీరియల్స్ చూస్తుంటుంది అని మమ్మల్ని అలా ఎత్తిపొడుస్తారు వాళ్ళు.అసలు ఆ TV9 చానల్ ఎందుకు పెట్టారు? వేసిన న్యుస్ మళ్ళీ మళ్ళీ వేసి విసిగించేస్తారు అంటూ అందరినీ ప్రశ్నించాను.అయినా ఆ"రవిశేఖర్ హృ(మ)దిలో"ఏముందో కాని ...అని మండిపడ్డాను.రవిశేఖర్ కాదోయి రవిప్రకాష్ అంటూ వచ్చింది సమాధానం.ఏదో ఒకటి అని విస్సుకుంటూ ఈ TV9 చానల్ ప్రజలు చూడకుండా"మనం ఏమీ చెయ్యలేమా"అనుకుంటూ ఎప్పుడో,ఎవరో పెట్టాలి ఈ చానల్ వాళ్ళకి"చాకిరేవు"అనుకున్నాను."నా అలోచనల పరంపర"లో అలా నేను కొట్టుకు పోతుండగా ఫోన్ మోగింది."మానస"దగ్గరనుండి ఫోన్. నేను అభిమానంగా"మనస్వి"అని పిలుస్తా తనని."మన కాకినాడలో" విశేషాలు ఏంటి అని తనతో కబుర్లలో పడిపోయాను.

TV లో"అంతర్ముఖం"ప్రోగ్రాం చూస్తున్నారు అందరు. ఎలా చూస్తున్నారో ఈ ప్రోగ్రాంస్ అందరు ఆంధ్ర రాష్ట్రం లో అని అబ్బురపడుతు ఒక్క ప్రొగ్రాం అయినా,"సుజన-సృజన"గా లేదే అనుకుని,నా లాప్టాప్ మళ్ళీ తెరిచాను.పత్రికా ఆఫీస్ లో పనిచేస్తున్న సోదరుడు,లాప్టాప్ మూసేసి వస్తే కబుర్లు చెపుతాను అని నాతో అంటే, సర్లే నీ"Jurno Dreams"లో నువ్వుండు,నా లోకం లో నేనుంటాను అంటూ నవ్వాను.ఇంతలో చదువుతు ఆపేసిన కవితలు గుర్తుకోచ్చి,కవితలు చదవసాగాను."వరూధిని"ప్రవరాఖ్యుల మీద కవితలు చదువుతున్నంత సేపు నేను"అమృతమథనం"చేస్తున్న భావన.నా లోకం లో నేను మునిగి ఉన్న వేళ ఇంట్లో వారందరు నవ్వుకుంటుంటే నేను వారి వంక నిర్లక్ష్యం గా ఒక చూపు విసిరి"నవ్వితే నవ్వండి"అనుకున్నాను.నెమ్మదిగా ఇల్లంతా సద్దుమునిగి పోయింది.నేను మాత్రం అలా చదువుకుంటూ ఉండిపోయాను.ఇంతలో అంతా"రవీయం" అన్నట్లు చీకట్లు తొలగిస్తూ"భాస్కర్"డు వచ్చాడు.

(ఈ టపా సరదాగా నేను చదివే బ్లాగ్స్ , మరియు నా బ్లాగ్ చదివి ఎల్లప్పుడు నన్ను కామెంట్స్ రూపేనా ప్రోత్షహించిన ఎందరో బ్లాగర్స్ బ్లాగ్ పేర్లతో అల్లిన కల్పిత కథ. )

Tuesday, April 16, 2013

సరదాగా చందమామనే చేతి వేళ్ళపై నిలబెడతావా?


                                          
         











Above photographs are clicked by "Laurent Laveder".
Website: www.pixheaven.net