Thursday, July 25, 2013
Friday, July 19, 2013
శ్రీరస్తు.. శుభమస్తు...అని దీవించగలమా?
రోజులు మారాయి, రోజులు మారాయి, మారాయి... మారాయి ...
రోజులు మారాయి..
http://stephgrantphotography.com/blog/shannon-seema-indian-lesbian-wedding-los-angeles-ca/
రోజులు మారాయి..
నిజమే! ఇలాంటి పెళ్ళిల్లు చూస్తామని ఒకప్పుడు అనుకోలేదు. ఇప్పుడు చాలా సాధారణమైన విషయమైపోయింది.మొదటిసారి నేను ఇలాంటి వివాహం గురించి విని ముక్కున వేలేసుకున్నపుడు అతి కటువుగా నన్ను విస్సుకున్నారొకరు..."You are ridiculous.Stop being a homophobe" అని...
ప్చ్..ఏంటో! ముందు, ముందు మరి ఈ వివాహాలు మనుషుల మధ్యే జరుగుతాయో లేక ...oops! నేనేమి వ్రాయలేదు..మీరేమి చదవలేదు అంతే! మీరు కూడా నాకు నాలుగు అక్షింతలెయ్యకముందే, నేను ఈ కింద లింక్ మీకు కానుకగా ఇచ్చేసి, ముగించేస్తాను.
http://stephgrantphotography.com/blog/shannon-seema-indian-lesbian-wedding-los-angeles-ca/
Tuesday, July 9, 2013
అలా చందమామనై...
మల్లెల తీరం లో సిరిమల్లెపువ్వు - నాలుగు పాటలు.
http://www.mediafire.com/listen/jsckc5pzmv9zavv/Alaa_Chandamaamanai.mp3
అలా చందమామనై ఇలా చేతికందనా
అలా చందమామనై ఇలా చేతికందనా
పాడి రోజు లాలిని, పంచుకోనా జాలిని
పాడి రోజు లాలిని, పంచుకొనా జాలిని
గాలిలో కెరటమై ఎదే తాకనా
మల్లెల్లో మధువునై దరే చేరనా
సందె వెలుగుల చెలిమి తీరం పిలుపునై... రానా
అలా చందమామనై ఇలా చేతికందనా
http://www.mediafire.com/listen/b12jn3z31303fyv/04Mabbulu_Kurise_%5BSongsAp.com%5D.mp3
మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం,చినుకై రాలెను సంతోషం
తియ్యని తేనల సావాసం,తోడై దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం,సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే, మౌనం విరిసే, మది మురిసే
కన్నులు మెరిసే, వెన్నెల కాసే,ఎద ఎగసే
ఏ జన్మ కథ మళ్ళీ మొదలయి,నా జన్మ కదిలింది
ఆశగా నీతో అడుగేస్తుంటే,అణువణువూ అదిరింది
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
మమతల ముడిపడి,మురళిగ నిలబడి,మానస కోయిల కూసెనుగా
మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే
ఏ కొమ్మ తొలి సిగ్గుల మొగ్గై,ఏ చోట పూస్తుందో
ఉరికే వాగులు, పారే ఏరులు చేరే తీరాలేవో
తెలుసా వాటికి తమ తల రాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
తెలుసా వాటికి తమ తల రాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
పువ్వుల ఘుమఘుమ,మువ్వల సరిగమ
ఎవ్వరు ఆపినా ఆగవుగా
మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే
నా చూపులకు సోయగమిచ్చి నీ కంటి కళ వచ్చి
నువ్వే నేనని భావన చేస్తూ,నాతో నేను రమించి
చూసేదంతా సొగసనిపించి,చేసేవన్నీ నిజమనిపించే
చూసేదంతా సొగసనిపించి,చేసేవన్నీ నిజమనిపించే
గువ్వల కిళకిళ,నవ్వుల పరిమళ
మల్లెల తీరము కనిపించే
మల్లెల తీరము కనిపించే
మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే
మల్లెలు పూసే,మౌనం విరిసే, మది మురిసే

http://www.mediafire.com/listen/j83wb9ybt8az1ad/02Nee_Needana_%5BSongsAp.com%5D.mp3

నీ నీడన ఇలా నడవనా
నీ నీడన ఇలా నడవనా
పరిమళించు పువ్వులాగ పలుకరించనా
చినుకు తాకు మొలక రీతి చిగురు తొడగనా
నీ పాటన సుధై పారనా
మనసు కోరు మల్లెనౌతు నేను నీలో కలసిపోనా
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరస్సులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరస్సులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
తూరుపు వెలుగుల,పడమటి జిలుగుల పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుస్సున ఇద్దరమే
చీకటి నలుపున మనమే,చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు,అలసట ఎరుగని నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుస్సున ఇద్దరమే
చీకటి నలుపున మనమే,చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు,అలసట ఎరుగని నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
స్వఛ్చపు తొలకరి, వెచ్చని జల్లుల, పచ్చని కాంతులలో మనమే
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటలమనమే
నింగి నేల చిన్నబోయి రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతం ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియ కథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటలమనమే
నింగి నేల చిన్నబోయి రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతం ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియ కథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరస్సులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
(You can stop the song playing on this site, by scrolling down the page and clicking on pause button of the player.)

Friday, July 5, 2013
ఆశ్చర్యం..తెలుగు సినిమా కూడా బాగుంటుందా?
http://www.youtube.com/watch?v=LDCj7Zxs-y0రోజూ వర్షాలు, అప్పుడప్పుడు తూఫానులతో ఈ వేసవి ఒక ఊపు ఊపుతుంది మా స్టేట్ ని....దానికి తోడు వేసవి సమయంలో అతిధుల రాక పోకలు. మాకోసమైతే వంట తప్పించుకునేందుకు ఎన్నో కారణాలు వెదికే నేను, అతిధులు వస్తే మాత్రం, రోజుకి మూడుసార్లు తప్పదు కదా మరి వంట గదితో స్నేహం? ఇకపోతే యంత్రాల మీదే కాక అప్పుడప్పుడు రోడ్డు మీద పకృతిని చూస్తూ పరిగెడుతూనో లేక నడుస్తూనో వేసవి కాలం గడపడం కూడా నాకు ఇష్టం. బ్లాగ్స్ చూసి, రాసి నెల పైనే అయ్యిందా అనిపించింది నాకు. ఇకపోతే ఈ వేసవి కాలం, కొద్దిగా సినిమాల జోరు కూడా బానే ఉందని చెప్పాలి. హిందీ లో ఒక అర డజన్ సినిమాలు, ఇంగ్లీష్లో కొన్ని అవేశం గా చూసేసాను. ఇంటికి వచ్చిన అతిధులతో మరీ 24 గంటలు మాట్లాడాలి అంటే కూడా ఇబ్బంది కదండి. పదండి సినిమాకి, అని చెప్పి వరుసగా హిందీ , ఇంగ్లీష్ సినిమాలు చూపించేసాను. తెలుగు మాత్రం ఊహు... నా వల్ల కాదు అని ఒక్కటి కూడా చూడలేదు, చూపించలేదు.ఇదిలా ఉండగా, అతిధులు వెళ్లాక, మాకు ఈ స్వాతంత్ర దినోత్సవం సెలవలు వచ్చేసాయి. ఈ సంవత్సరం చాలామందికి 4 రోజులు సెలవలు వచ్చాయి. సాధారణం గా ఇలాంటి సెలవలు వస్తే నాకు హాయిగా న్యు యార్క్ - Time square వీధుల్లో ముఖ్యం గా రాత్రి సమయంలో నడుస్తూ గడపడం అంతే మహా ఇష్టం. ఇంకేంటి అడ్డం? మరి వెళాదామా అని ఇంట్లో ప్రశ్న...ఊహూ..లేదు ఈ నాలుగు రోజులు వర్షం లేకుండా ఉంటే నాకిక్కడే గడపాలని ఉంది అని సమాధానమిచ్చాను. ఇంతలో స్నేహితురాలు ఒక సినిమా trailer పంపింది చూడమని...అది తెలుగు సినిమాది అని చూసి, పెదవి విరిచి, చూసాలే అని స్నేహితురాలికి సమాధానమిచ్చాను. నచ్చలేదా trailer అని మళ్ళీ ప్రశ్న. సరిగ్గా చూడలేదు, చూసి చెపుతానని దాటేసాను సమాధానం. తప్పకుండా చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
అంతగా చెప్పింది కదా అని సినిమా పేరేమిటా అని వివరంగా చూసాను. ఒక చిన్న shock! "మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు" ....ఇదేంటి ఇలాంటిదే మొన్నీమధ్య ఒక తల తిక్క సినిమా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అని కదా వచ్చింది? ఆ సినిమాకి వచ్చిన హైప్ చూసి వెళ్ళి ఎంతో నిరుత్షాహపడడం నాకింకా గుర్తే....ఆ సినిమాకి పేరడీ అయ్యి ఉంటుంది, అని విరక్తి కలిగి, తెలుగు డైరక్టర్లను , వారు ఎంచుకుంటున్న ఈ సినిమా టైటిల్స్ కి ఒక నమస్కారం పెట్టి ఆ trailer చూడకుండా కసిగా స్నేహితురాలు పంపిన ఇమైల్ మూసేసాను.మళ్ళీ మరునాడే ఫోన్..."సినిమా కి వస్తావా , వెళదాము ఈ రాత్రి" అని. "అయ్యబాబోయి నా వల్ల కాదు తల్లీ , నీకో దండం నన్ను ఒదిలెయ్యి ఈ సారి"అని బతిమాలాను. "అర్ధం అయ్యింది.. తమరు trailer చూడలేదు .....ముందు వెళ్ళి trailer చూడు. నీకు నచ్చుతుంది అని నాకు గొప్ప నమ్మకం" అంది. తప్పేట్టు లేదురా భగవంతుడా అని trailer చూసాను. నిజమే చాలా బాగుంది అనిపించింది. ముగ్గురి వ్యక్తుల కథ లా అనిపించింది. మనసులో చిన్న ఆశ, బాగుంటుందేమో అని...,వెంటనే తెలుగు సినిమాల మీద అంతకు ముందు ఏర్పరుచుకున్న బలమైన అభిప్రాయం ముందు ఆ చిన్న ఆశ సన్నగిల్లిపోయింది. అసలు ఏమాత్రం ఆశించకుండా, స్నేహితురాలి బలవంతం మీద వెళ్ళి ఈ రోజు చూసాను ఆ సినిమా.... "మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు"
సినిమా పూర్తయ్యేటప్పటికి, మనసంతా ఆనందం... ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక "అందమైన కవిత" అని చెప్పాలి. ఈ సినిమా కథ మూడు ముక్కల్లో చెప్పొచ్చు... కాని సినిమా తీసిన విధానం, పాటల చిత్రీకరణ,సినిమాలో ప్రతి ఫ్రేం ఎంతో అందం గా ఒక చక్కటి గ్రీటింగ్ కార్డ్ లా ఉంటుంది. సున్నితమైన సంభాషణలు, సున్నితమైన భావాలు ఎంత అందంగా తెరకెక్కించాడో ఆ దర్శకుడు. ఇది అని చెప్పలేని భావమేదో నన్ను ఊపేసింది. వెరసి ఈ రోజు నేను చూసిన సినిమా ఒక గొప్ప కావ్యం అని అంటే అతిసయోక్తి కాదేమో!!!!!
ఇకపోతే ఈ సినిమా విజయవంతమయ్యే అవకాశం చాలా, చాలా తక్కువ. మగవారు 80% ఈ సినిమా లో ఎక్కువ సేపు కూర్చోలేరు...ఎందుకంటే సున్నితమైన మనసున్న మగవారు చాలా తక్కువ కదండి? అమ్మాయి తన మానసిక సంఘర్షణ, తన ప్రేమ, తన భర్త గురించి మనకి చెపుతుంటే .......అలా రెండు గంటలు ఎలా గడిచాయో తెలియలేదు నాకు. పాటలన్ని ఎంతో బాగున్నాయి. పాత్రలు పోషించిన వారందరు చాలా బాగా చేసారు. ముఖ్య పాత్రలు మూడు. తండి పాత్ర, అక్క పాత్ర వేసిన వారు కూడా చాలా బాగా చేసారు. సినిమా అంతా కథ మీదే ఉంటుంది. Absolutely no commercial elements at all. అసలు deviation అన్నది లేదు story line నుండి..... నాకు effective gaa చెప్పటం చేతకాలేదనిపిస్తుంది...కాని మొత్తానికి తెలుగు సినిమా కూడా బాగుందండోయి అని గర్వం గా చెప్పుకోగలను అనిపించింది. మీరెవ్వరైనా ఈ సినిమా చూస్తే మరి మీ అభిప్రాయాలు పంచుకోవడం మరచి పోకండి. ఇంకెవ్వరైనా ఈ సినిమా రివ్యు అందం గా రాస్తే చదవాలని కూడా ఉందండోయి.
Subscribe to:
Posts (Atom)