Friday, November 30, 2012
Thursday, November 29, 2012
శ్రీవారు, శ్రీమతి మాట్లాడుకుంటే?
బోరు గా ఉందోయి, ఒక బీరు కాయ వెయ్యనా?
నాకు అలాగే ఉంది, మరి నేను కూడా అదే పని చెయ్యనా?
రామా,కృష్ణా... పాపం పాపం..ఎంత మాట!
మరి అదే! నేను చేస్తే పాపం, నువ్వు చేస్తే సరేనా?
వితండ వాదం! హమ్మా?
హాపి హవర్ ఉంది, ఆలశ్యం గా వస్తా సాయంత్రం.
నేను కూడా సాయంత్రం సినిమాకి చెక్కేస్తా సరేనా?
నీ ఇష్టమోయి! అయినా, అంత మంచి సినిమాలేమున్నాయి చెప్మా?
అంటే వెళ్ళొద్దు అనే కదా నీ ఉద్దేశం?
అన్యాయం!నేనలా ఎప్పుడు అన్నాను?
ఉషో ఉష్! ఈ రోజంతా బిసి బిసి...
అలసి సొలసి పోయా.. తినటానికేముందోయి?
డబల్ ఉషో ఉష్! ఈ రోజంతా బాక్ టు బాక్ మీటింగ్స్
అదే ప్రశ్న నాది కూడా..తినటానికేముందబ్బా?
దారుణం!అలసి సొలసి ఇంటికి వస్తే భోజనం కూడా లేదా?
నన్ను డిస్ట్రబ్ చెయ్యకోయి,కాసేపు రిలాక్స్ అవుతాను.
దానికేమి భాగ్యం? అలాగే, నేను కూడా కాస్త రిలాక్స్ అవుతా.
నెట్ బ్రౌస్ చెసే బదులు,ఏదన్నా ఉపయోగ పడే పని చెయ్యచ్చు కదా?
మరి మీరు చేస్తున్న పని ఏమిటో, రిలాక్స్ అవుతానంటూ..
అనవసరం! నే చెప్పినదే వేదం అని మన పెళ్ళి చేయించిన పూజారి చెప్పలేదు?
ఏమిటోయి ఈ మధ్య పరధ్యానం ? ఎక్కువ మాట్లాడటం లేదు నువ్వు?
ఓహో? అలాగే? నువ్వు ఎప్పుడన్నా సంభాషణ మొదలుపెట్టావా?
అబ్బా, అలా కాదు, నువ్వు మాట్లాడాలి, నేను వినాలి, అది రూలు
అహా? ఏమి సెలవిచ్చారండి? నేనేమన్నా కాలక్షేపం బట్టానినా?
ఎంత మాట! నువ్వు మాట్లడకపోతే ఇల్లంతా మూగపోతుంది తెలుసా?
ఇంకేముంది?అల్ప సంతోషి ఆ శ్రీమతి మురిసిపోయింది, శ్రీవారు అన్న ఆ మాటలకి..
(సరదాగా నవ్వుకోటానికి మాత్రమే రాసిన పోస్ట్ ఇది.)
Subscribe to:
Posts (Atom)

