అన్నపూర్ణమ్మ గారి కంట్లో పడితే తమకి బడిత పూజ తప్పదని తెలిసిన ఆ అరుగురు గప్ చిప్ గా ఇంట్లోకి దూరి పడుకున్నట్లు నటించసాగారు.లక్ష్మి బయట పని ముగించుకుని ఇంట్లోకి వస్తూ పడుకున్నట్లు నటిస్తున్న శేఖర్ ని చూసి ముసి ముసి నవ్వులు నడుచుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది.
అన్నపూర్ణమ్మ గారికి ఒక్కగానొక్క కూతురు సత్యవతమ్మ.సత్యవతిని తన పిన్నమ్మ కొడుకు విశ్వనాధంకి ఇచ్చి పెళ్ళి చేసింది ఆవిడ.విశ్వనాధంకి,సత్యవతికి ఆరుగురు సంతానం.మొదటి సంతానం అబ్బాయి,మిగతా ఐదుగురు అమ్మాయిలే.విశ్వనాధంగారు ఊరిలో పేరున్న పెద్దమనిషి.నలభై ఎకరాల భూమికి ఆసామి కావడమే కాక,ఆ ఊరికి పంచాయితి ప్రెసిడంట్ కూడా.ఊరిలో ఎవరికి తగువులు వచ్చినా విశ్వనాధంగారి దగ్గరికే తీర్పు కోసం వచ్చేవారు.ముక్కు సూటి మనిషి,నిజాయితికి మారు పేరు ఆయన.ఊరిలో అందరికి అయనంటే ఎంతో గౌరవం.ఎప్పుడు వేసే విస్తరి,తీసే విస్తరి అని అన్నపూర్ణమ్మ ఎంతో విసుక్కుంటూ ఉండేది.సత్యవతి మాత్రం భర్త చెప్పినట్టు నడుచుకునేది.విశ్వనాధంగారికి కొబ్బరి తోటలు ఉండేవి.ఏటా కొబ్బరి దిగుబడి బాగా వచ్చేది.చెరుకు పండించి బెల్లం తయ్యారు చేసి అమ్మేవారు.ఊడ్పు భూమిలో ధాన్యం పండించేవారు.వీటన్నిటితో పాటు సిగరెట్టు కూడా తెగ కాల్చేస్తూ,రాత్రైయితే కొద్దిగా పుచ్చుకోవటం లాంటి వ్యసనాలు కూడా ఆయనకి ఉండేవి.
విశ్వనాధంగారు కాంగ్రెస్స్ వాది.ఆ ఊరిలో,జిల్లాలో కాంగ్రెస్స్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.ఒక్కగానొక్క కొడుకు మాత్రం విధ్యార్ధి దశలోనే కమ్యునిస్ట్ పార్టి సిద్ధాంతాలకు ఆకర్షింపబడి కమ్యునిస్ట్ పార్టిలో సభ్యత్వం తీసుకున్నాడు.విషయం తెలిసిన తరువాత విశ్వనాధంగారి కోపానికి గురైనా తను మాత్రం నమ్మిన సిద్ధంతాలను,పార్టీను వదలలేదు ఆయన కొడుకు.కొడుకుతో పాటు ఐదుగురు కూతుర్లు కూడా నెమ్మదిగా అన్నగారి బాటలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలనే ఇష్టపడేవారు.ఐదుగురు కూతుర్లకు పెళ్ళిల్లు చేసి గోదావరి జిల్లా అల్లుల్లనే తెచ్చుకున్నారు విశ్వనాధం గారు.కొడుకు ఆదర్శ వివాహం,కానీ కట్నం లేకుండా పెళ్ళి చేసుకుని తండ్రితో పాటు వ్యవసాయం చేసుకుంటూ అదే ఊరిలో తల్లితండ్రి,అమ్మమ్మతో నివసించేవాడు.
విశ్వనాధంగారి కొడుకు సంతానమే వంశీ.శేఖర్,రూప,రమ్య,రవి,గోపాల్ విశ్వనాధంగారి ఐదుగురు అమ్మాయిల సంతానం.వీరందరు ప్రతి వేసవి సెలవలకు కలుసుకుంటారు.కలుసుకున్న ఆ రెండు నెలలలో వారి అల్లరికి అంతు ఉండేది కాదు.విశ్వనాధంగారికి,సత్యవతిగారికి మనవలంటే ప్రాణం.వారు ఆడింది ఆట,పాడింది పాటగా గడిచేది ఆ రెండు నెలలు.అన్నపూర్ణమ్మ మాత్రం ఎప్పుడు విస్సుకుంటూ,వారి అల్లరి మితి మీరినప్పుడల్లా వారి మీద చెయ్యి చేసుకోడానికి కూడా వెనకాడేది కాదు.అందుకే ఆ ఆరుగురికి అన్నపూర్ణమ్మగారంటే గారంటే మాత్రం చాలా భయ్యం.
పదమూడేళ్ళ లక్ష్మి తల్లీతండ్రి ఆ ఊరిలో మగ్గాల మీద వస్త్రాలను నేసేవారు.చేదోడు వాదోడు గా ఉంటుందని అన్నపూర్ణమ్మ గారి ఇంట్లో పనికి పంపించేవారు.దాదాపు అదే వయస్సు ఉన్నవారు ఆ ఇంటి మనవలందరు.అందుకే వారందరితో కలిసి ఎన్నో ఆటాలు ఆడేది లక్ష్మి.తెల్లవారుఝామునే వచ్చి అన్ని పనులు చక్కబెట్టే లక్ష్మిని చూస్తే ఆ ఆరుగురికి చాలా ఆశ్చర్యంగా ఉండేది.ఒక్క రోజైనా తాము లక్ష్మి కంటే ముందుగా లేచి లక్ష్మి కోసం వీధి అరుగు మీద కూర్చుని ఎదురు చూస్తామని పందెం కట్టారు ఆ ఆరుగురు.పందెం ఆరుసార్లు ఓడిపోయారు.పందెం గెలిసినప్పుడల్లా వారు ప్రతి వారం పొలం వెళ్ళి తాగే ముంజి కాయ నీరు తనకే ఇచ్చెయాలనేది లక్ష్మి.
"బారెడు పొద్దెక్కింది.ఇంక లెగుస్తారా"అంటూ అన్నపూర్ణమ్మ అందరిని తట్టిలేపింది.అందరు లేచి కాలకృత్యాలు తీర్చుకుని,ఇంట్లో చావిడి దగ్గర సమావేశం అయ్యారు.ఆ గ్రూప్ కి లీడర్ శేఖర్,వంశీలు.వారు చెప్పినట్టు మిగతావారందరు నడుచుకునే వారు."లక్ష్మి మీద పందెం మనం ఇంకెప్పుడు గెలవలేమా అన్నయ్యా"అని అడిగింది రూప.అలోచిస్తున్న శేఖర్ "నాకొక అద్భుతమైన ఇడియా వచ్చింది"అంటూ...బావ వంశీ చెవిలో ఏదో గుసగుస లాడాడు.వింటూనే వంశీ ఆనందంతో చిన్నగా విస్సిల్ వేసాడు.విషయం తమకి కూడా చెప్పమని మిగతావారందరు గొడవ చేసారు.వారందరికి నెమ్మదిగా లోగొంతులో వంశీ చెప్పసాగాడు ఆ రాత్రి తాము ఏమి చెయ్యదలచారో...
చిన్న నాటి మధుర స్మృతులు... :)
ReplyDeleteగడిచిపోయిన ఆ రోజులు మరి రావు కదండి.మిగిలేదల్లా మధురస్మృతులే!
Deleteధన్యవాదాలు శర్మ గారు మీ వాఖ్యకి.
నెక్స్ట్ నెక్స్ట్ ప్లీజ్ :)
ReplyDeleteఅసలే చిన్న పిల్లాడివి. నెక్ష్ట్ పార్ట్ లో దడుచుకుంటావేమో హర్షా. :)
Deleteమీ మదిని వీడని ముచ్చట్లు, మా హృదిని స్మృశిస్తున్నాయి.
ReplyDeleteబాగున్నాయండి కోనసీమ కబుర్లు.
భారతి గారు, చదివి స్పందించిన మీకు ధన్యవాదాలండి.
DeleteVery nice! Are you going to continue "ameica chaduvulu" ,in 6 parts u covered upto middle school very nicely. My on is freshmen in H S. eargly waiting for ur new posts on that. I felt if i knew all that infi u shared when my son is in elementary or middle, we would be making better choices, thanks in advance
ReplyDelete:) Thanks.I will complete that series soon.
Deleteఒక్కో పోస్ట్ లో ఒక్కో అంశాన్ని వివరిస్తున్నారు.అక్కడి ప్రకృతిని కూడా వర్ణించటం బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు రవిశేఖర్ గారు.
Deletebaagunnayi mi kaburlu e madya kanipinchadam ledu miru
ReplyDeleteమంజు గారు, బాగున్నారా? :)
Deleteఇది కధ కాదు...అవునాండీ వెన్నెల గారూ?
ReplyDeleteలేబల్ చూడండి ఒకసారి.... :))
Deleteఅనుకున్నానండీ...మీరిలానే జవాబిస్తారని...
ReplyDelete