సమయం రాత్రి ఒంటిగంట దాటింది.అమావస్య కావటం వలన,చిక్కటి చీకటి ఆ అరుగు అంతా వ్యాపించి ఉంది.ఆరుబయట అరుగు మీద ఆరు మంచాల మీద ఆ ఆరుగురు వళ్ళు మరచి హాయిగా నిదురపోతున్నారు.ఇంతలో ఆ వీధిలో కుక్క ఒకటి బాధగా మొరిగింది.పక్కనే ఉన్న మిగతా కుక్కలు కూడా "భౌ""భౌ"మంటూ మొరగసాగాయి.గదిలో పడుకున్న అన్నపూర్ణమ్మకి నిద్రాభంగం కలిగింది.ఇలా కునుకు పట్టిందో లేదో,ఇంతలోనే వెధవ గొడవ అని విసుక్కుంటూ,ఆ చీకట్లో తడుముకుంటూ నడచి వెళ్ళింది.వీధి గుమ్మం తలుపు తీసి,కర్ర ఒకటి తీసుకుని కుక్కలన్నింటిని గట్టిగా బెదిరించింది.కుక్కలు ఆ వీధి దాటి పారిపోయాయి.అన్నపూర్ణమ్మ అరుగు దాటి తన గదిలోకి వెళ్ళి,తలుపు దగ్గరగా వేసి పడుకుంది.
అదే సమయంలో అరుగు మీద పడుకున్న ఆరుగురిలో ఒకరైన వంశీకి చట్టుకున్న మెలకువ వచ్చింది.ఎవరో తన భుజం మీద చెయ్యి వేసి లేపినట్టుగా అనిపించింది.వంశీ వయసు పదకొండు సంవత్సరాలు.అర్ధరాత్రి ఉల్లిక్కిపడి లేవడం వలన,అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది.కళ్ళు పోడుచుకున్నా కనపడని చీకటిలో వంశీకి తన పక్కన పడుకున్న వారెవ్వరు కనపడలేదు.పక్కన కప్పుకోకుండా మడత పెట్టి ఉన్న దుప్పటి లాక్కొని మొఖ్ఖం మీదగా పూర్తిగా కప్పేసుకుని,భయ్యంతో వణికిపోతున్నాడు.అరగంట గడిచాక నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు వంశీ.
అదే సమయంలో అరుగు మీద పడుకున్న ఆరుగురిలో ఒకరైన వంశీకి చట్టుకున్న మెలకువ వచ్చింది.ఎవరో తన భుజం మీద చెయ్యి వేసి లేపినట్టుగా అనిపించింది.వంశీ వయసు పదకొండు సంవత్సరాలు.అర్ధరాత్రి ఉల్లిక్కిపడి లేవడం వలన,అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది.కళ్ళు పోడుచుకున్నా కనపడని చీకటిలో వంశీకి తన పక్కన పడుకున్న వారెవ్వరు కనపడలేదు.పక్కన కప్పుకోకుండా మడత పెట్టి ఉన్న దుప్పటి లాక్కొని మొఖ్ఖం మీదగా పూర్తిగా కప్పేసుకుని,భయ్యంతో వణికిపోతున్నాడు.అరగంట గడిచాక నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు వంశీ.
"లెగు తొందరగా,లక్ష్మి వచ్చేస్తుంది.వినిపిస్తుందా?"అని తనని పట్టుకుని కుదిపేస్తున్న బావ శేఖర్ ని చూసి,ఒక్క ఉదుటున మంచం మీద నుంచి కిందకు దూకాడు వంశీ.అప్పటికే శేఖర్,రవి,రమ్య,రూప,గోపాల్ అందరు లేచి తన మంచం చుట్టూ గుముకూడి ఉండటం చూసాడు వంశీ.అక్కడ ఉన్న అందరి వయసు 10-12లోపే ఉంటుంది.వారందరూ సెలవలకి పట్టణాల నుంచి అమ్మమ్మ,తాతయ్య నివసిస్తున్న కోనసీమలో ఒక పల్లెటూరికి వచ్చారు.వారి అల్లరికి అంతు లేదని మామ్మగారు అన్నపూర్ణమ్మ విసుక్కుంటుంటే,ఆవిడ కూతురు సత్యవతమ్మ నా మనవలకేంటి బంగారం అని మురిసిపోతూ ఉంటుంది.
చుట్టూ ఇంకా కొద్దిగా చీకటిగా ఉండడం చూసి "టైమెంత"అని అడిగాడు వంశీ బావ శేఖర్ ని."ఐదు గంటలు దాటింది.లెగు,ఈ రోజైనా మనం పందెం ఓడిపోకూడదు"అన్నాడు శేఖర్.అయినా ఇప్పటికే లక్ష్మి వచ్చేసిందో ఏమో?రూపా, బయట కల్లాపు జల్లి ముగ్గు పెట్టి ఉందేమో చూడు"అని ఆర్డర్ జారి చేసాడు శేఖర్."అలాగే ఉండు చూసేసి వస్తా"అని రెండు అడుగులు గుమ్మం వైపు వేసి,ఆగిపోయింది రూప."అమ్మో!ఈ చీకట్లో ఒక్కదాన్నే నేను వెళ్ళలేను.రమ్య,నువ్వు కూడా రా"అని చెల్లెలి చెయ్యి పట్టుకుంది రూప."వద్దు అందరం కలిసే వెళదాము"అని రూప బెరుకుగా అన్న రవి వైపు చూసింది."అంత పిరికితనం ఏంటీ అసలు మీ అందరికీ?సరే పదండి"అని శేఖర్ ముందు నడవగా మిగతా ఐదుగురు అడుగులో అడుగు వేస్తూ అతనిని అనుసరించారు.
అప్పటికే అన్నపూర్ణమ్మ లేచి వంటగదిలో మజ్జిగ చిలకరిస్తుంది.మామ్మగారు చూస్తే ఎక్కడ తమ మీద విరుచుకుపడతారో అని ఆ అరుగురు శబ్ధం చెయ్యకుండా వీధిలోకి వెళ్ళారు.అక్కడ ముంగిట ముగ్గు లేదు.ఆనందంతో అందరు పొంగిపోయారు.మొత్తానికి ఇన్ని రోజులకి లక్ష్మి మా చేతిలో ఓడిపోయింది అనుకుని ఒకరినొకరు కౌగిలించుకుని,"భలే"అని సంతోషంతో ఉప్పొంగిపోతుండగా ఇంట్లోంచి బక్కెట్టు,చీపిరి కట్ట తీసుకుని లక్ష్మి బయటికి అడుగుపెట్టింది.లక్ష్మిని చూడగానే అందరి మొఖ్ఖాలు మాడిపోయాయి."నువ్వెప్ప్పుడొచ్చావు?"నోరు తెరుచుని లక్ష్మిని చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్.ఫక్కున నవ్వింది లక్ష్మి."ఎప్పుడా?కోడి మొదటి సారి కూసినప్పుడు"అని కొంటెగా జవాబు చెప్పింది.ఇది అరోసారి మీరందరు నాతో ఓడిపోవడం"అని అంది.ఇంతలో అన్నపూర్ణమ్మ గట్టిగా అరిచింది వంటగదిలోంచి"ఎవరితోనే లక్ష్మి,పొద్దునే ఆ ముచ్చట్లు నీకు?"."వద్దు వద్దు చెప్పొద్దు"అని బతిమాలసాగారు ఆ అరుగురు."ఎవరితోను లేదమ్మా",అని కల్లాపు వెయ్యడంలో నిమగ్నమైపోయింది లక్ష్మి.
Maree intha chinna post aa? Aina bavundi...Waiting for next part....
ReplyDeleteనిరు గారు, ఎప్పుడు రాసే చాటభారతం తో పోల్చుకున్నారనమాట.అందుకని చిన్న పోస్ట్ గా అనిపించేసింది మీకు. అలా టక్కున చదివేసి, ఇలా కామెంట్ పెట్టిన మీకు ధన్యవాదాలు.
DeletePlz continue
ReplyDeleteఅలాగేనండి.మీ ప్రోత్సాహం ఉంటే తప్పకుండా..ధన్యవాదాలు.
DeleteVennela gaaru
ReplyDeleteGood !
Please dont take me otherwise but what I noticed is, when ever you write on current day to day things/life happenings you have good grip on your writings when compared to other kinds
I believe you can do much better on this! keep going.
Surabhi
You are always right Surabhi gaaru. I have to do a better job on this series or else it will soon be very boring. However this series comes out from one of the beautiful phases of my life-childhood. No matter how I write, this one will be dear to my heart. Thank you very much for reading the post and will appreciate if you can critique my writing whenever you find some free time. :)
Deleteమరిన్ని ముచ్చట్లుకై తదుపరి టపాకోసం వేచి చూస్తున్నామండి ...
ReplyDeleteభారతి గారు,ధన్యవాదాలండి.
Deleteఇంటరెస్టింగ్, కంటిన్యూ కంటిన్యూ :)
ReplyDeleteఅయ్యబాబోయి..బాబోయి...హర్ష గారేనాండి? మీరు అనుమతి ఇచ్చేసాక ఇంక తిరుగేముందండి? ఆయ్ ,అలాగేనండి!
Deleteకధన్నమాట....బాగుందండి.
ReplyDeleteమా కోనసీమ కబుర్లనమాట!ధన్యవాదాలు పద్మార్పితగారు.
Deleteఊ...
ReplyDeleteఇంట్రెస్టింగ్.. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్ :-)
ReplyDeleteThank you venu gaaru.
Deleteఊ...తర్వాత...చెప్పండీ బాబూ...
ReplyDeleteచెప్పామండి.ఇక మీరు చదవడమే తరువాయి...
Deleteబాల్యం ..లొకి తీసుకు వెలుతున్నారన్నమాట. వెరీ వెరీ నైస్
ReplyDeleteThank you vanaja gaaru
Deleteచాలా చాలా బాగుంది వెన్నెలగారూ... బాల్య జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే... :) మీ రైటింగ్ స్టైల్ బాగుందండీ...
ReplyDeleteధన్యవాదాలు శోభ గారు.
Deleteకోన సీమ లో మీ బాల్యం గురించి చెబుతుంటే మా బాల్యం గుర్తొస్తుంది.వర్ణన బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు రవిశేఖర్ గారు.
Delete