"అక్కా నీతో మాట్లాడాలి" చిన్నాన్నగారి అమ్మాయి గీత ఫోన్ చేసి అడిగింది. రేపు మాట్లాడుకుందాము, మధ్యానం లంచ్ కి కుదురుతుందా? అని అడిగాను. మేమిద్దరం పని చేసే ఆఫీస్లు దగ్గర కావటం వల్ల అప్పుడప్పుడు ఇలా లంచ్ లో కలుసుకోవడం పరిపాటే! ఇద్దరము దగ్గరలో ఉన్న ఒక రెస్టారంట్ లో కలిసాము. కొద్దిగా దిగులుగా కనిపించింది గీత. "ఏంటి మీ ఆయనతో గొడవ పడ్డావా?" అని అడిగాను. "లేదక్కా, చిన్ను గురించి" అంది. "చిన్ను? వాడికేమైంది? ఆరోగ్యం బాగుంది కదా?" కొంచెం ఆదుర్దాతో అడిగాను. చిన్ను గీత కొడుకు, నాలుగు సంవత్సరాలు వాడికి. "ఆరోగ్యం బానే ఉంది, కాని వాడితో పెద్ద చిక్కొచ్చి పడింది అక్కా,వాడి ఏజ్ కి చాప్టర్ బూక్స్ కూడా చదువుతున్నారు, వీడు అసలు రీడింగ్ చెయ్యటంలేదు. అన్ని విషయాలలోను చురుకుగానే ఉంటాడు, రీడింగ్ అంటే చాలు, అసలు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. దానితో అసలు వీడికి రీడింగ్ వస్తుందా అని బెంగగా ఉంది " అంది."ఫర్వాలేదులే నెమ్మదిగా చేస్తాడులే రీడింగ్, ఇంకా చిన్నవాడే కదా" అన్నాను. "ఎంటక్కా అలా మాట్లాడతావు, మా neighborhood లో వీడి ఏజ్ వాళ్ళందరూ చదువుతున్నారు. వీడికి ఎమన్నా ప్రోబ్లం ఉందేమొ" అని బాధపడుతున్న కస్సిన్ ని చూస్తే నవ్వొచ్చింది. ప్రస్తుతం చిన్ను ఒక pre-school కి వెళుతున్నాడు.అందరి పిల్లలాగే చలాకిగా ఉంటూ, బాగా తెలివైన వాడని అనుకుంటూ ఉంటాము. "ఇదేమంత బెంగ పడాల్సిన విషయం కాదు. ఇంకొక సంవత్సరం ఆగు,చక్కగా చదువుతాడు." అని సమాధానపరిచాను. గీత దిగులు నేనైతే పోగొట్టలేనని తెలిసి టాపిక్ మార్చి కాసేపు ఇండియా విశేషాలు మాట్లాడుకుని తిరిగి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయాము.
Elementary school లో కి అడుగు కూడా పెట్టని చిన్ను గురించి అంత దిగులు పడుతున్న గీత అందోళనను నేను కొట్టి పాడెయ్యలేను.కాంపిటీషన్ అలానే ఉంది మరి. 2 సంవత్సరాల వయసు నుంచే రీడింగ్, లెక్కలు రుద్దేస్తున్న కాలమిది. అమెరికన్స్ వారికి పుట్టిన పిల్లలందరికీ చాలా చిన్న వయసు (ఆరు నెలల వయసు) నుండే పుస్తకాలు చదివి వినిపిస్తూ ఉంటారు. పిల్లలు పుస్తకం లో బొమ్మలు చూస్తూ అల్లరి చేస్తూనే ఉంటారు, అయినా వారికి బుక్ రీడింగ్ చేస్తూ చిన్న వయసు నుంచే ఒక మంచి అలవాటును వారికి నేర్పుతారు. ఇక్కడ Elementary school (k-5/6) అంటే kindergarten నుంచి ఆరవ (6) తరగతి లేక ఐదవ (5) తరగతి వరకు విధ్యార్ధులు ఈ స్కూల్స్ లో చదువుకుంటారు.ఇక్కడ కొద్ది మంది తప్ప ఎక్కువ సాతం ఇండియన్స్ పబ్లిక్ స్కూల్స్ కే వెళతారు.ఫీస్ లు ఉండవు. ఖర్చు పెద్దగా ఉండదు. ఎక్కువగా రక రకాల బుక్స్ రీడ్ చెయ్యటం, కొద్దిగా బేసిక్ మేత్ నేర్పడం తప్ప kindergarten, 1st గ్రేడ్ లో పెద్దగా చదువు చెప్పటం అంటూ ఉండదు. కాని నాకు తెలిసి చాలా రకమైన క్రేఫ్ట్ వర్క్, ఇంకా రంగు రంగుల పెన్సిల్స్ తో బొమ్మలు వేస్తూ, ఆర్ట్ వర్క్ చేస్తూ, ఆడుకుంటూ, స్కూల్ కి వెళ్ళడం అంటేనే ఇష్టపడేటట్టూ గా ఉంటుంది మొదటి రెండు సంవత్సరాల ప్రాధమిక విద్య. ఎక్కువగా నీ గురించి, నీ కుట్టుంబం గురించి రాయమని రైటింగ్ assignments ఉంటాయి. ఒక లైన్ లో ,కాని రెండు లేదా మూడు లైన్స్ లో ఎదో వంకర టింకరగా అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పదాలతో రాస్తూ ఉంటారు విధ్యార్ధులు. హోం వర్క్ అంటూ ఏమి ఉండదు. స్కూల్ డ్రెస్స్ కూడా ఉండదు. ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించవచ్చు. ఇలా ఆడూతూ పాడుతూ కాలం గడిపేస్తున్న విధ్యార్ధులకు తల్లి తండ్రులకు తెలియకుండానే కొన్ని స్టేట్స్ లో (అన్ని స్టేట్స్ లో పబ్లిక్ స్కూల్స్ లో ఈ పరీక్షలు ఉండక పోవచ్చు,New york, Virginia, Maryland, DC, California, North Carolina, kansas etc..) అకస్మాత్తుగా ఒక పరీక్ష పెడతారు. అవి ఇంటెల్లిజెన్స్ -తెలివి తేటలను పరీక్షించే టెస్ట్స్. సాధారణంగా phsycologists IQ level తెలుసుకోవడం కోసం ఈ పరీక్షలు పెడుతూ ఉంటారు. వీటినే 1st గ్రేడ్ చివరిలో కాని, 2nd గ్రేడ్ లో కాని పెడతారు. నాకు తెలిసిన ఈ పరీక్షల పేర్లు- Cognitive abilities tests (verbal aptitide, non verbal aptitude, quantitave aptitude), Naglieri Non-Verbal Ability Test ( non verbal aptitude ), Otis-Lennon School Ability Test (verbal aptitide, non verbal aptitude ) etc... వీటినే gifted and talented tests అని కూడా అంటారు. ఈ పరీక్షలలో cuttoff మార్కులు తెచ్చుకుంటే స్కూల్ administration తల్లి తండ్రులకు ఒక లెటర్ ద్వారా తెలియపరుస్తారు మీ పిల్లలు Gifted and Talented మొదటి రౌండ్ లో సెలెక్ట్ అయ్యారు అని. అప్పుడు కాని తల్లి తండ్రులకి ఇలాంటి పరీక్షలు ఉంటాయి అని కూడా తెలియదు. తర్వాత రౌండ్ లో ఒక application process లో విధ్యార్ధుల గ్రేడ్స్ 1st గ్రేడ్, 2nd గ్రేడ్ వి, వాళ్ళ టీచర్ రికమ్మండేషన్స్ లాంటివి జోడించి ఇంకో కమిటీ కీ పంపుతారు. అందులో కూడా సెలెక్ట్ అయితే, అప్పుడు ఆ విధ్యార్ధులను 3rd గ్రేడ్ నుంచి gifted and talented (GT) కిడ్స్ అని చెప్పి వారిని వేరే స్కూల్స్ కి పంపుతారు. కొన్ని స్టేట్స్ లో వేరు గా అలా స్కూల్స్ ఉండవు ( ఆ స్టేట్ budget బట్టి ఉంటుంది), అలాంటప్పుడు అదే స్కూల్స్ లో విడిగా ఈ GT కిడ్స్ ని pool చేసి చదువు చెపుతారు. వీరి curriculum కొద్దిగా లెక్కలలో, science లో అడ్వాన్సడ్ గా ఉంటుంది.లెక్కలలో మాత్రం ఒక గ్రేడ్ ముందుగా చదువుతారు. (అంటే 3rd లో ఉంటే 4th గ్రేడ్ మేత్ చేస్తారు). science లో ప్రాజెక్ట్ వర్క్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి.
ఒకప్పుడు ఇలాంటి పరీక్షలు ఉంటాయని కాని, ఇలా
సెలెక్ట్ చేస్తారని కాని మాకు తెలిసేది కాదు. స్కూల్ నుంచి సెలక్ట్ అయ్యరని తెలిసేది అంతే.ఇప్పుడు వలస వచ్చిన భారతీయులు ఎక్కువ అయిపోయి, అన్ని విషయాలు ముందుగా తెలుసుకుని,ఈ పరీక్షలకు పిల్లలను ప్రిపేర్ చెయ్యడం మొదలుపెట్టారు.పుట్టగొడుగులుగా coaching centers వెలిసాయి. పుస్తకాల వేట మొదలుపెట్టి కొన్ని excercise books చేయించ సాగారు. మనం చదువలకు ఇచ్చే విలువ అలాంటిది. నాకైతే ఆ స్కూల్స్ లో వాళ్ళు చెప్పే చదువుకంటే అందరూ తెలివైన పిల్లలు ఒకే చోట ఉండటం వలన, మన పిల్లలు మంచి వాతావరణం లో ఉంటారు. ఇప్పుడు మా గీత అవేదన మీకు అర్ధం అయ్యే ఉంటుంది ఎందుకు చిన్ను ఇంకా బుక్ రీడింగ్ చెయ్యటం లేదని బాధ పడుతుందో. ఈ GT పరీక్షల గురించి తల్లితండ్రులు పడే stress (అవునండీ, రెండవ తరగతి చదువుతున్న పిల్లల గురించి stress (7 year kids)) , GT/ non GT kids elementary స్కూల్ లో అభ్యసించే విద్య, వాటి వివరాలు ఇంకో పోస్ట్ లో...

good, continue.
ReplyDeleteThank you so much!
Deleteమన వాళ్ళు ఈ comparison గొడవల్లో ఎక్కువగా మునిగి తేలుతున్నారు. ఈ మాత్రం దానికి ఖండాలు ధాటి రావాలా? అక్కడే వుంటే పోలా !! ముందు మనకు ఏమి కావాలో తెలిస్తే, పక్కోల్లకు ఏముందో మనకు అవసరం లేదు. మావాడికి Gifted School లో సీట్ వొచ్చినా, ఈ జనాలా comparison గొడవలో నలిగి పోతాడని వేరే స్కూల్ కి పంపిస్తున్నాం. ముందుగా తల్లిదండ్రుల ఆలోచనలు, నడవడిక మారాలి.
ReplyDeleteనేను అర్ధం చేసుకోగలను మీరు అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో!కాని తప్పదు, మనం అందరితో coexist అవ్వాలి. Comapare చేసుకునేవారిని చేసుకోనివ్వండి. మీ అబ్బాయి, మీరు కలిసి మీ గోల్స్ set చేసుకుని ముందుకు సాగండి.ఇంకా రాబోయే పోస్ట్ లో మనవాళ్ళు ఈ education system ని ఎలా మార్చేస్తున్నరో కూడా రాస్తాను. అన్ని చదవండి. ధన్యవాదాలు రాంగారు.
DeleteNice post..keep writing..this would help allot of new parents with kindergarten kids..if possible we will divide these posts by individual states..but there won't be much difference. You are covering all the topics. Keep writing..nice work.
ReplyDeleteThank you. I will try my best to share all my experiences. Follow these posts and please suggest if it's any different in any other states.
Deleteఅమెరికా చదువుల గురించి తెలియజేసినందుకు వెన్నెల గారికి ధన్యవాదాలు!
ReplyDeleteధన్యవాదాలు నాగేంద్రగారు.
Deletebaagundi
ReplyDeleteధన్యవాదాలు మురళి గారు.
Deleteఏదేశమేగినా ,ఎందుకాలిడినా ............ మన సమస్యలు మనను వీడ వన్న మాట
ReplyDeleteఅయ్యో మురళి గారు..ఇంకా మా కష్టాలు గురించి మీరు చదవనే లేదు.. మీకు టైం ఉంటే నా అనుభావలన్ని పంచుకుంటాను ఈ అమెరికా చదువులు పోస్ట్ ద్వారా.. ఇక్కడ భరతీయులు పడే stress మీరు అర్ధం చేసుకోగలుగుతారు.
Deleteబాగా వ్రాసారండి.
ReplyDeleteఓపికగా చదివి స్పందించినందుకు ధన్యవాదాలండి. ఇంకా ఎన్ని పార్ట్స్ రాయగలనో కాని, అనుభావాలన్ని పంచుకోవాలని ఉంది.
Deleteజలతారు వెన్నెల గారూ,
ReplyDeleteనేను ఈ సిరీస్ ని శ్రద్ధగా follow అవుతాను. మంచి పని చేస్తున్నారు ఇలా ఓపికగా వ్రాస్తూ. మేము ఉండేది న్యూ జెర్సీలో. మా స్కూల్ డిస్ట్రిక్ట్ చాలా సాధారణమైనది. Edison స్కూళ్ళు బాగుంటాయి అని విన్నాను. అంటే బాగా చెప్తారు అని కొందరి ఉద్దేసం. ఇక ప్రిన్స్టన్ దగ్గర ఉండే మా స్నేహితురాలు తన కష్టాలు చెప్పుకుంటుటుంది. నాకు కొంచెమే అర్థమౌతాయి. మా దగ్గర వాతావరణం చాలా లైటు. ఇక్కడా చైనా హవా, దేశీ హవా లేకపోలేదు. కానీ ఆ జట్టులో నేను లేను. అది మంచో చెడో తేల్చుకోలేకపోతున్నాను. మేము ఇలా ఓ మామూలు స్థాయి బడిలో వేసి పిల్లలకి తల్లిదండ్రులుగా మేము ఏర్పరచవలసిన environment లో లోపం చేస్తున్నామా అనిపిస్తుంటుంది. అది కాక నాకు పెద్ద లోపం అనిపించేది ఇంకొకటి, ఇతర స్కూళ్ళతో interaction లేకపోవడం. మేము science fair అనో లేక వక్తృత్వ పోటీలనో లేక ఇంకా కొన్ని ఇతర రకాల schhol exhibitions లో పాల్గొనే వాళ్ళం. పాల్గొనే వాళ్ళే కాక మొత్తం స్కూలు పిల్లల్నందరినీ తీసుకెళ్ళి చూపించే వారు వేరే స్కూళ్ళలో జరిగే events ని. అలాగే స్కూలు వాళ్ళే రక రకాల పోటీలకి expose చేసే వాళ్ళు. ఇక్కడ (ప్రభుత్వ) పాఠశలలలో అటువంటివి చూడలేదు. Talented and Gifted పిల్లల చేత ఒక ప్రత్యేక కార్యక్రమం చేయించారు. దానికి ఆ పిల్లల తల్లి దండ్రులను మాత్రమే ఆహ్వానించారు. కనీసం ఆ తరగతి వాళ్ళు కూడా చూడలేదు. ఇది నాకు తప్పనిపించింది. అలాగే టీచరుని బట్టి ఉంటుంది. మంచి టీచరు దొరికితే ఎంత అదృష్టమో. లేదా తల్లి దండ్రులే పూనుకుని awareness పెంచుకుని అక్కడికీ ఇక్కడికీ తీసుకు వెళ్తుండాలి, ఆ పరిక్ష, ఈ పరిక్ష వ్రాయించడం చెయ్యాలి. ప్రభుత్వ పాఠశాలలో చాలా సౌకర్యాలు ఉంటాయి . కానీ వాటిని తెలుసుకుని ఉపయోగించుకోగలగడం అనేదే పెద్ద విద్య. ఇదంతా మా పిల్లలు ఏదో పొడిచెయ్యాలని కాదు, వాళ్ళకి ప్రపంచం తెలియాలి అని. ఆ ప్రపంచంలో తామేంటో తెలియాలని. ఇంతకన్నా మెరుగ్గా ఎవరికైనా తెలిస్తే పంచుకుంటే నా లాంటి వారికి ఉపయోగపడుతుంది.
ఇన్ని చెప్పినా మళ్ళీ ప్రతి సారీ పిల్లలకీ నాకూ వత్తిడి లేకుండా కాలం గడుస్తోంది. వాళ్ళ ఆసక్తులు వాళ్ళకి ఉన్నాయి. స్నేహితులతో ఆడుకోవడానికి సమయం బోలెడు దొరుకుతోంది. బానే ఉందిలే అనేసుకుని ముందుకు వెళ్తుంటాను.
మీ టపాలు చదివితే ఇంకొంచెం స్పష్టత ఏర్పడుతుందేమో చూద్దాం.
లలిత గారు మీరు ప్రోత్సాహానికి చాలా తాంక్స్.మనం ఇక్కడ చదువుకోకపోవడం వలన మనకు ఇక్కడ system గురించి అంత గా తెలియకపోవటం వలన, కొన్ని అవకాశాలు మన పిల్లలు కోల్పోవడం జరుగుతుంది.M.S లాంటి ఉన్నత విధ్యలు అభ్యసించినా ఆ అనుభవం
DeleteK-12 guidance కి ఉపయోగపడదు అని తెలుసుకున్నాను.
Elementary schoolవరకు ఫర్వాలేదు. Middle, High schools ఒక రకంగా turning points అని చెప్పవచ్చు. కాని అన్ని county's లోను అన్ని programs ఉండాలని లేదు కదా..అలాంటప్పుడు ఏమి చెయ్యాలి , ఇలా ఎన్న్నో విషయాలు నేను తెలుసుకున్నవి, మీరు నా అనుభవాల ద్వారా తెలుసుకోగలిగితే అంతే చాలు.
చిన్న వయసు వారికే అబాకస్ సెంటర్స్ కూడా వున్నాయట కదా అక్కడ !ఇక్కడ చాలాకాలం నుండే వున్నాయి.ఇవి 4 to 6 సం : వారికోసమట !అమెరికాలోనెలకి 1000 డాలర్లని విన్నాను.ఒబామా గారు ఇండియా పిల్లలు మాత్స్ ,,సైన్సు లలో భారతీయులు ముందు కెలుతున్నారు.మీరు పోటీ పడండి అని చాలా సార్లు పిలుపిచ్చారు.ఇంకా వ్రాయండి ఆసక్తికరం గా వుంది తెలుసుకోవాలని..
ReplyDeleteALOHA centers లాంటివి చాలా వచ్చాయి అండి. అన్ని రకాలా coaching centers/Educational aids గురించి రాస్తాను. తప్పకుండా నా అనుభవాలన్ని చేసుకుంటాను.మీకు ధన్యవాదాలు.
Deletevennala gaaru,
ReplyDeleteAppreciate your post. Really good job trying to come up with this topic. I will follow the seris.
I live in CT, we do not have the concept of testing at Kindergarten to 2nd grade.But class teacher will observe the child from K to 2 nd grade and they will assess the child at the end of 3rd grade, identify the gifted and talented kids and recomend them for GT curriculum within the school.
Here within the public school system we do have magnet school system where they will select the kids at elementary level based on lottery system. These schools will be theme oriented like STEM concept, art& literature etc, for middle schools it is thru tests.
at my home one goes to regular public school and the other to magnet school with STEM concept, I do clearly see the difference in curriculum.
My little one is in prek and does not show any interest in reading but for now I'am not much worried thinking that he will pick it up ( or may be I have expereinced with older one and assume that at this young age almost every kid is smart just few differences in their interests. Reality comes when they move to higher classes and if they can retain their smartness with so many deviations, distractions,activities and pressures)
Looks like my comment is becoming a post. sorry for using lots of space
Thank you for the comment. Don't think that you are taking up space. Please share whatever you can as everyone's experience is unique and I am sure there will be other people who will be benefited by anything you say on this topic. I will try to write about the entire K - 12 journey and I should say 9-12 is the most stressfull one. Again thanks for the comment.
DeleteGood Post, informative post andi.
ReplyDeleteధన్యవాదాలండి మీకు!
Deleteచాలా విషయాలు తెలిసాయి..కాని వాళ్ళు ఒక మంచి ఉద్దేశ్యం తో పెట్టె పరీక్షలు మనం అది
ReplyDeleteకూడా పోటీ ప్రపంచం గా చేస్తే ఎలా?చేప నీటిలో ఉండగలదు ..ఈదగలదు...పక్షి ఎగారగలదు...
వేటికి ఏవి సరిపోతాయో అక్కడే ఉండాలి అప్పుడే అవి చక్కగా ఎదగ గలవు...
ధన్యవాదాలు శశి కళ గారు. బాగా చెప్పారు. ఇక్కడ విపరీతం గా పోటీ ప్రపంచం అయిపోయింది.
Delete