ఈ రోజు ఉదయం నిద్ర లేపుతూ శ్రీవారు నీకు ఒక వార్త చదివి వినిపించాలి అని "ఇంటర్ సెంకడియర్ ఫిజిక్స్ పేపర్ చాలా కష్టం గా ఉండటం మూలాన, అంధ్రాలో 31 శాతం విద్యార్థులు ఫిజిక్స్లోనే ఫెయిల్ అయ్యారని....విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారని". "You must be kidding, కల ఎమన్నా కన్నావా?" అని అడిగాను.లేదు కావాలంటే చూడు, అని అంధ్రజ్యోతి online న్యూస్ పేపర్ చూపించారు. నా నిద్ర మత్తు అంతా ఒక్క నిమిషం లో ఎగిరిపోయింది.
అంధ్రాలో ఇంటర్ సెంకడియర్ ఫిజిక్స్ పేపర్ కష్టం గా ఉంటే మధ్య నాకెందుకు అంత కుతూహలం అనుకుంటున్నరా? గత మూడు వారాల నుండి నాకు, మా వారికి ఫిజిక్స్ అన్న ఒక్క పదం తెచ్చిన నిదుర లేని రాత్రులు గుర్తుకు వచ్చాయి.గత 3 నెలలుగా కాలేజ్ ఫిజిక్స్ తో కుస్తీ పడుతున్న మా అమ్మాయి "అమ్మా,నాకు ఫిజిక్స్ లో 'A' రాదేమో" అని రోజూ గొడవ చేసేస్తుంది. "ఫర్వాలేదమ్మా, కష్టపడు ఫలితం భగవంతుడికి వదిలెయ్యి" అని అంటే వినదు. ఎలాగన్నా సాధించి తీరాలన్న పట్టుదల ఉంది. కాని మొదట్లో కొన్ని టెస్ట్స్, quizzes లో తక్కువ మార్కులు రావడం తో బెదిరి పోయి మాకు ఫోన్లు.ప్రోబ్లెంసెట్స్ కష్టంగా ఉన్నాయంటూ కొన్ని సార్లు,ప్రొఫెస్సర్ అంత బాగ కాన్సెప్ట్స్ క్లియర్ చెయ్యటం లేదంటూ కొన్ని సార్లు,తను బాగా చదివాననుకున్నా ప్రొఫెస్సర్ ఎంతో కష్టమైన పేపర్ ఇచ్చారని కొన్నిసార్లు, ఇలా రాత్రి , పగలు ఒకటే ఫొన్లు. అమ్మాయి ఫోన్ అనగానే,గుండె గాబరా అనే స్థితికి వచ్చేసాము నేను ,మా శ్రీవారు.
అమ్మాయి బాధ పడుతుంది అంటే శ్రీవారికి అంతులేని బాధ." అమ్మా ఫిజిక్స్ drop చెసెయ్యి తల్లీ" అని అనగానే మా
అమ్మాయి " I am not a looser " అంటూ ఎగిరిపడటం. పోనీ "How about one on one tutoring?" అంటే "No,why? నేను అలా నేర్చుకోలేను.అయినా ఎందుకు డబ్బులు దండగ? అంత డబ్బు ఖర్చు పెట్టి నేను "A" తెచ్చుకోవాలా? నాకు తృప్తి ఉండదు" అంటూ మళ్ళీ ఎగిరిపడటం. పొనీలేమ్మా "B+" or "B" కో settle అయిపో" అంటే రుద్రమదేవిలా "అమ్మా!! నీకసలు ఎమన్నా తెలుస్తోందా?" అంటూ ఫోన్ కట్ చెయ్యడం.ఈ విధంగా "ఫిజిక్స్" అన్న మాట వింటేనే ఎదో బాంబు పడట్టు ఫీల్ అవుతున్న తరుణంలో అంతకు ముందు రోజు మా అమ్మాయి ఫోన్ చేసి, "అమ్మా, నాకు ఇంక ఒక 60% వస్తే నాకు "A" వచ్చినట్టే ఫైనల్ టెస్ట్ లో" అని చాలా సంబరంతో చెప్పింది."Good Job" అని పొగిడేసి మాకు ఫిజిక్స్ కష్టాలు తీరిపోయినట్టే అని సంబరపడిపోయి నేను, మా శ్రీవారు తప్పకుండా celebrate చేసుకోవాలి అని అనుకుని నిద్ర పోయాము. Celebrate చేసుకోవాలనుకున్నది మా అమ్మాయికి "A" వస్తుంది కదా అని కాదండోయి..మాకు ఫిజిక్స్ ఫోన్స్ ఇక రావు అన్న సంబరంతో. ఇంతలో ఉదయాన్నే ఈ వార్త పేపర్ లో...అందుకని...ఏమిటో అందరు ఫిజిక్స్ భాదితులేనా అని ఒక్క క్షణం అనిపించింది.
(తరువాయి పోస్ట్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టం గురించి కొన్ని వివరాలు పోస్ట్ చేస్తాను. నా అనుభవాలు మీలో చాలా మందికి ఎవేర్నెస్స్ కలిగించవచ్చు , ఇంకా చిన్న పిల్లలు ఉన్నవారికి ఉపయోగపడచ్చు. బోర్ అనుకున్న వారు బిందాస్ గా స్కిప్ చెయ్యవచ్చు)

వెన్నెల గారూ పిల్లల చదువులు ఈ రోజుల్లో కత్తి మీద సాములా వున్నాయండీ...మీ పాప ఇండియాలో చదువుతో౦దా?
ReplyDeleteజ్యోతిర్మయి గారు, సబ్జెక్టు పరంగా గ్రేడ్స్ ఇండియా లో లేవనుకుటున్నాను.
Deleteజ్యోతిర్మయి గారు, అమ్మాయి undergrad 1st year ఇక్కడే వేరే స్టేట్ లో చదువుతుందండి. రాం గారు, మీరు guess చేసింది కరెక్టే!
Deleteమరీ అన్నేసి దొరల భాష మాటలు అలవోకగా వాడేస్తే మా లాంటి వాళ్ళకి కష్టం కదా. దేనినయినా ఇష్టపడితే కష్టం ఉండదు. ఇష్టపడకపోతే కష్టం ఉంటుంది, అదీ సంగతి. అది చెప్పండి అమ్మాయికి, అప్పుడు, అమ్మాయే క్లాస్ ఫస్ట్ ఫిజిక్సులో
ReplyDeleteతప్పకుండా మీ మాట గా చెపుతానండి. దొరల భాష మీద మక్కువ ఏమీ కాదండి..తొందరలో హడావిడిగా పోస్ట్ చేసేసానండి.
Deleteజలతారు వెన్నెల గారు, ఫిజిక్స్ అంటే అదేమన్నా దయ్యమా ????? అదో సబ్జెక్టు అంతే !!!! .... కాని నా కాలేజీ రోజుల్లో, నాకు మాత్రం ఫిజిక్స్ ఓ దయ్యం, భూతం, రాకాసి , రక్కసి ....
ReplyDeleteపాపం పిల్లల కోణం నుంచి చూస్తే జాలేస్తోంది... నేర్పే వాళ్ళు ఈ భయాల్నిపోగొట్టాలని ఆశిస్తూ....
నిజమేనండి.దెయ్యం కాదు, భూతం కాదు, కాని ఇక్కడ ఫిజిక్స్ చాలా కష్టం అండీ.అనుభవం తో చెపుతున్నాను. తను high school లో basic physics skip చేసి college credit తీసుకోవటం వల్ల fundamentals solid గా లేవేమో అని నేననుకుంటున్నాను. కాని ఎలాగో బయటపడినట్టే అనుకుంటా..
Deleteఏ సబ్జెక్ట్ అయినా కష్టమనుకుంటే భూతమే! అదే ఇష్టపడితే దానంత గొప్పది ఉండదు అనిపిస్తుంది. ఇంటర్లో నాకు కూడా ఫిజిక్స్ అంటే భయం ఎందుకంటే దానిలో ఉన్న మాధుర్యం అప్పుడు నాకు తెలియదు. కాని ఇప్పుడు ఓస్ అదా అనే స్థితికి వచ్చా! ఎప్పుడూ మాష్టార్లు చెపుతారు లేదా చెప్పట్లేదు అని బాధపడటం కన్నా మనమే దాని సంగతేంటో తీల్చేసి పది మందికి చెప్దాం అన్న ఆలోచన వచ్చిన నాడు దేనికీ భయపడం. అంత డబ్బు ఖర్చు పెట్టి నేను "A" తెచ్చుకోవాలా? నాకు తృప్తి ఉండదు" అన్న మీ అమ్మాయి మాటలు చూస్తుంటే నాకెందుకో తను స్వయంకృషిని నమ్ముకునే వ్యక్తిగా అనిపిస్తోంది. అటువంటి వారిని ఎల్లప్పుడూ విజయం వరిస్తుంది. నా తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పండి!
ReplyDeleteరసజ్ఞ గారు, ముందుగా మీకు స్వాగతం. నిజమేనండి. తనకు తానుగా ఎన్నో పుస్తకాలను రిఫెర్ చేసి తనే ప్రోబ్లెంసెట్స్ ఎన్నో చేసుకుని, crack చేసాను అని చెప్పింది.కష్టపడుతుంది, నాకదే చాలు. A వచ్చినా, B వచ్చినా నాకైతే తను సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలు. మీ మంచి మనసుకు , మా అమ్మాయికి ఇచ్చిన బెస్ట్ విషెస్ కి ధన్యవాదాలండి.
Deleteఈ సం:ఏమయిందంటే బ్లూ ప్రింట్ ప్రకారం ఇవ్వకుండా వేరే
ReplyDeleteఅంశాల్లో ఇచ్చారు.పిల్లలేమో అవి రావనుకొని చదవలేదు.కాని తెలివైన విద్యార్థులు అన్ని చదువుతారు కాబట్టి వారికి 60/60 కూడా వచ్చాయి .ఈ సం:మాత్రమే ఈ సమస్య. ఇక పోతే ఫిజిక్స్ బోధన సరిగా లేకపోతే కష్టమే!నేను ఫిజిక్స్ టీచర్ ను.8 th 10 వరకుచెబుతాను.దీనిలో సమస్య ఏంటంటే భోధించే తప్పుడు నిత్య జీవితం తో అనుసంధానించి చెప్పకపోతే కాన్సెప్ట్స్ అర్థం కావు.మార్క్స్ కోసమే చదివితే ఇలాగే వుంటుంది.
అందుకే నేను విజ్ఞాన శాస్త్రము ( http:cvramanscience.blogspot.in) అనే బ్లాగు పెట్టి కొంత ప్రయత్నం చేస్తున్నాను.గమనించగలరు.మీ అమ్మాయికి కూడా మీరు వివరించే విధం గా వుంటుంది ఈ బ్లాగు.గమనించగలరు.అలాగే www.physics.org,www.khanacademy.com,www.brightstorm.com వంటి వెబ్ సైట్స్ లో maths,physics,chemistry ల గురించి video lessons కూడా వున్నాయి.
మీ ప్రయత్నం అభినందనీయం .అక్కడి విద్యా వ్యవస్థ గురించి వ్రాయండి.మేము తెలుసుకుంటాము.ఈ విషయం లో నేను మన సిస్టం గురించి తెలియ జేస్తాను.మీరన్నట్టు ఇది పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది.
భారథ్ లో ఐ .ఐ.టి ఎక్షామ్ అంత కష్టం గా ప్రపంచం లో ఏ ఎక్షామ్ వుండదు.అందులో ఫిజిక్స్ ఇంకా కష్టం.
రవిశేఖర్ గారు, బ్లూ ప్రింట్ అంటే?మీరు ఫిజిక్స్ టీచర్ అని నేను ఇంతకు ముందే గ్రహించాను. మీరు చెప్పిన sites అన్నీ చూస్తాను.మా అమ్మాయితో పాటు నేను కూడా తెలుసుకున్న ఎన్నో విషయాలు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టం గురించి త్వరలో పోస్ట్ చేస్తాను.
Deleteఅంటే ఏ పాఠం లోఎన్ని ప్రశ్నలు ఇవ్వాలి,ఏ భావనల కు ఎంత శాతం weightage ఇవ్వాలి అని.ఇవన్నీ ముందే నిర్ణయించి అన్ని కాలేజి లకు పంపుతారు.దాని కనుగుణం గా బోధన జరుగుతుంది.అలా ఈసారి ఇవ్వలేదన్న మాట. మీరు నా విజ్ఞాన శాస్త్రము బ్లాగు చూడగలరు.
Deleteఓహో!అలాగా? చూస్తానండి తప్పకుండా..
Deletemee ammayiki "best of luck"
ReplyDeleteika ikkada science ante battikottadame,
nijame,e year physics debbaki inka yedusthunna pillalu, pillala perents ee urlo kuda chaalaa mande.
Thanks bhaskar gaaru.
DeleteSurprising! అక్కడ కూడానా? Physics లాంటి సబ్జెక్ట్ భట్టీయం వేయిస్తే నిజంగానే చుక్కలు చూపెడుతుంది. కానీ చదివించే మాష్టారు కాస్తంత practicalగా నేర్పితే, మా చెడ్డ interestingగా ఉంటుంది.
ReplyDeleteఏదేమయినా - మీ అమ్మాయి పట్టుదల మాత్రం నాకు మా బాగా నచ్చింది. అట్టా ఉండాలి. కాస్తంత భయం, ఆసక్తి, పట్టుదల.
ఇక్కడ కూడా తనకు వచ్చిన ప్రొఫెస్సర్ మీద చాలా అధారపడి ఉంటుందండి. మీ స్పందనకు ధన్యవాదాలండి
Deleteఇంటర్ లో జాయిన్ అవ్వగానే ఫిజిక్స్ అంటే ఒక భూతం అని పిల్లల మనసులో ముద్ర వేస్తారు, అలా మానసికం గా వాళ్ళను భయపెట్టే ఈ రోజు ఫిజిక్స్ లో అంత మంది ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం అని నేను విశ్వసిస్తాను.
ReplyDeleteమీ అమ్మాయి కి అభినందనలు అండీ, మీ అమ్మాయి ఆత్మవిశ్వాసానికి జోహార్లు.
నిజమే high school లో fundamentals బాగా నేర్చుకుంటే కాలేజ్ లెవెల్ లో అంత కష్టం కాకపోవచ్చు ఏమో. మీకు ధన్యవాదాలండి.
Delete"ఫర్వాలేదమ్మా, కష్టపడు ఫలితం భగవంతుడికి వదిలెయ్యి"
ReplyDeleteBindaas Phylosophy
:)
మరి ఏమీ చెయ్యమంటారండి? అంత కంటే నేను చెయ్యగలిగింది ఎమీ లేదు. ప్రయత్న లోపం ఉండకూడదు..అని చెప్పటం తప్ప..మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteఫిజిక్స్ ఫీవర్ అన్ని చోట్లా ఉంది..అన్నమాట. అన్నట్లు వెన్నెల గారు.. మీకు ఫిజిక్స్ అంటే భయమేనా!? అబ్బ..ఆ సబ్జక్ట్ అంటే..నాకు భలే బోర్ అండీ!కొందరికి ఏమో కరతామలకం.
ReplyDeleteమీ పాప.. కి అల్ బెస్ట్ చెప్పండి. సాధించి తీరాలనే తపన ఉంటే.. ఆకాశం అయినా అందుతుంది. పాపాయికి దీవెనలు. తనకి తెలుగు వచ్చా!? నేర్పించారా!?
సమయం కుదుర్చుకుని ఇలా పోస్ట్ లు కూడా వ్రాయండి. మీ శైలి బావుంది.
నేను చదువుకునేటప్పుడు నాకు ఫిజిక్స్ అంటే అంత భయ్యమున్నట్టు నాకు గుర్తు లేదు వనజ గారు. అంటే ఫిజిక్స్ కష్టమైన సబ్జెక్ట్ అన్నది నిజమే, అర్ధం చేసుకుంటేనే కాని మంచి మార్క్స్ తెచ్చుకోలేము అన్నది మాత్రం నిజమే!కాని మొదటి సారి మా అమ్మాయి ఫిజిక్స్ బుక్ తీసి చూసా..అమ్మో గ్రీక్ and లాటిన్ లాగే అనిపించి మూసేసాను. అమ్మాయిని దీవించిన మీకు , అందరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. తెలుగు చాలా బాగా వచ్చు అండి. నేను నేర్పించినది ఏమీ లేదు. కాని తెలుగు లో అనర్గలం గా మాట్లాడుతుంది. అర్ధం కూడా చేసుకుంటుంది. నా ENGLISH-తెలుగు మిక్ష్ posts కొన్ని మీరు చూస్తారు ఇక పై..ప్రయత్నిస్తాను తెలుగులోనే పూర్తిగా రాయడానికి.
Delete