ఇకనైనా నీ వ్యసనాన్ని వదులుతావా?
ఎన్ని సార్లు చెప్పినా నీ చెవికెక్కదా?
ఆరోగ్యం దెబ్బ తింటుందని చెప్పినా ఫర్వా లేదా?
నిద్రలేమితో బాధపడుతున్నా దాన్ని మాత్రం వదలవా?
పైగా విడదీయలేని అనుబంధం అంటున్నావా ?
దాన్ని వదలేస్తే నీ జన్మ నిరర్ధకమంటున్నావా?
వ్యసనాలెవరికి లేవని ప్రశ్నిస్తున్నావా?
పదపదహారవ శతాబ్దం నాటిది, నేను కనిపెట్టలేదంటావా?
ఉదయం లేవగానే రోజు దానికోసం నీ వెంపర్లాటా?
రోజంతా దానితో లెక్కలేన్నన్ని సార్లు సావాసమా?
నువ్వు తొందర్లో నేను కావాలో ,అది కావాలో తేల్చుకో!!!
హమ్మయ్య! ఈ రోజుకి ఈ తిట్ల దండకం ముగిసింది..
ఇదండి నేను రోజు వినే సుప్రభాతం!
హాయిగా "కాఫీ" తాగుదాము, వస్తారా?
నాకు అమితానందాన్ని ఇచ్చే పదాలు.."కాఫీ రెడీ"
ఏ రోజైతే తాగానో కాఫీ...ఆ ఆ ఆ....పాట వినండి!
తెలుగులో కాఫీని ఏమంటారు చెప్మా? తెలిస్తే చెప్పండి ప్లీస్!

ఇలా అయితే కష్టమే...
ReplyDeleteకదండి! మీ సానుభూతి/support కోసమే ఈ పోస్ట్ అండి!
Deleteధన్యవాదాలు జ్యోతిర్మయి గారు.
kauphy.
ReplyDelete:)) ఇంగ్లీష్ లో రాసారా కాఫీ ని? మీకు స్వాగతం నా బ్లాగ్ కి
Deleteధన్యవాదాలండి.
కుడితి?
ReplyDeleteరామ రామ! కుడితేంటండి వినడానికి క్లాస్ గా లేదండి..నాకు కాఫీ అంటేనే బాగుంది.
Deleteక్లాస్ గా ఉంది...
:)) ధన్యవాదాలండి.
మొదట పారా చదువుతున్నంత సేపు ఈ సుప్రభాతం అంతా నాకే అనుకున్నానండీ :))
ReplyDeleteఅంటే నాకు, కంప్యూటర్ కి వున్న బంధం గురించి క్లాసు తీసుకున్నారనుకున్నా :):)
తప్పదండీ కొన్ని లేకుండా ఉండలేం :)
చూసి చూడనట్టు వదిలేయాలండీ :)))
హా హా హా! కంప్యూటర్ కి అంత సీను లేదండి! రొజల్లా తాగే కాఫీ కి మాత్రమే ఈ తిట్ల దండకం! చూసి చూడనట్లు వదిలేస్తున్నానోచ్ ఈ రోజు నుండి..మా ఫోటాన్ గారి అండ చూసుకుని. :))
Deleteదాన్యవాదాలండి.
మీరు కాఫీ ప్రియులా? అమ్మో! ఇప్పుడు చెప్తే కొడతారేమో!!! నేను కాఫీకీ, టీకీ, కోక్ కీ చాలా దూరం. చిన్నప్పుడు మా ఇంటి పక్క మామ్మగారు నన్ను అస్తమానూ పిల్లా పిల్లా అని పిలిచి నీ పేరు పలకటం లేదు అందుకనే అలా పిలుస్తున్నాను అనేవారు. నన్నెవరయినా పిల్లా అంటే నాకు అస్సలు నచ్చదు. నాకేమో చాలా ఖోపం వచ్చేసేది. ఆవిడకి ప్రొద్దున్నే కాఫీ త్రాగటం అలవాటు. సరిగ్గా ఆవిడ త్రాగేటప్పుడే ఆవిడ దగ్గరకి వెళ్ళి మామ్మగారూ పాకీ (కాఫీని తిరగేసి) తాగుతున్నారా? అని చెవిలో త్రాగుతున్నంత సేపూ అంటూనే ఉండేదానిని. ఆవిడ పాపం నాకు నోరుతిరగక అలా అంటున్నాననుకుని అలా కాదమ్మా కాఫీ అనాలి అని చెప్పేవారు. అయినా నేను పాకీ పాకీ అనేదానిని. ఒక రోజున చెప్పేసాను. మీకు రసజ్ఞ అనడం రాకపోతే నాకు కాఫీ అనడం రాదు అని. ఇప్పటికీ ఆవిడ నేను కనిపిస్తే ఇదే చెప్తూ ఉంటారు.
ReplyDeleteఅమ్మాయి (అమ్మాయి is not equal to పిల్లా) రసజ్ఞా! అసలు ఒక మంచి అలవాటు ఉందామ్మా నీకు? అసలు ఈ కాలం లో పుట్టి ఇలా ఒక మంచి అలవాటు లేకుండా ఎలా ఉన్నావమ్మా? :))
Deleteమీరు మా కాఫీ ని పాకి అని తిట్టారు , అదేనండి మీరు చిన్నప్పుడెప్పుడో అన్నా సరే, కాఫీ అని అంత మాట అన్నారా లేదా? అందుకో మీకు మంచి అలవాట్లు లేవు అన్నాను.
సరదాగా అన్నాను..ధన్యవాదాలు రసజ్ఞ గారు.
తప్పదండీ!అలవాటయిపోయింది. స్నానం చేసేలోగా రెండు సార్లు తాగుతా రోజూ. ఆ తరవాత అస్సలు తాగబుద్ధికాదు అదేమిటో!!!
ReplyDeleteశర్మ గారు, మనలో మన మాట.. మీలా రెండు సార్లు తాగితే నాకు ఈ తిట్ల దండకం ఉండదండి.
Deleteరోజల్లా తాగుతూనే ఉంటాను (చాతకం గారు అన్నట్టు నన్ను కూడా దగ్గర వాళ్ళు కుడితి తాగినట్టు కాఫీ తాగడం ఆపుతావా అని అంటారు.) మీరు కూడా కఫీ ప్రియులైనందుకు సంతోషం. ధన్యవాదాలు మీ స్పందనకు.
తెలుగులో నిశివర్ణ ద్రవ పదార్ధం అంటారు :P
ReplyDeleteకాఫీ కోసం అయితే ఇలాంటివి ఇంకో రెండు డజన్లు అన్నా నేను పెద్ద గా ఫీల్ కాను :))) ఏదో ఒక వ్యసనం లేకుండా ఉంటె మరీ జీవితం బోరు గా ఉంటుంది :))
శ్రావ్య గారు, ముందుగా అందుకోండి అభినందనలు కాఫీ ని తెలుగులో ఏమంటారో చెప్పినందుకు.
Deleteఇప్పుడు చెప్పండి రహస్యం..కాఫీ ని "నిశివర్ణ ద్రవ పదార్ధం" అంటారని మీకెలా తెలుసు?
అహా! చెప్పండి అసలు, రోజుకి ఎన్నో కప్పులు కాఫీ తాగుతున్న నాకే తెలీదు, మీకెలా తెలుసు అన్నది నా పాయింట్. (అసూయతో వెన్నెల...)
అయినా నోరు తిరగకుండా ఆ పదం ఏంటండి? నాకు కాఫీ అనటమే బాగుంది.
మీరు కాఫీ కోసం తిట్లు పడచ్చు అంటారు! నిజమేనండి ఎదో ఒక వ్యసనం ఉండాలి! :))
ధన్యవాదాలు శ్రావ్య గారు
>>నిశివర్ణ ద్రవ పదార్ధం !!
Deleteనలభీములవారా చెప్పింది ?
@జలతారువెన్నెలగారుః ఎప్పుడొ ఒకసారి కాఫీ అంటే ఓకేగాని, ఎప్పుడూ కాఫీయేనా. అబ్బే భేషుగ్గా తేనీరు పట్టుకోండి :)
తేనీరు, పన్నీరు, కొబ్బరి నీరు ఎమీ వద్దండి. కాఫీ చాలు!
Deleteమీ స్పందనకు ధన్యవాదాలు. :))
ఫోటాన్ గారి మాదిరే మొదట నేను కూడా భుజాలు తడుముకున్నా!:) కాఫీగానీ,టీ,పాలులాంటివేవీ అలవాటులేదు గనుక భుజాలు మెప్పుకోలుగా చరుచుకున్నా! :):)
ReplyDeleteఏ అలవాటు లేదా మీకు? ఇప్పుడు తెలిసిందండి మీ టాలెంట్ రహస్యం.
Deleteఅందుకే అన్ని సొర చిత్రాలు ఒకటికి మించినవి ఒకటి స్రుజనాత్మకం గా వేయగలుగుతున్నారు.
మీ స్పందనకు ధన్యవాదాలండి విజయ మోహన్ గారు.
అలవాటైన వాటి గురించి వదులుకోలేనటువంటి వాటి గురించి క్యూరియాసిటీతో చదివేట్టు చెప్పారు...బాగుంది వెన్నెలగారూ...
ReplyDeleteవర్మ గారు,మీ స్పందన చాలా త్రుప్తినిచ్చిందండి.
Deleteధన్యవాదాలండి.
meeru coffe pichhi varena, nenu roujuku 10 to 15 thagevadina,
ReplyDeletenaa kisthamaina coffe ni okanoka samayam lo,
kasi lo coffe vadilesanu,aa photo kuda undali
now i am free from coffe
అదేంటండి అలా ఎలా మానేసారు. అది సాధ్యమేనా?
Deleteకాఫీ ఫ్రీ భాస్కర్ గారు, అందుకోండి మా అభినందనలు.
ఒక 20 సంవత్సరాల తరువాత నేను కూడా ట్రై చేస్తా కాఫీ ఫ్రీ అవ్వడానికి.
ధన్యవాదాలు మీ స్పందనకి.
ఈ వ్యసనంలో నేను రోజు మునిగి తేలతాను.
ReplyDeleteవీలయితే..ఒక కాఫీ.. నాలుగు కబుర్లు... That "s all :))
వనజ గారు, welcome to coffee club అండి.
Deletesame pinch! నేను కాకపోతే 4 కప్పుల కాఫీ ఒకటో, రెండో కబుర్లనమాట.
ధన్యవాదాలు వనజగారు.
వెన్నెల గారు మీకు మిథునం లోని కాఫీ దండకం పాట dedicating....ఎంజాయ్ ది కాఫీ :))
ReplyDeleteశేఖర్ గారు,మీ కామెంట్ చూడగానే వినేసాను ఆ పాట. వెంటనే బ్లాగ్ లో పెట్టేసాను.
Deleteమంచి పాట, అందులోను నాకు అతి ప్రియమైన కాఫీ పాటను నాకిచ్చారు (ఉందని చెప్పారు). ధన్యవాదాలండి.
చాలా మంది కాఫీతోనే నిద్ర లేస్తారు. అలాంటివారికి 'కాఫీ' సుప్రభాతమే!
ReplyDeleteకాఫిని తెలుగులో కూడా "కాఫీ... కాఫీ ..." అంటారనుకుంటా! అన్ని భాషలవారు ఇదే పదాన్ని వాడుతున్నారు.
నాగేంద్ర గారు, చెప్పనే లేదు మీరు కాఫీ తాగుతారా లేక మీకు ఆ అలవాటు లేదా?
Deleteమీ స్పందనకి ధన్యవాదాలండి.
vennelagaroo, vadalaleni alavaatla meeda bhaanam sandinchaaru
ReplyDeleteఫాతిమా గారు, మీకు కూడా కాఫీ క్లబ్ కి స్వాగతం! నిజమేనండి వదలలేని అలవాటు కాబట్టే దాన్ని వ్యసనం అన్నాను. మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteమరీ ఎక్కువ సార్లు త్రాగకండి.కెఫీన్ ఎక్కువైతే ప్రమాదం.ఒకటి ,రెండు సార్లు అయితే పర్లేదు.
ReplyDeleteమీరు ఈ టపా చూడకపోతే బాగున్ను అని అనుకున్నండి రవిశేఖర్ గారు.
Deleteమీరు వ్యసనాల గురించి టపా రాసినప్పుడు, అందులో కాఫీ కూడా ఒకటి అని చెప్పడం గుర్తే! గట్టిగా చెపుతున్నారు ఇంట్లో, నెమ్మదిగా చెపుతున్నారు మీలా స్నేహితులు,బతిమాలుతున్నారు ఇంకొందరు..కాఫీ ఫ్రీ అవ్వమని. ప్రయత్నించడానికి కూడా మనస్సు అంగీకరించటం లేదు..కాని ప్రయత్నిస్తాను. ధన్యవాదాలండి రవిశేఖర్ గారు.
ఒక కప్పు కాఫి పడగనె
ReplyDeleteవికసించును మెదడు , స్తబ్దు వీడును - ఐనన్
ఒకటో రెండో తాగిన
సుఖ మిడు , అతి కూడ దెంత అమృత మైనన్ .
"అతి కూడదని" మీరు కూడా అనేసారా మాస్టారు?
Deleteఅలాగేనండి ప్రయత్నిస్తాను. :))
ధన్యవాదాలు మీ స్పందనకి
"కాఫీ"ని తెలుగులో ఏమంటారో ఏమో కానీ, నేను మాత్రం మీది వ్యసనం అని అననులెండి.
ReplyDeleteఅలా అంటే నాపై కాఫీ నీళ్ళు కన్నెర్ర చేస్తాయి:-)
హమ్మాయ్య! అయితే మీరు కూడా మా కాఫీ పార్టియే!
Deleteమీమీద కన్నెర్ర చెయ్యగలరాండి ఎవరైనా? Question does not arise అసలు!
కాఫీ అయినా మనిషైనా!! ధన్యవాదాలు మీ స్పందనకు పద్మార్పిత గారు.
బాగుంది. ఏదో ఒక అలవాటు లేకపోతే బోర్ కొడుతుందండి. కాకపోతే అల తాగుతూనే ఉంటారా ? ఎలా అంది బాబు. ఇంతకి ఈ సాంగ్ ఎక్కడ పట్టుకున్నారు.
ReplyDelete:venkat
తాగుతూనే ఉంటాననే కదండి తిట్ల దండకం! ఎలా అంటే అలానే మరి, ఏమో అలవాటయ్యింది అలా! పాట శేఖర్ గారు చెపితే "మిధునం" సినిమాలోది అని , విని embedd చేసాను.ధన్యవాదాలు మీ స్పందనకు.
Deleteఒక్క కప్పుకే ఇన్ని దండకాలా ;(
ReplyDelete"టీ" ని తేనీరన్నట్టు కాఫీ ని తెలుగులో "కాఫీ నీళ్ళు" అంటారేమో ;)
చిన్ని ఆశగారు మీరు కాఫీ కప్పులో కాలేసారు. అదేనండి పప్పులో కాలేసారు. అంతా కాఫీ మయం లా ఉంది ఈ జగత్తు నాకు! :))
Delete"రోజంతా దానితో లెక్కలేన్నన్ని సార్లు సావాసమా?" అని రాసానుగా..అంటే ఒక కప్పు కోసం ఇన్ని తిట్లు కాదు, ఎన్నో కప్పులకోసం ఈ దండకం అన్నమాట! "కాఫీ నీళ్ళు" భలే ఉందండి కాఫీ కి తెలుగు పేరు. అసలు కాఫీ నీళ్ళే ఎక్కువ తాగుతాను నేను. ధన్యవాదాలు మీ స్పందనకు.
నేను కాఫీ మానేసి చాలా కాలమైంది. సుమారు 3600 యుగాలు.ఇంకో 600 యుగాల దాకా చెయ్యి తీరుబడిగా ఉండదట. ఏంచేస్తాం? ప్చ్.
ReplyDeleteఏదో అస్మదీయులనుకున్నాను మీరు, ఇలా తస్మదీయులవుతారనుకోలెదండి.
Deleteమీరు నా బ్లాగ్ లో "దహా" అనలేదు అన్న బెంగ మాత్రం తీరటం లేదు. :))
ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు
బాగుంది మీ సుప్రభాతం.కాఫీ నీళ్ళు అనే ప్రయోగం చాలా చోట్ల విన్నాను. ఎప్పుడూ తేనీరే తప్ప కాఫీ అలవాటు లేదు నాకు.
ReplyDeleteమాధవ్ గారు, స్వాగతం నా బ్లాగ్ కి. ధన్యవాదాలండి మీ స్పందనకు.
Deleteకాఫీ లేకపోతే ఒక సెకను ఒక యుగం అని నా ఉద్దేశం ..... దహా.
ReplyDeleteపద్యం / దండకం చాలా బాగుంది....... దహా.
:))
Deleteధన్యోస్మి! అడిగిన వెంటనే వరమిచ్చేసారు.
కాఫీ అంటే...
ReplyDelete"క్షీర శర్కరీ మిశ్రిత కూర్గు గింజల వేడి కషాయము"
చూసారా నేను చెప్పేసాను...
నాకో స్పెషల్ ప్రైజ్ ఇవ్వాలి వెన్నెలగారూ!:-)
కాఫీ ఆరోమాని అలా పీలుస్తూ
ఆ కాఫీ పైన నురుగు పెదవులమీద చక్కిలిగింతలు పెడుతుంటే...
మొదటి సిప్పులో మజాయే వేరండీ....ఏమంటారు?:-))
@శ్రీ
"క్షీర శర్కరీ మిశ్రిత కూర్గు గింజల వేడి కషాయము"
Deleteఅవునా? మరి శ్రావ్య గారింకేదో చెప్పారే...కాఫీ అంటేనే బాగుంది లెండి.
ధన్యవాదాలండి మీ స్పందనకు.
వెన్నెలగారూ!
ReplyDeleteవ్యాఖ్య చేసేముందు అన్ని వ్యాఖ్యలు చూసానండి...
నిశివర్ణద్రవ పదార్ధం అంటే నల్లని రంగు గల ద్రవ పదార్ధం అని...
అంటే బ్లాక్ కాఫీ అన్నమాట...
నేను వ్రాసింది
పాలు పంచాదారల్తో కలిసిన కాఫీ గింజల కషాయం....
అంటే మనం తాగే కాఫీ అన్నమాట....:-)
కాఫీ అనేదే బాగుంది కానీ నేనే సరైన అర్థం చెప్పానండి...
:-))....:-))
@శ్రీ
అయితే నా ఓటు మీకే!! :))
Delete:)))
ReplyDeleteThank you.
DeleteCoffee vishayam lo no compromise..ilaage continue cheseyyandi..:-)
ReplyDeleteహా హా హా ! అంతేనంటారా?? అలాగేనండి!
Delete