Saturday, June 23, 2012

కొతగా రెక్కలొచ్చేనా? లేదే!!


"వెలుగు నీడలు"  ఆదుర్తి సుబ్బా రావు గారు direct  చేసిన సినిమాలో శ్రీ శ్రీ గారు రాసిన పాట ఇది. ఒక్క సారి జాగ్రత్తగా అన్ని లైన్స్ చదవండి. ఇది 1961 లో రాసారు శ్రీ శ్రీ గారు. అంటే స్వాతంత్రం వచ్చాక 14 సంవత్సరాల తరువాత...

"స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి..
సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయి...
ఆకాశం అందుకునే ధరలొక వైపు
అదుపులేని నిరుద్యోగముంకొక వైపు
అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు 
అలుముకున్న ఏ దేశం ఎటు దిగజారు?
కాంచవోయి నేటి దుస్థితి, ఎదురించవోయి ఈ పరిస్థితి

పదవి వ్యామొహాలు కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరి ఒకని దొచుకునే వాడే
తన సౌఖ్యం, తన భాగ్యం చూసుకునే వారె!
స్వార్ధమే అనర్ధ దాయకం
అది చంపుకొనుటే క్షేమదాయకం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చెరిననాడే లొకానికి మన భారత దేశం అందించునులే శుభ సందేశం"

సింధూరం సినిమా 1997 లో రిలీస్ అయ్యింది. "సింధూరం" క్రిష్ణవంశీ గారు   గారు direct  చేసిన సినిమాలో సిరివెన్నెల గారు రాసిన పాట ఇది.

"అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే

తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!"

1961 లో ఆనాడు దేశం లో ఉన్న పరిస్తితులకు, 1997 లో ఉన్న పరిస్తితులకు నాకైతే పెద్ద తేడా కనపడటం లేదు. అంటే అవినీతి, కులమతద్వేషాలు, స్వార్ధ పూరితమైన మనుషులు ఇప్పుడేమి పుట్టుకుని రాలేదు.మనం  అన్ని రంగాల్లోను ఎంతో అభివృద్దిని సాధించినట్టు పైన చెప్పిన వాటిలోను ఎంతో ముందుకు వెళ్ళాము. తప్పట్లు మనందరికి!!!!

అయితే ఇప్పుడొక సందేహం ..మరి ఇంక 30 సంవత్సరాల తరువాత, ఎలా ఉంటుందో మన దేశం ?  శ్రీ శ్రీ , సిరివెన్నెల లాంటి రచయతలు ఎలా రాస్తారో పాటలు. తెలుసుకోవాలని ఉంది!!!!

33 comments:

  1. అవినీతి,కులమతాలు, స్వార్థపూరిత రాజకీయాలు ...మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని మళ్లీ మళ్లీ మనకు గుర్తుచేస్తూ సినీరచయితలు పాటలు రాస్తుంటారు. అంతే తప్ప పెద్దగా తేడా వుండదు.

    ReplyDelete
    Replies
    1. అంతేనండి, నిజమే. మీ స్పందనకు ధన్యవాదాలు నాగేంద్రగారు.

      Delete
  2. మరో ముప్పయ్యేళ్ళ తరువాత కూడా మార్పేమీ రాదు.
    బహుశా అప్పటికి ఇలాంటి పాటలు వ్రాసే సినిమాలే ఉండకపోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా? ఇంకో శ్రీ శ్రీ కాని సిరివెన్నెల లాంటివారు కాని ఉండరంటారా?
      ధన్యవాదాలండి మీ స్పందనకు.

      Delete
  3. ముప్పై సవంత్సరాల తరువాత కూడా పరిస్థితులు ఇలాగే వుంటాయేమో వెన్నల గారు...అప్పుడు మనం అర్థ శతాబ్దం స్థానంలో శతాబ్దపు అని పాడుకోవడమే! కానీ ఆ కవులతో పాటు మనమూ కాంక్షించే ఆ సమసమాజం రావాలని ఆశిద్దాం!

    ReplyDelete
    Replies
    1. ఒక్కోసారి నవ సమాజం తప్పకుండా వస్తుందని అనిపిస్తున్నా, అప్పుడప్పుడు నిరాశగానే మిగిలిపోతుందేమో అని కూడ బాధ! ధన్యవాదాలండి మీకు.

      Delete
  4. మూడు దశకాలే కాదు మూడు శతాబ్దాలైనా పరిస్థితి మారదు.
    మనకున్న మిత్రులని అడిగి చూస్తే
    ఎంతమంది అవినీతిగా సంపాదిస్తున్నారో...
    ఎంతమంది అవినీతిని ప్రోత్సహిస్తున్నారో చెప్తారా?
    చస్తే చెప్పరు...ఇది పచ్చి నిజం
    మనకి అవినీతి గుర్తొచ్చేది...(చాలామందికి)
    మన పని..మనం అనుకున్న లంచంతో జరగనపుడు...:-)
    అందుకే మనం మనవంతు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి..
    అలాంటి పాటలు విన్నపుడు మనమీద కాదులే వ్రాసింది అనుకొని సంతోషిస్తాము..:-)
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. పాట వినేసి వదిలేస్తాము అంటారు. నిజమేనండి . ధన్యవాదాలు మీ స్పందనకు!

      Delete
  5. manchi visleshana chesaarandi, marpu sahajam , kaka pothe konni nidanamga jaruguthuntai, manam gurtinchalenantha.
    nice post, keep writing.

    ReplyDelete
    Replies
    1. మార్పు సహజం అంటారు. పోన్లెండి, మంచి మార్పు వస్తే అందరికి మంచిదే! ఆశిద్దాము ఆ రోజు రావాలని! ధన్యవాదాలు మీ స్పందనకు

      Delete
  6. "శతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా" అని రాస్తారు ఏమో అక్కా

    ReplyDelete
  7. స్వార్ధం పెరిగిపోతున్నంత కాలం ఇలాగే ఉంటుంది. నాకు మార్పు చూస్తానన్న నమ్మకంలేదు, ఇంకే చూస్తా ఎనభైలొస్తూంటే :)

    ReplyDelete
    Replies
    1. మీరలా అనకూడదు. రామ రాజ్యం మళ్ళీ చూస్తారు మీరు! (ఇప్పుడు కలలోనా అనొద్దు మీరు). ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  8. గాయం సినిమా లోని "స్వరాజ్యమవలేని సురాజ్య మెందులకు! అనేపాట కూడా మీరు చెప్పిన సందర్భానికి సరిపోతుంది .మీరు సమాజం గురించి దాన్లో రావాల్సిన మార్పు గురించి చాలా బాగా ప్రస్తావిస్తున్నారు.మీరు చెప్పిన అంశాలపై చాలా చెప్పాలని ఉంది.నా బ్లాగు లో వివరిస్తాను.సమాజం ఇంకా పతనపు అంచుల వైపు ప్రయాణిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. తప్పక వివరించండి. ఆ పాట మీరు చెపితే గుర్తొచ్చిందండి!
      ధన్యవాదాలండి మీ స్పందనకు, మీ అభిమానానికి కూడా.

      Delete
  9. okko paata vintunte assalu vaallu anta baagaa ela raasaara anipistundi....devudu vaallaki echina varamemo adi....mi tapaa baavundi vennelaa

    ReplyDelete
    Replies
    1. సిరివెన్నెల గారు మాట్లాడితే విన్నారా ఎప్పుడైనా?
      youtube లో "వెన్నెల్లో సిరివెన్నెల" 6 పర్త్స్ ఉన్నాయి.
      సమయం ఉన్నప్పుడు చూడండి. సరస్వతీ కటాక్షం ఉంది వారికి.
      ధన్యవాదాలు manju గారు..

      Delete
  10. తోంబయ్యవ దశకానికి ముందు, అందరూ ప్రభుత్వోద్యోగాలకోసం వేంపర్లాడేవారు. ప్రైవేటు ఉద్యోగాలంటే కాస్తో కూస్తో చిన్న చూపు. నిరుద్యోగ సమస్య ఉండేది. అంతకు ముందే పుట్టినా, ఏనభై తోంబైల్లో నక్సలిజం ఓ మంచి ఊపందుకోన్నది - కారణాలు అందరికీ తేలిసినవే! తోంబై తరువాత, గ్లోబలైజేషన్ పుణ్యమా అని, లైసేన్స్ రాజ్ రద్దయింది. ఏన్నో అవకాశాలు తలుపు తడితే, వాటితో పాటే తత్తుల్యమైన తలనోప్పులూ బయలుదేరాయి. ఉద్యోగావకాశాలు పేరిగాయి. సగటు సంపాదనా పేరిగింది. అభివృద్ధి చేందిన దేశాలతో పోల్చకపోతే - సౌకర్యాలూ మేరుగుపడ్డాయి. కానీ కుటుంబ వ్యవస్థ, ప్రకృతి వనరులు దేబ్బ తింటున్నాయి. జనాభా, ఉగ్రవాదం, తీవ్రవాదాలు అదుపు తప్పుతున్నాయి.

    ఈ లేక్కన, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చరిత్రను రేండుగా భావించవచ్చు. విభాగించే గీత తోంబయ్యవ దశకం. కులమత వైషమ్యం, అవినీతి అనేవి మటుకు - రేంటిలో ఉన్నాయి.

    ఇరవయ్యవ శతాబ్దంనుండి (1900 Onwards) చూసినట్లయితే, మోదట దేశం (స్వాతంత్ర్యం), తరువాత రాష్ట్రాలు (రాష్ట్రాల ఏర్పాటు), అటుపై ప్రాంతీయ వాదం అనే ఓక pattern కనిపిస్తుంది. ఇది మరింత సంకుచితంగా మారి ఆలోచనా విధానంలో వస్తున్న విచ్చలవిడితనం, మాస్/సోషల్ మీడియాల ప్రాబల్యం, దిగజారుతున్న విలువలు వంటి అంశాలను పరిగణనలో తీసుకున్నట్లయితే, బహుశః ముప్పై ఏళ్ళ తరువాత కుటుంబ/మానవ విలువల గురించిన ఘోష కనిపిస్తుందని నా అనుమానం. వీటితోపాటే, ప్రకృతికి మనం చేసిన/చేస్తున్న కీడును కూడా వర్ణిస్తూ వాపోతామేమో!

    ReplyDelete
    Replies
    1. Wow! Nice analysis!
      చాలా విషయాలు అర్ధం అయ్యేటట్టు చాలా బాగా వివరించారు/విష్లేషించారు.
      అమ్మో! భయ్యం గా ఉందండి మీరు చెప్పిన భవిష్యవాణి వింటుంటే! ధన్యవాదాలు మీ స్పందనకు. మంచి విషయాలు చక్కగా చెప్పారు.

      Delete
  11. అసలు అప్పటికి ఇలాటి పాటలు వ్రాయాలని అనుకునే వాళ్ళు ఉండరేమో!
    ఉండరు కూడా!!

    ReplyDelete
  12. సమాజంలో మార్పు అన్నది సహజం..అది ఎప్పుడూ జరుగుతూనే వుంటుందికదండీ..అప్పటికి ఇంకా ఈ దోపిడీ వ్యవస్థ మిగిలే వుంటే ఇంత కంటే బలమైన వ్యక్తీకరణతో పాటలు రాసే వారుంటారు.. ఏమైనా మంచి కంపేరిజన్తో రాసారు..అభినందనలు వెన్నెల గారూ...

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ చూస్తే సంతొషం అండి నాకు! మనల్ని ఉత్తేజ పరిచే ఇలాంటి గేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. మీ వాఖ్యకి ధన్యవాదాలు.

      Delete
  13. మరో ముప్పై యేళ్ల దాకా ఇవే పాటలు వింటూ కాలక్షేపం చేద్దామా -
    లేక మార్పు కోసం మనవంతు ప్రయత్నిద్దామా -
    ముందు ఎవరికి వారు తేల్చుకో గలిగితే -
    ముప్పై యేళ్ల దాకా ఆగక్కర్లేదు -
    మరో మూడేళ్లలో మార్పు చవి చూడ వచ్చు -
    నిరాశా వాదులు తాము చెడేది గాక -
    సమాజాన్ని కూడా చెరుస్తారు -
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. నిజమే మాస్టారు. అందరిలోను ఎన్నో మంచి అలోచనలు ఉన్నాయి, పరులకు చేతనైనంత సాయం చెయ్యాలని ఉంది. కాని ఇంకా అనుకున్నంత గా మార్పు రావటం లేదు. ఏ పని అయినా ఇది చేస్తే నాకు ఒరిగేదేమిటి అని అలోచించేవారు కూడా ఉన్నరు!! ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  14. సిరి వెన్నెల గారు రాసిన పాట
    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
    మారదు లోకం మారదు కాలం
    లింక్ http://ramugvs.blogspot.com/2011/07/blog-post_5232.html


    గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
    గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి
    ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
    ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
    రామబాణమార్పిందా రావణ కాష్టం
    కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

    తప్పంతా మనదే, ఎవ్వరు ఇలాంటివి ఆపలేరు.... ఆ నాడు ఆ దేవుళ్ళ వల్లనే కాలేదు....

    ReplyDelete
    Replies
    1. నిజమే రామ్ గారు. మాస్టారు గారు అన్నట్టు, మనలో మనకి క్లారిటి ఉంటే మార్పు తొందరలో తెచ్చుకోవచ్చు!! ధన్యవాదాలు మీకు

      Delete
  15. మన నాయకులు నడుపుతున్న ప్రభుత్వాలే మార్చలేని ఈ సమాజాన్ని మన
    కవులు రాసిన పాటలు మార్చలేవని నా అభిప్రాయం. మనమంతా మన బ్లాగ్లతో ఉన్న సమాజాన్ని వర్నిన్స్తున్నాం కాని మార్పు మాత్రం తీసుకు రాలేకపోతున్నాం...కాని ఒక సంతోషం ఏంటంటే ఈ టపాలతో కాస్తో కూస్తో చైతన్యపరచగల్గుతున్నందుకు ఆనందం గా ఉంది...

    జలతారు వెన్నెల గారు మీకు అభినందనలు....

    ReplyDelete
    Replies
    1. సతీష్ గారు, మీ అవేసం మీ పోస్ట్స్ లో చూస్తూ ఉంటాను.
      నిజమే, చైతన్య వంతులం అవుతాము, మంచి అలోచనలు ఉన్నాయి . అవి చాలవు కదా మార్పు తేవాలంటే?
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete