ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం
పిలవకుండా వచ్చిందే మా ఊరు ఈ చుట్టం!
తెల్లవారిందంటూ గోడ మీద శ్రీనివాసుని పటం
పాడింది శ్రావ్యాంగా సుప్రభాతం!
ఇంకాసేపు పవళించమంటుంది బద్దకం
తెలియలేదు నాకు ఆ రోజు పొంచి ఉన్న ప్రమాదం!
రోజు కన్నా అరగంట ఆలశ్యంగా దిగాను మంచం
తప్పేది కాదుగా చెయ్యాల్సిన ఉద్యోగం!
శ్రీవారు అప్పటికే లేచి చేస్తున్నారు వ్యాయామం
ప్రతి సోమవారం ఇంట్లోనేగా వారి మకాం!
మెరుపు వేగంతో ముగించేసా స్నానం
పెట్టాలిగా మొక్కుబడిగా దేవుడికి నైవేధ్యం!
హడావిడిగా చేసాను ఫలహారం
జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యమని శ్రీవారి ఆదేశం!
ఆఫీస్ కి చేరుకోవాలంటే చెయ్యాలి గంట ప్రయాణం
వర్షం, ట్రాఫిక్ కలిసి చూపిస్తాయని తెలుసు నరకం!
కారు గరాజ్ లోంచి బయటికి తీస్తూ చూసుకున్నా సమయం
ఒక్కసారిగా గుండె ఆగిపోయిందా అన్నంత కలవరం!
ఎలాగైనా సమయానికి ఆఫీస్ చేరుకోవాలనే తాపత్రయం
చూసుకోలేదు డ్రైవేయ్ లో ఉన్న శ్రీవారి వాహనం!
వేగంగా కారు రివర్స్ చేస్తూ శ్రీవారి కారుని డీకొన్న వైనం
తెలియలేదు పాపం వారికి నేను చేసిన ఘనకార్యం!
మూడో మనిషికి తెలియకుండా చిత్తగించాను పలాయనం
శ్రీవారికి తెలిస్తే అవుతుందని తెలుసుగా యుద్దం!
మనసు ఉండబట్టలేక ఫోన్ చేసా, వెళ్ళాక కొంత దూరం
ఏంటోయి ఇప్పుడేగా మాట్లాడాం, అంటూ చేసారు పరిహాసం!
తెలపాలిగా వారి కారు నుజ్జు నుజ్జు అయిన సమాచారం
నెమ్మదిగా చెప్పాను వారికి జరిగిన విషయం!
సృష్టించారు శ్రీవారు ఫోన్ లోనే ప్రళయం
వారెదురుగా లేకుండా ఉండడం నాకు దేవుడు ఇచ్చిన ఒక వరం!
రోజంతా పనిలో నిమగ్నమవ్వాలని చేసాను ప్రయత్నం
అయినా మనసంతా ఏదో గందరగోళం!
ఇంటికి దిగులుగా చేరుకున్నాను ఆ సాయంత్రం
పలకలేదు శ్రీవారు ఎంత చేసినా నేను ప్రయత్నం!
ఎన్నడూ చూడని కొత్త రూపాన్ని శ్రీవారిలో చూసాను ఆ దినం
మాట లేదు , పలుకు లేదు, వ్యక్తపరచలేదు తన అవేశం!
నా తప్పేమి లేదని వర్షం మీద వేసాను నెపం
అయినా తగ్గలేదు శ్రీవారి కోపం!
ఎడ మొక్కం పెడ మొక్కం గా చేసాము భోజనం
చేసేదేమి లేక పాంటించా నేను మౌనం!
శ్రీవారు ఏకాగ్రతతో ఇమైల్ టైప్ చేస్తుంటే,వినిపించింది కీబోర్డ్ శబ్ధం
దగ్గరగా చేరి అడిగా ఎవరికా లేఖ అని వివరం!
మనసులో బాధను పంచుకోటానికి, ఉందొక నేస్తం
నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అని వచ్చింది సమాధానం!
అసూయతో రగిలిపోయాను ఆ నిమిషం
తన్నుకొచ్చేసింది నాలో ఉక్రోషం!
చెయ్యలేదుగా నేను ఘోరమైన నేరం
అయినా ఎన్నాళ్ళుగా సాగుతుందో ఈ రహస్య ప్రణయం!
మొదలయ్యింది ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం
తగ్గలేదు నేను, తెలుసుకోవటానికి ఆయన రహస్యం!
శ్రీవారి సమాధానం - "నీకు సంబంధం లేదు ఇది నా వ్యకిగతం
అయినా అన్నీ నీకు తెలియాలని లేదుగా నియమం!"
ఇంక లేదు నాకు సహనం
తెలుసుకోపోతే ఎవరో ఆ నేస్తం, తట్టుకోగలదా నా ప్రాణం!
అయినా అసలు ఇదేమి మాయరోగం
నేనే తన లోకమంటూ చేసారుగా ప్రమాణం!
ఇంతేలే అనుకున్నా ఈ జీవితం
బంధాలేవి కావనుకున్నాను శాస్వతం!
ఇప్పటికైనా తెలుసుకున్నా మావారి నిజ స్వరూపం
ఇంతటితో మా మధ్య ఉన్న బంధం సమాప్తం!
అంతులేని వ్యధను అనుభవిస్తున్నఆ తరుణం
శ్రీవారు ఇమైల్ పూర్తిచేసి గీకారు తన సంతకం!
చదవమంటూ నా చేతికి ఇచ్చారు మరుక్షణం
చదువుతూనే పెదవుల మీద మెరిసింది చిరు మందహాసం!
ఆనందంతో నిండి పోయింది నా హృదయం
మా అమ్మాయికి రాసారు ఉదయాన నేను చేసిన నిర్వాకం!
పొరపాట్లన్నవి మానవ సహజం
జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యాలన్నది నేను నేర్చుకున్న పాటం!
పిలవకుండా వచ్చిందే మా ఊరు ఈ చుట్టం!
తెల్లవారిందంటూ గోడ మీద శ్రీనివాసుని పటం
పాడింది శ్రావ్యాంగా సుప్రభాతం!
ఇంకాసేపు పవళించమంటుంది బద్దకం
తెలియలేదు నాకు ఆ రోజు పొంచి ఉన్న ప్రమాదం!
రోజు కన్నా అరగంట ఆలశ్యంగా దిగాను మంచం
తప్పేది కాదుగా చెయ్యాల్సిన ఉద్యోగం!
శ్రీవారు అప్పటికే లేచి చేస్తున్నారు వ్యాయామం
ప్రతి సోమవారం ఇంట్లోనేగా వారి మకాం!
మెరుపు వేగంతో ముగించేసా స్నానం
పెట్టాలిగా మొక్కుబడిగా దేవుడికి నైవేధ్యం!
హడావిడిగా చేసాను ఫలహారం
జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యమని శ్రీవారి ఆదేశం!
ఆఫీస్ కి చేరుకోవాలంటే చెయ్యాలి గంట ప్రయాణం
వర్షం, ట్రాఫిక్ కలిసి చూపిస్తాయని తెలుసు నరకం!
కారు గరాజ్ లోంచి బయటికి తీస్తూ చూసుకున్నా సమయం
ఒక్కసారిగా గుండె ఆగిపోయిందా అన్నంత కలవరం!
ఎలాగైనా సమయానికి ఆఫీస్ చేరుకోవాలనే తాపత్రయం
చూసుకోలేదు డ్రైవేయ్ లో ఉన్న శ్రీవారి వాహనం!
వేగంగా కారు రివర్స్ చేస్తూ శ్రీవారి కారుని డీకొన్న వైనం
తెలియలేదు పాపం వారికి నేను చేసిన ఘనకార్యం!
మూడో మనిషికి తెలియకుండా చిత్తగించాను పలాయనం
శ్రీవారికి తెలిస్తే అవుతుందని తెలుసుగా యుద్దం!
మనసు ఉండబట్టలేక ఫోన్ చేసా, వెళ్ళాక కొంత దూరం
ఏంటోయి ఇప్పుడేగా మాట్లాడాం, అంటూ చేసారు పరిహాసం!
తెలపాలిగా వారి కారు నుజ్జు నుజ్జు అయిన సమాచారం
నెమ్మదిగా చెప్పాను వారికి జరిగిన విషయం!
సృష్టించారు శ్రీవారు ఫోన్ లోనే ప్రళయం
వారెదురుగా లేకుండా ఉండడం నాకు దేవుడు ఇచ్చిన ఒక వరం!
రోజంతా పనిలో నిమగ్నమవ్వాలని చేసాను ప్రయత్నం
అయినా మనసంతా ఏదో గందరగోళం!
ఇంటికి దిగులుగా చేరుకున్నాను ఆ సాయంత్రం
పలకలేదు శ్రీవారు ఎంత చేసినా నేను ప్రయత్నం!
ఎన్నడూ చూడని కొత్త రూపాన్ని శ్రీవారిలో చూసాను ఆ దినం
మాట లేదు , పలుకు లేదు, వ్యక్తపరచలేదు తన అవేశం!
నా తప్పేమి లేదని వర్షం మీద వేసాను నెపం
అయినా తగ్గలేదు శ్రీవారి కోపం!
ఎడ మొక్కం పెడ మొక్కం గా చేసాము భోజనం
చేసేదేమి లేక పాంటించా నేను మౌనం!
శ్రీవారు ఏకాగ్రతతో ఇమైల్ టైప్ చేస్తుంటే,వినిపించింది కీబోర్డ్ శబ్ధం
దగ్గరగా చేరి అడిగా ఎవరికా లేఖ అని వివరం!
మనసులో బాధను పంచుకోటానికి, ఉందొక నేస్తం
నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అని వచ్చింది సమాధానం!
అసూయతో రగిలిపోయాను ఆ నిమిషం
తన్నుకొచ్చేసింది నాలో ఉక్రోషం!
చెయ్యలేదుగా నేను ఘోరమైన నేరం
అయినా ఎన్నాళ్ళుగా సాగుతుందో ఈ రహస్య ప్రణయం!
మొదలయ్యింది ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం
తగ్గలేదు నేను, తెలుసుకోవటానికి ఆయన రహస్యం!
శ్రీవారి సమాధానం - "నీకు సంబంధం లేదు ఇది నా వ్యకిగతం
అయినా అన్నీ నీకు తెలియాలని లేదుగా నియమం!"
ఇంక లేదు నాకు సహనం
తెలుసుకోపోతే ఎవరో ఆ నేస్తం, తట్టుకోగలదా నా ప్రాణం!
అయినా అసలు ఇదేమి మాయరోగం
నేనే తన లోకమంటూ చేసారుగా ప్రమాణం!
ఇంతేలే అనుకున్నా ఈ జీవితం
బంధాలేవి కావనుకున్నాను శాస్వతం!
ఇప్పటికైనా తెలుసుకున్నా మావారి నిజ స్వరూపం
ఇంతటితో మా మధ్య ఉన్న బంధం సమాప్తం!
అంతులేని వ్యధను అనుభవిస్తున్నఆ తరుణం
శ్రీవారు ఇమైల్ పూర్తిచేసి గీకారు తన సంతకం!
చదవమంటూ నా చేతికి ఇచ్చారు మరుక్షణం
చదువుతూనే పెదవుల మీద మెరిసింది చిరు మందహాసం!
ఆనందంతో నిండి పోయింది నా హృదయం
మా అమ్మాయికి రాసారు ఉదయాన నేను చేసిన నిర్వాకం!
పొరపాట్లన్నవి మానవ సహజం
జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యాలన్నది నేను నేర్చుకున్న పాటం!

Wowwwwwwwwwwwwwwwww!!!!
ReplyDeleteనా కవిత అంత బారుగా ఉంది గా మీ wow...
Deleteధన్యవాదాలు వనజగారు.
తప్పంతా వానదిగా
ReplyDeleteముప్పంతా మీ కదేల ముంచుకు వచ్చెన్?
తప్పనిసరి గాలివాన
చప్పున నొక దూదిపింజ చాడ్పున చెదరెన్!
ఎప్పటివలె మీ కవితయు
మెప్పించెను హృద్యమగుచు మీ కొక నీతిన్
చప్పున నేర్పించిన యీ
గొప్పదనము పాడు వాన కొనిపోయె గదా!
తప్పంతా వాందే నండి గురువు గారు.
Deleteముప్పు నాకు, భలే చెప్పారు. నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
పద్య రూపం లో మీ స్పందన నాకు చాలా నచ్చిందండి!
:)
ReplyDeleteమీ చిరునవ్వుకే కాని మీ నోటి మాటకు నోచుకోలేదా మేము!! హు!
Deleteపోన్లెండి నవ్వారు. అంతే చాలు.ధన్యవాదాలు మీకు
వెన్నెల గారూ...
Deleteఅపార్ధం చేసుకోకండి. స్మైలీతో సరిపెట్టేయడానికి కారణం ప్రత్యేకం ఏం లేదు. నాకు స్పందించడం, వ్యాఖ్యానించడం సరిగా తెలీదు అంతే. అన్యధా భావించవద్దు.
:-))....
ReplyDeleteవెన్నెల గారూ!
కవితను కూడా కారులాగే పరుగు తీయించారు....
కాకపొతే...ఎక్కడా దేనినీ డీకొట్ట కుండా!...
బాగుంది ఓ వర్షం కురిసిన రోజు మీ అనుభవం,
మీరు నేర్చుకున్న పాఠం...
....:-)
@శ్రీ
అమ్మో వేసాసారు మీరు sattire!
Deleteడీకొట్టడం అంటూ జరగదు మళ్ళీ! (వర్షం పడితే తప్ప..)
ధన్యవాదాలండి మీ స్పందనకు
అరే ఇంత ప్రశాంతంగా అంతమాయెనేమి యుద్ధం
ReplyDeleteమీ శ్రీవారికి పనికిరాదేమో మరీ ఇంత సహనం
మీరైనా గిల్లి పెట్టుకోవలసింది కూసింత కయ్యం
అదే మీ ఇరువురి హాస్య జల్లుల సరాగాలాపం
మన్నించాలి ఒకవేళ మితిమీరితే నా ప్రేలాపం
ఇది కేవలం హాస్యానికై చేసిన చిరుప్రయత్నం
హా హా హా పద్మ గారు!!
Deleteబహు చక్కగా పసందుగా ఉంది మీ కవిత్వం!
శ్రీవారికి లేదండొయి అంత సహనం..
ఈ సారి పొరపాటు నాది కానప్పుడు తప్పక పెట్టుకుంటాను అలాంటి సరదా కయ్యం
యే సంకోచం లేకుండా చెయ్యలండి మీరు నాతో స్నేహం
మీలాగే నలుగురు నవ్వుతూ ఉండాలనుకునేదే నా గుణం
మిమ్మల్ని మన్నించటమేమిటండి! ఇంకోసారి అలా రాయకండి!!
ధన్యవాదాలు పద్మ గారు!!
అంతా మీ మార్కుతో సాగిన రచనాయానం...అభినందనలు వెన్నెల గారూ..
ReplyDeleteమీరు చదివారాండి? ఎదో కథ లా రాస్తే, అంత attention ఉండదేమో అని ఇలా రాసాను.
Deleteమీ స్పందనకు ధన్యవాదాలండి
Nice explanation Jaltaru gaaru.....Actually I went to Vizag so I missed last day rain,but now you showed me the affect :)
ReplyDeleteThanks Satish!! ha ha , varsham showed its effect on me already!! Thank God, I saved my marriage somehow... Thanks for the comment.
Deleteoh, anudukena nalugu rojula mounam.
ReplyDeletekotha ga chepparu, meera ghoram.
ika meeru raayachu dheergh kavitvam.
nice, bhagha raasaarandi.
keep writing.
:)) ముందు కథ లా మొదలుపెట్టాను. నాకే బోర్ కొట్టీంది. సరే నాకు, ఇంకా చదివేవారికి interesting గా ఉండాలని అలా రాసాను. ధన్యవాదాలు.
Deleteమీరు మీ ఇమైల్ నా బ్లాగ్ లో కామెంట్ లా పెట్టండి.
telisipoindilendi padmarpitagaru e blog kuda meedenanani.
ReplyDeleteaa style meede, one and only you can write like this,u r great madam.
యోహంత్ గారు,
Deleteదేవుని మీద ప్రమాణం చేసి చెపుతున్నా.. నేను వెన్నెలనే!
పద్మార్పిత గారు వేరే!
అనుమానమా? చూడండి పైన.. వారి కామెంట్ కూడా ఉంది.
పద్మార్పిత గారి బ్లాగ్ లో నా కామెంట్స్ కూడా ఉంటాయి.
నేను పద్మార్పిత గారిలా ఎప్పటికి రాయలేను. She is very unique!!
Thanks for comapring me with such a sweet poetess! I will take that as a vey sweet compliment.
చాలా బాగుందండీ! ఆరుద్ర గారి ఇంటింటి పద్యాలు గుర్తుకొచ్చాయి. అంత్య ప్రాసలతో ఆడుకున్నారుగా? ఇలాంటివెన్నైనా చదవడానికి మెచ్చుకోవడానికీ నేను రడీ.
ReplyDeleteమీ లాంటి వారి ప్రశంసలు నాకు రావడం నాకు ఆనందంగా ఉందండీ!
Deleteమీరు చదువుతాను అంటే నేను అప్పుడప్పుడు రాయడానికి రెడీ!
ధన్యవాదాలండి.
బావుంది కవిత అలా ఒక్క గుక్కన పరుగులు పెట్టిచింది మీ అక్షరాల వాన ఈ వర్షం కురిసిన రోజున! వెన్నెల గారు.!!!
ReplyDeleteచాలా రోజులకు కనిపించారు.
Deleteవర్షం కురిసిన రోజు నా అనుభవం ఇలా మీ అందరితో పంచుకోవాలని అనిపించిందండి.
మీ కామెంట్ కూడా భలే చక్క గా ఉందండి!
ధన్యవాదాలు మీకు.
చిన్నిగారు, ఎవరన్నా చెప్పారా మీకు? మీ నవ్వు చాలా బాగుంటుంది. అమ్మాయి బాగుందాండి?
ReplyDelete:) :)
ReplyDeleteచిరునవ్వే సమాధానం అంటారా?
Deleteధన్యవాదాలండి..
ఎడతెరిపి లేకుండా కురిసింది వెన్నెల కవితా జల్లు
ReplyDeleteతడిసి మద్దయినవి పాఠకులలోని మెదల్లు
మధ్యలో అలుము కొన్నవి అనుమానపు మొగిల్లు
చివరకు విరిసింది అందమైన హరివిల్లు
----- సుజన-సృజన
మాష్టారు, తినలేదుగా మీ మెదల్లు, తిన్నానేమో అని నాకు కొంచెం దిగులు!!
Deleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.
మొదట మీకు అభినందనలు .ఇంత దీర్ఘ కవిత ఇంత సరళంగా అలవోకగా వ్రాసినందులకు.
ReplyDeleteతరువాత అన్ని పాదాల చివర సున్నావచ్చేట్లు అంత బాగా వ్రాయటం మీకు ఎలా సాధ్యమయింది.ఇది అంత సులభమేమీ కాదు.
ఇక పోతే ఒక సంఘటనను ఇంత చక్కగా కవిత రూపంలో సరదాగా వ్రాసినట్లనిపించినా చక్కటిలయ లో కనిపిస్తుంది.
మొత్తానికి ఒక మంచి ప్రయోగం చేసారు.
Such an honor అండి..మీ దగ్గర నుండి ఈ కామెంట్ రావడం.
Deleteముందు కథ గా రాద్దామని మొదలు పెట్టాను.
మళ్ళీ ఎందుకో ఇలా ప్రయత్నిద్దమని అనిపించింది.
మంచి ప్రయోగం అన్నారు, చాలా సంతోషం గా అనిపించ్చింది.
ధన్యవాదాలు మీకు.
balee raashavu akkaa chaalaa bagundi
ReplyDeleteనచ్చేసిందా తమ్ముడు? ధన్యవాదాలు మీకు.
Deleteభారీవర్షంలా మీ కవిత కూడా పరుగులు తీసింది. వర్షంలో మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు అభినందనలు వెన్నెల గారు!
ReplyDeleteధన్యవాదాలు నాగేంద్ర గారు.
Deleteమీ కవితా జల్లులో తడిసిపోయాం...టీ కప్పులో తుఫాన్ అన్నమాట. బావుందండీ..కథ సుఖాంతం.
ReplyDeleteటీ కప్పులో తుఫాను..భలే చెప్పారండి. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు.
Deleteఒకరోజులో జరిగిన సంఘటనలని, అనుభవాలని పదాలతో అంత్యప్రాసలతో బాగా వ్యక్తీకరించారండి. అభినందనలు వెన్నల గారు..:))
ReplyDeleteసురేష్ గారు, మీ స్పందనతో ఎప్పుడు నన్ను ప్రొత్సహించే మీకు ధన్యవాదాలండి.
Deleteబాగుందండీ..
ReplyDeleteనా బ్లాగ్ కి మీకు స్వాగతం. మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలండి మీకు.
Deletevennela gaaroo baagundi mee varshamlo oo roju, chakkagaa raasaru.
ReplyDeleteఫాతిమా గారు, మీకు నచ్చినందుకు సంతొషంగా ఉంది. ధన్యవాదాలు మీకు.
Deleteవర్షం కురిసిన ఆ రోజు
ReplyDeleteకురిసెను కవితా జల్లు...
చాలా చక్కగా రాశారు, చదివాక ఇలాకూడా రాయొచ్చా అనిపించేంతగా...
అభినందనలు!
ప్రశంస ఎంతో ఆనందానిచ్చింది. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు.
Deleteచదివిన వెంటనే నాకు మొదట వొచ్చిన మాట wow అని.
ReplyDeleteచదువుతున్నంత సేపు చిరు మందహాసమే....
నచ్చింది నిజం గా :))
Thanks Sekhar garu
Deleteవాన, వర్షం సంకలనం చేయాలని ఈ మద్య ఎవరైనా రాసారా అని వెదకుతుంటే దొరికింది జలతారువెన్నెల
ReplyDeleteవాన నెపంతో కొన్ని సూక్ష్మాలను చెప్పారు
నా సంకలనంలోకి తీసుకుంటున్నాను
అభినందనలు
ధన్యవాదాలండి. మీకు నచ్చినందుకు చాలా సంతోషం!!!
Delete