Thursday, June 14, 2012

ప్రశ్నించే హక్కు




ఆంధ్రాలో ఉప ఎన్నికలు
ప్రముఖులు చేస్తున్నారు విష్లేషణలు
గెలుపు ఓటములు కావు  దైవాదీనాలు
నోట్ల కట్లతో సాదించుకునేవేగా ఎన్నికల విజయాలు
కులతత్వపు ఉక్కు సంకెళ్ళలో బందీలేగా ఓటర్లు
మరి ఎందుకో ఇంకా ఎన్నికల నిర్ణయాల కోసం పడిగాపులు

విజయం కోసం నాయకులు వెదజల్లే కోట్లు
ప్రజా సేవ అనే వ్యాపారానికి వాళ్ళు పెడుతున్న పెట్టుబడులు
పదవి దక్కగానే అవుతాయి రెట్టింపు వాళ్ళ ఆస్తులు
ఇదెక్కడి న్యాయం అని జనం వేస్తే ప్రశ్నలు
గెలిపించారుగా ఓట్లు వేసి ఎలక్షన్లు
మీరిచ్చిన వరప్రసాదమే కదా ఈ పదవులు


ప్రశ్నించే హక్కు మీరు కోల్పాయారు అంటే తప్పేంటి నాయకులు?

49 comments:

  1. తప్పదండీ!!. ధనస్వామ్యానికే గెలుపు!!.మార్పు రావడానికి సమయం పడుతుందండీ!!!

    ReplyDelete
    Replies
    1. వేచి చూడమంటారు.:)) ధన్యవాదాలండి.

      Delete
  2. entandi hatathuga ila political entry ichharu,
    andhra okate antara,...
    aavesamga rasaara,
    good, keep writing.

    ReplyDelete
    Replies
    1. ఫలితాలు తేట తెల్లం గా తెలిసి కూడా.. గంటలు గంటలు పేపర్ కి, TV కి అంకితమైన వారిని చూసి రాసేసాను. :))

      Delete
  3. బాగా వ్రాశారు వెన్నల గారు!
    లెస్స పలికితిరి గురువు గారు!

    ReplyDelete
  4. గెలుపోటములు కూడా డబ్బునిస్తాయండీ...!!
    గెలుపోటముల మీద వెయ్యి కోట్ల పైనే బెట్టింగ్ జరిగిందని సమాచారం, అందులోనూ నాయకులదే సింహ బాగం :(((


    టపా తో పాటు పాట కూడా చాలా బాగుంది.. :)

    ReplyDelete
    Replies
    1. అరే! ఈ point ఎలా మిస్స్ అయ్యానబ్బా?
      మొత్తానికి ఘట్టికులే మీరు. ధన్యవాదాలు హర్ష గారు.

      Delete
  5. wow akkaa baagaa cheppavu.. backgroundsong naa fav song

    ReplyDelete
  6. మార్పు వొస్తుంది, కాని మార్పు కోసం వేచిచూడకండి, అది అందని ద్రాక్ష.............

    ReplyDelete
  7. ఉపఎన్నికలపై కవిత రూపంలో మీరు స్పందించిన తీరు బాగుంది.
    మీరు వినిపించిన పాట కూడా ఈ టపాకు మ్యాచ్ అయింది.
    అభినందనలు వెన్నెల గారు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగేంద్ర గారు.

      Delete
  8. హ్మ్...ఏమి చేద్దాము ...మంచి వాళ్ళు రాజకీయాలకు రాకపోతిరి...
    బాగా వ్రాసారు

    ReplyDelete
  9. అపహాస్యపు ప్రజాస్వామ్యంలో
    ఓటుహక్కు అవసరం తీరిపోయింది .
    ప్రజాస్వామ్య అవసరమూ తీరిపోయింది .
    ఓటరు విచ్చల విడిగా ఓటును అమ్ము కొంటున్నాడు .
    లీడరు స్వేచ్చగా కొనుక్కుంటున్నాడు .
    వెరసి - ప్రజాస్వామ్యం అర్థం మార్చుకుంది .
    ధనము చేత -
    ధనము కొరకు -
    ధనమే పాలించడం -
    అసలు శాసన నిర్మాణ వ్యవస్థ అవసరమా ? అనే ప్రశ్న సామాన్యుని మదిలో మొదులైంది .

    ReplyDelete
    Replies
    1. సామన్యులే కదా మాష్టారు ఓట్లు వేసింది. ప్రజలకు న్యాయం జరిగితే మంచిదే! అందరు సంతోషించే వారే! కానీ అలా జరుగుతుందా..వేచి చూదాము.

      Delete
    2. raajaaraavu garu pachhi nijam chepparu andi... manam marani (dabbulu teesukoni vote vesre vaaru )varaku ilanti donga raajakiyanaayakulu vastune untaru

      Delete
  10. ప్రతిసారీ జనం ఓడిపోతారు వాళ్ళు గెలుస్తారు..

    బాగుందండీ timely post..

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  11. ప్రశ్నించే హక్కా??? పిచ్చోళ్ళకి!!!

    ReplyDelete
    Replies
    1. :)) ధన్యవాదాలు ప్రేరణ గారు!

      Delete
  12. వోటు వేయడం అంటేనే
    అసహ్యం వేసే దుస్థితి తీసుకొచ్చారు
    (అ)ప్రజాస్వామ్యంలో నాయకులు...
    ఎవరికి వోటేయాలో తెలియని పరిస్థితి...
    మార్పు బహుశా ఈ తరానికే కాదు వచ్చే తరానికి కూడా సాధ్య పడదేమో...
    మీ ప్రశ్న బాగుంది వెన్నెలగారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు శ్రీ గారు.

      Delete
  13. ముందుంది మరిన్ని ఉప ఎన్నికల పండగ.
    ఓటర్లకు డబ్బు, కానుకలు, మందు పండగ.
    మీడియాకి బ్రేకింగ్ న్యూసుల పండగ.
    చూస్తునే ఉండండి ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం...

    ReplyDelete
    Replies
    1. అంతేలెండి. చూస్తూ ఉండడమే మనం చెయ్యగలిగేదీ!
      మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  14. upa ennikalake enni mari asalu ennikaloste ...?? dabbule dabbulemo....baagaa chepparu vennelaa

    ReplyDelete
    Replies
    1. ఓడిపోయిన oka MLA candidate spend 9 crores అన్నది నాకు తెలిసిన వార్త. ఇక గెలిచిన వారు ఎంత పోసారో మరి. ఇలా అన్ని పార్టీ లు కలిసి ఖర్చు పెట్టింది ఎంతో ఊహించండి మంజు గారు.మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  15. ఎన్నికలలో ఎన్ని కళలో .డబ్బు,మద్యం పంచకుండా వుండే అభ్యర్థులకు జనం ఓట్లు వేయడం లేదు.మీ ఆవేదన అందరికీ వుంది.మంచి పాయింట్ ఫోకస్ చేసారు.

    ReplyDelete
    Replies
    1. "ఎన్నికలలో ఎన్ని కళలో" నిజమే కదండి?
      బాగా చెప్పరు. ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  16. మనకి నచ్చనిదాన్ని అరాచకమందామా ?
    మనం కవితలు రాసుకుంటూ ఓటేసే వాళ్ళని అమ్ముడుపోయారందామా?
    లక్షలమంది జనాల నిర్ణయాన్ని నిర్దయగా కులంతోనూ, డబ్బుతోనూ బేరీజు వేద్దామా?
    ఎక్కడిదీ ప్రశ్నించే హక్కు?
    ఈ దేశ చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప ఉద్యమాలని (స్వాతంత్ర్యోద్యమాన్ని కూడా)నడిపించి, అనేక సార్లు విఙతగల నిర్ణయాల్ని ఎన్నికల్లో చూపిన ఈ దేశ ప్రజలనంతా వెఱ్రి గొర్రెలందామా? మన త్రిశంకు స్వర్గంలో మనం హాయిగా నిద్దరోదామా ?

    ReplyDelete
    Replies
    1. అరాచకం కాదా?
      ఒక పధకం ప్రాకారం, దేశాన్ని దొచేసుకుంటూ, పధకాల పేరున త్రుణమో, ఫణమో పేద వారికి పారేసి,ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు దోచుకోవడాన్ని మీరు సమర్ధిస్తున్నారా? ప్రజా సేవ మాత్రమే ధ్యెయమంటారా ఈనాడు గెలిచిన ఏ ప్రజా ప్రతినిధికైనా?
      మొక్కలోనే త్రుంచిపాడెయ్యల్సిన ఈ అవినీతిని, పెంచి పెద్దది చేసింది ప్రజల అజ్ఞానం కాదా? వారి తాత్కాలపు అవేశం ,రాజకీయ నాయకుల మొసలి కన్నీరు, ఈ పాద ధూలి యాత్రలు, వారు చేసేవన్ని ప్రజలకు సేవ చెయ్యలన్న ఉద్దేశమేనా?
      ఒక వేళ మీరు అన్నట్టు, నిజంగానే ప్రజలు గొర్రెలు కాదు, వారు అలోచించి వారిని ఆదుకునే మహా నయకులను మాత్రమే ఎన్నుకున్నారు అని మీరంటే , ఆ ప్రజా నయకులే నిజంగానే ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా నిలచి, వారి బ్రతుకులలో వెలుగు నింపితే అంతకంటే కావాల్సినదేముంది? పార్టి లకు అతీతేం గా ఎవరన్నా సరే ప్రజలకు మంచి చేస్తే, హర్షించేవారిలో మొదట నిలిచేది నేనే! బాధపడకండి, నాలాంటి వారు ఇలా రాస్తున్నారేంటి అని. మీ నమ్మకం నిజమై, ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ప్రజలకు మంచి చెయ్యాలని ఆశిద్దాము.

      Delete
    2. మీరన్న సమస్యలు లేవని కాదండీ నా ఉద్దేశ్యం. సామాన్య జనాల వివేకాన్ని చులకన చేస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియనే అపహాస్యం చేసేంతగా మాట్లాడటం చాలా సులువు. కానీ విషయాన్ని అర్థం చేసుకుంటూ వ్యవస్థ బాగుపడే ఆలోచన చెయ్యడం కష్టం.

      గెలిచిన వాళ్ళ గురించైనా, ఓడిన వాళ్ళ గురించైనా ఏ అభిప్రాయం చెప్పినా నాకభ్యంతరం లేదండీ. కాకపోతే మన నిరాశనీ, మనం ఒప్పుకోలేని విషయాలనీ సాకుగా చూపి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేసే బలహీనతకి లొంగ కూడదనే నా సూచన.

      There are people who are openly claiming that they do not believe in Democracy and they are fighting to overthrow this system. They are going by the name Maoists.

      The same masses rallied behind Gandhi for the freedom struggle. Were they participating because of caste and money even then? (We used to have more illeterate crowds then). Please do not belittle the collective decision of this country. that's an insult to you also. Its OK to talk about issues and cricise some of the bad trends. But please don't fall into the trap of talking like this.

      Delete
    3. మన నిరాశనీ, మనం ఒప్పుకోలేని విషయాలనీ ?? "మన నిరాశనీ, మనం ఒప్పుకోలేని విషయాలనీ" ఎమిటవి మీ ఉద్దేశం లో? I am not against Democracy. What are so called bad trends? I guess we can make time and talk about good trends because there are hardly any. Talking about bad trends..oh God! will that discussion ever end? Anyways I have expressed my opinion and I think it's time for people to change and think about the leaders they are electing and if they continue electing highly corrupted people as their representatives , then I would assume they cannot question them later, because they are the ones who casted the vote! Thank you for your comments!

      Delete
    4. >> మన నిరాశనీ, మనం ఒప్పుకోలేని విషయాలనీ ?? "మన నిరాశనీ, మనం ఒప్పుకోలేని విషయాలనీ" ఎమిటవి మీ ఉద్దేశం లో?

      I meant the things that we don't like about politics and the type of leaders that are getting elected.

      Anyway, I will leave it at that. Just one clarification... even if people elect them.. still they can question them. People need not wait till the next election for questioning. That's the beauty of our democracy.

      Delete
    5. @if they continue electing highly corrupted people as their representatives , then I would assume they cannot question them later,

      ఇదే అభిప్రాయం మీరు టపా లోను వ్యక్త పరిచినందున, ముందే ఒక మాట మిమ్మల్ని అడగదలచి విరమించుకొన్నాను. రెండవసారి చూచాక అడగడం లో నష్టం ఏమి లేదు అనుకొంటున్నాను

      ఎవరు డబ్బు తీసికొన్నారు అని మీరు భావిస్తున్నారో ఆ ప్రజలెప్పుడు ప్రశ్నించారు ? ప్రశ్నిస్తున్న వారు , డబ్బు తీసికొన్నవారు వేరు వేరు అయినపుడు ప్రజలందరినీ ఒకే గాటన కట్టేయ్యకూడదేమో నండీ. కొందరు ముందే డబ్బు తీసికోని ఓటెయ్యవచ్చు. ఇంకొందరు తరువాత ప్రయోజనాలు ఆశించవచ్చు. రెండు సమానం కాదా ?

      అదే సమయం లో వారికి మంచి ప్రత్యామ్నాయం లేనపుడు ఒకరికి ఓటు వేసినవారు దోషులు, ఇంకొకరికి ఓటు వేసినవారు మంచి పౌరులు అయిపోతారా !

      Delete
    6. మంచి ప్రశ్నే! ప్రతి నాయకుడి దగ్గర నుంచి ఎదో ఆశించే కదా ఓట్లు వేసేది ప్రజలు. కాపోతే కొన్ని విషయాలు తేట తెల్లం గా తెలిసిపోతున్నా ప్రజలు అలోచించటం లేదు కదా అని బాధ..
      వేచి చూడాల్సినదే ఈ నాయకులు ఎంతవరకు ప్రజలకు న్యాయం చేస్తారో!

      Delete
    7. @కాపోతే కొన్ని విషయాలు తేట తెల్లం గా తెలిసిపోతున్నా ప్రజలు అలోచించటం లేదు కదా అని బాధ..

      వాళ్లకి మాత్రమె తెలిసిన ఇంకొన్ని నిజాలు , మనం ఏమాత్రం పట్టించుకోనివి .. మీకు అతిపెద్ద సమస్య జగన్ కావచ్చు , కాని వాళ్ళకి అతిపెద్ద సమస్య వాళ్ల చుట్టూ ఉన్న సమాజం లోనే ఉంది. వారు ఆ సమస్యకు మాత్రమె ప్రతిస్పందించడం సాధారణం కదా.

      Delete
    8. సరే! అలాగే అనుకుందాము. ప్రజలు విజ్ఞులే, వారికి కావాల్సిన నాయకులను వారు ఎన్నుకునంటారు(ఇంకే ప్రలోభాలకు లొంగకుండా) అని మీరు నమ్మితే, వారి నమ్మకం వమ్ము కాకూడదని ఆశిస్తూ!!

      Delete
    9. >>People need not wait till the next election for questioning. That's the beauty of our democracy

      ప్రజాస్వామ్య సౌదర్యలహరి గుట్టు విప్పారు. అయితే ఏటంటారు? గాందేయ సారా కాంట్రాక్టర్ బొత్సని ఎన్నిసార్లు అడగలేదు? 30దాకా బినామీ షాపులున్నాయి అన్నారు. ఏం చేయగలిగారు? పిసిసి అధ్యక్షుడిగా జగన్ అవినీతి గురించి ఈయన చెబుతాడట, జనం ఓట్లేయాలట.

      Delete
  17. వీకెండ్ పొలిటీషియన్ గారు

    సిరివెన్నెల పాటకి భలే పేరడీ కట్టారు. వర్మ చూస్తే ఇంకో సిన్మా తీస్తాడు.

    ReplyDelete
    Replies
    1. సిరివెన్నెల పాటకి పేరడి కట్టడం మనలాంటి సామాన్యుల వళ్ళ అయ్యే పని కాదు లెండి.
      సిరివెన్నెల గారు ఈ పాటలో రాసిన వన్నీ అక్షర సత్యాలు.

      Delete
    2. జలతారువెన్నెల గారూ

      సిరివెన్నెల అయినా, ఇంకెవరయినా నిజాయితీ తో వ్రాస్తే ఆ విలువ వస్తుంది అండీ. సిరివెన్నెల గారిని అభిమానం తో మనం ఎంతయినా మెచ్చుకోవచ్చు, కాని ఒక మనిషి గా ఆయన సామాన్య వ్యక్తే. నిజానికి వ్యాఖ్య వ్రాసే ముందు మీరుకూడా సిరివెన్నెల గారి ట్యూన్ లో వ్రాసారేమో అని ఒకసారి చెక్ చేసాను :)

      Delete
    3. Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) :(comment got deleted by mistake!)

      పేరడీ కట్టేంత సీను నాకు లేదండీ. ఏ కవైనా ఒక సందర్భాన్ని బట్టి అద్భుతంగా ఆ భావాన్ని అక్షరాల్లో కూరుస్తాడు. ఆ సందర్భాల్లో చాలా సింపుల్గా మనకి అర్థమయ్యేలా కవులు రాస్తారు. అది వారి కళ. దానికి నమస్కరించాలి.

      అటువంటి కవితాత్మక అక్షరాల్ని, అన్ని వేళలా అన్ని సందర్భాలలో నిజమనుకోకూడదు.

      Delete
  18. వోటు కి తీసుకుంటున్నాము నోటు...

    అందుకే మనకు తప్పదు ఈ నాయకుల వెన్నుపోటు...

    we are also in same బోటు....

    మన చైతన్యమే మార్చాలి ఈ fate

    ReplyDelete