తుఫాను వస్తుందంట...సాండి అని దానికి పేరు పెట్టారంట!
తగు జాగ్రత్తలు తీసుకోవాలని గత వారం బుధవారం నుండి ఒకటే ఇమైల్స్, ఫోన్లు గట్రాలు..
ప్రకృతి వికటిస్తే మనం చెయ్యగలిగినది ఏమీ ఉండదు అని తెలిసినా...
అవసరార్ధం పాలు వగైరా ఆహారపదర్ధాలు తెచ్చుకోవాలి కదా..
అలాగే పవర్ పోతే ఫ్లాష్ లైట్స్,కాండిల్స్,లాంప్స్ వగైరా వస్తువులన్ని ఇంట్లో ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నాను.
కిక్కిరిసిపోయిన డిపార్ట్ మెంటల్ స్టోర్స్, గ్రాసరి స్టోర్లలో నేను కూడా చొచ్చుకుని పోయి నావంతు షాపింగ్ కూడా చేసేసాను.
స్నేహితులందరికి ఫోను చేసేసి... "నా హరికేన్ షాపింగ్ అయిపోయింది..మరి మీదో?" లాంటి చెత్త సంభాషణలు అన్ని చేసేసి ...
యుద్దానికి సిద్దం గా ఉన్న సైనికుల్లాగా నేను కూడా తుఫాన్ రాకకి నా పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుని రెడీ గా ఉన్నాను.
ఇంకో విచిత్రమైన సంఘటన జరిగిందండోయి...
ఒక స్నేహితురాలు ఫోన్ చేసి "మా ఇంట్లో కర్రంట్ పోతే బాకప్ గా మిమ్మల్ని పెట్టుకోవచ్చా?" అని అడిగింది.
మొదట అసలు తను ఏమడుగుతుందో అర్ధం కాలేదు.
తరువాత నెమ్మదిగా వెలిగింది.
ఓహో! వాళ్ళింట్లో కర్రంట్ పోతే మా ఇంటికి రావచ్చా అని అడుగుతుందని..
"దానికేం భాగ్యం? భేషుగ్గా రండి" అని చెప్పాను.
అప్పుడు ఆ స్నేహితురాలు అడిగింది."నిన్ను ఇంకెవరన్నా ఫోన్ చేసి ఇలాగే అడిగారా "అని.
"లేదు..నువ్వే" అన్నాను. "హమ్మయ్య అయితే నేనే అనమాట నుంబెర్ 1.నువ్వు వేరెవ్వరికి హామి ఇచ్చినా నా తరువాతే సుమా" అని హెచ్చరించింది.
తను కనీసం ఇంకొక ఐదుగురికి ఫోన్ చేసి బాకప్ పెట్టుకుందట.
కాని వాళ్ళందరి దగ్గర తను నంబర్ 1 కాకపోవచ్చు అని చెప్పింది.
అమ్మో! మరీ ఇంతిలా ప్లాన్ చేసుకోవాలన మాట అని ఆశ్చర్య పోయాను.
అదే స్నేహితురాలిని అడిగాను. "మీ ఇంటికి నేను వస్తాను నాకు కర్రంట్ పోతే" అని .
"నీది నంబర్ 4 "అని చెప్పేసింది. "అంతేనా? నంబర్ బంప్ అప్ చెయ్యలేవా?" అని అడుగుదామని అనుకుని, మరీ అలా బతిమాలటం ఇష్టం లేక ఊరుకున్నాను.
సోమవారం ఆఫీస్ లన్నిటికి సెలవు ప్రకటించారు. కాని పని చెయ్యగలిగిన వారు ఇంటి నుండి పని చెయ్యమని ఆదేశాలు కూడా జారి చేసారు. అనుకున్న రోజు రానే వచ్చింది.గాలి, వాన మొదలయ్యింది. టీవి లో వెదర్ చానల్ చూస్తూ ,రక రకాల తుఫాను కథలన్ని చెప్పేసుకున్నాము. చిన్నతనం లో చూసిన దివిసీమ తుఫాను నుండి, కత్రీన, ఐరీన్ వరకు...అలా ...అలా గుర్తుకు తెచ్చుకుంటూ సమయం గడిపేసాము.
సాయంత్రం టక్కున పవర్ పోయింది.
సరే అని ఫ్లాష్ లైట్ దగ్గర పెట్టుకుని, కాండల్ వెలిగించి..ఇంటిని చీకటి బారి నుండి కాపాడాను. ఇంతలో సెల్ మోగడం మొదలయ్యింది.
"మీ దగ్గర పవర్ పోయిందట కదా... అయ్యో ఎలా"అంటూ ఒక ఫ్రెండ్ పలకరింపు.
"ముందు నువ్వు ఫోన్ పెట్టు... అవసరం అయినప్పుడు ఈ ఫోన్ చార్జ్ లేకపోతే కష్టం" అని పెట్టేసాను.
ఈ పవర్ రేపటి వరకు రాకపోతే ఎలా? అసలే చలి కాలం...ఈ వాతావరణం లో పవర్ ఉన్న వారి ఇంటికి వెళ్ళాలన్నా కష్టమే..గాలి, వాన కలిసి భయంకరంగా ఉంది బయట....
ఒక గంట గడిచింది. నాకెందుకో వాన బయట కురుస్తున్న శబ్ధం చాలా దగ్గరగా వినిపించసాగింది. ఏదో నా పక్కనే పడుతున్నట్టు... టప టప శబ్ధం... ఆశ్చర్యపోతు... లివింగ్ రూం లోకి వచ్చాను. పది అడుగులు వెయ్యగానే కాళ్ళకు నీరు తగిలింది.. గుండె గుబేలుమంది... ఇదేమిటి ఇంట్లోకి నీరు అని ఆశ్చర్య పోతు..పైకి చూసా... రూఫ్ చిల్లు పడి పంపు లోంచి వచ్చే ధారలా
వర్షం చక్కగా ఇంట్లోనే కురుస్తుంది... కొయ్యబారిపోవడం తప్ప నేనేమి చెయ్యలేని పరిస్థితి. గబ గబా.. కింద హార్డ్ వుడ్ ఫ్లోర్ ని తుడిచేసి...ఇంట్లో ఉన్న టంబ్లర్ తేచ్చి సరిగ్గా వర్షం నీరు పడుతున్న చోట పెట్టి ఆ నీరు కింద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇది ఇంతటి తో ఆగేది కాదు అని మనస్సు చెపుతున్నా, ధైర్యం తెచ్చుకుని ఆ నీటి ధారను చూస్తూ కూర్చున్నాను. కొద్ది సెపటికి కనీసం ఇంకో నాలుగు చోట్ల రూఫ్ దెబ్బ తిని అదే విధం గా వర్షం నీరు ఇంట్లోకి కురవసాగింది... ఇంకో టంబ్లర్ తెచ్చి అక్కడ పెట్టి, కింద ఉన్న చెక్క ఫ్లోర్ ని కాపాడడానికి సత విధాల నా పాట్లు పడుతున్నాను. వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంది.. నేను టంబ్లర్ లో
నీరు వంపేసి, మళ్ళీ పెడుతున్నాను. మొత్తానికి ఉదయం వర్షం ఆగింది..
దానితో పాటే నా ఇంట్లో రూఫ్ నుంచి కారుతున్న నీటి ధార కూడా ఆగిపోయింది.పవర్ రాగానే, మళ్ళీ ఫోనులు మోగాయి....ఇంతకి మా ఇంట్లోనే కాదు, చాలమంది స్నేహితుల ఇంట్లో ఇదే తంతు...
అమెరికా లో చెక్క ఇల్లు..కొనుక్కున్న 13/14 సంవత్సరాలకి ఇలాంటివి మామూలే! ఇలాంటి బాధలు తప్పవు అని చెప్పగా విన్నా...అనుభవించే వరకు తెలియలేదు.

నిజమే కదా !గంట గంటకి లైవ్ మా చిన్ని ద్వారా విన్న నాకు మరింత అసహనం పెరిగింది మూడు రోజుల నుండి పవర్ లేక ఆకాశ హార్మ్యాల్లో ఎప్పుడు తగ్గుతుందా అని బెగులు బెగులుగా ఎదురు చూడడం తప్పించి చేసేదేమీ లేదు ,ప్రతి పని కి పవర్ మీద ఆధార పడటం వలన కొంత ప్రోబ్లం అనుకుంటాను .ఎమైనా ఎంతటి వారైన ప్రకృతికి తల వంచాల్సిందే(అగ్రరాజ్యాలైన మొన్న జపాన్ ఈ రోజు అమెరిక )
ReplyDeleteఅంతేకదండి! మీ చిన్ని బాగుందాండి?
Deleteమీ వాఖ్యకి ధన్యవాదాలు.
వెన్నల గారు చాలా రోజులకు మీ పోస్ట్, చాలా ఆనందంగా వుంది,..కానీ మీ అనుభవం కొంచె బాధగానే వుంది, నిజమే ప్రకృతి చాలా నేర్పుతుంది, ఇలాంటివి కూడా...మీరు చెప్పేది వేరే వాళ్ల అనుభవమేమో అని కూడా అనిపించింది, మధ్యలో ఒక పరిస్థితిని, మీ ఫీలింగ్ ను చక్కగా వివరించారు,..రిపేర్లతో బిజీగా వుంటారేమో కొంతకాలం,.
ReplyDeleteఇది నా అనుభవమేనండి. ప్రస్తుతం ఇంకో సారి వర్షం రాకముందే ఇల్లు బాగు చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాము. మీ వాఖ్యకి ధన్యవాదాలు భాస్కర్ గారు.
DeleteSafe gaa Unnaaru kadaa!
ReplyDeleteilaanti trouble's untoone untaayi. prakrutiki talavanchadame!
Take care!!
అలాగేనండి వనజ గారు. ధన్యవాదాలు మీకు.
Deleteఅయ్యో వెన్నెల గారూ!...
ReplyDeleteఇపుడెలా ఉంది మీ ఇల్లు?
కళ్ళకి కట్టినట్లు కనిపించింది మీ ఇల్లు..(ఫోటో కూడా పెట్టారు)
అమ్మాయిలు సృష్టించే ప్రళయాలు ఎక్కడైనా అంతేనండి...:-)
(వద్దు దండయాత్రకి సిద్ధం కాకండి...:-) )
అంటే ఇక్కడ కూడా తుఫానుల పేర్లు అమ్మాయిలవే పెడుతున్నారు లెండి...
అలా పేర్లు పెట్టె వాళ్ళు మహా తెలివైన వాళ్ళు లెండి...
వారికి సర్వం తెలుసు...:-)....
చాలా రోజులకి మీ పోస్ట్ ...
కేర్ తీసుకోండి ...@శ్రీ
చాలా ప్రశ్నలు వేసారు శ్రీ గారు..:)
Deleteఇప్పుడు ఇల్లు బానే ఉంది. (వర్షం పడటం లేదు కాబట్టి)
ఇక్కడ పెట్టిన చిత్రం గూగుల్ చిత్రమే నండి. (కాని అలాగే ఉందండి ఆ రోజు పరిస్థితి)
తుఫాను లాంటి ప్రళయాలు ఆడవారి వల్లనే సాధ్యం అంటారు. ఏదో మీ అభిమానం. :)) వాదించను లెండి.
మీ వాఖ్యకి ధన్యవాదాలు శ్రీ గారు.
అయ్యయ్యో.. ఇపుడెలా ఉన్నారండీ.. అన్ని కాస్త సద్దుమణిగనట్లేనా.. అప్రమత్తంగా ఉండండి..
ReplyDeleteవేణు గారు, బాగున్నారా?
Deleteఇప్పుడు ఫర్వాలేదండి.మళ్ళీ పెద్దగా వర్షం తొందరలో పడకూడదని కోరుకుంటున్నాను.
ఈ లోగా ఆ రూఫ్ రిపైర్ పని కూడా అయిపోతే ఇంక బెంగ లేదు. మీ వాఖ్యకి ధన్యవాదాలండి.
akkkkkkkkkkkkkkkkkkkkkaaaaaaaaaaaaaaaaaaaaaaa ela unnavvvvvvvvvvvvvvvvvvuuu
ReplyDeleteతమ్ముడు.. నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు?
Deleteఅయ్యో ! ఇంటి కప్పు కూడా ఇలాగవటం చూస్తే తుఫాన్ తీవ్రత ఎంత ఉందో అర్ధమవుతోందండి.
ReplyDeleteనేనున్న ప్రాంతంలో ఇంకా తీవ్రత మరీ అంత ఎక్కువ కాకపోయినా, బాగానే ఇబ్బంది పడ్డామండి. మీ వాఖ్యకి ధన్యవాదాలు.
Deleteoh God ! How are you now ?
ReplyDeleteSravya, all is well now!
DeleteIt was an experience for sure...to an extent I was horrified.
Thanks for asking!
ఈ శాండీ వల్ల చాలా నష్టమే జరిగింది. ఇక్కడినుంచి చూస్తున్న మాకే ఎంత భయంకరంగా ఉందో. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉందండి. మీకు తెలీదని కాదుగాని, కొంచెం జాగ్రత్తండి.
ReplyDeleteమంచి మనసుతో చెప్పిన మంచి మాట.
Deleteఇలాంటి అనుభవం మొదటిసారి కాబట్టి కొంచెం భయపడ్డాను.
తప్పకుండా జాగ్రత్తగా ఉంటానండి.
మీ వాఖ్యకి ధన్యవాదాలు.
సాండీ తుఫాను నుండి క్షేమంగా బయటపడ్డందుకు శుభాభినందనలు..
ReplyDeleteధైర్యంగా ముందు జాగ్రత్తలు తీసుకున్న తీరు అభినందనీయం వెన్నెల గారు..
వర్మ గారు, నిజమేనండి. క్షేమంగానే బయటపడ్డానని అనిపించింది.
Deleteనలుగురితో నారాయణ, గుంపుతో గోవిందా అన్నట్టుగానే ముందు జాగ్రత్తలు తీసుకున్నాను కాని మనం అనుకోనివి జరుగుతూనే ఉంటాయని తెలుసుకున్నాను.
మీ వాఖ్యకి ధన్యవాదాలు.
చెక్కదైనా, సిమెంట్ రూఫ్ అయినా వర్షం పడితే లీకేజ్ అనేది కామన్, అది అమెరికా అయినా ఇండియా అయినా అని తేలిపోయింది:) మీరు సేఫ్ కదా అదే హ్యాపీ...
ReplyDelete:) అంతేనంటారు? మీ వాఖ్యకి ధన్యవాదాలండి ప్రేరణ గారు.
Deleteఅయ్యో, శాండీ విధ్వంసం మీ ఇంటి రూఫ్ కీ చిల్లులెట్టిందా?
ReplyDeleteఏం చేస్తారు పాపం...శాండీ పుణ్యమా అని...కొత్త రూఫ్ వస్తుంది అనుకోటమే.
జాగ్రత్తండీ!
అంతేనండి చిన్ని ఆశగారు.ఏది జరిగినా మన మంచికే అనుకోవటం తప్ప చేయగలిగినది ఏమీ లేదు.ధన్యవాదాలు మీ వాఖ్యకి.
Deleteమొత్తానికి క్షేమంగా ఉన్నారు.. అదే సంతోషం. చిన్ని ఆశ గారన్నట్టు కొత్త రూఫ్ వస్తుంది అనుకోవడమే:)
ReplyDeleteఅలాగే అనుకుంటాను సుభ గారు. ధన్యవాదాలు మీ వాఖ్యకి.
Deleteభగవంతునికి ధన్యవాదాలు!
ReplyDeleteనిజమేనండి. ధన్యవాదాలు మీకు విజయమోహన్ గారు
Deleteవెన్నెల గారూ..
ReplyDeleteతుఫానులెన్నొచ్చినా భారతీయులం కాబట్టి మనకీ పైకప్పు నీళ్ళు గుమ్మరించడాలు అలవాటే కాబట్టి ఈజీగా ఎదుర్కొంటాం.. ఎటొచ్చీ పాపం అమెరికన్స్...:-)
క్షేమంగా బయటపడ్డందుకు కంగ్రాట్స్ మేడం...
Thanks Varma garu.
Deletehahahahaha really very interesting maam
ReplyDelete:)
Deleteinko vishyam aa kurodu mohan evaro gaani art tho champesthannadu nenu athani abhimanigaa mari poya meeku athani gurinchi telsthey nakku emanna telichendee
ReplyDeleteనాకు తెలిసిన సైట్ ఇది ఒక్కటే!
Deletehttp://www.jocalling.com/2009/07/mohans-art-work/
ఇల్లు కురిస్తే కురిసిందిలేండి..మీరు క్షేమంగా ఉన్నారు కదా..ఏం జరిగినా మన మంచికే..అలా కురవకపోతే మీరు ఇల్లు ఇప్పట్లో రిపేర్ చేయించే వాళ్ళు కాదు కదా!
ReplyDeleteవరూధిని గారు, బాగున్నారా?
Deleteమీరన్నట్టు అసలు రూఫ్ లో సమస్య ఉన్నట్టే తెలీదు, ఇప్పటి వరకు.
ఇప్పుడు తెలిసింది కాబట్టి ఒకందుకు మంచిదయ్యింది లెండి మీరన్నట్టు.
చదివి వాఖ్యాని రాసిన మీకు ధన్యవాదాలు.
తుఫాన్ నుంచి క్షేమంగా బయటపడినందుకు సంతోషంగా ఉంది .ఇప్పుడు నార్మల్ అయ్యారు కదా!!ఆ అనుభవం మీరు రాసిన విధానం నచ్చింది. జాగ్రత్తండీ!
ReplyDeleteఅంతా నార్మల్ అండి ఇప్పుడు.
Deleteచదివి వాఖ్యని రాసిన మీకు ధన్యవాదాలు!
Good to know that you all safe. Another storm on the way .. Nor'easter 2012 Tracker: Winter Storm Expected To Affect New York, New Jersey, New England (MAP). Be safe andi.
ReplyDeleteRam garu, How r u? Heard about the storm. I was crossinbg my fingers, as I am still in the process of getting my roof reapired. But I think we are safe this time.
Deleteమీ ఆగమనం బ్లాగు లోకానికి ఆనందం.అందుకే ఇన్ని వ్యాఖ్యలతో స్వాగతం.తుఫాను వ్యాసం మీ వర్ణన బాగున్నాయి.చాలా నష్టం జరిగింది కదా!జాగ్రత్తగా క్షేమంగా ఉన్నందుకు అభినందనలు.
ReplyDeleteమీ అభిమానానికి ధన్యవాదాలండి.
Delete