బోరు గా ఉందోయి, ఒక బీరు కాయ వెయ్యనా?
నాకు అలాగే ఉంది, మరి నేను కూడా అదే పని చెయ్యనా?
రామా,కృష్ణా... పాపం పాపం..ఎంత మాట!
మరి అదే! నేను చేస్తే పాపం, నువ్వు చేస్తే సరేనా?
వితండ వాదం! హమ్మా?
హాపి హవర్ ఉంది, ఆలశ్యం గా వస్తా సాయంత్రం.
నేను కూడా సాయంత్రం సినిమాకి చెక్కేస్తా సరేనా?
నీ ఇష్టమోయి! అయినా, అంత మంచి సినిమాలేమున్నాయి చెప్మా?
అంటే వెళ్ళొద్దు అనే కదా నీ ఉద్దేశం?
అన్యాయం!నేనలా ఎప్పుడు అన్నాను?
ఉషో ఉష్! ఈ రోజంతా బిసి బిసి...
అలసి సొలసి పోయా.. తినటానికేముందోయి?
డబల్ ఉషో ఉష్! ఈ రోజంతా బాక్ టు బాక్ మీటింగ్స్
అదే ప్రశ్న నాది కూడా..తినటానికేముందబ్బా?
దారుణం!అలసి సొలసి ఇంటికి వస్తే భోజనం కూడా లేదా?
నన్ను డిస్ట్రబ్ చెయ్యకోయి,కాసేపు రిలాక్స్ అవుతాను.
దానికేమి భాగ్యం? అలాగే, నేను కూడా కాస్త రిలాక్స్ అవుతా.
నెట్ బ్రౌస్ చెసే బదులు,ఏదన్నా ఉపయోగ పడే పని చెయ్యచ్చు కదా?
మరి మీరు చేస్తున్న పని ఏమిటో, రిలాక్స్ అవుతానంటూ..
అనవసరం! నే చెప్పినదే వేదం అని మన పెళ్ళి చేయించిన పూజారి చెప్పలేదు?
ఏమిటోయి ఈ మధ్య పరధ్యానం ? ఎక్కువ మాట్లాడటం లేదు నువ్వు?
ఓహో? అలాగే? నువ్వు ఎప్పుడన్నా సంభాషణ మొదలుపెట్టావా?
అబ్బా, అలా కాదు, నువ్వు మాట్లాడాలి, నేను వినాలి, అది రూలు
అహా? ఏమి సెలవిచ్చారండి? నేనేమన్నా కాలక్షేపం బట్టానినా?
ఎంత మాట! నువ్వు మాట్లడకపోతే ఇల్లంతా మూగపోతుంది తెలుసా?
ఇంకేముంది?అల్ప సంతోషి ఆ శ్రీమతి మురిసిపోయింది, శ్రీవారు అన్న ఆ మాటలకి..
(సరదాగా నవ్వుకోటానికి మాత్రమే రాసిన పోస్ట్ ఇది.)

:):) నిజంగా ఇలానే ఉండాలంటారా ;)
ReplyDeleteరసజ్ఞ గారు, భలే వారే! ఇలాగే ఉంటే ఎలాగండి? సరదాగా నవ్వుకోవడానికి రాసినది మాత్రమే! చదివి, వాఖ్య రాసి , ప్రశ్నించిన మీకు ధన్యవాదాలు
Deleteఎంత మాట! నువ్వు మాట్లడకపోతే ఇల్లంతా మూగపోతుంది తెలుసా?
ReplyDeleteచాలా కాలం తరవాత.
నిజం.ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి....ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి....:)
Deleteచదివి , స్పందించి, ఆప్యాయం గా వాఖ్య పెట్టిన మీకు ముందుగా ధన్యవాదాలు.
మంచి పాట గుర్తుకు తెచ్చారు. ఇల్లాలి గురించి నిజాలు ఒప్పుకున్న మీకు మరి ఒక్కసారి ధన్యవాదాలు.
:-)....వెన్నెల గారూ!బాగుంది సరదాగా...@శ్రీ
ReplyDeleteశ్రీ గారు,స్పందించినందుకు thanks అండి. సరదా గా రాసినదే కదా మరి.
Delete(గట్టిగా) మాట్లాడితే శ్రీవారు మూగబోరూ ;)
ReplyDeleteబాగుందండీ, సరదాలోనూ నిజం ఉంది, సహజమూ ఉంది.
చిన్ని ఆశ గారు, మగవారికి ఎప్పుడు మౌనం వహించాలో, ఎప్పుడు గట్టిగా మాట్లాడాలో బాగా తెలుసండి. :)) పాపం ఆడవారే! ప్చ్...
Deleteస్పందిచంచిన మీకు ధన్యవాదాలు.
హ హా...అవునండీ...పాపం ఆడ వారే...ఎప్పుడూ గట్టిగా మాట్లాడేస్తారు ;)
Deleteమాట్లాడితే ఎక్కువ మాట్లాడొద్దంటారు...
ReplyDeleteమూగనోము పడితే మాట్లాడవోయ్ అంటారు...
ఈ మగవాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలీదు...
శ్రీ లలిత గారు, ఎందుకో మీరు అమాయకం గా కనపడుతున్నారండి. వాళ్ళకన్ని తెలుసండి. మనల్ని ఆడించడం కూడా..:) కాదంటారా? సరాదా గా నవ్వుకోడానికి మాత్రమే రాసానండి. నెపం వెయ్యడానికి అసలు కాదు లెండి.
Deleteచదివి , మీ స్పందనను తెలియచేసినందుకు ధన్యవాదాలండి.
బావుంది అండి.
ReplyDeleteనా లెక్కలో ఇల్లాలు అనాలి, శ్రీవారు వినాలి.
"ఎవిటోయ్ సుబ్బారావ్ నిన్న నువ్వు మీ ఆవిడా మాటా మాటా అనుకున్నారుట? లేదండి మా ఆవిడ అండి, నేను (మనసులో) అనుకున్నా" - ముళ్ళపూడి వెంకట రమణ గారి జోకు
వెంకట్ గారు, ముందుగా స్పందించిన మీకు ధన్యవాదాలు.
Deleteమనసులో అనుకోవడం కంటే బయటికి అనేస్తేనే బెట్టర్ కదండి!
అరె రే ! చూడటం ఆలస్యం అయిందే ! బావుంది..
ReplyDeleteఅన్నట్టు ఈ మధ్య అంతా ఇలాగే వాదులాడా రా!? అయినా అలా బుట్టలో పడిపోటారా..ఏమిటి!? :)
వనజ గారు, అందరు ఇలా వాదులాడుకుంటారో లేదో నాకైతే తెలీదు. అప్పుడప్పుడు సరదాగ చుట్టూ చూసినప్పుడు విన్న సంభాషణలు మాత్రం అని చెప్పగలను. అయ్యో! అనాదిగా ఆడవారికి తెలిసిందే బుట్టలో పడటం కదండి.. అలా పడకపోతే వారు స్త్రీలు కారు కదండి.. :) ధన్యవాదాలు మీకు
Deleteపాపం, మీ వారిని ఇలా అల్లాడించేస్తూ చివరలో సరదాగా అంటే మాత్రం మాకర్థం కాదనుకున్నారా,... మళ్లీ అల్ప సంతోషి శ్రీమతి అని బిరుదు కూడా ఇచ్చేసుకున్నారు మీరు,...హ,హ,...చాలా కాలానికి మీ పోస్ట్,.వెరైటిగా,,,,,అప్పుడప్పుడు రాస్తూ వుండండి,.
ReplyDeleteభాస్కర్ గారు, ఊహు! నేను అసలు అలా కాదండి. నేను నిజంగా జెనెరల్ గానే రాసానండి. మీరు నమ్మాలి. post వెరైటిగా ఉందా? చాలా కాలానికి నేను రాయడం వెరైటిగా ఉందా? :))
Deleteధన్యవాదాలు మీ అభిమానానికి!
:))
ReplyDeleteచదివి, చిరునవ్వుతో స్పందించిన మాలకుమార్ గారు ధన్యవాదాలండి.
Deleteమీ సంభాషణా చాతుర్యం అమోఘం!!!
ReplyDeleteచందు గారు, Thank you so much!
Deleteశ్రీమతి,శ్రీవారి మాటలు బాగున్నాయండీ
ReplyDeleteఅప్పుడప్పుడూ ఇలాగ కూడా మాట్లాడుకుంటేనే బాగుంటుందేమో కదా :)
అంటే మీరెప్పుడు ఇలా మాట్లాడుకోలేదన మాట! :)
Deleteచదివి, స్పందించిన మీకు ధన్యవాదాలు రాజి గారు!
:))
ReplyDeleteచిరునవ్వుతో స్పందించావా హర్షా? Thank you very much!
maavaaru meekelaa telusandee...aayana maaTalannee ilaa paTTesaaru!!
ReplyDeleteశ్రీవారు (వారు ఎవరి శ్రీవారైనా సరే) మాట్లాడితే ఇలాగే ఉంటుందండి. హమ్మయ్య, మీరు రిలేట్ అవ్వగలిగారు, అంతే చాలు. స్పందించినందుకు ధన్యవాదాలు ఎన్నెల గారు.
Deleteహ హ అది మీరే కదూ నిజం చెప్పండి :-)
ReplyDeleteశ్రావ్య, అలా నిలదీసి అడిగితే ఎలా చెప్పమ్మ? నేను, నాలాంటి ఇంకెందరో శ్రీమతులు. :)
DeleteThank you so much for your comment.
అంతే అంతే......దహా.
ReplyDeleteమీరు అంతే అంటే ఇంక 100% అంతే నండి. :)
Deleteధన్యవాదాలు మీ వాఖ్యకి.
చాలా బాగుందండి......కామెడీ గా రాసినా...అన్నీ నిజాలే :)
ReplyDeleteధన్యవాదాలండి కావ్యాంజలి గారు
Delete:):)
ReplyDelete:)) Thank you
Deleteశ్రీ వెన్నెలగారికి, నమస్కారములు.
ReplyDeleteచాలా సరదాగా, నిజానికి దగ్గరగా వున్నది. రాసిన దానినిబట్టి చూస్తే శ్రీవారు గడుగ్గాయిలాగా వున్నారు; చిత్రాన్నిబట్టి చూస్తే ( స్త్రీ కేశాలు, ఆ కేశాలలో ఇరుకున్న/బంధింపబడిన శ్రీవారి ముఖం ) శ్రీమతిగారే గడుగ్గాయిలాగా వున్నట్లనిపిస్తుంది. అయినా, ఆడవల్ల మాటలకెకాడు, మగవాళ్ల మాటలకికూడా అర్ధాలు వేరేలే!! అని చెప్పాల్సివస్తుంది మరి.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మధవరావు గారు, మీరు వాఖ్యలో రాసిన వన్ని నిజాలేనండోయి.
Deleteభలే కనిపెట్టాసారు నా అంతరంగం. ధన్యవాదాలు మీ స్పందనకు.