Thursday, December 6, 2012

తస్మాత్ జాగ్రత్త


"సత్యా..దీపక్ ఇండియా నుంచి వచ్చాడు.ఈ రోజు ఉదయమే పలకరించాను" అంటూ వార్త మోసుకొచ్చింది వాణి. "అవునా?ఉండు వెళ్ళి కలిసి వస్తాను" అంటూ దీపక్ కూర్చునే డిపార్ట్ మెంట్ వైపు అడుగులు వేసింది సత్య. తల వంచుకుని, తదేకంగా కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నాడు దీపక్. నెల రోజుల తరువాత వర్క్ కి ఆ రోజే రావడం కారణంగా చదవని ఇమైల్స్ అన్నీ చూస్తున్నాడు దీపక్. దీపక్ ని చూడగానే "హాయ్ దీపక్,నీ ట్రిప్ ఎలా అయ్యింది?" అని అడిగింది సత్య. సత్యని చూస్తూనే చిరునవ్వు పెదవులపై తల్లుక్కుమంది దీపక్ కి."అక్కా..అంతా బాగా జరిగింది" కొంచెం సిగ్గుపడుతూ జవాబు ఇచ్చాడు. "ఓహో ! కొత్త పెళ్ళికొడుకు సిగ్గు కూడా పడుతున్నాడండి" అని దీపక్ ని ఆట పట్టించింది సత్య. "ఇంతకీ అనురాధని తీసుకుని వచ్చావు కదా?" అని సత్య ప్రశ్నిస్తే "అవునక్కా,ఇద్దరము కలిసే వచ్చాము" అని సమాధానమిచ్చాడు దీపక్. "మరి నీ బెట్టర్ హాఫ్ ని ఎప్పుడు పరిచయం చేస్తావు?" అన్నసత్యతో,అప్పుడే అక్కడికి వచ్చిన వాణి "ఇదిగో సత్యా..ముందు వాళ్ళని కొన్ని రోజులు హాయిగా ఎంజోయ్ చెయ్యనీ" అంది వాణి. మళ్ళీ సిగ్గు పడుతూ "అలాంటిదేమి లేదక్కా,ఈ వీకెండ్ కలుద్దామా" అని అడిగాడు దీపక్. అప్పటికే వారి సంభాషణని వింటున్న ఇంకొంతమంది వారి సహోద్యోగులు అక్కడ చేరి,పార్టీ ఎప్పుడు అని గొడవ చెయ్యడం మొదలుపెట్టారు.

దీపక్  నెలరోజుల క్రితమే ఇండియా వెళ్ళి వివాహం చేసుకుని సతీసమేతంగా అమెరికలో అడుగు పెట్టాడు. అప్పటికే ఐదు సంవత్సరాలుగా అమెరికాలో వర్క్ చేస్తున్న దీపక్ చాలా మంచివాడుగా స్నేహితుల దగ్గర, వర్క్ లో కొల్లీగ్స్ దగ్గర పేరు తెచ్చుకున్నాడు. చాలా నెమ్మదైనవాడు, పరుషం గా ఒక్క మాట మాట్లాడం కాని, ఒకరి గురించి చెడుగా మాట్లాడం కాని దీపక్ కి తెలీదు. అందరికీ తలలో నాలుకగా ఉంటూ, చింతలే లేని చిద్విలాస స్వామిలా ఉంటాడు. సత్యకి దీపక్ చాలా సంవత్సరాలుగా తెలుసు. సత్య, ఆమె భర్త ప్రకాష్ దీపక్ ని తమ ఇంట్లో సభ్యుడిలాగే ప్రేమగా చూసుకుంటారు. చనువుగా అక్కా అని పిలవడం అలవాటు. ఆ వీకెండ్ అనురాధను కలిసాక దీపక్ కి తగ్గ భార్య అనుకున్నారు సత్య, వాణి. ఆ తరువాత ఎన్నో సంధర్భాలలో అను గురించి ఎంతో ఆనందంగా చెప్పేవాడు దీపక్. అప్పుడప్పుడు అనురాధ (అను)ని కలిసినప్పుడు అను కూడా దీపక్ లాంటి భర్త దొరకటం తన అదృష్టంగా చెప్పేది. ఒకరినొకరు ఇష్టపడతూ, ప్రేమగా, ఎంతో సంతోషంగా ఉండేవారు ఇద్దరు.

ఆరు నెలల తరువాత ,ఒక రోజు హట్టాత్తుగా షాపింగ్ చేస్తుండగా అను, దీపక్ కనిపించారు సత్యకి. ఆఫీస్ లో ఎవరి పనిలో వారు నిమగ్నమైపోయి, ఎన్నో రోజులుగా దీపక్ ని కూడా కలవలేదు సత్య. వారిద్దరినీ చూసి నవ్వుతూ పలకరిచింది సత్య "ఓ కొత్త జంట .. బాగున్నారా? చాలా రోజులయ్యింది కదా మనం కలుసుకుని" అని పలకరించింది సత్య.సమాధానంగా దీపక్ అన్నాడు "అవునక్కా రెండు నెలలు పైగా అయ్యిందేమో..ఇంతకి ఏ ప్రోజెక్ట్ మీద పని చేస్తున్నారు మీరు ఇప్పుడు?" అని వివరాలు అడిగాడు. సత్య, దీపక్ కొద్దిసేపు వర్క్ కి సంబంధించిన కబుర్లలో పడిపోయారు. ఇంతలో చట్టుక్కున్న అక్కడ అను కూడా ఉంది అన్న విషయం గుర్తుకు వచ్చి,"ఇవన్నీ తరువాత మాట్ళాడుకుందాము కాని,ఇంతకీ కొత్త కాపురం ఎలా ఉంది? సెట్టిల్ అయ్యినట్టేనా?"అని అడిగింది సత్య. అను ముభావంగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది.దీపక్ సర్దుకుని.."అంతా బానే ఉంది" అని పొడిగా సమాధానమిచ్చి"మళ్ళీ కలుద్దాము"అని అప్పటికి సెలవు తీసుకున్నాడు. కొద్దిగా బాధగా అనిపించింది సత్యకి. ఏమయ్యింది వీళ్ళకి?ఇంతకు ముందు వరకు హాయిగా, నవ్వుతూ,తుళ్ళుతూ ఉండేవారిద్దరూ.ఈ రోజు ఎందుకని అలా ఉన్నారో?అను కళ్ళలో ఏదో తెలియని బాధ కనిపించింది సత్యకి. దీపక్ కూడా ఎప్పటిలా లేడు.ఏదన్నా మాట,మాట అనుకున్నరేమో..భార్యాభర్తల మధ్య సహజమే కదా అని అనుకుని ఆవిషయం అంతటితో మర్చిపోయింది సత్య.

వారం రోజుల తరువాత వాణి సుడిగాలిలా సత్య దగ్గరకి వచ్చి నీకొక విషయం చెప్పాలి అంది లోగుంతుతో "సరే పద అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము" అని సత్య అనగా, ఇద్దరు బ్రేక్ రూం కి వెళ్ళారు. "ఇప్పుడు చెప్పు, విషయం ఏమిటో?" అని సత్య అడిగింది. "దీపక్ , అను చాలా ముభావం గా ఉంటున్నారు, మొన్న పార్టిలో అయితే ఇద్దరు అపరిచితులానే ఉన్నారు.కలిసి వచ్చి,కలిసి వెళ్ళడం మాత్రం చేసారు కాని,ఇంతకు ముందులా లేరు.ఏదో తేడా" అన్న సందేహం వెళ్ళగక్కింది. సత్య తలాడిస్తూ "నేను కూడా గమనించాను ఆ మధ్య కలిసినప్పుడు..వీలు చూసుకుని దీపక్ ని అడుగుదామా" అని సత్య అంది. "ఇంకా నయ్యం..ఎలా అడుగుతాము ఇలాంటి విషయాలు? నువ్వు వాయి ముడు..చుప్ రహో" అని అంది వాణి. అంతటితో ఆ సంభాషణ ముగిసినా,సత్య కి మనసు ఊరుకోక, ఒక రోజు వాళ్ళింటికి వస్తున్నానని చెప్పి ఒక సప్రైస్ విసిట్ చేసింది సత్య. దీపక్ "ఇంట్లో పాలు లేవు,కనీసం టీ పెట్టడానికి" అని "ఇప్పుడే వస్తానక్కా..మీరు మాట్లాడుతూ ఉండండి" అని హడావిడిగా బయటికి వెళ్ళాడు.అనుతో ఏకాంతం గా గడిపే సమయం దొరికినందుకు సంతోషిస్తూ అడిగింది సత్య అనుని "ఏమిటి మీరిద్దరు ఈ మధ్య ముభావంగా ఉంటున్నారు? ఏ విషయంలోనైనా గొడవ పడ్డారా? సంశయించకుండా విషయం చెప్పు.ఇక్కడ అయినవారికి దూరంగా ఉంటున్నాము, స్నేహితులతోనే అన్ని బాధలు, మంచి , చెడు పంచుకుంటాము..ఫర్వాలేదు చెప్పు"అని అను తో అంది సత్య.

అప్పటి వరకు మౌనంగా ఉన్న అను సత్య మాటలకి కదిలిపోయి ఒక్కసారి బోరుమని ఏడవటం మొదలుపెట్టింది.కొంచెం కంగారు పడింది సత్య."ఏమయ్యింది నిన్ను ఇంత బాధపెట్టే పనేమి చేసాడు దీపక్?" అని అడిగింది సత్య. అను నెమ్మదిగా విషయం విపులం గా చెప్పసాగింది. అంతా విన్నాక సత్య హాయిగా ఊపిరి పీల్చుకుంది.."ఓస్! ఇదా విషయం..విషయం ఇదని తెలిస్తే నువ్వు ఇంత బాధ పడాల్సిన అవసరమే ఉండేది కాదు. నేను, వీణ, ఇంకా ఎంతో మంది ఉన్నాము నీకు,అసలు దిగులు పడకు నువ్వు"అని ఓదార్చింది అనుని.ఇంతలో దీపక్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అక్కడ వాతావరణాన్ని చూసి అను వైపు అనుమానం గా చూసాడు దీపక్.సత్య అంది దీపక్ తో"ఆదివారం, సోమవారం, మంగళవారం నాకు కుదురుతుంది,నాకు తెలిసినంతవరకు వీణకి  శనివారం, బుధవారం తప్పకుండా కుదురుతుంది.మేము రేపటి నుంచి వచ్చి సాయత్రం ఆరు గంటలకు అనుని పిక్ చేసుకుంటాము.అయినా మీ మగవారందరికీ ఈ ఫోబియా ఏంటయ్యా? ఆ నిమిషంలో మిమ్మల్ని ఆ దూర్వాశ మహాముని ఆవహిస్తాడా? అని దీపక్ ని నాలుగు చివాట్లు పెట్టి అక్కడ నుంచి ఇంటికి వచ్చింది సత్య.

ఇంట్లోకి రాగానే ఎదురుగా భర్త ప్రకాష్ "దేవి గారికి ఈ మధ్య షికార్లు ఎక్కువయ్యాయి. ఎక్కడినుంచో రాక?" నవ్వుతూ అడిగాడు. "దీపక్ దగ్గరకి వెళ్ళి వచ్చానులే" అని పొడిగా జవాబిచ్చింది సత్య. "ఎలా ఉన్నాడేమిటి కొత్త పెళ్ళికొడుకు?" అని అడిగాడు ప్రకాష్."బానే ఉన్నాడు, అనుకి డ్రైవింగ్ నేర్పుతున్నాడు" అని ప్రకాష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ సమాధానమిచ్చింది సత్య. ప్రకాష్ పగలబడి నవ్వసాగాడు."అయితే దీపావళి టపాకాయలు పేలుతున్నాయా? ఏ రేంజ్ లో? అయినా మీ ఆడవారికి డ్రైవింగ్ సెన్స్ తక్కువోయి..ఏమన్న అంటే మండిపడతావు కాని, నిజాలు అప్పుడప్పుడు ఒప్పుకోవాలి మరి నువ్వు" అన్నాడు ప్రకాష్. ఇదిగో ఆ మాటంటేనే నాకు మండుతుంది.నీకు ఎక్కువ టిక్కట్స్ ( సరిగ్గా డ్రైవ్ చెయ్యకపోతే పోలిసులు ఇచ్చే జరిమానాలు) ఉన్నాయా? నాకు ఉన్నాయా?"అని హుంకరించింది సత్య."బాబోయి ఈ వంతు గొడవలు ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం అయిపోయాయి కదా? మళ్ళీ ఇప్పుడెందుకు చెప్పు" అని మాట దాటేసాడు ప్రకాష్.

పదిహేను సంవత్సరాల క్రితం సంఘటనలన్ని కళ్ళ ముందు కదిలాయి సత్యకి. అత్యవసరమైతే కాని డ్రైవింగ్ నేర్చుకోవాలన్న కోరిక పెద్దగా ఉండేది కాదు సత్యకి. కాని అన్ని పనులకు ప్రకాష్ మీద ఆధారపడటం సరి అయిన పద్దతి కాదు కాబట్టి, డ్రైవింగ్ నేర్పమని ప్రకాష్ ని అడిగింది సత్య. సరే అని  ఒక పార్కింగ్ లాట్కి తీసుకెళ్ళాడు.అంతే, స్టీరింగ్ ముట్టుకుంటే డమాడం..కార్ యాక్సిలటర్ మీద కాలు వేస్తే డమాడం,బ్రేక్స్ మీద కాలు వేస్తే డమాడం, ఎవరినో ఈ రోజు గుద్దేస్తావా అంటూ, అసలు ఏమి చేస్తున్నావో తెలుసా అంటూ తిట్లు. పూనకం వచ్చిన వాడిలా ఆవేశపడటం, ఆ టెన్షన్ లో ఏమి   మాట్లాడుతున్నాడో అతనికే తెలిసేది కాదు. అయినా సరే తప్పదు కనక కొద్ది రోజులు అలాగే ఓపికగా భర్త సాయంతో డ్రైవింగ్ నేర్చుకోసాగింది సత్య.  కాని రోజు రోజు కి గొడవలు ఎక్కువ అయ్యాయే కాని తగ్గలేదు. ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా, తన కార్ ని తీసుకెళ్ళి సత్య యాక్షిడంట్ చేసేస్తుందని రోజు దడిచిపోయేవాడు ప్రకాష్. ఇలాగే కొనసాగితే అసలు డ్రైవింగ్ అంటేనే తెలియని భయ్యం కలిగి, ఇంక జీవితంలో డ్రైవింగ్ చెయ్యలేను అన్న విషయం అర్ధం చేసుకుని భర్తతో ఇకపై నువ్వు నేర్పక్కర్లేదు , నేనే డ్రైవింగ్ క్లాస్సెస్ తీసుకునో , ఫ్రెండ్స్ సాయంతోనో నేర్చుకుంటాను అని తేల్చి చెప్పేసింది సత్య. కొద్ది రోజులలోనే డ్రైవింగ్ నేర్చుకుంది సత్య. కాని ప్రకాష్ తనను అన్న మాటలు, ఆ రోజుల్లో తాము పడ్డ గొడవలు అంత తేలికగా మర్చిపోలేకపోయింది. నెమ్మదిగా ఎంతో మంది స్నేహితుల ద్వారా, పరిచయస్తుల ద్వారా ఇలాంటి సంఘటనలు ప్రతి ఇంటా ఉన్నాయి అని తెలుసుకుంది. ముఖ్యంగా భర్తలు భార్యలకు డ్రైవింగ్ నేర్పుతుండగా వారు చిత్రంగా ఎంతో ఆవేశానికి లోనవుతారాని, ఎన్నో విషయాలలో ఎంతో ఓర్పుతో ఉండేవారి విశ్వరూపం మాత్రం భార్యలకు డ్రైవింగ్ నేర్పేటప్పుడు చూపెడతారన్న విషయం అర్ధం అయ్యింది సత్యకి. సమస్య అర్ధం అయితే దానికి పరిస్కారం కూడా ఉంటుందిగా.. పరిస్కారం ఏమిటంటే భార్యలు ఎవ్వరు కూడా భర్తల దగ్గర డ్రైవింగ్ నేర్చుకోకూడదు. భర్త ఎంత గొప్ప వాడైనా, ఎంత మంచివాడైనా, ఎంత శాంత మూర్తి అయినా, ఎంత ప్రేమ కలిగిన వాడైనా, అసలు ఆ భగవంతుడైనా భార్యలకు డ్రవింగ్ నేర్పేటప్పుడు మాత్రం వారికి కలిగే ఆగ్రహావేశాలకు ఎవరన్నా హడిలిపోవాల్సినదే! పాపం అది వారి weakness అని వారిని క్షమించెయ్యాలి అంతే!


అనుకి రెండు నెలలలో డ్రైవింగ్ దగ్గర ఉండి నేర్పించారు సత్య, వాణి. దీపక్, అను హాయిగా, సంతోషం గా ఉన్నారెప్పటిలాగే! 

నీతి : అమెరికాలో భర్తల సాయంతో డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే అమ్మాయిలు, తస్మాత్ జాగ్రత్తా!

(అవేశపడకుండా ఎంతో ఓర్పుతో, భార్యని ఒక్క మాట కూడా అనకుండా డ్రైవింగ్ నేర్పిన వారిని నేను ఇప్పటివరకు చూడలేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే,వారిని ఉద్దేసించి రాసిన పోస్ట్ కాదు అని గమనించ ప్రార్ధన!)

47 comments:

  1. ఓహ్..అలాగా..తెలియదండీ నాకు ఈ విషయం..ఎప్పుడు వినలేదు..భలే ఉందే...మీ ముందుజాగ్రత్త చర్యకి ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ఈ బాధలు మాకు లేవు కనక, మాకు కొత్తసంగతి తెలిసింది. తస్మాత్ జాగ్రత!!! :)

    ReplyDelete
  3. my husband is not like that, he was more confident in me than myself

    ReplyDelete
    Replies
    1. I guess you are saying, your husband has more confidence in you than himself , right?
      Great!

      Delete
  4. Superb. Not just wife & husbands but the rule apply for all siblings too. ;)
    The + point is that for long drives you can relax and watch movies while hubbies sweat it out when you go together.

    ReplyDelete
  5. బాగుందండి,.పెళ్లైన కొత్తలలో అడిగినట్లుంది మా ఆవిడ సైకిల్ నేర్పమని,..ఇంకా వీలు కాలేదండి,..కారే కాదు, సైకిల్ అయినా మీ ధీయరీ కరెక్టే.....

    ReplyDelete
    Replies
    1. Proven theory భాస్కర్ గారు. :) ధన్యవాదాలు

      Delete
  6. పోస్ట్ బాగుంది జ.వె. గారు :-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫోటాన్ గారు. :)

      Delete
  7. ఓస్ ఇంతేనా, ఏదే అనుకున్నా. Making hill out of mole, కదా ఈ రచయిత్రులు

    ReplyDelete
    Replies
    1. Anonymous గారు, First of all, నేను రచయిత్రిని కాను.
      జీవితానుభావాలన్ని నా రీతిలో నేను రాసుకుంటాను.
      ఇక పోతే ఈ పోస్ట్ అందరు రిలేట్ చేసుకోలేరు లెండి.
      అనుభవించిన కొద్ది మంది మాత్రమే నేను రాసిన దానిలో అతిసయోక్తి లేదని అనుకుంటారు అని నా నమ్మకం.స్పందించినందుకు ధన్యవాదాలు.

      Delete
  8. * చక్కటి ఆలోచనాత్మకమైన టపాను రాసారు. మీరు చెప్పింది నిజమేననిపిస్తుందండి.
    * అయితే, స్త్రీలు వాహనాలను నడపటం నేర్చుకుంటే ఎక్కడికైనా స్వతంత్ర్యంగా వెళ్ళగలరు కాబట్టి, వారికి స్వేచ్చ పెరుగుతుందని మగవారి భయం కావచ్చు.
    * లేక , స్త్రీలు వాహనాలను నడపటం నేర్చుకుంటే , ప్రమాదాలు జరుగుతాయేమోననే భయం వల్ల , భార్యకు డ్రైవింగ్ నేర్పించటం భర్తకు అంత ఇష్టం ఉండదేమోనండి.
    * పిల్లలకు బండి కొనివ్వాలంటే తల్లితండ్రులు ఎన్నోవిధాలుగా ఆలోచించి భయపడతారు కదా ! అలాగే, మగవారు కూడా ఎన్నోవిధాలుగా ఆలోచించి, స్త్రీలకు బండి ఇవ్వాలంటే భయపడతారేమోనండి.
    ......................
    * వాహనాలను నడపటంలో మగవారికున్నంత ఉత్సాహం, ఓపిక.. ఆడవారికి ఉండదు. ( శారీరికంగా త్వరగా అలసిపోతారు కాబట్టి, ) ఈ విషయంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మనస్తత్వంలో కూడా కొంచెం తేడా ఉంటుందంటారు.
    * చిన్నతనంలో ఎక్కువమంది అబ్బాయిలు వాహనాలకు సంబంధించిన బొమ్మలను కొనుక్కోవటానికి ఇష్టపడితే , ఎక్కువమంది ఆడపిల్లలు వాహనాల బొమ్మలను కొనుక్కోవటానికి అంత ఇష్టపడరు.
    * అయితే, ఈ రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో , ఇష్టమున్నా లేకపోయినా ఆడవాళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు.
    *ఈ మధ్య ఒక సర్వేలో తేలిందేమిటంటే, డ్రైవింగ్ లో మగవారికన్నా స్త్రీలు ఎక్కువ పొరపాట్లు చేస్తారట.. ( ఈ సర్వే ఎంతవరకూ నిజమో నాకు తెలియదు.. )
    * ఈ టపా చదివిన తరువాత నాకు తోచిన అభిప్రాయాలను రాసానండి.

    ReplyDelete
    Replies
    1. మీరు చాలా బాగా విష్లేషించారు అనురాధ గారు.

      * మీ మొదటి పాయింట్ కొద్దివరకు కర్రెక్ట్ ఏమో కాని , నేను నా చుట్టూ చూసిన వారిలో ఏ ఒక్కరు అలా అలోచించేవారు కాదు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ అన్నది వచ్చి తీరాలి ఇక్కడ నివసిస్తున్న వారికి.
      * మీ రెండొ పాయింట్ చాలామటుకు నిజమే! స్త్రీలు వాహనాలు నడిపితే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో అన్న భయ్యం భర్తలకు ఉండడం నేను కూడా గమనించాను.
      * నిజమే, పిల్లల విషయం లో భార్యా భర్థలిద్దరు ఒకేళా అలోచిస్తారు, కాబట్టి, మన పిల్లల విషయం లో మనకి ఉన్న భయమే , భర్తలకు భార్యల విషయం లో అంతర్లీనం గా ఉంటుంది.
      ఇక పోతే మీరు రాసిన మిగతా పాయింట్స్ అన్ని కూడా సరి అయినవే!
      సర్వే గురించి కొత్త విషయం నాకు తెలిపారు.

      Great response to my post అనురాధ గారు. Thank you so much!

      Delete
  9. డ్రైవింగ్ గురించి మీరు చెప్పిందీ నూటికి నూరుపాళ్ళూ నిజమండీ:))

    ReplyDelete
    Replies
    1. సునీత గారు,బాగున్నారా? రిలేట్ అయ్యారు నా పోస్ట్ కి. అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. ధన్యవాదాలు టపా చదివి స్పందించినందుకు.

      Delete
  10. ఇది ఒక వైపు స్టోరీ మాత్రమే.

    సాధారణంగా భర్త పక్కన ఉన్నప్పుడు, భార్య "ఏదన్నా తప్పు జరిగితే ఆయన చూసుకుంటారు లే" అనే భరోసాతో ఉంటుంది. ఇది ఏ మాత్రం తప్పు కాదు. భర్త అంటేనే భరించేవాడు కాబట్టి భర్తకు కూడా ఈ తరహా dependency అంగీకారమే. కానీ ఈ dependency కార్ డ్రైవింగ్‌లో కూడా తెలియకుండానే ప్రదర్శిస్తుంది భార్య. ఇది చాలదన్నట్లు కనీస ట్రాఫిక్ సెన్స్ అన్నది సాధారణంగా ఉండదు. ఈ రెంటి దెబ్బకి, తన భార్య డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు 'ఇంత దారుణంగా కూడా mistakes చెయ్యొచ్చు' అని రుచి చూపించిన ప్రతి సారీ రింగులు తిరిగి ఈ తరహాలో ఎంత భారీ accident జరుగుతుందోనని భర్త ఊహించుకొని బెంబేలెత్తిపోతాడు. అర క్షణంలో సినిమా చూసి, తను ప్రేమించే భార్య ఏ కష్టానికి లోనవుతుందోనని భయపడి, ఆ భయాన్ని పెద్ద హూంకారరూపంలో ప్రదర్శిస్తాడు. ఆ అరుపులు వికటించిన ప్రేమ యొక్క రూపాంతరాలు మాత్రమే! అదే బయటివారు ఎవరన్నా నేర్పిస్తుంటే, ఆ subconscious dependencyని పక్కన పెట్టి నేర్చుకుంటుంది - అందుకని అక్కడ అనుభవం వేరేగా ఉంటుంది.

    కార్ డ్రైవింగ్ వంటివి నేర్చుకుంటున్నప్పుడు ఈయన నా భర్త కాదు - నేర్పించే శిక్షకుడు అని ప్రవర్తించగలిగితే, ఏ గొడవలూ ఉండవు. 'సఖీ' సినిమా చూసే ఉంటారు. అందులో అరవింద్ స్వామి, ఖుష్బూల పాత్రలు గుర్తున్నాయా? అదీ భర్త అంటే.

    ReplyDelete
    Replies
    1. మీతో పూర్తిగా ఏకీభవిస్తానండి.డ్రైవింగ్ నేర్పేటప్పుడు భర్తలు అంతటి అసహానాన్ని చూపటం వెనక అర్ధవంతమైన కారణాలు ఎలా ఉన్నాయో, పాపం భార్యలు కూడా ఆ డ్రవింగ్ నేర్చునేటప్పుడు ఎందుకు అలా భర్తలు అవేశపడుతున్నారో అన్న విచక్షణ కంటే, అన్నేసి మాటలు తను ఎంతో ప్రేమించే, తనను ఎంతగానో ప్రెమించే భర్త నోటి వెంట విన్నప్పుడు, భార్యలు కూడా రియక్ట్ అవ్వడం సహజం. గొడవలు తప్పని సరి అని తెలిసినప్పుడు అవి నివారించుకునే ప్రయత్నం చెయ్యాలి కదండి..

      ధన్యవాదాలండి మీ స్పందనకు.

      Delete
  11. * చక్కటి టపాను వ్రాసారు.
    * మహిళలు ఒంటరిగా టాక్సీలలో ప్రయాణించటం అంత సురక్షితం కాదు కాబట్టి, స్త్రీలు డ్రైవింగ్ నేర్చుకోవటం మంచిదేనండి.

    * ఈ విషయం ముందు వ్యాఖ్యలో రాయలేదని ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యను రాసానండి.
    * ఇప్పటికే ఎక్కువగా రాసినట్లున్నాను. దయచేసి క్షమించండి.

    ReplyDelete
    Replies
    1. అనురాధ గారు, మీ ప్రశంస కి మనస్పూర్తిగా ధన్యవాదాలండి.
      మీరు ఎంత పెద్ద వాఖ్య అయినా రాయచ్చు. క్షమించడం అన్న పదాలు వద్దండి.
      టపాలకు స్పందనలే oxygen కదండి? అర్ధవంతమైన, అలోచనాత్మక స్పందనలు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుందండి

      Delete
  12. miru edi cheppinaa nijame andi tapaa lo chakkagaa nijaalu anni raasaru

    ReplyDelete
    Replies
    1. Thanks మంజు గారు. చాలా పెద్ద ప్రశంస. మీకు కూడా అనుభవేమా?

      Delete
  13. నిజమేమోనండోయ్..సాధారణంగా అబ్బాయిలకి అమ్మాయిల Driving నచ్చదు..
    ఇంత చిన్న విషయాన్ని చాలా ఆసక్తికరంగా రాసారు..:):)

    ReplyDelete
    Replies
    1. ధన్య వాదాలు ధాత్రి గారు. మీకు కూడా తెలుసన మాట ఈ విషయం! :)

      Delete
  14. చక్కటి విశ్లేషణ వెన్నెలగారూ.. డ్రైవింగ్ గురించి మీరు చెప్పింది నిజం..

    ReplyDelete
  15. అందుకే ఇలాంటి టెన్షన్స్ వద్దనుకునే డ్రైవింగ్ మావారిని నేనే నేర్చేసుకోమని, ప్రక్కన కూర్చుని నేను ఎంజాయింగ్:-)

    ReplyDelete
    Replies
    1. మంచి పని చేసారు స్రుజన గారు.మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  16. అలా ఒక్కమాట కూడా మాట్లాడకుండా నేర్పితే మా ధ్యాస మళ్ళిందనేవారు కూడా మీరే:-)

    ReplyDelete
  17. బండి స్వంతదారుడు పక్కన వుండగా డ్రైవింగ్ నేర్చుకోవడంలో అలాంటి ఇబ్బందులుంటాయి. భర్తనే కాదు, అన్న, అక్క, నాన్న అయినా అంతే. అదే డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ వుంటే, బండికి జరిగే డేమేజికి మనమే కాంపెన్సేట్ చేయాల్సివుంటుంది, అతడిది భాధ్యత అంతగా వుండదు. స్వతదారుని వాలెట్‌తీపి అలాంటిది. :)

    ReplyDelete
    Replies
    1. పూర్తిగా మీ అభిప్రాయం తో ఏకీభవించలేకపోతునాన్నండి.
      మగవారు కొద్దిగా ఎక్కువ రియక్ట్ అవుతారేమో ఈ విషయం లో అనిపిస్తుంది.
      మీ అభిప్రాయం తెలిపి, ఇలా కూడ అవ్వొచ్చేమో అన్న అలోచనను నాకు కలిగించారు.
      ధన్యవాదాలు SNKR గారు

      Delete
    2. భర్తగారి బావమరది/మామగారి బండిలో నేర్పమన్నప్పుడు రియాక్షన్ తక్కువగా వున్నట్టు ఓ అద్యయనాలు చెబుతున్నాయి. అయిననూ 'ఏకీభవించను' అంటే... ఇక మీ ఇష్టం. :)

      Delete
    3. మీ కామెంట్ చూసి నవ్వుతూ ఉండిపోయాను. ఇంత విపులం గా మీరు చెప్పాక SNKR గారు, ఒప్పేసుకున్నానండి... ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  18. ప్రతి పోష్ట్ లో వాస్తవిక దృక్పథం , సమస్యకు చక్కని పరిష్కారం సూచించడం ఒక్క వెన్నెలకే చెల్లు .

    ReplyDelete
    Replies
    1. మాష్టారు, కథ లా కల్పితం గా రాస్తానే కాని, అన్ని సంఘటనులు జరిగినవే, చాలా మటుకు నేను కాని , నా చుట్టూ ఉన్నవారు కాని అనుభవించినవేనండి.
      స్పందనల ద్వారా, నన్ను ఎంతో ప్రోత్షహిస్తున్న మీకు నా ధన్యవాదాలు.

      Delete
  19. vennela gaaru,
    What you said is sooo true.
    i went 10 yrs back recollecting memories.
    same exact scene. As soon as it becomes evening i use to feel kind of tensed thinking about driving session and all the drama.
    Once I stopped the car in the middle of the road and walked home back saying that it was the last for me in this country and I 'am going back home ( it was a local street)
    street)
    refering to snkr gari comment, I learned driving on a brand new car my husband sitting next to me

    ReplyDelete
    Replies
    1. I am glad that you could relate to this post. Thank you so much for your comment.

      Delete
  20. చైతన్య కృష్ణ పాటూరుDecember 10, 2012 at 9:47 PM

    ఇప్పుడే చూస్తున్నా ఈ పోస్ట్. సరిగ్గా మా ఇంట్లో జరుగుతున్న వ్యవహారమే(ఇండియాలో లెండి). మా ఆవిడకి కార్ నేర్పాలని నేను, నేర్చుకోవాలని తను, ఇద్దరం పట్టుబట్టి బయలుదేరినా దారిలో నేను కంగారుపడి అరవటం, ఆమె కాన్ఫిడెన్స్ పొగొట్టుకుని డీలా పడటం, దానికి నేను బాధపడటం, ఇదీ వరస. ఇండియాలో గేర్స్ ఉన్న కార్లు నేర్పాలంటే ఈ కంగారు మరీ ఎక్కువ. పైన SNKRగారు చెప్పిన వాలెట్‍తీపితో పాటు నా కంగారుకు అనిపించే కారణాలు ఇవి.

    1. కాలేజ్ ఏజ్‍లో గేర్ బైకులు తోలిన అబ్బాయిలతో పోలిస్తే, గేర్ లెస్ స్కూటర్లు తోలిన అమ్మాయిలకి కార్‍లో గేర్ అనే కాన్సెప్ట్ ఎక్కటానికి కాస్త టైమ్ పట్టడం. ఈలోపే నేర్పించే మగవాళ్ళు తాము నేర్చుకున్న వేగంతో పొల్చుకుని సహనం కోల్పోటం.

    2. ఇండియాలో పొరబాటున ఎవరికైన, ఏ బండికైనా తగిలినా పర్సు ఖాళీ అవ్వటం ఒకటి, బండి దిగి గొడవలేసుకోవాల్సి రావటం, దానికి ఓపిక లేకపోవటం ఇంకొకటి. డ్రైవింగ్ స్కూల్ కార్‍కైతే నేర్పేవారి కాలి కింద కంట్రోల్స్ ఉంటాయి. లాస్ట్ మినిట్‍లో అయినా కంట్రోల్ చెయ్యొచు కాబట్టి వాళ్ళకు మనలాగా బీపీ రైస్ అవ్వదు. కూల్‍గా ఉంటారు, తోలేవాళ్ళకు కంగారు ఉండదు.

    ReplyDelete
    Replies
    1. చైతన్య గారు, మీకు, మీ శ్రీమతిగారికి కూడా ఇలాంటి అనుభవం ఉందన మాట.
      చక్కగా వివరం గా , విడమరచి వాఖ్య రాసి నా పోస్ట్ ని బలపరిచినందుకు ధన్యవాదాలండి.

      Delete
  21. nenu nerchukunnaaanoch...

    kaani pelli ayina kotta kavatam valla....
    amma pelli ayina 1 yr varaku emi matladaku ani Shanti mantram upadesinchatam valla...

    nenu.. gammuna undedaanni.. papam ayina ento opiggaaa nerpinchevaaru.. okasaari tappi... rendo sari road test gattesanandoi :)

    ReplyDelete
    Replies
    1. అమ్మ గారు చెప్పిన శాంతి మంత్రం కూడా ఒక పరిష్కారమే అనమాట ఈ సమస్యకి.
      మీరు మొత్తానికి గట్టెక్కినందుకు సంతోషం అండి.
      మీ శ్రీవారికి చెప్పండి ప్రత్యేక ధన్యవాదాలు మరి.

      Delete
  22. అమెరిక లో ఆలుమగల మధ్య ఏర్పడుతున్న ఈ విభిన్న అరమరికలు గురించి చాలా చక్కగా వర్ణించి చెప్పారు మేడమ్ ఈ పోస్ట్ లో..

    ReplyDelete