Thursday, April 4, 2013

శ్రీవారి ప్రయాణం-నెచ్చెలి సందేహం

Artist :Prashant Pawar


"హమ్మాయ్య! రెండు వారాలు మనకి పండగ!" అంది హారిక
"ఎందుకలా?" అమాయకంగా అడిగింది ప్రియ నెచ్చెలి గీతిక
"శ్రీవారు రెండు వారాలు ఉండరుగా,అందుకే బోలేడంత
తీరిక
పనిలో పని నేను కూడా చెక్కేస్తా అక్క దగ్గరికి ఫ్లోరిడ"

అసూయగా చూస్తూ గీతిక అడిగింది నెమ్మదిగా
"ఎక్కడికోయి మీ శ్రీవారి విహారం నీ తోడు లేకుండా?"
చిరునవ్వుతో చెప్పింది హారిక,"అడగలేదు నేను అంత వివరంగా
కావలట వారికి బ్రేక్..అలసి సొలసిపోయారట ఎన్నో రోజులుగా"


"బ్రేక్ అంటే?"అడిగింది గీతిక సాలోచనగా
హారిక చెప్పింది ఇలా.."నిత్య జీవితం నుండి కాస్త వైవిధ్యంగా
కొద్ది రోజులు గడపాలని వారికి ఉంది ఒక కోరిక
కాదనగలనా వారి మనసు తెలిసాక?"


"విడ్డూరంగా ఉందే!" నొసలు ముడిచింది గీతిక
"జంటగా కాక ఒంటరిగా వెళ్ళాలని ఎందుకో మీ శ్రీవారికి అంత కోరిక
తీర్చగలవా నా సందేహం కొద్దిగా?"
చిరునవ్వు నవ్వింది మళ్ళీ హారిక


"సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టుగా
ఈ ప్రపంచమంతా ఒక చుట్టు చుట్టాలి అన్నది శ్రీవారి ఆశయంగా?
నాకు లేదోయి మరీ అంత ఓపిక
నా లోకమంటూ నాకు ఒకటి ఉందిగా!"


అనుమానంగా చూసింది గీతిక
"ఔరా!నీ వారందరు చూడరా నిన్ను వింతగా?
శ్రీవారిని ఒక్కరినే అలా పంపిస్తే షికారుకి ఒంటరిగా
జంటగా నిన్ను తీసుకువెళ్ళాలని అనిపించలేదా మీ శ్రీవారికైనా?


అలుమగలెప్పుడు జంట కవులవలె అంటుకు తిరగాలని అన్నారుగా
దీనికేమిటి నీ సమాధానం?"అని ప్రియ నెచ్చెలి నిలదీయగా
"ఇద్దరి అభిరుచులు కలవాలని లేదుగా
ఒకరి ఇష్టం ఇంకొకరు తెలుసుకుని,మెలగాలిగా" అంది హారిక


"భార్యాభర్తల బంధానికి అర్ధం తెలియదా?
ఏ బంధం లేకుండా కలిసి జీవిస్తున్నవారిలా..మీరు అనిపిస్తున్నారు మరి నాకు కొత్తగా!
అయినా ఎలా నమ్ముతావోయి అంతలా?
రహస్య ప్రియురాలితో వెళితే ఒకవేళ నీ శ్రీవారు జంటగా?" అడిగింది గీతిక


సూటిగా నెచ్చెలి కళ్ళలోకి చూస్తూ అడిగింది హారిక
"వివాహానికి పునాది నమ్మకమేగా?
వివాహమంటే స్త్రీ,పురుషులిద్దరి స్వేఛ్ఛా జీవితానికి స్వస్తి కాదుగా?
వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ,తోడుగా,నీడగా జీవితం గడపడమేగా?


ఒకే ఆత్మగా భార్యాభర్తలు జీవించినా
ఎవరి అలోచనా విధానం వారిది అయితే తప్పు కాదుగా?
నా తీరిక సమయానంతా అక్కతో కలిసి గడపుతా హాయిగా
శ్రీవారికేమో ప్రపంచమంతా చూడాలని మరి కోరిక


అయినా కొద్ది రోజుల విరహం మంచిదేగా
ఇరవయ్యినాలుగు గంటలు అత్తుకుని ఉంటే బల్లుల్లా
అర్ధం పర్ధం లేని కయ్యాలకు కాలు దువ్వడమేగా
ఉన్నది ఒక్కటే జీవితం,అనుభవిద్దాము హాయిగా!"

ఉలుకు పలుకు లేకుండా చూస్తుండిపోయింది గీతిక
ఏదో కొత్త రహస్యం తెలుసుకున్న దానిలా!
వారిద్దరి సామరస్యం వెనుక ఉన్న చిట్కా
కనుగొన్నాననే తృప్తితో ఊపిరి పీల్చుకుంది తేలికగా!

41 comments:

  1. అధునాతనమైన భావం అద్భుతముగా నున్నది.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చిందంటే నాకు ఆనందమే! ధన్యవాదాలండి.

      Delete
  2. బాగుంది. నాకూ ఇట్లాగే అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా అలాగే అనిపిస్తే ఇంక ఎవ్వరి మాటలు లెక్క చెయ్యక్కర్లేదేమోనండి.
      మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యావాదాలు లక్ష్మి దేవి గారు.

      Delete
  3. వ్రాసిన స్టైల్ కూడా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ లాంటి విజ్ఞులకి ఈ రాతలు నచ్చాయి అంటే ఇంక అంత కంటే ఏమి కావాలండి. మీ వాఖ్య మీ దీవెన గా భావిస్తాను.ధన్యవాదాలు మరి ఒక్కసారి.

      Delete
  4. చాలా చాలా బాగుంది అద్భుతంగా వ్రాసారు

    చప్పట్లు .

    "వివాహానికి పునాది నమ్మకమేగా?
    వివాహమంటే స్త్రీ,పురుషులిద్దరి స్వేఛ్ఛా జీవితానికి స్వస్తి కాదుగా?
    వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ,తోడుగా,నీడగా జీవితం గడపడమేగా?

    మంచి అవగాహన.

    అభినందనలు . ఇలాగే వ్రాసేయండి మరిన్ని

    ReplyDelete
    Replies
    1. వనజ గారు, మీరు అద్భుతం అన్నారంటే అవార్డ్ వచ్చినట్టే!
      కూసింత గర్వంగా అనిపిస్తుందండి.:) మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

      Delete
  5. Replies
    1. వాఖ్యని అసంపూర్తిగా వదిలేసారు అలా...నేను...?
      ధన్యవాదాలు శ్రావ్య గారు.

      Delete

  6. "వివాహానికి పునాది నమ్మకమేగా?

    ఇది సనాతన సాంప్రదాయం . దీన్నే ఈ అధునాతన కాలంలో నమ్మకం నీడలో ఆడవాళ్ళు న్నారు.
    అమ్మకం సౌధంలో మగవాళ్ళున్నారు చాలావఱకు.

    వివాహమంటే స్త్రీ,పురుషులిద్దరి స్వేఛ్ఛా జీవితానికి స్వస్తి కాదుగా?
    వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ,తోడుగా,నీడగా జీవితం గడపడమేగా?

    ఇదీ నిజమే . అయితే ఆ భార్యాభర్తలిరువురూ తోడుగా , నీడగా జీవితం గడపటమేగా "
    అంతే కాదు నిజానికి తోడు నీడలా వెన్నంటి ఉండాలని . ఇది అర్ధం చేసుకుని ఆచరణయోగ్యమైనప్పుడు ఆ భార్యాభర్తలు అజరామరులే .

    శర్మ జీ ఎస్
    నా ఆలోచనల పరంపర బ్లాగ్
    http://naalochanalaparampara.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. శర్మ గారు, చదివి వాఖ్య పెట్టిన మీకు ధన్యవాదాలు.

      Delete
  7. అర్థమయ్యింది.
    ఇదే మిధునంలో చెప్పిన Attached detachment or detached attachment అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. సూక్ష్మంగా భావం అంతా గ్రహించేసారు బోనగిరి గారు.
      ధన్యవాదాలు మీకు.

      Delete
  8. వివాహమంటే స్త్రీ,పురుషులిద్దరి స్వేఛ్ఛా జీవితానికి స్వస్తి కాదుగా?
    వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ,తోడుగా,నీడగా జీవితం గడపడమేగా?
    well said mam.

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు,ధన్యవాదాలండి.

      Delete
  9. మన ఇష్టాలను భాగస్వామి ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నారు దానికి అనుగుణంగా ఉంటున్నారా లేదా అని ఆలోచించే ముందు మనం వారి ఇష్టాలకి అనుగుణంగా ఉంటున్నామా లేదా అని ఆత్మా విమర్శ చేసుకోప్ని దానికి తగ్గట్లుగా మసులుకుంటే ఇల్లు స్వర్గ సీమేగా అవుతుంది..చాల బాగ్గుంది మీ పోస్ట్ వెన్నెల గారు...అభినందనలు...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. మెచ్చుకుని, మీ అభిప్రాయం కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలు శ్రీ గారు.

      Delete
  10. కొ్న్ని ఏస్పెక్ట్స్ లో మీరు కరక్టే నండీ... కానీ తమ ఇంట్లో తామే గెస్ట్ ల్లా ఉండే వారికి మాత్రం...ఎక్కడికి వెళ్ళినా ఫేమిలీ మొత్తాన్ని తీసుకుపోతే వాళ్లతో గడిపాం అన్న తృప్తి ఉంటుంది....

    ReplyDelete
    Replies
    1. అబ్బే! మీలాంటి బిసి డాక్టర్స్ కి వర్తించదు లెండి. ఏదో మాలాంటి వారికి తప్ప...:)
      ధన్యవాదాలు ప్రసాద్ గారు.

      Delete
  11. Good advice to latest generation.

    ReplyDelete
  12. Replies
    1. అంతేకదండి.
      చదివి ,మెచ్చిన మీకు ధన్యవాదాలు పూర్వ ఫల్గుణి గారు.

      Delete
  13. ఇదే కదా 'జీవిత సత్యం' మరి:) ఈ రోజుల్లో బాగా స్థిర పడుతున్న అభిప్రాయాలు, ఎంతో సుతిమెత్తగా చెప్పారు. చాలా చాలా చాలా నచ్చింది నాకు.

    ReplyDelete
    Replies
    1. జయ గారు మీరు మెచ్చారంటే మహదానందమే!
      ధన్యవాదాలు మీకు.

      Delete
  14. నమ్మకం మీద ఆధార పడిన జీవితం్, ఎంత గొప్పగా ఉంటుందో మీ కవిత తెల్పుతుంది. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా మీ కవిత చదివాను. అభినందనలు వెన్నెలగారూ...

    ReplyDelete
    Replies
    1. మెరాజ్ గారు,
      బాగున్నారా? ఎన్నో రోజుల తరువాత ప్రియ నెచ్చెలి పలకరింపు అని సంతోషం కలిగిందండి. మీ వాఖ్యకు ధన్యవాదాలండి.

      Delete
  15. మనసులో మాట చెప్పేస్తున్నా.పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు సుఖస్థానాలు, వీరు ఒకరిని ఒకరు విడిచి ఉండలేక పోవడమే....అదే జీవితం..నవ్వుల పడవ పువ్వులనావ.. కదిలే.... :)

    ReplyDelete
    Replies
    1. బాగున్నారాండి? మీరు చెప్పినదానితో పూర్తిగా ఏకీభవిస్తాను.ధన్యవాదాలు.

      Delete
  16. .వాట్ యాన్ ఐడియా,. ఈ చిన్న బ్రేక్ బావుందండి,..ఎప్పుడన్నా ఆచరణలోకి తేవాలి,.మా ఆవిడని అడిగి,.,.వెన్నలగారు,..కొంచెం పొడవు తగ్గితే బావుండేదేమో అనిపించింది,.

    ReplyDelete
    Replies
    1. :)) పెట్టేయండి ఆచరణలో మరి..
      అలాగేనండి, పొడవు తగ్గించేద్దాం ఈ సారి.(మన చేతిలో పనే గా!!)
      ధన్యవాదాలు భాస్కర్ గారు.

      Delete
  17. మీ భావం వచన రూపం లో కాకుండా సరదా కవిత రూపం లో చక్కగా ఆవిష్కరించారు. ఇరువైపులా మ్మకమే పునాది గా జీవితాలు సాగితే ప్రపంచం మరింత నూతనం గా ఉంటుంది.మంచి సందేశం.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయవాఖ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలు రవిశేఖర్ గారు.

      Delete
  18. Yes, very good message in this post. Everyone must do so atleast once an year. When one of my friends visit india from US, they travel together till hyderabad, but wife and husband go on different destinations for 2 weeks and after 2 weeks they meet again in airport. Each want to visit their own native places but there is less time & whoever want to meet them both together see them at airport while pickup & send off. ;)

    ReplyDelete
    Replies
    1. :) When I wrote this, idea was more about "vacation" time to places other than India. While trvaelling to India, I totally agree that your friend and his wife's planning is good too. I also beleive that family vacations are fun and I love them, but at times, there is nothing "wrong" when husband and wife plan their own short vacations.You will be suprised to know,not many will accept this unless either husband or wife have a solid reason to do so! Thanks for your comment.

      Delete
  19. ఇప్పుడే మీ ఈ పోస్ట్ చూశాను. చాల చాలా బాగుందండి.
    కవిత సరదాగా సాగిన మీరిచ్చిన సందేశం సప్తపదికి (ఏడడుగుల బంధానికి) నిర్వచనంలా ఉంది.

    ReplyDelete