గారెలు,పులిహోర,బొబ్బట్లు
కాజాలు,లడ్లు,కొబ్బరి ఉండలు!
మైసూర్పాక్ ఇంకా ఎన్నో నోరూరించే తినుభండారాలు
ఉగాది పండుగ రోజు వడ్డించింది స్నేహితురాలు!
కాజాలు,లడ్లు,కొబ్బరి ఉండలు!
మైసూర్పాక్ ఇంకా ఎన్నో నోరూరించే తినుభండారాలు
ఉగాది పండుగ రోజు వడ్డించింది స్నేహితురాలు!
పండుగ అన్న పేరు చెప్పి చేసేసింది ఇన్ని వంటకాలు
దీనికేంటో ఈ తెగులు,కూర్చోవచ్చుగా వేసుకుని కాలు మీద కాలు!
దానికి తోడు మా కోడలు చాలా పనిమంతురాలు
అంటూ దాని అత్తగారు తీస్తారు దీర్ఘాలు!
దీనికేంటో ఈ తెగులు,కూర్చోవచ్చుగా వేసుకుని కాలు మీద కాలు!
దానికి తోడు మా కోడలు చాలా పనిమంతురాలు
అంటూ దాని అత్తగారు తీస్తారు దీర్ఘాలు!
స్నేహితురాలి కూతురు "చిన్ని" గురించి తీసా నేను ఆరాలు
ఎక్కడుంది ?కనపడటం లేదే అని అడిగా వివరాలు!
చదువుకుంటున్నారు కలిసి చిన్ని,నీ కూతురు అమ్ములు
విసుక్కుంది స్నేహితురాలు,తెలిసి ఎందుకు వేస్తున్నావంటూ ప్రశ్నలు!
ఎక్కడుంది ?కనపడటం లేదే అని అడిగా వివరాలు!
చదువుకుంటున్నారు కలిసి చిన్ని,నీ కూతురు అమ్ములు
విసుక్కుంది స్నేహితురాలు,తెలిసి ఎందుకు వేస్తున్నావంటూ ప్రశ్నలు!
ఉగాది విందు చెయ్యమంటూ వేసింది అందరికీ విస్తర్లు
స్వాధీనం తప్పుతోంది మనసు చూసాక అన్ని పదార్ధాలు!
ఆలస్యం దేనికి తినమని తొందర చేసింది స్నేహితురాలు
ఉండబట్టలేక వడ్డించుకున్నా గారెలు,లడ్లు,కాజాలు!
స్వాధీనం తప్పుతోంది మనసు చూసాక అన్ని పదార్ధాలు!
ఆలస్యం దేనికి తినమని తొందర చేసింది స్నేహితురాలు
ఉండబట్టలేక వడ్డించుకున్నా గారెలు,లడ్లు,కాజాలు!
గమనించా అప్పుడు శ్రీవారి కళ్ళలో నిప్పులు
అర్ధం కాక ఏమిటన్నట్టు ఎగరేసా కనుబొమ్మలు!
విస్సుగ్గా తిప్పుకున్నారు నా వైపు నుంచి తన చూపులు
తడబాటుతో చూసుకున్నా నేను వేసుకున్న దుస్తులు!
అర్ధం కాక ఏమిటన్నట్టు ఎగరేసా కనుబొమ్మలు!
విస్సుగ్గా తిప్పుకున్నారు నా వైపు నుంచి తన చూపులు
తడబాటుతో చూసుకున్నా నేను వేసుకున్న దుస్తులు!
అర్ధం కాక ఆయనగారి విసవిసలు
విషయమేమిటా అని మనసులోనే పడ్డా తర్జన భర్జనలు!
ఇంతలో సుడిగాలిలా దూసుకొచ్చారు హాల్లోకి చిన్ని ,అమ్ములు
వారిద్దరు చిన్నపట్నుంచి కలిసి పెరిగిన నేస్తాలు!
విషయమేమిటా అని మనసులోనే పడ్డా తర్జన భర్జనలు!
ఇంతలో సుడిగాలిలా దూసుకొచ్చారు హాల్లోకి చిన్ని ,అమ్ములు
వారిద్దరు చిన్నపట్నుంచి కలిసి పెరిగిన నేస్తాలు!
పెట్టింది తినాలి, ఎదురు చెప్పకూడదంటూ చెప్పా వారికి పాఠాలు!
అయినా ససేమిరా అన్నారు ఆ చిన్నారులు
తప్పక స్నేహితురాలు ఆర్డర్ చేసింది పీజ్జాలు!
తప్పక స్నేహితురాలు ఆర్డర్ చేసింది పీజ్జాలు!
స్నేహితురాలి అత్తగారు లంకించుకున్నారు తిట్లు
బొత్తిగా బాలేదంటూ మా పిల్లల పెంపకాలు!
చెప్పింది విని,పెట్టింది తిని పెరిగారమ్మా మా పిల్లలు
ఆడింది ఆటగా,పాడింది పాటగా పెంచుతున్నారు మీరు.. అంటూ ఆవిడ విసవిసలు!
బొత్తిగా బాలేదంటూ మా పిల్లల పెంపకాలు!
చెప్పింది విని,పెట్టింది తిని పెరిగారమ్మా మా పిల్లలు
ఆడింది ఆటగా,పాడింది పాటగా పెంచుతున్నారు మీరు.. అంటూ ఆవిడ విసవిసలు!
ఆవిడకు ఎదురుచెప్పలేక,పిల్లలకు నచ్చచెప్పలేక పడ్డాము మేము పాట్లు
రోజులు మారాయి,మీకు తెలీదంటూ చెప్పాము ఆవిడకు నీతులు!
మాకు తెలుసు పిల్లల పెంపకంలో మేము చేస్తున్న తప్పులు
రోజులు మారాయి,మీకు తెలీదంటూ చెప్పాము ఆవిడకు నీతులు!
మాకు తెలుసు పిల్లల పెంపకంలో మేము చేస్తున్న తప్పులు
ఒప్పుకోవడానికి అడ్డొచ్చాయి మాకు అహాలు!
పండుగ రోజు కూడా ఏమిటో ఈ గొడవలు
అనుకుంటూ వేసుకున్నాను విస్తరిలో ఇంకో రెండు లడ్లు!
అప్పుడు గుర్తొచ్చాయి నాకు శ్రీవారి నిప్పులు చెరిగే కళ్ళు
ఇంకేముంది..పరిగెట్టాయి నా గుండెల్లో రైల్లు!
మనసంతా ఒక్కసారిగా ఆవరించింది దిగులు
ఈ మధ్య మా దంపతుల మధ్య తరచూ తగాదాలు!
కోప్పడుతూనే ఉన్నారు నన్ను రాత్రి పగలు
చేసినట్టు నేను ఏవో నేరాలు!
విందు అయ్యాక చెప్పుకున్నాము కొన్ని కబుర్లు
ఇంక వెళదామా అంటూ తీసారు శ్రీవారు కారు తాళాలు!
ఇంకాసేపుందామంటూ గొడవ చేసింది అమ్ములు
తొందరగా కానివ్వమంటూ,ఆగాము ఇంకో పది నిమిషాలు!
ఇంటికి చేరాక.. లేవు శ్రీవారికి నాకు మాటలు
వేసుకుని కూర్చున్నారు తన ముందు ఏవో పుస్తకాలు!
ఇంక తప్పదు చెయ్యాలనుకుంటూ సంధి ప్రయత్నాలు
చెప్పటానికి సిద్దపడ్డాను క్షమాపణలు!
ఈ ఒక్కసారికి క్షమించమంటూ వేసుకున్నా నేను లెంపలు
మళ్ళీ తన మాట జవదాటనని చేసా ప్రమాణాలు!
నాకెందుకు అమ్మాయి..నీ ఇష్టమంటూ చిందించారు చిరునవ్వులు
అడ్డూ,అదుపు లేకుండా తింటే స్వీట్లు, పెరిగేది నీ వంట్లొనే కేలరీలు!
ఉగాది పండుగ రోజు కూడా తప్పలేదు నాకు చివాట్లు
రోజు ఇలాంటివే మా మధ్య జరుగుతున్నాయి కేలరీల యుద్దాలు!
మితంగా తినాలని ఎన్నిసార్లు తీసుకున్నా నిర్ణయాలు
అదుపు తప్పి తినేస్తాను లడ్లు, కాజాలు,బొబ్బట్లు..అంధ్రా పిండివంటలు!

Bale bale...same same here at my home ...asalu alaantivi tinakunda ela vundagalamu...hmmm...ento calorila gola...anyways,,happy ugadi andi....
ReplyDeleteమీ ఇంట్లో కూడా ఇదే వరసా? హు!అందులో మీరు super chef కదా? :)
DeleteThanks for the wishes and your comment too!
తడబాటుతో చూసుకున్నా నేను వేసుకున్న దుస్తులు! (what a lovely secret)
ReplyDeleteసంప్రదాయ పరిస్థితిని చాలా అద్భుతముగా చెప్పారు.
మొత్తానికి మా చేత చదివించేసారు నాలుగు ఐదు సార్లు .....
రుద్రవీణ సినిమా లో 'రండి రండి ' పాటని గుర్తుకు తెచ్చారు .... చాలా చాలా బాగుంది !!
:) మీకు నచ్చినందుకు సంతోషమండి సాగర్ గారు.
Deleteధన్యవాదాలు.
ఆనందమానందమాయెనే
ReplyDelete:) ధన్యవాదాలు శర్మగారు.
Deleteచెప్పకండి పతికి క్షమాపణలు
ReplyDeleteఉన్నాయిగా మనకి ఉపాయాలు
పరుగెత్తండి పదిమైళ్ళు
కరిగించండి ఒంట్లో కాలరీలు...
అమ్మో! పది మైళ్ళే?
Deleteఇంకేదన్నా మార్గం ఉంటే చెబుదురు?
ధన్యవాదాలు శ్రీలలిత గారు
కాకలు తీరినట్లు వ్రాసిన వ్రాతలు
ReplyDeleteకని నిండెను నా మదిలో సంతసాలు
ఇక పైననూ కొనసాగించు అనేకానేక ఠపాలు
కలవేన్నో జలతారు వెన్నెలకి మార్గాలు
ఎందుకిన్ని విధించుకున్న విరామాలు
దీటుగా ఎదుర్కొనుము విఘాతాలు
such a Wonderful post . congrats !!
వనజ గారు, ఏమీ తినకూండానే మీ కామెంట్ చూసి ఓ రెండు కేలరీలు పెరిగినట్టు ఉన్నానండి. :) మీ అభిమానానికి, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
Delete
ReplyDeleteచివాట్లు కావవి కేలరీల యుద్ధాలు అని తీపి
వంటకాలకు తీయటి పేరు చక్కగా పెట్టారు.
:)ధన్యవాదాలు శర్మగారు.
Deletebaavunnayi mi ugadi kaburlu mari nannu pilava ledemiti vennela garu :)??
ReplyDeleteమంజు గారు, ఈ సారికి క్షమించెయ్యండి.వచ్చే వారం కదా శ్రీరామనవమి.
Deleteఅందుకోండి నా ఆహ్వానం. మీకన్నీ తీపి లేని స్వీట్లు స్పెషల్. :))
ధన్యవాదాలు!
మీకోచ్చే షుగరూ పెరిగే కొలె ష్ట్రాల్లూ..
ReplyDeleteఇంటాయనకి తెస్తాయి నానా పాట్లు..
అదేం చిత్రమో
వారే తినాలి డాక్టర్లతో చీవాట్లు...
తర్వాత పడాలి అగచాట్లు
ముందు చూపున్నమీ శ్రీవారు
వారికి మా జోహారు..
:) డాక్టర్ గారు అనిపించుకున్నారు కదా?
Deleteధన్యవాదాలు ప్రసాద్ గారు
హహ్హహ్హహ్హ
ReplyDeleteచదావడానికి మొదట్లో పడ్డా ఆపసోపాలు
పూర్తయ్యాక తెప్పించారు మోముపై చిరునవ్వులు
*ఉగాది కవితలు* రాయడంలో మీ ప్రతిభ అరుపులు
ఇదేవిధంగా కురిపించండి మెరుపుల ధగధగలు
(ఇదేంటిది ఫ్లోలో ఇలా రాసేసాను అయినా పర్లేదు. వహ్వా శభాష్ రా చారీ.. నీలోనూ మాంంంచి తవిగాడున్నాడు)
మీకు ఉగాది శుభాకాంక్షలు వెన్నెల గారు, good post by the way :)
పొరబడ్డారు నాగార్జున గారు. మీలో గొప్ప కవి ఉన్నాడు,తవిగాడు లేడు.
Deleteఅయినా మిమ్మల్ని కావి కాదు అన్నదెవెరండి? ధన్యవాదాలు.
sweet post...:-)
ReplyDeleteThank you sweet lady! :)
Deleteమొదటగా అద్భుతహఃమీరు చెప్పినట్లు నిన్న నేను రాసిన వాటిలో మూడు చేశాను. తిన్నాము. భలే మజాగా వుంది
ReplyDeleteధన్యవాదాలు పూర్వఫల్గుణి గారు.
Deleteమీ ఇంట్లో ఉగాది పచ్చడి లో వేప్పువ్వు మాత్రమే ఉంటుందనుకుంటా?
ReplyDeleteభలే ప్రశ్న వేసారండి!
Deleteవేప పువు రవ్వంత ఎక్కువే ఉంటుంది లెండి.:))
ఉగాది పండుగకు ఒక మంచి కవితను మాకు బహుమతిగా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు...
ReplyDelete:)ధన్యవాదాలు మీకు.
Deleteఎన్ని విషయాలను అలవోకగా చెప్పేసారండి,.పిండి వంటలు, కోడలి కష్టాలు,.అత్తగారి కోపాలు,.ఆపుకోలేని జిహ్వచాపల్యం,.మీ ఆరోగ్యం పై శ్రీవారు శ్రద్ద, గిల్లికజ్జలు,మీ తంటాలు. ,.మారుతున్న పిల్లల అలవాట్లు,.సరదాగా వాటినన్నింటిని ఒక దగ్గర కూర్చడం నిజంగా కష్టమే,.మంచి ప్రయత్నం,.
ReplyDeleteభాస్కర్ గారు, ధన్యవాదాలండి.
Deleteఉగాది పండగ రోజు ఎవరైతే ఉగాది పచ్చడి తినకుండా స్వీట్స్ నోట్లో పెట్టు కుంటారో వారు వారి భాగస్వామితో ఆ రోజు తిట్లు తిందురు గాక అని ఆది దేవుడి శాపం . మీరు ఆ రోజు ఉగాది పచ్చడి తినకుండా మీ యింటికి వెళ్లి పోవడం తో అలా జరిగిందన్న మాట .
ReplyDelete:)టపా లో ఉగాది పచ్చడి ప్రసక్తే ఎత్తకుండా రాసినందుకు, భలే చురక వేసారు రవి గారు.:)) ధన్యవాదాలు
Deleteఇన్ని విషయాలను చదివించేలా వ్రాసారు.స్వీట్స్ తో బహుపరాక్ అండి .
ReplyDeleteమీరు బహు పరాక్ అంటే ఇంకేంటండి..ఆనందమే!
Deleteధన్యవాదాలు రవిశేఖర్ గారు.
ఫోటో తప్ప మిగతా అంతా బాగుంది :)))
ReplyDeleteఫోటో ఎందుకు బాలేదో నువ్వు ఇప్పుడు చెప్పి తీరాలి హర్షా. అంతే! :)
Deleteనోరూరించే స్వీట్ల వరసా
ReplyDeleteఅంత్యప్రాసల కవితా
భలే బాగున్నాయి తెలుసా...:)
ధన్యవాదాలండి .
Deleteరాసేసారుగా మీరు కూడా కామెంట్ భలే చక్కగా!