రోజులు మారాయి, రోజులు మారాయి, మారాయి... మారాయి ...
రోజులు మారాయి..
http://stephgrantphotography.com/blog/shannon-seema-indian-lesbian-wedding-los-angeles-ca/
రోజులు మారాయి..
నిజమే! ఇలాంటి పెళ్ళిల్లు చూస్తామని ఒకప్పుడు అనుకోలేదు. ఇప్పుడు చాలా సాధారణమైన విషయమైపోయింది.మొదటిసారి నేను ఇలాంటి వివాహం గురించి విని ముక్కున వేలేసుకున్నపుడు అతి కటువుగా నన్ను విస్సుకున్నారొకరు..."You are ridiculous.Stop being a homophobe" అని...
ప్చ్..ఏంటో! ముందు, ముందు మరి ఈ వివాహాలు మనుషుల మధ్యే జరుగుతాయో లేక ...oops! నేనేమి వ్రాయలేదు..మీరేమి చదవలేదు అంతే! మీరు కూడా నాకు నాలుగు అక్షింతలెయ్యకముందే, నేను ఈ కింద లింక్ మీకు కానుకగా ఇచ్చేసి, ముగించేస్తాను.
http://stephgrantphotography.com/blog/shannon-seema-indian-lesbian-wedding-los-angeles-ca/
Sure 2 see so many in future
ReplyDeleteనిజమేనండి శర్మ గారు. మారుతున్న కాలం తో మారాలేమో మరి. ధన్యవాదాలు మీ వాఖ్యకి.
Deleteఏం చేస్తాం చెప్పండి. కలియుగప్రభావం అంతా.
ReplyDeleteప్రజాయాహి మనుష్యాః పూర్ణా అని శృతి.
వివాహం ధర్మప్రజార్థం వివాహామంత్రార్థం.
ఇప్పుడు వివాహం ఒక వేడుక.
ఇప్పుడు వివాహం ఒక తంతు.
ఇప్పుడు వివాహం ఒక తమాషా.
పిల్లలంటారా? దాని దేముంది లెండి. మార్కెట్లో దొరికే రోజులు వచ్చాయి.
దంపతులు మూడు రకాలు. 1.సంతానాన్ని ఉత్పత్తి చేసే వారు 2.సంతానాన్ని కొనుక్కునే వారు. ౩. సంతానమా నాన్సెన్స్ అనే వాళ్ళు.
1,2 రకాల దంపతులు సంతానం అనే వినిమయవస్తువులకు మార్కెట్ క్రియేట్ చేస్తారు. మా మంచి మార్కెట్.
3వ రకం దంపతుల సంఖ్య ప్రపంచంలో హోమో సెపియన్స్ రకం మనం మానవజాతి అస్తిత్వాన్ని నియంత్రిస్తూ ఉంటుంది.
ఈ మూడు రకాలు నాగరికతకు అశ్యావశ్యకం అని రీసెర్చి పేపర్ యీ పాటికి వచ్చేసే ఉంటుందే?
కొంచెం యీ సంగతి వాకబు చేసి చెబుతారా?
ఎవరూ ఇంకా వ్రాయకపోతే ఆ రీసెర్చి పేపర్ యేదో నేనే వండుతాను.
ఏమంటారు?
శ్యామలీయం గారు,మీ విశ్లేషణ బాగుంది. ఆ రిసెర్చ్ పేపర్ మీరు రాసెయ్యండి.మీకు మా మద్దతు పూర్తిగ ఉంటుంది. :) ధన్యవాదాలు మీ వాఖ్యకి
Deleteమీరు బాధపడి, ఇలా చెప్పి మమ్మల్ని బాధపెట్టడం ఏం బాలేదండి,..ఇంకో 200 ఏళ్ల తరువాత ఇలా అనుకుంటారేమో,..అప్పుడెప్పుడో ఆడ,మగ పెళ్లి అనే దారుణమైన ఆచారం ఉండేదని,..:)
ReplyDeleteహా హా హా ! బాగుందండి భాస్కర్ గారు మీ కామెంట్.
Deleteబాబోయి ఆ రొజులు మనం చూడకపోవటం మన అదృష్టం అనుకోవాలేమో! ధన్యవాదాలు మీ వాఖ్యకి.
బాగుంది కానీండి మీ జోక్., అప్పుడు, ఇంకో 200 ఏళ్ల తరువాత "అప్పుడెప్పుడో ఆడ,మగ పెళ్లి అనే దారుణమైన ఆచారం ఉండేదని" అనుకుందుకు మనుషులను ఎక్కడినుంచి దిగుమతి చేసుకోవాలండీ?
Deleteపాయింటేనండోయీ శ్యామలీయం గారు. ఈ విషయం నాకు తట్టనే లేదు. :)
Deleteహ హ హా.
ReplyDeleteనా reactions చెప్తా వినండి .
మీరు రాసింది అర్ధం కాలేదు , సరేలే లింక్ చూద్దామని ఓపెన్ చేసాను .
మొదట ఎవరో పెళ్ళికి తయరవుతున్నారేమో అనుకున్నా
రెండు పెళ్ళిళ్ళు అనుకుంటా ఒకటి హిందూ , ఒకటి క్రిస్టియన్
బాగా అలంకరించుకున్తున్నారు ..
ఏంటి క్రిస్టియన్ అమ్మాయి మేహేంది పెట్టుకుంది ??? ఏదో ఇంట్రెస్ట్ తో అనుకుంటా
ఆహా పరదేశం లో కుడా మన సాంప్రదాయం ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు .
పెళ్ళికొడుకు ఎక్కడా కనపడదేంటి , ఫొటోస్ ఎవరో బాగా తీసారు
...
...
ఇదేంటి ఇదేదో తేడా గా కనపడుతుంది
ఓర్నాయనో , ఇది నిజంగా తేడా పెళ్ళే
అది కుడా మన సాంప్రదాయం లో .
ఆ తరువాతా అందరు కలిసి ఈ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకోవడం ఏంటో ????
అసలు ఇదేదో చాలా కామన్ అన్నట్టు జనం అంత గెంతులేయడం ఏంటో ???
venkatగారు......లింక్ చూస్తున్నంత సేపు మీ ఎక్స్ ప్రెషన్సే నావీను అందుకే మీ కమెంట్ క్రిందే నేనూ వ్రాసాను.
Deleteజలతారువెన్నెలగారు.....లింక్ ఇచ్చి తప్పించుకున్నారు :-)
మీ రియాక్షన్ ఇలా కళ్ళకు కట్టినట్టు మాకు కనపడేలా రాసారు.:)
Deleteధన్యవాదాలు వెంకట్ గారు.
పద్మార్పిత గారు, బహుకాల దర్శనం. తప్పించుకున్నంటారా? మీ అందరి కంటే ముందే ఈ ఫోటొస్ చూసి దడుచుకున్నది నేనే కదండి? :) Thanks for the comment.
Deleteఈ పెళ్ళి ఆ మధ్య నేను క్యాలిఫోర్నియా సన్నీవేల్ లో ఉన్నప్పుడే జరిగింది . దీనికి మూల కారణం అమెరికా మూల సంస్కృతే . ఎవరికిష్టమైనట్లు వాళ్ళు జీవించమనే . అంటే ఒకరు మరొకరి స్వేఛ్ఛ కక్షలో ప్రవేశించి బాధ పెట్టనంతవరకు అని .
ReplyDeleteఅందుకేగా వాళ్ళు దేవుడిని పూజించకున్నా , మన హిందువులను గాని మరెవరిని గాని వాళ్లకిష్టం వచ్చినట్లుగా వుండనిస్తున్నారు . మనలని మన హిందూ దేవాలయాలను నిర్మిమ్చనిస్తున్నారు . ఇటువంతివన్నీ అమెరికాలో సర్వ సామాన్యమే . ఈ విషయం మీలామ్టి వాళ్ళకు తెలియనిది కాదు గదా . మీ రక్కడే వుంటున్నారుగా . ఇది మనవాళ్ళకు తెలియజేయడం చాలా బాగుంది . రేపు మనకు కూడా ఇది వచ్చే అవకాశాలు అధికంగా వున్నాయి . మీరన్నట్లు " శ్రీరస్తు , శుభమస్తు .... అని దీవించగలమా ! " . ఇప్పటికే అవి మర్చ్హిపోయారు . పెళ్ళిళ్ళకి వెళ్ళినా అక్శతలు చల్లటం తప్ప , ఆశీర్వదించటం లేదు చాలా మంది . ఇది నిజం .
వ్యక్తిస్వేఛ్ఛ ను నేను కూడా గౌరవిస్తాను కాని, ఎందుకో ఇలాంటివి ఇప్పుడిప్పుడే చూడటం, పైగా మొదటిసారి సాంప్రదాయం గా ఇలాంటి వివాహాన్ని అందరు అనుమతించి జరపటం కొద్దిగా మనస్సు అంగీకరించలేకపోయింది. వారికి పెద్ద మొత్తం లో ఇంత ధైర్యం గా వివాహం జరుపుకున్నందున, బాగానే ముడుతుందని వినికిడి కూడా.. సర్లెండి వారేదో తప్పు చేసారు అన్నది నా అభిప్రాయం కాదు కాని, నేను ఎందుకో జీర్ణించుకోలేకపోయాను అన్నది మాత్రం నిజం. ధన్యవాదాలండి మీ వాఖ్యకి.
Deleteavunu mari nalugurito manam poka tappadu kada vennela garu
ReplyDelete:) ధన్యవాదాలు మంజు గారు.
Deleteబాబోయ్ !ఇక చూడలేక సగంలో మూసేశాను
ReplyDeleteమొదట చూసినప్పుడు నేను కూడా ఇలాగే స్పందించానండి. ధన్యవాదాలు చిన్ని గారు.
Deleteమీరు ఈమొత్తం విషయాన్నీ సంస్కృతి, sex, నైతికత కోణాల్లో చూస్తున్నారేగానీ ప్రేమ కోణంలో చూడటంలేదు. సమాజపు ఎక్స్పెక్టేషన్లకు ఎదురీదగలిగేంత ధైర్యం వాళ్ళకుందంటే, దానికి మూలం ఏమిటి?
ReplyDeleteపొరుగువారి sexual preferences మీద ఎందుకు అంత ఆసక్తి కనబరచాలెవరైనా? Sharmaగారన్నట్లు వీటన్నింటినీ వ్యక్తిస్వేఛ్ఛ 'పర్దా'లో అంగీకరించగలిగినవాళ్ళవల్లే ఆదేశంలో ఎవరికి నచ్చిన మతాన్నివాళ్ళు ఆచరించగలిగుతున్నారు. మనకున్న preconceived, absolutist నైతికతతో సంఘటల్ని, వ్యక్తుల్నీ judge చెయ్యకూడాదేమో ఆలోచించండి.
మనకున్న preconceived, absolutist నైతికతతో వ్యక్తులను జడ్జ్ చెయ్యకూడదేమో అన్నది కర్రెక్ట్ అండి. సాంప్రదాయకంగా జరిగిన ఈ బిన్నమైన వివాహం చూసి ఎందుకో ఆస్చర్య పడి పోయి, స్పందించిన తీరు Brain's reflex action కింద జమ కట్టెయండి ఈ సారికి.Thanks for the comment.
Deleteకాని వాళ్లకి ఆ ధైర్యాన్నిచ్చిన ఆ సమాజాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను ( ఎన్ని లోపాలున్నా )
ReplyDelete:) True!
Deletethe couple are beautiful. :)
ReplyDelete:) మరి ఇంక ఆలశ్యం చెయ్యకుండా దీవించెయ్యండి మరి
DeleteBTW... did the groom kiss the bride? (that pic is missing)
ReplyDeleteఉండే ఉండాలే...ఇంకోసారి చూడండి.
DeleteLet us hope for better..
ReplyDeleteఅంతేనండి వర్మ గారు. మిగిలింది హొప్ మాత్రమే!
Deleteధన్యవాదాలు మీ వాఖ్యకి.
గ్రీకు నాగరికతల మూలాలో నుంచి రావాలి దీన్ని అనేకాదు మొత్తం పాశ్చ్యత్య మైండ్ సెట్ ని అర్ధం చేసుకోవాలంటే..!వారికి కనిపించేదే నిజమైన ప్రపంచం...ఇక్కడనుంచే ఏదైనా పొందాలి..ఆనందమైనా..ధనమైనా..వారి నైతికత కి సంబందించిన సూత్రాలు కూడా దానిమీద ఆధారపడే నిర్మితమైనవి.మన కోణం లో అసహజమైనవే అయినా ...భారతీయ సమాజంలోనూ అవి ఒక భాగమౌతున్నాయి.దాని వెనుక వూహించలేని hidden agendas కూడా వుండవచ్చు.మన కంటే మానవ పరమైన తెలివితేటల్లో వాళ్ళు కొన్ని వందల ఏళ్ళు ముందున్నారు..అది సత్యం..!
ReplyDeleteఅసలు భారతీయ లేదా హిందూ సంస్కృతి అంటే ఏమిటి..? అది రాష్ట్రానికి ఒక మాదిరిగా స్థానిక ఆచారాలతో నిండివుంది.కొంత ఉపనిషత్తులలో మంచి ఆలోచనా ధారలు కనిపిస్తాయి.అయితే ఆ సారాన్ని జనబాహుళ్యం లోనికి తీసుకువచ్చింది తక్కువ.పుక్కిటి పురాణాలు చెప్పుకుంటూ జాతిని యావత్తు బలహీనంగా తయారు చేయడం లోనే పీఠాధిపతులు కాలక్షేపం చేస్తుంటారు.
పోనివ్వండి ఎంత దాకా పోతుందో..ఏమవుతుంది..ప్రతిదానికి ఒక హద్దు వున్నట్టే సెక్స్ కి కూడా ఒక హద్దు వున్నది. అయితే అది ఆగిపోవడం సహజంగా జరగాలి తప్ప బలవంతంగా ఆపకూడదు.అలాంటప్పుడే ఇంకొకరి మీద పోలిసింగ్ చేయాలి అనిపిస్తుంది మన నీతి కర్తల లాగా..!
నా దృష్టిలో ఎంత సెక్స్ లో ఆనందం పొందితే ఆ మనిషి లేదా ఆ జాతి అంత వికసిస్తుంది బుద్ధి పరంగా..! దానికి దీనికి ఏదో దగ్గర సంబంధం వుంది.
మీ వాఖ్యకి ధన్యవాదాలు మూర్తి గారు.
DeletePerfect Jodi :-)
ReplyDelete:) Do you really think so? Thanks for the comment.
Deleteమీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.
ReplyDeletewww.poodanda.blogspot.com
Sure. Thank you!
Delete
ReplyDeleteమాలిక లో చాలా వ్యాఖ్యలు కనిపిస్తే ఈ టపా ఏమిటో అని చూసాను. చదివాను. విచారించాను. ప్రకృతి నియమాల్ని కూడా దాటేసేటంత వ్యక్తిగత స్వేఛ్ఛ పనికిరాదనిపించింది. మనుష్య జాతిని అంతరించకుండా కొనసాగించడం పెళ్ళి ముఖ్యోద్దేశ్యాల్లో ఒకటి. అందుకోసం పెళ్ళి స్త్రీ పురుషుల మధ్యే జరగడం అవసరం. ఇదే proven విధానం. దీనికి పాశ్చాత్యం ప్రాచ్యం అనే తేడాయే లేదు. వేరే ఏ రకమైన "పెళ్ళి" అయినా ప్రకృతి విరుధ్ధమే (ప్రేమ, వ్యక్తిగత స్వేఛ్ఛ అనుకున్నా కూడా). అసలటువంటి "వివాహ జీవితం" ఎంతకాలం నిలుస్తుంది? మనుష్య జాతి మనుగడని దృష్టి లో పెట్టుకుని, ఈ ఆడ-ఆడ, మగ-మగ "వివాహాల" గురించి సభ్య సమాజం సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది (అరికట్టటం కోసం). ఈ టపా వ్రాసి జలతారు గారు మంచి పని చేసారు. శ్యామలీయం గారు సూటి ప్రశ్న అడిగారు - రెండొందలేళ్ళ తర్వాత విడ్డూరపోవటానికి మనుషులు ఎక్కడనుంచి వస్తారని.
మీతో పూర్తిగా ఏకీభవిస్తానండి నేను. ఇక్కడ ఈ రకమైన వివాహాలను అమోదించిన స్టేట్స్ పది పైనే ఉన్నాయి మరి. అందుకని చట్టబద్దమైన ఈ వివాహాలను అరికట్టే ప్రయత్నం ఎవరు పూనుకున్నా జరిగేది కాదు. అయితే సాంప్రదాయకం గా ఒక భారతీయ యువతి, ఒక అమెరికన్ యువతి ఇలా పెద్దల అనుమతితో వివాహం జరగడం కొంచెం వింతగానే తోచింది. అందుకని ఈ టపా వ్రాయడం జరిగింది. ధన్యవాదాలు మీ వాఖ్యకి.
Delete:)))
ReplyDeleteఏమిటో...ఇలాంటి వాటి వెనుక మనస్తత్త్వం...ఏమయి ఉంటుందో...
టాబూనో ఏదో కార్యక్రమం వస్తూ ఉంటుంది....డిస్కవరీ లోనో, నాట్ జియో లోనో...మానసికమయిన పెర్వర్షన్స్ గురించి.....విపరీతమయిన లేదా ప్రత్యేకమయిన మనస్తత్వాలను...ఎనలయిజ్ చేస్తూ...వాటిలో వెతుక్కోవాలి...ఈ ఆకర్షణలు ఏ రకమయినవో...
ఎలాంటి మనస్తత్వాలైనా,మనం వారి స్వేఛకి అడ్డు తగలక, విమర్శించక,మార్పుని స్వాగతిసూ, మౌనం గా ఉండాల్సిందే! ధన్యవాదాలు ప్రసాద్ గారు మీ వాఖ్యకి
Deleteఇక్కడే వుంది పెళ్లి మిస్సయ్యా !!
ReplyDelete:) ఈ సారి అసలు మిస్స్ అవ్వకండి ఇలాంటి వివాహం ఇంకొకటి కనక జరిగితే.
Delete