Tuesday, July 9, 2013

అలా చందమామనై...

మల్లెల తీరం లో సిరిమల్లెపువ్వు - నాలుగు పాటలు.


http://www.mediafire.com/listen/jsckc5pzmv9zavv/Alaa_Chandamaamanai.mp3

అలా చందమామనై ఇలా చేతికందనా
అలా చందమామనై ఇలా చేతికందనా
పాడి రోజు లాలిని, పంచుకోనా జాలిని 
పాడి రోజు లాలిని, పంచుకొనా జాలిని
గాలిలో కెరటమై ఎదే తాకనా
మల్లెల్లో మధువునై దరే చేరనా
సందె వెలుగుల చెలిమి తీరం పిలుపునై... రానా
అలా చందమామనై ఇలా చేతికందనా

http://www.mediafire.com/listen/b12jn3z31303fyv/04Mabbulu_Kurise_%5BSongsAp.com%5D.mp3

మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం,చినుకై రాలెను సంతోషం
తియ్యని తేనల సావాసం,తోడై దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం,సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే, మౌనం విరిసే, మది మురిసే
కన్నులు మెరిసే, వెన్నెల కాసే,ఎద ఎగసే

ఏ జన్మ కథ మళ్ళీ మొదలయి,నా జన్మ కదిలింది
ఆశగా నీతో అడుగేస్తుంటే,అణువణువూ అదిరింది
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
మమతల ముడిపడి,మురళిగ నిలబడి,మానస కోయిల కూసెనుగా
మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే

ఏ కొమ్మ తొలి సిగ్గుల మొగ్గై,ఏ చోట పూస్తుందో
ఉరికే వాగులు, పారే ఏరులు చేరే తీరాలేవో
తెలుసా వాటికి తమ తల రాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
తెలుసా వాటికి తమ తల రాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
పువ్వుల ఘుమఘుమ,మువ్వల సరిగమ
ఎవ్వరు ఆపినా ఆగవుగా
మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే

నా చూపులకు సోయగమిచ్చి నీ కంటి కళ వచ్చి
నువ్వే నేనని భావన చేస్తూ,నాతో నేను రమించి
చూసేదంతా సొగసనిపించి,చేసేవన్నీ నిజమనిపించే
చూసేదంతా సొగసనిపించి,చేసేవన్నీ నిజమనిపించే
గువ్వల కిళకిళ,నవ్వుల పరిమళ
మల్లెల తీరము కనిపించే
మల్లెల తీరము కనిపించే

మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే,మది మురిసే
దిక్కులు మెరిసే,చుక్కలు విరిసే,ఎద ఎగసే
మల్లెలు పూసే,మౌనం విరిసే, మది మురిసే
కన్నులు మెరిసే, వెన్నెల కాసే,ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం,చినుకై రాలెను సంతోషం
తియ్యని తేనల సావాసం,తోడై దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం,సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే, మౌనం విరిసే, మది మురిసే
కన్నులు మెరిసే, వెన్నెల కాసే,ఎద ఎగసే

http://www.mediafire.com/listen/j83wb9ybt8az1ad/02Nee_Needana_%5BSongsAp.com%5D.mp3


నీ నీడన ఇలా నడవనా
నీ నీడన ఇలా నడవనా
పరిమళించు పువ్వులాగ పలుకరించనా
చినుకు తాకు మొలక రీతి చిగురు తొడగనా
నీ పాటన సుధై పారనా
మనసు కోరు మల్లెనౌతు నేను నీలో కలసిపోనా

మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరస్సులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
 
తూరుపు వెలుగుల,పడమటి జిలుగుల పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుస్సున ఇద్దరమే
చీకటి నలుపున మనమే,చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు,అలసట ఎరుగని నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!

 
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
 
స్వఛ్చపు తొలకరి, వెచ్చని జల్లుల, పచ్చని కాంతులలో మనమే
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటలమనమే
నింగి నేల చిన్నబోయి రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతం ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియ కథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే

 
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరస్సులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా

(You can stop the song playing on this site, by scrolling down the page and clicking on pause button of the player.)

17 comments:

  1. మురిపించే మల్లెమొగ్గలు,వీనులవిందైన గువ్వల కిలకిలలు,నవ్వుల పరిమళం పువ్వుల ఘుమఘుమలు......ఇన్ని విశేషణాలా! విశ్లేషించాలంటే ఎన్ని విశేషాలో!

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి ఉమాదేవిగారు.ఈ సినిమాలో పాటలన్ని వింటుంటే ఏదో తెలియని అనుభూతి కి లోనవుతాము. నాకు పాటలు సినిమా చూస్తున్నపుడు ఇంకా నచ్చాయండి.
      ధన్యవాదాలు ఉమాదేవి గారు.

      Delete
  2. మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

    www.poodanda.blogspot.com

    ReplyDelete
  3. Replies
    1. వనజ గారు, పాటలు బాగున్నాయా? ధన్యవాదాలు మీ వాఖ్యకి

      Delete
  4. మంచి సినిమా పాటలను షేర్ చేసినందుకు థాంక్సండీ...

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు ధన్యవాదాలండి.

      Delete
  5. మల్లెలతీరం పై రెండు వరుస పోస్టులు -- సూపరు.
    సిస్టంలో నేను ఆ ఆల్బం ప్లే చేస్తూ ఈ పోస్ట్ చూడటం -- ఇంకా సూపరు

    వెయ్యి లైకులు, వంద షేర్లు వేసుకోండి నా తరఫున :)

    ఏదైనా సినిమాలో ఒకటి రెండు పాటలు బాగుంటాయి.. మహా అయితే ఇంకో రెండు, కాని ఈ ఆల్బంలాగా మెత్తం పాటలన్నీ బాగుండటం థీమ్ మ్యూజిక్ తో సహా...అప్పుడెపుడో బ్లాక్ అండ్ వైట్ జమానా తరువాత ఇన్నాళ్ళకు.

    వినండి వినండి... వింటూనేఏఏఏఏ ఉండండి :)

    ReplyDelete
    Replies
    1. రెండు సార్లు చూసా కదా నాగార్జున గారు సినిమా అందుకని రెండు పోస్ట్స్ అన్న మాట!
      మీ అన్నేసి లైక్స్ , అన్నేసి షేర్లకు ధన్యవాదాలు.అవునండి , కొద్ది రోజులౌగా ఇదే పని..ఇదే సినిమాలో పాటలు వినడం...:) నేను సినిమా చూసినప్పుడే మొదటిసారి పాటలు వినడం. నాకు ఈ పాటల సంగతి సినిమా చూడకముందు తెలియదు. ఇంతకీ ఇండియా లో ఎలా ఉంది ఆదరణ ఈ సినిమాకి? మా స్టేట్ లో ఫ్లాప్ షో..అసలు , నేను తీసికెళ్ళిన వారు తప్ప, చూసిన వారు ఎవ్వరు లేరు..

      Delete
    2. మేము చూసిన రోజున కేవలం రెండు థియేటర్లలో ఉంది...మొదటి రోజు కాబట్టి ఓ వందమంది దాకా వచ్చారు, ఇప్పటికి నాలుగు థియేటర్స్ లో ఆడుతుంది...వచ్చేవారం సంగతి ఏమిటో

      Delete
  6. పాటలు మాత్రం చాలా బాగున్నాయండీ.. నాగార్జున గారు చెప్పినట్లు నావికూడా మరో వంద లైకులు వేస్కోండి :-) నేను రిలీజైన రోజునుండీ ఇవే పాటలు వింటూ ఉన్నాను. థీం మ్యూజిక్ సైతం అపుడపుడు మనసులో అలా తిరుగుతూ ఉంది.

    ReplyDelete
    Replies
    1. మళ్ళీ ఇలాంటి అల్బం రావాలంటే ఎన్ని రోజులు వేచి ఉండాలో వేణు గారు. ధన్యవాదాలు మీ వాఖ్యకి.

      Delete