Thursday, August 1, 2013

జావెద్ అక్తార్ గారి కవిత -మహేష్ బాబు గొంతులో...




మహేష్ బాబు తెలుగులో..

ఫరాన్ అక్తార్ హిందీలో..


ఎవరి కళ్ళలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో
ఎవరి మాట మన్ననగా ఉంటుందో
ఎవరి మనసు మెత్తగా ఉంటుందో
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో
ఎవరికి ఆడవాళ్ళంటే హృదయంలో అభిమానం,సమాజంలో గౌరవం ఉంటాయో
ఎవరు వాళ్ళ శరీరానికి,మనసుకు,ఆత్మకి విలువిస్తారో
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో
స్త్రీకి శక్తుంది,గుర్తింపుంటుంది,గౌరవం ఉండాలని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో
ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు,సహచరుడు,ఆత్మీయుడు
ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు…

(You can stop the song playing on this site, by scrolling down the page and clicking on pause button of the player.)

24 comments:

  1. మహేష్ బాబు దీన్ని ఏ సినిమాలో చదివాడు అనేది నాకు గుర్తు రావడం లేదు.జావెద్ గారి కవితా రీతి ని మాత్రం తప్పక అభినందించితీరాలి.ఈ సందర్బంగా నాకు వివేకానందస్వామి "The East and the west " అనే పుస్తకం లో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. "మన దేశంలో స్త్రీని కాళీ మాత తోను ,దుర్గా మాతతోను పోల్చుతాము గాని నిజానికి హిందువులమైన మనవలె ఎవరు ఈ భూమి మీద స్త్రీని అణిచి వేయలేదు.ఒక రెక్క తో పక్షి ఎక్కడైనా ఎగరగలుగుతుందా..ప్రస్తుతం మన పరిస్థితి అదే...అమెరికా యొక్క సమాజం లో ప్రతి గొప్ప విషయం లో స్త్రీల యొక్క శక్తియుక్తులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.అక్కడి స్త్రీలు ఉన్నత భావాలు అర్ధం చేసుకోవడంలో పురుషులు కంటే మిన్నగా వుంటారు.పాశ్చ్యాత్యులు స్త్రీ కి ఇచ్చే గౌరవం ఒక మంత్రగాడు ఒక శక్తి స్వరూపిణికి ఇచ్చే గౌరవం లా తోస్తుంది.. "Ave Maria" అనే భక్తి పూర్వకమైన పలుకులు యూరపు దేశాలలోని వీధులలో మారుమోగుతుంటాయి." అని అంటారు.



    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు మూర్తి గారు.మంచి పుస్తకాన్ని గురించి తెలియచేసారు.

      Delete
  2. ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో
    స్త్రీకి శక్తుంది,గుర్తింపుంటుంది,గౌరవం ఉండాలని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో
    ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో
    అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు,సహచరుడు,ఆత్మీయుడు
    ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు…

    Wonderful

    ReplyDelete
    Replies
    1. జావెద్ అక్తర్ గారి ప్రతి పాట,కవితలన్ని wonderful కదండి. ధన్యవాదాలు శర్మగారు.

      Delete
  3. నేను నిన్ననే చూసను అండీ.....నాకు చాలా బాగా నచ్చింది ఈ కవిత....చెప్పిన విధనం ఇంకా బాగుంది...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీను గారు మీ వాఖ్యకి.

      Delete
  4. ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో,
    స్త్రీకి శక్తుంది, గుర్తింపుంటుంది, గౌరవం ఉండాలని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో,
    ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో,
    అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు
    ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు…

    అద్భుతమైన భావన.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భారతి గారు.జావెద్ అక్తర్ గారి కవిత కదండి మరి!

      Delete
  5. అక్షర సత్యం.....వాడే అసలైన మగాడు.

    ReplyDelete
    Replies
    1. మీ మాటే నా మాట పద్మార్పిత గారు. ధన్యవాదాలు మీ వాఖ్యకి.

      Delete
  6. అక్షర సత్యం , ఆచరణయోగ్యం అనుకుంటే .

    ReplyDelete
    Replies
    1. ఆచరణయోగ్యమా కాదా అన్నది మన చేతిలోనే కదండి ఉంది? మీ వాఖ్యకి ధన్యవాదాలు శర్మ గారు.

      Delete
  7. ఫర్హన్ అక్తర్ ప్రయత్నాన్ని మనం అభినందించాలి..తన తండ్రి రాసిన ఈ కవితను ప్రచారం చేస్తూ "మర్ద్" పేరుతో (అసలైన మగాడు) MARD (Men against Rape and Discrimination) అనే నూతన అర్థాన్ని కనిపెట్టి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణాది రాష్త్రాల తరపున మహేష్ బాబు ఈ కార్యక్రమానికి ప్రచారకర్త. సచిన్ టెండుల్కర్, హృతిక్ రోషన్ కూడా ఈ కార్యక్రమం లొ భాగస్వాములు.

    ReplyDelete
    Replies
    1. MARD (Men against Rape and Discrimination) కార్యక్రమం గురించి వివరాలు తెలియచేసిన మీకు ధన్యవాదాలు నవజీవన్ గారు.

      Delete
  8. ఎంత అద్భుతమైన భావం. ఇటువంటి కవిత్వాలను విని షబాన అజ్మి , జాదు అత్తరు తో రెండో పెళ్లి కి రెడి అయింది. మొదటి భార్య కి ఈ కవిత్వం చెప్పి ఉంటే, జాదు అత్తరు స్రీల మీద అంత గౌరవం ఉంటే రెండో పెళ్లి కి ఎలా సిద్దం అయ్యావు అని అడిగి ఉండేది. ఒక భార్య బ్రతికి ఉంటే రెండొ పెళ్లి చేసుకోవాలనే ఆలొచన ఎలా నిజమైన మగాడికి వస్తుందో ఆయనకే తెలియాలి

    ReplyDelete

  9. తెలుగు లో అనువాదం చక్కగా చేసారు. చంద్రబోస్ చేసారుట

    ReplyDelete
    Replies
    1. ఓహో అలాగా?మంచి విషయం తెలియచేసారు.నేను ఎవరు అనువాదం చేసారా అని అనుకున్నాను. ధన్యవాదాలు మీ స్పందనకు వాసు గారు.

      Delete
  10. ఈ అనువాదం కొంచం రవీంద్ర నాదుని కవితను పోలి ఉంది, బాగుంది, జావేద్ గారి భావం బాగుంటుంది. వెన్నెల గారూ ఎలా ఉన్నారు?

    ReplyDelete
    Replies
    1. మెరాజ్ గారు, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలారోజులకు పలకరించారు. ధన్యవాదాలు నీ వాఖ్యకి.

      Delete
  11. అస్సలు ఆధిపత్యం అన్న ఒక్కఆలోచన బుర్ర లోనుండి తొలగిస్తే, ఒక్క స్త్రీ నే కాదు, పిల్లలను, వృద్ధులను సకల జంతు జాలాన్ని 'వారి/వాటి శక్తిని' గుర్తించే గుణం అలవడుతుంది.

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారు రామ్ గారు. ఎలా ఉన్నారు?

      Delete
  12. వెన్నల గారు అబ్బో చాలా బాగా చెప్పారు...very nice very nice...:-):-):-)

    ReplyDelete
  13. చాలా బాగుంది శ్రీ గారూ .. ఇప్పుడే నేను ఈ కవిత చూడటం. థాంక్స్ అండీ !

    ReplyDelete