Monday, April 9, 2012

నిస్వార్ద సేవ




వర్క్ కి డ్రైవ్ చేస్తున్న అనిత మనసులో ఎన్నో సందేహాలు.అసలు తను చేస్తున్న పని సరైనదేనా?ఎందుకు అమ్మా, అత్తయ్యగారు అందరూ భయపెడుతున్నారు?శ్రీధర్ కి, తనకి ఇష్టమని చెప్పినా ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు?ఇంకో వారం రొజుల్లో ఇండియా ప్రయాణం.

ఆఫీసులోకి అడుగుపెడుతూనే, ఏదో ముఖ్యమైన మీటింగ్ అంటూ
అనితకి పిలుపు రాగా,హడావిడిగా కాన్ఫెరెన్స్ రూంలోకి వెళ్ళింది అనిత. కాన్ఫెరెన్స్ రూం లో ఉన్న అనిత సహుద్యోగులు వాళ్ళు పెంచుకుంటున్న కుక్క పిల్లల గురించి,పిల్లుల గురించి, ఆ రోజు వాతావరణం గురించి, రాత్రి జరిగిన బాస్కెట్ బాల్ మాచ్ గురించి అనర్గళంగా మాట్లాడుకుంటున్నారు.అనిత కొలీగ్ రాబ్ అనితను అడిగాడు "Are you excited  about your vacation next week?" అని.అనిత చిరునవ్వుతో "Oh yeah ,looking forward to it" అని సమాధానం చెప్పింది.ఇంతలో అదే రూం లో ఉన్న లిల్లీ అడిగింది అనితని ఎన్ని వారాలలో మళ్ళీ తిరిగిరావడం అని.అనిత క్లుప్తంగా ఐదు వారాలు అని సమాధానం చెప్పింది.మీటింగ్ ముగిసాక తన ఆఫీస్ వైపు అడుగులు వేస్తున్న అనిత దగ్గరికి లిల్లీ మళ్ళీ వచ్చి మాట కలపడానికి ప్రయత్నించింది. అనిత తనకి చాలా పని ఉందని చెప్పి లిల్లీని పంపించేసింది.అనితకి లిల్లీతో మాట్లాడడం అసలు ఇష్టంలేదు.

ఇంతలో శ్రీధర్ ఫోన్ "అనితా అమ్మ మళ్ళీ అలోచించమటుంది, ఏం చేద్దం" 
అని.అనిత నెమ్మదిగా అడిగింది, "నువ్వేమని చెప్పావు?"అని. ఆమ్మకి నచ్చచెప్పాను,"మేమిద్దరమూ అలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇంక దీని గురించి అలోచించటం అంటూ ఎమీ లేదు" అని. "చెప్పావు కదా? అయితే అదే మాట మీద ఉండు నువ్వు. అంతే కానీ ఇలా ఇన్ని సార్లు నువ్వు కూడ అడుగుతుంటే, నాకు కూడా నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదేమో అని అనుమానం వస్తుంది" అని అంది అనిత.. "ఓకే" అని ఫోన్ పెట్టేసాడు శ్రీధర్.చిన్నగా నిట్టూర్చి పని చేసుకోసాగింది అనిత.లంచ్ టైం అవ్వడంతో కేఫెటీరియా కి వెలదామని బయలుదేరింది అనిత.లిల్లీ దారిలో ఎదురైతే చూడనట్టుగా తల తిప్పుకుని నడకలో వేగం పెంచి తనని దాటుకుని వెళ్ళిపోయింది అనిత. 

లిల్లీ, అనిత గత ఐదు సంవత్సరాలు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు.సహజంగా స్నేహశీలైన అనిత లిల్లీ అంటే ఇష్ట్టపడకపోవడానికి మాత్రం ఒక కారణం ఉంది. ఉద్యోగం మొదలు పెట్టిన తొలి రోజుల్లో లిల్లీ తో చాలా స్నేహం గా ఉండేది అనిత.వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోవడం వలన మూడు నెలల వరకు వారిద్దరూ ఎంతో సఖ్యతగా కలిసి మెలిసి తిరుగుతూ ఉండేవారు. కాని ఒకరోజు లిల్లీ మాటల సంధర్భం లో అనితకి చెప్పింది గతంలో తను  ఎనిమిది సంవత్సరాలు ఒక బార్లో వెయిట్రెస్స్(bartender) గా పనిచేసానని, అది కూడా రాత్రులు పని చెయ్యడం వలన ఎక్కువగా టిప్స్ అవి వచ్చేవని, అలా కష్టపడి పని చేసి సంపాదించిన డాల్లర్స్ తోనే తను పై చదువులు చదివానని చెప్పింది. అనిత నిర్ఘాంతపోయింది. తను రోజు కలిసి పనిచేసేది ఒక bartender తోనా? అది కూడా  బార్లో ఎనిమిది సంవత్సరాలు రాత్రులు  పని చేసిన ఒక  అమ్మాయి తోనా? ఒక్కసారిగా లిల్లీ అంటే విముఖత ఏర్పడింది అనితలో. అనిత చిన్నపటి నుంచి ఏ లోటు లేకుండా పెరిగింది. ఇంట్లో గారాబు పట్టిగా అన్నిట్లో తన మాట నెగ్గించుకుంది. శ్రద్ధగా చదువుకుని అమెరికా వచ్చి పై చదువులు చదివి మంచి ఉద్యోగం లో స్దిరపడింది. చిరకాల స్నేహితుడైన శ్రీధర్ ని ఇష్ట్టపడి వివాహమాడింది. జీవితంలో కష్ట్టమంటూ ఎరుగని అనితకి లిల్లీ ఒక  విశృంఖలమైన జీవితం గడిపిన దానిలా కనిపించింది.లిల్లీ తో అంతకు ముందు ఉన్న స్నేహాన్ని తుంచేసి,ముభావంగా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పేది అనిత. 


ఐదువారాలు గడిచాయి.అనిత,శ్రీధర్ ఇండియా నుంచి తిరిగివచ్చారు.అనిత చేతిలో ముద్దులొలికే ఆరు నెలల పాప.ఆ పాపని దత్తత చేసుకోడానికే అనిత, శ్రీధర్ ఇండియా వెళ్ళారు.అనితకి చిన్నపటినుంచి ఒక ఆశయం.తనకు చేతనైనంత సేవ పేదవారికి కాని ,సహాయం కావల్సిన వారికి కాని చెయ్యాలి అని.ఒక్క బిడ్డనే కని, ఇంకో బిడ్డను దత్తత తీసుకోవాలి అని ఎప్పుడూ అనుకునేది.అనిత ఇంటిలో, శ్రీధర్ ఇంటిలోను దీనికి వ్యతిరేకించినా , శ్రీధర్, అనిత ఒకే మాటకు కట్టుపడి వాళ్ళు అనుకున్నట్టుగానే ముద్దులొలికే పసి పాపను దత్తత చేసుకున్నారు.తెల్లగా, అందం గా ఉంది అనిత దత్తత చేసుకున్న పాప. ఆ వీకెండ్ స్నేహితులందరినీ పిలిచి పాపని దత్తత చేసుకున్నట్టు, పాప పేరు స్వప్న అని పెట్టుకున్నామని చెప్పింది. స్నేహితులందరూ ముద్దులొలికే పాపని చూసి , అనితని పొగిడారు. గర్వంగా అనిపించింది అనితకి.ఎంత శ్రమ పడిందని తను, ఎన్ని ఫోన్ లు ఇండియా కి, ఎన్ని సార్లు అమ్మ నాన్న పంపిన ఫొటోలు, అత్తగారు , మావగారు పంపించిన ఫోటోస్ లో పాపలు నచ్చక, కనీసం ఒక ఆరు నెలలు శ్రమపడితే కాని, ఈ అందాల పాప తనకు దక్కలేదు. చూడటానికి ముక్కు తీరు బాగుండాలి,తెల్లగా ఉండాలి, అరోగ్యవంతురాలై  ఉండాలి అని ఎన్నో రోజులు వెతికి, అన్నీ  కుదిరితేనే దత్తత చేసుకుంది పాపను అనిత. పాపని కన్న తల్లిలా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అనిత.


పాప వచ్చిన దగ్గర నుంచి వర్క్ నుంచి ఇంటికి తొందరగా వచ్చేసేది అనిత. ఒకసారి వర్క్ లో లిల్లీ చెయ్యల్సిన ఒక ప్రోజెక్ట్ లో కొద్దిగా వెనుకపడి ఉండటం వల్ల అనిత ని సహాయపడమని చెప్పాడు అనిత బాస్.అనిత మనసులో అనుకుంది..ఇప్పుడు ఈ మహా తల్లికి అంతగా రాచకార్యాలేమున్నాయో, ఇలా డెడ్లైన్ మిస్స్ చేస్తుంది అని. బాస్ చెప్పాడు కాబట్టి అయిష్టం గా నే ఒప్పుకుంది అనిత.ఒక వారం రోజులు తను రిమోట్ గా  పని చేస్తానని అర్జీ పెట్టుకుని దానికి బాస్ నుంచి ఆమోదం వచ్చాక అనితకి చెప్పింది లిల్లీ.అనిత కి చాలా కోపం వచ్చేసింది. లిల్లీ రిమోట్ గా పని చేస్తే తను రోజు అనుకున్న టైం కి ఇంటికి వెళ్ళటం కుదరదు.వర్క్ లో కూడా కొన్ని మీటింగ్స్ తనే వెళ్ళాల్సి వస్తుంది అని చాలా చిరాకు అనిపించింది.మర్నాడు తన అక్కసు అంతా తన ఇంకో కొల్లీగైన జేంస్ తో వెళ్ళబోసుకుంది అనిత.లిల్లీ కి అంతగా వెలగబెట్టాల్సిన పనులేమిటో, హాయిగా ఎవరన్నా ప్రియుడితో కలిసి వెకేషన్ కి చెక్కేసి ఉంటుందని,తన మీద ఒక్కసారిగా ఇంత పని రుద్దేసి వెల్లిపోయింది అని చెప్పింది అనిత. తను ఆరు నెలల పాపతో ఎంత ఇబ్బంది పడుతుందో, రాత్రులు నిదుర లేక జాగారం చేస్తూ , పొద్దున్న వర్క్ కి టైం కి వచ్చి వెళ్ళడం ఎంత కష్టమో తెలుసా అని  జేంస్ ని అడిగింది అనిత. జేంస్ సంశయిస్తూ అనితకి చెప్పాడు లిల్లీ కూతురికి జ్వరంగా ఉండటం కారణం గా తను రిమోట్ గా పనిచేస్తుందని చెప్పాడు అనితకి.ఎవరితో పడుకుని, ఎన్నో ప్రియుడికి తో కన్న కూతురో అని మనసులో హేళనగా అనుకుంది అనిత.


వారం రోజుల తర్వాత వర్క్ కి వచ్చింది లిల్లీ.అనితకి తాంక్స్ చెప్పి తన ఆఫీస్ వైపు వెళుతుండగా , జేంస్ పలకరించడతం తో అతనితో మాట్లాడసాగింది లిల్లీ. జేంస్ తో తన సంభాషణ ముగియగానే మళ్ళీ అనిత ఆఫీస్ కి వచ్చి అడిగింది లిల్లీ."పాపను దత్తత్త చేసుకున్నవంట కదా?" అని. అవునని సమాధానం చెప్పి, తను గత వారం లిల్లీ వల్ల ఎంత ఇబ్బంది పడిందో చాలా కటువుగానే చెప్పింది అనిత. లిల్లీ నెమ్మదిగా అనిత కళ్ళలోకి సూటిగా చూసి, క్షమాపణలు కోరి, తను కూడ సంవత్సరం క్రితమే ఒక అమ్మాయిని దత్తత చేసుకున్నట్టు, ఆ అమ్మాయికి చూపు లేదని చెప్పింది అనితకి.తను బ్రైలీ నేర్చుకుంటుందని, ఆ పాపకి కొద్దిగా వంట్లో నలతగా ఉంటే తను రావడానికి ఇబ్బంది అయ్యిందని చెప్పింది.ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది అనిత.


ఆ రోజు రాత్రి అనితకి నిద్రపట్టలేదు.పాప తన ఇంట్లో అడుగుపెట్టిన రోజునుండి తన లైఫ్ ఎంత బిసి అయిపోయిందో తనకు తెలుసు. ఒక్క నిమిషం తీరిక ఉండటం లేదు. అలాంటిది ఒక చూపులేని అమ్మయిని పెంచడం అంటే..మాటలా. ఆ ఊహకే వణికిపోయింది అనిత.అసలు లిల్లీ ఎందుకు ఒక చూపు లేని  అమ్మాయిని పెంచుకుంటుంది ..ఇలా  ఎన్నో ప్రశ్నలతో ఆ రాత్రి గడిపి మర్నాడు లిల్లీ కనపడగానే అడిగింది తన సందేహం తీర్చమని. లిల్లీ చెప్పింది తను లైఫ్ లో ఎన్నో కష్టాలు చూసిందని, తను అప్పుడే అనుకుంది అట, ఎవరికన్నా తను డబ్బు సంపాదించినప్పుడు సాయపడాలి అని. అయితే చూపులేని అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు దత్తత, అన్ని సక్రమంగా ఉన్నా అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా అని అనిత అడిగితే, లిల్లీ సమాధానం అలాంటి   అమ్మాయిని  తను కాకపోయినా ఎవరన్నా దత్తత చేసుకుంటారని, ఇలాంటి ఒక పాపకు జీవితాన్ని, ఒక ఇంటిని ఇవ్వడమే తనకి ఇంకా తృప్తి కలిగిస్తుందని చెప్పింది లిల్లీ. అనితకి ఒక్కసారిగా లిల్లీ ఎంతో మహోన్నతురాలిగా కనిపించింది.ఇదే కదా స్వార్ధం లేని స్వచ్చమైన మానవ సేవ? తను ఎన్ని అలోచించింది? ఎంతమంది అంద విహీనం గా ఉన్నారని, నల్లగా ఉన్నారని తిరస్కరించి అందం గా ముద్దులొలికే పాపను మాత్రమే దత్తత చేసుకుని తెచ్చుకుంది.
ఎంత మందితోనో చెప్పుకుంది అనిత తను చేసిన ఆ మంచి పనిని. స్నేహితులందరూ పొగుడుతుంటే ఉప్పొంగిపోయింది. లిల్లీ మాటవరసకు కూడా ఎవరికి చెప్పలేదు తను ఒక చూపులేని అమ్మాయిని పెంచుకుంటున్న విషయం.


లిల్లీ పట్ల ఇన్నాళ్ళు తను ప్రవర్తించిన తీరు తలచుకుంటేనే తన మీద తనకే అసహ్యం కలిగింది అనితకి.చేతులెత్తి మొక్కాలనిపించే సంస్కారం ఈ అమ్మాయి సొంతం కదా అని కళ్ళలోంచి జారిపడుతున్న అశృవులను ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తపడింది. 

(ఇది నిజంగా జరిగిన సంఘటన.కొద్దిగా మార్పులతో రాయటం జరిగింది)

48 comments:

  1. నిజమైన నిస్వార్థ ప్రేమ. నిజంగానే లిల్లీ వంటి వారికి చేతులెత్తి మొక్కవచ్చు.

    ReplyDelete
    Replies
    1. అవునండి. లిల్లీ దత్తత చేసుకున్న పాపకు ఇప్పుడు 9 సంవత్సరాలు. లిల్లీ ని చూసినప్పుడల్ల నాకు మనసులో కలిగే భావమే ఇది. చేతులెత్తి నమస్కరించాలని.ధన్యవాదాలండి

      Delete
  2. ur friend is really great

    ReplyDelete
  3. వెన్నెలగారూ, కథ చాలా బాగుంది. అభినందనలు.

    చిన్న చిన్న సవరణలు:
    తప్పు ఒప్పు
    అనర్గలంగా అనర్గళంగా
    నిర్కాంతపోయింది నిర్ఘాంతపోయింది
    విశ్రుంఖలమైన విశృంఖలమైన
    దత్తత్తు దత్తత
    వెల్లిపోయింది వెళ్ళిపోయింది
    కట్టువుగానే కటువుగానే
    అస్సయం అసహ్యం
    అశ్రువలను అశృవులను

    మరొక చిన్న సవరణ:
    హతాశురాలైంది అన్న భావం సరికాదేమో. మీరు నిర్ఘాంతపోయింది అని అంటే బాగుండేది. హతాశురాలైంది అంటే ఆశ దెబ్బతిన్నదిగా అయ్యింది అని అర్థం.

    ReplyDelete
    Replies
    1. మీకు చాలా చాలా చాలా thanks అండి. చదవడమే కాకుండా నా typos అన్ని సరిదిద్దినందుకు.మీరు చెప్పినవన్ని నేను correct చేసాననే అనుకుంటున్నాను. ఇంకొకసారి మీకు ధన్యవాదాలు

      Delete
    2. వెన్నెల గారు,

      thaanks - ధన్యవాదాలు
      correct - సరి

      చదవడమే కాకుండా నేను రాసిన అచ్చు తప్పులను(typos) అన్ని సరిదిద్దినందుకు

      Delete
    3. "thaanks" should be spelled as "thanks". నా అచ్చుతప్పులు సరి చేసిన మీకు ధన్యవాదాలు.

      Delete
    4. పోస్టుతో పాటు కరక్షన్స్ బాగా చూశారు శ్యామలీయం గారూ ! మీకు తెలుగు మీదా ప్రేమ బాగున్నట్టుంది.

      Delete
    5. మంచి పోస్టు . మానవత్వం అంటే ఏమిటో - అపార్ధం అంటే ఏమిటో వివరించే ప్రయత్నం చేశారు. నేటి మన సమాజం లోని ఆధిపత్య ప్రదర్శనలో సహాయం లో, సేవా ధృక్పథం లో కూడా కమ్యూనికేషన్స్ లో ఎలా లొపాలుంటయో చెప్పారు. బాగుంది.

      Delete
    6. నా బ్లాగ్ కి మీకు స్వాగతం. చదివి మీ స్పందనను తెలియచేసినందుకు ధన్యవాదాలు.

      Delete
  4. జలతారు వెన్నెల గారూ.. చాలా మంచి సంఘటనను తెలియచేశారు..
    నిజంగా పైకి సంఘ సంస్కర్తలుగా,సమాజానికి మేలు చేసె వాళ్ళుగా గొప్పలు చెప్పుకునే కొందరు నిజమైన అవసరంలో ఉన్నవాళ్ళకి నిస్వార్ధంగా హెల్ప్ చేయలేరు..
    వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ మాత్రమే..

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసి అనిత కూడా చాలా మంచి అమ్మాయేనండి.తను దత్తత చేసుకున్న అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగానే చూసుకుంటుంది, ఇప్పుడు తనకి 2 సంవత్సరాల బాబు. కాని లిల్లీ లాంటి వాళ్ళు కనిపిస్తున్న సజీవ దేవుని రూపాలు అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు రాజిగారు.

      Delete
  5. చాలా మంచి విషయం చెప్పారండి. ఆచరణలో కష్టమైనా కనీసం ఇటువంటి వాళ్ళను తలచుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎవరో ఒకరు, ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ...అన్నపాట గుర్తుకొచ్చింది.

    ReplyDelete
    Replies
    1. జయగారు, మళ్ళీ సిరివెన్నెల గారి పాటను గుర్తుకు తెచ్చారు. Lovely song! ధన్యవాదాలు మీకు!

      Delete
  6. ఆలోచింప చేసే విషయం !అందుకే ఎదుటివారిని చూసి ఒక నిర్ణయానికి రాకూడదు .మంచి విషయాన్ని ఫోకస్ చేసారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రవిశేఖర్ గారు.
      మాలిక -ee email try చెయ్యండి.malakpet.rowdy@gmail.com

      Delete
  7. అనిత చేసిన దాంట్లో తప్పేమీ లేదు .సృష్టి మర్మాలు దాగి వున్నాయి అందులో .
    వొక మనిషి అందం గా ఐశ్వర్యవంతుడు గా పుట్టటానికి పూర్వజన్మ సుకృతం
    అయితే ఆ పుణ్యాన్ని ఈ జన్మలో నిలబెట్టు కుంటడా లేదా అన్నది అతని ఖర్మ మీద ఆధార పడి వుంటుంది .
    అందుకే అందంగా వున్నా పాపాయిని ఆమె ఎంచు కోవడం ఆ పాపకి పుట్టిన ఆరు నెలలకే
    విదేశి యానం రావడం ,కన్న తల్లిదండ్రులు ఆర్దికం గా వున్న వాళ్ళు కాక పోయినా
    వున్న వాళ్లనే తల్లిదండ్రులు గా పొందడం లలటా లిఖితం .
    యిక లిల్లి విషయానికి వస్తే నిశిరాత్రులలో తప్పులు జరిగే అవకాశాలు వున్న చోట
    తప్పులని ప్రేరేపించే పనిలో వుద్యోగం .విశ్రున్ఖలత్వం కాదనలేం .
    అందుకే మరింత కష్టపడే ఆలోచనే ఆమె తో అంధురాలైన పిల్లని
    దత్తత చేసుకోనిచ్చింది .బయట కుర్చుని చూసే వాళ్ళు శభాష్ అని తప్పట్లు కొట్టొచ్చు గాని
    ఏనాటి ఋణం తీర్చుకుంటున్నారో యిద్దరు .మీరు రాసిన దానికి సృష్టి కోణం నా దృష్టిలో .

    ReplyDelete
    Replies
    1. You sure have a different perspective when analyzing people unlike many of us. And you amazed me this time. Thank you for the comment!

      Delete
  8. thank u for your compliment though i may not deserve it in toto .but that was my instant thought when i read the story ,and i mean it .

    ReplyDelete
  9. జీవితంలో ఎంత కష్ట్టాలు పడితే అంత జ్ణానం వస్తుంది. మనిషిలొ ప్రేమ వికసిస్తుంది. జ్ణానానికి పరాకాష్ట ఇతరులను షరతులు లేకుండా ప్రేమించటమే. నిజమైన ప్రేమ చాలా విప్లవాత్మకం గా ఉంట్టుంది, కనుక అటువంటి వారిని కలసినపుడు, వారి గురించి విన్నా, వారిని కొంచెం అర్థం చేసుకొన్నా మనుషుల చైతన్యం మీద తప్పక ప్రభావం చూపుతుంది. లిల్లి అటువంటి వనితనే. మొదటి నుంచి మంచి భావాలు ఒక పరిధిలో ఉన్న అనిత లాంటి వారు, లిల్లి గురించి అసలు సంగతి తెలిసిన తరువాత పూర్తిగా మారిపోయి ఉంటారు. ఇప్పుడు అనిత అందరికి మాములు వ్యక్తిలా కనిపించినా, ఆమే లిల్లి వలన పూర్తిగా వికసించి అందరిని షరతులు లేకుండా, స్వచ్చంగా ప్రేమించటం మొదలు పెట్టి ఉంట్టుంది. బహుశా ఆమేకి ఇప్పుడు దేనిమీదా ఆరోపణలు ఉండి ఉండకపోవచ్చు. ఇతరులలో మంచి తనం మాత్రమే చుడటం మొదలుపెట్టి ఉంట్టుంది. `

    ReplyDelete
    Replies
    1. అనితలో మార్పు గురించి నాకు పెద్దగా తెలీదు కాని, గత కొన్ని సంవత్సరాలుగా లిల్లీ ని చూస్తున్న నాకు మాత్రం ఇంత మంచి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా తెలుసు అని చాలాసార్లు గర్వపడ్డాను. అనిత కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి.మీకు దన్యవాదాలు శ్రీనివాస్ గారు.

      Delete
  10. మనసుకు అవకరం లేకుంటే..ప్రపంచం అంతా.. అందాల మయం. Good & Inspiring

    ReplyDelete
  11. మీ కథ స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆదర్శాలు చాలామందికి ఉంటాయి కాని ఆచరణలో పెట్టిన వారి మానసిక స్థయిర్యాన్ని మెచ్చుకుని తీరాలి.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పినదానిలో చాల నిజం ఉంది.ధన్యవాదాలు జ్యోతిర్మయిగారు.

      Delete
  12. జలతారువెన్నెల గారు, గుండెను పిండే నిజాన్ని రాసారు, ధన్యవాదాలండి.
    మానవ సేవే, మాధవ సేవ. ఇంత కన్నా ఎక్కువ నిదర్శనం అవసరం లేదు.
    .....పని పూర్తి చెయ్యకుండా చెప్పకోడదు కాని, నాకు అలాంటి ఇక ఆశయం వుందండి, అమలే తరువాయి. మీరు గూగుల్ translator బాదితులేనా !! ఈ ఆంగ్ల కీ బోర్డు లో తెలుగు టైపు చెయ్యాలంటే తల ప్రాణం తోకలోకి వొస్తోంది. ఏదన్నారాయాలన్నా రాయలేక పోతున్నాం.
    మరీ చిన్న చిన్న పదాలు అక్షర దోషాలతో, మనకు బేసిక్ తెలుగు వొచ్చా రాదా అనే సందేహం సృస్టిస్తోంది.
    చాలా పెద్ద టపాలు రాస్తున్నారు, మీ వోపికకు జోహార్లు.
    అక్షర దోషాలున్న మన్నించండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాంగారు.మీ ఆశయం తప్పక నెరవేరాలని నేను కోరుకుంటున్నాను.
      తెలుగులో టైప్ చెయ్యండం ఇబ్బందిగానే ఉంది.

      Delete
  13. లిల్లీ లాంటి నిస్వార్ధపరులు చాలా రేర్ గా వుంటారు . నిజంగా అలాంటి అమ్మాయి వుంటే చేతులెత్తి దండం పెట్టాలి .

    ReplyDelete
    Replies
    1. లిల్లీ పాత్ర కల్పితం కాదండి.ధన్యవాదాలు మాలాగారు.

      Delete
  14. పూర్వ జన్మ ఋణం అన్నది నిజం ... కాని మనిషి మానవత్వము నిజమే ... లిల్లి చేసింది గొప్ప పని ... అనిత చేసింది మంచి పని.... ఏదైతేనేం ఇద్దరిని అభినందించాలి ...వీలైతే వారిని ఆదర్శంగా తీసుకొని మనము అ మార్గంలో నడవాలి...

    ReplyDelete
    Replies
    1. మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు కల్యాణ్ గారు

      Delete
  15. ఉన్న - తత్త్వంబు మారి , సమున్నతత్త్వ
    మలవడును సత్యము దెలిసి మెలగు నపుడు ,
    తెలియు సత్య మహంకృతి తొలగినపుడు ,
    ఙ్ఞానముననే తొలగు నహంకార మెపుడు .

    బ్లాగు సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మాష్టారూ, పద్యరూపంలో స్పందించిన మీకు ధన్యవాదాలు.

      Delete
  16. జలతారువెన్నెల గారు చాలాకాలంగా బ్లాగులు చూస్తున్నాను.మీ కామెంట్స్ కూడా చూసేవాడినే.మీ కామెంట్స్
    చూసినప్పుడల్లా మీ బ్లాగు చిత్రం నన్నెంతో ఆకట్టుకుంటూ వుండేది.చాలా సింపుల్గా,చాలా క్యూట్ గా ఎంతో నిర్మలత్వం ఆ face లో. అయితే ఈరోజు మీ బ్లాగును ఓపెన్ చేసి టపాలను చదివాను.చాలా బాగున్నాయి.
    ప్రత్యేకంగా- నిస్వార్తసేవ సింప్లీ సూపర్బ్.ఇంకా ఇలాంటి రోజుల్లో అలాంటివాళ్ళు వున్నారంటే-అలాంటివారందరికీ శతకోటి ధన్యవాదాలతో కూడిన దండాలు.
    మీ కవితలు కూడా బాగున్నాయి.అయితే మీ ప్రజ్ఞ పాటవాలను ఊహాలోకాలకే పరిమితము
    చేయకుండా ప్రస్తుత సమాజ అవసరాలకు పనికోచ్చేట్లు ప్రసరింప చేస్తారని ణా కోరిక.ఇలా ఎందుకు కోరుతున్నానో next కామెంట్ లో వివరిస్తాను.

    ReplyDelete
    Replies
    1. హరిగారు, మీ సలహాని తప్పక పాటించడానికి ప్రయత్నిస్తాను.
      నా బ్లాగ్ చిత్రం నచ్చినందుకు ధన్యవాదాలు. నాకు కూడా ఎంతో ఇష్టమైన చిత్రం ఇది.
      ఉన్నారండి లిల్లీ లాంటి వారు ఉన్నారు, అనిత లాంటి వారు కూడా ఉన్నారు.
      మీ అభిమానానికి మరి ఒక్కసారి ధన్యవాదాలు.

      Delete
  17. హ్మ్ ! మంచి స్ఫూర్తి దాయకమైన విషయం పంచుకున్నదుకు ధన్యవాదాలండి !

    కవితలతో పాటు ఇలాంటి మంచి విషయాలు మరింత ఎక్కువ గా మీ బ్లాగులో చదవాలి అని కోరుకుంటున్నాను (అంటే కవితలు చదవాలి అంటే నాకు కొంచెం కష్టం అన్న మాట అది విషయం :D)

    btw ఆ పక్క ప్రొఫైల్ అమ్మాయి చాలా బావుందండి అచ్చు మీ రాతలాగా !

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిస్తానండి. నా బ్లాగ్ కి మీకు స్వాగతం. పక్క ప్రొఫైల్ అమ్మాయి చిత్రం క్రెడిట్ ఆ చిత్రం స్రుష్టించిన్వారికే దక్కుతుంది.ధన్యవాదాలు శ్రావ్య గారు.

      Delete
  18. అనిత గారి గొప్పతనం మెచ్చుకుంటూ ఆసక్తికరంగా చదువుతూ లిల్లీ గురించి తెలిసాక అశ్రువొకటి కనులమాటున కదలాడింది.

    నిజ జీవితంలో మీకు ఎదురైన సంఘటనే, అయినా ఇది చదివిన కొన్ని హృదయాలకైనా ఇలాంటి నిస్వార్ధ సేవలు చేసే ఆలోచన రావాలని కోరుకుంటున్నాము.
    రక్త సంబంధాన్ని ప్రేమించటం సృష్టి లో స్వతహాగా ప్రాణికి లభించే భావన.
    ఏ సంబంధమూ లేని నిస్వార్ధ సేవ లో హృదయానికి లభించేది ఆత్మ సంతృప్తి.
    కడకి ప్రాణులన్నీ వెతికేది దీని కోసమే. అది రోజూ పొందగలిగిన వారు నిజంగా ధన్యులు.
    చాలా మంచి అనుభవం...అందరితోనూ ఇలా పంచుకున్నందుకు థ్యాంక్స్ అండీ!
    కొందరికైనా మీ అనుభవం స్ఫూర్తి కాగలదని ఆశిస్తున్నాము.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు!

      Delete
  19. చాలా చాలా బాగుందండీ.. ఎంతో స్పూర్తిదాయకమైన విషయం.
    లిల్లీ కి, అలాంటి వారికి హ్యాట్సాఫ్.

    ReplyDelete
    Replies
    1. నేను కూడా లిల్లీ ని చూసినప్పుడల్లా మీలాగే స్పందిస్తాను. నా బ్లాగ్ కి మీకు స్వాగతం. ధన్యవాదాలు రాజ్ కుమార్ గారు

      Delete
  20. మంచి విషయం తెలియపరచినావు..చాలా బాగుంది అక్కా...

    ReplyDelete
    Replies
    1. చదివినందుకు మరియు స్పందినందుకు ఒక థాంక్స్ అందుకోండి!

      Delete
  21. బాగుందండీ....!!!
    అలాంటి ఆడవాళ్ళు కుడా ఇప్పుడు వున్నారా?
    "వున్నారు" అని తెలియ చెప్పినందుకు.. ధన్యవాదములు.. :)

    ReplyDelete
    Replies
    1. కథలోని రెండు పాత్రలు కల్పితం కాదండి!

      Delete