రమ్య, మంజు, సంజయ్, సునీత మంచి స్నేహితులు.
రమ్య అందమైనది, తెలివైనది,గుణవంతురాలు.తల్లితండ్రుల గారాబు పట్టి.
వారు చెప్పినట్టు నడచుకుని డాక్టర్ అయ్యింది.అమెరికా లో ఉన్నా డేటింగ్లు మీటింగ్లు అనక తల్లి తండ్రులు సంతోషంగా, అన్యోన్యంగా ఉండటం చిన్నపటినుంచి చూసిన రమ్య తల్లితండ్రులకే వదిలేసింది తనకి వరుడిని వెతికే భాద్యత. తోటి స్నేహితులు వారిస్తున్నా తల్లితండ్రులు చూపించిన అబ్బాయిని వరించింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న కొత్త పెళ్ళికొడుకు చాల అద్రుష్టవంతుడన్నారు అందరూ. రమ్య ఎంత సాంప్రదాయకంగా పెరిగిందో అతనికి తెలియచెప్పి,వారి కొత్త కాపురానికి దీవించి పంపారు తల్లితండ్రులు, స్నేహితులు.వీసాలు, గ్రీన్ కార్డ్లు,సిటిజెన్షిప్ల అవధులు అన్ని దాటి ఐదు సంవత్సరాల తర్వాత తను కూడా ఒక మంచి డాక్టర్ అనిపించుకున్నాడు రమ్య భర్త. ఒక శుభముహుర్తాన్న తనతో పాటు పని చేస్తున్న అమెరికన్ నర్స్ మోజులో (అతని భాష లో ప్రేమ) పడ్డాడు. సదరు నర్సమ్మకి ఇద్దరు అమ్మాయిలు మొదటి భర్త నుంచి, ఒక అబ్బాయి రెండవ వివాహం నుంచి సంక్రమించగా ప్రస్తుతం ఒంటరిగా ఉంది. రమ్యకి తెలియకుండా నర్స్ తోను, నర్స్ పిల్లలతోను చాలా బిసి అయిపోయాడు రమ్య భర్త. ఎట్టకేలకు ఒక రోజు విషయం గ్రహించిన రమ్య భర్తని వారించింది. జరిగినదేదో జరిగింది, మర్చిపోతాను, నర్స్ ని మర్చిపొమ్మంది. అందమైన తెల్ల నర్స్ నా మనసు దోచింది అని చెప్పాడు రమ్య భర్త. తల్లితండ్రులకి ఈ విషయం తెలిస్తే బాధపడతారని ఒక ఆరు నెలలు ఓపిక పట్టింది రమ్య. పరిస్తితులు మారకపోవడంతో ఇక అతనితో కలిసి జీవించలేనని చెప్పింది రమ్య తన తల్లితండ్రులకు. విడాకులు తీసుకుంది రమ్య. జీవితం అంటే ఏ రకమైన ఆసక్తి లేకుండా మిగిలిపోయింది.
మంజు తల్లి తండ్రిలిద్దరు ఇండియా నుంచి వలస వచిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. మంజు శ్రద్ధగా చదువుకుని పోస్ట్ గ్రాడ్యూట్ పూర్తి చేసింది. అమెరికన్,ఇండియన్ అబ్బాయిలు ఎందరో తనని ఇష్టపడ్డా తండ్రికి ఇష్ట్టముండదని తెలిసి తండ్రి చూసిన వ్యక్తినే పెళ్ళాడింది. కొద్ది రోజులకే వారికి అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకోవటం జరిగింది. ఎంతో చలాకిగా ఉండే మంజు ఒక్కసారిగా జీవితం లో అన్నీ కోల్పోయిన దానిలా అయిపోయింది.
సంజయ్ అమెరికాకి పై చదువులకోసం వచ్చి మంచి ఉద్యోగంలో స్దిరపడ్డాడు. ఇండియాలో ఉన్న సంజయ్ తల్లితండ్రులు చదువుకున్న, అందమైన అమ్మాయిని వెతికి కొడుక్కి పెళ్ళి చేసారు. నాలుగు వారాలు సెలవు తీసుకుని ఇండియా వెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు సంజయ్.
అందమైన, చురుకైన భార్య దొరికిందని సంతోషించాడు సంజయ్. ఇంకో నెలలో వీసా పంపిస్తానని చెప్పి అమెరికా తిరిగి వచ్చాడు. చెప్పినట్టుగానే నెల రోజుల్లో వీసా పంపించాడు భార్యకి. ఎంతో అత్రుతతో భార్య కోసం ఎదురుచూస్తున్న సంజయ్ కి, ఏర్పోర్ట్ లో సంజయ్ భార్యని కలుసుకోవడానికి తన బోయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. సంజయ్ భార్య సంజయ్ కి అతనిని పరిచయం చేసి, సంజయ్ ఎమీ అనుకోవద్దు.. నేను, ఇతను మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. వీసా లేకపోవడం వలన ఇన్నాళ్ళు నేను అమెరికా రాలేకపోయాను. నేను ఇతన్ని విడిచి ఉండలేను. సోరీ , బుట్ థాంక్ యు అని చెప్పి చక్కా వెళ్ళిపోయింది. నివ్వెరపోయాడు సంజయ్. ఎన్ని రోజులైనా ఈ విషయం మరచిపోలేక అందరూ మళ్ళీ పెళ్ళి చెసుకోమంటున్నా వినటం లేదు సంజయ్.
సునీతకి అమెరికాలో పిన్ని, బాబయి గ్రీన్ కార్డ్ స్పోన్సెర్ చేస్తే చిన్న వయసులోనే అమెరికా కి వచ్చి ఎం.ఎస్ పూర్తి చేసి తను ఇష్ట్టపడ్డ అబ్బాయిని , తల్లితండ్రులని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకుంది.ఇరువైపు వారి పెద్దలకు అంగీకారం లేనందువలన, కొద్ది రోజులలోనే నీ వాళ్ళు, నా వాళ్ళు అని తగాదాపడి విడాకులు తీసుకున్నారు. అయితే సునీత ఢీలా పడిపోలేదు.
తను స్కూల్ లో నేర్చుకున్న ఫ్లూట్ లెస్సన్స్ లో మళ్ళీ చేరింది. సమయం ఉన్నప్పుడల్లా చిన్నపటినుంచి చేసిన వాలెంటీరింగ్ మళ్ళీ మొదలుపెట్టింది. టెన్నిస్ క్లబ్ లో చేరింది. తనకంటూ ఒక జీవితం , దానికి ఒక అర్ధం ఏర్పరుచుకుని ముందుకు సాగింది.
సునీత తన స్నేహితులకి చెప్పింది -" పెళ్ళి, ప్రేమ జీవితంలో ఒక భాగం అవ్వాలి కాని, అవే జీవితం కాకూడదు . Husband/wife should be an addition in your life along with your work, sports , hobbies, friends and parents but he/she cannot be your life. The moment you start thinking he/she is your life and there is no life beyond them, you are finished. Common guys! cheer up and please get along with your life. Life is more beautiful than just a relationship."
ప్రేమ, పెళ్ళి విఫలమైతే బాధ ఉంటుంది నిజమే, కాని సునీతలా అందరూ అలోచించగలిగితే ఎంత బాగుండు అనిపించింది.

well said :)
ReplyDeleteఈ టాపిక్ మీద మీదైన శైలి లో ఒక కథ రాస్తే చాల బాగుంటుంది.
ధన్యవాదాలు శేఖర్ గారు.తప్పకుండా రాస్తానండి.
DeleteYes, It is TRUE.
ReplyDeleteThanks for your response Vanajagaaru.
Deleteమీరు చెప్పిన సంజయ్ కథ నేను లోగడ విన్నదే. ఇంకా ఇంకా ఘోరమైన కథలుకూడా విన్నాను, కొన్ని స్వయంగా యెరుగుదును కూడా.
ReplyDeleteనా సహోద్యోగి మరదలు ఒకామె అమెరికాసంబంధం చేసుకుని కోటి ఆశలతో వచ్చింది; అదీ అమెరికాలో అక్క,బావ ఉండే ఊరికే. కొద్దినెలలు గడిచాక అనుమానపిశాచి బయటపడ్డాడు ఆ కొత్త పెళ్ళికొడుకులో. భయంకరమైన మాటలు, చేతలు. మళ్ళీ అప్పుడప్పుడు అతి ప్రేమ కూడా. కొన్నాళ్ళకు యిద్దరూ భారతదేశం వచ్చారు. అమ్మాయిని పుట్టింటివద్ద దింపి, 'టాటా, గుడ్ బై' అని చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మాయి అమ్మగారింట కట్టుబట్టలతో ఉంది. తన బట్టలు, బంగారం, సర్టిఫికేట్లు అన్నీ అమెరికాలో ఉండిపోయాయి!
కొన్నాళ్ళకు అమ్మాయి అన్ని సర్టిఫికేట్లు తిరిగి డుప్లికేట్లు తెచ్చుకుని, అమెరికాలో చదువుకుందుకు మళ్ళీ అక్కగారింటికే వచ్చింది. ఆత్మవిశ్వాసంతో నిలబడి నిలచింది. ఒకసారినాతో అంది, ఆ వదిలిపోయైన మగడు తిరిగి సయోధ్యకోసం ప్రయత్నిస్తున్నాడని. నేనయితే, జగ్రత్త అమ్మాయీ, అతను నువ్వు సంపాదించగలవని తెలిసి నీ డబ్బుకోసం ఆశ పడుతున్నాడేమో ఆలోచించుకో అన్నాను. మరోసారి మోసపోవటానికి సిధ్ధంగా లేనని ఆమె చెప్పింది.
నవవధువును, అమెరికాలో అర్థరాత్రి నడిరోడ్డుమీద వదలి పరారైన NRI మొగుడి కథకూడా విన్నాను. అతడిని మర్నాడే పోలీసులు పట్టుకున్నారనుకోండీ.
ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ప్రస్తుతం NRI సంబంధం అంటే భయపడే పరిస్థితి.
అర్థనారీశ్వరం అచ్చమైన భారత దాంపత్యం. వద్దన్నా దాని ప్రభావం మనవాళ్ళమీద ఉంటుంది. Just one part of life అనుకోవటం నిజంగా కష్టమే. కాని అలా అనుకోవటం నేటి నాగరిక(?) ప్రపంచంలో అవసరం అయిపోయే రోజులు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం సమాజంలో పిచ్చితలలు వేసిన డబ్బువ్యామోఃహం. అపరిపక్వమైన ప్రేమలతో పెళ్ళిళ్ళకు తొందరపడటలూ, Arranged marriages లో తలిదండ్రులను మధ్యవర్తులు బోల్తాకొట్టించటాలూ వగైరాలూ కారణాలే ననుకోండి.
నా బ్లాగ్ కి స్వాగతం శ్యామలీయంగారు
Deleteసంజయ్, సునీత , రమ్య, మంజు వీరందరి పేర్లు మార్చి రాయల్సి వచ్చింది కాని వీరి గురించి రాసిన వన్నీ నిజంగా జరిగినవే.
మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు.
హుమ్మ్.. అన్నీ ఆలోచనలు ఆచరణలో పెట్టగలగడం అందరికీ ఒకేలా ఉండదు కదా.. మీరు చెప్పింది చూస్తే నిజమే అందరూ సునీతలా ఈజీగా తీసుకోగలిగితే సరి.. అంతే కదా! అనిపిస్తుంది గానీ వాస్తవంలో అదంత సులువైంది కాకపోడమే అసలు సమస్య. అదీ గాకుండా, సమస్య ఒకటే అయినా కూడా ప్రతీ ఒక్కరి స్థాయిలో సమస్య తీవ్రత వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలని బట్టి ఆధారపడి ఉంటుంది. అందులోంచి బయట పడటం అనేది కూడా అంతే వేరుగా ఉంటుంది.
ReplyDeleteమీరు చెప్పిన కథల్లో అమెరికాలో పెరిగిన పిల్లల పరిస్థితే ఇలా ఉందంటే ఇంకా ఇండియాలోనే పుట్టి పెరిగి జీవిస్తున్న వాళ్లకి ఇంకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. విడిపోయిన బంధం కలిగించే బాధతో పాటుగా, చుట్టూ ఉన్న కుటుంబం, సమాజం పరంగా ఉండే ఇబ్బందులు కూడా ఉంటాయి.
ఏదేమైనా.. ఆచరించగలిగితే మీరు చెప్పినట్టు ప్రేమ, పెళ్లి కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమే అని అనుకోడానికి ప్రయత్నించడం మంచి పరిష్కారమే..
మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం.నేను రాసినవన్ని నిజంగా జరిగిన సంఘటనలు.
Deleteఇక్కడ ఒక పార్టీ లో ఒక చిన్న డిబేట్ జరిగినప్పుడు యువతీయువకులు సూచించిన పరిస్కారమార్గం ఇది. వాళ్ళు మాకు కూడా ఇచ్చిన సూచన ఏమిటంటే.."మమ్మల్ని సరిగా రెయిస్ చెయ్యండి,జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఎదురుకునేటట్లు.మన సాంప్రదాయం ఇదే అనో, పరువు కోసమో, పరపతి కోసమో జీవితంలో అన్ని కోల్పోయామన్న భావన రానీయకుండా, ఇలాంటివి జరిగినప్పుడు తట్టుకోవడం కష్ట్టమైనా తల్లితండ్రులుగా , స్నేహితులుగా మీరు అండ గా ఉండి ధైర్యం చెప్పి జీవితం అంటే పెళ్ళి, ప్రేమ మాత్రమే కాదు,ఇంత కంటే ఇంకా విలువైన వెన్నో ఉన్నాయి అని వెన్ను తట్టి ధైర్యం చెప్పండి. Do not think we are a failure in life just becuase we have a broken relationship , and please change the way you think and then only you can support and give us enough strength to face any situation "అని. చిన్నవాళ్ళైనా వాళ్ళ అలోచనలు నా మనసుకి నచ్చాయి.
I totally agree with their opinion. I guess it really matters how you were brought up, especially when it comes to relationships related issues.
Deleteyou made me think for quite some time on this topic today. So, I should say that's a thoughtful post! ;)
Thank you very much for the encouraging words!
DeleteMay be your suggestion "Husband/wife should be an addition...but cannot be your life" is an apt conclusion for people who went through failed relationship.
ReplyDeleteBut to a healthy couple with normal or positive relationship, such a perspective may not be the correct one.
Emotional dependece also should be less on each other (husband/wife) even in case of healthy relationships. just a practical approach to life.
DeleteI am not suggesting anything to anyone in my blog.I am just stating my opinion.
ఒక రకంగా చెప్పాలంటే, పైకి emotional dependence అనిపింఛే దాంపత్యాలు లేదా ఇతర బాంధవ్యాలు అన్నీ financial dependence అనే దానికి ముసుగులు. అతి సాధారణంగా సాంప్రదాయిక భారతీయ కుటుంబాలలో యింటిపెద్ద అన్ని నిర్ణయాలూ తీసేసుకుంటూ మిగతా అందరినీ dependents చేసుకుని బండి నడిపించటం జరుగుతుంటుంది. ఆ యింటిపెద్దతో బాంధవ్యం విఛ్ఛిన్నమైతే అంతవరకూ dependents గా ఉన్నవాళ్ళకు తమ స్వంతజీవితాలకు సంబంధించిన యే విషయంలోనూ నిర్ణయంతీసుకునే వ్యావహారిక జ్ఞానమూ, మానసికపరిపక్వతా లేక అయోమయానికీ, అభద్రతకూ గురిఅవుతారు. పరంపరాగతంగా ఇటువంటి ధోరణిగల కుటుంబాలనుండి వచ్చి పిల్లలనూ అలాగే పెంచితే మారుతున్న సమాజంలో కొత్తకొత్త సవాళ్ళమాట దేవుడెరుగు యే చిన్న విషయంలోనూ గందరగోళపడకుండా ఉండలేకపోతున్నారు యువత. ఈ విషయం గుర్తించాలి.
ReplyDelete"emotional dependence అనిపింఛే దాంపత్యాలు లేదా ఇతర బాంధవ్యాలు అన్నీ financial dependence అనే దానికి ముసుగులు." మీరు చెప్పినది నిజమేనేమో కాని నేను financial dependence లేని చోట కూడా చాలా emotional dependence ఉండే దాంపత్యాలు చూసాను.అది వారి మధ్య ఉన్న అన్యోన్యతకు తార్కాణం అంటే మాత్రం ఒప్పుకోవటానికి మనసు అంగీకరించటం లేదు.
Delete*అది వారి మధ్య ఉన్న అన్యోన్యతకు తార్కాణం అంటే మాత్రం ఒప్పుకోవటానికి మనసు అంగీకరించటం లేదు.*
Deleteమీరు తప్పక అంగీకరించాలి. ప్రపంచం మనం ఎంత మంచి గా ఊహిస్తే అంత మంచి వారు, ఎంత చెత్తగా ఊహించుకొంటే అంత చెత్తవారు ఉదాహరణలు గా దొరుకుతారు. అత్యుత్తమ ప్రేమికులు కూడా భార్యా భర్తలలో ఉంటారు. ఒకప్పుడు అటువంటి వారు చాలా ఎక్కువగా ఉండేవారు, అలాంటివారి వలననే కదా పెళ్లి అనే వ్యవస్థ ఇన్ని రోజులు నిలబడి ఉంది.
నిజమే కాదనటం లేదు.My post is more targetted towards the emotional imbalances, youth are facing because of broken relatonships. Coexistence కొన్ని years గా చేస్తుంటే couples కే కాదండి, ఎవ్వరి మధ్య అయినా అన్యోన్యత ఉంటుంది.
Deleteమీ కధ చదివిన తరువాత నాకు పరిచయం ఉన్న ఓ కుటుంబం గుర్తుకు వచ్చింది ,ఆ అమ్మాయి పేరు సత్య
ReplyDeleteమీ కధ లో సునీత లా తనకు తానె ధైర్యం చెప్పుకుని దర్జాగా బ్రతుకుతోంది .మీరుచెప్పింది నిజమే ప్రేమ
పెళ్ళి జీవితం లో ఒక భాగం మాత్రమే these two are part of life but not heart of life any how ,you are appreciated please keep it up ,try to create aware ness through your articles
Thank you so much for appreciating.
Delete*తనకు తానె ధైర్యం చెప్పుకుని దర్జాగా బ్రతుకుతోంది *
Deleteదర్జాగా బ్రతుకుతోంది అంటే ? అందరు మొదట్లో అలాగే అనుకొంటారు. ఇంట్లో పెద్ద వారు పైలోకాలకు వెళ్లిన తరువాత, సహాయం చేసేవారు ఎవరు అందుబాటులో లేనపుడు, జబ్బులు, రోగాలు మొదలైన తరువాత, వారి దైర్యం, దర్జా ఎలా ఉంట్టుందో ఒకటాపా రాసేది. ఆ కాలం లో పక్కింటి వారన్న పలికేవారు, ఇప్పుడు ఎవ్వరు అవసరమైతే మందేశంలొ పలకరు.అమేరికా సంగతి వేరే.
మీరు చెప్పినది నిజమే, మంచి పోయింటే....
Deleteఅలాంటి రోజు వస్తుందని తెలిసినప్పుడు, తగిన విధంగా financial గా కూడా ప్లాన్ చేసుకుని, old age homes /retirement homes లాంటి వాటి మీద అధారపడాలి. కాలం మారుతుంది. అమెరికా లో ఉన్న,ఇండియా లో అయీనా ఒకరి మీద అధారపడకుండా ఏ వయసులో నైనా బ్రతకగలగాలి.ఇది స్త్రీ, పురుషులిద్దరికీ వర్తిస్తుంది.
మీరిచ్చిన సలహా అమేరికాకు సరిపోతుందేమో! ఇక్కడ వారికి అది ఏమాత్రం సరిపోదని నా అభిప్రాయం. మీరు ఇండియా విడచి ఎన్నిరోజులైందో తెలియదుగాని, ఇప్పుడు ఇక్కడ ఉన్న వారికి నిర్లక్షం, డబ్బు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఏమీ లేకపోయినా ఇక్కడ ఉన్న వారికి కులపిచ్చికి,అహంకారానికి లోటులేదు. ఇప్పుడు కొత్తగా డబ్బులు వచ్చేసరికి పట్టపగ్గలు లేవు. భార్య కొడుకు, కోడలు, కూతురు లేని వారిని ఎంత డబ్బులు ఉన్నా అక్కడ చేరితే హీనం గా, ఘొరం గా చూడబడుతారు. వనజ వనమాలి బ్లాగులో ఒక ఓల్డ్ ఏజ్ హోం గురించి రాసింది చదవండి. అసాలికి ఈ దేశంలో వారికి సర్విస్, టైం మానేజిమేంట్ గురించి ఎమి తెలుసని?
Deleteవనజ గారి బ్లాగ్ లో ఉంటే తప్పక చదువుతాను. నాకు తెలిసినంతవరకూ, డబ్బు ఉంటే మంచి old age homes India లో కూడా ఉన్నాయి అని విన్నట్టు గుర్తు. మీరు చెప్పినదే కనక నిజం అయితే,చాలా విచారించ దగ్గ విషయమే.
DeletePeople always think that the most
ReplyDeletepainful thing is
losing the one you love in your life..
The truth is.. the most painful thing is losing
yourself in the process of loving some one too much
forgetting that you are "Special" too
"పెళ్ళి, ప్రేమ జీవితంలో ఒక భాగం అవ్వాలి కాని, అవే జీవితం కాకూడదు"
మంచి విషయం చర్చించారండీ..
You made a valid point. "Don't loose yourself in the process of loving someone too much" very well said.
DeleteThanks for the comment రాజిగారు.
మీరు చర్చించిన విషయం, మనకో మనకు తెల్సినవాళ్ళకో జరిగే వుంటుంది. ఎందుకంటే ఈ సంఘటనల రేటు ఎక్కువగా వుంది.
ReplyDeleteఈ మద్యే నా మిత్రుడు "మిత్రుడు అని చెప్పుకోడానికి సిగ్గుగా వుంది", వాడు జనాలదగ్గర డబ్బులు గుంజి, కేసినో లో తగలేసి వాడు దారిలో వాడు పైకి పొయ్యాడు.
పొయ్యేవాడు పోకుండా కట్టుకున్న బార్యని, ఒక కొడుకును రోడ్ మీద వొదిలేసి పోతే, పాపం ఆ అమ్మాయి ఇంకా పడరాని పాట్లు పడుతుందు ఇక్కడ.
ఎన్ని దయనీయమైన గాధలు ......................గుండె తరుక్కపోతోంది ................
నేను ప్రస్తావించినవన్నీ నిజంగానే నా స్నేహితులకి జరిగిన సంఘటనలే!Very sorry to hear about your friend's family. Thanks for the positive response. మీ స్పందనకి ధన్యవాదాలు.
Deleteశీఘ్రవివాహాలే శ్రేయస్కరం-6
ReplyDeletehttp://kalagooragampa.blogspot.in/2012/03/6.html
I don't necessarily agree with some of the contents of this post you referred. But thanks anyway!
Deleteఏమిటో నాకు ఏమి అర్ధం అవటం లేదు.. జగమే మాయ బ్రతుకే మాయ...
ReplyDeleteమీరు మాకు మంచి తెలుగు పాటలు అందిస్తూ, హాయిగా పెళ్ళి చేసుకుని సుఖంగా ఉండండి.
Deleteఎక్కువగా అలోచించకండి!
/Life is more beautiful than just a relationship/
ReplyDeleteIt is okay in that particular situation.
Relationship is also a part of life. Would Life without any relationships(not just marital partner) be beautiful?! I don't know.
Ofocurse , relationship is part of life and core of the life when everything works out! My post only targets broken relationships.
Deleteజలతారు వెన్నెల గారు..ఓల్డ్ ఏజ్ హోం అంటూ పోస్ట్ ఏమి వ్రాయలేదు ..అని నాకు గుర్తు. ఈ పోస్ట్ చూడండి. వృద్దాప్యం లో అయిన వాళ్ళు ఉన్నా లేనట్లు..ఎలా అవస్థలు పడతారో..ఆఖరి దశ యెంత బాదాకరమో .. ! కుటుంబం ఉండాలి. అలాగే అన్ని సమయాలలో డబ్బు అవసరాలు తీర్చ లేదు. ముఖ్యంగా ..మానసిక అవసరాలు.
ReplyDeletehttp://www.vanajavanamali.blogspot.in/2012/02/blog-post_06.html
@ జలతారువెన్నెల గారు.. చాలా బాగుంది.
ReplyDeleteనిజమే... సునీత గారు.. చెప్పినట్టు.. "పెళ్ళి, ప్రేమ జీవితంలో ఒక భాగం అవ్వాలి కాని, అవే జీవితం కాకూడదు" కానీ... నాకు తెలిసి.. మనసులో ఒకరిని... వుంచుకొని... పెళ్లి అనే బంధం కారణంగా.. మరొకరితో.. జీవించే వాళ్ళని కొద్దిమందిని చూసాను... అలా పెళ్ళిచేసుకుని జీవిచడం అవసరమా?
మీరు చెప్పిన ఈ నిజాలు అన్నీ.... పెళ్లి అయిన తరువాత జరిగినవి... అదే.. పెళ్లి కాకముందు... అలా జరిగితే.. తనకంటూ ఒక జీవితం , దానికి ఒక అర్ధం ఏర్పరుచుకుని ముందుకు సాగానిస్తారా? :)
పెళ్లి పెళ్లి అని .... వాళ్ళకొక జీవితం (సంసారం) .. కుటుంబం దానికో అర్థం.. ఇవ్వటానికి.. ఎంతమంది.. వెంటాడుతారు? తల్లిదండ్రులేమో .. బాధ్యతలు తీర్చుకొవాలని, స్నేహితులేమో.. మాకూ ఓ కుటుంబం వుంది... నీదీ ఓ కుటుంబం ఐతే.. బాగుంటుందని.... చుట్టాలు.. పెళ్ళెప్పుడు అని :) బ్రతికుండగానే చంపేస్తారు కదండీ....
ఇక్కడ.. ఇండియాలో.. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని.. పెళ్లి చేసుకోకుండా వుండనిస్తారా?
ఒకవేళ అలా వుండాలి అంటే... ఏకాకిలా బ్రతకాలి.
మన తెలుగు వారు.. ఎంత సాధించినా.. పెళ్లి కాలేదని సూటిపోటి మాటలతోనే చంపేస్తారు కదండీ...
ఇక్కడ డబ్బు వుండాలి .. ఆస్తి వుండాలి.. పేరు వుండాలి.. కులం వుండాలి... కుటుంబం వుండాలి. :) మనస్సాక్షి లేకపోయినా పర్వాలేదు...
రాజి గారు చెప్పినట్టు.. "Don't loose yourself in the process of loving someone too much" - నిజమే..
పోయిన తరువాత తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం..... అది ఏది అయినా సరే..!!!
Life is God's gift. In my opinion, we need to live life to the fullest! అన్ని మనకనుకూలంగా జరగవు కదండి? ఎక్కడో చదివినట్టు గుర్తు.life is simple and we complicate it ...Don't hold on to your past..You are not going to gain anything out of it. Society norms చాలా ఉంటాయి...అవి మీకు బాధకరమైతే మూడో మనిషికి హాని చెయ్యనంత వరకు మీరు మీకు నచ్చినట్టే life lead చెయ్యచ్చు.ధన్యవాదాలు మీకు.
Deleteసున్నితమైన మనస్సు ఉన్న వాళ్ళకేనండీ ఈ భాదలన్నీ...దులిపేసుకు తిరిగే వాళ్ళకు ఏమీ ఉండవు.....కాబట్టి....జనాలందరూ రాతి మనస్కులై పోవాలని నా మనవి...
ReplyDeleteఒక రకంగా అలోచిస్తే, మీరు అన్నది నిజమే! బాధ కలగటం సహజం. కాని ఎంత తొందరగా అది మర్చి పోయి, జీవితం తో రాజి కి రాగలిగితే అంత మంచిది.ధన్యవాదాలు మీకు.
Delete