Friday, May 18, 2012

భిన్నాభిప్రాయాలు-స్పర్ధలు




సాయంత్రం ఏడు గంటలు దాటింది. ఆఫీస్ నుంచి లేట్ గా ఇంటికి వచ్చిన శాంతికి కిరణ్, హారిక డైనింగ్ టేబుల్ దగ్గర వాదించుకుంటూ కనిపించారు. విషయమేమిటా అని తను కూడా నెమ్మదిగా టేబుల్ దగ్గరికి చేరింది. కిరణ్ శాంతిని చూడగానే "ఇదిగో నీ కూతురి సంగతేంటో చూడు, ఆ బక్కెట్లో ఎవరితోనో గొడవట, దాని గురించి మూడ్ ఆఫ్ అంటుంది" అని. హారిక పగలబడి నవ్వుతుంది. "అమ్మా ... నాన్నకెన్ని సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ బక్కెట్ అంటారేంటీ? It's Tumblr Dad!....." అని అంది హారిక. "అదే ఏదో ఒకటి టంబ్లరో, చెంబో, తప్పాలాయో ఎదో ఒకటి లేమ్మా, పేరులో ఏముంది" అని హారికను ఇంకా ఉడికించాడు కిరణ్. సరే విషయమేమిటి అని అడిగింది శాంతి. "నేను చెపుతాను .." అంటూ మొదలుపెట్టాడు కిరణ్

"ఈ మధ్య పాపం అందరు ఐశ్వర్యారాయ్ లావైపోయింది అని బాధపడుతన్నారు కదా. నీ కూతురేమో ఐశ్వర్యారాయ్ మీద ఎదో రాసిందట ఆ బక్కేట్లో,అది ఎవరో స్నేహితురాలికి నచ్చలేదట, చాలా బాధపడుతూ స్పందించిందంట.ఆ స్పందన నచ్చక నీ కూతురు ఇక్కడ ఆవేశపడుతుంది. అందుకే కౌన్సల్లింగ్ చేస్తున్నా" అని చెప్పాడు. "ఏమని రాసావు హారికా,నీ స్నేహితురాలిని అంత బాధపెట్టేలా" అని అడిగింది శాంతి."నేనేమి రాయలేదమ్మా, ఏదో వెబ్సైట్ లో ఎవరో రాసింది నేను Tumblrలో రాసాను రెఫరెన్స్ ఇచ్చి,అయినా నీకు తెలుసు కదా నాకు ఐశ్వర్యారాయ్ అంటే ఇష్ట్టం లేదని" అని జవాబు ఇచ్చింది హారిక. "సరే ఇప్పటికన్నా చెప్పు ఏమిరాసావో .." అని అడిగింది శాంతి .వెంటనే లాప్టాప్ తెరిచి చూపెట్టింది హారిక. "Aishwarya Rai can never get it right. Too perfect, too plastic, too fake, and now, alas, too fat." అని ఉంది అందులో. హారిక వివరించసాగింది."అమ్మా ఇది నా అభిప్రాయం, ఇష్టముంటే చదవాలి,లేకపోతే లేదు,అంతే కాని నా స్నేహితురాలి స్పందన నాకు నచ్చలేదు." 

నవ్వుతూ అడిగింది శాంతి "ఇంతకి ఎమందేమిటి నీ స్నేహితురాలు?" అని."ఐశ్వర్యారాయ్ అంటే నాకు చాలా ఇష్ట్టం, ఇలాంటీవి పోస్ట్ చెయ్యకు. You hurt my feelings. లావవ్వడం, సన్నగా ఉండాలనుకోవటం ఐశ్వర్యా పెర్సనల్ విషయం అది, మధ్య నీకేమిటి ప్రోబ్లం"అని."నువ్వేమన్నావు మరి?"అని అడిగింది శాంతి."ఒక స్మైలీ టైప్ చేసాను"అని చెప్పింది హారిక.మరి ఇంకేమిటి సమస్య ?"అర్ధం కాక అడిగింది శాంతి కూతురిని. ఏముంది అక్కడ తన ఫ్రెండ్ ని ఏమీ అనలేక...ఇక్కడ నా దగ్గర సీమ టపాకాయలా ఎగురుతుంది" అని చెప్పాడు కిరణ్. "అమ్మా నువ్వే చెప్పు, ఎవరి అభిప్రాయాలు వారివి కదా? నేను తన గురించి ఎమీ రాయలేదు కదా, మరి తనకెందుకు అంత బాధ? Aiswarya rai is an actress and she is a public figure. సో నేను కామెంట్ చెయ్యచ్చు." అని సమర్ధించుకుంది హారిక. "పాపం అభిమానులు ఉంటారమ్మా..మరి వారిని నువ్వు బాధపెట్టిన దానివి అయ్యావు కదా..." అని నవ్వుతూ అంది శాంతి. 

 "ok, now stop both of you" అంటూ కిరణ్ కలగచేసుకున్నాడు. "అసలు అవసరం ఉన్న చోట, లేని చోట ఎందుకమ్మా అంతగా రియాక్ట్ అవుతావు హారిక? ఇది పెద్ద విషయమా? ఇక్కడ నువ్వు రాసిన దాన్ని, సమర్ధిస్తే నీకు ఆనందం, అదే విమర్సిస్తేనో, నచ్చలేదని చెపితేనో ,నీకు ఇష్ట్టం ఉండట్లేదు, నీ అహంకారాం దెబ్బ తింటుంది. అసలు దీని గురించి మనం ఇంత సేపు మాట్లాడుకోవాలా?నీ అభిప్రాయాన్ని నువ్వు వ్యక్తపరిచావు, నీ స్నేహితురాలికి అది నచ్చలేదు, నువ్వు నవ్వి ఊరుకున్నా, నీ మనసులో మాత్రం విపరీతమైన కోపం పెంచుకున్నావు.అది తప్పు.నీకు ఎలా నీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వాతంత్రం ఉందో, అలాగే నీ స్నేహితురాలు కాబట్టి నీకు నిష్కర్ష గా చెప్పింది ,నువ్వు రాసినది తనకి నచ్చలేదని. తన ఫీలింగ్స్ కి కూడా నువ్వు విలువ ఇవ్వాలి కదా?" ఆవేశంతో అంది హారిక 
"నేనేమీ తనని కామెంట్  చెయ్యలేదు  కదా, మధ్య తన కెందుకో అంత బాధ...అది నాకు నచ్చలేదు నాన్నా..." అంది. "పిచ్చిదానిలా మాట్లాడకు, ఇంతకు ముందు నీకు, తనకు ఉన్న స్నేహం అంతా ఈ ఒక్క సంఘటనతో తుడిచిపెట్టుకుపోతుందా?" అని తను కూడా అవేశంగా అడిగాడు కిరణ్. ""yeah , I don't like her anymore" అని నెమ్మదిగా చెప్పింది హారిక.

ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది శాంతి. తనకి నచ్చని మాట ఒక్కటి మాట్లాడితే ఇంక స్నేహాన్ని వదులుకుంటున్నట్లు మాట్లాడుతున్న హారికను చూస్తే ఆ నిమిషంలో భయమేసింది శాంతికి. రేపు మాట్లాడుకుందాము అని "ఇంక పడుకుందామా" అని ఆ సంభాషణ అంతటితో ఆపేసింది శాంతి. శాంతి అలోచిస్తూ ఉండిపోయింది చాలా సేపు. ఆ నిమిషంలో శాంతికి తన స్నేహితురాలు రమ్య గుర్తుకువచ్చింది. రమ్య , శాంతి ఒక ఆఫీస్ లో కలిసి పని చేసేవారు. ఇద్దరూ అమెరికాకి ఒకటే సంవత్సరంలో రావడం , ఒకే కమ్మ్యునిటీలో ఉండడం,ఇద్దరు ఇంచుమించుగా దగ్గర వయసు వారే కావటం వల్ల వారిద్దరు మంచి స్నేహితులయ్యారు. కిరణ్ , రమ్య భర్త కి కూడా స్నేహం కుదరటంతో ఇద్దరి కుటుంబాలు బాగా దగ్గరయ్యాయి. శాంతి, రమ్య ఇద్దరు ఏడు సంవత్సరాల వరకు, దేశం కాని దేశంలో  ఎంత బాగా సెట్టిల్ అవ్వగలమా అన్న అంశం మీద తప్ప ఇంకేది పట్టించుకునే  వారు కారు.తరవాత వారి ద్రుష్టి అంతా ఎదుగుతున్న వారి పిల్లల మీదే ఉండేది. మాట్లాడుకున్న, కలిసినా, వారికి పిల్లల చదువులు, యాక్టివిటీస్ తప్ప ఇంకేమి మాట్లాడుకునే వారు కాదు.


అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడు ఒక్కసారి కూడా ఇద్దరికి మాట తేడా కాని, ఒకరి వలన ఇంకొకరు బాధపడటం కాని జరగలేదు.ఇప్పుడు పిల్లల బాధ్యత లేదు ఇద్దరికి.శాంతి కూతురు, రమ్య కొడుకు కూడా వేరే స్టేట్స్ లో కాలెజ్ లో చేరారు. ఇప్పుడు రమ్య కి శాంతికి కావాల్సినంత టైం ఉంది, జీవితంలో ఏ లోటు లేదు. తీరిక ఎక్కువ ఉండటంతో ఇద్దరూ వారి పిల్లలు వాలంటీర్ చేసిన ఒక  హాస్పిటల్లో వారానికి మూడు రోజులు వాలంటీర్ చేస్తూ,ఉద్యోగాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఒక రోజున రమ్య చిరంజీవి పార్టీని కాంగ్రెస్స్ లో విలీనం చేస్తున్నాడని,పార్టీని ద్రుష్టిలో పెట్టుకుని అతను తీసుకున్నది మంచి నిర్ణయం అని రమ్య అంది. దానికి శాంతి ఏదో మార్పు తెస్తానని రాజకీయాలలో దిగాడు కదా, మరి అదేంటీ, పార్టీ ఓడిపోతే పోనీ తన సమయం అంతా సంఘసేవకి వినియోగిస్తూ, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసి నెగ్గి తను ఏవైతే ప్రజలకు చెయ్యాలనుకున్నాడో, అవన్ని చెయ్యొచ్చు కదా, ఇలా పార్టీని విలీనం చేసి, తను నమ్ముకున్న సిద్ధంతాల కన్నా, రాజకీయాలలో పదవి ముఖ్యమని నిరూపించినట్టే  కదా" అని అంది శాంతి.రమ్య దానికి విసురుగా.."అంటారమ్మ , ఎన్నైనా అంటారు, NTR రాజకీయాలలో కి వచ్చిన పరిస్తితులు వేరు, ఇప్పుడు వేరు.ఆ రోజుల్లో చిరంజీవి పార్టీ పెట్టినా తప్పక గెలిచేవాడు" అని అంది.శాంతికి మతిపోయినంత పనైంది.అదేంటి రమ్యా..అలా అనేసావు, నెనేమీ అసలు  NTR మాట ఎత్తలేదే. అది జరిగిపోయిన కథ. మనం మాట్లాడుకుంటున్నది ఈ రోజున చిరంజీవి పార్టీని విలీనం చెయ్యడం గురించి కదా..అసలు నీ నిష్టూరమేంటో నాకేమీ అర్ధం కాలేదు" అని అంది శాంతి. "ఏమీ లేదులే, let's change the topic" అని అక్కడితో ఆపేసింది రమ్య.


ఒక వారం రోజుల తరువాత కిరణ్ అడిగాడు శాంతిని, "నీకు, రమ్యకి 
ఎమన్నా మనస్పర్ధలు వచ్చాయా" అని. "అలాంటిదేమీ లేదే అని అంటూనే, వెంటనే అంది..మీకెందుకు వచ్చింది ఆ అనుమానం?" అని . కిరణ్ తనతో రమ్య భర్త చాలా ముభవంగా ఉంటున్నాడని చెప్పాడు.నిజమే , తను కూడా నాతో అంటి ముట్టనట్టు ఉంటుంది" అని అంది. కొద్ది వారాలలోనే పూర్తిగా శాంతితో మాట్లాడడమే మానేసింది రమ్య. అంతటితో ఆగక, వీరిద్దరు ఇతర స్నేహితుల ఇంట్లో కలిసినప్పుడు, అప్పుడు వరకు వారిద్దరి మధ్య లేని పోటీ మనస్తత్వాన్ని అందరు గమనించారు. అసలు నేనేమన్నానని, అంత మూర్ఖం గా నాతో మాట్లాడడం మానేసి, 17 సంవత్సరాల స్నేహాన్ని ఇలా ఒక్క వారం లో తుంచేసింది రమ్య అని శాంతి బాధపడని రోజు లేదు.


శాంతికి ఎంతో చెప్పి చూసాడు కిరణ్ "ఒకసారి డిన్నర్ కి పిలువు రమ్యని. అంతా అదే సర్దుకుంటుంది" అని. శాంతి ఒప్పుకోలేదు.తనే మాట్లాడడం మానేసింది, నేనెందుకు ఎదో తప్పు చేసిన దానిలా రాజికి రావాలి" అని "అయినా శాంతి నువ్వు ఎన్నిసార్లు రమ్యని భోజనానికి పిలిచినప్పుడు, రమ్యకి ఇష్ట్టమైన వంటలే చేసేదానివి కాని, పర్లేదులే నా ఇంటికి వచ్చింది కాబట్టి నాకు ఇష్ట్టమైన వంటలే తినాలి రమ్య అని అనుకోలేదుగా..ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిరుచి,కొన్ని స్థిరిమైన అభిప్రాయాలు ఉంటాయి.ఆ అభిప్రాయలతో మనం ఏకీభవించాలని లేదు, అలా అని వ్యతిరేకించనవసరమూ లేదు.కొంతమంది వారు నమ్మినదే వేదం అని వాదిస్తారు. విని ఊరుకోవడమే! వాదించి వారి దగ్గర మనం సాధించేదేమీ లేదు.ఇప్పుడు ఒక వేళ నువ్వు ఏదన్నా మంచి కార్యం తలపెట్టవనుకో, దాని వలన కొంత మందికి మేలు చెయ్యగలను అని నువ్వు అనుకుంటే, అప్పుడు నువ్వు చేసేదాన్ని సమర్ధించకుండా వితండ వాదన  చేస్తూ,తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించేవారికి నువ్వు నచ్చచెప్పే ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి.ఓపికగా వారు అర్ధం చేసుకునే వరకు వివరించాలి, డీబేట్ చెయ్యాలి. అంతే కాని రాజకీయనాయకుల గురించి, సినిమా ఏక్టర్ల గురించి,సినిమాల  గురించి ఈ శత్రుత్వాలేంటీ? ఇంత చదువుకుని సిగ్గుగా లేదు? 17 సంవత్సరాలుగా నీకు, రమ్య కి మధ్య ఉన్న స్నేహానికి అడ్డు రాని కులం, ఈరోజున ఇద్దరకి తీరుక ఎక్కువై, ఇలాంటివి మాట్లాడుకుని మనస్పర్ధలకు గురయ్యారు.వ్యక్తిగతంగా నీకు ఇప్పుడు కూడా రమ్య అంటే ఇష్ట్టమే, కాని అది నువ్వు ఇప్పుడు ఒప్పుకోడానికి సిద్ధంగా లేవు. ఆ రోజున రమ్య చిరంజీవి పార్టీ ని గురించి నీతో అన్నప్పుడు నువ్వెందుకు రమ్య కి చిరంజీవి అంటే ఇష్ట్టం కదా..అనవసరం గా ఇప్పుడు విమర్శించి తనను బాధ పెట్టాలి అని అనుకోలేదు? నవ్వి ఊరుకుంటే అంతా సర్దుకునేది కదా?" అని  అన్నాడు కిరణ్. "అదేంటి కిరణ్, నువ్వు కూడా నాదే తప్పు అన్నట్టు మాట్లాడతావు" అని అడిగింది శాంతి."తప్పు నీదా, రమ్యదా అని నేను తీర్పు ఇవ్వటం లేదు. నీకు తెలుసు రమ్య ఎంత మంచిది అన్నది,సరే తను అభిమానించేవారిని కించపరిచావని చిన్నబుచ్చుకున్న మాట కూడా వాస్తవమే!కాని నువ్వేమి చేసావు? తన మనసు నొచ్చుకున్నదని తెలిసి కూడా..నువ్వు కూడా మౌనం గా ఉండిపోయావు. ఇద్దరు నిజమైన స్నేహితుల మధ్య ఇగో ఉండదు, ఉండకూడదు.ప్రేమ ఉన్న చోట ఇగో ఉండదు.అందుకని రేపే వెళ్ళి రమ్య తో మాట్లాడు. మనుషులన్నాక భిన్నాభిప్రాయాలు ఉంటాయి.ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవిస్తూ, ఒకరి పట్ల ఇంకొకరు సహనంతో/Tolerance తో ఉండాలి.విమర్శ మంచిదే,కాని అవసరం ఉన్న చోట, అక్కర్లేని చోట విపరీతం గా ఒకరినొకరిని విమర్శిస్తూ , ఎత్తిపొడుచుకుంటూ మనం సంస్కారం గా ప్రవర్తిస్తున్నామా" అన్నాడు కిరణ్.


కిరణ్ చెప్పినవన్నీ నిజాలే అని తెలిసినా, కొద్ది రోజులదాక శాంతి మౌనంగా ఉండిపోయింది. తరువాత ఒక రోజున ఆఫీస్ లో మాట కలిపింది శాంతి. రమ్య కూడా సంతోషంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఇద్దరు ఒకరికొకరు క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. మళ్ళి ఇదివరకటిలా ఎమీ జరగనట్టే కలిసిపోయారు.ఇప్పుడు వారి మధ్య రాజకీయాల గురించి కాని, సినిమాల గురించి కాని, టాపిక్స్ రావు. వచ్చినా పెద్దగా వారు వాటిని పట్టించుకోరు.


పొద్దున లేవగానే హారికకు నెమ్మదిగా స్నేహం విలువ, ఒకరి అభిప్రాయాలను గౌరవిచటం గురించి విపులంగా చెప్పాలని నిర్ణయించుకుని నిద్రకు ఉపక్రమించింది శాంతి. 

34 comments:

  1. చాలా బావుందండి ! అభిప్రాయబేధాలు ఉండకుండా ఉండవు వాటిని దాటుకుని మరీ పెరిగిన బంధమే ఎప్పుడూ నిలుస్తుంది .

    ReplyDelete
    Replies
    1. శ్రావ్య గారు, అంతేనండి. బాగా చెప్పారు. మీకు ధన్యవాదాలు.Cloud computing -III ఎప్పుడు రాస్తున్నారు?

      Delete
  2. "మనుషులన్నాక భిన్నాభిప్రాయాలు ఉంటాయి.ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవిస్తూ, ఒకరి పట్ల ఇంకొకరు సహనంతో/Tolerance తో ఉండాలి."

    జలతారువెన్నెల గారూ.. మంచి విషయాలు చెప్పారండీ..

    ReplyDelete
    Replies
    1. రాజి గారు, బాగునారా? ధన్యవాదాలండి.

      Delete
  3. జలతారు వెన్నెల గారు బాగుందండి . విచిత్ర మేమంటే కొందరు నాయకులు, నటుల అభిమానం పేరుతో వాళ్ల అభిమానులు ఇలా కిచులడు కుంటారు కానీ ఆ నాయకులు, నటులు మాత్రం బాగానే ఉంటారు . ఒకరింట్లో పెళ్ళికి ఒకరు వెళతారు అభిమానుల మధ్య నేమో పచ్చ గడ్డి వేస్తె భగ్గు మంటుంది . స్నేహితుల మధ్య సాధ్య మయినంత వరకు కులం, మతం, పార్టీ, ప్రాంతం , అభిమాన నటుల వంటి చర్చ లేకుంటేనే మంచిది . స్నేహితుల ఇద్దరి అభిప్రాయం ఒకటే అయితే ఇబ్బంది లేదు . ఈ అంశాల్లో వేరు వేరు అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటి గురించి ఎక్కువగా చర్చించక పోవడం మంచిది .

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పినవన్నీ అక్షరసత్యాలు మురళి గారు. బారత దేశ సంస్కృతి బిన్నత్వంలో ఏకత్వం అనేదానికి ఉదాహరణ అని చెప్పేవారం. ముందు తరాలుకు కూడా ఇలాగే చెప్పుకున్నేట్టు మనం ఉండాలి కదండీ!మీకు ధన్యవాదాలు.

      Delete
  4. శాంతి గారు లేవగానే మారు మనస్సు పొందిన౦దుకు నా good morning చెప్పండి

    "తన మతమేమో తనదీ మానమత మసలే పడదోయ్...."
    నుంచీ "మనసుంటే మార్గం ఉంటది" అనిపించింది.

    నేను హైదరాబాదు లో ఉద్యోగం చేసేప్పుడో వారాంతపు సెలవుల్లో మావూరు వెళ్ళేవాడిని,
    ఇవాళ రాత్రికి నా ప్రయాణం ఉంటుందా లేదా అనేది సాయంత్రం వరకు తెలిసేది కాదు,
    ఇక reservation కి చోటే లేదు, ఇక మా middle class నేల విమానం (రేపల్లె రైలు ఎక్కేవాడిని)
    అక్కడ గొడవ పాడనీ berth ఉండేది కాదు, ప్రతి భోగీలో కనీసం seats కోసం ఒకరిద్దరైనా గొడవ పడుతూనే ఉండేవారు రాత్రంతా...
    మధ్యలో మటుకు కొందరు seat లు దొరకిన వారు ఇలా అనేవారు
    "కాసేపు ప్రయాణం చేసి ఎవరిదారిన వారు వెళ్ళే వాళ్లం ఈ మాత్రపు భాగ్యానికి ఇంత గొడవెందుకు" అని...
    నాకు ఈ dialogue నాకు no of times విని విని noted అయ్యిపోయింది,,,

    మళ్ళీ ఎవరి నోటనైనా ఆ dialogue వినిపిస్తే ,,,,
    అవును కదా! ఏదో వందేళ్ళు అనే కొంత కాలం కలిసి journey చేసేవాల్లమే మనం అంత
    ఈ వందేళ్ళల్లో కూడా యావత్ జీవితం ఏ వోక్కరిద్దరితోనైనా కలసి నడుస్తామో లేదో తెలియదు.
    ఇంతోటి దానికి ఇంత ఆపార్థాలు నిష్టూరాలు ఎందుకో? ఏమో! అనిపిస్తుంటుంది...

    post బాగుంది,

    ?!

    ReplyDelete
    Replies
    1. ఏంటి రమ్య good morning చెప్పకర్లేదా మీకు. ఇదిగో ఇదిగో మీరు రమ్యని అవమానిస్తున్నారు సుమీ! Just kidding అండీ! మీరు చెప్పినట్టు అప్పార్ధాలు, నిష్టూరాలు లేకుండా సహజీవనం చెయ్యగలగాలి అందరమూ!మీకు ధన్యవాదాలు.

      Delete
  5. వెన్నెల గారు, మంచి సబ్జెక్టును ఎన్నుకున్నారు. మనం చెప్పేదే కరెక్ట్ అని, మనం చెప్పేదే వినాలనుకోవడం తప్పు. ఎవరి అభిప్రాయాలు వారివని సద్దుకుపోతే ఏ గొడవలు రాకుండా వుంటాయి. మన బ్లాగ్ లోకంలో కూడా రకరకాల పెడర్థాలు తీస్తుంటారు. అలాంటి కామెంట్లను పట్టించుకోకపోవడమే మంచిదనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. ఈ విషయం ఈ మధ్యనే తెలుసుకున్నాను నాగేంద్ర గారు. మంచి సలహా ఇచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  6. Replies
    1. భాస్కర్ గారు నా కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  7. జలతారువెన్నెల గారు,
    మీ భి..స్ప...పోస్ట్ చదివిన తరువాత ,
    నా విద్యార్థి దశ లో చదివిన మాలతి చందూర్ గారి
    ఓ "జవాబు" గుర్తుకొచ్చింది. అదేంటన్టే-స్నేహం అంటే ఏంటి అనే ప్రశ్నకు
    చందూర్ గారిచ్చిన సమాధానం-భిన్నాభిప్రాయాలతో,భిన్న దృక్పదాలతో ఉంటూ,
    ఒకరి అభిప్రాయాలను,అభిమతాలను ఒకరు గౌరవించుకుంటూ, కలసి మెలసి ఉండడమే "అని.
    ఈ విషయాన్నే అన్నీ మానవ సంబంధాలకు అనునయించుకుంటే సరిపోతున్దనేది నా ఉద్దేశ్యం.ఏమంటారు?!

    ReplyDelete
    Replies
    1. మీ ఉద్దేశ్యం సదుద్దేశమే అంటాను. తప్పక అందరమూ ఆ విధంగానే నడచుకోవాలి అని నా ఉద్దేశ్యం కూడా హరిగారు! మీకు ధన్యవాదాలు.

      Delete
  8. వెన్నెల గారూ...మంచి అంశం ఎంచుకున్నారు. చెప్పిన విధానం చాలా బావుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జ్యోతి గారు. మీ ప్రశంస ఈ కథకే వన్నె తెచ్చింది. ధన్యవాదాలు మీకు.

      Delete
  9. బాగా చెప్పారు. ప్రపంచంలో అన్ని విషయాల్లోనూ ఏ ఇద్దరి అభిప్రాయాలూ ఒకేలా ఉండవు. అటువంటప్పుడు ఇలాంటి మనస్ఫర్థలు మామూలే. కానీ అవి మనుషులని దూరం చేసుకునేదాకా వెళ్ళకూడదు. అయినా ఎవరో థర్డ్ పర్సన్ వలన ఇద్దరు స్నేహితులు విడిపోవడం కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటుంది నాకు.

    ReplyDelete
    Replies
    1. మీతో నేను ఏకీభవిస్తున్నాను రసజ్ఞ గారు.ధన్యవాదాలు మీకు.

      Delete
  10. ఆశ్చర్యం గా అనిపించింది. ఇంతటి చిన్న విషయాలు కూడా మనుషులని విడదీసే దాకా వెళతాయా? ఏది ఏమైనా మీరు చెప్పిన విధానం బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ సందేహం సరైనదే! కాని, ఒక్కోసారి అంతేనండి. చాలా చిన్న విషయంలో బేధాభిప్రాయాలతో ఎంతో విలువైన స్నేహాలను పోగొట్టుకుంటారు చాలా మంది.ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు.

      Delete
  11. ఇద్దరు స్నేహితుల మధ్య అన్ని విషయాలలో ఏకాభిప్రాయం అసాధ్యం. ఆలూ మగలకే అది సాధ్యం కాదు. చిన్న విషయానికి విడిపోయేది స్నేహంకాదు. వారు మళ్ళీ కలిసేరన్నది, నిజమైన స్నేహం, కలవడం కోసం బాధపడ్డారన్నది నిజమైన బాధ.

    ReplyDelete
    Replies
    1. ఈ రోజు సుదినం! బ్లాగులలోకానికి, నా బ్లాగ్ కి మళ్ళీ మీకు స్వాగతం!ధన్యవాదాలు శర్మ గారు

      Delete
  12. చల్లనివెన్నెల గారు
    ఒక సున్నితమైన విషయాన్ని ఎంత చక్కగా వివరించారండి
    మన మనోభావాలను వ్యక్తపరిచి అందరూ వాటితో ఏకీభవించాలనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం.
    ఈ విషయం బ్లాగులలో అప్పడప్పుడు కనిపిస్తుంది
    మీరన్నట్లు నిజమైన స్నేహంలో స్పర్దలకు చోటులేదు
    ఒకరిభావాలను ఇంకొకరు గౌరవించగలిగిన వారే నిజమైన స్నేహితులు

    ReplyDelete
    Replies
    1. మీ హృదయపూర్వక స్పందనకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు

      Delete
  13. Replies
    1. వెన్నెల గారూ మే భావాలు చాల సున్నితంగా ఉంటాయి. మీరు ఏమి చెప్పినా అర్ధవంతంగా ఉంటుంది , స్పందించే హృదయం మీది అది అలాగే నిర్మలంగా ఉండాలని కోరుకుంటున్న

      Delete
    2. ఆత్మీయమైన మీ స్పందనకు మనస్పూర్తిగా ధన్యవాదాలు ఫాతిమా గారు.

      Delete
  14. vennela gagu mee prati post lo mee sunnitham kanipisthundi

    ReplyDelete
    Replies
    1. మీ ప్రొఫైల్ pcture లో పాప ఎంత బాగుందో!!ధన్యవాదాలు ఫాతిమా గారు..

      Delete
  15. ముందు ఇంత వ్యాసాన్ని ఓపిగ్గా వివరించిన మీకు అభినందనలు.మీరు ప్రస్తావించిన అంశాలు చాలా మంది జీవితాల్లో జరుగుతుంటాయి.చర్చ వాదన అని ఒక పోస్ట్ ఇంతకు ముందు ముందు వ్రాసాను.మీరు కథారూపం లో చక్కగా వివరించారు.సినిమా,రాజకీయం,క్రికెట్ వీటిల్లో ఎవరి అభిమానాలు
    వారికి ఉంటాయి.ఎక్కువగా వీటితో చర్చల్లో జనం కాలం గడిపేస్తుంటారు .

    ReplyDelete