Friday, May 4, 2012

కలయా నిజమా..




శుక్రువారం సాయంత్రం స్నేహితురాలిని కలిసి డిన్నర్ చేసాక మళ్ళీ కలుద్దామని తనకి చెప్పి నేను కార్ దగ్గరికి రాగానే, ఏదో పాటల సీడి ఉంది ఇస్తాను ఉండు అని ఇచ్చింది. నేను డ్రైవ్ చేస్తూ సరే ఇచ్చింది కదా విందామని పెట్టాను. ఎందుకో రాత్రి 10:00 గంటలు దాటింది, రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ లేదు. ఎవో కొన్ని పాటలు వచ్చాయి, కొత్త సినిమాల్లోవే అనుకుంటా, ఇంతలో ఈ పాట మొదలయ్యింది.. కలయా నిజమా.. అంటూ.. ఈ పాట ఎవరు పాడారో, గొంతు చాలా బాగుంది అనుకున్నాను. పాట చాలా నచ్చేసింది నాకు. మళ్ళీ మళ్ళీ విన్నాను.సినిమా చూడలేదు కాని, హనుమంతుడు పాడిన పాట అని గ్రహించాను. కొన్ని నిమిషాల పాటు నా మనసు ఒక తెలియని పారవశ్యం తో నిండిపోయింది.ఇంటికి వచ్చాక ఏంటో దేవుడి పాట కదా, దాని మహిమ అనుకున్నాను.కాని అలోచిస్తే నేను పరవశించింది ఆ పాట సంగీతానికి, ఆ పాట పాడిన వారి గొంతులోని మాధుర్యానికే కాని,భక్తి పాట అని కాదేమో ? ఎదైతేనేంటి మంచి పాట విన్నాను కదా అనుకున్నాను.ఈ పాట పాడింది ఎవరో టిప్పు అట..ఇంతకు ముందు ఇంత మంచి పాటలు వచ్చాయో లేదో కాని ఈ పాట మాత్రం చాలా బాగా పాడాడు. సినిమాలో ఎలా చిత్రీకరించారో ఈ పాట.

కలయా నిజమా వైష్ణవ మాయా
అవునా కాదా ఓ ముని వర్యా
జరిగేదేదీ ఆపగలేను..జననీ వ్యధని చూడగ లేను.
కలయా నిజమా…

పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా.. 
సీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యా. 
సిరి మల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా.. 
ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా.. 
కడలే దాటి కలిపిన నేనూ ఇప్పుడూ ఈ తీరు కు ఏమైపోను. 
శ్రీ రామ ఆజ్ఞ ఎదురించ లేను
దారి ఏదీ తోచదాయే తెలుపుమయ్యా.



24 comments:

  1. శ్రీ రామరాజ్యం లో అన్ని పాటలు మళ్ళీ మళ్ళీ వినాలినిపించేవె. కీరవాణి బాణీలు అమృత వర్షాలు......

    ReplyDelete
    Replies
    1. నేను వినలేదు ఇప్పటివరకు రాంగారు. ఫ్రెండ్స్ అంతా పాత లవ కుశ తో compare చేసి, బాగున్నయి, బాగోలేవు, అంత బాగోలేవు అని కామెంట్స్ చేస్తుంటే, సరే విన్నొచ్చులే అనుకున్నాను. ఈ ఒక్క పాట వినడం జరిగింది. వినాలి అన్ని!

      Delete
  2. బాపు, రమణల దృశ్యకావ్యం 'శ్రీ రామరాజ్యం' చిత్రంలోని పాటలన్నీ బాగున్నాయి.
    ఇళయరాజ గారి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. మంచి పాటను గుర్తుచేసినందుకు
    ధన్యవాదాలు వెన్నెల గారు!

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా వింటానండి పాటలన్ని.సినిమా కూడా చూడాలి, అనుకున్నాను, చూడలేకపోయాను.ధన్యవాదాలు నాగేంద్రగారు

      Delete
  3. అలోచిస్తే నేను పరవశించింది ఆ పాట సంగీతానికి, ఆ పాట పాడిన వారి గొంతులోని మాధుర్యానికే కాని,భక్తి పాట అని కాదేమో ?

    Good Good

    Keep this analysis (enquiry)

    ?!

    ReplyDelete
    Replies
    1. అనుకున్నానండి మీరు ఈ ప్రశ్న ఈ పోస్ట్ చూస్తే తప్పకుండా పట్టుకుంటారని. చాలా సార్లు నేను ఆ సంధిగ్దం లో ఉంటాను. దెవుడి పాట కాబట్టి ఎమన్నా పారవశ్యమా అని. కాని కాదేమొ, సిరివెన్నెల గారి, "ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో" అని విన్నా అదే ఫీలింగ్ ఆ అంతర్యం నాకు ఇంకా బొధ పడలేదు.

      Delete
  4. కలయా నిజమా అంటే కూలీ నెం 1 అనె సినిమాలో ఒక పాట వుందండీ ఆ పాటేమో అనుకున్నాను కానీ ఇది భక్తి పాట ఐనా బాగానే వుందిలెండి..

    ReplyDelete
    Replies
    1. నిన్న youtube link కోసం వెతుకుతుంటే ఆ పాట కూడా కనిపిస్తే విన్నానండీ.అది కూడా ఇలయరాజా గారి పాటే అనుకుంటా!

      Delete
  5. @వెన్నల గారు మీ సందిగ్ధం మిమల్ని మీరు తెలుసుకునేలా చేస్తుంది....ఎంతో మంచి అలవాటు... ఇక నా అభిప్రాయం ఏంటంటే..... భక్తి భావన అన్నది మనలోనే ఉంటుంది... ఇంకోటి ఇప్పుడు హనుమంతుడు రామ అనే సబ్దము వింటే చాలు అది ఎవరు పలికినా ఎలా పలికినా పారవశ్యానికి లోనయ్యి తను తాను మరచిపోతుంటాడు... అందరికి తెలిసిందే... అది నిజమైన భక్తిగా పరిగణించవచ్చు.... అదే మనము వింటే వింటాము మహా అయితే తలచుకుంటాము కాసేపు అంతే కదండి... కాబట్టి భక్తి అనేది ఒక భావన ... ఉంది అనుకుంటే ఎందులోనైన ఉంటుంది చేట్టులోను పుట్టలోను రాయిలోను ..ఇంకా దానికి రూపం కూడా ఉండాల్సిన అవసరం లేదు అది ఒక అనంతమైన శక్తీ ... లేదు అనుకుంటే ఎక్కడా ఉండదు అది మహా విగ్రహమైనా సరే గుడిలోనైన సరే ... మంచి విషయాన్ని ప్రస్తావించారు ధన్యవాదాలు ... :)

    ReplyDelete
    Replies
    1. కల్యాణ్ గారు మీరు చెప్పినదానిలో చాలా నిజం ఉంది. భక్తి కూడా భావన నిజమే!
      ఎన్నో రకాల భావనలను మనసుని తాకేలా రాసే గేయ రచయితలు, పాడి పరవశింప చేసే గాయకులు వల్ల మనం ఈ అనుభూతిని పొందుతాము. ఉదాహరణకు ఈ పాట విన్నాను. నాకు హనుమంతుడు ఎంతో బాధతో సీతమ్మ వారి గురించి, రాముల వారి గురించి పడే వేదన, నన్ను కదిలించిందేమొ అంతగా!!మీ కామెంట్స్ కి మరొక్కసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు.

      Delete
    2. " నాకు హనుమంతుడు ఎంతో బాధతో సీతమ్మ వారి గురించి, రాముల వారి గురించి పడే వేదన, నన్ను కదిలించిందేమొ అంతగా" - నిజం అదే అయుంటుంది కారణం

      Delete
    3. vennela garu meedi chala sunnitha hridayam

      Delete
  6. హనుమ భక్తిలో రామ సీత పట్ల ప్రేమ కూడా అన్ని చోట్లా కనిపిస్తుంది...
    రవీంద్రుని గీతాంజలిలో చూడండి...భక్తితో పాటు ప్రేమ కూడా కనిపిస్తుంది...
    హనుమకి కేవలం భక్తే ఉంటే ఆయన గుండెల్లో సీతారాములు కనిపింహేవారు కారేమో...
    హనుమ పంచముఖాలు కనిపించేవి వీర్వేరుగా కనిపిస్తాయి గాని అసలు పంచ ముఖాలంటే...
    వేరుగా కనిపించినా ఒకటే అయిన 'సీ' 'తా' 'రా' 'ము' 'లు'...
    బాపు చూపిన హనుమ కొత్తగా ఉన్నా చిత్రంలో బాగుందండీ!
    మీ విశ్లేషణ బాగుంది వెన్నెలగారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. మంచి విషయాలు తెలిపారు. ధన్యవాదాలు శ్రీ గారు!

      Delete
  7. Replies
    1. అదే నేను అనుకున్నానండి!ధన్యవాదాలు రవిశేఖర్ గారు!

      Delete
  8. ఈ పాట విని వచ్చిన సందేహాలన్నీ ఇళయరాజా మాజిక్ అండీ...సింపుల్...ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకుపోతాడు...గాడ్ ఆఫ్ మ్యూజిక్....ఆయన పాటలు వింటూ మరో ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు...

    ReplyDelete