Thursday, June 7, 2012

I love India



హమ్మయ్య చూస్తుండగానే వీకెండ్ మళ్ళీ వచ్చేసింది అని మనసులో అనుకుంటూ శుక్రువారం వర్క్ కి బయలుదేరింది స్నేహ.బ్లాక్ బెర్రిలో రోజంతా ఎన్ని మీటింగ్స్ ఉన్నాయో అని కాలెండర్ చూసుకుంది స్నేహ. వెళ్ళగానే కండక్ట్ చెయ్యాల్సిన WIP/SCRUM మీటింగ్,తర్వాత చిన్న చితక మీటింగ్స్ తప్ప ఏమీ లేవు అని ఆనందం తో ఉప్పొంగిపోయింది.డ్రైవ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడ వద్దు అని రోజు లెక్చర్  ఇస్తున్న శ్రీవారి ఆజ్ఞను లెక్కచేయకుండా స్నేహితురాలు వినీల కు ఫోన్ చేసింది. "ఏంటి సంగతి? evening plans ఏంటి?" అని అడిగింది హుషారుగా."What? అప్పుడే weekend వచ్చేసిందా?"అంటూ ఫోన్ లోనే తన అపనమ్మకాన్ని వెల్లడి చేసింది వినీల.  వినీల గొంతులో కూడా ఉత్సాహం గమనించింది స్నేహ."అవును ఏం చేద్దాం?ఇప్పుడే ప్లాన్ చేద్దామా? లేక సాయంత్రం కలుసుకున్నాక decide చేదామా?" అని. "anything is fine with me. ఇప్పుడైతే ఇంకో 15 నిమిషాలు మాట్లాడగలను" అంది స్నేహ. "సర్లే నేను ఉమకి, ప్రీతి కి కూడా కాల్ ఇచ్చి మళ్ళీ కాల్ చేస్తాను అంది" వినీల. అలా అయితే కాల్ వద్దు,text ఇవ్వు , నేను morning meetings అయ్యాక కాల్ చేస్తాను" అంది స్నేహ . "అలాగే" అని ఫోన్  పేట్టేసింది వినీల.

ఆఫీస్ లో అడుగుపెడుతూనే మీటింగ్ లో"నిన్నేమి చేసారు,ఈ రోజేమి చేస్తున్నారు,ఎమన్నా అడ్డంకులున్నాయా"లాంటి చచ్చు  ప్రశ్నలు టీం కి వేసేసి,వాళ్ళందరి మొఖంలో ఎప్పుడు కనిపించే నిరాసక్తత,నిర్లక్ష్యాన్ని గమనించి కూడా గమనించనట్లు ఒక నవ్వు పులుమేసుకుని మొక్కుబడిగా మీటింగ్ కానిచ్చేసింది స్నేహ.శుక్రువారం వచ్చిందంటేనే మనస్సు పని మీద లగ్నం అవ్వదు.చేసేవన్నీ మొక్కుబడి పనులే ఆ రోజు. ఒక్కోసారి అలోచన్లో పడుతుంది స్నేహ,వారమంతా ఏమి ఊడపొడిచేసామనో ఇలా శుక్రువారం వచ్చేసరికి గాల్లో తేలిపోతున్నట్టు,హాయిగా,హుషారుగా ఉంటుంది ప్రాణం అని.వారమంతా టంచనుగా 8:00 గంటలకే ఆఫీస్ కి రావడం,అనంతమైన ట్రాఫిక్ లో గంటకు పైగా డ్రైవ్,తరువాత రోజంతా ఎడతెరిపి లేకుండా మీటింగ్స్,భరించి ఇంటికి వెళ్ళేసరికి, మళ్ళి "డిన్నర్ కి ఏంటీ ఈ రోజు?" అని అడుగుతారు ఇంట్లో..సరే...ఆ డిన్నర్ సంగతేదో తేల్చాకన్నా కొంచెం రెస్ట్ దొరుకుతుందనుకుంటే,నిద్రాదేవి కరుణించేస్తుంది.పడుకునేటప్పుడు కూడా రేపు గురించేదో చింత.అలా అని ఏదన్నా లోటు లేదా బెంగ ఉందా అంటే,ఏమీ లేదు..ఎందుకు అంత  stress వారమంతా అంటే మరి ...అదంతే!అందుకే శుక్రువారం రావడం తోనే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది..రాబోయే రెండు రోజులు, హాయిగా రిలాక్స్ అయ్యి, తన పనులన్ని తన పేస్ లో చేసుకోవచ్చు అని ఆనందం..

గత ఆరు నెలలలుగా క్రమం తప్పకుండా ముగ్గురు స్నేహితులను శుక్రువారం సాయంత్రం కలవడం ఒక అలవాటుగా మారిపోయింది స్నేహకి.ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి,వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి, స్నేహితురాలను కలవడానికి వెళ్ళిపోతుంది స్నేహ.రాత్రి 11:30/12:00 గంటల వరకు కబుర్లెన్నో చెప్పుకుని, సాధక బాధలు వెళ్ళగక్కుని, ఒకరిని ఒకరు "కష్టాలు కలకాలం ఉండవు"అని ఓదార్చుకుంటూ,ఆడవారి అరోగ్య రహస్యమైన గాసిప్పింగ్ పుష్కలం గా చేసుకుని, ఒక ఎజెండా లేని మీటింగ్ లా గడపడం అలవాటు చేసుకున్నారు ఆ నలుగురు స్నేహితులు.అలాంటి ఒక శుక్రువారం సాయంత్రమే అయినా,ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది.అది ఏంటంటే ఈ రోజు వాళ్ళ మీటింగ్ కి ఒక ఎజెండా ఉందండోయి!

సాయంత్రం నాలుగు కొట్టగానే,ఇంటికి బయలుదేరింది స్నేహ.అర గంటలో నలుగురు కలవాలనుకుంటున్న అడ్డా లో కలిసారు.ఎక్కడికన్నా Indian punctual Time ( లేట్ గా వెళ్ళడం) ప్రకారం వెళ్ళడానికి వీరు జంకరు  కాని,ఈ శుక్రువారం మీటింగ్ కి మాత్రం టంచనుగా అనుకున్న టైం కి కలుస్తారు.కొంచెం లేట్ అయినా మిగతా వారు ఏమి చెప్పేసుకున్నారో,నేను మిస్సైపోయానే అని విలవిలలాడిపోతారు.ఎవరికి కావల్సిన డ్రింక్స్ వాళ్ళు తెచ్చుకుని,మాటల్లో పడ్డారు.వినీల ఉమ వంక చూస్తూ అడిగింది "చెప్పు,ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు?" ఈ వారం కొంచెం మూడ్ బాలేదు. దివ్య కి వాళ్ళ నాన్న కి గొడవ. ఇప్పుడు సర్దుకుంది, కాని దివ్య మాతో చాలా ఫ్రాంక్ గా చర్చించిన కొన్ని విషయాలు ఎందుకో బాగ కలవరపెడుతున్నాయి నన్ను" అని అంది.దివ్య ఉమ కూతురు.కాలేజ్ లో మూడవ సంవత్సరం chemical engineering చదువుతుంది.చాల పద్దతిగా పెరిగిన దివ్య అంటే అందరికి చాలా ఇష్టం. చాలా బాగా పెంచావు ఉమా నీ కూతురిని అని ఎవరన్నా అంటే నా గొప్పతనం ఏమీ లేదు,అది సహజంగానే బుద్దిమంతురాలు అని సమాధానమిస్తుంది ఉమ.నిజమే ఒక్కోసారి దివ్య ని చూస్తే ఉమ అన్నా చెపుతున్న మాటలు నిజమే అనిపిస్తుంది.

"ఉమా వివరంగా చెప్పు? ఏంటి సమస్య?"అని అడిగింది స్నేహ."ఈవారం మొదట్లో దివ్య నాకు ఫోన్ చేసి తనకి 1000$ కావాలని అడిగింది."అన్ని డాల్లర్స్ ఎందుకమ్మా నీకు?"అని అడిగాను."నేను ఇండియా పంపించాలి"అని అంది.అర్ధం కాలేదు నాకు."ఇండియా పంపడమేమిటి ఎవరికి?"విస్తుపోయాను నేను."అమ్మా అన్ని వివరాలు తర్వాత చెపుతాను,నువ్వు నాన్నను కూడా అడిగి నాకు ఎలా పంపుతావో చెప్పు,ఇప్పుడు క్లాస్ ఉంది నాకు అని ఫోన్ పెట్టేసింది దివ్య.సరే అసలు దివ్యకి ఇంత హట్టాతుగా డబ్బు అవసరమేమిటా అని అనుకుంటూ,ప్రదీప్ కి ఫోన్ చెసాను.ప్రదీప్ పూర్తిగా వినకుండానే,కూతురు డబ్బు అడిగిందని తెలియగానే,పంపించేదాము అని చెప్పేసాడు.సాయంత్రం మళ్ళి దివ్య ఫోన్ చేసింది.ఈసారి,ప్రదీప్ కాల్ తీసుకున్నాడు."ఏంటమ్మా? money అడిగావంట కదా, బాంక్ లో ఉన్నాయమ్మ,నువ్వు విత్ డ్రా చేసుకో!"అని చెప్పాడు ప్రదీప్.ఏదో అడగాలి కదా అన్నాట్టు "ఎందుకమ్మా ఇప్పుడు డబ్బు నీకు"అని అడిగాడు."ఇండియా పంపాలి నాన్నా..ఒక ఫ్రెండ్ మనీ రెయిస్ చేస్తొంది,someone is fighting for life."అని చెప్పింది దివ్య.అప్పుడు కాని అర్ధం కాలేదు ప్రదీప్ కూతురు ఆ డబ్బు తన కోసం కాక ఎదో చారిటి కోసం అడిగిందని.వెంటనే అడిగాడు,"అసలు ఎవరా ఫ్రెండ్?నువ్వు డబ్బులు ఎందుకు పంపాలి? అది కూడా ఇండియాకా?నిన్నెవరో బాగానే బుట్టలో వేసారు"అని కూతురితో అన్నాడు ప్రదీప్. "Are you saying I can't trust my friend?" అని ఎదురు ప్రశ్న వేసింది దివ్య. "అది కాదమ్మా,అసలు ఎవరా ఫ్రెండ్?ఇండియా లో నీకు ఫ్రెండ్ ఏంటి? నిన్నెందుకు money పంపమంటుంది?"కొంచెం వివరంగా చెప్పు అడిగాడు ప్రదీప్.

లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు చంటక్క పరిచయం చేసింది ముంబై లో.తను కూడా undergrad చేస్తుంది.పేరు మెహక్.అప్పుడు పరిచయం నాకు.We were in touch and she is one of my very good friends. మొన్నీమధ్య వాళ్ళ maid servant's son, met with a terrible accident and he is fighting for his life and money has to be raised for his opeartion as they cannot afford such huge amounts for the surgery.మెహక్ చాలా money రెయిస్ చేసింది.కాని ఇంకా Rs.50,000 తక్కువయ్యాయట.నన్నుఅడగలేదు కాని,చాలా upset గా ఉంది గత కొన్ని రోజులుగా.నేనే చెప్పాను money పంపుతానని" అంది దివ్య.ప్రదీప్ కి చాలా కోపం వచ్చింది."దివ్యా..నిన్ను మోసం చేయ్యడం చాలా తేలిక.అసలు నీ ఫ్రెండ్ చెప్పింది కట్టు కథ కాదు అని నమ్మకమేమిటి? నీకు తెలియదమ్మా.అలా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు పంపకూడదు. ముందు ఆ మెహక్ చెప్పినవన్ని ఎంత వరకు నిజమో కనుక్కున్నాక  కాని డబు పంపద్దు. నేను కనుక్కుంటాను. నాకు మెహక్ వివరాలు ఇవ్వు."అని నెమ్మదిగా చెప్పాడు ప్రదీప్. 


దివ్య కి వెంటనే కోపం వచ్చి,"నాన్నా..నేను చెపుతున్నాను కదా? నా మీద నమ్మకం లేదా? లేక నేను సరిగ్గా మనుషులను assess చెయ్యలేననుకుంటున్నారా? అయినా నేను అడిగింది 1000$. ఒక వేల నేనే shopping కనో, ఏదన్నా expensive stuff కొనుక్కోవాలనో అడిగితే అప్పుడు నన్ను ఒక్క ప్రశ్న కూడా వెయ్యరు, పైగా ఇంకా కావాలా అని అడుగుతారు.అదే ఏ గుడికో డొనేషన్ ఇమ్మంటే మాత్రం ఒక్కసారి కూడా అలోచించకుండా ఇచేస్తారు.మీరు గత పది సంవత్సరాలుగా మన state లో వెలసిన అన్ని Temples కి ఎంత డొనేషన్ ఇచ్చారో అలోచించండి.TANA కి ఎన్ని సార్లు డొనేట్ చేసారో, ఇండియా లో తిరుపతి హుండిలో వేసిన 10,000 డాలర్లు ఇవన్ని గుర్తే నాకు.అలాంటిది ఈ రోజు ఒక ప్రాణం నిలబెట్టడానికి అడిగితే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారా నన్ను? అదే ఇక్కడ ఎవ్వరికన్నా అలా జరిగితే అవసరం అయితే money డొనట్ చెయ్యరా మీరు? ఇండియా అంటేనే ,do you think we cannot trust anyone there? మీకు మెహక్ గురించి తెలీదు నాన్నా.తను ఈ surgery కి 4.50 lakhs పూల్ చేసింది.Rs.50,000 తక్కువయ్యాయి.అయినా నా internship money ఉంది కదా , అది ఇవ్వండి.మీ డబ్బులు అవ్సరం లేదు" అని తేల్చి చెప్పేసింది దివ్య. "అది కాదమ్మా, నువ్వు ఇంకా చిన్న పిల్లవు, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.నేను ఇవ్వను అని అనడం లేదు, కాని కొద్దిగా వాకబు చేసి ఇద్దాము అన్నానమ్మా..సరే..నీ ఇష్టం వచ్చినట్టే కానిద్దాము. వీలైనంత తొందరలో డబ్బు పంపిద్దాము" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ప్రదీప్.


ఆ రోజు రాత్రి మళ్ళీ  ఫోన్  చేసి, ఇంకో అరగంట మాట్లాడింది దివ్య వాళ్ళ నాన్న తో. "నాన్న , నువ్వు నాకోసం సరే అన్నావు అని నాకు తెలుసు, నాకు అది ఎంత మాత్రం తృప్తి ఇవ్వడం లేదు.నువ్వు మనస్పూర్తిగా ఇచ్చినప్పుడే నాకు తృప్తి" అని చెప్పింది. "లేదమ్మా,ఈ డబ్బులతో ఒక ప్రాణం నిలబడుతుందంటే నాకు కూడా సంతోషమే కదా"అని తండ్రి అనేవరకు దివ్య శాంతించలేదు."నిజమే ప్రదీప్ లాగే మనం కూడా ఎవ్వరిని అంత తొందరగా నమ్మము. ఇక్కడ చూడు, వీళ్ళు మనిషిని బాగా నమ్ముతారు.వాళ్ళు trust చేసారు కాబట్టే ఇంత మంది ఇండియన్స్ ఈ రోజు అమెరికా వచ్చి, ఏ చెత్త resume లో రాసినా..నమ్మారు, ఉద్యోగాలు ఇచ్చారు.మనిషిని మనిషి నమ్మాలి ఉమా..నీ కూతురు దివ్య అంత తెలివి తక్కువది కాదు. ఏమి చేసినా, అలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుంది." అంది ప్రీతి. "ప్రాణానికి ఇక్కడ వాళ్ళు ఇచ్చే విలువ ఇండియా లో అయితే లేదు కదా." అంది వినీల. "నిజమే ఇక్కడ కాబట్టి ఇలా అర్ధ రాత్రి వరకు కబుర్లు చెప్పుకుని , ఏ బెంగ లేకుండా ఇళ్ళకు చేరుకుంటున్నాము" అంది ప్రీతి."సర్లే ఇప్పుడు ఇండియా కూడా చాలా మారింది. round the clock job చేస్తున్నారు కదా.So పరిస్తితులు మెరుగయ్యే ఉంటాయి" అంది స్నేహ.


"ఏమి మెరుగవ్వడమో మనం ఇది పూర్తిగా మన దేశం అనుకోము లేము, ఇండియా మీద మమకారం తెంచుకోలేము. రెంటికి చెడ్డ రేవడి లా అయ్యాము కదా?" అంది వినీల."మన పిల్లలే నయ్యం, ఇండియా మాదే, అమెరికా మాదే అంటున్నారు.మొన్నీ మధ్య అమ్మ చెపుతుంది మా అక్క , బావ, వాళ్ళ అబ్బాయి ఇండియా వెళ్ళినప్పుడు కర్రెంట్ ఒక రోజల్లా పోతే మా బావగారు తట్టుకోలేక ఆపసోపాలు పడిపోతుంటే వాళ్ళ అబ్బాయి అన్నాడంట.."నాన్న ఇక్కడే పుట్టి పెరిగావు కదా? ఇండియా అంటే ఇలాగే ఉంటుంది అని నీకు తెలిసి కూడా ఆ మాత్రం భరించలేక అంతలా ఇండియా లో weather ని తిట్టుకుంటున్నావు? నువ్వు తిట్టుకోవాలంటే ఇక్కడ traffic గురించి తిట్టుకో, corruption etc problems గురించి తిట్టుకో, అంతే కాని ఏంటి weather గురించి ఇండియా అంటేనే దరిద్రం అంటావు అని..అంత వేడిలో కూడా ఇబ్బంది పడ్డా ఒక్క మాట అనలేదు ఇండియా ఎందుకు వచ్చానని అక్క వాళ్ళ అబ్బాయి"అని ముగించింది ఉమ.మాటల్లో చాలా టైం అయ్యింది అని తెలుసుకుని, ఆ రోజుకి bye చెప్పేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. స్నేహ డ్రైవ్  చేస్తూ అలోచిస్తుంది దివ్య గురించి. ఎంత మంచి మనసు దివ్యది అని. ఇండియా గురించి ఎక్కువ మాట్లాడుకోవడం తో మనసంతా ఇండియా గురించి అలోచనలతో నిండిపోయింది.ఇక్కడ ఇంత  మదనపడుతూ  ఒకో సారి ఎరక్క పోయి వచ్చాను, ఇర్రుక్కుపోయాను type లో బాధ అనుభవిస్తుంటే, బ్లాగ్ లో  "మేధ ను తారిస్తే ఐటీ బిజ్, బాడీ ని తారిస్తే (తార) ప్చ్, వ్యభిచార్"అన్న కవిత  చదవటం  ఎప్పుడో జ్ఞాపకం వచ్చి,మనసంతా బాధతో నిండిపోయింది. 

50 comments:

  1. bhagha raasarandi, length koncham thagisthe inka bhagunde demo anipinchindi.
    edo okkati ammukokunda, konukkokunda jeevetham ela?

    ReplyDelete
    Replies
    1. అలాగేనండి! ఈ టపా చదవడం కష్టమైన పనే! చదివి స్పందించిన మీకు ధన్యవాదాలు భాస్కర్ గారు!

      Delete
  2. టపా రెండు సార్లు చదివానండీ.. ఎందుకో చెప్పుకోండి చూద్దాం?
    ఎందుకంటే ఈ టపా కి తగ్గట్టు పాట బాగా సరిపోయింది.
    చాల బాగుంది... :)

    ReplyDelete
    Replies
    1. రెండు సార్లా? నేను రాసిన draft ఒక్కసారి మాత్రమే చదివానండి..నాకే ఎంటో చాటభారతం లా ఉంది అనుకుని, రాసేసాను కాబట్టి పోస్ట్ చేసేసానండి! మీరు చదవడమే కాక, పాట విని, బాగుంది అని చెప్పినందుకు ధన్యవాదాలండి!

      Delete
  3. Interesting. I love India. I love, love our country i.e INDIA that is called BHARAT

    ReplyDelete
  4. Interesting. I love INDIA.

    ReplyDelete
  5. బావుంది, కానీ ఆ నలుగురు లో జలతారు వెన్నెల గారు ఎవరా ani థింకింగ్ ;)))

    ReplyDelete
    Replies
    1. :)) చెప్పుకోండి చూదాము.
      ధన్యవాదాలు శ్రావ్య గారు, చదివి స్పందించినందుకు.

      Delete
  6. మంచి టపా! బాగా రాసారు వెన్నెల గారు...అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారు, మీరు కూడా చదివేసారా? చదివి స్పందించినందుకు ధన్యవాదాలండి!

      Delete
  7. ఇది నిజంగా జరిగిందా, అలా ఐతే దివ్యకీ ఆమె తల్లి దండ్రులకీ అభినందనలు. దివ్యలాగా వాదించినా తల్లి దండ్రులు ఎంతమంది ఒప్పుకుంటారు అని నాకు అనుమానం. ఇక్కడ పెరిగే పిల్లల గురించి ఆశాజనకంగా ఉంది టపా.

    ReplyDelete
    Replies
    1. ఆశ్చర్యం గా అనిపించినా ఇది జరిగిన సంఘటనే! ట్రెండ్ మారుతుంది. ఇక్కడ పెరుగుతున్న పిల్లలు నాకు తెలిసి high school కి వచ్చేటప్పటికి, చాలా మారతారు. వారి అభిరుచులు, ఇండియా గురించి తెలుసుకోవాలనుకోవటం, వారు మనకంటూ ఒక culture ఉంది అని గర్వం గా ఫీల్ అవ్వడం నేను చాలా మందిని చూసాను. అలా అని వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ తో కలవకపోవటం అన్నది ఉండదు. వాళ్ళు ఇక్కడ ఎంత social గా ఉంటారొ, ఇండియా గురించి కూడ అంతే గర్వం గా ఫీల్ అవుతారు. చాల మటుకు, తల్లి తండ్రుల పెంపకం బట్టి ప్రభావం కూడా ఉంటుంది. కొంత మంది స్నేహితులు ఇండియా కి దూరం గా ఉన్నాము, ఇంక ఏంటిలే ఇక్కడ పద్దత్తులు అవి embrace చేసేసుకుంటే ముందు ముందు పిల్లలకు కూడా సులువుగా ఉంటుంది అని అనుకుంటారు. కాని ఇక్కడ culture లో మంచి ని తీసుకుంటూ, మన culture కి దగ్గరగా పెంచటం మనం చెయ్యగలిగితే బాగుంటుంది. ఇప్పుడు మాటవరసకు తీసుకుంటే, ఒకప్పుడు అనర్గలం గా తెలుగు మాట్లాడే పిల్లలు ఎంత మంది ఉండేవారు ? ఇప్పుడు ఎంత మంది లేరండి తెలుగులో చక్కగా మాట్లాడేవారు. కాకపోతే తెలుగు మాట్లాడడమే కాని రాయడం ఇంకా ఎక్కువమంది నేర్చుకోవడం లేదు. అది మాత్రం లోటే! పిల్లలు కు మొదటి గురువులు తల్లి తండ్రులే కదా..నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు స్కూల్ కి ఇడ్లి పెడితే మా అమ్మాయి అందరు sandwiches తెచ్చుకుంటున్నారు , నాకు కూడా ఇవ్వు, అని అడగడం. నేను అప్పుడు దాని మాటలు serious గా తీసుకుని ఇక్కడ వారు తినే ఫుడ్ మాత్రమే పెడితే, అలాగే అలవాటు అయ్యేది. పర్వాలేదురా.. ఇడ్లి is good for health అని చెప్పి ఇడ్లి lunch box లో తీసుకెళ్ళడం ఏమాత్రం నామోషీ అయిన పని కాదు అని చెప్పను. అలా అని నేను రోజు lunch box లో indian food మాత్రమే ఇచ్చేదాని అని కాదండి. ఈ రోజున చాలా మంది friends మా పిల్లలు Indian food తినరు అని అంటుంటే, నవ్వొస్తుంది. మీకు ఇష్టం లేక పిల్లలని ఆ food కి దూరం గా ఉంచుతున్నారా అని..ఏ అలవాట్లు చేస్తే అవే అబ్బుతాయి వారికి. నేను OM coach గా కొన్ని years చేసాను అని చెప్ప కదండి? అప్పుడు మా ఇంటికి చాలా మంది అమెరికన్ అమ్మాయిలు, అబ్బయిలు వచ్చేవారు.వాళ్ళకి ఎన్నో తెలుగు, హింది సినిమాలు చూపెట్టేది మా అమ్మాయి. నాకు బాగా గుర్తు, ఆనంద్ సినిమా చూపెట్టింది వాళ్ళకి ఒక సారి. వాళ్ళు చాలా ప్రశ్నలు అడగడం అప్పుడు ఆ సినిమాలో ఆ అమ్మాయి పెళ్ళి చెడిపోయినప్పుడు. మా అమ్మాయి ఇండియా లో marriages గురించి చెప్పడం, తరువాత నన్ను కూడా చాలా ప్రశ్నలు వాళ్ళు వెయ్యడం అన్ని గుర్తే! college కి వచ్చాక, మన పిల్లల అభిప్రాయాలకు విలువ ఇచ్చి, వాళ్ళకి అన్ని రకాల support గా ఉండాలండి.. మీరు కూడా దివ్య తల్లి తండ్రుల లాగానే ఉంటారు, చూస్తూ ఉండండి!

      Delete
    2. "కాని ఇక్కడ culture లో మంచి ని తీసుకుంటూ, మన culture కి దగ్గరగా పెంచటం మనం చెయ్యగలిగితే బాగుంటుంది." I needed to hear this. ఒక్క తరంలో మనం ఇక్కడి వాళ్ళం ఐపోము. ఇక్కడి సంకృతిని ఎంబ్రేస్ చేసుకోవడం కాదు, ఇక్కడి మంచిని ఎంబ్రేస్ చేసుకోవాలి. అలాగే మన సంకృతికి సంబంధించి కూడా. మూలాలు వదిలేసుకుంటే వ్యక్తిత్వం బలంగా ఎలా ఉంటుంది? Thanks.
      "మీరు కూడా దివ్య తల్లి తండ్రుల లాగానే ఉంటారు, చూస్తూ ఉండండి!" Amen!

      Delete
    3. :)) చక్కగా summarize చేసారు.

      Delete
  8. మెహాక్ నిజంగా సోషల్ కాజ్ కోసమే సేకరించిందో లేదో తెలుసుకుని
    రాసి వుంటే తండ్రి కూతుర్లలో ఎవరు నేగ్గారో తెలిసి వుండేది .
    ఈ సందర్భంగా ఆ నలుగురు సినిమాలో వొక సన్నీ వేశం గుర్తుకు వచ్చింది .
    రాజేంద్రప్రసాద్ అప్పు చేసి డబ్బు తీసుకు వస్తుంటే వొక ఆమె తన కూతురికి
    కాన్సెర్ అని ఆపరేషన్ కి డబ్బులు తక్కువ అయ్యాయని లేకపోతె బతకదని
    చెపితే అతను డబ్బులు యిస్తాడు తనకి స్తోమత లేకపోయినా .
    మర్నాడు పేపర్ లో ఆమె ఇలానే చాల మందిని మోసం చేసి
    డబ్బులు సంపాయిస్తుందని ,పోలీసులు అరెస్ట్ చేసారని వస్తుంది .
    అది చదివి రాజేంద్రప్రసాద్ కొడుకులు తండ్రిని తిడితే
    పోనిలేరా ఆ పాపకి కాన్సర్ లేదు కదా అని ఉదాత్తం గా ఊరుకుంటాడు .
    అంత ఉదారత వుండదు కాబట్టే మీ కధ లో తండ్రి కీడెంచి మేలు ఎంచాడు
    కూతురు ఆదర్శాల వెల్లువలో నిజాలు విచారించలేదు .

    ReplyDelete
    Replies
    1. మీ point తీసిపారెయ్యలేను, కాని ప్రదీప్ ఒక వేళ నిజంగానే మోసపోయాడనుకోండి, అతను పోగొట్టుకునేది కొద్ది డబ్బు మాత్రమే! అది అతనికి లెక్కలోనికి రాదు! అతను అలాంటి donations చాలా ఇస్తాడు. (కథ లో రాసినట్టు). అందుకని ఒకరు ప్రాణాపదలో ఉన్నారని తెలిసినప్పుడు సంశయించకుండా ఇవ్వొచ్చు. తన స్తితికి మించిన దానం చెయ్యకూడదు లెండి, కాని ప్రదీప్ ఆ మాత్రం కూతురి మాట కు విలువ ఇచ్చి డబ్బు ఇవ్వచ్చు. :))
      ఎవరు నెగ్గారు అన్నదానికి నా జవాబు మోసపోతే ఈ కథ ఇలా రాసేదాన్ని కాదేమో!

      Delete
    2. ఇంకో point నేను చెప్పదలచుకున్నది ఎంటి అంటే, మనం కూడా ఎవరన్నా ఆపదలో ఉన్నప్పుడు, అయ్యో మనం చెయ్యగలిగినది ఎమన్నా ఉందా అన్న అలోచన ముందు రావాలే కాని, అవతల వాళ్ళు అబద్ధాలు చెపుతున్నరేమో అన్న అలోచనే ఎందుకు రావాలి? ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మోసపోయినా..అతను మానవత్వం ఉన్నవాడు కాబట్టి అతను ఎక్కువ అలోచించకుండా సాయం చేసాడు. మోసాలు ఉండవు అని నేను చెప్పటం లేదు. కాని మన ద్రుష్టి కూడా మారాలి. జాగ్రత్తగా ఉండటం వేరు,ప్రతి దానికి ముందు negative గా థింక్ చెయ్యడం వేరు ఏమో?

      Delete
  9. వెన్నెల గారూ పిల్లలకు అలాంటి ఆలోచన రావడం ప్రశంసనీయం. దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడయితే భవిశ్యత్తూ ఆశాజనకంగా వు౦టుంది. చక్కగా వ్రాశారు. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారు,మీరు చెప్పినది నిజమేనండి! అభినందించినందుకు ధన్యవాదాలు.

      Delete
  10. ఐ లవ్ ఇండియా
    మేరా భారత్ మహాన్
    వందే మాతరం
    సారే జహాసె అచ్చా
    --- నిజమే
    కానీ .....
    ఇక్కడ డబ్బు తీసుకొని ఓటేస్తారు .
    నిజాయితీ పరులమని చెప్పుకొనే మేథావు లసలు ఓటింగులో పాల్గొనరు .
    పోటీ లోని అభ్యర్థులంతా బాహాటంగా డబ్బు పంపకం చేస్తారు .
    డబ్బుతో గెలుస్తారు .
    ఇక్కడ జరిగేదంతా రాజకీయ వ్యాపారం .
    అసమర్థ ప్రజా స్వామ్యం.ఇక్కడ ప్రజా స్వామ్య వ్యవస్థ ప్రజల కోసం కాదు , నేతలకోసం .
    అవినీతి గురించి అందరూ ఉపన్యాసాలిస్తారు .
    చక్కచేయడానికి ఏ ఒక్కడూ ప్రయత్నం చెయ్యడు .
    దేశాన్ని ప్రేమించే వాళ్ళు దేశ సౌభాగ్యానికి ఏ చిన్న ప్రయత్నం చెయ్య గలిగినా వాళ్ళ జీవితం ధన్యమైనట్లే కదా !

    ReplyDelete
    Replies
    1. మారుతున్న సమాజం తో పాటు విలువలు కూడా పడిపోతున్నాయి మాష్టారు.
      అవినీతి అన్న పదానికి definition మారిపోయింది.
      కులతత్వపు ఉచ్చులలో ఇరుక్కుని ఈ రోజున అవినీతిని నీతి గా మార్చేస్తున్నాము.
      రెండు- మితిమీరిపోయిన స్వార్ధం ప్రతి ఒక్కరిలో..
      అందరి అలోచనా పరిధి..నాకేంటి, నాకు ఎంత వరకు లాభం అనే తప్ప, ఆ పరిధి దాటి అలోచించటం లేదు. పేదవారు, చదువుకోని వారు అలా అలోచిస్తే దానికి కారణాలు వెతకచ్చు. కాని విధ్యావంతులు, చదువుకున్న వారు కూడా అదే రకంగా అలోచిస్తున్నారు కదా? మనమే వోట్లు వేసి తెచ్చుకున్నము ఈ అవినీతి నాయకులు కాబట్టి, అది వారి తప్పు కాదు.మన బలహీనత!
      కనీసం ముందు తరమైనా ఇలాంటి రాజకీయాలు మాకు వద్దు అని ఈ పరిస్తితి నుంచి మన ఇండియా ని విముక్తి చేస్తారని ఆశిస్తూ, ఒక ఆశాజీవి గా ఎదురుచూడడమే కాని, ఎమీ చెయ్యలేని పరిస్తితి.

      Delete
  11. alochanaatmakam ga raasaaru vennelaa nenu kuda oka ammayiki alane pampanu teacher gari intlo pani ammayiki operation ani malli aunty naku letter kuda rasaru evarini adiginaa evvaledu nene cridit card lovi pampanu appudu naku kudaa ebbandule...:)

    ReplyDelete
    Replies
    1. మంజుల గారు, చాలా మంచి పని చేసారండి. అప్పుడు కష్ట్టం గా ఉన్నా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకుని మరీ పంపారు అంటే, అదండి నిజమైన సేవా భావం. మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాల్సిందే!మీరు ఒక సేవా సంస్థ కూడా పెట్టారు కదండి, ఎక్కడో మీ పోస్ట్ లో చూసినట్టు గుర్తు . మీకు ధన్యవాదాలండి!

      Delete
  12. దివ్య .. లాటి యువతరం ప్రశ్నలకి పెద్దలు సమాధానం చెప్పగలరా!/
    చాలా చక్కటి పోస్ట్.
    ఈ మాటలతో.. నేను మీ మాటే!
    "మేధ ను తారిస్తే ఐటీ బిజ్, బాడీ ని తారిస్తే (తార) ప్చ్, వ్యభిచార్"
    ఇవాళ దేశం లో దిగజారుడు తనం ఈ రెండు విషయాల్లోనే కాదు.. ఇంకా చాలా చాలా విషయాలలో కనిపిస్తుంది.
    మిమ్మల్ని పై వాక్యం బాగా బాధ పెట్టింది అనుకుంటాను.
    మేధో వలస ..వలన జీవనది వలె ఉండే దేశం..ఎండిపోతుంది. నిజమే కదా!
    NRI ల వల్ల ఈ దేశంలో జరిగిన అభివృద్ధి ఎంత?
    వ్యక్తి అభివృద్ధి .. దేశ అభివృద్ధి అనుకుంటే.. స్నేహ అనుకున్నట్లు "ఐ లవ్ ఇండియా" అని అనుకోవడమే తప్ప ఏం ఘనమైన ఆనవాళ్ళు ఇక్కడ ఉండవు.
    దివ్యలా, వేడిలో కూడా ఇబ్బంది పడ్డా ఒక్క మాట అనలేదు ఇండియా ఎందుకు వచ్చానని అక్క వాళ్ళ అబ్బాయి" అనే యువత కావాలి.
    అన్నట్టు ఇంట మంచి పోస్ట్లు వ్రాస్తూ .. మీ బ్లాగ్ చదవడం అంటే భయపడే టట్లు చేస్తున్నారు.
    బ్లాగ్ ని అందరు చదవడానికి వీలుగా ..ఆహ్లాదంగా మార్చండి.
    ఇంకా.. బ్లాక్ బోర్డ్ మీద చదవలేం.. ఐ యాం 40 + మేడం:) :)
    అభినందనలు...జలతారు వెన్నెల.

    ReplyDelete
    Replies
    1. వనజ గారు, ఒక్కటే చెప్పగలను. వ్యక్తి అభివృద్ధి .. దేశ అభివృద్ధి కాకపోయినా, స్నేహ లాంటి వారు నలుగురికి సాయపడాలన్నా, ముందు తను ఒకరికి సాయం చెయ్యగలిగే పరిస్థితిలో ఉండడం కూడా ముఖ్యమే కదండి? అది ఇండియా లో ఉండి చెయ్యలేరా అంటే చెయ్యగలము, కాని ఇక్కడ ఉండి ఇంకా ఎక్కువ చెయ్యగలమేమో అని అనిపిస్తూ ఉంటుంది.ఈ రోజున నేను చాలా మంది ఫ్రెండ్స్ కి బంధువలకు చెపుతూ ఉంటాను,వీలైనంతవరకు విధ్యా దానం చెయ్యమని. పేద విధ్యార్దులకు సాయం చెయ్యండి. వారికి ఒక భవిష్యత్తు ప్రసాదించిన వారు అవుతారు అని. మీరు చెప్పిన మార్పులు తప్పకుండా చేస్తాను బ్లాగ్ కి. ధన్యవాదాలు మీ స్పందనకి , సదా మీ ప్రొత్సాహానికి.

      Delete
  13. మీరు ఇలా సంభాషణల రూపంలో , విషయాన్ని చక్కగా వ్యక్తపరిచేలా బాగా వ్రాస్తున్నారు.మీ బ్లాగు మంచి చర్చా వేదికగా మారింది.అందరు మీ బ్లాగులో కలిసి కబుర్లు చెప్పుకుంటున్నట్టు వుంటుంది.మీరు అందరికి చక్కగా జవాబులు ఇస్తూ ఎంతో ఓపికగా మరల కామెంట్స్ వ్రాస్తూ బ్లాగర్స్ అందరిని ఇలా కలుపుతున్నందుకు మీకు ధన్యవాదాలు.ఇక విషయానికి వస్తే చిన్న పిల్లల ఆలోచనా తీరు చాలా స్వచ్చంగా వుంటుంది.స్నేహానికి,నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు.సహాయపడే గుణం ఆ వయసు నుండే రావటం గొప్పే !గుడ్ పోస్ట్.

    ReplyDelete
    Replies
    1. నేను చదివిన ప్రతి బ్లాగ్ (post) కి కామెంట్ రాయడం (atleast చదివాను అని or సమయం లేనప్పుడు ఒక్క మాటలో బాగుంది అనో), నా బ్లాగ్ లో సమయం తీసుకుని కామెంట్ రాసిన వారికి సమాధానం ఇవ్వడం నా ద్రుష్టిలో కనీస మర్యాద అని నా అభిప్రాయం.పిల్లల
      గురించి మీరు చెప్పినవన్ని సత్యాలే! కల్మషం లేనిది వారి మనస్సు.మీ స్పందనకు, మీ ప్రొత్సాహానికి మనస్పూర్తిగా దన్యవాదాలు.

      Delete
  14. మేధో వలస ..వలన జీవనది వలె ఉండే దేశం..ఎండిపోతుంది. నిజమే కదా!...

    ఇది ఒక్కటే చదివి...స్పందిస్తున్నా...
    ఈఎస్సై...సింగరేణి...వంటి సంస్థల్లో పని చేసిన డాక్టర్లు....అక్కడి నుండి బయటకి వచ్చేసి మాంచి స్పెషాలిటీ చేసి ప్రయివేట్ ప్రాక్తీసులు చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది నాకు తెలుసు...కారణం...అక్కడ డాక్టర్లను కార్మికులు పురుగులను చూసినట్టు చూడడమే!!మా వల్లే కదరా నువ్వు బ్రతుకు తున్నావు అన్నట్టు ప్రతీ రోజూ అక్కడి కార్మికులు చాలా అగౌరవంగా చూస్తారట.....లీవ్ ఇవ్వక పోతే ఆ డాక్టరు తన్నులు తినాల్సిందే...ఇస్తే యాజమాన్యం నుండి తిట్లు...అందరికీ లీవులిస్తే ఇక్కడ పని చేసే కార్మికులు ఎవరూ అంటూ...సమయం లేక పోవడం వల్ల మరిన్ని వివరణలు ఇవ్వలేను గానీ...చదువుకున్న ప్రొఫెషనల్స్ కు ఈ దేశంలో గౌరవం లేదు...జీత భత్యాలు తర్వాతి మాట..

    ReplyDelete
    Replies
    1. మంచి విషయం ప్రస్తావనకు తెచ్చారు.మరి అలాంటి పరిస్థితులలో ప్రైవట్ ప్రాక్టిస్ పెట్టుగోగలగటం తప్ప ఆ డాక్టర్స్ ఎమీ చెయ్యగలరు? మేదో వలసను వ్యభిచారం తో పోల్చడం ఎంతవరకు కర్రెక్టో నాకు తెలియదు గాని, ఇండియా లో ఇలా చదువులు అవ్వగానే అలా అమెరికాki flights ఎక్కమని ప్రొత్సహించింది అప్పట్లో ఇండియన్ తల్లి తండ్రులే కదా.. ఎక్కడకి వలస వచ్చినా మనం భారతీయులం అని చెప్పుకోటానికి సిగ్గు పడకుండా,వీలైనంత లో, చేతనైనంత వరకు , ఇండియా లో అవసరం ఉన్న వారిని ఆదుకోగలిగితే అదే చాలు...ధన్యవాదాలండి మీ స్పందనకు.వీలైతే టపా చదవండి..

      Delete
  15. చాలా బాగుంది మేడం. నమ్మకం విషయం లో అయితే మీరు చెప్పిందే కరెక్ట్. మనుషుల్ని బాగా నమ్ముతారు. ఒక్కోసారి ఆ నమ్మకం ఎక్కడ పోతుందో అన్న భయం తో నేను పని చేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు కూడా ఆ నలుగురు సినిమా గుర్తొచ్చింది. అందులో నాకు నచ్చిన సన్నివేసం అదే , అవతలి వాళ్లకి cancer లేదని తెలిసి, తనని మోసం చేసారని తెలిసి కూడా, అది పట్టించుకోకుండా తను ఎంతో సంతోషపడతాడు. దివ్య కి అభినందనలు చెప్పండి.
    :venkat

    ReplyDelete
    Replies
    1. వెంకట్ గారు, మీ స్పందనకు ధన్యవాదాలండి!
      మోసపోతే నష్టపోయేది కొంచె డబ్బే! కాని నమ్మకపోతే ఒక ప్రాణం పోవడానికి కారకులం కూడా అవుతామేమో కదండి?మీరు ఈ పోస్ట్ చదివి, సమయం తీసుకుని స్పందించి మీ అభిప్రాయం తెలిపినందుకు మరొక్కసారి ధన్యవాదాలండి!

      Delete
  16. పిల్లలు ఎక్కడ తప్పు త్రోవ పడతారో, మోసపోతారో అని పెద్దలకుండే భయం సమంజసమే. అలానే పిల్లలకి తప్పో, ఒప్పో ఒక ఛాన్స్ ఇస్తే వారికి వారే తెలుసుకుంటారు కూడా. ఇక్కడ మీరు కథలో చెప్పినట్లు అంతంత డబ్బులు డొనేషన్ ఇచ్చిన ఆయనకి వెయ్యి డాలర్లు పెద్ద లేక్కెం కాదు. ఈ సంఘటనకి దగ్గర దగ్గరగా నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. మన పరిసరాలలో రోజుకి పది రూపాయల రోజుకూలీ కోసం వళ్ళంతా రక్తం కారుతున్నా మట్టి కప్పుకుని పడుకునే పరిస్థితి. అదే మనం చిన్న జ్వరం వచ్చిందని చెప్తే ఇప్పటికీ అందరూ ఫోన్లు చేసి పలకరింపులు. మనిషికీ మనిషికీ ఎంత వ్యత్యాసం? కొందరిది చదువుకోవాలన్న ఆశ ఉన్నా చదువుకోలేని పరిస్థితి. మనకి అన్నీ సిద్ధంగా అగ్గగ్గలాడుతూ చేసి పెడుతుంటే చదవడానికి బద్ధకం. అప్పుడు నేను, మా మిత్రులు కొంతమంది ప్రతీ వారాంతంలో మాకు పరీక్షలు ఉండేవి, అయ్యిన వెంటనే వారి వద్దకు వెళ్ళి పాఠాలు చెప్పేవాళ్ళం. వారికి కూలీ లెక్కల్లో కూడా వంద రూపాయలని వ్రాసి పది రూపాయలిచ్చి వేలిముద్రలు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది చిన్న డ్వాక్రా గ్రూపు ఏర్పాటు చేసుకుని డబ్బులు సంపాదిస్తుంటే, వారి పిల్లలు చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఒకతను నాకు పంపిన మెయిల్ "అక్కా నేను బాగా చదువుకుంటున్నాను, IIT లో సీట్ వచ్చింది. ముందు నీకే చెప్తున్నా అని". నాకు ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను. వాడిని స్కూల్ లో నేనే చేర్పించాను. ప్రతీ వారం పాఠాలు ప్రక్కన కూర్చుని చదివించేదానిని. లాబుల్లో చేసే ప్రయోగాలు నేను వారింట్లో కేవలం రోజు వారీ వస్తువులతో DNA isolation అవీ చూపించేదానిని. అలా తను వారి పాకలోనే ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసుకున్నాడు. లాబుల్లో కూడా ఒక కెమికల్ ఎందుకు వాడుతున్నాం, ఎలాంటిది వాడుతున్నాం అన్న విషయాలు తెలిస్తేనే ఇలాంటివన్నీ సాధ్యం. మంచి రాంకులు తెచ్చుకుని పైకొచ్చాడు. ఇప్పటికీ ఏమి సందేహం ఉన్నా నన్నే అడుగుతాడు. నాకు మెరిట్ స్కాలర్షిప్ ద్వారా వచ్చిన, వచ్చే డబ్బులని ఇలా చాలా మంది చదువుకి మాత్రమే వెచ్చించాను. దీనంతటికీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఒక్కటే కారణం. చాలా పెద్ద వ్యాఖ్య అయ్యింది మన్నించండి.

    ReplyDelete
    Replies
    1. సో రసజ్ఞ అనే ఈ అమ్మాయి చదువుల సరస్వతే కాక, బ్లాగ్ అర్టికల్స్ రీసెర్చ్ స్కోలరే కాక,మానవత్వం మెండు గా కలిగి, సేవా భావం కలిగి, తన పరిధిలో తను చెయ్యగలిగిన సాయం అవసరం ఉన్న వారికి చేస్తుందనమాట! ఈ రసజ్ఞ నాకు చాలా నచ్చింది. ప్రత్యక్షంగా కాని పరోక్షం గా కాని ఇలా పేద, తెలివైన, చదువుకోవాలన్న అభిలాష ఉన్న విధ్యార్దులకు సాయం చేసే వారంటే నాకు చాలా ఇష్టం. అసలు ఈ రోజున మనం ఇండియా లో literacy rate పెంచాల్సిన అవసరం చాలా ఉంది! It is a dire need! మీరు చేసినట్టు కనీస విధ్యాబ్యాసం చేసినా (teaching to differentiate between 100 and 10 rs)అది కూడా చాలా పెద్ద విషయమే! అలాంటిది ఒక స్టూడంట్ (who made it to IIT) కి మీరు ఇంత సాయం /విధ్యాదానం చేసారంటే, నిజంగానే మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలీటం లేదు. మీ మెరిట్ స్కాలర్ షిప్ ని కూడా మీరు పరుల కోసం, అది కూడా విధ్య కోసం వెచ్చించారు అంటే నా దగ్గర మాటల్లేవు మిమ్మల్ని అభినందించడానికి. సొ రసజ్ఞ...మీకు నా ఆశీస్సులు. ఇలాగే service to mankind is service to God అన్నది అందరు తెలుసుకోగలిగితే ఆ తిరుపతి హుండిలో వేసే కొన్ని కోట్ల రూపాయలు/డాల్లర్స్ తో ఎంత మందికి జీవనాధారణం, జీవితం ఇవ్వచ్చు!
      May God bless you and please continue to be the same person your entire life and I appreciate your parents for raising you so well and being very supportive! Eventhough I like the articles you post I am more impressed today after I read this comment of yours rasajna. Hey by the way thanks for the comment!

      Delete
    2. రసజ్న గారికి, నిజంగా మీరు గ్రేట్. మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మీరు చాల మందికి స్పూర్తి, నాకు కూడా. I am so glad to read your comment and no words to explain my happiness.
      :venkat

      Delete
  17. మీ బ్లాగు తెరవగానే ఓ ఆర్తనాదం వినిపించిందండి. కంగారు పడి దిక్కులు చూస్తున్న నాకు ఓ దయ్యం పాట లాంటిది వినిపించి జడిపించింది. ఆ పాట మీ బ్లాగులోంచి వస్తోందని తెలియటానికి కాసేపు పట్టింది. అబ్బా చా ఇదేం ప్రచారమండి, మరీ Tv9లాగా!? సీరియల్ మధ్యలో వచ్చే 'వాషింగ్ పౌడర్ నిర్మా ' అడ్వర్టైజ్మెంట్ల లాగా! చంపేశారు.

    ReplyDelete
    Replies
    1. నేను సాధారణంగా సద్విమర్శలకు తప్పితే ఇలా అజ్ఞాతల కామెంట్స్ publish చెయ్యను. నా మటుకు అది time వేస్ట్. విమర్శలు ఎవరన్నా చెయ్యచు. అది నా టపాకి సంబంధించి ఉంటే జవాబు ఇస్తాను. మీ కామెంట్ కి ఈ మాత్రం టైం వేస్ట్ ఎందుకు చెస్తున్నాను అంటే ఇంకోసారి ఇలాంటి కామెంట్ రాసి మీ టైం వేస్ట్ చేసుకోకండి అని చెపుదామని.

      మీ కామెంట్ విషయానికి వద్దాము. మీకు నా బ్లాగ్ లో పాట "దెయ్యం పాట", "ఆర్తనాదం", "TV 9 ప్రచారం లా", " washing powder నిర్మా" లా అనిపిస్తే నా బ్లాగ్ చూడడం మానెయ్యండి. అది ఏ మాత్రం కష్టమైన పని కాదే! ఎన్నో బ్లాగ్స్ పాటలు లేకుండా ఉన్నాయి... So, find some peace there!

      Delete
    2. మరిచాను, ఇంకో పని కూడా చెయ్యచ్చు. నా బ్లాగ్ తెరిచినప్పుడుvolume mute చేసుకోవచ్చు కూడా!

      Delete
    3. బలవంతపు పాటలు వినిపించడం మీ అభిమతం అన్నారు. వాల్యూమ్ కంటొల్ చేసుకోవడానికి ఈ ఆటాక్ వూహించింది కాదు కదా. నా పాట వినాలనుకున్నవారు ఇక్కడ నొక్కండి అని ఓ బటన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ రాగానే పాట తాటికాయ తలమీద పడబోతోందని, ఎవరుమాత్రం వూహించగలరు? అజ్ఞాతలకు ఏదో ఫేవర్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నందుకు అభినందనలు. ఇలాంటి బ్లాగులకు వచ్చేముందు రెండుసార్లు ఆలోచించుకుని, వాల్యూం కంట్రోల్ చేసుకుని వస్తాం లేండి. :)

      Delete
    4. మహా ప్రభు! అలానే! నా బ్లాగ్ లో తాటికాయంత అక్షరాలతో, ఒక నోట్ పెడతాను.
      ఈ బ్లాగ్ లో పాట play అవుతుంది, అది ఆర్తనాదం అని అనిపిస్తే కిందకి scroll చేసి, divshare player ని pause చెయ్యండి అని! కుష్?

      Delete
  18. రసఙ్ఞ వ్యాఖ్య చదివింతర్వాత ఆమెకు అభినందనలు చెప్పాలనిపించింది . మనిషి మనిషి గా బ్రతకడం లోని పరమార్థమే సామాజిక బాధ్యత . కాని , స్వార్థంతో కూడిన నిరాసక్తత ఆపని చెయ్య నియ్యడం లేదు . ఒక్క సారి అటు వైపుగా అడు గేస్తే ఆ ఆనందం , ఆ ఆత్మ సంతృప్తి అనిర్వచనీయం . ఉపాధ్యాయ వృత్తిలో పని చేసిన నాకలాంటి అనుభవాలు కో కొల్లలు . ఇప్పటికీ నావద్ద చదువు కొన్న వాళ్ళు తమ ఇబ్బందులకు నా నుండి ఏదో ఒక పరిష్కారాన్ని పొందు తుండడం నాకు ఆనందంగా ఉంటుంది . మనము అంతంత మాత్రమే . మనమేమి చెయ్యగలం అని చాలా మంది భావిస్తుంటారు . ఇది కేవలం తప్పించుకోవడమే . డబ్బు సామాజిక బాధ్యతలో ఒక కోణం మాత్రమే .

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తున్నాను మాష్టారు.

      Delete
  19. మొత్తం చదివానండీ మీ పోస్ట్...మిస్సయి ఉండే వాడిని..చాలా చక్కగా ప్రజెంట్ చేసారు...ఇది చాలా ఇళ్ళలో ఉన్న ప్రాబ్లమే..పిల్లలకీ పెద్దలకీ మద్య..
    ఇక మన జనాల విషయానికి వస్తే....నమ్మామా..మనని ముంచేస్తారు...నోరు విప్పితే అబద్దాలు....ప్రతి దానికీను...ఎప్పటి నుండి ఈ డెలివరీ పైన్స్ అంటే అబ్బే ఒక్క గంట నుండే అంటారు...ఎక్సామ్ చేస్తే లోపల బేబీ చనిపోయి ఉంటుంది...గట్టిగా నిలదీస్తే కూడా అబ్బే గంట నుండే నొప్పులు బాబూ..అని బొంకేస్తారు...ఇక్కడ అబద్దాన్ని బొంకడమ్ అంటారు... చివరికీ కూపీ లాగితే ఆరెమ్పీ దగ్గర ఒక రోజంతా ట్రై చేసీ చేసీ...చివరికి వాడు చేతులెత్తేస్తే అప్పుడు ఆసుపత్రికి వస్తారు...ప్రతీ చిన్న విషయానికీ నోరు విప్పితే అబద్దాలే....ఏ మాత్రం నమ్మ దగ్గ వ్యక్తులు కాదు ఇక్కడి మనుషులు...చాలా జాగ్ర్త్త త్తగా ఉండక పోతే డిస్చార్జ్ టైమ్ లో డబ్బులు ఎగ్గొట్టి జారుకునే రకాలూ ఉన్నాయ్....లోయర్ క్లాస్ వాళ్ళే కాదు చదువుకున్న వాళ్ళు కూడా ఇంతే, నూటికి 99% ఇలానే ఉన్నా రు...... సొసైటీ లో అన్ని చోట్లా ఇలానే ఉంది.....అందుకే ఎవరైనా సహోయం కోసమొస్తే వాళ్ళు చీప్పే కారణాలు నమ్మలేం ఇక్కడ.....ఇక్కడి మనుష్యులను నమ్మామా మునిగామన్న మాటే!!!!

    ReplyDelete
    Replies
    1. మీరు ప్రస్తవించిన విషయాలన్ని మీ అనుభావలు కాబట్టి, తప్పకుండా మీతో ఏకీభవిస్తాను అండి.కాని జీవితానుభావాలు దివ్య కి ఇలాంటి పాటాలు నేర్పలేదు కదా..ఆ వయస్సు, మంచి మనస్సు అలానే మాట్లాదిస్తుంది అన్నది నిజం. ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  20. జలతారువెన్నెల గారు, ముందు మీ వోపికకు జోహార్లండి. టపాకి జోడి గా ఆ పాట నిజంగా వావ్ 'సినిమా పెద్ధగా ఆడలేదు కాని ఈ పాట బాగా కంపోస్ చేసారు'. ఇక మీ టపాలో టాపిక్స్ నాకు తెల్సి చాలా వోరకు మీకు నిజ జీవితంలో ఎదురు/జరిగినవి అని అనుకుటున్నాను. TANA, NATA, BATA, ATA ఇంకో టా, ఇంకో టా లకి డొనేషన్ సంగతి పక్కన పెడితే, మన కోసం ఎమన్నా కొనాలంటే/చెయ్యాలంటే కచ్ఛితంగా జరిగే తంతు బాగా వివరించారు. కాని పట్టు విడుపు కావాలి కదా !!. ..... మర్చేపోయాను...... నా బ్లాక్ బెర్రీ...... నా ఆపిల్... రేపు పోద్ధున్నే నీను ఎన్ని గంటలకు "బ్లాక్ బెర్రీ/ఆపిల్" పండ్లు తినే మీటింగ్స్ వున్నాయో చూసుకోవాలి.... లేక పోతే టపా చదవడం పక్కన పెట్టి వుద్యోగాల వేట మొదలెట్టాలి ...........

    ReplyDelete
    Replies
    1. టపా చదివినందుకు thanks ram gaaru.
      ఇంకా పాట మీకు ఆర్తనాదం లా అనిపించనందుకు కూడా ధన్యవాదాలు. :))
      జరిగిన సంఘటనల చుట్టూ కథలు అల్లుతాను.ఇవి అరుదుగా జరిగే incidents కావడం మూలాన, ఎందుకో బ్లాగ్ లో టపా రూపేనా అందరితో పంచుకోవాలని అనిపిస్తుంది. మీ బ్లాక్ బెర్రీ,ఆపిల్ లో మీటింగ్స్ జాగ్రత్త సుమా..వుద్యోగాల వేట అంటే, ఎప్పుడు చిరాకే కదా? అయినా మన area లో వుద్యోగాల కు కొదవ లేదు సుమీ!! ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  21. meeru okkasaari chadivaaru kaani mammalni 2 saarlu chadivinchaaru, vennalagaroo

    ReplyDelete
    Replies
    1. ఫాతిమ గారు, ఈ టపా రెండు సార్లు చదివిన మీకు నేను ఎలా ధన్యవాదాలు చెప్పగలను? అయినా సరే మళ్ళి చెపుతున్నాను. ధన్యవాదాలు ఫాతిమ గారు!

      Delete
  22. @మేధో వలస ..వలన జీవనది వలె ఉండే దేశం..ఎండిపోతుంది. నిజమే కదా!....
    అలాఅ వెళ్ళిన వాళ్ళ పై చాలా దారుణమైన విమర్శలు చదివా....ఎవడో తెల్ల వాడికి మనం చెయ్యడమేమిటీ ఇక్కడ పుట్టి ...అన్న వాళ్ళూ ఉన్నారు...అందుకే ఇంతగా స్ట్రెస్ ఇస్తున్నా...కాళీ గా ఉన్నపుడు ఈ లిన్క్ చదవండి....

    అహొ రాత్రులూ శ్రమించి ఈ డాక్టర్ ఈ స్థాయి కి వచ్చారన్న విషయం మరవకండి...ఆయన జవాబులో ఒక లైన్...

    I studied and then worked in the United States for nearly 16 years. I came back with a dream to serve my countrymen. However, now after going through the mental trauma caused by a reckless individual who is inadvertently abetted by a corrupt officialdom and a thoughtless media, I am beginning to wonder if I made a mistake in returning to india....

    https://www.facebook.com/photo.php?fbid=368730323181721&set=a.346901585364595.94012.291073544280733&type=1&theater

    ReplyDelete
    Replies
    1. Shocking I should say! The entire country and even my entire family cried on that day when the program was aired feeling the pain of the daughter who lost her mother and the man who lost his wife. Shocking to know that they were trying to make money out of it by blaming the doctor!
      Thanks for enlightening us! I am sure I will have a long debate with my daughter tonight!

      Delete