రాధకి, వేణుకి పెళ్ళిచూపులు
డేటింగ్ అని పెట్టుకున్నారు పేరు దానికి వాళ్ళు!
ఏదో ఒకటి, ఒకరికి ఒకరు నచ్చితే చాలు ,అన్నారు పెద్దలు
ఆ విషయం తెలపాలంటే, ఆగాలన్నారు జంట ఇంకో పది నెలలు!
పది నెలలా.. అని విస విసలాడారు మధ్యవర్తులు
ఎదురు చెప్పలేక జంటకి, ఊపారు తలలు!
హోటల్లు, సినిమాలు అని జంట తిరిగారు షికార్లు
గంటలు గంటలు ఫొన్ లో చెప్పుకున్నారు వారు కబుర్లు!
మనస్సు ఊరుకోక అన్నారు తల్లితండ్రులు
పంతులుగారిని పిలిపించి చూస్తామని పెళ్ళిముహుర్తాలు!
తొందరేమిటని ప్రశ్నించారు రాధావేణులు
మా పరిచయం ఇప్పుడే అయ్యింది మొదలు!
ఔరా.. అని వేసుకున్నారు అందరు ముక్కున వేళ్ళు
చెప్పొద్దన్నారు జంట, పాత చింతకాయ కబుర్లు!
కలిసాయో లెదో చూద్దామనుకున్నారు పెద్దలు జతాకాలు
పనిలో పనిగా తీరిపోతాయిగా అన్ని సందేహాలు!
కలిసిన జాతకాలను చూసి పెద్దలు మురిసి కన్నారు కలలు
చేసారు జంట వారు కన్న కలలు కల్లలు!
కలవలేదని తేల్చి చెప్పారు వారి అభిరుచులు
చేసేదేమి లేక మూసుకున్నారు పెద్దలు నోళ్ళు!
పరిచయం లేనప్పుడూ ఒకరినొకరు తెల్సుకోవాలన్న తెగులు
తెలుసుకున్నాక సరి అయినవారేనా సహజీవనానికి అన్న దిగులు!
నిర్ణయం తీసుకోలేక వారు పడే తర్జన బర్జనలు
అవసరమా పెళ్ళి చేసుకునే జంటలకు ఇన్ని అగచాట్లు!
అపార్ధం చేసుకోకండి నన్ను, ఓ పెళ్ళీడుకొచ్చిన పిల్లలూ
తీసుకోవాలి మీరు సరి అయిన నిర్ణయాలు!
హాయిగా వేసుకుంటారు పెద్దలు అప్పుడు కాలు మీద కాలు
అలా జరగన్నప్పుడు పరిగెత్తిస్తారు కదా పెద్దల గుండెల్లో మీరు రైల్లు!

అభిరుచులు కలవలేదని చెప్పడం సరి అయిన నిర్ణయం అవ్వొచ్చు కదా? :)
ReplyDeleteదానికి పది నెలలు పడుతుందా తెలుసుకోవడానికి ప్రసాద్ గారు.
Deleteజలతారు వెన్నెల గారు.. ముందుగా మీకు మనసైన అభినందనలు.
ReplyDeleteమీరు తోటి బ్లాగర్లతో పంచుకోవాలి అనిపించిన విషయాన్ని .. కవితా రూపంలో చేపాలనుకోవడం బాగుంది. కవిత్వం అని కాదు కాని అంత్య ప్రాస కలవడం కోసం మీరు బాగా శ్రమ పడుతున్నారు.
అభినందనలు. అభినందనల మందారమాల.
అలాగే.. మీరు చెప్పిన విషయం బావుంది. మనకి ఇక్కడ అయితే..ఓ..కాలక్షేపపు "లవ్ అఫైర్" అక్కడ "డేటింగ్" అంతే..తేడా..
ఏమైనా పెద్దవాళ్ళకి దిగులే సుమా!
ఎదో కొంచెం చదివే వారికి సరదాగ, నాకు కొంచెం పరీక్షగా అనిపించి రాస్తున్నానండి.శ్రమ పడటం ఎక్కువ లేదు.. వాడుక భాష కాబట్టి తడుముకోకుండా వస్తున్నాయి పదాలు.. డేటింగ్ కి నేను వ్యతిరేకిని కాదు. కాని మరీ సంవత్సరాల తరబడి డేటింగ్లు చివరన " She is not my టైప్లు(type)" అదే విసుగు! మీ అభినందన మందార మాల ని స్వీకరిస్తూ, మీకు మన్స్పూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను వనజ గారు.
Deleteoka topic theesukoni saradaga kavithalu allesthunnarandi,bhale thamashaga, genaration gap valla pillala bhavalau peddalaki eppudo vinthagane untaayemonandi, evari jeevithamu, mana chethullo undadu kada, nice keep writing.
ReplyDeleteపెద్ద వారికి చిన్న వారు ఒక వింత
Deleteచిన్న వారికి పెద్దవారు ఒక సంత
అయినా ఎందుకొచ్చిందంటారు ఒకరితో ఒకరికి తంటా?
ధన్యవాదాలు భాస్కర్ గారు.
మన వివాహ వ్యవస్థకు రకరకాల పేర్లు పెట్టి భ్రష్టు పట్టిస్తున్నారు.
ReplyDeleteఅమ్మాయిల జీవితాలతో మగాడు ఆడుకునే నాటకం ఈ డేటింగ్.
మంచి పోస్ట్... అందుకోండి మా అభినందనలు వెన్నెల గారు!
*అమ్మాయిల జీవితాలతో మగాడు ఆడుకునే నాటకం ఈ డేటింగ్.*
Deleteఅసలికి మన వివాహవ్యస్థే ఒక కుళ్లు వ్యవస్థ. ఇంకా భ్రష్టు పట్టించటానికి దానిలో ఏముంది? బాపనస్ దానిని చాలా గ్లొరిఫై చేసి, ఆధ్యత్మిక జీవితం లో ఒక భాగంగా పెళ్లి చేసుకోవాలి అని పేచారాం చేశారు. ఐదు నిముషాల పనికి, ఇద్దరు కలసి ఆనందించినదానికి మగవారికి మాత్రం యావజ్జివ కారాగార శిక్ష వేస్తారా? వివాహంమగవాళ్ల నెత్తిన బలంవంతాగా రుద్దబడినది , వాళ్లని తొకెయ్యటానికి ఆడవాళ్లు వేసిన ఎత్తుగడ. ఈ ఎత్తుగడలు,కుట్రలను అర్థం చేసుకొన్న పశ్చిమదేశాల లో ని వారిలో కొంతమంది గేలుగా మారుతున్నారు.
కెవ్వు కేక.
Deleteపైన మనోడు ఎవడో జీవితం లో బాగా frustrate అయిపోయినట్టున్నాడు.
:venkat
Nagendra gaaru.
Deleteడేటింగ్ నాటకం లో, ఒక్క మగాడు మాత్రమే నాటకాలు ఆడలేడండి.
ఇద్దరు కలిసి ఆడితేనే నాటకం రసవత్తరంగా ఉంటుంది.
:venkat
AnonymousJuly 2, 2012 11:26 PM
Deleteనాకు తట్టనేలేదు. ఆలోచింపజేసేదిగా వుంది. :)))
Snkr
నాగేంద్ర గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. కొన్ని సందర్భాలలో అబ్బాయిలు ఆడుకునే నాటకం కావచ్చు, కొన్ని సందర్భాలలో అబ్బయిలు, అమ్మాయిలు కలిసి చేస్తున్న టైం పాస్ కాలక్సేపం కావచ్చు, ఇంకొన్ని సందర్భాలలో అసలు అమ్మాయిలకు , అబ్బయిలకు వారు దేనికోసం తాపత్రయ పడుతున్నారో ఒక క్లారీటీ లేక కూడా కావచ్చు. అబ్బాయిలు, అమ్మయిలు ఇద్దరు ఒకరికి ఒకరు ఎమీ తక్కువ కాదండి ఈ విషయంలో!
Deleteఅజ్ఞాత గారు, మీ అభిప్రాయం మీరు వ్యక్తపరచడం లో తప్పు లేదు కాని, ఇలా ఒక కులాన్ని ఎత్తి చూపి దూషించడం నచ్చలేదు. ఈ శిక్షలు, కక్షలు పెద్దగా తెలియవు కాని, ఇష్టం లేని వివ్వాహ వ్యవస్థ లో అయిష్టం గా జీవితకాలం బాధపడాల్సిన అవసరం లేదు కదండి? ధన్యవాదాలు మీ స్పందనకి
Deleteవెంకట్ గారు, మీరు ఎక్కడ నుంచి అరిచారో కెవ్వ్ మని నాకు ఇక్కడికి వినిపించిందండి :))
Deleteఅజ్ఞాత గారు తన అభిప్రాయం చెప్పారు. మన judgement ఎందుకు లెండి?
మీరనట్టు అమ్మాయిలు, అబ్బాయిలు సమానం గా కలిపి పెద్దవారికి చూపిస్తున్న నరకమేలెండి ఇది! ధన్యవాదాలు మీ స్పందనకి.
SNKR గారు , మీరు సామన్యం గా మీ ID తొ వాఖ్యపెడతారు కదా? మీరు SNKR అవునా కాదా అని సందిగ్దం .
Deleteఇక పోతే ఎప్పుడో అన్నారు ,ISI maark వచ్చినట్టె అని...వచ్చినట్టేనాండి ఈ పోస్ట్ కి?
మీరు కనక SNKR గారు కాకపోతే టపా మెచ్చుకునందుకు ధన్యవాదాలండి
*ఇద్దరు కలిసి ఆడితేనే నాటకం రసవత్తరంగా ఉంటుంది.*
Deleteపిచ్చి వెంకన్నా! నేనేమి ఫ్రస్టేడ్ కాలేదు. పెళ్లనేదే పెద్ద కుట్ర, దానికి బ్రాహ్మణ మగవాళ్లు ఆధ్యాత్మిక రంగులద్దారు. ప్రతి సంవత్సరం భద్రాచలంలో సీతారాముల కల్యాణం, రోజు తిరుమలలో వెంకన్నా కల్యాణం చేయిస్తూ పనిగట్టుకొని, పథకం ప్రకారం,భూస్వామ్య వర్గాలు, బ్రాహ్మణులుఈ కుట్రను నీరు గార్చి, సామాన్య విషయం లాగా చేశారు. మగవారి మీద పెళ్లి తంతును పరోక్షంగా, బలవంతంగా, సామజిక జీవితంలో ఒక భాగంగా రుద్దారు/చేసేశారు. ఈ కుట్రను బహిర్గతం చేయాలసిన సమయం ఆసన్నమైంది. ఇక బ్రాహ్మణులు ఇప్పుడు ఎటువంటి అధికారంలో లేరు. భవిషత్లో వచ్చేది లేదు. మరివాళ్లు పెంచి పోషించిన చాలా వ్యవస్థలో, ఒక భాగమైన ఈ వివాహ వ్యవస్థను కొనసాగించటం అనవసరం. ఈ సమయం లో ఈ వ్యవస్థను పెకిలించి పారేయొచ్చు.
అదే మా ఇంటిలో పని చేసుకొనే యానది వర్గానికి చెందిన మహిళ, 25సం|| హాయిగా మూడు పెళ్లిళు చేసుకొంది. మగవారు అంతే. పిల్లలను అమ్మమ్మో నాయనమ్మో పెంచుత్తూంటారు. ఆవర్గం లో ఎన్ని పెళ్లిళ్లు చేసుకొన్నా ఎవరికి (ఆడ,మగకి ) ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. నిముషంలో విడిపోతారు, నచ్చిన వారితో కలసి ఉంటారు. వయసులో ఆనందించటమే వారి గోల్. దేవుడికి కల్యాణాలు మొద|| చేయించరు, వాళ్లే హాయిగా కావలసినన్ని కల్యాణాలు చేసుకొంటారు. ఇదేమి వారిని తక్కువ చేసి మాట్లాడటానికి రాయటం లేదు. నాకు వాళ్ల పెళ్లిళే నచ్చాయి, వారిదే ఉత్తమ సాంప్రదాయం. Practically feasible. బ్రాహ్మణ సంసృతి పుస్తకాలలో తప్పించి, జీవితంలో ఎక్కడా ఉండదు. ఉంటే గింటే ఒక 10%-20% జనాభా అనుసరిస్తారేమో. దాని కొరకు 80%- 90% బాధపడాలా?
*ఇష్టం లేని వివ్వాహ వ్యవస్థ లో అయిష్టం గా జీవితకాలం బాధపడాల్సిన అవసరం లేదు కదండి?*
అవన్ని అమేరికాలో సాధ్యం. ఇక్కడ కాదు. నిద్దరలేచిన మొదలుకొని పక్కింటోడు ఎమీ చేస్తున్నాడానేదే తెలుగువారి ప్రధాన జీవనం. ఇప్పుడు మొబైల్ పోన్ లు కూడా తోడయ్యాయి.
Thanks Snkr. పురుషులను చైతన్య పరచటంలో మీరు ఓ చేయివేయండి. దేశం బాగు పడుతుంది.
/పిల్లలను అమ్మమ్మో నాయనమ్మో పెంచుత్తూంటారు. /
Delete!!?!
మీ యానాదిత్వం బాగుంది కాని ఓ డౌటు-వాళ్ళకు మాత్రం ఆ తీరిక, ఎవరు మనుములో, ఎవరు కాదో ఎలా గుర్తు/లెక్క ఉంటుంది?!!
వారలా కని పడేస్తూ వుంటే పిల్లలను ముసలోళ్ళు పెంచి మరి దేశమ్మీదికి వదిలేస్తుంటారా?!! ఆ పిల్లలు పెద్దాళ్ళయ్యాక అదే పోని చేస్తే వాళ్ళ పిల్లలను పెంచేందుకు ఆ యానాది తల్లిదండ్రులు అందుబాటులో వుండరేమో కదా? వాళ్ళకు 3-4 పెళ్ళిళ్ళ(!?!)తో ఎంతమంది మనుములు/మునిమనుమలు వుంటారో!
/నాకు వాళ్ల పెళ్లిళే నచ్చాయి, వారిదే ఉత్తమ సాంప్రదాయం./
మీరు ఫాలో అయిపోండి. కనీసం పిల్లల లెక్క/వివరాలు ఇంట్లో 'బ్రాహ్మణసంస్కృతి' పాటించే ముసలాళ్ళకు ఇవ్వండి, పెంచి పెద్ద చేస్తారు. లేదంటే చెత్తకుప్పల్లో చూడాల్సొస్తుందేమో. :P
చెయ్యి/కాలు నే వేయను అజ్ఞాతోయ్ (మా ఇంట్లో విరిచేస్తారు), కావాలంటే పనిలేనపుడు ఆలోచించి పెడతా... అంతే! :D
----
జలతారువెన్నెల గారు,
/ఇక పోతే ఎప్పుడో అన్నారు ,ISI maark వచ్చినట్టె అని...వచ్చినట్టేనాండి ఈ పోస్ట్ కి?/
అలా నేనే అన్నానా?!! గుర్తులేదండి. :)) పేజి లాగ్ కానపుడు అలా అజ్ఞాతగా కామెంట్ పెడుతుంటా. ఈమధ్య ఓ గ్రామసింహం తోకవూపుతూ నావెంటే పడుతున్నాడుతోందండి, ఇకమీద అలా పెట్టను. :)
SNKR గారు, మీరు నా పోస్ట్ "బ్లాగింగ్ సందేహం!" లో ఇలా స్పందించారు.
Delete"ఫ్రెండ్స్ మొహమాటంగా బాగుంది అంటారేమో కాని బూచాళ్ళు (అజ్ఞాతలు) మాత్రం మెచ్చుకుంటే నిజంగా మెచ్చుకుంటారు. బూచాళ్ళ మెచ్చుకోళ్ళు ఈశీ మార్క్ అనుకోవచ్చు. :))"
SNKR
అది గుర్తొచ్చింది అంతే!అన్యధా భావించవద్దు అని మనవి.
My dear Alien,
Deleteకొత్త పాయింట్ చెప్పారన్నమాట, ఐతే మనం అనుభవించే ఈ కష్టాలకి బ్రాహ్మణులే కారణమన్నమాట. హన్నన్న నేను ఇప్పటి వరకు realise అవ్వలేదండి. ఇంకేం మరి కానీయండి, తెగిన్చినోడికి తెడ్డె లింగం మన్నట్టు. కాకపోతే ఇంకా ఎన్నాళ్ళు ఆ బ్రాహ్మణులును పట్టుకుని ఎదుస్తారండి, వాళ్ళు కళ్యాణాలు చేయిస్తే మనం చేసేసుకున్తామ ఏంటి. మనం మన ఇంట్లో వాళ్ళు చెప్పిందే వినడం లేదు. నాకెందుకో మీరు కలలు కన్నా మరో ప్రపంచం వచ్చేస్తుందండి.,మీ పిల్లలకి పూర్తిగా అందుబాటులో ఉంటుంది.
ఇంత కుట్ర ఉందా మన మగవాళ్ళ మీద. హన్నన్న, మనకి తెలియకుండా మనం గంగిరెద్దు ల ఫాలో ఐపోతున్నమన్నమాట.బాగుంది.మనలో మన మాట, ఈసారి కామెంట్ పెట్టేటప్పుడు మీరు ఇప్పుడు ఎన్నో relation లో ఉన్నారో చెప్పండి.
ఉంటాను. త్వరలో ఒక యానాది వీరుడిని చుడబోతున్నమన్నమాట .
:venkat.
@అజ్ఞాత (పేరు చెప్పని వారు), మీ వాఖ్య నేను ఇక్కడ పబ్లిష్ చెయ్యటం లేదు. కారణం పూర్తిగా వ్యక్తిగత దూషణలు,
Deleteఒక కులానిపై మీరు సందిస్థున్న అరోపణలు నాకు నచ్చలేదు. ఎన్నో అర్ధం లేని మూఢ నమ్మకాలని, సాంప్రదాయలని మనం ఈ రోజు సరి అయినవి కావు అని అనుకున్నప్పుడు అవి పాటించడం మానేసాము. మరి అలాగే వివాహ వ్యవస్థ లో ఎవరికి నమ్మకం లేకపోతే అందరు దీనిని కూడా ఎప్పుడో వ్యతిరేకించేవారు. కాని ఇప్పటికి వివాహ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం తోనే చాలా మంది వివాహాలు చేసుకుని, సహజీవనం చేస్తున్నారు. మీ అభిప్రాయం మీది, దానిని తప్పు అనలేను. కాని ఎప్పుడో ఒక కులం వారు చేసిన కుట్ర కి ఫలితమే మనమందరము ఈ నాడు ఈ వివాహ వ్యవస్థను నమ్ముతున్నము అంటే దానిని పూర్తిగా ఖండిస్తున్నాను.
నేను ఈ టపా సరదాగా రాసాను. ఒక స్నేహితురాలు (అమెరికా లో ఉన్న) గత కొద్ది సంవత్సరాలుగా తన అబ్బాయికి పెళ్ళి చెయ్యలని పూనుకోవడం, ఆ అబ్బాయి సంవత్సరాల పాటు ఒక అమ్మాయి తో డేటింగ్ అని తిరగడం, చివరగా వచ్చి అభిరుచులు కలవలేదు అనటం చూసి, నేను ఈ రకం గా రాసాను. శ్రీ గారు రాసినట్టు "జీవిత భాగస్వామి సరి అవునో కాదో తెలుసుకోవడానికి ఒక చూపు చాలు / ఒకోసారి ఓ జీవితం కూడా సరిపోదు." అంతే కాని ఇలా prolonged period of time dating అంటూ తిరిగి, మళ్ళి ఇంకొకరితో ఇలాగే చేసి, ఇదొక ఆట లా తీసుకుంటున్నారే అని నా అబిప్రాయం. డేటింగ్ కి నేను వ్యతిరేకిని కాదు, అలా అని నా స్నేహితుని కొడుకుకి వివాహ వ్యవస్థను మీద నమ్మకం లేక పోలేదు.
స్త్రీ , పురుషులిద్దారు సమానమే అండీ. ఒకరి అవసరం ఇంకొకరికి లేదు అనుకుంటే పొరపాటు అన్నది నా అభిప్రాయం.
ఇంక కామెంట్స్ ఈ టపాకి పుబ్లిష్ చెయ్యనండి ఈ విషయం మీద. ఎదో సరదాగా రాసిన టపా ఇలా ముగుస్తుందనుకోలేదు.
హ హా కుర్రకారుపై సంధించారీసారి కవితా బాణం...అలానే చాదస్తపు పెద్దోళ్ళమీదా ఓ వాడి బాణం వేసెయ్యాల్సింది ;)
ReplyDeleteబాగుందండీ ప్రాసతో సరదా కవిత.
తప్పకుండా అండి.. మా అమ్మాయి ఈ సారి నన్ను బాగా విసుకున్నప్పుడు, అసలు నీ మనసులో ఏముందో చెప్పమ్మా..అని అడిగి, తెలుసుకుని మరీ రాస్తాను. ధన్యవాదాలండి మీ స్పందనకు.
Deleteవెన్నెల గారూ!
ReplyDeleteమొదట బాల్య వివాహాలు...
తరవాత పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు...
కొన్నాళ్ళకి పెళ్లి చూపులు చూసుకోవడం...
తర్వాత ఒకే కులం లో ప్రేమ పెళ్ళిళ్ళు...
తర్వాతి కాలంలో కులాంతర, మతాంతర వివాహాలు...
ఇప్పుడు సమలైంగిక వివాహాలు(కొన్ని దేశాల్లో)
సహా జీవనం,
కాంట్రాక్టు పెళ్ళిళ్ళు...
సమయాన్ని బట్టి ముందువన్నీ చాదస్తాలు, తప్పులుగా కనిపిస్తున్నాయి ఈ తరానికి...
అందుకని డేటింగ్ మీద ప్రత్యేకంగా వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు...
జీవిత భాగస్వామి సరి అవునో కాదో తెలుసుకోవడానికి
ఒక చూపు చాలు / ఒకోసారి ఓ జీవితం కూడా సరిపోదు.
@శ్రీ
ముందుగా మీకు అభినందనలు..వివాహ వ్యవస్థలో వచ్చిన మార్పులు, చేర్పులు అని పుస్తకం రాయచ్చు మీరు!! :))
Deleteడేటింగ్ కు వ్యతిరేకిని కాదు నేను. మారుతున్న కాలం తో పాటు మారాలి, నిజమే! కాని మరీ సంవత్సరం పైగా డేటింగ్ చేసి, సారీ అంటే ఎలా?
ఇలా ప్రతి స్పందనలో మీరు మంచి analysis తో స్పందిస్తారని ఆశిస్తూ, మీకు ధన్యవాదాలు శ్రీ గారు.
వెన్నెల గారూ!
Deleteనేను డేటింగ్ ని సమర్ధించడం లేదు...
అలాంటి విదేశీ పోకడల్ని అనుసరించి...
ఆడపిల్లలు అనవసరంగా అపవాదులకి గురి అవుతున్నారు...
ఒక మగవాడు పదిమందితో డేటింగ్ చేస్తే....సెలెక్ట్ చేసుకుంటున్నాడు అంటారు..
అదే ఆడపిల్ల డేటింగ్ చేస్తే... అదే జనం...పదిమందితో తిరిగిందంటారు...
అందుకని ఈ డేటింగ్ అనేది మన ప్రస్తుత కాలమాన పరిస్థితులకి సరిపడదేమోనని నా అభిప్రాయం.
@శ్రీ
:))
Deleteమీ బ్లాగ్ కి సరైన పాట దొరికినట్లుంది వెన్నెల గారూ! :-)
ReplyDeleteపాట బాగుంది.
@శ్రీ
:)) Thank you so much.
Deleteశ్రీ గారి కామెంటు కి డిటో. వారి రెండో కామెంటుకి ఇంకో డిటో.
ReplyDeleteఅయితే నా స్పందన కూడా మీ కామెంట్ కి డిటో, డిటో :)))
Deleteధన్యవాదాలండి చదివి, స్పందనను తెలియచేసినందుకు.
వంద రకాల ఈక్వేషన్లతో జరగుతున్నాయి నేటి పెళ్ళిచూపులైన..పెళ్ళిళ్ళయినా!
ReplyDeleteవెన్నల గారు, మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని కవిత రూపంలో చెప్పాలన్న మీ తాపత్రయం అభినందనీయం! బాగుంది..:)
సురేష్ గారు సరదాకి చిరు కవితలు అన్న మాట.
Deleteపెళ్ళి చూపుల విషయం లో మీరు గమనించింది నూటికి నూరు పాళ్ళు నిజమే.
మీ స్పందనకు ధన్యవాదాలండి
భలేవుంది! వెన్నలా నేను ఒక తమషా చెబుతాను. మేము మా అమ్మాయికి పెళ్లి సంభదాలు చూస్తున్నాం.అయతే అందులో అన్ని నచ్చుతున్నాయి ,అభిరుచులు వగైరాలు కానీ జాతకాలు కుదరక మరీ పదినెలలు కాదు కానీ ఓనెల లోపు వద్దులే అనేస్తున్నారు అది పెద్ద వాళ్ళ ద్వారా!! మరీ దీనిని ఏమందాం?మిగతా అన్ని బావుంటున్నాయి కానీ జాతకం నప్పలేదు అని కొన్ని రోజులు ఆగక చెప్పడం
ReplyDeleteమొత్తంకి భలే రాసారు పద్య రూపం లో. చాల బావుంది
షూట్ చెయ్యకపోయారా వాళ్ళందరినీ?
Delete100% match అయిన జాతకాలు ఉన్నవారు మహా ఆనందం గా ఉన్నారు అని ఎక్కడన్న రాసి పెట్టిఉందా? మన చాదస్తం కాకపోతే?
అబ్బాయిలేమన్న అక్కడ వేరే equations మనసులో పెట్టుకుని ఆడిస్తున్నారేమో ఆ నాటకం?
అయినా నెల రోజులకి కాని తెలీదా జాతకం match అయ్యిందో లేదో? ఈ సారి మీరు అడగండి ముందే జాతకాల మీద నమ్మకం ఉందా అని, వారు వుంది అంటే మీరే అడగండి ముందు అబ్బాయి జాతకం ఇమ్మని, match చేసి చూసి సరిపోకపోతే అమ్మాయిని అసలు చూపించకండి. మరీ తమాషా అయిపోయింది. ధన్యవాదాలండి మీకు.
మీ పెద్దోళ్ళు ఉన్నారే.. మమ్ములను ఎప్పుడు అర్ధం చేసుకోరు.. మీకు మీకు నచ్చితే సరిపోతుందా... మా ప్రాబ్లంస్ మీకు తెలియవు... ఒకప్పుడు పెళ్లి జరిగితే జీవితం కష్టం అయినా సుఖం అయిన కుటుంబం కోసం కలిసి ఉండ్డేవారు.. ఇప్పుడు అలా కాదు చిన్న విషయము కూడా వీడాకుల వరకు పోతుంది ... ఇప్పుడు ఎవరికీ వారే ఎక్కువ అన్న ఫీలింగ్ పెరిగింది నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అన్న ఫీలింగ్ లో ఇప్పటి యూత్ ఉన్నారు.. సో కలసి ఉండవలసింది వారు కాబట్టి వారికే వదిలేయండి... మేము ఇలా చేసుకున్నాము మీరు కూడా అల చేసుకోండి అండి చెప్పకండి...
ReplyDeleteరామ రామ ఎంత మాట తమ్ముడు!
Deleteఇలా అపార్ధం చేసుకుంటే ఎలా?
నేను అభ్యంతరం చెప్పింది సంవత్సరాల తరబడి తిరిగి, ఫైనల్ గా నచ్చలేదు అని చెపుతున్నారు అని.. నీకొక విషయం చెప్పాలి. ఆ డేటింగ్ జరుగుతున్న కాలం లో పాపం పిచ్చి తల్లితండ్రులు మధ్య విడదీయరాని స్నేహం కూడా ఏర్పడిపోతుంది. (అమ్మాయి parents and అబ్బాయి parents కి)..ఇంతలో సారీ అనేస్తున్నారు అమ్మాయి, అబ్బాయి...ఇదెక్కడి గోల అని అడుగుతున్నాను అంతే! ఒక విషయం చెప్పు ...ఈ ఎక్కువ తక్కువ ఫీలింగ్లు, ఈ విడిపోవడాలు ముందు ముందు వివాహ జీవీతం లో ఉంటాయో ,లేదో ఎలా తెలుస్తాయి? అమ్మాయితో సంవత్సరం డేటింగ్ తరువాతా? మేము ఎలా చేసుకున్నా , మీరు మీ ఇష్టానుసారం గా చేసుకుని హాయిగా ఉండాలనే మా కోరిక కూడా..
అలోచించు ఒక్క సారి..
ha ha this is what we call generation gap :P (just kidding ) Nice thoughts!
ReplyDeleteశ్రావ్య ఉండండి చెపుతాను మీ పని. జెనరషన్ గాప్ అంటారా? హమ్మా?
Deleteలేదు శ్రావ్య గారు, జెనరషన్ గాప్ ఉన్నా చాలా మటుకు స్నేహితుల లానే ఉండాలని ట్రైయింగు! అర్ధం చేసుకోవాలి యౌత్!!!
ధన్యవాదాలు మీ స్పందనకు.
చిన్నప్పుడు మట్టి తినడం అంటే మనకిష్టం...కాని మన పెద్ద వాళ్ళు తినొద్దు అని తిడితే మనం ఎడిచేవాళ్ళం... అదే మనం పెద్దవాళ్ళం అయినతరువాత ఇప్పుడున్న చిన్నపిల్లలు మట్టి తింటుంటే తినొద్దు అని అరుస్తాము.....చిన్న పిల్లలాగా ఉన్నప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది.. పెద్దవాల్లం అయినప్పుడు అరవడం కరెక్ట్ అనిపిస్తుంది...దీన్నే జెనరేషన్ గ్యాప్ అని మన వాళ్ళు అంటారు.. కాని చిన్నప్పుడు మట్టి తినడం వలన నోరు మాత్రమె పాడవుతుంది, కానీ ఈ డేటింగ్ వలన జీవితమే పాడవుతుంది. నోరు కడుక్కుంటే బాగావుతుంది కాని ఒకసారి కోల్పోయిన జీవితం ఏమి చేస్తే తిరిగొస్తుంది....? జలతారువేన్నెల గారు మీ అభిప్రాయం బావుంది,, దానికి నా తరుపున అభినందనలు....
ReplyDeleteడేటింగ్ కి నేను వ్యతిరేకిని కాదు సతీష్ గారు, కాని టైం లిమిట్ లేకుండా సంవత్సరాల తరబడి చేసేదాని డేటింగ్ అనరు కదా...టైం పాస్ అని తెలిసిపోతుంది.. ఈ లోగా అమ్మాయికి కాని , అబ్బాయికి ఇంకా అందమగా, హోదగల అమ్మాయి/అబాయి తగిలితే , సారీ మా అభిరుచులు కలవలేదు అని సాకు. అందుకే డేటింగ్ with some time limit ని propose చేస్తున్నాను. మీ స్పందనకు ధన్యవాదాలు
Deleteఎందు వల్లనో ఈ మధ్య యువతలో భక్తి భావం పెరిగి పోతోంది . సంప్రదాయాలంటే మక్కువ పెరిగి పోతోంది . ప్రేమ వివాహాల విముఖత - పెద్దలు కుదిర్చిన వాటిపై సుముఖత పెరిగి పోతోంది . విదేశీ పధ్ధతుల పైన కంటే ప్రాంతీయ పధ్ధతులను ఇష్ట పడుతున్నారు .అభద్రతా భావన వల్లనేమో .... ?
ReplyDeleteమీ పోష్టు హేతుబధ్ధంగా ఉంది .
----- సుజన-సృజన
మాష్టారు, నిజమే! సరిగా పట్టారు మీరు. "అభద్రతా భావన వల్లనే అయి ఉండొచ్చు.
Deleteధన్యవాదాలు మాష్టారు!
వెన్నెల గారూ, మీ కవితా సందేశం చాలా బాగుంది, అభిప్రాయాన్ని కచ్చితంగా ఎలా చెప్పాలో యువతరానికి వివరించారు.
ReplyDeleteమీ స్పందన కి ధన్యవాదాలు ఫాతిమ గారు.
Deleteమన యువత పెద్ద భ్రాంతి లో ఉన్నారు ఎన్నాళ్లు డేటింగ్ చేసినా ఒకరినొకరు తెలుసుకోవడం కష్టం.విదేశాల్లో ఈ డేటింగ్ ఎప్పటినుంచో ఉంది కదా? మరి అక్కడే విడాకుల కేసులు కూడా ఎందుకు ఎక్కువ?ముఖాలు కూడా చూసుకోకుండా వివాహాలు చేసుకున్న దంపతులు చిరకాలం కలిసి ఉండగలుగుతున్నారు కదా? Made for each other అని ప్రపంచం లో ఎక్కడా ఉండరు.మనని మనమే అలా మలచుకోవాలి. అప్పుడే దాంపత్యాలు నిలుస్తాయి.
ReplyDelete"Made for each other అని ప్రపంచం లో ఎక్కడా ఉండరు.మనని మనమే అలా మలచుకోవాలి.అప్పుడే దాంపత్యాలు నిలుస్తాయి."
Deleteఎంత కర్రెక్ట్ గా చక్కగా చెప్పారండి.
ఒక అర్టికల్ లో ఇలా ఉంది."The key for successfull marriage is not finding the right person but loving the person you found!!!!"
మీకు ధన్యవాదాలండి.
డేటింగ్ మన సంస్కృతికి కొత్తేమీ కాదు లెండి.
ReplyDeleteబావామరదళ్ళ కంటే ఎక్కువ డేటింగ్ చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి?
భలే గుర్తుచేసారే! ఈ విషయం నాకు తట్టలేదు సుమి.
Deleteధన్యవాదాలండి!
Back ground song excellent.ఎదుట నిలిచే జలతారు వెన్నెలేమో!ఈ పాట నుండి మీ బ్లాగు పేరు వచ్చిందన్నమాట.ఇక మీరెన్నుకున్న టాపిక్ ఎప్పటికి చర్చనీయాంశమే.ప్రేమించినా ఒకరికొకరు అర్థం కారు.dating చేసినా అర్థం కారు.పెద్దలు కుదిర్చినంత మాత్రమే సరిపోదు.కలిసి జీవించటానికి ప్రయాణం మొదలుపెట్టినప్పటినుండి సరి అయిన అవగాహనతో ప్రేమ పునాదిగా జీవించాలని తెలుసుకుంటే చాలు.మంచి చర్చ పెట్టారు.ఇక ప్రాస సరే సరి.
ReplyDeleteఈ పాట సిరివెన్నెల గారు రాసారు. ఈ చిత్రం లో అన్ని పాటలు చాలా బాగుంటాయి.
Deleteమీకు కూడా నచ్చినందుకు సంతోషం. ప్రేమ పెళ్ళిల్లు, పెద్దలు కుదిర్చిన పెళ్ళిల్లు, డేటింగ్ చేసి జీవిత భాగస్వామిని ఎన్నుకున్న పెళ్ళిల్లు ఏవైనా సరే మీరన్నట్టు ఒకరినొకరు అర్ధం చేసుకుని సహజీవనం చెయ్యాలి. మీరు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు రవిశేఖర్ గారు.
జలతారువెన్నెల meaning chepthara?
ReplyDeleteజలతారు అంటే మెరిసే బంగారు తీగల్లాగా (దారాల్లాగ)అని అర్ధమని ఒక సారి నాకు మధురవాణి గారు చెప్పారు. వాన సినిమా లో సిరివెన్నెల గారు రాసిన పాట (నా బ్లాగ్ లో వచ్చే పాట) లో ఆ పదం ఉంటుంది. అది నేను అర్ధం చేసుకున్నది "bright water fall" లాంటి వెన్నెల అని..కాని సరైన అర్ధం ఇది అని చెప్పింది మధురవాణి గారు. జలతారువెన్నెల అంటే మెరిసే బంగారు తీగల్లాఅంటి వెన్నెల అని అర్ధం. :))
Delete