Tuesday, July 17, 2012

పుట్టిన రోజున తిట్లు-అవే దీవెనలు!


హడావిడిగా ఇంట్లో అడుగుపెడుతూనే స్కూల్ బాగ్ విసిరేసి.."అమ్మా..అమ్మా."అని గట్టిగా అరిచినంత పని చేసింది శ్రేయ."ఏంటా అరుపులు? కొంచెం గొంతు తగ్గించు"అంటూ లోపల నుంచి వచ్చింది ప్రియ."నేను వాలంటీరింగ్ కి వెళ్ళాలి, టైం లేదు, నాకు ఆకలిగా కూడా ఉంది"అని సమాధానం ఇచ్చింది శ్రేయ."ఐదు నిమిషాలు ఆగు,ఏదన్నా చేసిస్తాను."అని ఆ పనిలో పడింది ప్రియ.ఆ రోజు శ్రేయ పదహారవ పుట్టిన రోజైనా స్కూల్ కి, తరువాత ప్రతి బుధవారం చేసే వాలంటీరింగ్ కి వెళ్ళడం తప్పలేదు. ఒక్క రోజు స్కూల్ మానినా తరువాత కొన్ని రోజులుగా పెరిగే చదువు భారం తలచుకుని ఒక్క రోజు కూడా స్కూల్ మానడానికి ఇష్టపడదు శ్రేయ.అలాగే వాలంటీరింగ్ కూడా మానడానికి ఇష్టపడదు.శ్రేయ ని హాస్పిటల్ దగ్గర దించుతూ అంది ప్రియ"శ్రేయా,ఎనిమిదింటికల్లా వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాము నేను,నాన్న.డిన్నర్ కి వెళదాము"అని."సరే"అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శ్రేయ.శ్రేయ రాకకై ఎదురుచూస్తూ గడిపింది ఆ సాయంత్రం ప్రియ.అందరు పదహారవ పుట్టిన రోజు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. శ్రేయ గట్టిగానే చెప్పింది తల్లితండ్రులిద్దరికి,తనకలాంటివి నచ్చవని.చేసేదేమి లేక ఆ రోజు డిన్నర్కి శ్రేయకి ఇష్టమైన రెస్టారంట్ కి తీసుకెళ్ళటానికి నిశ్చయించుకుంది ప్రియ.

హాస్పిటల్ దగ్గర అసహనంగా ఎదురుచూస్తుంది కూతురి కోసం ప్రియ.టంచనుగా ఎనిమిది కొట్టగానే బయటికి వచ్చే శ్రేయ ఆ రోజు ఇంకా బయటకు రాలేదు.అరగంట దాటినా శ్రేయ హాస్పిటల్ నుంచి బయటకు రాకపోవడంతో అసహనంగా ఒక టెక్ష్ట్ మెస్సేజ్ కొట్టింది శ్రేయ కూతురికి.రిప్లై రాలేదు.కొద్దిగా భయ్యం వేసింది ప్రియకి.ఇలా ఎప్పుడు జరగలేదే..ఇంత ఆలశ్యం ఎందుకయ్యిందా అని కారు దిగి,హాస్పిటల్ వైపు వడి,వడిగా  అడుగులు వేయసాగింది శ్రేయ.ఇంతలో సెల్ మోగింది.నంబర్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది."ఎందుకు ఇంత లేట్?వర్క్ ఇంకా ఉందా"అని అడిగింది ఫోన్ తియ్యగానే ప్రియ.తల్లి గొంతు వినగానే బావురుమంది శ్రేయ.విషయం అర్ధం కాక,కూతురు ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారు పడిపోయింది ప్రియ.ఇంటికి వెళ్ళిపోదాము,ఇంక డిన్నర్ కి వద్దు అని ఏడుస్తూనే చెప్పింది శ్రేయ.

ఇంటిలోకి అడుగుపెట్టాక శ్రేయ కొంచెం శాంతించాక విషయం కనుక్కుందాము అని ఆగింది ప్రియ.శ్రేయ ఒక పేరు మోసిన హాస్పిటల్ లో పేషంట్ సప్పోర్ట్ సర్వీసెస్ విభాగంలో వాలంటీరింగ్ చేస్తుంది.వారానికి నాలుగు గంటలు పని చెయ్యాలి. పేషంట్స్ ని డిస్చార్జ్ చెయ్యడం..వాళ్ళకి పువ్వులు అవి ఇచ్చి,వారితో మాట్లాడడం,వారికి కావాల్సినవి తెచ్చి ఇవ్వడం.,లాబ్స్ కి పేషంట్స్ బ్లడ్ సాంపల్స్ తీసుకెళ్ళడం లాంటి పనులు చెయ్యాలి.ఒక్కో రోజు బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన రోజులు కూడా ఉండేవి.హాస్పిటల్ చాలా పెద్దది కావున,ఒక్కొక్క విభాగం చాలా చాలా దూరం గా ఉంటాయి.నడిచి నడిచి కాళ్ళు నొప్పి అని కూడా అప్పుడప్పుడు తల్లికి చెపుతుంది శ్రేయ. అయితే ఏ రోజున నేను వెళ్ళను అనేది కాదు, ఎంతో ఇష్టం గా వెళ్ళేది.

నెమ్మదిగా తనను తాను సంభాలించుకుని జరిగింది చెప్పసాగింది శ్రేయ.ఆ రోజు సుమారుగా 7:30కి ఒక పేషంట్ ని డిస్చార్జ్  చెయ్యాల్సి రావడంతో పేషంట్ ని నర్స్ వీల్ చైర్ లో కూర్చోపెడితే అతనితో కబుర్లు చెబుతూ హాస్పిటల్ బయటికి తీసికెళ్ళింది శ్రేయ. పేషంట్ తాలూకా ఇద్దరు బంధువులు వచ్చి,కారు హాస్పిటల్ ద్వారానికి దగ్గరగా తెచ్చారు. చలి కాలం, స్నో పడుతుంది ఆ రోజు. పేషంట్ ని నెమ్మదిగా వీల్ చైర్ లోంచి లేపారు ఇద్దరు బంధువులు.ఇంతలో బంధువులలో ఒకరు కారు డోర్ అన్లాక్ చేసానా అని పేషంట్ ని వదిలి కారు డోర్ దగ్గరకి వెళ్ళగా పేషంట్ బరువైన మనిషి కావడం వలన జారిపోయి కింద పడిపోయాడు. రెప్ప పటులో జరిగిపోయింది అంతా! వెంటనే పేషంట్ ని పట్టుకున్న అతను శ్రేయ మీద విరుచుకు పడ్డాడు...అంతా నీ వల్లనే..పడిపోతున్న మనిషికి చేయూతను ఇవ్వలేదు అని గట్టిగా దుర్భాషలాడడం మొదలుపెట్టాడు.శ్రేయ పేషంట్ పడిపోతుంటే ఒక్క ఉదుటున ముందుకు ఉరికింది కాని,ఇంతలో ఎన్నోసార్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పిన రూల్స్ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఎట్టి పరిస్థితులలోను పేషంట్ ని వాలంటీర్స్ హాస్పిటల్ బయటికి వచ్చాక టచ్ చెయ్యకూడదు. పేషంట్ తరుపు వారు వుంటారు,వారిదే పూర్తి బాధ్యత పేషంట్ ఒక్కసారి హాస్పిటల్ బయటికి వచ్చాక. హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా  పేషంట్ ని ఎక్కువగా ఫిసికల్ గా టచ్ చెయ్యకూడదు అన్నది చాలా ముఖ్యమైన రూల్ .మొట్టమొదటి వాలంటీరింగ్ మీటింగ్ లోనే చెప్పారు హాస్పిటల్ వారు.దేనినైనా సహిస్తారు కాని,ఒక్కసారి రూల్ అతిక్రమిస్తే మాత్రం చాలా త్రీవ్రంగా పరిణామాలు ఎదురుకోవల్సి వస్తుంది హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి అని శ్రేయకి తెలుసు.

అది గుర్తుకువచ్చి వెంటనే శ్రేయ వెనక్కి వెళ్ళిపోగా,పేషంట్ బంధువు కోపానికి బలి అయిపోయింది.అసలే నల్లవాడు(ఆఫ్రికన్) కావడంతో ఆజానుబాహుడైన అతను నోటికి వచ్చినట్టు తిట్టడంతో శ్రేయ కి ఏమిచెయ్యాలో తెలియక అలా నోట మాట రాక ఉండిపోయింది.అతను తిడుతూనే ఉన్నాడు.అసలే స్నో పడుతూ ఉండటం వలన,జారిపోయిన పేషంట్ కొద్దిసేపు వరకు కొలుకోలేక పోయాడు.జనం చేరారు,అతనిని మళ్ళీ హాపిటల్ లోకి తీసుకుని వెళ్ళారు.శ్రేయకి తను చేసినది తప్పో,ఒప్పో అని అలోచనే కాక,ఇప్పుడు ఆ పేషంట్ కి ఏమౌతుందా అన్న భయ్యం కూడా పీడించసాగింది.ఆ ఆఫ్రికన్ అతను శ్రేయను తిట్టడం మానలేదు.చాలా పెద్ద గొంతుతో హాస్పిటల్ అంతా వినిపించేలా కేకలు వేస్తూనే ఉన్నాడు.శ్రేయ బిక్కచిక్కిపోయి అందరి ముందు తిట్ట్లు తినడమే కాక,తప్పు చేసానా అని భయ్యం తో వణికిపోసాగింది.ఇంతలో గొడవంతా తెలిసి వాలంటీరింగ్ అధికారి ఒకరు వచ్చి,జరిగినదంతా చెప్పమని అడగగా శ్రేయ జరిగినది అంతా చెప్పింది.ఒక పుస్తకం తెచ్చి చెప్పినదంతా రాసి సంతకం పెట్టమన్నాడు ఆ అధికారి.ఇంటికి వెళ్ళు ప్రస్తుతానికి,రేపు నీకు కాల్ వస్తుంది వాలంటీరింగ్ హెడ్ దగ్గర నుంచి,అని చెప్పి పంపించేసాడు.అతను నువ్వు చేసినది సరి అయిన పనే,పర్వాలేదు వెళ్ళు, రేపు మాట్లాడుకోవచ్చు అన్నాడు.

జరిగినదంతా తల్లితండ్రులకు చెప్పి బోరుమని ఏడ్చింది శ్రేయ.ఎంతో అపురూపం గా ఒక్క మాట కూడా అనకుండా శ్రేయని పెంచారు తల్లితండ్రులిద్దరు.నెమ్మదిగా తనని ఊరుకోబెట్టారు.ఎంత బతిమాలినా భోజనం చెయ్యనని భీష్మించుకున్న అమ్మయిని చూసి శ్రేయ తండ్రి మనస్సు బాధతో విలవిలలాడింది.ఆ రోజు రాత్రి ప్రియ తొ ప్రియ భర్త,"ఎందుకు ప్రియా,శ్రేయకు ఈ వాలంటీరింగ్ అవి అవసరమా?బుధ్ధిగా చదువుకుంటుంది కదా?ఇవన్నీ ఏమిటసలు?"అని అడిగాడు.ఇక్కడ అందరు చిన్నపటి నుంచి ఎక్కడో ఒకచోట ఇలా తోచిన వాలంటీరింగ్ చెయ్యడం చూస్తూనే ఉన్నారు కదా? Giving back to the community concept మనకి తెలియనిదా? అందులోను శ్రేయ తనే ఇష్టపడి చేస్తుంటే వద్దు అని ఎలా చెపుతాము అని జవాబు ఇచ్చింది ప్రియ.

ఆ రోజు ఆ ఇంట్లో ఎవ్వరికి నిద్ర పట్టలేదు. అందులోను పదహారవ పుట్టిన రోజున శ్రేయకు ఇలా జరగడంతో ప్రియకెందుకో చాలా బాధగా అనిపించింది.మరునాడు ఆఫీస్ లో ఉండగా ప్రియకి ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి.ఫోన్ ఎత్తగానే వాలంటీరింగ్ హెడ్ మాట్లాడసాగింది.శ్రేయ తమ హాస్పిటల్ తరపున వాలంటీర్ గా పని చేస్తున్నందుకు గర్వపడుతున్నామని,రాత్రి జరిగిన సంఘటనలో తను రూల్స్ కి అనుగునంగా నడుచుకుందని, అవేశంతో ఉన్న పేషంట్ బంధువుకి ఎదురు ఒక్క మాట కూడా చెప్పకుండా మళ్ళీ హాస్పిటల్ కి వచ్చి జరిగింది జరిగినట్టు చెప్పి వెళ్ళిందని,పొగుడుతూనే ఉంది.భారమైన మనసుతో సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రియ.సాయంత్రం ఇంటికి రాగానే కూతురు మౌనంగా ఉండడం చూసి,దగ్గరగా వెళ్ళి తనకి వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పింది ప్రియ కూతురికి.శ్రేయ ఒక చిన్న చిరునవ్వు నవ్వి,"నాకు కూడా మైల్ వచ్చిందమ్మా.You don't worry, I am alright" అని సమాధానం చెప్పింది.నవ్వుతున్న కూతురుని చూడగానే మనసులో బాధ అంతా ఎవరో తీసేసినట్లు అనిపించింది ప్రియకి.ఆ రోజు రాత్రి భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెపుతున్న కూతురిని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ప్రియ భర్త.మరి ఇంక మానేస్తావా వాలంటీరింగ్ అని తండ్రి అడిగితే "No way dad!! పాపం ఆ పేషంట్ వాళ్ళ బంధువు అతనికి ఏమయిపోతుందా అన్న కోపం లో నన్ను తిట్టాడు కాని, నా మీద అతనికేమి కోపం?"అని అంటున్న కూతురుని చూస్తూ ఉండిపోయింది ప్రియ.

తరువాత కొద్ది రోజుల్లోనే ఆ హాస్పిటల్ వాలంటీరింగ్ department మొత్తానికి student coordinator గా ఎన్నుకున్నారు శ్రేయని. గత ఐదు సంవత్సారలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది శ్రేయ ఆ హాస్పిటల్ లో!ఈ తరం పిల్లలని చూసి గర్వ పడాల్సిందే అనుకుంది ప్రియ. 

57 comments:

  1. Inspiring!
    Hats off to Sreya and her parents :)
    Loved the narration.

    --
    h

    ReplyDelete
  2. మీరెంచుకున్న అంశం, అది వివరించిన తీరు ఆకట్టుకున్నాయి. ఇది నిజంగా జరిగినదో, మీరు కల్పించినదో తెలియదు కానీ, కొన్ని సందర్భాల్లో మౌనానికి మించిన ఆయుధం లేదన్న నా పాలిసీని బలపరిచింది :) పాపం ఆ పేషంట్ వాళ్ళ బంధువు అతనికి ఏమయిపోతుందా అన్న కోపం లో నన్ను తిట్టాడు కాని, నా మీద అతనికేమి కోపం? ముచ్చటేసింది. నిజమే! ఈ రకంగా ఆలోచిస్తూ, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోగలగటం నిజంగా ప్రశంసనీయం.

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారు, నిజజీవితంలో నాకు కాని, చుట్టూ ఉన్న స్నేహితులకు కాని జరిగిన సంఘటనలు మాత్రమే నేను కథలు గా రాస్తూ ఉంటాను. ఇది నూటికి నూరు పాళ్ళు పదహారవ పుట్టినరోజున శ్రేయ ఎదురుకున్న సంఘటనే!!మీకు నచ్చినందుకు సంతోషం. అలాగే చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపినందుకు కూడా ధన్యవాదాలు.

      Delete
  3. జరిగినదానిని అర్ధం చేసుకుని తిరిగి మళ్ళీ వెళ్ళాలనుకున్న శ్రేయకు అభినందనలు. బాగా వ్రాశారు వెన్నెల గారూ..

    ReplyDelete
    Replies
    1. నిజమే జ్యోతిర్మయి గారు,శ్రేయను అభినందించాల్సిందే! మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. మౌనమె నీ భాష ఓ మూగ మనసా. అసలు కోపం వస్తే మాట్లాడటం మానెయ్యడం మంచిది. ఇది నా పాలసీ

    ReplyDelete
    Replies
    1. అంతేనండి. మంచి మాట సెలవిచ్చారు. మీకు ధన్యవాదాలు.

      Delete
  5. చాలా బాగుంది కథ.
    శారద

    ReplyDelete
  6. తీరికగా మా పిల్లలకి చదివి వినిపిస్తాను ఈ కథ. బహుశా మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటానేమో.మీరు వ్రాసిన విధానం కథలా ఉంది. ఇది నిజమే అనుకుంటాను, ఇప్పటి వరకూ మీరు వ్రాసిన ఇలాంటి విషయాలని బట్టి.

    ReplyDelete
    Replies
    1. లలితగారు జరిగిన సంఘటనలను మాత్రమే కథలుగా రాసే అలవాటు నాది. మీకు తెలుసినట్టే ఉంది ఈ విషయం. అవునండి చెప్పండి మీ పిల్లలకు. ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరిగినా వాళ్ళు నిరుత్సాహపడకుండా సరి అయిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  7. స్వీట్ సిక్స్ టీన్ రోజున అమ్మాయికి ఓ చేదు అనుభవం ఎదురైనా ..మంచి విచక్షణ తో ప్రవర్తించడం నేర్చుకుంది.
    గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ కాన్సెప్ట్. ..
    ఎంత గొప్ప ఆచరణ.
    శ్రేయ కి అభినందనలు. చెప్పండి.
    పిల్లలను సేవా భావం వైపు పయనిన్పజేయడం తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప సుగుణం.
    శ్రేయ తల్లిదండ్రులకు అభినందనలు.
    శ్రేయ ని చూస్తుంటే.. లాస్వేగాస్ లో ఉంటున్న మా ఫ్రెండ్ కూతురు గుర్తుకువచ్చింది. తను శ్రేయ లాగానే!!

    ReplyDelete
    Replies
    1. వనజ గారు, నేను శ్రేయకు చెపుతూ ఉంటాను, పుట్టిన రోజున దేవుడు ఎందుకో ఇలాంటి సంఘటన నీకు ఎదురయ్యేలా చేసాడు అని..మీ స్పందనకు ధన్యవాదాలు. మీ ఫ్రెండ్ కూతురికి నా ఆశీస్సులు.

      Delete
  8. ఇక్కడ తొక్కలో don't do లు ఎక్కువ. సమయానుసారంగా ఎలా మెలగాలో వాళ్లకి తెలియదు, మిగతావాళ్ళను బలిపశువులను చేస్తారు. ఒక్క హాస్పిటల్ ఏమి కర్మ స్కూల్ , లైబ్రరీ, పార్క్స్ ప్రతీ చోటా ఇంతే. స్కూల్ ప్లే గ్రౌండ్ లో పిల్లలు దెబ్బలు తగిలించుకుంటే రూల్స్ పేరు చెప్పి టీచర్స్ పేరెంట్స్ కి కాల్ చేస్తారు తప్పిస్తే, అక్కడ ఫస్ట్ ఎయిడ్ ముఖ్యం అని ఆలోచించరు. పాపం శ్రేయ రూల్స్ పాటించి మళ్ళీ వాలంటీర్ గా పని చేసే భాగ్యాని దక్కించుకుంది.

    ReplyDelete
    Replies
    1. Raam gaaru, sometimes it's important that we go by the rules. I understand your concern about kids getting hurt at schhol and parents being called for minor accidents. But they are bound by the laws of school and county .. Laws of this country are different. So ..yeah at times.. it's sad but ...Thanks for the comment.

      Delete
  9. చాలా బాగా రాసారు వెన్నెల గారు.... శ్రియకు అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగేంద్ర గారు.

      Delete
  10. నిజమే కదండీ యువతలో ఆ బాధ్యతాయుతమైన భావన రావడం గొప్పే కదా...బాగుంది మీ కథనం... అభినందనలు మీకు శ్రేయకు, ప్రియ గారికి...

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు, మీ అభినందనలు తప్పక తెలియచేస్తాను. కధనం నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు మీకు

      Delete
  11. Replies
    1. జీడిపప్పుగారికి నా నిరసన తెలియజేసుకుంటున్నాను.
      మీ బ్లాగులిష్టులో నా బ్లాగు 'శ్యామలీయం' లేదేమండీ? ఆఁయ్?

      ఇకపోతే, జలతారువెన్నేలగారూ,
      మీ కథ(?) కథనం రెండూ బాగున్నాయి.

      Delete
    2. జీడిపప్పు గారు, Yes, it is a true incident. Thanks for your comment. And welcome to my blog.

      Delete
    3. శ్యామలీయం గారు, మీరు బాగుంది అంటే నాకు నిజంగా చాలా సంతోషం గా ఉందండి. కథ లా రాసిన జరిగిన ఒక సంఘటన. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
    4. శ్యామలీయం గారు, మీ బ్లాగును కవితల విభాగంలో కలిపాను

      Delete
    5. జీడిపప్పుగారు, తమాషాకి అన్నానండి. మీరు నా బ్లాగు కలపకపోయినా ఫరవాలేదు.
      ఇలాంటి మంచి లిష్టింగ్ ఒకటి ఉంటే బాగుండు ననుకున్నా చాలా సార్లు.
      కాని, యెంత మంచి లిష్టింగ్ చేసినా యేవో కొన్ని దృష్టికి రానివి ఉండనే ఉంటాయి.

      Delete
  12. స్థితప్రజ్ఞతను మించింది లేదు.అందరి శ్రేయస్సును కోరే శ్రేయ సార్థకనామధేయురాలు.

    ReplyDelete
    Replies
    1. ఉమా దేవి గారు, బాగున్నారా? ధన్యవాదాలండి మీ స్పందనకు

      Delete
  13. "తనకుమాలిన ధర్మానికిపోతే తాట లేచి,తీట తీరిందట" అలా వుంది సంగతి!!
    ఆ పేషెంట్ కి ఏమైనా ఐతే అప్పుడుండేది శ్రేయమ్మ పని,వారి అమ్మానాన్నల పని.......
    ఏమిటో ఈ మధ్య అందరూ బ్లాగుల్లో సమాజోద్ధరణ గురించి మాట్లాడుతున్నారు ఆచరణ సంగతేమో కానీ మరి???

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ చూస్తే నవ్వొచ్చింది నాకు. సరే ఫెషంట్ కి ఏమన్నా అయ్యిందే అనుకుందాము. దానిలో శ్రేయ తప్పేమి ఉండదు. ఒకవేళ శ్రేయ ఆ పేషంట్ ని వీల్ చైర్ మీద నుంచి తోసేస్తే అప్పుడు తన తప్పు ఉండేది. Volunteers are fully protected by Hospital management as long as they obey the rules!!
      కాబట్టి మీరట్టే ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. :))
      ఇంక మీరు రాసిన చివరి లైన్..."బ్లాగుల్లో సమాజోద్ధరణ గురించి మాట్లాడుతున్నారు ఆచరణ సంగతేమో కానీ మరి???"
      పర్లేదు లేండి, మంచి అలోచన అంటూ ఉంటే వారు తప్పక ఎదో ఒక విధంగా సమాజోద్ధరణ చేస్తారు అని నాకు గట్టి నమ్మకం. అలోచనే లేని వారు, అలోచిస్తున్న వారిని మాటల తూటాలతో వెనక్కి లాగేవాళ్ళను చూస్తేనే నాకు బాధ వేస్తుంది. మీరు ఈ పోస్ట్ చూడండి..

      http://ramugvs.blogspot.com/2012/07/blog-post.html?showComment=1342555137101#c7687369497837881314

      Delete
    2. జలతారువెన్నెల గారు, ఇలా పేరు వూరు లేని రాతలకి సమాధానం ఇవ్వడం అంటే వాళ్ళని ప్రోత్సహించడమే. వీళ్ళు మాంసం తిన్నామని గుర్తుగా ఎముకలు మేడలో వేసుక తిరగే బాపతు. అలానే ఎదుటివాళ్ళను ప్రూఫ్స్ అడుగుతున్నారు. కొన్ని విస్మరిస్తే మానసిక ఆందోళన వుండదు.

      Delete
    3. Will follow your advice going forward. Thanks Ram garu.

      Delete
  14. పిల్లలను 'తల్లి దండ్రులు - పాఠశాల - సమాజం' ఎలా పెంచితే అలా పెరుగుతారు .
    'సేవా భావన - సామాజిక బాధ్యత ' అలవడ్డం , అలవడక పోవడం - అనే రెండింటికీ బాధ్యత పై మూడింటిదే .
    ఇక్కడ పై మూడూ స్వార్థాన్ని మాత్రమే బోధిస్తున్నాయి .
    'యువతరం ' బాగా చదవడం , ర్యాంకు తెచ్చుకోవడం , మంచి ఉద్యోగం , బాగా ఆర్జించడం , అనుభవించడం - మాత్రమే చేస్తూ ఉంది .
    చివరకు తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు .
    ఇక ...సేవాభావన .... కు చోటెక్కడ ?
    మీ లాంటి రచయితల కథనాలైనా పై మూడింటి' వికృత మనస్తత్వాన్ని' మార్చగలిగితే .....బావుణ్ణు .
    కొనసాగించండి .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మాష్టారు, ఇక్కడ పెరుగుతున్న పిల్లలు చాలా మంది నేను రాసినట్టు గానే ఉన్నారండి.పోటి ప్రపంచంలో తల్లితండ్రులే పిల్లలని చాలా మటుకు చెడుపుతున్నారనే భావన నాకు ఉంది. మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  15. జీవితంలో ఒక్కోసారి కొన్ని క్లిష్టప్రశ్నలు ఎదురవుతుంటాయి.
    జీవితంలో రూల్స్ పాటించటం ముఖ్యమా ? లేక మానవత్వం ముఖ్యమా ? అని.
    చక్కటి ఆలోచనాత్మక పోస్టును అందించినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
    Replies
    1. నిజమే అనురాధ గారు. రూల్స్ పాటించలి అని చెప్పినప్పుడు హాస్పిటల్ వాళ్ళు, తప్పదండి..కాని ఆ సమయంలో శ్రేయ ఎలా నడుచుకుంది అన్నది ముఖ్యం. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  16. ఎంత చక్కగా రాశారో, ఒక పెద్ద రచయిత్రి లక్షణాలన్ని కనిపిస్తున్నాయి, ఎక్కడా చిన్న విషయం కూడా వదలకుండా జాగ్రత్తగా మలిచారు, కథో, నిజంగానే జరిగిందా అనే సందేహాన్ని అందరిలోరేకిత్తించగలిగారంటే,మీరు గొప్పగా రాసినట్టే,నిజమయితే శ్రేయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు,తల్లిదండ్రులకు అభినందనలు.
    keep writing.

    ReplyDelete
    Replies
    1. చాలా పెద్ద పురస్కారం అండి మీరు నాకు రాసిన ఈ కామెంట్ భాస్కర్ గారు. జరిగిన సంఘటనలు అధారం గా రాసిన కథ ఇది. మీ అభినందనలు శ్రేయకు తప్పక తెలుపుతాను. మీరు చదివి మెచ్చినందుకు ధన్యవాదాలండి.

      Delete
  17. మంచి వాళ్ళ గురించి చదివాక
    మనసు ఆనందం గా ఉంది
    ఆ అమ్మాయి కి వారి తల్లితండ్రులకు అభినందనలు.
    Nice :))

    ReplyDelete
    Replies
    1. మంచి వారిని గుర్తించిన మీరు కూడా చాలా మంచివారండి శేఖర్ గారు. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  18. వెన్నెల గారూ, రాసిన విదానం బాగుంది. మంచి రచయిత్రి అనిపించుకున్నారు.

    ReplyDelete
    Replies
    1. టీచర్ గారికి నచ్చిందంటే నేను పరీక్ష పాస్ అయినట్టే ఫాతిమ గారు.. ధన్యవాదాలు మీకు.

      Delete
    2. meereppudoo good student, naaku girl students ante chaalaa istam.

      Delete
  19. సేవా భావం ఆ వయసునుండే పిల్లల్లో కలిగించడం గొప్ప విషయం.మీ వర్ణన బాగుంది సహజంగా !మంచి సందేశం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రవిశేఖర్ గారు

      Delete
  20. Attitude మనిషినెప్పుడూ విజయపధంలోనే నడిపిస్తుంది.
    Congratulations to శ్రేయ!

    ReplyDelete
    Replies
    1. So true. Thanks for the comment. I will convey your wishes chinni aasa gaaru.

      Delete
  21. నిజంగా జరిగింది అయితే...శ్రేయకి అభినందనలు...
    మీరు వ్రాసింది కథ అయితే..స్ఫూర్తిదాయకమైన కథ...
    ఏమైనా కథనం ఆద్యంతం చక్కగా ఉంది...అభినందనలు మీకు వెన్నెల గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, జరిగినదే కథ లా రాసాను. కథనం మీకు నచ్చినందుకు సంతోషం అండి.
      ధన్యవాదాలు మీకు.

      Delete
  22. Vennela garu
    Your blog contents are generally good dealing with sensitive human emotions.
    The way you dealt this story is also very good.
    But, I would like to say my opinion;
    The young girl is always right; either helping the patient or abide by the rules as she did here.
    But, as mature adults we need to encourage youngsters to give top priority to helping a human being in
    crisis than sticking to rules. Here, had she helped the patient,neglecting rules, the worst outcome would have been negative marking by authorities or loss of volunteership. Which is more important? Praise by the hospital or helping the patient? In this situation,poor giri has to accept either hosital(sort of) abuse or the patient relative abuse.
    I mean rules are essential for normal civil life but in extraordinary situation appropriate human judgement
    makes big difference. Even here if it is a good administration they should commend if a girl helps a patient ignoring rules.
    Again most parents are selfish about the welfare of their children, so they tend to encourage sticking to the
    rules( good volunteering certificate may be helpful in future but a happy smile of a patient's relative has no
    value materially). ( I remember you wrote a good poem to get rid of all selfishness recently which was very
    Good)

    ReplyDelete
    Replies
    1. Well.. Here is my answer.
      A 16 year old is not yet mature enough to take decissions of her own in such situations. However her instant reaction was she was all set to hold the patient when he was slipping. But the rules were repeated so many times not to get in physical contact with the patient while in hospital or outside. So she was in a dilema.... and everything happened in fraction of a second !! So may be I would have reacted differently if I was in Shreya's place. However remember she is an young teenager and not an adult like us. I agree that at times responding to the situation in right way is more important than rules .. Thanks for the thoughtful comment and kind words.

      Delete
  23. Rules are made for a reason. US has too many con artists that are always on the lookout to sue big coorporations for a fast buck. There is a chance crime happening outside hospital for whatever reasons, you don't want to be in the middle of it.

    Very good informative post. Thanks for sharing. This post reminds me of last story of Bhatti-vikramaarka where being silent with no action is the answer. This kid might be 16 but has shown a lot of maturity for her age. She sure made all desi proud.

    ReplyDelete
    Replies
    1. Thanks చాతకం గారు. I think you understood the entire episode very well. Thanks again.

      Delete