Friday, July 20, 2012

తాళపత్ర గ్రంధాలు-నమ్మలేని నిజాలు



భవిష్యత్తు గురించి చెపుతారు జ్యోతిష్కులు అంటారు కదా?నేను ఇప్పటికి మరచిపోలేని సంఘటన ఒకటి జరిగింది నా జీవితం లో.చిన్నపుడు నన్ను ఎవరన్నా నువ్వు దేవుడిని నమ్ముతావా  అంటే నాకు తెలీదని చెప్పేదాన్ని.ఒక నిర్ధిష్టమైన అభిప్రాయం లేకుండా ఉండేదాన్ని.ఒక్కోసారి ఉన్నాడనిపించేది. ఒక్కోసారి లేడేమో అని సందేహము కలిగేది.అలోచిస్తూ మాత్రం ఉండేదాన్ని. అమ్మ ఎప్పుడూ చెప్పేది..మనుషులలో మంచితనమే దేవుడు...సమాజం లో మనుషులు తప్పులు చెయ్యకుండా ఎదో ఒక భీతికి కట్టుపడి ఉండాలని దేవుడు అన్నది సృష్టించారని చెప్పేది. 

ఒక రోజున విజయవాడ లో ఎవరో మడ్రాస్ నుంచి వచ్చి ఏవో తాళపత్ర గ్రంధాలు చూసి జ్యోష్యం చెపుతున్నారు అని తెలిస్తే,వినగానే కొట్టి పాడేసాను..కాని ఒక ఫ్రెండ్ చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకున్నాక అవి నిజమో , కాదో తెలుసుకోవాలని ఆకాంక్ష కలిగింది.నేను కూడా అప్పాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను.

ఒక పాత ఇంటిలో ముగ్గురు తమిల్ వాళ్ళు ఉన్నారు. అందరు మగవారే.ఫీస్ Rs.100.Date of birth అడిగారు. కొన్ని గ్రంధాలలోంచి ఒకటి తీసి,కొంచెం తిరగేసి..నీ పేరులో మూడు అక్షరాలు ఉన్నాయి.మొదటి అక్షరం "శ్రీ" తో మొదలౌతుంది కర్రెక్టేనా అని అడిగారు.తేరుకోడానికి సమయం పట్టింది..కాని ఇంతలో అనుకున్నా permutations and combinations ఎన్ని చేస్తారో చూదాము అని ఎదురుచూసాను. మరునిమిషంలో నా పూర్తి పేరు చెప్పారు.కాళ్ళ కింద భూమి కదిలిపోయిందా అనిపించింది..వెంటనే నా కుటుంభసభ్యుల పేర్లు కూడా చెప్పారు. ఇంక నాకు ముచ్చెమటలు పట్టి ,మొదటి సారిగా భయ్యం అంటే ఏంటో తెలిసింది..నా పరిస్థితి చూసి ఆయన అడిగారు...continue  చెయ్యనా అని, నాకు ధైర్యం లేదు ఇంక...అయినా సరే అని అక్కడే ఉండిపోయాను..ఒక అరగంట నా past, present, future గురించి చెప్పారు. అన్నీ record చేసి ఇచ్చారు. పాస్ట్ అంతా కళ్ళకు కట్టినట్టు అన్ని నిజాలే..ప్రెసెంట్ గురించి చెప్పినవి నిజాలే...అప్పటిలో future గురించి చెప్పినవి నిజమో కాదో తెలీదు కదా..కాని ఇప్పుడు చూస్తే చెప్పినవి జరగకపోవడం అన్నది లేదు.!! ఇప్పటికి నాలో ఉన్న తర్కం..నమ్మొద్దు అని చెపుతున్నా..కళ్ళతో చూసినది, అనుభవించినది ఎలా నమ్మకుండా ఉండగలను? అప్పుడే ఆయన చెప్పారు..నువ్వు దేవుడిని పూర్తిగా నమ్మటం లేదు..నీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన ఫలానా వారికి సంభందించి జరుగుతుంది..ఆ రోజు నువ్వే నమ్ముతావు..అని..కొట్టిపారేసాను ఆ రోజు..

నిజమయ్యింది తరువాత...

దేనిని నేను గుడ్డిగా నమ్మను.తరువాత అసలు నా వివరాలన్ని వాళ్ళకి ఎవరన్నా అందించిన వారున్నారేమో అని కూడా inquiry చేసాను..ఊహూ..ఆ chance లేదు... మరి ఎలా సంభవం అది? ఏమో!!! కాని నేను రాసిన ఏ ఒక్క సంఘటన కల్పితం కాదు. 


60 comments:

  1. జలతారువెన్నెలగారు,
    జీవిత మనేది ఒక అద్భుతం. అందులో యెన్నో వింతలూ విశేషాలు, కొండలూ, లోయలూ మలుపులూ, గెలుపులూ, పిలుపులూ అన్నీ‌ ఉంటాయి. ఒక్కో సారి కొన్ని మనకు పరమానందం కలిగిస్తాయి. ఒక్కో సారి కొన్ని చాలా బాధ కలిగిస్తాయి. కాని అంతా కలిపి ఒక అద్భుతం. అందుకే అది అపురూపం. మీరు చెప్పిన అనుభవం ఆశ్చర్యం కలిగించింది.

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి శ్యామలీయం గారు.
      మీరు చెప్పినట్టు జీవితం నిజంగామే అద్బుతం.

      Delete
  2. ఇది చాలా సర్వ సాధారణం గా
    చెప్పే విషయమండి.

    ఇందులో నమ్మకం లేక పోవట మనే మాటే లేదు మరి.

    మన తాళ పత్ర ములలో అన్నీ వున్నాయి. మనకు ఆ భాష తెలీదు అంతే.

    వాటిని శోధించి తెలిపే వాళ్ళు తెలిపితే మనం వెంటనే హాశ్చర్య పడి పోతాం. అంతే.



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. నమ్మలేని నిజమండి జిలేబి గారు.అసలు మన జీవితం లో జరిగేవాటి గురించి చెప్పటం మాట అటుంచి, అసలు పేర్లు ఎలా చెప్పగలుగుతారో నాకు అర్ధం కాదు. కాని మీరన్నది నిజమే అని పూర్తిగా నమ్ముతున్నాను. స్వానుభవం అయితే కాని ఇలాంటివి నమ్మడం చాలా మందికి కష్టమే! ధన్యవాదాలు మీ స్పందనకు జిలేబి గారు.

      Delete
  3. అనుభవమైతే కాని తత్వం ఒంట పట్టదన్నారు పెద్దలు.

    ReplyDelete
    Replies
    1. :))అంతేనేమో! ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  4. hey naaku kuda jarigindi ila hyd lo,,,kani anni chepparu furute cheppalante 3000 adigaru antha vaaraku cheppinanduku 500 tisukunnaru,,,appatlo naaku job leka 3000 kattale,,kani naa peru maa amma nd nanna nd annayya peru anni crrct ga chepparu
    regards
    rudra bhaskar
    9940307041

    ReplyDelete
    Replies
    1. :)) మీకు కూడా అనుభవమనమాట! ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  5. చెప్ప లేం..ఏ పుట్టలో ఏ పాము ఉందొ!
    అన్నట్టు ఫీజ్ కట్టి లొపలకి ఎంటర్ అయ్యేటప్పుడు మీ వివరాలు వారు రాసుకున్నారేమో.. గమనించుకున్నారా?
    మీ జీవితంలో జరిగిన దాని ప్రకారం మీ నమ్మకాన్ని ఎవరు కాదన్నా..నిజం ఏమిటో మీకు తెలుసు కదా! ఇతరులు నమ్మక పోయినా నొచ్చుకోకండి. అని మాత్రం చెపుతున్నాను.:)

    ReplyDelete
    Replies
    1. లేదండి వనజగారు..అలాంటిదేమి జరగలేదు అసలు. నిజమే స్వానుభవం అయితే కాని నమ్మడం కష్టమే! నేను కూడా ఎవరన్న చెపితే నమ్మనేమో! ధన్యవాదాలు మీ స్పందనకి.

      Delete
  6. మీరన్నది నిజమే.
    దేవుడూ, దయ్యం కనపడవని కొట్టిపారేసినా...జ్యోతిష్యమూ ఎన్నో ఏళ్ళ పరిశోధనా, మనిషి జన జీవన సరళీ చదివీ అభివృద్ధి చెందిన ఓ శాస్త్రమే, అన్నీ నమ్మలేకపోయినా, కొన్ని జరిగినవీ జరగబోయేవీ చెప్పినపుడు ఆశ్చర్యం కలగక మానదు.
    అయితే మీ భవిష్యత్తు కొంత మీకు ముందే తెలుసనమాట...
    బాగుందీ మీ జ్యోతిష్య అనుబంధం...

    ReplyDelete
    Replies
    1. భవిష్యత్తు ముందే తెలుసా అంటే తెలీదనే చెప్పలి.. చాలామటుకు జెనెరల్ గా ఉంటుంది.. జరిగిపోయాక, ఆ రికార్డింగ్ వింటే, అప్పుడు జరిగిన సఘటనలు అన్వయించుకుంటే అవును కదా, అలాగే జరిగింది అనుకోవటమే! కాని పేరులు చెప్పినప్పుడు మాత్రం ఇప్పటికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ధన్యవాదాలు చిన్నీఅశగారు మీ స్పందనకు.

      Delete
  7. దాన్ని నాడి జ్యొతిష్యం అంటారు.తమిళనాడులో ఆవిర్భవించింది.

    ReplyDelete
    Replies
    1. విన్నాండి అదే నేను కూడా..
      కాని అందరు దీనిని సంపూర్ణం గా విశ్వసించరు.
      కాని కొంతమందికి , నా లాంటి వారికి వారు చెప్పినవన్నీ నిజం అయినాయి.ధన్యవాదాలండి మీ స్పందనకు మూర్తి గారు

      Delete
  8. hammo bayapaddanu bayapaddanu lol(just 4 fun)

    ReplyDelete
    Replies
    1. తనూజ్ గారు, ఒక్కసారి వెళ్ళిరండి మీరు కూడా..భయ్యం అంటే ఏంటో తెలుస్తుంది మీకు ..:))

      Delete
  9. Interesting experience
    One should respect other's belief as long as no harm to themselves
    and the community
    Is there any change in your mother's philosophy which is nothing
    but " manava sevaye madhava seva' ?

    ReplyDelete
    Replies
    1. I don't think so! She still believes in that!
      Thanks for your comment! :))

      Delete
  10. నేను కూడా బ్లాగ్ జ్యోతిష్యం మొదలుపెడదమనుకుంటున్నానండి,మీ పేరు శ్రీ తో మొదలవుతుంది, మీరు ఎవరిని నమ్మననుకుంటారు గాని, ఎక్కువమందిని నమ్ముతారు, ఆ నమ్మకం వలన లాభం పొందారు కూడా. ఏది పెద్దగా గుర్తుపెట్టుకోరు. మీరు మర్చిపోయింది ఎవరన్నా గుర్తుచేస్తే ఫీల్ అవుతుంటారు, కొద్ది సేపు.ఒంటరిగా వుండటం ఇష్టం అనుకుంటారు గానే, అలా వుండటం మీకు కష్టంగానే వుంటుంది. మీకు ఇష్టమైన పనులు, ఆలోచించడం( నిజానికి మీరు పెద్దగా ఆలోచించరు), నిద్రపోవడం.
    మీ తరువాత టపాలో కవిత రాయలనుకుంటున్నారు.ఇంకా చాలా రాయలని వుంది కాని, ఓ వంద రూపాయిలు అడగలేక పోతున్నానండి,హ,హ....
    నమ్మకంలో జీవించండి,.
    నమ్మకమే జీవితం, జీవితమే నమ్మకం,

    ReplyDelete
    Replies
    1. ముందుగా మీ జ్యోతిష్యానికి ఒక వందనం!
      అదేంటొ మీరు చెప్పినవి ఒక్కటి కూడా నిజంకాదు, కాలేవు.
      హా హా హా హా ...నాకు మతిమరుపు అంటారా? హు! అలోచించనా?
      నిద్రపోతానా? హమ్మా!! అసలు మీరెవరండి? నాకు గుర్తు లేదు అసలు..
      అసలు నమ్మటం లేదండి మిమ్మల్ని...
      ధన్యవాదాలు భాస్కర్ గారు మీ స్పందనకు.
      మనసారా నవ్వించినందుకు.

      Delete
  11. నేను ఎప్పుడూ చెప్పించుకోలేదు కాని, చాల సార్లు విన్నాను. నిజమో అబద్దమో ఇప్పటకి తెల్చుకోలేకపోతున్నాను. ఎంత మంది సమర్దిన్చారో, అంత కన్నా ఎక్కువ మంది విమర్శించారు. కొంతమంది శాస్త్రం మంచిదే, కాని చెప్పేవాళ్ళు దొంగలు అని, కొంతమంది శాస్త్రమే పెద్ద బూటకం అని, ఇప్పటకి తేల్చుకోలేదు నేను.
    :venkat

    ReplyDelete
    Replies
    1. క్కసారి వెళ్ళండి. తెలుసుకుంటారు. నేను అందరిని నమ్మమని చెప్పటం లేదు.
      నా అనుభవం చెప్పనంతే! :)) ధన్యవాదాలు వెంకట్ గారు.

      Delete
    2. చూద్దాం, ఒకసారి వెళ్తే అన్ని తెలుస్తాయి కదా. ఒకసారి అడ్రస్ ఇవ్వండి.
      ఎలా రాసి పెట్టి ఉంటె అలా జరుగుతుంది అని ఇప్పటి వరకు నేను ఎక్కడకి వెళ్ళలేదు.
      కానీ మీ అనుభవం చదువుతుంటే కొంచెం ఇంటరెస్టింగ్ గా ఉంది.
      :venkat

      Delete
    3. meeru address istanannaaru ??
      :venkat

      Delete
  12. vennela gaaroo bhaskar gaaru jotishyam chepparaa. hypnotisim chesaaraa?

    ReplyDelete
    Replies
    1. నిజమేనండోయి ఫాతిమ గారు, నాకు అది తట్టనేలేదు.. అవ్వు అవ్వు! అది హిప్నటిసం లాగే ఉంది...నా జాగ్రత్తలో నేనుంటాను. వారి కవితలు ఇంక ఎక్కువ చదవను..అసలే ఇప్పటికే భాస్కర్ గారి కవితలు నాకు నేను గా చదువుతున్నానా...లేక హిప్నటిసం మహిమా? వా..వా..:((

      Delete
  13. నాడిజ్యోతిష్యం మహర్షిప్రోక్తం . అయితే కొన్నివంశాలవారివద్ద ఆతాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిలో వ్రాతలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయనికూడా చెబుతారు . అయితే ఆపేరుతో నకిలీలికూడా మొదలయ్యారు అదివేరే విషయమనుకోండి . ఋషులిచ్చిన ఈ మహావిద్యలు మానవాళిశ్రేయస్సుకు ఉపయోగపడతాయి సరిగా వినియోగిస్తే . ఇక సత్యానికి మన నమ్మకాలతో పనిలేదు . మన నమ్మకం మారుతుంటుంది .సత్యం స్థిరం

    ReplyDelete
    Replies
    1. చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారండి. " వాటిలో వ్రాతలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయనికూడా చెబుతారు" నిజమా? ఎలా సంభవమో అది? కాని నమ్ముతాను. మీ అమూల్యమైన వాఖ్యకి ధన్యవాదాలండి దుర్గేశ్వరగారు

      Delete
  14. నమ్మబుధ్ధి కావడం లేదు. అయినా మీరు చెప్పిన మీ అనుభవాన్నిసంపూర్ణంగా నమ్ముతున్నాను.కానీ, ఈ జ్యోతిష్యకారులలో ఎవరు నిష్ణాతులో ఎవరు కుహనా పండితులో తెలియదు కనుక చెప్పించుకోవడం మంచిది కాదనే నా ప్రగాఢ విశ్వాసం. చెప్పించుకోకపోవడం వల్ల ఏ నష్టమూ ఉండదు.జాతకం ముందే తెలిసి ఉండడం వల్ల మంచి కంటె కీడే ఎక్కువ జరుగుతుంది.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పినది నిజమేనండి. కాని చిన్న వయస్సు. తెలుసుకోవాలనే కుతూహలం తో ఆనాడు సరదాగా చేసిన పని ఇది..కాని పై ప్రాణాలు పైనే పొయాయి లేండి వారు పేర్లు, వరసగా గ్రంధం లో రాసి ఉన్నట్టు చదువుతుంటే! మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  15. నాకు మెదట జ్యోతిష్యం పైన నమ్మకం వుండేది కాదు. కొన్ని అనుభవాలు చూసాక నమ్మకం కుదిరింది.
    అదేవిధంగా దేవుడు ఉన్నాడని నేను గట్టిగా నమ్ముతాను.

    ReplyDelete
    Replies
    1. నేను కూడా అంతే నండి. :))
      ధన్యవాదాలు నాగేంద్రగారు

      Delete
  16. ఆ జ్యోతిష్యం చెప్పిన వారి వివరాలు ఇవ్వండి, వెళ్ళి నా భవిష్యత్తేమిటో తేల్చుకుంటాను. :)
    మాకు తెలిసిన ఓ జ్యోతిష్కులు వున్నారు, పోస్ట్‌మార్టం రిపోర్ట్లే గాని, బ్రతికి వుండగా ఇవ్వరు. :)

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా ఇస్తాను. ఈ మధ్యనే నేను ఈ విష్యం చెపితే ఒకరు వెళ్ళి వచ్చారు.నేను పూర్తి అడ్రస్స్ ఇక్కడే , ఈ కామెంట్ బోక్ష్ లోనే పోస్ట్ చేస్తాను. మీరు చెక్ చేస్తూ ఉండండి.
      ధన్యవాదాలు SNKR గారు మీ స్పందనకు.

      Delete
    2. @SNKR: పోస్ట్ మార్టం రిపోర్టా ??? funny, I can guess whom you are referring..

      Delete
  17. మీకు అనుభవమే అనమాట!ధన్యవాదాలు మీ స్పందనకి.

    ReplyDelete
  18. అవునేమోనండి.. సరిగా గుర్తులేదు..చాలా సంవత్సరాల క్రితం నాటి సంగతి.

    ReplyDelete
  19. అలా నిజమైతే అతను ఈ ప్రపంచానికి దేవుడు అయి ఉండేవాడు.ఈ తుఫాన్స్ ,సునామీల,భూకంపాల నుండి గురించి ముందే చెప్పి ప్రపంచాన్ని రక్షించవచ్చు.రేపు షేర్ మార్కెట్ ఏమవుతుందో తెలుసుకొని పెట్టు బడి పెడితే లక్షల కోట్లు సంపాదించ వచ్చు.గెలిచేవారి గురించి,ఓడిపోయే వారి గురించి పందాలు వేసి వందల కోట్లు సంపాదించ వచ్చు.అసలు మనుషులనే శాసించ వచ్చు.ఏమో మీ విషయం లో నిజమై ఉండవచ్చు.దాన్ని కాదనటం లేదు కానీ పై ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు ఉండవు.అసలు భవిష్యత్తు తెలిస్తే మానవ జన్మ ఈ భూమి పై ముగిసి పోతుందండీ.ఏదేమైనా మంచి చర్చ పెట్టారు.

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి రవిశేఖర్ గారు, ఒప్పుకుంటాను. కాని ఎలా పేర్లు అలా తెలిసినట్టు చెప్పారు, ఇంకా చాలా విషయలు అలా చూసినట్టు, రాసినవి చదివారో మరి..అందుకే నమ్మలేని నిజం అని రాసాను.

      Delete
  20. కేవలం ఒక గారడీ వాడు వంశపారంపర్యంగా తాను నేర్చుకొన్న విద్యతో వేలాది మంది ప్రేక్షకుల బుధ్ధికి , మనస్సుకు , కళ్ళకు గంతలు కట్టేసి - కాసేపు బ్రమలో ముంచేస్తాడు . వాడిలో నిజాయితీ ఉంది .
    కాని , మానవులలో ఒక మోథావి వర్గం - అనాదిగా తమ మేథస్సును - జ్యోతిషాలు , మంత్ర తంత్రాలు , శాంతులు , క్రతువులు , భూతవైద్యాలు - మొదలైన అసత్యాలకు వెచ్చించి - మానవాళికి నమ్మక ద్రోహం చేస్తూనే ఉన్నారు . ఆర్తిలో తమవద్దకు వచ్చే వ్యథా జీవులకు ధైర్యం చెప్పి , అనునయించడానికి తమ మేథస్సును ఉపయోగించాలేకాని , జ్యోతిషం పేరుతో అనృతాలు చెప్పి భయపెట్టి మేథస్సును సంపాదనకు , స్వార్థానికీ ఉపయోగించడం - దుర్మార్గం. వీటికి భగవత్తత్త్వాన్ని ఉపయోగించడం మరీ ద్ర్మార్గం .
    ఊర్లూ పేర్లూ చెప్పడం వ్యాపార రహస్యం . అనేక మానవ బలహీనతలలో అద్భుతం కూడా ఒకటి .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మానవులలో ఒక మోథావి వర్గం - అనాదిగా తమ మేథస్సును
      What is that one and only intellectual class? Would you be more specific?

      ఊర్లూ పేర్లూ చెప్పడం వ్యాపార రహస్యం మానవాళికి నమ్మక ద్రోహం చేస్తూనే ఉన్నారు
      How they are able to tell? is the question here. What other intellectual classes have been doing, having known the so called exploitation?

      Delete
    2. రాజారావు గారు, మీతో పూర్తిగా ఏకిభవించలేము. మేదావివర్గం ద్రోహం గురించి చెప్పాలంటే ఒక మిడి మిడి జ్గ్ణానం ఉన్న జ్యోతిషుడు చేసే ద్రోహం కంటే, శాస్త్రజ్గ్నాం ఉన్న వైద్యులు చేస్తున్న ద్రోహమే ఈ సమాజంలో ఎక్కువగా ఉంది. అంత మాత్రం చేత వైద్య శాస్త్రం తప్పంట్టామా? నిజమైన జ్యొతిషుడు కేవలం జరగబోయే మంచి గురించి మాత్రమే చెప్పాలి. చెడు చెప్పరాదు ఇది వ్రుత్తి నియమము. కాని మీరన్నట్లు కొంతమంది డబ్బాశతో ఉన్నది లేనిది చెప్పి బయపెట్టి శాంతిక్రతువుల పేరుతో దబ్బులు పిండుతున్నారు ఎలాగంటే వైద్యులు నార్మల్ డెలివెరీ కేసు ను ఆపరేషన్ కేసు గా మార్చి డబ్బులు గుంజినట్లు. కేవలం మంచి మాత్రమే చెపితే వారిలో పాజిటివ్ నెస్ పెరిగి మరింత ఆశావహద్రుక్పదంతో జీవిస్తారు ఇది మంచిదేగదా! అటు వ్యక్తికి, ఇటు సమాజానికి.ఏమాంటారు?

      Delete
  21. :) నాడీజ్యోతిష్యం....అనేది possible.
    మన తెలుగు పంచాంగం ప్రకారం.. కాలాన్ని విభజించి.. కొన్ని నక్షత్రాలు గ్రహాల position బట్టి.. ఒక జీవి జాతకాన్ని.. (past, present and future) 60%~90% analyse చెయ్యవచ్చు..
    అలా అన్ని నక్షత్రాలను కలుపుకుంటే.. కొన్ని వేల జాతకాలు మాత్రమే మళ్ళీ మళ్ళీ వస్తూ వుంటాయి.

    మన పూర్వికులు రాసిని ఆ గ్రంధాలు చాలా వున్నాయి.... చాలా మటుకు డబ్బుకోసం.. నోటికి వచ్చినది చెప్పేవారే ఎక్కువ.

    ఇలాటివి అన్నీ తన కంటితో చూసి మనిషికి/మనసుకి అనుభవంలో తెలుసుకుంటే కానీ ఎవరూ నమ్మరు.

    :) మీ experience బాగుంది.

    - మానస

    ReplyDelete
  22. మీ ఆర్టికల్ బావుంది రొటీన్ కి భిన్నంగా!నెనూ ఇది విన్నాను ఇంతకుముందు...నాకూ వెళ్ళి కలుసుకోవాలనుంది...అడ్రస్ లాంటి వివరాలు కోసం చూస్తాను..పూర్తి నమ్మకముంది..అయితే ఇక్కడ ఒకరిద్దరు లేవనెత్తిన ప్రశ్నలకి జవాబులు లేకపోలేదు..ఇలా చెప్పేవాళ్ళకీ లిమిటేషన్స్ ఉంటాయి--సునామీలు తుఫానులు భీభత్స్సాలు చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ జాతకవివరాలు లేవుకాబట్టి...అలాగే షేర్ మార్కెట్ గురించిన స్పెక్యులేషన్ కూడా చెయ్యలేరు మరికొన్ని కారణాలవల్ల..అంతమాత్రాన వారి టాలెంట్ ని అనుమానించడానికి లేదు..వెళ్ళి పరీక్షించుకోవచ్చు.ఎడ్రస్ ప్లీజ్

    ReplyDelete
  23. namakaanni kaligincharu devuni mida nice exp vennela garu....
    net andubaatu lo ledu mi tapalaku late comment eami anukokandi

    ReplyDelete
  24. దీనిలో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏమిలేదు ఇది మన పూర్వికులు మనకిచ్చిన ఒక అద్భతమైన విద్య. అంకితభావం,దీక్ష,పట్టుదల ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు.ఇక దేవుడు అంటారా మీ అమ్మగారు చెప్పిన్నట్టు మనిషి విచ్చలవిడితనాన్ని అరికట్టడానికి,తప్పులు చేయకుండా ఉండడానికి మన పెద్దలు సృష్టించిన ఒక భయం. దేవుడు లేడు అనుకోవడంలో కంటే ఉన్నాడు అనుకోవడంలో చాల లాబాలున్నాయి.

    ReplyDelete
  25. nakoo intrest undi address istaaraa veltaanu

    ReplyDelete
  26. hi
    baga chepparandi . ple address ivvandi ......

    ReplyDelete
  27. Ma'am, You are 100% correct. I also happen to meet that 'Nadi jyotisha' people and got such kind of experience.This ancient science born in Tamil Nadu.Some families only practiced it and kept it secret among their kinsmen only.They have innumerable 'Talapatra grandhas' with them.One more shocking news is one of my friends has been died in an accident exactly as they have told him.They will ask beforehand whether we want to know the shocking truths like this.
    I have some more examples like these, people generally bash it as nothing.But It's true.

    ReplyDelete
  28. వెన్నెల గారు, ఇప్పుడే మీ బ్లాగ్ చూస్తున్నాను. మీరు వ్రాసింది చదువుతున్నప్పుడు మా తమ్ముడు ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం గుర్తు వచ్చింది. విజయ వాడ లోనే తను కూడా మీరు వెళ్ళినట్లు తాళ పాత్ర గ్రందాల సహాయంతో తన జాతకం తెలుసు కుందామని వెళ్ళాడట... ఫీజ్ సంగతి తెలియదు గాని, తను దిమ్మేరపోయాదట. తన పేరు తో పాటు, మా అమ్మా నాన్నల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, ఆ వంశం లోని వారి పేర్లు చెప్తూ వాడి జాతకం చెప్పారట .. బయటకు వచ్చిన వెంటనే తను చేసిన పని నాకు ఫోన్ చేయడం ..పూర్వ జన్మ, నెక్స్ట్ జన్మలు కూడా చెప్పారట ..ఆ తర్వాత మేము తమిళ నాడు యాత్ర లో భాగంగా ఆ వూరు కూడా వెళ్ళాము. సమయం కుదరక ఎవరమూ ఆ తాళ పత్రాల జాతకాలు పట్టించుకోలేదు .. ఇప్పుడు మరల ఆ విషయం జ్ఞప్తి కి తెచ్చారు ..

    ReplyDelete
  29. నమ్మబుద్ది కావట్లేదు ఎందుకో ! అయినా మీ అనుభవాన్ని కొట్టిపారేసి అగౌరవపరిచెంత పెద్ద వాడిని కాదు ?wonder వరల్డ్ magazine లో ఇలాంటివి చాల చదివాను అండి?సరిగ్గా గుర్తులేదు ?అయినా మీ అనుభవాన్ని పంచుకున్నదుకు ధన్యవాదాలు ........

    ReplyDelete
  30. వెన్నెల గారు జ్యొతిష్యం ఒక ప్రాచీన శాస్త్రం. మన అవతారపురుషుల జననాలు సైతం అట్టి శాస్త గణాంకాల ప్రకారమే తెలుసుకునేవారు.భారతంలో ఫౌండ్రక వాసుదేవుడి కథే ఒక మంచి ఉదాహరణ.మా నమ్మకాలకన్నా, మీలాంటి వారి అనుభవాలే మన ప్రాచీన విజ్గ్నానాన్ని వెలుగులోకి తేవడానికి దోహదపడతాయి. మనవజాతిని కొన్ని వేలసార్లు నాశనం చేసే అణ్వాయుదాలు కనిపెట్టడానికి చేసే కోట్ల రూపాయిలలో 1 శాతం మన ప్రాచీన విజ్గ్నాణ పరిశొదనలకు వినియూగిస్తే మానవులకు మేలు జరుగుతుంది. ఎవరు నమ్మినా, నమ్మక పొయినా, జ్యొతీష్యం ఒక శాస్తం అనేది నిజం.నిజం.నిజం. త్వరలోనే ఇది ప్రపంచానికి తెలుస్తుంది అనేది మా నమ్మకం.

    ReplyDelete
  31. ఎలా వున్నారండి, సైన్స్ ప్రాజెక్టులు గురించి కొంచెం సమాచారం కావాలండి, ఇవ్వగలరా..

    ReplyDelete
  32. శ్రీ వెన్నెల గారికి, నమస్కారములు.

    శ్రీమతి ఫాతిమాగారు చెప్పినట్లుగా మిమ్మల్ని, మీతోపాటు ప్రక్కన వున్న వరినీకూడా హిప్నటైజ్ చేసి మీనుంచే మీ వివరాలను రాబట్టి మీకు ఇచ్చివుండి వచ్చును. అవకాశాలు చాలా వున్నాయి. వారు చెప్పిన దాంట్లో, ముఖ్యంగా గతం గురించి, అంతా నిజమే వుండివుండవచ్చును. ఎందుకంటే, ఆ వివరాలను మీనుంచే రాబట్టి వుంటారుకాబట్టి. అయితే, మీ భవిషత్ గురించి చెప్పినవన్నీ, అప్పటినుంచి ఇప్పటివరకూ అన్నీ నిజమే అయివుంటే అప్పుడు ఇది నిజమే అని అనుకోవటానికి అవకాశం వుంది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  33. అభిప్రాయాలని వ్యక్త పరిచిన వారందరికి ధన్యవాదాలు.
    నా మటుకు నా కళ్ళెదురుగా జరిగినవన్ని కనికట్టు అని కొట్టి పారెయ్యలేక చిన్నతనంలో జరిగిన ఈ సంఘటన ఇలా పంచుకున్నాను పోస్ట్ ద్వారా. స్పందించిన వారికి, ప్రశ్నలు అడిగిన వారికి, ఆశ్చర్యపోయిన వారికి అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

    ReplyDelete
  34. మన రాష్ట్ర డి జి పి దినేష్ రెడ్డి కి జాతకాలు చూడటం వచ్చు. ఆయన కి దేవుడు మీద భక్తి,నమ్మకం ఎక్కువ. ఆయన తంజావూరు బృహదీశ్వరాలయంలో నాడి వాళ్లదగ్గర పది సంవత్సరాల క్రితం చేయి చూపించుకొంటే డి జి పి పదవి వస్తుందని చెప్పారని ఒపెన్ హార్ట్ విత్ ఆర్ కె లో చేప్పాడు. నాడి గ్రంథాలు అవాస్తవమని కొట్టిపారేయలెము.

    ReplyDelete
  35. మీరు నాడీ జ్యోతిషాలయానికి వెళ్లడానికి ఒకటి రెండు రోజుల ముందుగానీ, జ్యోతిషాలయంలో వేచి ఉన్నపుడు గానీ మిమ్మల్ని ఎవరైనా పలకరించి, మీ పుట్టు పూర్వోత్తరాలన్నీ సేకరించి ఉండవచ్చు? జ్యోతిష్కుల అనుచరులు భక్తుల్లో కలిసిపోయి వివరాలు సేకరించి గురువులకు అందిస్తుంటారు. భక్తులను ఆకర్షించడానికి ఇదొక స్ట్రాటజీ. మీకు తెలీకుండానే మీ నుంచి వివరాలను సేకరించి ఉండవచ్చేమో...

    ReplyDelete