Tuesday, December 4, 2012

అమెరికా చదువులు-5



"ఎలా ఉంది రా సన్నీ  మిడిల్ స్కూల్?" అని అడిగాను స్నేహితురాలి సుపుత్రుడుని. "ఆంటీ..టూ మచ్ వర్క్. చాలా రాత్రి వరకు హోం  వర్క్ చెయ్యాల్సి  వస్తుంది" అన్నాడు దిగులుగా."నెమ్మదిగా అలవాటు పడతావులేరా.." అని నవ్వి భుజం తట్టి అక్కడనుంచి స్నేహితురాలి దగ్గరకి వెళ్ళాను. 'ఎలా ఉంది రమా, మిడిల్ స్కూల్ experience? నీ కొడుకు పాపం అప్పుడే నిద్ర లేకుండా  చదువుకుంటున్నట్టున్నాడు?" అంటూ పలకరించాను. రమ బేల గా నా వంక చూస్తూ "ఏమి చెప్పమంటావు? మొదట్లో కొన్ని రోజులు ఉదయాన్నే లేవడానికి ఇబ్బంది పడ్డాడు. ఎలిమెంటరీలో ఉన్నప్పుడు 8:00 గంటలకు లేచేవాడు. ఇప్పుడు మరీ 6:00 గంటలకి లేవడం, 6:40 కి స్కూల్ బస్ ఎక్కడం, రోజంతా ఉరుకులు పరుగులు ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్ కి , 2:30 కి  after school clubs  అన్ని అయ్యేసరికి ఇంటికి చేరుకునేది సాయంత్రం 4 గంటలకు. కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ 5:00 గంటలకు మొదలుపెడతాడు హొంవర్క్..అదేంటో గంటల తరబడి చేస్తూనే ఉంటాడు.. అర్ధ రాత్రి అయినా హొం వర్క్ అవ్వదు వీడికి. మరుసటి రోజు ఏదన్నా quiz  కాని test కాని ఉంటే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా ఆలశ్యం అవుతుంది వాడు పడుకోడానికి.పాపం వాడికి వీకెండ్ అయినా కొంచెం బ్రేక్ దొరుకుతుంది అనుకుంటే, మళ్ళీ  ఏదో ఒక activities అని, extra classes అని ...నాకైతే వాడిని చూస్తే జాలి వేస్తుంది" అని కంట నీరు పెట్టుకున్నంత పని చేసింది రమ. "ఫర్వాలేదు రమా.. అలవాటు పడిపోతావులే, ఎప్పుడన్నా వాడు ఖాలీగా గా నీ కళ్ళ ముందే తిరుగుతుంటే, నీకు వాడు ఏదో  చెయ్యటం లేదేమో అని బెంగ పెట్టుకునే స్థాయికి నువ్వే ఎదుగుతావులే. నీ కొడుకు, వాడి వయస్సు వాళ్ళు, అందరు కొద్ది రోజుల్లో అలవాటి పడిపోతారు ఈ middle school transition" అని సమాధానమిచ్చాను.

"Math ఏ లెవల్ లో ఉన్నాడు సన్నీ?" అని అడిగాను."Algebra చేస్తున్నాడు "అని చెప్పింది రమ.. "గుడ్" అన్నాను మెచ్చుకోలుగా."విధ్య వాళ్ళ అబ్బాయి seventh grade లోనే geometry చేస్తున్నాడు తెలుసా?".అంటూ తనకు తెలిసిన విషయం చెప్పింది రమ. "అయితే ఆ అబ్బాయి math లో jem అన్నమాట" అన్నాను. "నాకు తెలియలేదు సమ్మర్ లో (6th class అయిపోయాక సమ్మర్ బ్రేక్ లో) స్టూడంట్స్ algebra క్లాస్ తీసుకోవచ్చు అని. ఆ కోర్స్ పూర్తి చేసాక 7th grade లో geometry కి admission తీసుకోవచ్చు అట. ఆలశ్యం గా తెలిసింది నాకు, అప్పటికే registrations అయిపోయాయి" అని బాధ పడింది రమ. "పర్వాలేదు రమా, algebra  అయితే హాయిగా , easy గా చేసుకుంటాడు, బెంగ పడకు. next year  తీసుకోవచ్చు గా" అన్నాను. "అలా కాదులే, ఎంతన్నా విధ్య కొడుక్కి చాలా అడ్వాంటజ్ ఉంది. వాడు ఈ సంవత్సరం ఎలక్టివ్ తీసుకోకుండా algebra, ఇంకా geometry కూడా స్కూల్ లోనే తీసుకుంటున్నాడు.  Pre calculus skip out exam pass అయితే అప్పుడు high school లో 9th లోనే AP Calculus తీసుకోవచ్చు" అంటూ వివరించి చెప్పింది."ఓహో! అలాగా?" అన్నాను. రమ చెప్పినట్టుగానే, చాలా మంది స్టూడంట్స్ math లో advanced లెవెల్స్ లో ఉండడం నాకు కూడా తెలుసు. 

Math levels గురించి (middle స్కూల్ నుండి 12th వరకు) కొన్ని తెలుసుకోవాల్సిన వివరాలు. మూడు రకాల గా స్టూడంట్స్ ను విభజిస్తే,

1. non GT/Advanced math లో లేని స్టుడంట్స్ 6th grade  నుండి 8th grade  వరకు math 6, math 7, math 8 చేస్తారు.

2. GT/advanced math స్టూడంట్స్ సాధారణం గా math ఒక లెవెల్ ఎక్కువ లో ఉంటారు. అనగా, వారు 6th grade నుండి 8th grade వరకు math 7, math 7 honors, math 8 honors  చేస్తారు.

3. Exceptionally talented స్టూడంట్స్ (in math) కు కొన్ని స్టేట్స్ లో 6th grade లో "IAAT(Iowa alegbra aptitude test)  అనే పరీక్ష పెడతారు. ఆ పరీక్ష "Algebra" knowledge ని test చేస్తుంది అని చాలా మంది పేరంట్స్ అపోహ పడుతూ ఉంటారు. కాని ఈ IAAT పరీక్ష కేవలం students readiness to crack algebra in 7th grade అన్నది test చెయ్యడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పరీక్ష లో ఒకవేల 95 percentile score  చెయ్యగలిగితే  ఆ తరువాత "math 8" end of the year exam  పెడతారు. ఈ రెండు exams లోను 95 సాతం మార్కులు (differs from state to state)  score చేసిన  స్టూడంట్స్ అందరికి 7th grade లో Algebra admission ఇస్తారు. Math 8 exam ఎందుకు పెడతారు అన్న ప్రశ్న ఉదయించవచ్చు ఇక్కడ. నార్మల్ స్టూడంట్స్ Algebra 9th grade లో  తీసుకుంటారు. అందుకని advanced గా 7th grade లో తీసుకుంటున్న స్టూడంట్స్ math 8 లెక్కల పరీక్ష కూడా పాస్ అయితే కాని వారికి algebra  లో admission ఇవ్వరు. 
స్టూడంట్స్  6th grade నుండి 8th grade వరకు math 7, Algebra, geometry, Algebra-II & Trignometry(one year)   చేస్తారు. 


Some links you might find useful:

http://www.doe.virginia.gov/testing/sol/standards_docs/mathematics/2009/stds_math7.pdf
http://www.doe.virginia.gov/testing/sol/standards_docs/mathematics/2009/stds_math8.pdf


Math counts మరియు AMC exams గురించి ఇంకో పోస్ట్ లో ....

12 comments:

  1. మంచి ప్రయత్నం, ఒక క్లాస్ తీసుకుని వారి సిలబస్ ను విశ్లేషించండి ఎప్పుడన్నా వీలైతే,..అక్కడి క్లబ్ ల గురించి కూడా,...

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిస్తాను భాస్కర్ గారు. ధన్యవాదాలు

      Delete
  2. జలతారు వెన్నెల గారు, మీ టపాలు చాలా ఇంఫర్మేటివ్ గా వున్నాయండి...బోలెడు విషయాలు తెలియచెపుతున్నందుకు ధన్యవాదాలండి...కాని నాకు మా పిల్లల చదువులు ముందు ముందు ఇలా వుంటాయా అని భయం పట్టుకుందండీ :(

    -దీరు

    ReplyDelete
    Replies
    1. భయపడాల్సినదేమి ఉండదండి. కొన్ని విషయాలు తెలుసుకుని ఉండడడం చాలా ముఖ్యం. అలా తెలియపరచాలన్న సదుద్దేశం తోనే ఈ సిరీస్ రాస్తున్నాను.ధన్యవాదాలండి.

      Delete
  3. Thank you. Very helpful.

    ReplyDelete
  4. Nice Post after long gap..My son is in First Grade now..he is already getting lot of math homework in 1st grade..lot of changes in us education system..hope for the best.

    ReplyDelete