ఉదయమే ఒక ఫోన్ కాల్!
"జిందగీ నా మిలేగి దుబారా" అని నువ్వు నమ్ముతావా?
"అదేమి ప్రశ్న? సంగతేంటో చెప్పు", విసుక్కున్నా నేను.
"నమ్ముతావా లేదా? అ ప్రశ్నకి జవాబు చెప్పు...."
"ఉదయమే ఆ చెత్త ప్రశ్నలేంటి.."అన్నా విసుగ్గా...
పోనీ కనీసం దీనికి జవాబు చెప్పు..."జిందగీ నా మిలేగి దుబారా సినిమా చూసాము కదా? ఆ సినిమా నీకు నచ్చిందా లేదా? "
"ఈ మధ్య చూసిన ఏ సినిమా కథ గుర్తుకు ఉండటం లేదు,కాని ఒక్కటి మాత్రం చెప్పగలను,ఆ సినిమా మాత్రం గుర్తుండిపోయింది...చక్కగా మూడు గంటలలో ప్రపంచమంతా చూపెట్టారు కదా.."అన్నా గుర్తు తెచ్చుకుంటూ...
"అవును , ఇంకేమి నచ్చాయి ఆ సినిమాలో ..."అవతల వైపు నుండి ఆసక్తి గా ఇంకో ప్రశ్న.
"అదేదో టొమేటో ఫెస్టివల్ అని టొమేటోలు ఒకరిపై ఒకరు విసురుకునే సరదా సంబరం,బుల్ రున్ ఇంకా.."అంటూ మాట్లాడుతున్న నన్ను ఆపి
"ఆగక్కడ...మరి ఒకవేళ మనం కూడా అలా ఒక బుల్ రున్ కి, టోమేటో ఫెస్టివల్ కి వెళితేనో? " అంటూ ఒక ప్రశ్నార్ధకం
"సర్లే....నాకిప్పుడు Spain వెళ్ళే ఓపిక లేదు...తీరిక లేదు.."అంటూ కొట్టిపారేస్తుండగా...
"మరి అదే, వినాలి కదా నేను చెప్పేది పూర్తిగా...."
"ఊ ఊ, చెప్పు ...."
"ఈ ఆగస్ట్ లో మనకి దగ్గరలోనే మనం కూడా ఈ ఫెస్టివల్ సెలెబ్రేట్ చేసుకుంటున్నాము.ఇంచక్కా బుల్స్ తో పరిగెట్టచ్చు...టొమేటోలతో కొట్టుకోవచ్చు...నువ్వు చెయ్యవలసినదల్లా,టికట్స్ కొనడమే ఆ ఈవెంట్ కి...."అంటూ వచ్చింది సమాధానం...
ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది...పొద్దున్నే భలే వార్త వచ్చిందే అనుకుంటూ
ఇమైల్ చూసుకున్నా....ఈ రెండు లింక్స్ ఉన్నాయి...
వేంటనే తిరిగి రిప్లై కొట్టా ఆ ఇమైల్ కి ...."Hritik Roshan వస్తున్నాడా లేదా? "అంటూ..
ఇంకా ఈ ప్రొగ్రాం కి వెళదామన్న వారందిరికి ఇంకో కండిషన్ పెట్టేసాను పనిలో పనిగా...,ఆగస్ట్ వరకు అంటే ఇంకా మూడు నెలలు ఉన్నాయి కదా....ఒక రెండు 5k రన్స్, ఒక 10k రన్ రిజిస్టర్ చెయ్యండి, అప్పుడు ఆ బుల్ రన్ ఈవెంట్ లో మనం బాగా పరిగెట్టగలమేమో అని.."

"జిందగీ నా మిలేగి దుబారా"
ReplyDeleteలేవగానే కనిపించేట్టుగా ఈ చిన్న మాట గోడమీద రాసి పెట్టుకుంటే పెద్ద మార్పు తధ్యం
మురళి గారు, చాలా రోజుల తరువాత, కాదు ఎన్నో నెలల తరువాత మీ వాఖ్య. . సంతోషం కలిగింది. నిజమేనండి.."జిందగీ నా మిలేగి దుబారా" అని రేపే ఒక పోస్టర్ అతికించుకుంటాను నా రూంలో! :) ధన్యవాదాలండి!
Deleteఈ సినిమా నాకు కూడ ఇష్టమే. చూసిన తరువాత ఈ సినిమాపై నా కామెంట్..
ReplyDelete"జిందగీని దుబారా చెయ్యకండి."
అంటే అలా టైం స్పెండ్ చెయ్యొద్దని కాదు. వీలైనంతగా జీవితాన్ని ఆస్వాదించమని.
అలోచనాస్త్రాలను సంధించి, భలే అర్ధం చెప్పారండి..బోనగిరి గారు ""జిందగీ నా మిలేగి దుబారా" కి!!!:)
Deleteకాని మీరు చెప్పిన అర్ధం కూడా బాగుంది. ధన్యవాదాలు మీ వాఖ్యకి.
:) .ఒక రెండు 5k రన్స్, ఒక 10k రన్ ట్విస్ట్ బావుంది
ReplyDeleteవనజ గారు, లేకపోతే, ఆ బుల్స్ వెంట పరిగెట్టడం ఆషామాషి వ్యవహారమనుకుంటున్నారు జనం! మంచి "Athlete" అయ్యి ఉండాలి ఆ trained bulls తో పరిగెట్టాలి అంటే! ధన్యవాదాలండి
DeleteJust added those two apps on my iPhone. I am ready now ;).
ReplyDeletePS: you don't need to go anywhere for it, wait for another controversial 'friendship day' in Hyderabad.
అయితే మీరు పరిగెడుతున్నారా? ఊరికే చూస్తున్నారా? ముందు అది చెప్పండి చాతకం గారు. "PS: you don't need to go anywhere for it, wait for another controversial 'friendship day' in Hyderabad." ఈ వాఖ్య నాకు అర్ధం కాలేదండి. ధన్యవాదాలు మీ వాఖ్యకి. (టికట్స్ తొందరగా కొనుక్కోండి, event అప్పుడే చాలా popular అయిపోయింది.)
Delete@.ఒక రెండు 5k రన్స్, ఒక 10k రన్ రిజిస్టర్ చెయ్యండి..
ReplyDeleteహా..హ్హా..హ్హహా.. ప్రాక్టీస్ కే కదండీ!!!పరిగెత్త లేక కూలబడి పోతాం అని ...:)))
అంతేకదండి...మరి trained bulls తో పరిగెట్టాలంటే మాటలా చెప్పండి...? ఎంత ప్రాక్టీస్ చెయ్యాలి? అయినా మనలో మన మాట,నాకు తెలిసి ఫైనల్ గా అందరు పరిగెట్టడం కన్నా చూడటమే బాగుంటుంది అనేవారే ఎక్కువ ఉంటారు,చదువుకునే పిల్లలు తప్ప! :) ధన్యవాదాలు మీ వాఖ్యకి
DeleteOpps, "Running of the Bulls in Richmond" will be missing it. Nice post. I did watch "జిందగీ నా మిలేగి దుబారా" and it is an excellent movie.
ReplyDeleteFirst treadmill, then few 5k and 10k runs. If you can not, Still you can drive to Richmond to see 'Running of the Bulls' form 5k far. Good Luck andi.
రామ్ గారు, ఈ event చూడగానే మొదట గుర్తుకు వచ్చింది మీరే!
Deleteట్రెడ్మిల్ల్ మీద నిత్యం పరిగెడుతూనే ఉంటాము,కాబట్టి 5కk,10కk కి జంప్ అన మాట!
నిజమే స్పెక్టేటర్స్ గా కూడా వెళ్ళొచ్చు,లేదా "Tomato Royale" food fight లో పాల్గొనవచ్చు..:) Thanks రామ్ గారు.
Well, start the practice:)
ReplyDelete:) Anu, Trying our best atleast for now. Thank you for the comment.
DeleteGreat...
ReplyDeleteIt's going to be fun and best u...
Please share ur experience as well once ur done with it :)
Sure Sekhar garu. Thanks for the comment.
Delete