చిన్నానగారి అబ్బాయి సురేష్ ఫోన్ చేసాడు "అక్కా.. సంజయ్ SCAT లో చాలా బాగా స్కోర్ చేసాడు అని ఆనందంతో చెప్పాడు. సంజయ్ కి ఫోన్ ఇవ్వు.."I will congratulate him" అని అన్నాను. "Hello అత్తయ్యా" అని సంజయ్ అనగానే "Good job రా నాన్నా , ఇలాగే బాగా చదువుకో" అని చెప్పి ఫోన్ పెట్టేసాను. ఇంతకీ సంజయ్ చదువుతున్నది 4th grade. మరి SCAT పరీక్ష ఏంటంటారా? John Hopkins university వాళ్ళు ప్రతి సంవత్సరం Talent search అని కొన్ని tests పెడతారు 2-8 th grade విధ్యార్ధులకు.ఈ పరీక్షలు పెట్టేది summer లో వాళ్ళ programs/classes కి eligibility decide చెయ్యడాని కే అయినా.. ఆ summer programs కి తమ పిల్లలను పంపని వారు కూడా ఆ పరీక్షలు ఫీస్ చెల్లించి రాయవచ్చు. సంజయ్ చదువుతున్నది 4th grade అయినా సంజయ్ రాసిన SCAT పరీక్ష 6th grade level లో ఉంటుంది. వచ్చే results కూడా percentiles లో ఉంటాయి. Above grade level english/math లో ఉన్నారా లేదా అని తెలుసుకోవచ్చు, ఈ పరీక్షలలో వచ్చే score ని బట్టి. Middle school (6/7-8 grades) లో CTY (center for talented youth) ద్వారా students SAT పరీక్ష తీసుకోవచ్చు. SAT విధ్యార్ధులు high school లో మాత్రమే తీసుకోగలరు. కాని CTY Talent search లో member అయితే SAT 6 th grade నుంచే తీసుకోవచ్చు. ఇలాంటిదే ఇంకొక Talent Search exams conducting university NC లో కూడా ఉంది అని విన్నాను. నాకు వివరాలు పెద్దగా తెలియవు. SCAT/STB tests (CTY) information link : http://cty.jhu.edu/talent/
Elementary school నుంచి middle school transition కొంచెం కష్టమైనదే! అప్పటి వరకు academics serious గాతీసుకున్నా,తీసుకోపోయినా..middle school నుంచి కొంచెం focus చేసి చదువుకోవాలి. Homework లాంటివి చాలా elementary schools లో (public schools) ఇవ్వరు. ఇచ్చినా, 10/20 minutes కంటే ఎక్కువగా ఉండకపోవచ్చు. హట్టాత్తుగా middle school కి వచ్చేసరికి, ఉన్న 7 subjectsలోను homework తప్పని సరిగా ఉంటుంది.ప్రతి రోజు అన్ని subjects teach చెయ్యరు. "Block schedule" అని ఒక రోజు 3 subjects , ఒక రోజు 4 subjects అలా ఉంటాయి. Middle school నుంచే electives తీసుకోవడం మొదలెడతారు విధ్యార్ధులు. ఏదో ఒక foreign language (spanish/french/Latin etc..) తీసుకోవచ్చు. ఒకవేళ విధ్యార్దులు middleschool లో తీసుకోకపోయినా high school లో అయితే తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇంకొక పెద్ద మార్పు ఏంటంటే, అప్పటివరకు, ఒకటో, రెండో పుస్తకాలతో స్కూల్ కి వెళ్ళే విధ్యార్దులందరు హట్టాత్తుగా బోలెడన్నిbooks/folders మొయ్యాల్సి వస్తుంది. ప్రతి రోజు 3 లేదా 4 subjects మాత్రమే classes ఉంటాయి కాబట్టి, అన్ని classes కి అన్ని folders/books తీసుకుని వెళ్ళరు. ప్రతి విధ్యార్ధికి lockers allot చేసేది middle school లోనే!Lockers అంటే books/folders/bag/lunch box పెట్టుకోడానికి ఒక storage place లాంటిది. ప్రతి lockerకి కీ ఉంటుంది. ఏ subject class అయితే ఆ సబ్జెక్ట్ books/foldres మాత్రమే తీసుకుని వెళతారు. మిగతా పుస్తకాలన్ని లాకర్ లోనే ఉంటాయి. Challenge ఏమిటంటే ప్రతి class కి మధ్య gap may be 5 minutes ఉంటుందేమో. Classes అన్ని ఒకటే floor లేదా.. building లో ఉండకపోవచ్చు. అందుకని, వాళ్ళు ఒక class అవ్వగానే ఇంకొక classకి almost పరిగెట్టుకుంటూ lockers దగ్గరకి వచ్చి, books/folders మార్చుకుంటూ ఉంటారు. ఆ 5 minutes లోనే లాకర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ next class ఎక్కడ ఉన్నా...ఆ place కి వెళ్ళడం జరిగిపోవాలి.కొంచెం కష్టమే అయినా...నెమ్మదిగా అలవాటు పడిపోతారు. యంత్రాల్లా చక చక కదులుతారు ఒక class అవ్వగానే, next class కి వెళ్ళడానికి.
Middle school subjects -math, science, social, PE, English, Music(string/band), Electives (Foreign language falls under this) . Elementary school లో విధ్యార్దులకు ఒక teacher అన్ని subjects teach చెయ్యటం జరుగుతుంది. కాని middle school నుంచి ప్రతి subject కి different teachers ఉంటారు.Homework కి, quizzes and Tests కి marks ఉంటాయి.ఇవ్వన్ని కలిపి grade determine చేస్తారు.ప్రతి stateకి grading different గా ఉంటుంది కాని mostly on an average 93-100% score చేస్తే"A" grade వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే, ఒక్క quiz/homework /test లో కాని 50% కంటే తక్కువ score చేస్తే almost ఆ subject లో "A" తెచ్చుకోవడం చాలా కష్ట్టం. Consistent gaa perform చేస్తేనే కానీ మంచి grades తెచ్చుకోవడం అంత సులభం కాదు. After school clubs గురించి, math and science competitions గురించి, volunteering activities గురించి next పోస్ట్ లో ...

vaaammo..deenikanna mana govt schoolse better gaa..
ReplyDeleteinka nayam , nenu akkada puttaanu kaadu...
:venkat.
ఎందుకని అలా అన్నారు? Schools బానే ఉంటాయండి.కొంచెం వివరంగా చెప్పండి.
Deletenenemi serious ga analedandi. meeru cheppedi chaduvutunte akkada highschool period chala strict ga, konchem tense ga untundemo ani uhinchukunnanu. na high school chaduvu to compare chesukunte nene ekkuva freedom enjoy chesanemo ani anipinchindi anthe. manaki ikkada highschool lo marks base meda next class ki promotion undadu kada ( I meant 6th to 10th ). ee madhyana chadivaanu 7th kuda marks list nundi theesesaru ani. so aa uddeshyam lo cheppaanandi anthe.
Delete:venkat.
avunu endukandi anthala parigetti books thechchukovadam, anni 5 mins lo ayipovala, oka 1 or 2 mins late aithe lopalaki raanivaara ? inko vishayam, 5 mins lo ready avvalera next class ki ? oka class nundi maro class ki velladaniki antha time padutundaa ?
Delete:venkat
ఓహో! అదా మీ ఉద్దేశం. నిజమేనండి..ఇక్కడ మంచి మార్కులు తెచ్చుకోవడం కొంచెం కష్టమే! కాని బాగా చదువుకుంటున్నారు లెండి almost మన Indians అందరూ! classes కి లేట్ గా రానిస్తారా? మంచి ప్రశ్న .. నాకు గుర్తు లేదు..కాని రానివ్వరు అని అనుకుంటున్నాను. రానిచ్చినా attendance ఉండదనుకుంటా (marked as absent for the class). చాలా schools లో classes అన్ని విసిరేసినట్టుగా దూరం గా ఉంటాయి. ఒక class ground floor లో ఉంటే, ఇంకో class first floor లో ఉండొచ్చు, లేదా school బయట trailers లో ఉండొచ్చు. వారి lockers classes కి దూరం గా ఉండొచ్చు. సో వాళ్ళు lockers దగ్గరికి వచ్చి, books పెట్టి, మళ్ళి next class కి books తీసుకుని పరిగెట్టాల్సి ఉంటుంది... మొదట్లో కష్టమైనా నెమ్మదిగా అలవాటు పడిపోతారండి!
Deleteకొత్త పోస్టు వచ్చేసిందా, ఈ సీరీస్‌లో :) Thanks. మిడిల్ స్కూల్ అనుభవం ఈ సంవత్సరమే రుచి చూశాను. క్లాసుల మధ్య లాకర్లోంచి కావల్సిన వస్తువులు తీసుకోగలగడం. హోంవర్క్ ఇంటికి తీసుకొచ్చుకోవడం మర్చిపోకపోవడం ఇలాంటివి అలవాటు కావడానికి బానే సమయం పట్టింది మా అబ్బాయికి. తెలిసినా కొంచెం మా అబ్బాయిని కష్టపెట్టాను మాటల్తోటి నేను కూడా. తర్వాత నేను బుద్ధి తెచ్చుకున్నాను. మా వాడూ హోంవర్క్‌లు మర్చిపోవడం వల్ల గ్రేడ్ బాగా కిందికి పడిపోవడం అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. అంతకు మించి వాడినీ వాళ్ళ టీచర్నీ అభినందించవలసింది ఏంటంటే ఆయన నమ్మకం, ప్రోత్సాహం, వాడి పట్టుదల. ఆ టీచర్ మాటలని గౌరవించి వాడి మీద ఒత్తిడి పెట్టకపోవడం నేను చాలా మటుకు చెయ్యగలగడం మా బ్బాయి అదృష్టం :) గురువులకి నా జోహార్లు. ఒక్కరేమో తప్ప నేను మా పిల్లల టీచర్లందరికీ చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. వాళ్ళు నేర్పినవి నేను నేర్పగలిగేదాన్ని కాదు. ఆ ఒక్క టీచర్‌నుంచి కూడా నేను నేర్చుకున్నది ఎంతో ఉంది, ఇంకో విధంగా. వాళ్ళ నుంచీ నేను నేర్చుకున్నవి మా పిల్లల పట్ల చక్కగా పాటించగలిగితే నాకూ, మా పిల్లలకీ కూడా peace of mind ఉంటుంది. మీరు పోయిన సారి చెప్పిన తారక మంత్రం నా మనసుమీదనుంచీ ఎంతో బరువు దింపేసింది. ఈ talent search లాంటి పరీక్షలంటే నాకదో రకమైన ఇష్టం. ఏదో కొత్త రుచి పిల్లలకు అందించగలుగుతానేమో అని అదో రకమైన ఉత్సాహం. దాన్ని ఆరోగ్యకరమైన ఉత్సాహంగానే కొనసాగించాలి అని దేని గురించీ కంగారు పడకూడదనీ నిర్ణయం తీసేసుకున్నాను. నా నిర్ణయానికి బాధ్యత మీదే :)
ReplyDeleteలలిత గారు, చాలా మంది విధ్యార్ధులకు middle school transition is a difficult one! మీరు చెప్పినట్టు homework తెచ్చుకోవడం మర్చిపోవటం, చేసిన home work turn in చెయ్యకపోవడం, దీని వలన ఎంతో easy గా వచ్చే marks పోగొట్టుకోవడం, quarter చివరన, ఇంకా ఎన్ని marks వస్తే "A" వస్తుందా అని calculators మీద పడటం ఇవన్ని మరచిపోలేని అనుభవాలు. ఇక్కడ గురువులకు మనం జోహార్లు చెప్పాల్సిందే..వాళ్ళు deal చేసే పద్దతి ఎంతైనా వేరు గా ఉంటుంది విధ్యార్ధులతో! నా తారక మంత్రం మీరు serious గా తీసుకోవడం నాకు ఆనందం ఇచ్చిందండి. నేను ఆ తారక మంత్రం ఎందుకు చెప్పానో, ముందు ముందు మీకు నా High school posts చదివితే అర్ధం అవుతుంది. మీ encouragement కి మరొక్కసారి ధన్యవాదాలు.
Deleteelementary, highschool,renDoo choosaanu. ivannee naa koe friend explain chaesaaru. aa parigettaDam paapam maa ammaayi modaTloe roejukoe debba tagilinchuku vacchaedi. short cut loe velhlhi.
ReplyDelete:)) అర్ధం చేసుకోగలను.. ఆ ఉన్న 5 minutes లో ఉరుకులు పరుగులు...
Deleteబాగుంది పోస్ట్.ఇక్కడ కూడా ప్రతి క్లాసు కి టాలెంట్ పరీక్షలు వున్నాయి.అక్కడ పిల్లలు తరగతులు మారటం బాగుంది.ఇక్కడ కూడా cbse లో అంతా grades వుంటాయి .AP లో కూడా ఇప్పుడు 10th లో grades పెట్టారు. ఇలాగే వ్రాయండి.ఇంకా తెలుసుకోవాలని వుంది.
ReplyDeleteOhh Talent పరీక్షలుంటాయా అక్కడ కూడా? అంటే school వాళ్ళు పెడతారా? లేక బయట తీసుకోవాలా ఈ పరీక్షలు? నేను కూడా విన్నాను, cbse లొ ఎదో 8/10 అలా ఇస్తున్నారు అంట కదా ranking/scoring? అంటే b+ అని కూడా విన్నాను. చిత్రం గా ఉందండి. మేము చదువుకున్నపటికి ఇప్పటికి ఎంత మారిపోయిందో education system India లో కూడా.. ఇంకా EAMCET ఈ year తరువాత తీసేస్తున్నారు అని కూడా విన్నాను. నిజమేనాండి?
DeleteNTSE(govt),nstse(private),ఇంకా ఇలా చాలా వుంటాయి.olympiyads(maths,physics,chemistry),వీటి పేరుతో ,IIT foundations పేరుతో సం ;లక్ష రూపాయలు ఫీజు తీసుకునే స్చూల్స్ వున్నాయి. LKG ki లక్ష తీసుకునే inter national schools చాలా వున్నాయి .ఇక grading system ఈ సం ;నుండి మార్క్స్ చెప్పకుండా మన state లో స్టార్ట్ చేసారు.ఇంకా చాలా మార్పులు వస్తున్నాయి.ఎంసెట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.IIT టెస్ట్ పద్ధతి మారుస్తున్నారు.
DeleteThanks for the information.
Deletehttp://www.msnbc.msn.com/id/47751459/ns/health-the_new_york_times
ReplyDeleteఈ ఆర్టికల్ చదివి మీ అభిప్రాయం చెప్తారా?
Oh my God lalitha gaaru!!! ఇదెక్కడి విపరీతం అండి? pills for good grades? cha! I am not able to digest this at all...any such drugs will have side effects. My daughter used to say " I think I have Attention Deficit Hyperactivity Disorder (ADHD), I can't focus for more than 1 hour" అని. But we said.."నోరుమూసుకుని, ఆ computer shutdown చేసి చదువు. రెండు గంటలేమి ఖర్మ, మనస్సుంటే ఆరు గంటలు కూడా focus చెయ్యచ్చు" అని...అమ్మో! ఇదేంటండి బాబు,pills for good grades? Really shocking! and thanks a bunch for sharing lalita gaaru.
DeletePressure అనేది ఉంటుంది.You can't escape that in high school years. I should say all 4 years of high school are really tough, but worst is 11th grade. But they all will survive. You just need perfect planning అంతే! కాస్త ఆ టైం లో harmones ప్రభావం, ఇంకా stress/sleepless nights వలన, మన మాటను అసలు లెక్క చెయ్యరు మన పిల్లలు. దాంతో మనకు మనస్తాపం, వారికి నష్టం జరుగుతుంది.
ఇది చదివి నాకు ఇలాంటి చదువులు ఎందుకు ఉపయోగపడతాయి అనిపించింది. మందులేసుకుని మేలుకుని చదవడం, వేరే activities లో పాల్గోవడం అంటే మన శరీరాన్నీ, మైండ్‌నీ హద్దు దాటి పుష్ చేస్తున్నామనే కదా అర్థం. అలా తెచ్చుకున్న కాలేజీ సీట్లలో మరి ఇంకా కష్టపడి తమ "ప్రతిభని" నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కెరీర్లో.
ReplyDeleteమీ అనుభవం కూడా తెలుసుకోవాలనిపించింది. మీ మాటలు గుర్తుంచుకుంటాను. పద్ధతిగా చదువుకున్న దాంట్లో వచ్చినంత జీవితంలో నచ్చిన మార్గం ఏర్పరుచుకోవడానికి సరిపోతుందని అనుకుంటున్నాను నేను. "పేరు మోసిన" స్కూళ్ళ మీద ఉన్న ముచ్చట తీరిపోయింది ఈ ఆర్టికల్ చదివాక. ఉన్న చోట క్రమశిక్షణతో తెచ్చుకోగలిగినంత గుర్తింపు తెచ్చుకుని చక్కగా ఎవరి ప్రత్యేకత వారు తెలుసుకుని, నిలుపుకుంటూ ముందుకి సాగుతూ ఉండడమే సంతోషానికీ మనశ్శాంతికీ మార్గం అనిపిస్తోంది. మీలాంటి వారితో బ్లాగ్ముఖంగా పరిచయం కావడం, మీరు మీ అనుభవాలు పంచుకోవడం, నా లాంటి తల్లిదండ్రులకి చాలా ఊరట కలిగించే విషయం. Thanks.
Thank you lalitha gaaru. My pleasure andi.
Delete