కొన్ని వేల సంవత్సరాల క్రితం,మనుషులు భూమి మీద లేని కాలం లో ధర్మము, అధర్మము భూమి మీద ఉండేవి. ఏమి చెయ్యాలో తెలియక, అలా తిరుగుతూ ఉండేవి.ఒకరోజు ధర్మము, అధర్మము బంధువర్గం తో ఒకచోట సమావేశం అయ్యినప్పుడు, చమత్కారానికి ఒక అలోచన తట్టి, అందరితో అంది "మనం అందరము కలిసి దాగుడు మూతల ఆట ఆడదామా?" అని. అందరికి ఆ అలోచన నచ్చి అలాగే ఆడుకుందాము అని అనుకున్నారు. ఇంతలో పిచ్చితనం గట్టిగా అరిచింది "నేను లెక్క పెడతాను, మీరందరూ వెళ్ళి దాక్కోండి" అని. అక్కడ ఉన్న ఎవరికీ పిచ్చితనానికి ఉన్నంత పిచ్చి/వెర్రి లేనందువలన అందరు వెంటనే ఒప్పేసుకున్నారు. పిచ్చితనం ఒక చెట్టు చాటుకు వెళ్ళి " ఒకటి, రెండు, మూడు.." అని లెక్కపెట్ట సాగింది. అలా పిచితనం లెక్కపెడుతూ ఉండగా అందరూ వెళ్ళి దాక్కొన్నారు. కరుణ చంద్ర వంక యొక్క మొనలు కి వేలాడింది.ద్రోహం చెత్తకుప్పలో దాక్కుంది.మోహము మేఘాలలో కలిసిపోయింది. రసము భూమి మధ్యకు వెళ్ళి దాక్కొంది. అబద్దం అందరితో ఒక రాయి వెనక దాక్కొంటానని చెప్పి కొలను లోకి వెళ్ళి దాక్కొంది. లోభిత్వము ఒక గోనె సంచి లో దాక్కొంది. పిచ్చితనం లెక్కపెడుతూనే ఉంది "డబ్బై తొమ్మిది, ఎనభై,ఎనభై ఒకటి..". ప్రేమ తప్ప అందరూ వెళ్ళిపోయి దాక్కున్నారు. ప్రేమకి ఎక్కడ కి వెళ్ళాలో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమౌతుంది. ఒకరకంగా మన అందరికీ ఇది ఏమాత్రం ఆశ్చర్యము కలగకూడదు, ఎందుకంటే ప్రేమను దాచడం అసాధ్యం కదా? పిచ్చితనం గట్టిగా లెక్కపెడుతుంది, "తొంభై ఐదు, తొంభై ఆరు, తొంభై ఏడు ..." పిచ్చితనం "వంద" అని అనగానే హడావిడిగా గులాబి పొదలోకి వెళ్ళి దాక్కొంది ప్రేమ. పిచ్చితనం చెట్టు చాటు నుంచి వచ్చి "నేను వస్తున్నాను, వస్తున్నాను" అని అంది. అలా చెట్టు చాటు నుంచి రావడమే తరువాయి, ముందుగా సోమరితనం కనిపించింది. మనకు తెలిసిందే కద, సొమరితనం/బద్ధకానికి దాక్కునేంత శక్తి ఉండదు కదా..తరువాత ఒకరి తర్వాత ఒకరిని కరుణని, అబద్దాన్ని, రసముని, ద్రోహాన్ని, లోభిత్వము ను, అందరిని కనిపేట్టేసింది పిచ్చితనం, ఒక్క ప్రేమను తప్ప. పిచ్చితనం పట్టుదలగా వెతుకుతుంది ప్రేమని. ప్రేమను కనిపెట్టలేక అసహనం గా ఉంది పిచ్చితనం.
ఓర్వలేనితనంతో అసూయ పిచ్చితనం చెవిలో గుసగుసలాడింది "నువ్వు కనిపెట్టాల్సింది ప్రేమని మాత్రమే, ప్రేమ గులాబి పొదలో దాక్కుని ఉంది వెళ్ళు" అని. పిచ్చితనం అసహనంగా ఒక కర్ర తీసుకుని గులాబి పొదను పొడవసాగింది. అలా పొడవగా పొడవగా, అకస్మాత్తుగా ఎవరిదో బిగ్గరగా ఏడుపు వినిపించింది.ప్రేమ గులాబి పొదలోంచి బయటకు వచ్చి తన ముఖము కనబడకుండా రెండు చేతులూ అడ్డం పెట్టింది.ప్రేమ రెండు కనులలోంచి రక్తం కారుతోంది. పిచ్చితనం ప్రేమను కనిపెట్టాలనే తొందరలో ప్రేమ రెండు కళ్ళను పొడిచేసింది. ఒక్కసారిగా అంతులేని దుఃఖము తో "అయ్యో , నేనెంత పని చేసానే" అని కుమిలిపోయింది పిచ్చితనం. "నేను నిన్ను అంధురాలిని చేసాను. ఇప్పుడు ఎలా?నీకు చూపుని ఎలా తిరిగి ఇవ్వగలను" అని బాధపడుతుంటే, ప్రేమ ఇలా బదులిచ్చింది. "నువ్వు పోయిన నా చూపుని తిరిగి ఎలాగూ నాకు ప్రసాదించలేవు.నిజంగా మంచి మనసుతో నాకు నువ్వు ఎమన్నా చెయ్యలనుకుంటే,ఈ రోజునుంచి నాకు దారి చూపించే తోడుగా ఉండు." అని అడిగింది. ఆ రోజునుంచి, ప్రేమ గుడ్డిది కావడంతో తోడుగా ప్రేమను అంటిపెట్టుకుని ఉండిపోయింది పిచ్చితనం.
(Original author : Unknown. Translated by me in telugu)
(Original author : Unknown. Translated by me in telugu)

చాలా బాగుంది. ఏదో ఆవేదనతో రాసినట్టుగా ఉంది . తనను పట్టించుకున్న పట్టించు కోక పోయినా ఆ ప్రేమ అందరిని ప్రేమిస్తూ పొతే బాగుంటుందేమో
ReplyDeleteఒక స్నేహితురాలు ఇమైల్ లో పంపిన ఇంగ్లిష్ కథ కి తెలుగు లో అతి కష్టం మీద చేసిన అనువాదమండి.నాకు చదివినప్పుడు చాలా నచ్చేసింది. అందుకని మీ అందరితో పంచుకోవాలని అనిపించింది. ధన్యవాదాలు మీకు.
Deleteప్రేమ, పిచ్చి అలా జతయ్యాయన్నమాట భలే చెప్పారండీ..
ReplyDeleteనమ్మాలని అనిపిస్తుంది కదండి? ఇది ఎవరు రాసారో తెలీదు. కాని నాకు మాత్రం చాలా నచ్చింది. ధన్యవాదాలు రాజి గారు
DeleteMadam, మనస్తత్వాల సుమ మాలల అల్లిక ఎంతో అందంగా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ప్రేమకు మీరు చెప్పిన నిర్వచనం. ఈ రోజుల్లో ప్రేమపై పిచ్చితనపు ప్రభావం ఎంత ఉందొ తెలుస్తూనే ఉంది. ప్రేమ గుడ్డిది కనుక పిచ్చితనం దానిని ఎలా తీసికెళ్తే అలా వెళ్ళాల్సొస్తుంది కాబట్టి పిచ్చితనం ఇంకా అవివేకంతో ప్రేమకు హాని చేస్తూనే ఉంది. వివేకం అనే ఊత దొరికితే ఇప్పటి ప్రేమ సరైన దారిలో వెళ్తుంది.
ReplyDeleteఫాతిమ గారు, ఇది ఇమైల్ లో ఒక స్నేహితురాలు పంపిన ఇంగ్లిష్ కథ కి తెలుగు అనువాదము. నేను రాసినది కాదు. నేను తెలుగులో రాసి ఈ టపా పోస్ట్ చేసాను.మీ నిర్వచనం బాగుంది. ధన్యవాదాలు మీకు.
Deletechaalaa bagundi mee katha.
ReplyDeleteగీతిక గారు ధన్యవాదాలు. కాని నేను రాసినది కాదు. తెలుగులో రాసి మీ అందరితో పంచుకున్నాను అంతే!
Delete@వెన్నల గారు
ReplyDeleteఆహా అద్బుతమండి...ఎంతబాగా చెప్పారు మనలో భావాలు ఏ లక్షణాలతో ఉంటాయని...
మొదట చూసినప్పుడు నా బధకము ఇంత చదవాలా వద్దులే అని చెప్పింది
సరే నా ఆలోచన "పిచ్చి ప్రేమ" అన్న పదాన్ని చూసి ఆ బొమ్మను చూసి ఇదేదో బాగుండేటట్టు ఉంది చదువు అని చెప్పింది
తరువాత నా జ్ఞానము సహాయముతో చదువుతూ పోయాను
అంత చదివేసాక నా వివేకము అందులో నీతిని గ్రహించి అది ఒక కథైనప్పటికి అందులో ఎంత అర్థము ఉందో వివరించింది
తరువాత నా మనసు ఆ పిచ్చి ప్రేమకు దాసోహమైంది ......
కల్యాణ్ గారు, ఇది నా కథ కాదు. దీనిని తెలుగులో రాయడం మాత్రమే నేను చేసినది.
Deleteచిత్రం నచ్చి, ఈ కథ ను చదివి మీరు స్పందించిన తీరు బాగుంది. ధన్యవాదాలండి మీకు.
వెన్నల గారు ఏమైనా బాగుందా చెప్పండి మీరు వెన్నల అని పేరు పెట్టుకొని జాబిలి గురించి తెలిసి పదే పదే అలా అనకండి..... రవి కిరణాలు ఎంత వేడిగా వుంటాయి...అంతటి కిరణాలు వెన్నలాగా మారి మనకు చేరుతుంది కదా... మరి ఇది అంతే మీరు చెప్పకపోయినా కష్టమైన ఆ ఆంగ్ల ప్రచురణని అనువాదం చేసి చల్లని తెలుగులో పంపారు వెన్నల అనిపించుకున్నారు...కాబట్టి మీరెంత చెప్పినా వెన్నల గొప్పతనం గొప్పతనమే ... మరొక్కసారి ధన్యవాదాలు అనువదించి మాకు చక్కగా అందించినందుకు.... :)
Delete:)) ధన్యవాదాలు కల్యాణ్ గారు
Delete...
ReplyDelete:)
love is blind,
and having madness...
అంటారా???
@శ్రీ
Story written by someone said that Sri garu!(even though I believe that..). Translated an English story sent by my friend. I really liked it when I read it, and hence shared with everyone.
Deleteఈసారి చిత్రం రాణి ముఖర్జీ లా ఉందండోయ్!.....
ReplyDeleteనిజమే పోలికలున్నాయండోయి! భలే కనిపెట్టారండి.
Deleteఎక్కడిదండి ఈ కథ!ప్రేమను గుడ్డి దాన్ని చేసి దానికి పిచ్చితనాన్ని తోడు చేశారు.ఈ కాలపు ప్రేమలు అంత గుడ్డిగా ఏమీ లేవండి .లెక్కలు వేసుకొని మరీ ప్రేమిస్తున్నారు.అంతగా కుదరకపోతే ఇంకో ప్రేమ కోసం వెతుకులాట.!కథ తమాషాగా వుంది.పూర్వపు ప్రేమల్లో వున్నా సాంద్రత ఇప్పటి వాటిలో లేవు.
ReplyDeleteస్నేహితురాలు పంపిన ఇంగ్లీష్ కథ ను తెలుగులో రాసేసి మీ అందరితో పంచుకున్నాను. నేను రాసినది కాదు. మీరు చెప్పిన దానిలో నిజం ఉంది. కాని అది కూడా ఒకందుకు మంచిదేనేమో! May be they are just being practical controlling their emotions.
Deletebhale raasare baavundi mi tapaa!!
ReplyDeleteటపా నేను రాసినా , కథ నాది కాదోచ్! ఇంగ్లిష్ లో ఉన్నదాన్ని తెలుగులో రాసేసి మీ అందరి మన్నలను కొట్టెయ్యలని అనుకుని ఒక పధకం వేసుకున్నాను మంజు గారు. ధన్యవాదాలు మీకు.
DeleteIdi Kadhaina chala Baga ooohincharu meru.....Anduke nemo Prema Ane pichitanmu lo mulnigi Youth verri veshalu vestumdi...Idi nenu pichi prema gurinchi chebtunnanu...Prema gurinchi kadu suma....
ReplyDeleteనేను ఊహించలేదండి.ఇంగ్లీష్ లో ఉన్న కథను తెలుగులో రాసాను అంతే! ధన్యవాదాలు మీకు!
Deleteసృజనాత్మకమైన కథ..మీ అనువాదం చాలా బావుంది.
ReplyDeleteధన్యవాదాలు జ్యోతిర్మయి గారు!
Deleteవెన్నెల గారు బాగుంది....చక్కగా అనువదించారు..ఫీల్ మిస్ కాలేదు.
ReplyDeleteచాల పోస్టులు చదవాల్సినవి ఉన్నాయ్...చదవాలి :))
అసలు మీరున్నట్టా?లేనట్టా? అనిపించిందండి శేఖర్ గారు! ధన్యవాదాలు మీకు.
Deleteమొదటి పదం నుండి చివరి పదం వోరకు అలరించాయి.....చాలా బావుంది... జలతారువెన్నెల గారు ...
ReplyDeleteధన్యవాదాలు రాంగారు!
Deleteవామ్మో... దీని వెనుక ఇంత కథ ఉన్నదా?!?!?!
ReplyDeleteకల్పిస్తే ఎన్నైనా కథలు ఉండొచ్చు కదండి? కాని ఈ కథ ఎందుకో ఆకట్టుకుంది. అందుకే అందరితో పంచుకోవాలనిపించింది. ధన్యవాదాలండి.
Deleteమీరు ఉహించి రాసిన కథ కాకపోయినా మీ అనువాదం చాలా బాగుంది వెన్నెల గారు!
ReplyDeleteచదివి మెచ్చినందుకు ధన్యవాదాలండి!
Deleteప్రేమ ఎప్పుడూ పిచ్చిదే!
ReplyDeletechala bagumdi.....
ReplyDeleteమీ కవితలు బాగుంటాయి. ధన్యవాదాలు హనుగారు.
Deletewow Bale Vivarincharu kadhaa
ReplyDeleteనేను కాదు కద వర్ణించింది, translate చేసాను అంతే! ధన్యవాదాలు తమ్ముడూ!
Deleteచాల చక్కగా వ్రాసారు...నిజమేనేమో ఇది అనిపిస్తుంది .మంచి ఊహ.
ReplyDeleteస్నేహితురాలు పంపిన ఒక ఇంగ్లీష్ కథ తెలుగులో అనువదించాను అంతే నండి. మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.
Deleteచాలా బాగుంది.. "లవ్ ఈజ్ బ్లైండ్ " కావడానికి కారణాలు ఉంటాయని చెపుతుంది. ఈ కథ.
ReplyDeleteనేను ఇప్పుడే చూసాను.చాలా బాగా అనువాదం చేసారు. ఫీల్ బాగుంది.
ధన్యవాదాలు వనజ గారు!
Deleteచాలా చాలా బాగుందండి ఈ అనువాద కదా. Thanks for sharing.
ReplyDeleteచదివారనమాట! :)
Delete