Wednesday, May 23, 2012

ఆకాశానికి రవికిరణం




ఆకాశానికి రవికిరణం ఆరని హారతి
కడలికి పున్నమి జాబిల్లి వెన్నెల హారతి
త్యాగం మనిషికి ఆభరణం..అది జీవన జ్యోతి
కల్లాకపటం తెలియని హృదయం
కర్పూర జ్యోతి..వెలిగే కర్పూర జ్యోతి

పుట్టినరోజున పాపకు తల్లి పట్టేదే తొలి హారతి
కొత్తకోడలికి ముత్తైదువులు ఇచ్చేదే శుభ హారతి
నిండు మనసుతో దేవుని కొలిచి వెలిగించేదే శ్రీ హారతి
నిండు మనసుతో దేవుని కొలిచి వెలిగించేదే శ్రీ హారతి
కరిగి కరిగినా కాంతి తరగని మంగళ హారతి ఆ జ్యోతి
కల్లాకపటం తెలియని హృదయం..కర్పూర జ్యోతి

విరిసిన కుసుమం వాడిపోయినా..పిందె గురుతుగా మిగిలేను
పండిన ఫలము నేలరాలినా..విత్తనమైనా మిగిలేను
ఆయువు తీరి మనిషి పోయినా
ఆయువు తీరి మనిషి పోయినా..సంతతి అయినా మిగిలేను
వయసులేనిది, వాడిపోనిది  స్మృతి గా మాత్రం మిగిలేది
కల్లాకపటం తెలియని హృదయం..కర్పూర జ్యోతి

8 comments:

  1. జలతారువెన్నెల గారు, మంచి పాట అందునా జానకి పాడిన పాట..... share చేసినందుకు ధన్యవాదాలండి....

    ReplyDelete
  2. Replies
    1. మంజుగారు...పొరబడ్డారేమో! ఇది "సంగీత" అనే పాత సిమిమాలో పాట అండి! ధన్యవాదాలు.

      Delete
  3. ninnana mi kavita chusanu comment raaddamante net a time lo pani cheyaledu enka mi kavitalu kaburlu kudaa baavuntunnayi anduke ekkada rasanu

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య.. అయితే దిగులే లేదు నాకు. Thank you so much మంజు గారు!

      Delete