Friday, May 25, 2012

పాలరాతి శిల్పం చెప్పిన నీతి!


ఒక మ్యుసియం లో అందమైన పాలరాతి శిల్పాన్ని ద్వారం దగ్గర అందరికి కనపడేలా ప్రదర్శించారు.ప్రపంచం నలు దిక్కుల నుండి ఎంతో మంది ఆ అందమైన పాలరాతి శిల్పాన్ని చూడడానికి వచ్చేవారు.ఒక రాత్రి వేళ నేల మీద ఉన్న మార్బల్ టైల్ కి ఆ శిల్పానికి మధ్య సంభాషణ ఇలా సాగింది. " ఓ శిల్పమా..అన్ని దేశాల నుండి ఎంతో మంది నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చి మా మీద అడుగులు వేసి తొక్కేస్తూ ఉంటారు. ఇది భావ్యమేనా?" అని అడిగింది మార్బల్ టైల్. అప్పుడు ఆ శిల్పం ఇలా జవాబు ఇచ్చిందట. "స్నేహితుడా.. నీకు గుర్తుందా మనిద్దరము ఒకటే గుహలోంచి వచ్చాము?" అని. టైల్ దానికి బదులుగా "అందుకే అడుగుతున్నాను,ఇద్దరము పుట్టింది ఒక చోటే, కాని మన ఇద్దరిని ఆదరించే తీరులో ఇంత వ్యత్యాసమేమిటి అన్నది నా ప్రశ్న.ఇది చాలా అన్యాయం కదా" అని అడిగింది.

శిల్పం టైల్ తో " నీకు గుర్తుందా? శిల్పి మన దగ్గరకి వచ్చినప్పుడు మనిద్దరితో పని చెయ్యాలని ప్రయత్నించాడు. నువ్వు ఎదురుతిరిగి అతని పనిముట్లు కి సహకరించలేదు. అదే శిల్పి నా దగ్గరకి వచ్చి తన పనిముట్లు తో నా వళ్ళంతా గాయాలు చేస్తూ నన్ను చెక్కుతున్నపుడు నాకు తెలుసు, ఇవన్నీ భరిస్తూ నేను అతనికి సహకరిస్తే నేను అందరిలా కాక పదిమందిలో ప్రత్యేకం గా నిలువగలుగుతానని. అందుకే ఎంత నొప్పిగా ఉన్నా ఓర్చుకుని ఈ రూపాన్ని పొందాను.నువ్వు శిల్పికి సహరించక అలాగే ఉండిపోయావు.అందుకని  నువ్వు చేసుకున్నదానికి ఎవరినో నిందిస్తావు ఎందుకు?" అని జవాబు ఇచ్చింది.

చిన్న వయసునుండి, జీవితం లో లక్ష్యాలు ఏర్పరుచుకుంటూ,కష్టపడిన వారు జీవితంలో తప్పక పైకొస్తారు. పరాజయాలు, విపత్తులు ఎన్ని ఎదురైనా కుంగిపోకుండా జీవితం లో ముందడుగు వేస్తూ సాగిపోతే మనం కోరుకున్న గమ్యాన్ని తప్పక చేరుకుంటాము. జరిగిపోయినవన్ని తలచుకుంటూ గతంలో వగచేకన్నా, మనం ఏ విధంగాను మార్చలేని గతాన్ని మరిచిపోతూ ,ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకుంటూ(blessing in disguise),వర్తమానంలో జీవిస్తూ, ఉజ్జ్వలమైన భవిష్యత్తు గురించి కలలు కంటూ, విలువలను కాపాడుకుంటూ,మన లక్ష్యాలన్ని నెరవేర్చుకుంటూ  ముందుకు సాగిపోవాలి!

(Original author : Unknown. Translated by me in telugu)

32 comments:

  1. ఇదే కథ దేవుడి విగ్రహం,గడప పై ఉండే రాయి మీద వుంది .మీరు ఇంకా బాగా వ్ర్తాసారు.చివరి సందేశం ఇంకా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు, బాగున్నారా? నేను దేవుడి విగ్రహం, గడప కథ వినలేదండి.
      నేను ఈ కథ ఒక బుక్ లో చదివినట్టు గుర్తు. మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు మీకు.

      Delete
  2. రవిశేఖర్‍గారన్నట్లు దేవుడి విగ్రహం,గడపపై ఉన్న కథను మీరు ఈ కాలానికి తగినట్లుగా బాగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి. నేను దేవుడి విగ్రహం,గడప పై ఉండే రాయి కథ చదవలేదండి. ధన్యవాదాలు విజయమోహన్ గారు.

      Delete
  3. Inspiring, బాగుంది.

    ReplyDelete
  4. మీ 'బ్లాగింగ్' సందేహంలో మీరు వెలుబుచ్చిన సందేహాలకు ఈ నీతికథ ఒక సమాధానం. బ్లాగులో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకోవచ్చు. కానీ, కొద్దో గొప్పో కొందరికైన ఉపయోగపడే ఇలాంటి రచనలు చేస్తే బాగుంటుంది. చాలా బాగా రాసారు వెన్నెల గారు!

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా నాగేంద్ర గారు? అలాగేనండి. ట్రై చేస్తాను. ధన్యవాదాలు మీకు.

      Delete
  5. రవిశేఖర్ గారు ఉదహరించిన కథ చదివానండీ...
    కాలానుగుణంగా... మీ ప్రస్తుతీకరణ బాగుంది....
    మీ స్వాగతం బాగుంది. :-)
    @శ్రీ....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీ గారు. ఆ కథ నేను చదవలేదండి.

      Delete
  6. debba, debba ki orchukoni,
    thnaku thanu malachukoni,
    edagadame, kada, ee jeevitham.

    ReplyDelete
  7. kadha baagundi cheppina vidham kuda chaalaa chaalaa baavundi vennela

    ReplyDelete
  8. కధ మరోరూపంలో పాతదే అయినప్పటికీ మీదైన శైలిలో చక్కగా వివరించి, చివరలో సందేశాత్మకమైన సూచనను ఇవ్వడం నాకు చాలా చాలా నచ్చిందండి.

    ReplyDelete
    Replies
    1. భారతి గారు, మీకు నచ్చినందుకు చాల చాల సంతోషం. ధన్యవాదాలు మీకు.

      Delete
  9. మీ పాలరాతి శిల్పం చెప్పిన నీతి బాగుంది . మనిషి 'వర్తమానంలో బ్రతకాలనే' - మీ సందేశం కూడా మంచి సందేశం . ఈ కథ ద్వారా నేనింకో నీతి కూడా చెప్పదలచుకొన్నాను .....
    కాల గమనం లో క్రిందు మీదౌతుంది , మీదు క్రిందౌతుంది.మనిషి దానిని కూడా తట్టుకొని నిలబడడానికి సిధ్ధంగా ఉండాలి మరి !

    దురిత దూరుల ఘన పాద ధూళి తగిలి
    పరమ పావన మగును - ఆ -పాలరాయి
    తీరు తీరుల మనుజుల దిష్టి తగిలి
    శిల్పి చెక్కిన బొమ్మయు శిధిల మగును

    కాల చక్రంపు గమనాల ఘటన వల్ల
    క్రిందు మీదగు , మీదౌను క్రిందు - ఐన
    కలత జెందక కర్తవ్య ఘనత దాల్చి
    వర్తమానాన బ్రతుకుటే వర్తనమ్ము .

    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి.మంచి సందేశం మాష్టారు! ధన్యవాదాలండి!

      Delete
  10. మనిషిని మలిచిన దేవుడు, మనసును మలచుకునే స్వేచ్ఛను మనిషికే వదిలాడు.మేధకు పదును పెట్టాలి,మాటకు మంచితనాన్ని అద్దాలి.మానవతకు నగిషీలు చెక్కాలి.అప్పుడు గులకరాయివంటి మనిషయినా వజ్రసమానుడవుతాడు.చక్కటి కథకు ఆకట్టుకునే కథనం!

    ReplyDelete
    Replies
    1. "మేధకు పదును,మాటకు మంచితనాన్ని అద్దాలి.మానవతకు నగిషీలు చెక్కాలి"
      ఎంత బాగా చెప్పారండి? కథనం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు ఉమాదేవి గారు.

      Delete
  11. గుర్తింపు రావాలంటే దెబ్బలు తినాలంటారు. బాగుంది

    ReplyDelete
  12. వెన్నెల గారు
    చాలా బాగా రాసారండి
    కస్టపడి పని చేస్తే ఫలితం తప్పక దక్కుతుంది
    కష్టేఫలే గారి బ్లోగ్ లోనే వుంచుకుని మళ్ళి అడుగుతారేంటి

    ReplyDelete
    Replies
    1. నిజమేనండోయి శ్రీనివాస్ గారు! కష్టేఫలే గారి గురించి మరిచాను.ధన్యవాదాలు మీకు.

      Delete
  13. చాలా బావుంది..

    ReplyDelete