జీవితంలో బాగా స్థిరపడిన కొందరు యువతీయువకులు వారు చదువుకున్న కాలేజ్ లో మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. చదువుకునే రోజుల్లో వాళ్ళు ఎంతో ఇష్టపడే ప్రొఫెస్సర్ ని కలవడానికి వెళ్ళారు. వాళ్ళందరి సంభాషణలలోను జీవితం పట్ల తీవ్రమైన అసంతృప్తి, పని ఒత్తిడి వల్ల కలిగే అలసట,బంధాల పైన అపనమ్మకం ఇలాంటివే ఎక్కువగా మాటలు దొర్లాయి. ఇంతలో ప్రొఫెస్సర్ వారందరికి కాఫీ పెడతానని చెప్పి వెళ్ళి, ఒక పెద్ద కాఫీ పోట్ లో కాఫీ, మరియు ఒక పది కప్పులు తెచ్చి వాళ్ళందరి ముందు ఉంచారు. ఇంట్లో ఒకే రకమైన కప్పులు కనపడకపోవటం వల్ల, కొన్ని గాజు కప్పులు, కొన్ని ప్రొసిలైన్ కప్పులు, కొన్ని క్రిస్టల్ వి, కొన్ని సాధారణ మైనవి, కొన్ని ఖరీదైనవి ప్రొఫెస్సర్ తెచ్చి వారి ముందు పెట్టారు.అందరిని వారికి కావాల్సిన కప్పుల్లో కాఫీ నింపుకుని తాగమని చెప్పారు.వాళ్ళందరు కాఫీ తాగుతుండగా ప్రొఫెస్సర్ గారు ఇలా అన్నారు.."మీరందరు గమనించారో లేదో, ఖరీదైన , అందమైన కప్పులన్ని తీసుకుని, మామూలుగా ఉన్నవి, సాధరణంగా కనిపించే కప్పులు వదిలేసారు.ఇది చాలా సాధారమైణ విషయం,మీరందరూ ఒక సర్వోత్తమమైన జీవితం కోసం ఆశపడుతున్నారు. అదే మూల కారణం మీ అందరి సమస్యలకి, జీవితం పట్ల అసంతృప్తి కి.మీరు తాగుతున్న కప్పు ఎలాంటిదైనా మీ అందరి కాఫీ ఒకేలా ఉంటుంది.మీకందరికీ కావాల్సినది కాఫీ, కాని మీరందరూ ఉన్నవాటిలో అతి ఖరీదైన కప్పు కోసం కాని, అందమైన కప్పు కోసం కాని తాపత్రయపడ్డారు.తరువాత నెమ్మదిగా మీ పక్కవారు ఏకప్పులో కాఫీ తాగుతున్నారో చూడసాగారు. మీ జీవితం ఒక కాఫీ అయితే , మీ ఉద్యోగం, మీ డబ్బు,సమాజం లో మీ ప్రతిష్ట కప్పులు.ఇవన్నీ జీవితం గడపడానికి పనికొచ్చేవి మాత్రమే ! మీరు చేస్తున్న ఉద్యోగం, మీ డబ్బు మీరు అనుభవించే జీవితాన్ని మార్చదు.మనం ఎక్కువగా కప్పు మీద ద్యాస పెడతామే తప్ప మనకు భగవంతుడు ఇచ్చిన జీవితం గురించి అలోచించము.దేవుడు మనకి కాఫీ ఇస్తాడే తప్ప మనం తాగే కప్పు ని వెతికి ఇవ్వడు.సంతోషంగా ఉన్నవారికి శ్రేష్ఠమైన జీవితం ఉండకపోవచ్చు. కాని వారికున్నదానిలో వారు చాలా గొప్ప జీవితాన్ని గడుపుతారు. సాధారణమైన జీవితం గడపండి,దాతృత్వముతో ఉదారమైన జీవితం గడపండి. ఎదుటివారి గురించి అలోచించండి, వారిని ప్రేమతో చూడండి. అందరిపట్ల దయను కలిగి ఉండండి. ఆపై భగవంతుడి కి వదిలెయ్యండి.జీవితంలో అందరికన్నా ధనవవంతుడు అంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడు కాడు, ఎవరికైతే అతి తక్కువ డబ్బు కావాలో జీవించడానికి, వాడే ధనవంతుడు." అని ముగించారు.
(Original author : Unknown. Translated by me in telugu)

super..
ReplyDelete"జీవితంలో అందరికన్నా ధనవవంతుడు అంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడు కాడు, ఎవరికైతే అతి తక్కువ డబ్బు కావాలో జీవించడానికి, వాడే ధనవంతుడు."
ReplyDeleteమంచి విషయం చెప్పారండీ...
ఇంక "అమ్మ చిత్రాలు" మీరు చెప్పకముందే మా చూపులు ముందుగా అటే వెళ్ళిపోయాయి..
చాలా బాగున్నాయి.
ధన్యవాదాలు రాజిగారు!
Deletenicely brewed
ReplyDelete:) chala baagundi
ReplyDeleteధన్యవాదాలు మానస గారు!
Deleteజీవితార్ధాన్ని ఒక కాఫీకప్పుతో పోల్చి ఎంత బాగా చెప్పారండీ..
ReplyDeleteఅమ్మ చిత్రాలకు విలువకట్టగలవారమా ఎవ్వరమైనా!
అంత బాగున్నాయి.అభినందనలు.
నిజమేనండి! ధన్యవాదాలు లలితగారు
Deleteఅసంతృప్తి మనిషిని పాడు చేస్తుంది.
ReplyDeleteఅవుననండి మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు.
Deleteకాఫీ కప్పులో ఆలోచనాతుఫానులేపి ధనవిలువ తెలిపే కాగితాలకన్నా శ్వేతపత్రంవంటి మనసున్నవాడే మహరాజు అని చెప్పడం అమ్మగుండెలో పొదువుకున్న పసిపాపంత స్వచ్ఛంగా ఉంది.
ReplyDeleteఉమాదేవి గారు, ఎంత బాగా చెప్పారండి. మీ కామెంట్ కూడా చాలా సార్లు చదువుకోవాలనిపిస్తుంది. ధన్యవాదాలు మీకు!
Deletevery nice post. Thank you...very much........
ReplyDeleteవనజగారు! బాగున్నారా? ధన్యవాదాలు మీకు.
Deleteబాగా విశ్లేషించారు
ReplyDeleteధన్యవాదాలండి!
Deleteవెన్నెల గారూ కాఫీ కప్పులతో చాలా బాగా చెప్పారు. ఇంకో విషయం మనం ఎంచుకున్న మంచి కప్పులో కాఫీ తాగుతూ సంతోషంగా ఉండడం కన్నా, పక్కవారి కప్పు, మనకప్పుకంటే అందంగా ఉందనో, ఖరీదైనదనో బాధపడుతూ కూడా ఉంటాం. ఈ మధ్య ఇది మరీ ఎక్కువ కనిపిస్తోంది.
ReplyDeleteబాగా చెప్పారు! ఈ విషయం మీకు, నాకు ( ఇక్కడ నివసిస్తున్నవారికి) బాగా అనుభవమే కదండి! ధన్యవాదాలు మీకు!
Deleteఐనా వింటారా ? కవి
ReplyDeleteతా ! నీమాటలు ? "జగత్తు ధన మూలము"? సౌ
ఖ్యానుభవ జీవనమ్మే
ఙ్ఞానమునకు నేడు కొలతగా మారె గదా !
బ్లాగు సుజన-సృజన
నిజమే మాష్టారు. అన్ని తెలుసుకుంటున్నాము, విశ్లేషించుకుంటున్నాము,సంతోషం గా ఉండాలంటే ఎలాంటి జీవితం గడపాలో తెలుసు, అయినా మళ్ళీ ఈ పోటి పరుగుపందాలలో, "నా"
Deleteఅనే స్వార్ధపు ఉచ్చు లో బిగుసుకుపోతున్నాము.ధన్యవాదాలు మీకు!
కని పెంచిన కడుపాకలి
ReplyDeleteకనుటకు కనికరము లేని కఠినాత్ముల గని , తా
ననయము ఆకలి మంటకు
కనకన మని బొగులు "అమ్మ కడుపుకు" జేజే !
బ్లాగు సుజన-సృజన
స్వార్ధం కని పెంచిన తల్లి తండ్రులను కూడ పట్టించుకోనివ్వకుండా చేస్తున్నది మాష్టారు.పద్యం తో ఎప్పటిలాగే మంచి మాటలు చెప్పిన మీకు ధన్యవాదాలు.
Deletenice post andee... పోస్టు కన్నా బాగా డామినేట్ చేసిన విషయం ఏంటంటే...
ReplyDeleteకమెంట్ బాక్స్ కి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే.. ఒకదానిని మించి ఒకటీ అమ్మ బొమ్మలు. "చాలా బాగున్నాయ్..." అంటే చిన్నమాటవుతుందేమో..
రాజ్ కుమార్ గారు, Thank you very much! Glad you liked them.
Deleteజీవితం కాఫీ లాంటిదా ! నాకు కాఫీ అంటే చాలా ఇష్టం :)
ReplyDeleteఅమ్మ చిత్రాలు చాలా బాగున్నాయి .
అసలు మీ టెంప్లెట్ డిజైన్ నే వెరైటీ గా వుంది . అందరికన్నా పైన వున్న అమ్మాయి హోంలీగా , ఆకుపచ్చ చీర లో చాలా బాగుంది .కింద పెన్ తో రాస్తున్న అమ్మాయి కూడా బాగుంది .
same pinch అండి! నాకు కూడా కాఫీ అంటే చాలా ఇష్టం. ఆకుపచ్చ అమ్మాయి చిత్రం, కింద పెన్ను తో రాస్తున్న అమ్మాయి చిత్రం, అమ్మ చిత్రాలన్ని మన ఇంటర్నెట్ పుణ్యమే! కాని నా బ్లాగ్ లో చేరాక అవి నావే! ( అని నాకు నేను సరిపెట్టేసుకుంటున్నను). అమ్మ చిత్రాలన్ని ఎంతో మక్కువతో నేను పోగుచేసుకున్నవి. మీకు కూడా నచ్చినందుకు ధన్యవాదాలు మాలా కుమార్ గారు.
Deleteనేను కూడా కాఫీ ప్రియుడినే. మంచి కాఫీ ఏ పాత్రలో ఇచ్చినా తాగేస్తాను...దహా.
ReplyDeleteఅమ్మ చిత్రాలు బాగున్నాయి.
మనం ఒక కాఫీ క్లబ్ పెట్టేసుకుందామండి అయితే. :))
Deleteఅమ్మ చిత్రాలు మీకు నచ్చినందుకు సంతోషం.
ధన్యవాదాలు మీకు!
వెన్నెల గారు !
ReplyDeleteకాఫీ-కప్పులు post ఒక్కసారి వెనుదిరిగి లోలోపలికి చూసుకునేలా చేసింది,
నన్ను నేనే ప్రశ్నించుకునేలా,
నా చేతలను నిజాయితీగా సమీక్షిన్చుకునేలా,
నా ఆలోచనలను భావాలను అవలోకిన్చుకునేలా ఉండటమే కాదు
అవకాశమున్నంత మేరకు సవరించుకునేలా
inspiring గా ఉన్నది ఇది చదవగానే,
చదవటం కాదు చూడటం,
ఎవరికీ వారము ఆత్మ పరిశీలన చేసుకోవటం కోసమై
వినూత్న శైలి లో
ప్రొఫెసర్ గారి చేత జీవితపు పాఠం బాగా చెప్పించారు,
కథ లో మరో విశేషం ఏమంటే ,...
అందరూ బడి చదువులు పూర్తి చేసుకున్నవారే,
కాని బ్రతుకు బడి లో నేర్వలాసింది ఉందని తెలిసేలా చిన్న చిన్న సమస్యలతో ఉన్నట్లు చిత్రించారు,
నిజమే బాధ ఉన్నప్పుడే బోధ సరిగ్గా బోధ పడుతుందని మా సత్సంగం లో చెప్తుంటారు,
వీరంతా సరైన సమయం లో గురు చెంతన చేరారు,
సరైన కాలం లో నే వారిలో వివేక బీజాలు నాటాడు ఆ గురువు గారు,
ఏమాత్రం సందేహం లేదు, ఆ వివేక బీజాలు వట వృక్షాలుగా ఎదిగి
వారినందరినీ బ్రతుకు బడి లో గెలిచేలాచేస్తాయి.
ఏదో కాఫీ - కప్పులు అని heading ఉంటె
నాకు కాఫీ అనేది సూఫీ లా కనిపించింది నా మనసుకి వినిపించింది కూడాను 2 or 3 times,
సరే కదా! అని చూస్తే నిజంగా సూఫీ (కవిత) కథ విన్నట్లే ఉన్నది.
చక్కని post ని అందించినందులకు కృతజ్ఞతలు.
ఇంకో విషయం చెప్పాన?
ఎక్కడెక్కడో వెతుకుతాం ధ్యానమని యోగమని etc etc
కాని ఇలాంటి చిన్న చిన్న స్థాయి లోని అంశాలే ఉన్నత స్థానానికి తీసుకు వెళ్తాయి.
మొన్న ఆ మధ్య కాన్పూర్ అని ఉత్తరభారతం లో ఒక ప్రాంతానికి వెళ్ళాను,
అక్కడ మట్టితో చేసిన పాత్రలతో కాఫీ తాగుతుంటే,
నేను ఆగి వాటిలోనే తాగి ఒక అరడజను కొనుక్కుతేచ్చుకున్నాను!
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ అని మా దేవదాసు చెప్పాడు !! బాగుంది !!
ఎప్పుడూ ఇలాంటివి సాధ్య పడక పోయినా కనీసం పక్షానికొక్క మారన్న
మాచేత ఇలా నిజ పరిశీలన చేయించండి.
కొంత లో కొంత అన్నా పరిణామం వస్తుంది క్రమంగా!
sairam
?!
ధన్యవాదాలండి. మీ కామెంట్ నిజంగానే అలోచనలో పడేసింది నన్ను మళ్ళీ.
Deleteఅమ్మ! బొమ్మలు చూడమన్నారు కదూ !
Deleteచూస్తున్న చూస్తున్నా ! ఏమ్మా ! ఎంత చాంతాడంత comment పెట్టనని కసి కాకపోతే
అమ్మకు దూరంగా ఉన్నానని నన్ను ఏడిపిస్తారా?
చిన్న పిల్లాడ్ని చేసి బొమ్మల్ని చూపించి? hu hu :( :(
~!~
~!~
ఏమి పర్లేదు ఇప్పుడే మా అమ్మతో phone లో మాట్లాడను గా!
సరే!
మీరు post చేసిన అమ్మ బొమ్మలలో
మొదటి బొమ్మ లో అమ్మ !
భగవంతుడా నా ఈ బిడ్డడిని చల్లగా చూడు తండ్రి అంటూ వేడుకుంటుంటే...
రెండవ బొమ్మలో !
నా బిడ్డడే భగవంతుడు నాబిడ్డ కు ఏమౌతుందోనని భయపడక్కర్లేదు ఎన్నడూ ! అని గర్వం తో యశోద కృష్ణుడిని ఎత్తుకుంది.
మూడవ బొమ్మలో !
నా ఈ బంగారు కొండని చక్కగా పెంచాలి, చక్కగా ఆడించాలి లాలించాలి ఇంకా చక్కని విద్యాబుద్ధులు చెప్పించాలి, .. అంటూ ఊహాగానాలు చేస్తుంటే..
నాల్గవ బొమ్మలో !
బిడ్డ పెరిగి అల్లరి చేస్తుంటే, అప్పుడే అల్లరి చేస్తున్నాడా నాబిడ్డ ?
ఎంత చిన్ని వాడు, బుల్లి బుల్లి చేతులు చిన్ని చిన్ని కళ్ళు చొట్ట ముక్కు అని మురిపెంతో ముద్దాడు తుండడం అయిదవ బొమ్మలో కనిపిస్తుండగా!
అమ్మకు ఏమాత్రం కష్టం కలిగించ కుండా కడుపునిండా పాలుతాగి కస్తూరి రంగ రంగ విని పండుకున్న బిడ్డడిని చూస్తూ అమ్మ ముసి ముసి నవ్వు నవ్వుకుంటూ ఉండటం ఆరు కాగా,
ఏడవ బొమ్మలో అమ్మో ! నా బిడ్డడు ఏడ్చి ఏడ్చి ఇప్పటికి గానీ పండుకోలేదు, ఏ ముదష్టపోల్లు దిస్టు పెట్టారో, నా బంగారానికి రేపటినించి వేడిని నా దగ్గరే ఉంచుకుంటా బయటకు పంపనే కూడదు అనుకోవటం కనిపిస్తుండగా..
మా నాయనే చిట్టి కన్నా బుజ్జి తండ్రీ కున్నులు బుజ్జులు అమ్ములూ నాన్నలూ మున్నులూ అంటూ ఆడించటం మనకు స్ఫురిస్తూ ఉంటె 8 వ బొమ్మలో...
9 వ బొమ్మలో అమ్మ బిడ్డడిని చూసి చిట్టి తండ్రి నిను చూడగా ... వేయి కళ్ళైనా సరిపోవు నాన్నా ! అంటూ
పైకి పాడితే నాకెక్కడ మెలుకువ వస్తుందో అని అమ్మ తన లోలోనే పాడుకుంటుంది,
10 వాస్తల్యానుభూతిని
11 మమతానురాగపు మాధుర్యాలను సూచిస్తుంటే,,,
12 లో బిడ్డ కళ్ళల్లో తన అందం వెతుకుతూ వాడి చిరునవ్వులో లీనమయి పోయింది...
ఆ పదమూడవ బొమ్మ మీరే నా comment కి reply ఇస్తున్నారు...
Just kidding :)
So nice
ఆ చిత్ర కారులు అమ్మ ప్రేమలో ఎంతలా రమించి ఉండక పోతే ఇంతలా చిత్రీ కరించారో కదూ!
Thank you
:)
?!
Simply mindblowing! అమ్మ చిత్రాల్లో భావాలన్ని ఇంత బాగా తెలియచెప్పిన మీకు నిజంగా ఎలా ధన్యవాదాలు తెలియచెప్పాలి? మిమ్మల్ని మనస్పూర్తిగా ఆశ్వీర్వదించడం తప్ప! మీ భావాలన్ని నేను captions గా రాస్తాను ప్రతి అమ్మ చిత్రానికి, మీరు అనుమతిస్తే. మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు!
Deleteఅమ్మ,
ReplyDeleteమూర్తీ భవించిన స్వార్థం.
తన బిడ్డకి ఎమీ లోటు కాకూడదనే స్వార్ధం!
Deleteనిజమే ! ఆ స్వార్థమే ప్రేమ గా కరిగి మాతృత్వంనిండి వాత్సల్యం అనే మధుర రసాన్ని ఆత్మీయత గా ఇస్తుంది.
Delete?!
"ఆ స్వార్థమే ప్రేమ గా కరిగి మాతృత్వంనిండి వాత్సల్యం అనే మధుర రసాన్ని ఆత్మీయత గా ఇస్తుంది."
Deleteఅబ్బ ఏమి చెప్పారు 'ఎందుకో ఏమో!' అమ్మ సెంటిమెంటు బాగా వుంది. మాటల్లెవ్వు.
:))
Delete@ Anonymous
Delete:)
పోతన గారి పంథా లో
పలికిన వారిదేమున్నది చెప్పండి?
పలికించిన వాళ్ళకే credits అంతా....
?!
wow nuvu super akkaaa bale cheppavu naaku baagaa nachhindi
ReplyDeleteThank you tammudu!
Deletenyc post...ప్రాక్టికల్‌గా కష్టమండీ......జనం చాలా దూరం వచ్చేశారు...వెనక్కు వీళ్ళే సమస్యే లేదు...ఇందులో కొట్టుకు పోవడమే...
ReplyDeleteనిజమే! పర్యవసానము తెలిసి మరీ మనిషి కొనితెచ్చుకుంటున్న ఇక్కట్లు ఇవి అనుకోవాలి మనం ఇక!ధన్యావదాలండి మీ స్పందనకి.
Deleteవెన్నెల గారూ!
ReplyDeleteబాగుందండీ .....ఎంచుకొనే కప్పులతో మానసిక విశ్లేషణ.
'అమ్మ' చిత్రాలు చాలా బాగున్నాయి...@శ్రీ
శ్రీ గారు, ధన్యవాదాలు. మీరు అమ్మ మీద కవిత్వం రాయండి. చిత్రాలు మీకు నచ్చినందుకు సంతోషం!
Deletemee comment ee roje choosaanu...
Deleteamma meeda kavita tappaka raastaanu...
@shree
జీవితం యొక్క అర్ధం చాల చక్కగా చెప్పారు...మనం ఎలా చుస్తే అలా అన్నట్లు...బాగుంది :))
ReplyDeleteశేఖర్ గారు, నిజమే! ధన్యవాదాలు మీకు.
DeleteNice post Madam, pics are so cute.
ReplyDeleteThank you so much!
Deleteచివరగా వచ్చి అన్ని కామెంట్స్ చదివాను.కథ ద్వారా మంచి సందేశం ఇచ్చారు.పోలిక మనిషిని ఎన్నో కష్టాలకు గురిచేస్తుంది.అందులోనుండి పుట్టే ఈర్ష్య మనిషిని దహించివేస్తుంది.
ReplyDeleteఅలాగే అమ్మ బొమ్మలు ఎందుకో ఏమో గారి కామెంట్స్ చాలా బాగున్నాయి.
అమ్మ ప్రేమ లోని కమ్మదనం వర్ణించటానికి మాటలు చాలవు.
మంచి పోస్ట్.
@ Ravishankar garu, Thanks a lot sir,
DeleteI just read your (My favorite) Jiddu krishna moorthy's birthday special post, I like it, thanks
http://endukoemo.blogspot.in/p/blog-page_12.html?showComment=1336819355020
@ వెన్నెల గారు ! అసందర్భ comment అనుకోక పోతే చిన్న మనవి !
ఒక సారి పై link ని ఖాళి ఉన్నప్పుడు చూడ గలరు !!
నాకు youtube లో ఒక కథ సుధా అనే channel కనిపించింది.
నా blog లో post చేసాను కాని, అది aggregators లో చూపించటం లేదు ఇది మంచి సంగతి పలువురికి తెలిస్తే బాగుంటుందని తలచి ఇదిగో మీ బ్లాగు ముఖం గా చెప్తున్నాను
thanks
:)
?!
రవిశేఖర్ గారు, ధన్యవాదాలు.ఎందుకో ఏమో గారు, ఆ కధా సుధ ఇదివరకలో నేను చూసానండి! మంచి లింక్ పోస్త్ చేసారు!
Deleteధన్యవాదాలు మీకు!
Very Nice.
ReplyDeleteడార్క్ బ్యాక్ గ్రౌండ్ మీద, ఆ రేడియంట్ బ్లూ కలర్ అక్షరాలు చదవటం కొంచెం కష్టంగా ఉందండి :)
అలాగే, మీరు వేసే పోస్ట్ లల్లో కొంచెం పారాగ్రాఫ్స్ లా విడగొట్టి రాస్తే చదవటానికి ఈజీగా ఉంటుందనుకుంటానండీ:)
అసలే మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ముఖ్యంగా మీ అమెరికాచదువులు అనే పోస్ట్స్‌లో.
తప్పకుండా వచ్చే వారం ట్రై చేసి, background/text colors change చేస్తాను. మీ feedback ki thank you very much కుమార్ గారు.
Deletenice chala bag achepparu
ReplyDeleteధన్యవాదాలు సందీప్ గారు
Deleteజీవిత సత్యాన్ని కాఫీ కప్ ల ద్వారా చాలా సింపుల్ గా చెప్పారు. NICE POSTING.KEEP IT UP.
ReplyDeleteఆలస్యపు స్పందనకు క్షంతవ్యుణ్ణి
హరి గారు, సమయం కుదిరినప్పుడే కదండి,బ్లాగ్స్ చూడగలము.
Deleteఇందులో క్షమాపణలు దేనికండి? చదివి స్పందించినందుకు ధన్యవాదాలు.