Monday, March 18, 2013

లేడీ బాస్-ఆఖరి భాగం



ఇద్దరి లేడీబాస్ లతో నిత్యం ట్రెడ్ మిల్ల్ మీద పరిగెట్టిన అనుభవేమో,మా కొత్త బాస్ గారు నడిస్తే చాలు,పరిగెట్టద్దు అనడం చాలా వింతగా అనిపించింది.అదేనండి ప్రతి చిన్న దానికి హడావిడి పడుతుంటే,ఫర్వాలేదు నెమ్మదిగా చెయ్యమనేవారు.ఇలా అలోచించటం తప్పేమో కాని,"భగవంతుడా,ఇకపై నాకు ఎప్పుడు మగ బాసులనే ప్రసాదించు స్వామి" అని పైకి ఎవ్వరికి వినపడకుండా దేవుడిని కోరుకున్నాను కూడా."రాక్షషి,నువ్వు స్త్రీవే కదా,ఇలా అలోచించడం తగునా?"అని అంతరాత్మ మందలించిందనుకోండి,అది వేరే విషయం.నాతో పని చేసేవారందరితో కలివిడిగా ఉంటు,వారు ఇచ్చిన పని సరిగ్గ చేసారా,లేదా అన్న ఒక్క విషయం తప్ప ఇంకేమి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు.చాలా మందికి నేను నచ్చాను,ముఖ్యంగా అంతకు ముందున్న వాళ్ళ బాస్ చండశాసనుడు అని పేరు గడించడటం కూడా దానికి కారణం అవ్వచ్చు.

నాతో పని చేసే అరుణ ఒక నెల రోజులు లీవ్ మీద వెళుతూ,నాతో ఒక అరగంట ముచ్చటించింది.ఆ సంభాషణలో తను ఎందుకు సెలవు పెట్టాల్సొచ్చిందో అన్న విషయం షేర్ చేసుకుంటూ,తొందరలో వీలైతే ఉద్యోగం మానేస్తాను అని కూడా అంది.అరుణ తన పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి చేసే ఉద్యోగం ఆటంకమౌతుందని,అది తనకి బాధ కలిగిస్తుందని చెప్పింది.యధాలాపంగా అడిగాను,ఎంత వయస్సు పిల్లలకి అని.ఇద్దరు కవలలు-ఇద్దరికి పదమూడు సంవత్సరాలు అని చెప్పగానే అనాలోచితంగానే అనేసాను,"Are you out of your mind?You don't need to sit at home now,after working all these years.This is the time,teen hormones kick in and you will go thru hell mentally.ఈ టైంలో  పిల్లలే ఒక వ్యాపకంగా ఇంకే వ్యాపకం లేకుండా ఉండడం అన్నది అంత తెలివైన పని కాదు అన్నాను.నా లెక్చర్ పూర్తవకముందే "అలాంటి అనుభవం నాకు ఉండకపోవచ్చు.My kids love my company"అని సమాధానమిచ్చింది.కొద్దిగా ఆ విషయం మీద డిబేట్ చేదామన్న అలోచన కలిగింది కాని,అంతకంటే ఎక్కువ తనతో ఆ విషయం పొడిగించటానికి నాకు తనతో అంత చనువు లేని మూలాన,ఆ సంభాషణ అంతటితో ఆపేసాను.నేను అనవసరంగా తన వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకున్నానేమో అన్న రవ్వంత బాధ నాలో కలిగింది.నెమ్మదిగా నా అలోచనలు గతం లోకి పరుగులు తీసాయి.

డోన్నాకి నాకు మధ్య ఒకనాడు లంచ్ లో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.ఆ రోజు డోన్నా ఎందుకనో ఎప్పుడు ఉండే మూడ్ లో లేదు. ఏమిటి విషయం అని నేను యధాలాపంగా అడిగాను."విసిగిపోతున్నాను ఇద్దరి అమ్మాయిలతో.ఒకరు నా మేకప్ వాడేస్తారు నా అనుమతి లేకుండా.ఇంకొకరు నా బట్టలు వాడుతున్నారు అనుమతి లేకుండా.ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగుతారు.నాకు చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యారు ఇద్దరు.ఎప్పుడు ఇంట్లోంచి పోతారా అని ఎదురు చూస్తున్నాను.ఇంకో రెండు సంవత్సరాలు ఆగడం నా వల్ల కాదు.ఇప్పటికే విసిగిపోయి ఉన్నాను." అని అంది.ముద్దుగా, నా చుట్టూ తిరిగే అమ్మాయి రూపమే నాకు తెలుసు ఆ రోజుల్లో.అసలు డోన్నా తల్లేనా?నవమాసాలు మోసి కన్నది ఈమేనా? ఎలా మాట్లాడుతుంది ఇలా?ఇద్దరి కూతుళ్ళు ఎప్పుడు ఇల్లు వదిలి పోతారో అంటుందా?నా దిగ్బ్రాంతిని అణుచుకుంటూ అడిగాను అమాయకంగా"You don't love them? How can you talk like this?"అని.వెంటనే సమాధానం"Love does not mean clinging to them for life long.I have my own life.They should understand their limits.I just can't take them anymore." పిల్లలతో సంబంధం లేని పెర్సనల్ లైఫ్ ఏంటి ఈవిడకి? మతి ఏమన్నా పోయిందా అని ఆశ్చర్యపోతు నెమ్మదిగా అడిగాను."Once they leave your house for higher studies,don't you feel the void in your life"అని."Are you kidding?I have so many things lined up to do for the rest of my life." అంది. ఇక ఆవిడ నా దృష్టిలో మమతానురాగాలు లేని ఒక మనిషి గానే కాని తల్లిగా కనిపించలేదు.ఆ నిమిషంలో ఆవిడ వాడిన పదజాలం కాని,తనకంటూ ఒక లైఫ్ లేకుండా పోతుంది అని వాపోవడం చూసాక ఆవిడ మీద అప్పటివరకు ఉన్న ఆరాధ్యభావం పోయి,ఆవిడ మీద విముఖత కలిగింది.

అదే సంభాషణ మా మధ్య ఈనాడు జరిగితే,అలాంటి అనుభవాలు పూర్తిగా నాకు లేకపోయినా,నా అనుభవాలకి ఆవిడ అనుభవాలకి వ్యత్యాసం ఉన్నా, ఆవిడను నేను ఆ రోజుల్లో జడ్జ్ చేసినట్టు చేసేదాన్ని కాదేమో!అది మొదటిసారి,ఆఖరిసారి కాదు,నేను నా చుట్టూ ఉన్నవారిని జడ్జ్ చెయ్యడం.జేన్ విషయంలో కూడా అదే జరిగింది. జేన్ ఒక రోజు నాతో,ఇంకొందరితో అంది "నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రస్తుతం.నా భర్త, నేను,మా పనులు వీటితో తీరిక ఉండదు.నాకు నా పిల్లలిద్దరు చాలా దూరం గాఉన్నారు.Thank God!చీటికి మాటికి వాళ్ళు నా ఇంటికి రావడం నాకు నచ్చదు."అని.పిల్లల నీడ పడకూడదు అనుకుంటుంది ి అసలు ఈవిడ మనిషేనా అన్న ఏహ్య భావం అప్పట్లో నాకు కలిగింది.తనని కూడా జుడ్జ్ చేసాను.

మనం మన తల్లితండ్రులను చూసి నేర్చుకున్నది కావచ్చు,మన సంస్కృతి కావొచ్చుకాని చాలామంది భారతీయులు పిల్లలే జీవితం,వారే లోకంగా బ్రతికేవారే!అన్నీ వారికోసమే అని నిరంతరము వారి సుఖం,వారి సౌఖ్యానికి ఎక్కువగా పాటు పడేవారే. పాశ్చాత్య సంస్కృతిలో ఆడవారైనా కాని ,మగవారైనా కాని వారికంటూ ఉన్న అభిరుచులు, వారి హాబీలు,వారి ఇష్టాలు సాధారణంగా చంపుకోరు.బాధ్యతగా పిల్లలని పెంచి మంచి పొరులుగా తీర్చిదిద్దుతారు కూడా.కాని ఆ ప్రహసనంలో వారు తమని తాము అంకితం చేసేసుకోరు.అలాగే పిల్లల మీద మనకున్నంత ఇమోషనల్ డిపెండన్స్ కూడా ఉండదు వారికి.కొవ్వొత్తుల్లా కరిగిపోరు పిల్లల కోసం.చరమ దశలో వృద్దులైన వారిని చూడటానికి పిల్లలు రావటం లేదే అన్న బాధ కూడా తక్కువే వారికి.

ఆ మధ్య చూసిన"Amour"అనే సినిమాలో సన్నివేశం గుర్తొచ్చింది.ఇద్దరు వృద్దులైన భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా నివసిస్తూ ఉంటారు.భార్యకి పక్షవాతం వచ్చి కదలలేని పరిస్థితి.ఒక్కగానొక్క కూతురుకి ఈ విషయం తెలిసి వచ్చి చూసి బాధపడుతుంది,తరువాత వెళ్ళిపోతుంది.కొన్ని రోజులకి తిరిగి వచ్చి తండ్రి మీద మండిపడుతుంది.నేను లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేసాను,అమ్మ ఎలా ఉందో కనుకుందామని,నువ్వు ఒక్కసారి కూడా నాకు జవాబు ఇవ్వలేదు,నా కాల్ రిటర్న్ చెయ్యలేదు అని.I was so worried"అని బాధ పడుతుంది.అప్పుడు తండ్రి ఇలా జవాబు ఇస్తాడు."Your worries are of no use to me.Don't get me  wrong.I am not criticizing  you.I just don't have time to deal with your worries.That is all.మీ అమ్మ తను ఉన్న ఈ స్టేట్ లో ఎవ్వరిని చూడాలనుకోవడం లేదు,నేను కూడ.నీకంటూ ఒక పెర్సనల్ లైఫ్ ఉంది కదా,అలాగే మాకు ఉంది, దయచేసి మమ్మల్ని విసిగించకు."అని అంటాడు.

చేతన్ భగత్ తన బ్లాగ్ లో Woman's day రోజు రాసిన ఒక అర్టికల్"Five things women need to change about themselves"చదివాను.అతను రాసినవన్నిటితో నేను ఏకిభవించకపోయినా ఒక్క పాయింట్ మాత్రం ఎందుకో నన్ను బాగా అలోచింపచేసింది."The first behaviour that needs to end is the constant desire to judge other women---Women are hard on themselves.They are harder on each other. An overweight woman enters the room. Most women are thinking 'how fat is she?' A working mother misses a PTA meeting due to an office deadline, others think 'what a terrible mother she is'. A pretty woman's promotion makes other women wonder what she had been up to to get the job.From an ill-fitting dress to a badly cooked dish,you are ready to judge others.This, despite knowing, you yourselves are not perfect.As a woman, it is tough enough is to survive in a male dominated world. Why be so hard on each other? Can you let each other breathe?"

నేను నా లేడి బాస్ లను జడ్జ్ చెయ్యడం కూడా చేతన్ భగత్ చెప్పిన పాయింట్ కి సరిగ్గా సరిపోయే ఉదాహరణే కదా?ఇన్ని పోస్ట్స్ రాసి,ఇంత ఎనాలిసిస్ చేసిన నేను పూర్తిగా మారిపోతానంటారా?ఏమో? ఒకవేళ మళ్ళీ ఎవరన్నా నేను జడ్జ్ చెయ్యడం చూసి నన్ను నిలదీసారే అనుకోండి,నా దగ్గర సమాధానమొకటి రెడి గా ఉందండోయి....నా సమాధానం "ఫీమేల్ DNA ప్రాబ్లం. I can't help it. sorry" అని

41 comments:

  1. I suppose, you have written a higher level of psychology which I cannot understand. :)

    ReplyDelete
    Replies
    1. మీకు అర్ధం కాలేదు అంటే నా రాతల్లో ఏదో లోటు ఉన్నట్టే. ఒకరకంగా చూస్తే నేను మిథునం అప్పలదాసు గారి "Attached Detachment" కి దగ్గర గానే రాసానేమో? అలా మీకనిపించలేదా? మీకు అర్ధం కాని పోస్ట్ రాసిననదుకు కించిత్తు బాధ గానే ఉందండి. ధన్యవాదాలు మీ వాఖ్యకి శర్మ గారు.

      Delete
  2. శ్రీ గారు మీ పోస్ట్ ఆఖరి భాగం రెండు మూడు సార్లు చదివాను

    నా అభిప్రాయం : వ్యక్తిగతమైన వస్తువులని ఇతరులు ఎలా వాడకూడదో , అలాగే వ్యక్తిగత మైన అభిరుచులని ఇష్టాలని చంపుకోవడం ఇష్టం ఉండదు సంపూర్ణ జీవితాన్ని అనుభవించాలని అనుకునే వారికి తల్లి-దండ్రులు,భర్త -బిడ్డలు వారికి సంబంధించిన అన్ని విషయాలు మాత్రం నామమాత్రమే. ఇక్కడ అరగాదీసుకోవదాలు,కొవ్వొత్తిలా కరిగి పోవడాలు ఉండవు .

    సెచ్చ గా మసలే వారి అంతః ప్రపంచంని బాహ్యంగా ఎవరు ఇబ్బంది పెట్టినా భరించలేరు మీ లేడీ బాస్ లు అలాంటి వారే !

    మన భారతీయ జీవన విధానం కి వారి జీవన విధానం కి హస్తిమశకాంతర బేధం ఉంది . అవసరాలు -ప్రాముఖ్యత - సంబంధాలు వీటి చుట్టూనే మనిషి తన జీవితం నిర్మించుకుంటారు. ఈ మూడిటితో జీవితం లో దేనికి విలువనిస్తే అదే మిగులుతుంది.

    మన వ్యవస్థ లో పిల్లలకి విలువ ఇస్తాం వారి నుండి ఆశిస్తాం ఒకవేళ పిల్లల నుండి తిరిగి లభించక పొతే అలమటిస్తాం అది మన జీవన విధానం

    మీరు చెప్పిన దానిని బట్టి చూస్తే ఎవరి స్వేచ్చకి అయినా భంగం కలుగనంత కాలం, సహృదయత తో అర్ధం చేసుకున్నంత కాలం, ఆ బంధాలు నిలిచి ఉంటాయి లేనప్పుడు బయటకి తోసేస్తారు మీ లేడీ బాస్ లో విషయం లో అదే తోస్తుంది నాకు

    మీ కోణం లో మీరు జడ్జ్ చేసారు. తప్పులేదు నాకు నచ్చింది. అలా జడ్జ్ చేయగల్గినందుకే మీరు ఈ పోస్ట్ వ్రాసారు. మీలో పరిశీలన సంఘర్షణ రెండు ఉన్నాయి అన్నిసార్లు మన ఆలోచనా విధానమే సరిఅయినది కాదు . ఇతరుల సమస్యని ఇతరుల కోణం లో మనం ఆలోచించ గల్గినప్పుడు మన అభిప్రాయాలు మారిపోతాయి. :)

    ఈ సిరీస్ ని ఇలా ముగింపు ఇచ్చి ఆలోచనలు మిగిల్చారు . థాంక్ యు సో మచ్.

    ReplyDelete
    Replies
    1. వనజ గారు, మీరు కూడా నా పోస్ట్ రెండు సార్లు చదివి అప్పుడు అర్ధం చేసుకున్నారు అంటే, పోస్ట్ నేను సరిగా రాయలేదు లేదా అర్ధమంతమైన ముగింపు ఇవ్వలేదేమో!మీ కామెంట్ చదివాక మాత్రం మీరు నేను చెప్పలనుకున్నాది,నా మనసులో ఉన్నది పసిగెట్టి రాసారా అనిపించింది.ఇక్కడ మా లేడీ బాస్ లు లాంటి వారు ఎంత మంది ఉన్నారో, పరిపూర్ణ సేవా భావం కల స్త్రీలు కూడా ఎక్కువే ఉన్నారండి. "నిస్వార్ధ సేవ" పోస్ట్ ఇంతకు ముందు నేను రాసాను అలాంటి మాతృమూర్తి గురించి.మీరు అన్ని పోస్ట్ లు చదివి ఇంత చక్కటి వాఖ్యని వదిలి,నన్ను ప్రోత్సహించిస్తున్న మీకు ధన్యవాదాలు వనజ గారు.

      Delete
  3. nice..........story.try to place more gud stories.............

    ReplyDelete
  4. Hi Akkaa how are you.. nenu lenidi chusi postlu rastunnavaa... kaaani kaani aalage kaainivu..:(

    ReplyDelete
    Replies
    1. బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు బాలు? పోస్త్శ్ చదివి నీ అభిప్రాయం తెలుపు.ధన్యవాదాలు .

      Delete
  5. Loved this part. Really. A woman, changes (transforms) a lot through all phases of life. Nice point.

    ReplyDelete
    Replies
    1. Thank you very much for reading the posts/series and expressing your valuable opinion.

      Delete
  6. చప్పట్లు! ధన్యవాదాలు. నేను మాలికకి అప్పుడు వ్రాసి పంపాను ఒక కథ, 'వీరి వీరి గుమ్మడి పండూ అని ( http://magazine.maalika.org/2011/11/06/%e0%b0%b5%e0%b1%80%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b5%e0%b1%80%e0%b0%b0%e0%b1%80-%e0%b0%97%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%82%e0%b0%a1%e0%b1%82-%e0%b0%b5%e0%b1%80/ ). అందులో పాత్ర రవ్వంత 'negative shade' లో ఉంది. అంటే నేనూ 'జడ్జ్' చేసాను అన్నమాట :) అందులో నేను చెప్పదల్చుకున్నది ఇదే. మీరు చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. లలిత గారు, మీ కథ చదివాను. చాలా బాగుంది.ఇదే కాన్సెప్ట్ (జడ్జింగ్ others) మీద రాసారు.నేను కూడా అదే కాన్సెప్ట్ మీద తుదిలో ముగించాను.మీరు ఈ టపా/సిరీస్ చదివి, వాఖ్య వదిలారు. ధన్యవాదాలండి.

      Delete
  7. ఆఖరి భాగం చాలా బాగుంది, ఒక చిన్న జ్ఞాపకం కదిలించింది. ఒక ఫ్రెండ్ తనకి నలుగురు ఆడపిల్లలు అందరు టీన్స్ లో ఉన్నా ఆఖరి పాప ఇంకా వాళ్లకి పసిపాపే. కాని బయట ఎప్పుడు పిల్లల గురించి తానుగా చాట్ చెయ్యరు ఆమె, మనం అడిగితె చెప్తారు సింపుల్ గా అంటే. ఇదేంటి బయట రోజంతా ఉన్నా అస్సలు వర్రీ అవడం కాని, గుర్తు చేసికోవడం కాని లేదు అని చాలా ఆశ్చర్యం అనిపించేది. కాని వారంతా చాలా ప్రేమగా ఉంటారు ఒకరితో ఒకరు మామూలుగా.

    ReplyDelete
    Replies
    1. మౌలి గారు, మీకు ఆఖరి భాగం నచ్చినందుకు సంతోషం.
      మీ జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నందుకు, పోస్ట్స్/సిరీస్ చదివినందుకు ధన్యవాదాలండి.

      Delete
  8. ఎవరి జీవనవిధానాలు వారివి. మనం తల్లితండ్రులను ప్రేమిస్తాము.అలాగే వారు కూడా పిల్లలను ప్రేమిస్తారు. పెళ్లి జరిగాక పిల్లలకు కూడా ఒక కుటుంబం ఏర్పడుతుంది. భారతదేశం లో మగపిల్లలయితే తల్లితండ్రులతో కలిసి ఉంటారు ఆడపిల్లలకు అత్తారింట్లో వారికీ ఒక కుటుంబం ఏర్పడుతుంది . ఇక్కడ బంధాలు, అనుబంధాలు పెంపకం మీద ఆధారపడి ఉంటాయి. అమెరికా లాంటి దేశాలలో వారు పూర్తిగా ఒక జీవన విధానానికి అలవాటు పడ్డారు కాబట్టి, పిల్లల మీద ఆధారపడకుండా స్వేచ్చగా వారి హక్కులను వారు పొందుతున్నారు.

    భారతదేశం లో అది సాధ్యపడటం లేదు. పెద్దలు పిల్లల మీద ఆధారపడుతున్న కొన్ని సందర్భాలలో వాళ్ళు కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. భారతదేశం లో వృద్దులకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలు కూడా లేవు. ఆధారపడటం అనేది వృద్దాప్యం లో సహజం. కాని ఆధారపడకుండా అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించే ప్రతీ మనిషి ఆలోచనా విలువైనదే. నేడు పిల్లలకు విలువలు నేర్పడం అవసరం. విలువలు లేని దగ్గర ప్రేమ ఉండదు, బాధ్యతా ఉండదు. మీ టపా ఆలోచింపజేసేలా ఉంది.

    ReplyDelete
    Replies
    1. "నేడు పిల్లలకు విలువలు నేర్పడం అవసరం. విలువలు లేని దగ్గర ప్రేమ ఉండదు, బాధ్యతా ఉండదు" చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు మీ వాఖ్యకి నవజీవన్ గారు.

      Delete
  9. Enjoyed reading this very thought provoking post. Thank you. Male DNA is no different but only difference is that you can express it outside, we keep these feelings hidden and act as if it does not bother us. ;) we all should follow bhagavadgeeta philosophy of 'do your duty as a good parent but don't expect anything in return' if at all you get it in return, you are lucky. I have already started writing my 'bucket list' on what to do after my retirement. ;)

    ReplyDelete
    Replies
    1. Thank you చాతకం gaaru for taking time and reading the post. Did you read the entire series?
      ha ha ha...Thanks for the secret you revealed.(Male DNA is no different).That is a news to me. Good for you that you are planning ahead and getting ready with your "bucket list" on list of things to do. Good luck on that. One day I will have to do that, I guess.

      Delete
  10. నేనూహించిన సమస్యే! మారిన జీవన రీతి ఆహ్వానించక తప్పదు. అది ఎవరైనా ఒకటే. మన తరం లోనే ఇంత మార్పు కనిపిస్తున్నప్పుడు పిల్లల భవిష్యత్తులో వాళ్ళ ఆలోచనలు ఇంకా మారి పోతాయి. మన పెద్దల విధానం తో మనకు తేడాలెలా ఉన్నాయో ఇదీ అంతే:) నా దాకా వస్తే కానీ తెలీదు అంటే ఎలా!'గ్లోబలైజేషన్' లో ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం కదా. మానసిక బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా అవసరమైనప్పుడు తల్లిదండ్రుల దగ్గిర ఎంత మంది ఉండగలుగుతున్నారు.ఏం చేస్తాం తప్పదు.ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎవరి జీవితం వారిదే...ఎవరి ఇష్టాలు వారివే....ముఖ్యంగా మొగవారిలో కన్నా ఆడవారిలోనే ఎక్కువ మార్పు చూస్తున్నాం:)

    ReplyDelete
    Replies
    1. మీరు రాసినవన్నీ అక్షర సత్యాలు జయ గారు."మానసిక బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేదు." నిజమే, కాని అవే మానసిక బంధాలు బలహీనం చెయ్యకూడదు మనల్ని.ముగింపు మీరు ఊహించినందుకు కొద్దిగా "అయ్యో" అనిపించినా, నా మనసు చదివగలిగారు అని ఆనందం కూడా వేసింది.ఓపిక గా నా ఈ సిరీస్ మొత్తం చదివిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి.

      Delete
  11. బాగుందండి.
    ఎన్నో చక్కటి విషయాలను ప్రస్తావించారు.


    ReplyDelete
    Replies
    1. అనురాధ గారు, ధన్యవాదాలండి.

      Delete
  12. చాలా బాగుంది వెన్నెల గారూ...ప్రతి విషయం ఆలోచింప జేసేదిలా ఉంది...ప్రతి ఎపిసోడ్ బాగుంది...మీ విశ్లేషణ చక్కగా ఉంది...విద్యతో బాటు విలువలు నేర్పడం చాలా అవసరం...వాటితోనే వాళ్ళు మంచి నాగరీకులుగా గుర్తింపు పొందేది...అభినందనలు...@శ్రీ...

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, మీ వాఖ్య ఎంతో సంతోషానిచ్చింది.సమయం తీసుకుని చదివి అభినందించిన మీకు ధన్యవాదాలు.

      Delete
  13. ఆలోచనాత్మకంగా ఉంది. చక్కగా సరళంగా మీ భావాలను వెల్లడి చేశారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారు, మీరు వాఖ్య రాస్తే అది దీవనే! ధన్యవాదాలండి.

      Delete
  14. పోస్ట్ పెట్టిన వెంటనే చూసా కానీ డైజెస్ట్ చేసుకో లేకపోయా...పిల్లల గురించి అలా ఆలోచిస్తారా??అని..అక్కడి తో ఆగిపోయా...కామెంట్ కూడా పెట్ట బుద్ది కాలేదు.....ఈ రోజు క్రింద లింక్ చూసాక అందరూ అలా ఉండరులే అనిపించింది..ముక్యంగా కొన్ని కామెంట్స్ చూసాక..(Janet Mcdonald)
    https://www.facebook.com/photo.php?fbid=497943720265568&set=a.279616505431625.65613.279389268787682&type=1&theater

    ReplyDelete
    Replies
    1. ఒప్పుకుంటాను. అందరు అలా ఉండకపోవచ్చు.సేవా మూర్తులైన మాతృమూర్తులెందరో కూడా ఇక్కడ ఉన్నారు, నేను చూసాను. :)

      Delete
  15. Hi,
    I have been a silent follower of ur series...very interesting analysis...
    Jane and Donna might hav sounded harsh but somehow I felt they are right...neither should we over pamper nor expect a return from our kids...it's always better to draw a fine line and live..I know it's easy to say but practically difficult but being a mother of a toddler I sometimes keep reminding myself that kids are not all life...Mentally preparing myself to the inevitable in the coming years!!!!

    ReplyDelete
    Replies
    1. Niru, Thank you so much for reading the series and expressing your opinion. It took me a long time to even digest the conversation I had years ago with my supervisors. Since you said you are a mother of a toddler,looks like at this young age, you understood the essence of the post. :) Welcome to my blog.

      Delete
  16. మంచి అంశాన్ని చర్చకు పెట్టినందుకు ముందుగా మీకు అభినందనలు . పాశ్చాత్య జీవన విథానం మన జీవన విథానం కంటే నిర్ద్వంద్వంగా మెరుగైనది . మనం ఒప్పుకోము గాని , మనం మనగొప్ప డప్పాలు కొట్టు కుంటూ , నిరంతరం సహజత్వానికి దూరంగా బ్రమలలో బతుకీడుస్తుంటాం . పిల్లల కోసమే బతుకు తున్నామనే ఆదర్శాన్ని వల్లిస్తూనే , కొడుకూ - కోడలూ ఆనందంగా ఉంటే చూచి ఓర్చుకో గలిగిన తల్లిదండ్రు లెందరున్నారిక్కడ ? తల్లిదండ్రుల పెన్షన్ డబ్బులు మాకివ్వడం లేదే ? ఈ వయస్సులో కూడా వీళ్ళకు డబ్బూ దస్కం స్వేఛ్ఛా అవసరమా ? అనుకోని కొడుకూ కూతుర్లున్నారా ?
    అన్న దమ్ములకు పడదు . అక్క చెల్లెల్లకు పడదు . సోదరీ సోదరులకు పడదు . బహు చక్కని అనుబంధాలు మనవి . నిరంతరం ఈర్ష్యాసూయల కాలుష్యాల బాంధవ్యాలలో బ్రతికే మనం , సహజత్వానికి దగ్గరగా - తమ బాథ్యతలు నిర్వర్తించి , తమబతుకులు తాము బతికే అచటి పెద్దల జీవన విథానాలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు .
    ఇక స్త్రీల విషయంలో పాశ్చాత్య సమాజంలో ఉన్న విలువ , మన సమాజంలో కాగడా పెట్టి వెతికినా కనిపించదు . పైపెచ్చు మహిళలని గౌరవించడం గూర్చి గొప్పలు చెప్తాం . ఇక్కడ కుహనా కుటుంబ వ్యవస్థ ముసుగులో వ్యక్తిగత స్వేఛ్ఛ హరించుకు పోతోంది .

    ReplyDelete
    Replies
    1. మాష్టారు, ముందుగా చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.నిజమేనండి,అలోచిస్తే పాశ్చాత్య జీవన విధానంలో నాకు కూడా పెద్దగా లోపాలు కనిపించవు.ఆ సంస్కృతిలో నేను పెరగలేదు కాబట్టి,అలోచన అంతగా ఎదగని రోజుల్లో ఒక విధమైన వ్యతిరేకత భావాన్ని పెంచుకున్నాను.ఆర్ధిక ఇబ్బందులు లేని కుట్టుంబాలలో ప్రేమలు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. అది కూడా తమ కంటే తమ బంధువులు "కొద్దిగా" సంపద తక్కువ కలిగి ఉన్నవారు అయితే ఇంకా మంచిది. మహిళలకు ఇచ్చే విలువ విషయంలో మీరు చెప్పింది నిజమే నండి. భారతదేశం కంటే పాశ్చాత్య సమాజంలో విలువ ఎక్కువే! (పూర్తిగా మగవారితో సమానం మాత్రం కాదండి)

      Delete
  17. @వెంకట రాజారావు . లక్కాకుల గారు

    ఈ భాగం పై వ్యాఖ్యానించిన తర్వాత నుండీ , ఏదయితే నా ఆలోచనలో మెదులుతూ ఉందొ అదే ఇంకా బాగా మీరు చెప్పారు.

    ReplyDelete
  18. Vennela gaaru,
    I was thinking of posting a comment on this series since 3 days and finally I got some time ( my own time).
    First of all very good post. I like some of your posts alot.
    Coming to writing style may be there should have been some more clarity in the last episode to tie it to the earlier episodes ( or may its my brain not grasping). I could get two different things here.

    1. Judging others
    2. Transition of mothers mindset towards kids as kids grow

    I feel both of them are interrelated when we know that we our selves change our mindset as we evolve, then there is no point in judging ourselves.So forget about judging others. I strongly feel, follow and try to say others that first think from opposite persons POV and also consider the opininons,words or actions of a person only for the given time and context and dont assume that they are carved in stone. ( I understand the differnce beween changing words as needed ( like a chameleon) and change in the mindset and I think most of us already understand this)

    Surabhi

    ReplyDelete
    Replies
    1. Surabhi gaaru,

      First of all let me thank you for passing on such wonderful feedback about the series. Wonderful in the sense, conveying to me how exactly you felt when you read all the parts.
      Yes, I read last part many times before I published it, and really felt that there was a disconnect from previous parts. In a hurry to finish the series, I really did not do a good job in concluding (connecting 1,2,3 parts to the last one). I judged very wrongly two very important woman in my life who played such a major role in shaping up my career path. I feel bad about it even today. But I guess that is life. Cannot go back in time. :))
      Once again thank you for taking time and commenting on the posts.

      Delete
  19. మంచి సీరీస్ రాశారు. చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. కిషోర్ వర్మ గారు, ధన్యవాదాలండి.

      Delete
  20. మంచి విషయాలను పంచుకున్నారండీ... బాగుంది సిరీస్..

    ReplyDelete
    Replies
    1. సిరీస్ చదివి , సమయం తీసుకుని మీరు వాఖ్య రాసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి

      Delete
  21. Madam, I am Chandra from australia...Mee posts anni chadivanu..Naku kuda 15months daughter undi...she is back in india now...yenduko mee posts chadivuthuntey maa ammayini chala chal miss avuthunna.mother-daughter love chala baga share chesaru...chaduvuthunnantha sepu kallallo neellu thirigayi...thank you so much...intha busy life lo kuda meeru yela rastunnaro ...great andi..

    ReplyDelete