Tuesday, March 26, 2013

ప్రేమలేఖ


చిత్రం: బాపు బొమ్మ
పుస్తకాలెన్ని నే చదివినా..
ఉప్పొంగిన భావాలెన్నింటికో నే అక్షరరూపం ఇచ్చినా..
అర్ధంకానిది ఒక్కటే!
నా మనస్సునే లేఖ గా రాసి నాకందించావు..
నన్ను నాకే కొత్తగా చూపించావు..
ఇదేనా ప్రేమంటే?

23 comments:

  1. వావ్ .. ప్రేమ మహత్యం కవిత్వం పొంగుకొస్తుంది మరి

    ReplyDelete
    Replies
    1. లేబల్ చేసిన కేటగిరి చూడండి ఒక్కసారి. :)

      Delete
  2. హోళీ సందడి అంతా జలతారు వెన్నెల లోనే కనిపిస్తుంది. వెన్నెల కూడా రంగులలో కురుస్తుంది అన్నమాట. భావుకత్వం చాలా చాలా బావుంది

    ReplyDelete
    Replies
    1. హోలీ శుభాకాంక్షలు ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియలేదు అనమాట వనజ గారు!

      Delete
  3. మనమనసు మరొకరు అందునా కట్టుకున్నవారు ఆవిష్కరిస్తే అదే ప్రేమ కదా! అదే జీవితమకరందం.

    ReplyDelete
  4. అవును ప్రేమంటే ఇదే :-)

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ పద్మ గారు, అంతేనంటారు.
      ధన్యవాదాలు మీ వాఖ్యకి.

      Delete
  5. అవును..నాదీ అదే మాట... ప్రేమ మహత్యం కవిత్వం పొంగుకొస్తుంది...

    ReplyDelete
    Replies
    1. అయ్యో , మీరు కూడానా? "బొమ్మలు పలికే భావాలు" మాత్రమేనండి. :))

      Delete
  6. @లేబల్ చేసిన కేటగిరి చూడండి ఒక్కసారి. :)

    చక్కగా కుదిరింది కదండీ!!లేక పోతే నాలా కత్తి...రెండు చుక్కల రక్తం...తో ఈ ఇలాంటి కవిత పెట్ట లేదు కదా :)

    ReplyDelete
  7. చక్కటి భావుకత్వం. బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. అంతా బాపు బొమ్మ మహత్యమేనండి.ఆ చిత్రాన్ని చూడగానే అలా రాయాలనిపించింది. భారతి గారు ,ధన్యవాదాలు.

      Delete
  8. మనసును పూర్తిగా అర్థం చేసుకోవటమేగా ప్రేమంటే !చాలా బాగుంది ప్రేమంటే చిన్న చిన్న మాటల్లో! .

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు, మీరు మళ్ళీ తళ్ళుక్కుమన్నారు కదా! అదే చాలు మాకు.
      ధన్యవాదాలండి.

      Delete
  9. ప్రేమ ఇంత గొప్పగా కూడా చెప్పొచ్చా! చాలా బాగుంది.

    ReplyDelete
  10. నా మనస్సునే లేఖ గా రాసి నాకందించావు..
    నన్ను నాకే కొత్తగా చూపించావు..

    మీ భాష్యం చాలా కొత్తగా అందముగా ఉన్నదండి !!
    fantastic..

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు విధ్యాసాగర్ గారు.

      Delete
  11. vennala gaaru ela unnaru ? - emo mari premaku enni arthaalu cheppina saripodhu kadha mallee inko artham tho ravaalani naa manavi anagaa dheenni minchina anuraagamtho dheenni minchina akshara bandhaalatho manasulu kaliselaa choopulu viriselaa raathi gundelonu prema chigurinchelaa undaalani manavi.......

    ReplyDelete