Pic source : Google images
ఇంటికి చేరుకునేసరికి వాన తగ్గు ముఖం పట్టింది.ఇంట్లోకి వస్తూనే వేడి గా టీ పెట్టుకుని అలా సన్నటి వాన తుపర పడుతుంటే,కిటికిలో నుండి ి చూస్తూండిపోయాను.Gym ఎలాగు ఎగ్గొట్టాను కదా అని, అమ్మాయిని పిలిచి "వాక్ కి వెళదామా" అని అడిగాను."అమ్మో, నువ్వు వాక్ అని నన్ను కనీసం మూడో నాలుగో మైల్స్ నడిపించేస్తావు..నేను రాను పో"అని సమాధానం వచ్చింది."అలా కాదు రా...నా మాట వినవు?ఈ రోజు నాకు తోడు ఎవ్వరు లేరు..ప్లీస్ రావా"అని బతిమాలడం మొదలుపెట్టాను.విసుగ్గా నా వైపు ఒక చూపు చూసి"నా వల్ల కాదమ్మా..ప్లీస్"అంది.అలోచించాను,టాలివుడ్ సినిమాలు చూడకపోయినా, తనకి ఉన్న బాలివుడ్ సినిమా మోజు నాకు ఆ క్షణం లో గుర్తుకు రావడంతో, నన్ను నేనే మెచ్చుకుని,ఇదిగో ఆ "జవాని..." అని ఏదో సినిమా ఈ శుక్రువారం వెళ్ళాలని అన్నావు కదా..నువ్వు ఇప్పుడు వాక్ కి రాకపోతే నేను సినిమాకి రాను...అంతే ఫైనల్...డిసైడ్ చేసుకో"అని వార్నింగ్ ఇచ్చేసాను.నా పాచిక తప్పక పారుతుందని వాకింగ్ షూస్ వేసుకోసాగాను."నువ్వేమి రానక్కర్లా..నా ఫ్రెండ్ జేనీ వస్తానని చెప్పింది..నువ్వు వెళ్ళు, నేను రాను" అని తెగేసి చెప్పింది. "ఔరా...ఆ జేనీకి ఏమర్ధమవుతుంది?డబ్బు దండగ"అని విసుక్కున్నాను.ముసి ముసి నవ్వులు నవ్వుతూ,"సబ్ టైటిల్స్ ఉంటాయిగా...అయినా పిచ్చి అమ్మా...ప్రేమ చిత్రానికి భాషతో సంబంధం ఉండదుగా...అలా అర్ధమయ్యి పోతుందంతే!"అని సమాధానం వచ్చింది.
ఇప్పుడెలా? ఒంటరిగా వెళ్ళచ్చు...కాని ఎవరిదన్నా బుర్ర తింటూ నడవటం లో ఆ హాయి వేరే కదా?స్నేహితురాలిని పిలవనా అనుకుంటు,ఇంతలో నా పెద్దరికం నన్ను ప్రశ్నించింది,"తల్లి మాటకు ఎదురు చెపుతుందా?రమ్మంటే కిక్కురుమనకుండా రావాలా వద్దా?మా చిన్నపుడు పెద్దవారు చెప్పిన మాటకి ఎదురు చెప్పామా?(అంటే డూ డూ బసవన్నలా తలాడిస్తూనే,ఎదురు చెప్పకుండా..వారు చెప్పినట్టు కాక, నా మనస్సు కి నచ్చినట్టే చాలా సార్లు నడుచుకున్నాననుకోండి.అయినా అవన్ని బయటికి చెప్పము కదా...). ఆఖరి అస్త్రం ప్రయోగించాను."అయినా ఈ మధ్య నువ్వు నా మాట వినటం లేదు,నా దగ్గర ఉండేదే మొక్కుబడిగా మూడు లేదా రెండు వారాలు..ఆ కొద్ది రోజులు కూడా నాతో సమయం గడపవా..పోన్లే నీ ఇష్టం" అంటూ,వీధి గుమ్మం తలుపు తీసాను.నాకు తెలుసు విసవిసలాడుతూ నా వెనకాలే వస్తుందని.అనుకున్నట్టుగానే"వస్తున్నానుండు"అని ఒక అరుపు అరిచింది నా చెవులు చిల్లులు పడేలా.విజయగర్వంతో నవ్వుకున్నాను.ఈ తరం పిల్లలు మాట విననట్టే వుంటారు, కాని ప్రేమకి లొంగకుండా ఎక్కడికి పోతారు?
ఇద్దరము జంటగా వీధిలో కి అడుగు పెట్టాము.ఇంతలో వాన చినుకులు మా మీద పడ్డాయి. వెంటనే అమ్మాయి "వాన పడుతుంది, వెనక్కి వెళదాము పద"అంది.ఆకాశం వైపు చూస్తూ నేను"లేదు,ఈ వాన ఎంతో సేపు ఉండదు, పైగా ఇంతకంటే జోరుగా కూడా కురవదు.నువ్వేమి మొక్క మొలిసిపోవు ,పద నడుద్దాము" అన్నాను. "నీకేమన్నా పిచ్చా?ఎవరన్నా వానలో వాకింగ్ చేస్తారా"అంటూ ప్రశ్నించింది.ఎవరు చేసినా,చెయ్యకపోయినా మనం చేద్దాము,వాన చినుకులు ఇలా మనల్ని చక్కగా ముద్దాడుతుంటే హాయిగా లేదు?"అన్నాను ఆ వాతావరణానికి మైమరిచిపోతు.వెంటనే సమాధానమోచ్చింది,"జలుబు చేస్తుంది, I don't want to catch cold" అని."ఈ మాత్రానికి జలుబు చెయ్యదు, ఛలో" అని తన చెయ్యి పట్టుకుని వాకింగ్ కి వెళ్ళిన ఇద్దరము గంటన్నర తరువాత ఇల్లు చేరుకునేసరికి మా బట్టలు వర్షం వలన పూర్తిగా తడిచిపోయాయి.ఇంట్లో శ్రీవారిని చూసి కబుర్లలో పడిపోయింది అమ్మాయి.నాకు మాత్రం ఆ వర్షం లో తడుస్తూ,అమ్మాయితో చిన్ననాటి కబుర్లు చెబుతూ,జీవితాన్నిఇప్పుడిప్పుడే చూస్తున్నా దాని మాటలు వింటూ,అపుడప్పుడు కొన్ని ఉచిత సలహాలేవో పాడేస్తూ,ఇరువరం కలిసి నడిచిన ఆ వాక్ మాత్రం గుర్తుండిపోతుంది.

చాలా చాలా బావుంది. వర్షం లో చిన్న నాటి జ్నాపకాలతో.. అమ్మాయితో ఈవ్నింగ్ వాక్ . అసలు వర్షంలో తదుస్తూ నదక. వావ్. స్వగతం లో చాలా నిజాలు చెప్పేసారు. మళ్ళీ ఇక్కడా నిజాలే వింటున్నా ..:) :)
ReplyDeleteఇలా అనుకున్నానో లేదో.. ఇలా పొస్ట్ తో వచ్చేసారు థాంక్యూ !
వనజ గారు, స్వగతం లో నిజాలు చేప్పేస్తున్నానంటారా? :)
Deleteటపా నేనెంతో ఇష్టపడి రాసాను. మీకు నచ్చినందుకు సంతోషం.
ధన్యవాదాలు మీ వాఖ్యకి.
వావ్ వర్షం లో అమ్మాయి తో కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ . చదువుతుంటేనే ఎంతబాగుందో!మిస్సింగ్ :)
ReplyDeleteమాలా గారు, ధన్యవాదాలండి మీ వాఖ్యకి. నిజమేనండి వర్షం లో తడుస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే చాలా బాగుంటుంది.
Deleteచక్కని టపా వెన్నెల గారు వర్షం లో తడవటం చిన్నప్పటి ఆ రోజులు ఇప్పటి అమ్మాయితో అక్కడి కబుర్లు అన్ని వెరసి మీ టపా అద్భుతంగా వుంది
ReplyDeleteమంజు గారు బాగున్నారా? మీకు టపా నచ్చినందుకు హాపిస్! :) ధన్యవాదాలు
Deleteచాలా రోజులకి వచ్చి చక్కని వాన కురిపించారు. చెప్పండి మీరు మా ఇంటి పక్కనే ఉంటారు కదూ? వాతావరణం గురించి మీరు చెప్పింది చూస్తే అలానే అనిపిస్తోంది :)
ReplyDeleteలలిత గారు,కుశలమా? అవునండి మీరు సరిగ్గా గమనించలేదు. నేను మీకు దగ్గరలోనే కదా ఉంటాను? :) ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తున్నాయి మాకు.
Deleteధన్యవాదాలండి మీ వాఖ్యకి
చాలా బాగుందండీ! అమ్మాయి లేని నాలాంటి వాళ్ళ కు ఈర్ష్య కలిగిస్తుంది . మీ అమ్మాయి ప్రక్కన మీ స్థానంలో నన్ను ఊహించుకుని నేనూ వర్షాన్ని ఎంజాయ్ చేసేసాను లెండి .
ReplyDeleteనాగరాణి గారు , ఊహించేసుకోండి. ఊహాలోకం అద్భుతం గా ఉంటుంది కదండి.టపా చదివి , వాఖ్య వదిలిన మీకు ధన్యవాదాలు.
DeleteSooooo....nice. Very pleasant post. I enjoyed it.
ReplyDeleteఅను గారు , చిత్రం గా ఉందే! మీరు కూడా ఈ మధ్య రాసిన టపా లో వర్షం గురించి రాసారు కదా? ఈ రోజే చదివానండి. బాగుంది మీ టపా. ఈ టపా మీకు నచ్చి, మీరు మెచ్చినందుకు ధన్యవాదాలండి.
Deleteకలసి నడచిన కబుర్లు కమనీయంగా ఉన్నాయి.
ReplyDeleteఅవునండి, ఎన్నో సార్లు నడచి ఉంటాను తనతో .. కాని ఆ రోజు మాత్రం గుర్తుండిపోతుంది. ధన్యవాదాలు ఉమా దేవి గారు.
Deleteస్పందన ఉన్న ప్రతివారూ వానలో తడవడానికి ఇష్టపడతారు. అందులోనూ అమ్మాయితో కలిసి చిన్నప్పటి ఙ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ.. బలే ఉంటుంది. చాలా బాగా రాసారండీ...
ReplyDeleteలలిత గారు ,బాగా చెప్పారండి. స్పందించే మనసు లేకపోతే జీవితం మీద ఆసక్తి పోతుందేమో... ధన్యవాదాలు మీ వాఖ్యకి.
Deleteబాగుందండి. " ఒక సాయంత్రం " ను కొద్దిగా కష్టపడి జీవితంలో ఒక మంచి memorable event గా చేసుకున్నారు
ReplyDeleteఅలాగే picture మరియు అందులోని lines excellent. థాంక్సండి.
రావు గారు, మీకు నా బ్లాగ్ కి స్వాగతం. మీకు టపా, చిత్రం రెండు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు మీ వాఖ్యకి.
Deleteతుఫాను వర్షాలయితే చెప్పలేనంత కుండ పోత... అలాంటి వర్షంలో... వైజాగ్ లొ బీచ్ కు పొయే వాళ్ళం...గంటా రెండు గంటల పాటు అలాంటి వర్షంలో తడిస్తే భలే ఉంటుంది.....మెడికల్ హాస్టల్ లో ఉన్నపుడూ అంతే సెకండ్ షో చూసి వస్తూ ....వర్షానికి దొరికిపోతే హాయిగా ఎంజాయ్ చెసే వాళ్లం..ఇది రాస్తూంటెనే ఆ థ్రిల్ గుర్తొచ్చి ఎంతో హేపీ అనిపించింది...ఇప్పటికీ ఎదో వంకతో వర్షంలోకి వెళ్ళి తడిచి వస్తా....ఇంట్లో వాళ్ళు తిడుతున్నా.. :-)))
ReplyDeleteప్రసాద్ గారు, వర్షం అంటే ఇష్టం లేని వారు చాలా అరుదుగా ఉంటారేమో! మీ గత కాలపు అనుభవాలు ఈ టపా గుర్తుచేసినందుకు సంతోషం గా ఉంది. మీ వాఖ్యకి ధన్యవాదాలండి.
Deleteచాలా బాగుందండీ!
ReplyDeleteప్రేరణ గారు ధన్యవాదాలండి.
Deleteఅటువంటి నడక చాలా బాగుంటుంది.బాగా వర్ణించారు.
ReplyDeleteధన్యవాదాలు రవిశేఖర్ గారు. బాగున్నారా?
Deleteచాలా చాలా బాగా గుర్తు చేసినందులకు ధన్యవాదాలు. మీ బ్లాగు చాలా బాగుంది.
ReplyDeleteశైలజ గారు , నా బ్లాగ్ కి స్వాగతం.మీ వాఖ్యకి ధన్యవాదాలు
Delete