ఆ రోజు సాయంత్రం అంజలి తన తండ్రితో "నాన్నగారు మిమ్మల్ని "నాన్న" అని అనొచ్చా? అమ్మ కోప్పడుతుంది అలా పిలుస్తానంటే" అని అడిగింది. సురేష్ ప్రేమగా అంజలిని దగ్గరకి తీసుకుని బుజ్జగిస్తూ "నీకెలాగ పిలవాలనుంటే అలా పిలువు అంజు, నువ్వెలా పిలిచినా నాకిష్టమే" అని చెప్పాడు. పట్టరాని ఆనందంతో అంజలి "అమ్మా, నేను "నాన్నా"అనే పిలుస్తా"అని గట్టిగా సుమిత్రకి వినిపించేటట్టు అరిచి పక్క గదిలోకి పారిపోయింది అంజలి. ధుమధుమలాడుతూ వచ్చింది సుమిత్ర "అదేంటి సురేష్? నేను చెప్పాను కదా అలా పిలవకూడదు అని? నువ్వు అమ్మ చెప్పినట్టు వినాలి అని చెప్పకుండా దానిని వెనకేసుకొస్తావెందుకు?" అని అడిగింది."పిలుపులో ఏముందోయి? మనసులో గౌరవం ఉండాలి కాని" అని తేల్చేసాడు సురేష్. "మీ జిల్లాలో ఉన్న అలవాటేగా ఎవ్వరినీ మర్యాదగా పిలవకపోవడం? నా కూతురు అలాంటి భాషకి అలవాటు పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలలో ఇది ఒకటి" అని విసురుగా చెప్పింది సుమిత్ర. ఇంక ఆ సంభాషణ సాగదీస్తే ప్రమాదం అని తెలుసుకున్న సురేష్ అక్కడితో ఆపేసాడు.
అంజలి తన తండ్రిని రోజు "నాన్నా" అని పిలుస్తూనే సుమిత్రని చూడగానే నవ్వుతూ "నాన్నగారు" అని పిలుపు మార్చేది.కొన్ని రోజులకి పూరి జగన్నాథ్ అను ఒక గొప్ప డైరక్టర్ గారు వారి సినిమాలో అమ్మని "ఒసే" అని ఇంకా పేరు పెట్టి కూడా పిలవచ్చు అని సదరు హీరో గారి ద్వారా మన అంధ్రరాష్ట్రం ప్రజలకు తెలియచెప్పారు. అంజలి సుమిత్ర దగ్గరికి వచ్చి "నేను నిన్ను రేపటినుంచి సుమిత్రా అని పిలుస్తాను. సినిమాలో హీరో అమ్మని అలా పిలుస్తున్నాడేంటి అని నాన్నని అడిగితే "That means they are very close అన్నమాట" అని చెప్పారు. అందుకని నేను కూడా నిన్ను సుమిత్రా అని పిలుస్తాను" అని చిలిపిగా చెప్పింది అంజలి. తెలివిగా తను కూడా చురక వేసింది సుమిత్ర "అందుకే కదా ఆ హీరో ని "ఇడియట్" అన్నారు. నిన్ను కూడా నేను అలా పిలవనా?" అంటే "ఊహు వద్దులే..అంజు అనే పిలువు" అని నవ్వేసి వెళ్ళిపోయింది అంజు.
మళ్ళీ యుద్దానికి సిద్ధమయ్యింది సుమిత్ర సురేష్ తో "అంజలి తెలిసో తెలియకో నిన్ను ప్రశ్న అడిగితే నువ్వు చెప్పిన సమాధానం కరక్ట్ కాదు.ఆ సినిమాలో హీరో తల్లిని అలా సంభోదించడం తప్పు అని ఎందుకు విడమర్చి చెప్పలేదు? అని నిలదీసింది సుమిత్ర. "నాకేమి తప్పు అనిపించలేదు.తల్లితండ్రి అంటే చాలా ప్రేమగానే ఉన్నాడే హీరో.పిలుపులో ఏముంది చెప్పు" అని వాదించాడు. "ప్రేమ ఉందా లేదా అన్నది కాదు ఇక్కడ సమస్య. మనం మర్యాదగా మాట్లడం పిల్లలకి నేర్పించాలి" అన్నది సుమిత్ర.
కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి.అంజలి అవన్నీ చూస్తూనే ఉంది. తనకు వచ్చిన సందేహాలు అన్ని అడుగుతూనే వుంది.ఇంట్లో తల్లి చెప్పే ఎన్నో విషయాలకు, సినిమాలో చూపించే వాటికి పొంతన లేక తల్లినో, తండ్రినో ప్రశ్నిస్తూనే ఉంది.సాధ్యమైనంతవరకు,మంచి చెడు భోదిస్తూ వచ్చింది సుమిత్ర.
కొద్ది రోజుల తర్వాత "సరిగ్గా చదువుకోవటం లేదు ,ఇంకా కష్ట్టపడి చదవాలి" అని అంజలి తండ్రి మందలిస్తే "నువ్వు చదువుకున్నావు కదా నాన్నా, మరి నువ్వేమన్నా ప్రెసిడెంట్ అయ్యావా? పర్లేదులే నేను చదువుతుంది చాలు" అని సమాధానం చెప్పింది అంజలి. "అమ్మో సినిమా ప్రభావం" అని అవాక్కైపోయాడు సురేష్.(ఏదో సినిమాలో నితిన్ అనే హీరో తండ్రి పాత్రదారుడితో అన్న మాటలట అవి.)
ఆ రోజునుండి ఒక్క మాట మీద నిలబడి తెలుగు సినిమాలు చూడడం మానేసారు సుమిత్ర, సురేష్.అంజలి ఎదురుప్రశ్నలు, సమాధానాలు ఆ రోజునుంచి తక్కువయ్యాయి.
సరదాకి, వినోదానికి చూసే సినిమాలు తెలియకుండానే వాటి ప్రభావం చూపుతాయి పిల్లల మీద. కొద్దిగా మంచి చెడు తెలుసుకునే విచక్షణా జ్ఞానం అలవర్చుకున్నాక వాళ్ళ మీద సినిమా ప్రభావం ఎక్కువగా ఉండదు.హీరోలని ఒక ఆదర్శంగా తీసుకుంటున్న ఈ రోజుల్లో యువతరం మీద ఇలాంటి సినిమాల ప్రభావం పడకుండా ఉంటే చాలు. సమాజం మీద చెడు ప్రభావం చూపే సినిమాలు ప్రేక్షకులు వినోదం కోసం చూస్తున్నంతసేపు ఈ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే audience reject చెయ్యడం మొదలు పెడతారో, అప్పుడే మార్పు వచ్చే chances ఉన్నాయి అన్నది నా అభిప్రాయం.
(అమయగారి "పూరీ జగన్నాథ్ ''బూతుల బిజినెస్ మేన్''
వనజవనమాలి గారి "ఐటం సాంగ్స్ - అశ్లీల సాహిత్యం"
పై రెండు పోస్ట్ లు చదివాక ఈ పోస్ట్ రాయలనిపించింది. రవితేజ గారి అభిమానులు, నితిన్ గారి అభిమానులు, పూరి గారి అభిమానులు నన్ను క్షమించ ప్రార్ధన. )
ఇది సర్వ సహజమైపోయింది. పాత కట్టుబాట్లని ఎదిరించడమే గొప్ప అనుకుంటున్న కాలం. ఎంత కాలం ఆపగలరు పిల్లలని, వీటి ప్రభావం నుంచి?
ReplyDeleteమీరు చెప్పింది నిజమేనండి! కాని చిన్నదో ,పెద్దదో ఒక ప్రయత్నం అంటూ చేస్తెనే కదండీ మార్పు వస్తుంది అని ఆశ పడటానికి.మీకు ఉగాది శుభాకాంక్షలు!
DeleteWell said... :))
ReplyDeleteThank you so much for appreciating.
Deleteబాగా చెప్పారండీ!
ReplyDeleteధన్యవాదాలు రసజ్ఞగారు.
Deleteహ్మ్మ్... నిజమే నండీ.. చాపకింద నీరులా ఇవీ..పాకిపోతున్నాయ్.
ReplyDeleteఒకప్పుడూ బూతులు అనబడే మాటలు.. ఇప్పుడు చాలా కామన్ గా అందరి మధ్యా,అందరితోనూ మాట్లాడగలిగే మామూలు మాటలయిపోయాయ్. పూరీలాంటోళ్ళవల్ల.. ;(
కానీ నేను మా నాన్నగారిని "నాన్న" అనే పిలుస్తాను ;)))) ఈ ఒక్క విష్యం లోనూ నేణు పాప తోనూ, సురేష్ తోనూ ఏకీభవిస్తాను ;)
నా బ్లాగ్ కి స్వాగతం రాజ్ కుమార్ గారు. నా కథలో సుమిత్ర పాత్ర గోదావరి జిల్లా అమ్మాయండి.మర్యాదలు ఎక్కువండి అక్కడ. నాన్నగారండి, మావయ్యగారండి ఇలా పిలుస్తారు కదా. అదే రాసాను. ధన్యవాదాలు.
Deleteసినిమావాళ్ళు చేసిన తప్పేంటో చూపారు. చివరిలో క్షమించమని అనటం అవసరం లేదేమో.
ReplyDeleteసినిమా అభిమానులు చాలా మంది ఉంటారండి.వారు నా బ్లాగ్ మూసెయ్యమని ధర్నా చెయ్యకుండా బతిమాలడం అన్నమాట! జుస్ట్ కిడ్డింగ్ అండి. ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు మురళిగారు.
Delete:) :) మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
ReplyDeleteమీకు కూడా పరిమళ గారు! నా బ్లాగ్ కి స్వాగతం!
Deletebaga rasaru....
ReplyDeleteధన్యవాదాలండి SJగారు.
Deleteఏం చేస్తాం? ఇలాంటి కొన్ని సినిమాలనుంచి పిల్లలని దూరంగా ఉంచాలి. అంతే.
ReplyDeleteమీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.ధన్యవాదాలండి
Deleteమీ బ్లాగు చాలా బాగుంది.
ReplyDeleteపిల్లలకి తల్లిదండ్రులు..టీచర్లే రోల్ మోడల్సు..వాళ్ళు ఇలాంటివి గమనించి పిల్లల్ని సరిదిద్దుతుండాలి...అలా సినిమాల ప్రభావం తగ్గించాలి.
మొత్తానికే తెలుగు సినిమాలు చూదటం మానేస్తే మంచి సినిమాలు కూడా మిస్ అవుతారు కదా!
మీకు నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.
Deleteనా బ్లాగ్ కి స్వాగతం. పూర్తిగా సినిమాలు చూడడటం మానలేము కదండి.
ఒప్పుకుంటున్నాను.
వాళ్ళ మొహం మళ్ళీ వాళ్ళని క్షమాపణలు అడిగేదేవిటి? ఇంకాస్త గట్టిగా తిట్టినా తప్పులేదు. బాగా రాశారు. కేవలం సినిమాల వల్ల పిల్లలు, జనాలు విలువలు నేర్చుకుంటారని నేను అనుకోనుగాని ఇట్లాంటి వెర్రి పోకడలు మరీ వెర్రితలలు వేస్తున్నాయి.
ReplyDeleteమెచ్చినందుకు ధన్యవాదాలు.
Delete