Monday, March 5, 2012

అమ్మా...ఇదిగో నా లిస్ట్


మొదటి సంవత్సరం ఇంటికి దూరంగా అమ్మ,నాన్నలను వదిలేసి చదువుకోడానికి వెళ్ళిన నా కూతురు...
ఈ రోజు ఒక టెక్ష్ట్ పంపించింది.
అమ్మా ...నేను వచ్చే వారం ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు చేసి పెట్టే వంటలు అన్నీ చెయ్యాలి అని.
ఇండియన్ ఫుడ్ రెండు నెలలుగా తినలేదు...ఇది ఏమి లైఫ్ అని చేసిన కామెంట్ కి నేను ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాను. రోజు వండిపెట్టినప్పుడు ఎప్పుడు సరిగ్గా తినని నా కూతురు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఆనందంగా కూడా అనిపించింది.
అన్ని అందుబాటులో, తేలిగ్గా దొరికినప్పుడు వాటి విలువ నిజంగానే తెలియదు ఏమో...

4 comments:

  1. .ఇది ఏమి లైఫ్ ఎంత దారుణం అండీ బాబు? ఎప్పుడో around 9pm కి non veg hotel కి వెళ్లి మరీ veg order చేసి రెండు తందూరి రోటీలు with curd తిన్నాను, ఇప్పుడు తే||జా పావుతక్కువ మూడు అయ్యింది ఒక పక్క ఆకలి దంచేస్తుంటే ఇలాంటి ఫోటో పెట్టి నన్ను ఊరిస్తున్నారే? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నా నధ్యక్షా ?!

    నిజమే నండీ! మీ అమ్మాయి english అన్నారు కాని, నిజమే ఆహరం అందున్నా జిహ్వ కు అలవాటైన ఆహరం అమాంతం దూరమైతే అలానే ఉంటుందని ఈ నా 2months experience చెప్తోంది.
    ఆ మధ్యలో బికనీర్వాల కి వెళ్లి తెగ లాగించే వాడిని, ఉప్చ్ అది నేనుండే చోటికి నా టైం కి దూరం, సో ... north indian food తో adjust కాక తప్పటం లేదు, ఇక లాభం లేదు మా అమ్మకి phone చేసి ఒక day appointment నాకు సాంబార్ కాయటం నేర్చుకోవాలి !!

    any way its a real post అందుకే ఎవరు కామెంట్ చేయలేదనుకుంటా ఇందులో...

    ?!

    ReplyDelete