Monday, March 5, 2012

నా అభిమాన కవి సిరివెన్నెలగారు


"ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమొ..." సిరివెన్నెల గారు రాసిన "వాన" సినిమాలోని ఈ పాట రోజుకి నేను లెక్కలేనన్ని సార్లు వింటాను.
మనసుని స్పందించేట్లు పాటలు రాయడం లో ఆయనకి ఆయనే సాటి.
ఒక్కోసారి అనిపిస్తుంది "విరించినై విరచించితిని" అని రాసిన సిరివెన్నెల గారేనా వాన సినిమాలో పాట కూడ రాసింది అని...
వేటూరి గారి గురించి అందరు గొప్పగా మాట్లాడడం తెలుసు ,ఆయన ఎంత గొప్పగా రాస్తారో అందరికి తెలిసిన విషయమే.
నా అభిప్రాయంలో సిరివెన్నెల గారి పాటలు ఒక సామాన్య వ్యక్తిని కూడా స్పందింప చేసేంత గొప్పగా ఉంటాయి.
త్రివిక్రం గారు ఈ మధ్య జరిగిన ఒక ప్రోగ్రాం లొ సిరివెన్నెల గారి గురించి చాల బాగా చెప్పరు.
నిజంగా అలాంటి కవి మనమద్య నివసిస్తూ మనం చూసే సినిమాలలో పాటలు రాయడం మన తెలుగు వాళ్ళు చేసుకున్న అద్రుష్టం.
ఈ బ్లాగ్ లో నా మొదటి పోస్ట్ లో సిరివెన్నెల గారిని తలచుకోవాలి అనిపించింది.

13 comments:

  1. మీకే కాదు మాకు ఇష్టమైన కవి సిరివెన్నెల గారు...

    ReplyDelete
  2. "అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
    అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
    మెలికలు తిరిగే నది నడకలకు
    మరి మరి ఉరికే మదితలపులకు....."
    మదితలపులకి నదినడకలకి సిరివెన్నెల గారు పెట్టిన పోలిక మరువలేనిది.
    నాలా అభిమానించేవారు మీరు కూడా అని తెలిపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. చిన్నప్పుడు సిరివెన్నెల లోని విధాత తలపున ...ఎన్నిసార్లు పాడి ఉంటానో .ఆయన వ్రాసిన గాయం సినిమా లోని ఆయన నటించిన ఒక పాటను అంతకుముందు ఒక గీతంగా వ్రాసారు.దాన్ని కొద్దిగా మార్చి గాయంలో పెట్టారు.ఆ మొదటగా వ్రాసిన గీతం నేను వివిధ వేదికలఫై పాడాను.తెలుగు పాటల తోటలో విరిసిన పారిజాతం సిరివెన్నెల.

    ReplyDelete
    Replies
    1. బాగా రాయగలడమే కాక మీరు బాగా పాడతారనమాట.
      సిరివెన్నెలగారి గారిని అభిమానించే వారిలో మీరు కూడా ఉన్నారనమాట.
      ధన్యవాదాలు రవిశేఖర్ గారూ.

      Delete
    2. " వేటూరి గారి గురించి అందరు గొప్పగా మాట్లాడడం తెలుసు ,ఆయన ఎంత గొప్పగా రాస్తారో అందరికి తెలిసిన విషయమే "

      పైన మీరు ఉదహరించిన మాటలు వ్యంగంగా అన్నారో లేక ఎటువంటి భావం లేకుండా వ్యాక్యానించారో తెలీదు కాని. వేటూరిని ఎందుకు అందరూ అంతలా పొగుడుతారంటే..! ఆయన వద్దకు వెళ్ళి అప్పటికప్పుడు పాట రాయమంటే ఒక గంటలో రాయగలడు ఏ పాటైనా సరే..! అదే విదంగా ఒకే సారి పది రకాల బిన్న సినిమాల దర్శకులు ఒకే సారి వచ్చి కూర్చొని పాట రాయమని అడిగినా అందరికీ ఒకే సారి పాట రాసేవారు. అయన అలా రాయడానికి కారణం ఆయన పెద్ద తండ్రి అయిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు.. పిన్న వయసునుండే ప్రబంద కావ్యాలు, కాళిదాసు పద్యాలు..ఇలా ఒకటేమిటి ఆని శతకాలు, కావ్యాలు.. అన్నిటిని వల్లించి అవపోసన పట్టాడు అందుకే ఏది అడిగినా తడుముకోకుండా పాట రాయగల సత్తా ఆయనలో వున్నది..అడిగిన వెంటనే ఆశువుగా పదాలను అల్లగల సామర్థ్యం అయన సొత్తు.

      ఇక సిరివెన్నెల.. ఆయన గురించి నేను ప్రత్యేకంగా గొప్పవాడు అని చెప్పనవసరం లేదు..! లోకమంతా తెలుసు..! కాని బయటి ప్రపంచానికి తెలియని విషయం..సందర్బం చెప్పగానే ఆయన వెంటనే పాటను రాయడానికి చాలా ప్రయత్నిస్తాడు..ఎన్నో విదాలుగా తనలో తాను మదనపడతాడు..చివరకు రేపు రాసుకొని వొస్తా అని చెప్పి రాత్రిల్లు కూర్చొని ఒక 20 వర్షన్స్ రాసి అందులో నుండి మళ్ళీ ఒక ఒక వర్షన్ తయారు చేసి ఉదయమే అందిస్తాడు అందులో చాలా గొప్ప పదాలు భావాలు ఉంటాయి..వాటి కోసం చాలా ప్రాకులాడుతాడు..ఆయన. తన విద్యనంత గుప్పించాలని మదన పడతాడు..! వేటూరికి ఈ బాద లేదు..ఏమడిగినా ఆశువుగా చెప్పగలడు..అదీ ఇద్దరి మద్యన ఉన్న తేడా..! ఇద్దరు గొప్పవారే కాకపోతే వ్యత్యాసం ఉన్నది ఇద్దరి మద్యన అదే వేటూరిని గొప్పగా చూపిస్తున్నది.

      Delete
    3. అంత పెద్దవారి గురించి వ్యంగంగా మాట్లాడే కుసంస్కారం లేదండి నాకు.
      ఆయన పాటలంటే కూడా నాకు చాల ఇష్ట్టం. సిరివెన్నెలగారిని తలచుకునే ముందు వేటూరి గారి గురించి తలచుకోవాలి అని అనుకున్నానే తప్ప అసలు వ్యంగ్యంగా రాయాటమా? Extremly sorry , if my post sounded like that. I apologize for this.

      Delete
    4. అయ్యో మీరు కుసంస్కారి అని ఉద్దేశంతో నేనా వ్యాక్య చేయలేదండి..! గతంలో చాలా మంది తమ తమ బ్లాగుల్లో "వేటూరి" విషయంలో చాలా విమర్శలు చేసేవారు, భయంకరంగా మాట్లాడే వారు. అది గుర్తొచ్చి..ఇక్కడ మీ వ్యాసంలో వున్న వేటూరి మీద వ్యాక్యలు చూసి..కాస్త తికమక పడ్డాను. దానివలన అంత పెద్ద వివరణ ఇవ్వవలసి వొచ్చింది. మీరు ఇంత చిన్న విషయాని "అపాలజి" చెప్పనవసరం లేదండి. నేను కేవలం విషయం చెప్పాలని ఉద్దేశంతో మాత్రమే నా కామెంట్ రాసాను. అంతే కాని మిమ్మల్ని నొప్పించాలని ఉద్దేశం నాలో ఏ కోశాన లేదండి.

      Delete
    5. తికమక పెట్టినందుకు apology అనుకోండి. మీరు నన్ను నొప్పించలేదు.

      Delete
  4. కొత్తగా వచ్చిన ఓనమాలు సినిమా అన్ని పాటలు సిరివెన్నెల గారే రాసారు..విన్నారా ?చాల బాగున్నాయి

    ReplyDelete
    Replies
    1. లేదండి.వినలేదు.చెప్పారు కదా.ఈ రోజే వింటాను.
      Thanks for letting me know.

      Delete
  5. http://youtu.be/pd50X9PHO7Y

    వెంటపడుతోంది చూడు కనపడని మంట ఏదో ? అంటూ హృద్యమంగా సాగిన ఈగీతాన్నిఆస్వాదించటం ఆ భావుకతలో లీనం అవ్వటం తప్ప వేరేమి చేయగలము?
    ఆడదాని హృదయం చాలా లోతైనదని అగ్ని పర్వతాలు సైతం అందులో దాగున్నవని అగాధాలు

    అందు కలవని .... స్త్రీహృదయాన్ని చూపిన - కవి శిరోమణి

    ?!

    ReplyDelete
  6. vaana lo aa pata chaala bhaguntundandi.
    labels add chesinanduku thanks andi.

    ReplyDelete
    Replies
    1. You are welcome andi. I should have added them long ago! Thanks for suggesting.

      Delete