"అమ్మా అవనీ నేల తల్లీ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదెందుకని.."
శివదత్త గారు రాసిన పాట సంగీతపరంగానే కాదు, సాహిత్యరీత్యా చాలా మంచి పాట.
రెండు నెలలతర్వాత ఇంటికి వచ్చిన నా కూతురు అమ్మా అమ్మా అని లెఖలేన్నన్ని సార్లు పిలుస్తూ నా వెంట తిరుగుతుంటే..
నిజమేనేమొ...అమ్మా అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదు కదా అనిపించింది...
తనకోసం చేసిన వంటలన్ని అద్భుతంగా ఉన్నాయని చెపుతూ ఆస్వాదిస్తూ తినటం చూస్తే చాలా త్రుప్తిగా కూడా అనిపించింది.
నా చెంత చేరి తన స్నేహితురాలందరి గురించి, ఇంటికి దూరంగాఉన్న ఈ రెండు నెలలలో జరిగినవన్ని పూసగుచినట్టు చెపుతూ మధ్యమధ్యలో "అమ్మా నీకు నిద్ర వస్తుందా..పోని రేపు మాట్లాడుకుందామా?" అని అడుగుతున్న నా చిట్టితల్లిని చూస్తే చిన్నప్పుడు తనకి కావల్సింది ఏదైనా అప్పటికప్పుడు ఇవ్వాలని మారం చేసినది ఈ అమ్మయేనా అనిపించింది.
నిండుగా నా కూతురు ఇంట్లో తిరుగుతుంటే మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.
ఎల్లప్పుడూ తనకి విజయం తోడుగా ఉండాలని ,పరాజయపు అగాధాలు దరికి కూడా రాకూడదు అని మనస్పూర్తిగా దీవించా..

కూతురు ఎదిగితే మనసెరిగిన కన్నతల్లే
ReplyDeleteఅనుభవంతో చెప్పారనిపిస్తుంది.చక్కటి మాటన్నారు..
Delete