కొద్దిరోజులక్రితం వర్క్ లో ఊపిరి పీల్చుకోలేనంత పని ఉంటే మా డిపార్ట్మెంట్లో అందరు రేయనక, పగలనకా కష్టపడి పనిచేస్తూన్నప్పుడు జరిగిన సంఘటన.
అర్ధరాత్రి వరకు పనిచేసి ఆ రోజు లేట్ గా వర్క్ కి వచ్చిన నాకు..
ఒక క్యూబ్ దగ్గర చాలా మంది నా సహ ఉద్యోగులు గుమికూడి ఉండడం ఆశ్చర్యం కలిగించింది.
ఏమై ఉంటుందా అని కుతూహలంతో నేను కూడా చేరా అందరితో.
జెన్ని అని నాతోటి ఉద్యోగి క్యూబ్లో తన డెస్క్ మీద అందమైన పూలగుత్తి.
జెన్ని మెరిసే కళ్ళతో అందరికీ వివరిస్తున్నదేమిటంటే..జెన్ని భర్త జెన్ని రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తున్నందుకు, తను వర్క్ వలన స్ట్రెస్స్ కి గురవుతుందని తనకి ఒక మంచి గ్రీటింగ్ కార్డ్,పూల గుత్తి పంపించాడు.
"హనీ,హోప్ యు విల్ బీ రిలీవ్డ్ సూన్ ఫ్రం దిస్ స్ట్రెస్స్. ఐ లువ్ యు" అంటూ ఇంకా చాల రాసాడు.
జెన్నికి "యు ర్ సో లక్కి.యు హవ్ ఎ గ్రేట్ హస్బండ్" అని నా పక్కనే ఉన్న నా కొలీగ్స్ తనకి ప్రశంసల వర్షం కురిపించారు.
ఒక ఫ్రెండ్ అంతటితో ఆగక నా వెంటే నా క్యూబ్ కి వచ్చి..జెన్ని ఎంత అద్రుష్టవంతురాలో పదే పదే చెపుతూ ఇండియన్ హస్బండ్స్ కి ప్రేమ వ్యక్తపరచడమే రాదు అని తెగ బాధపడిపోయింది.
ఇప్పుడు దానిగురించి అలోచించేంత సమయం మనకి లేదు కాని..పనిలో నిమగ్నమౌదాము అని చెప్పి తనని అప్పటికి ఆ మూడ్ లోంచి బయటపడేసాను.
ఆ ఫ్రెండ్ ఉండేది మా కమ్యునిటీయే కాబట్టి ఇద్దరము అప్పుడప్పుడు కలిసి ప్రయాణం చేస్తుంటాము. ఆఫీస్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన సంభాషణ మళ్ళీ ఆ రోజు సాయంత్రం గుర్తుకు వచ్చి జెన్ని అద్రుష్టం గురించి పదే పదే వాపోతున్న నా స్నేహితురాలిని చూస్తే జాలి వేసింది.
నా ఫ్రెండ్ భర్త మితభాషి. ఎక్కువగా మాట్లాడకపోయినా తనని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఒక నెల రోజులు రాత్రి పగలు వర్క్ తో సతమౌతున్న తనని ఇంటికి రాగానే ఏ కష్టం లేకుండా అలసి వచ్చిన తనకి చెతనైతే వంట చేసో, కాకపోతే ఫుడ్ బయటనుండి తెప్పించో ఇంకా తన ఆరేళ్ళ పాపని కూడా తనే చూసుకున్నారు. అనుక్షణం తను అలసిపోయి ఉంటుందన్న విషయం గ్రహించి నా ఫ్రెండ్ నోరు తెరిచి అడగకుండా సాధ్యమైనంతవరకు ఎంతో సహకరించేవారు. కాని అతనికి రోజుకి ఒక పది సార్లు ఫోన్ చేసి తీపి కబుర్లు చెప్పడం రాదు. ఐ లువ్ యు అని డ్రమాటిక్ గా చెప్పటం రాదు. పూలగుత్తి పంపించాలని అనిపించలేదు.
మర్నాడు మేమిద్దరమూ మళ్ళీ కలిసి ప్రయాణం చేస్తున్నపుడు జెన్ని అద్రుష్టం గురించి మల్లీ చర్చ మొదలయ్యింది. లైఫ్ రొటీన్ అయిపోయింది అంటూ..ఏముంది నా లైఫ్ లో వర్క్, ఇల్లు తప్ప... ఒక ఎక్ష్చైట్మెంట్ లేదు. జెన్ని భర్త లాంటివాడు అయితే లైఫ్ ఎంత బాగుంటుందో అంటూ...నా వంక ఒక చూపు వేసి....మీకు అనిపించట్లేదా అలాగా అని అడిగింది.
నేను తనని నెమ్మదిగా అడిగా ప్రేమంటే పూలగుత్తి పంపించడమేనా అని. సర్రున కోపం వచ్చింది తనకి అలా ఎందుకు అంటున్నారు? "ప్రేమ ఉంటే సరిపోదు. దానిని వ్యక్తపరచడం కూడా తెలియాలి అంటూ అవేశంతో జవాబు ఇచ్చింది."
" నేను నీతో ఏకీభవిస్తాను. కాని ప్రేమని ఇలా ( పూలగుత్తి లాంటివి ఇచ్చి) మాత్రమే వ్యక్తపరచాలని లేదు కదా ? మీ వారు నీ మనసెరిగి మసలుకుంటారు కదా అది ప్రేమేగా?" అంటే "లేదు. అయినా మీకు అర్ధం కాదు, మీ తరం వేరు..మా తరం వేరు" అని సమాధానం వదిలింది. నాకు నిజంగానే జాలి వేసింది తనని చూస్తే. ప్రేమని తరచు నాటకీయంగా వ్యక్త పరచటం లేదు అన్న వాదనే కాని, తన భర్త చేసే ప్రతి చర్యలోనూ ప్రేమని గ్రహించని తన అజ్ఞానాన్ని చూసి కోపం కూడా వచ్చింది.
ఒక రెండు నెలల తర్వాత తాజా వార్త ..మా ఆఫీస్ లో జెన్ని భర్త జెన్ని కి విడాకులు ఇచ్చేసాడని.
జలతారువెన్నెల గారు.......
ReplyDeleteఒక్క మాట చెప్పనా,
మనల్ని నిజంగా ప్రెమించడం అంటే మనసులొ ఆరాధించడం.
నిజమయిన ప్రేమికులు పదే పదే తమ భవాన్ని వ్యక్తీకరించరు..అది ఎదుటివారు అనుభవించేలా చెస్తారు.
కాని అది అందరికీ అర్ధం కాదు.
కాని ప్రేమ ని పదే పదే తెలిపెవారిలొనూ ప్రేమ ఉంటుంది
మంచి మాట చెప్పారు. మీరు చెప్పినదానితో నేను ఏకీభవిస్తాను.
ReplyDelete“ తెలియ మాటల కందని తీపులున్న
ReplyDeleteప్రేమ భావాలు చిలుకు ఏతీరు లైన
నిజము” , జలతారు వెన్నెలా ! “ నేర్చిపలుకు
ప్రేమపలుకుల డ్రామాల ప్రేమ కన్న “
బ్లాగు: సుజన-సృజన
మీ కామెంట్ అర్దం కాలేదని చెపితే అర్ధం వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు.
Deleteమీరు వివరించినది ఇక్కడ మల్లీ పొస్ట్ చేస్తున్న..
"మాటలు పరిపూర్ణ ప్రేమ భావన నందించ లేవు .
నేర్పరులు మోస పూరిత మాటలతో ప్రేమ నటిస్తారు . మధురమైన ప్రేమ హృదయం లోతుల
నుండి చర్యల ద్వారానే బహిర్గత మౌతుందని నా ఉద్దేశ్యం .
మీ - ప్రేమంటే - బాగుంది. అభినందనలు ."
ప్రేమంటే పూలగుత్తి పంపడం ఒకటే కాదని తెలియని పిచ్చి తల్లి.కాలం సమాధానం చెబుతుంది.
ReplyDeleteనిజమేనండి, కాలం చాలావాటికి సమాధానం చెపుతుంది.
Deletepl check ur comment section. it is not taking open id
ReplyDeleteI corrected it. Thanks for pointing this out!
Deleteగ్లోబలైజషన్ మహిమ...
ReplyDeleteఅన్నట్టు మీ బ్లాగు పేరు బావుంది.
వార్డ్ వెరిఫికషన్ తీసేయండి వ్యాఖ్య పెట్టడానికి వీలుగా ఉంటుంది.
ధన్యవాదాలు జ్యోతిర్మయిగారు.
Deleteవెరిఫికషన్ తీసేసాను.
పూలగుత్తులు . సినిమా టికెట్లేనా ప్రేమంటే :) పాపం పిచ్చిపిల్ల :)
Deleteబాగా చెప్పారు.ధన్యవాదాలు మాలాగారు.
Delete:) కాలమే అన్నింటికీ సమాధానం అనడానికి ఇది ఒక సాక్ష్యం ....
ReplyDeleteఅవునండి నిజమే! ధన్యవాదాలు కల్యాణ్ గారు.
Deleteప్రేమని ఇలా ( పూలగుత్తి లాంటివి ఇచ్చి) మాత్రమే వ్యక్తపరచాలని లేదు కదా ? మీ వారు నీ మనసెరిగి మసలుకుంటారు కదా అది ప్రేమేగా?"
ReplyDeleteచాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు.నిజమయిన ప్రేమని ఇలాంటి వాళ్ళు గుర్తించాలి అని అనుకోవడం మినహా వాళ్ళకి మనం ఎంత చెప్పిన అర్ధం కాదు. పోస్ట్ బావుంది.
ధన్యవాదాలు మీకు!
Delete